నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Thursday, November 16, 2017

పూజ ఎందుకు చేయాలి ?

pooja-enduku-cheyali

పూజ ఎందుకు?:
“ కోటిమంది వైద్యులు కూడివచ్చినకాని మరణమన్న వ్యాధి మాన్పలేరు”--- బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు
“జాతస్యః ధృవో మృత్యుః”--- భగవద్గీత
“పుట్టుటయు నిజము పోవుటయు నిజము”--- అన్నమయ్య
“పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం”--- ఆదిశంకరాచార్యులు
ఇలా ఎందరోమహానుభావులు ఎంతో అనుభవముతో ఆర్తితో జ్ఞానంతో చెప్పిన వన్నీ వింటున్నాం, కానీ ఏ రోజైన దీనిని గురించి ఆలోచించామా? కనీసం ఆలోచించే ప్రయత్నమైనా చేశామా? ఒక్కసారి మనసుపెట్టి ఆలోచించండి .“మాకురుధన జన యవ్వన గర్వం హారతి నిమేషాత్కాలః సర్వం , మాయా మయ మిద మఖిలం హిత్వా బ్రహ్మ పదం త్వం ప్రవిశం విదిత్వా”
--- ఆదిశంకరాచార్యులు

మనకు ఏది అవసరమో, ఏది నిత్యమో ఏది సత్యమో తెలియచేయు చున్నారు. కావున ఈ మానవ ఉపాధి మహోత్కృష్టమైనది.కొన్ని కోట్ల కోట్ల జన్మలకు, కానీఎన్నో ఉపాధులు దాటితే కానీ ఈ మానవ ఉపాధి లభించదు. లభించిన ఈ ఉపాధిని భగవంతుడు మనకు ఇచ్చిన ఈ మహద్భాగ్యాన్ని అవకాశమును అవివేకంతో, అజ్ఞానంతో దుర్వినియోగం చేసుకొనరాదు. ఈ మహదావకాశమును దుర్వినియోగం చేయడం అవివేకం, అజ్ఞానం. భాగవతం అష్టమస్కందములో 37,46 పద్యములలో శ్రీ పోతన గారి ద్వారా అపరధర్మావతార మూర్తి “రామో విగ్రహవాన్ ధర్మః”అని కీర్తించబడిన ఆ శ్రీ రామచంద్రప్రభువే శ్రీ పోతనామాత్యులవారి తో పలికించినట్లు ఈ ఉపాధికి (ఆత్మకు) ఎన్ని కోట్ల కోట్ల మంది (భార్యల తో/భర్తల తో/పిల్లల తో) సంబంధ బాంధవ్యములు ఉన్నాయో ఆలోచించండి

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

« PREV
NEXT »

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com