నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

18, మార్చి 2020, బుధవారం

వీర్ సావర్కర్- సాంఘిక విప్లవ యోధుడు - Sanghika Viplava Yodha "Veera Saavarkar"



వీర్ సావర్కర్ అసలు ఎవరు?
  • 🚩 అంతర్జాతీయ స్థాయిలో భారత స్వాతంత్ర్యం కోసం విప్లవోద్యమాన్ని నడిపిన విప్లవయోధుడు.
  • 🚩 గొప్ప గ్రంధ రచయిత, ఆయన గ్రంథాలు ప్రచురణకు ముందే, రెండు ప్రభుత్వాలు నిషేధించాయి.
  • 🚩 భారత స్వాతంత్రోద్యమoలో పాల్గొన్నందుకు, విశ్వవిద్యాలయo ఆయన బారిస్టర్ డిగ్రీని రద్దు చేసింది.
  • 🚩 విదేశీ వస్త్రాలను బహిరంగంగా మంటల్లో కాల్చేసిన జాతీయవాది.
  • 🚩దేశ సమగ్ర అభివృద్ధికై, అంటరానితనం, కులతత్వం నిర్మూలనకై పాటుపడ్డ సాంఘిక విప్లవయోధుడు.
  • 🚩 దేశంలో బ్రిటిష్ న్యాయవ్యవస్థకి ఎటువంటి స్థానం లేదని ఎదిరించిన విప్లవకారుడు.
  • 🚩 50సంవత్సరాల కఠిన కారాగార శిక్ష వేయబడ్డ వ్యక్తి, దశాబ్దం పైగా జైలు శిక్ష అనుభవించి విడుదలైన తరువాత కూడా క్రియాశీలక జీవితం గడిపిన వారు.
  • 🚩 కాగితాలు ఇవ్వనందున, జైలు గోడలమీద కవితలు వ్రాసి, వాటిని తరువాత ప్రచురించడానికి వీలుగా, తోటి ఖైదీలను కంఠస్థం చేయమని కోరిన గొప్ప కవి.
  • 🚩 ఆయన జైలు శిక్ష, హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో పెద్ద సంచలం సృష్టించింది.
  • 🚩 ఆయన జీవితంలో తన బాధ్యతలు తీరిపోయాయనే అభిమతంతో స్వచ్ఛందంగా నిరాహారదీక్షచేసి ప్రాయోపవేశo చేసిన యోగి.
సావర్కర్ స్థాపించిన హరిజన్ భజన మండలి, రత్నగిరి
సావర్కర్ స్థాపించిన హరిజన్ భజన మండలి, రత్నగిరి
శ్రీమత్ భాగోజిసేథ్ కీర్ నిర్వహించిన సామూహిక భోజనాలు, రత్నగిరి, 2 May 1938, సావర్కర్ తో సహా వేయి మంది పైగా పాల్గొన్నారు.
శ్రీమత్ భాగోజిసేథ్ కీర్ నిర్వహించిన సామూహిక భోజనాలు, రత్నగిరి, 2 May 1938, సావర్కర్ తో సహా వేయి మంది పైగా పాల్గొన్నారు.
శ్రీమత్ భాగోజిసేథ్ కీర్ నిర్వహించిన సామూహిక భోజనాలు, రత్నగిరి
శ్రీమత్ భాగోజిసేథ్ కీర్ నిర్వహించిన సామూహిక భోజనాలు, రత్నగిరి
సాంఘిక విప్లవ యోధుడు
హిందుత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన సావర్కర్ సాంఘిక విప్లవ యోధుడు కూడా. ధనంజయ్ కీర్ , తమ అంబేద్కర్ జీవిత చరిత్ర లో `సంస్కర్త ఉన్న స్థితి నుంచి సమాజాన్ని బాగు పరుస్తాడు, కాని విప్లవకారుడు పాత స్థితిని తొలగించి కొత్తది నిర్మిస్తాడు’ అంటారు. సావర్కర్ ఆ విధమైన సాంఘిక విప్లవయోధుడు.

శాస్త్రీయ దృక్పధం
సావర్కర్ తమ వ్యాసాలలో `నేడు’ రేపు’ `నిన్న’టికి బందీ కాకూడదని వ్రాసారు; జిజ్ఞాసతో అన్ని విశేషాలు గమనించి, విశ్లేషించి ఓక నిర్ధారణకి రావాలని చెప్తూ శాస్త్రీయ దృక్పధాన్ని నిర్వచించారు. మంచి, చెడులను అర్ధం చేసుకుని ఎంచుకోవడానికి `జాతీయ ప్రయోజనం’ `మానవ ప్రయోజనం’ కొలమానాలుగా గ్రహించాలని అన్నారు.

