Page Nav

HIDE

Grid

HIDE_BLOG

రేపు 22న జనతా కర్ఫ్యు ద్వారా కరోనాను కట్టడి చేద్దాం – ప్రధాని నరేంద్ర మోదీ - PM Modi Urges Citizens to Follow Janata Curfew on 22 March

ప్ర పంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనడానికి జాగ్రత్త, అప్రమత్తతలే ప్రధానమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ ప్రజాన...నెల 22న జనతా కర్ఫ్యు ద్వారా కరోనాను కట్టడి చేద్దాం – ప్రధాని నరేంద్ర మోదీ - PM Modi Urges Citizens to Follow Janata Curfew on 22 March
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనడానికి జాగ్రత్త, అప్రమత్తతలే ప్రధానమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ఈ నెల 22న అంతా జనతా కర్ఫ్యు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని ప్రసంగంలో ముఖ్యాంశాలు –
 • 1. మనం ఆరోగ్యంగా ఉంటామని ఇతరులను ఆరోగ్యంగా ఉంచుతామని సంకల్పం తీసుకోవాలి
 • 2. సంయమనం, సామాజిక దూరం పాటించడం అత్యావశ్యకం. నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడమంటే మనం మనకు, మన కుటుంబానికి ఆపద కలిగిస్తున్నామని గుర్తించాలి.
 • 3. ప్రభుత్వం చేపట్టే అన్నీ కార్యక్రమాలకు మనం పూర్తి సహకారం అందించాలి.
 • మార్చ్ 22 న ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు జనతా కర్ఫ్యు లో భాగంగా మనం పూర్తిగా మన ఇళ్లకే పరిమితమవ్వలి.
 • 4. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు అత్యవసర సేవలు నిర్వహిస్తున్నవారికి కృతజ్ఞతగా అందరం చప్పట్లు కొట్టాలి , పళ్ళాలు మోగించాలి.
 • 5. జనతా కర్ఫ్యు గురించి అందరిలో అవగాహన కలిగించాలి. దీనికోసం రేపటినుంచి రోజూ కనీసం 10 మందికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలి.
 • 6. మొదటి ప్రపంచ యుద్ధం కంటే కరోన వైరస్ వల్ల ప్రపంచంలో ఎక్కువమంది ప్రభావితమయ్యారు. కొన్ని దేశాల్లో అనూహ్యంగా బాధితుల సంఖ్య నమోదైంది.
 • 7. వైద్య మరియు ఇతర అత్యవసర విభాగాలవారు పడుతున్న శ్రమని మనం గుర్తించి, అభినందించాలి.
 • 8. రెగ్యులర్ గా వైద్య పరీక్షలు చేయించుకునేవారు వాటిని ఒక నెలపాటు వాయిదా వేసుకోవాలి. అత్యవసర శస్త్ర చికిత్సలు తప్పించి మిగిలినవి కూడా వాయిదా వేసుకోవాలి. ఆ విధంగా వైద్య సిబ్బందిపై ఒత్తిడి తగ్గించాలి.
 • 9. వ్యాపార సంస్థల యాజమాన్యాలు తమ వద్ద పనిచేసేవారు ఒకవేళ ఉద్యోగానికి హాజరుకాకపోయినా ఈ విపత్కర పరిస్థితిలో వారు తమ కుటుంబ సభ్యులను రక్షించుకోవడం కోసం అలా చేసి ఉంటారని గుర్తించి వేతనంలో కోత విధించకుండా ఉండాలి.
 • 10. కరోన వైరస్ మూలంగా ఏర్పడిన ఆర్ధిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొనేందుకు కేంద్ర ఆర్ధికమంత్రి నేతృత్వంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటవుతుంది.
 • 11. పాలు, మందులు, మొదలైన నిత్యవసర వస్తువులు దేశంలో తగిన్నన్ని ఉన్నాయి. కాబట్టి వాటిని కొనుగోలు చేయడానికి అనవసరమైన ఆందోళన, ఆతృత పడకుండా ఉండాలి.
మూలము: విశ్వ సంవాద కేంద్రము