భారత రాజ్యాంగం అధికరణ 51A `శాస్త్రీయ దృక్పధo’, `మానవత్వం’, `జిజ్ఞాస’ `సంస్కరణ’ పౌరుల బాధ్యతగా అభివర్ణించి, సావర్కర్ ఆలోచనలను గౌరవించింది. జాతి ఔన్నత్యానికి, మానవ సంక్షేమానికి మూలoగానే కాక, `శాస్త్రీయ దృక్పధo’ ద్వారా మాత్రమే పటిష్టమైన, ఆధునిక, ప్రగతిశీల దేశాన్ని నిర్మించుకోగలమని ఆయన గాఢంగా నమ్మారు, అనేక సార్లు వ్రాసారు. ఆయన సాంఘిక పరిణామ సిద్ధాంతానికి `శాస్త్రీయ దృక్పధo’, `మానవత్వం’ సూత్రాలే ఆధారం.
కుల వ్యవస్థ
భగవద్గీతలోని 4వ చరణం `చాతుర్వర్ణ్యంమయాసృష్టం’ అనే వాక్యం, నాలుగు వర్ణాలు అని, అవి వృత్తికి సంబంధిoచినదే తప్ప, జన్మతః సమకూరేది కాదని వివరించేవారు. ఒకే `కుల’వృత్తిలో పనిచేయాలని కాని, వారసత్వoగా అదే వృత్తిలో కొనసాగాలని అర్ధం కాదని చెప్పేవారు. అన్ని కులాల మధ్య సమన్వయo సాధిస్తేనే సాంఘిక విప్లవం సాధ్యమని అన్నారు.

దేశీయ పద్ధతులు – సంకెళ్ళు
సావర్కర్ భారత దేశ దాస్య శృంఖలాలను ఎంతగా వ్యతిరేకించారో, `ఏడు సంకెళ్ళు’ అని ఆయన పేరుపెట్టిన ఈ క్రింది వాటిని కూడా అంతే తీవ్రంగా వ్యతిరేకించారు.
  • 1. కర్మకాండ, ఆచారాలు అనుసరించే సమాన హక్కులు, స్వేచ్ఛ హిందువులందరికి ఉండాలి.
  • 2. ఏ వృత్తిని ఎంచుకోవడానికైనా అందరు హిందువులకి సమాన హక్కులు, స్వేచ్ఛ ఉండాలి. కులపరమైన అంక్షలు ఏమి ఉండకూడదు, వ్యక్తులు తమకి ఇష్టమైన వృత్తిని కొనసాగించడానికి ఎవరు అడ్డు రాకూడదు.
  • 3. అస్పృశ్యత, ఏ కులం విషయంలోనైనా పూర్తిగా తొలగించాలి, అది మానవతకే శాపం. ఏ వ్యాధి కారణంగానైనా ప్రజా ఆరోగ్యానికి ముప్పు వాటిల్లితే తప్ప అంటరానితనం అనేది ఉండకూడదు.
  • 4. విదేశీ ప్రయాణాల మూలంగా వెలివేయకూడదు.
  • 5. గతంలో హిందూ మతాన్ని వదిలేసిన వారైనా, లేక ఇతర మతాలలో పుట్టిన వారైనా హిందూమతoలోకి తిరిగి రావాలనుకుంటే, వారిని ఆహ్వానించాలి. రత్నగిరిలో ఆయన స్వయంగా కొన్ని కార్యక్రమాలని నిర్వహించారు.
  • 6. మతాలలో కొన్ని రకాలైనా ఆహారాలు నిషిద్ధం అనే సూత్రాన్ని ఆయన వ్యతిరేకించారు. `మతం హృదయంలో ఉండాలి కాని, కడుపులో కాదు’ అన్నారు. రత్నగిరిలో ఆయన స్వయంగా సామూహిక భోజనాలు నిర్వహించారు.
  • 7. వివాహాలకి కులం అడ్డoకి కాకూడదు. వ్యక్తుల మంచి లక్షణాలు వివాహాలకి ఆధారం కావాలి.
మూలము: విశ్వ సంవాద కేంద్రము
« PREV
NEXT »