నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

16, ఏప్రిల్ 2020, గురువారం

కరోనా వైరస్ లాక్ డౌన్ నేవథ్యంలో ప్రజాసేవకై అందరికంటే ముందు ఆర్.స్.స్ - Praja Sevalo RSS

కరోనా వైరస్ లాక్ డౌన్ నేవథ్యంలో ప్రజాసేవకై అందరికంటే ముందు ఆర్.స్.స్ - Praja Sevalo RSS
నసంక్షేమ సమితి, సేవాభారతి, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కార్యకర్తలు ప్రకృతి వైపరిత్యాలు సంభవించినపుడు, వివిధ అత్యవసర సమయాల్లో బాధితులకు సహాయ కార్యక్రమాలు చేయడంలో ముందుండి పనిచేయడం అందరికీ తెలిసిందే.

కరోనా వైరస్ మహమ్మారి (కోవిడ్-19) ను ఎదుర్కొనేందుకు దేశమంతా లాక్ డౌన్  ప్రకటించిన నేవథ్యంలో ఎందరో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వ పాలనా యంత్రాంగం, పోలీసుల సూచనలు, అనుమతులు పొంది ప్రపంచ ఆరోగ్య సంస్థ జాగ్రత్తలు పాటిస్తూ ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ స్వయం సేవకులు బాధితుల సహాయార్థం హుటావుటిన రంగంలోకి దిగి సేవా కార్యక్రమాలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వివిధ ప్రదేశాల్లో మున్సిపల్ అధికారుల సూచన మేరకు ముఖ్యమైన సేవలందించిన సిబ్బందికి గస్తీ చేసే పోలీసులు, సెక్యూరిటీ సిబ్బందికి మాస్కులు వితరణ చేసారు. రోజువారీ కూలీలకు ఆహారం అందచేశారు.

    ప్రకాశం జిల్లా గుడూరులో 30 యానాదుల కుటుంబాలకు నిత్యావసర వస్తువుల కిట్లు అందించారు. విజయవాడ, సింగ్ నగర్, ఉడాకాలనీలోని వృద్ధులు మాత్రమే ఉన్న 30 కుటుంబాలకు వారం రోజులకు సరిపడా కూరగాయలు అందించారు. రాజమండ్రిలో ఆర్.స్.స్  కార్యకర్తలు ఇంటింటికీ వెళ్ళి కరోనా వ్యాధిపై అవగాహన కల్పించారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఆస్ఎస్ఎస్., సేవాఖారతి కార్యకర్తలు తమ సేవలను అందిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ జన సంక్షేమ సమితి సేవాభారతి, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కార్యకర్తలు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగాన్ని కలిసి అన్ని రకాల సేవలకు తాము సిద్దంగా ఉన్నామని ఎటువంటి ప్రజావసరాలకైనా తమ సేవలను వినియోగించుకోవచ్చునని విజ్ఞప్తి చేశారు.

       దేశమంతా సంపూర్ణంగా లాక్ డౌన్ లో ఉన్న దరిమిలా రాబోవు రోజుల్లో వివిధ రకాల సేవా అవసరాలు రావచ్చు. స్వయంసేవకులు అవసరమైన వైద్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ పోలీసుల నియమాలు పాటి స్తూ సహాయ కార్యక్రమాలు చేయడానికి సన్నద్ధంగా ఉండాలని జన సంక్షేమ సమితి అధ్యక్షులు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రాంత సంఘచాలక్ భూపతిరాజు శ్రీనివాసరాజు కార్యకర్తలను కోరారు.
సేవా కార్యక్రమాలు
సేవా కార్యక్రమాలు

సేవా కార్యక్రమాలు
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ స్వయం సేవకులు పలు ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు:
 • గుంటూరు జిల్లా: సేవాభారతి ఆధ్వర్యంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు 500 మంది పేషెంట్లకు, వారి సహాయకులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లలో ఉంటున్న వృద్ధులకు ప్రతిరోజు 450 మందికి రెండు పూటల భోజనం అందిస్తున్నారు. అలాగే మిజోరాం నుండి వచ్చి గుంటూరులో చదువుకుంటున్న విద్యార్థులకు భోజన ప్యాకెట్స్ లను వితరణ చేశారు.
 • విశాఖపట్నం: సేవాభారతి ఆధ్వర్యంలో నిరాశ్రిత కుటుంబాలకు 800 మందికి భోజన వితరణ, సీతమ్మధారనగర్ హెచ్.బి.కాలనీలో భవన నిర్మాణ కార్మికులు, కంచరపాలెం నగర్, మర్రిపాలెం బస్తీలలో ఉన్నవారికి నిత్యావసర వస్తువులను అందించారు. అలాగే పారిశుద్ధ కార్మికులకు పోలీస్ యంత్రాంగానికి, ఆరోగ్య సిబ్బందికి 5000 మాస్కులు, 2000 శానిటైజర్లు అందజేశారు.
  సికింద్రాబాద్
  సికింద్రాబాద్
 • సికింద్రాబాద్: సేవాభారతి - తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్లో కరోనా క్రిమిసంహారక సొరంగం ఏప్రిల్ 13న ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ సేవాభారతి రాష్ట్ర అధ్యక్షులు దుర్గారెడ్డి గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్ డా| శ్రావణ్ కుమార్, సీనియర్ డాక్టర్లు, సేవా భారతి కార్యకర్తలు పాల్గొన్నారు.
 • సరూరనగర్: మీర్ పేట కార్పోరేషన్లోని 500 పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు నిత్యావసర వస్తువులైన కూరగాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామభారతి ప్రాంత అధ్యక్షులు స్తంభాద్రి రెడ్డి, సలహాదారు విశ్వమిత్ర, కార్యవర్గ సభ్యులు ఏరెడ్ల అంజిరెడ్డి, దిల్సుఖ్నగర్ భాగ్ సేవాప్రముఖ్ మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
 • శంషాబాద్: సేవాభారతి ఆధ్వర్యంలో శంషాబాద్ నగరంలో 200 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సేవాభారతి కార్యకర్తలు కె. జనార్ధన్, కె. శ్రీనివాస్, టి. జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు
 • హైదరాబాద్: కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి పిలుపు మేరకు 'శంకర సేవా సమితి' తరఫున నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లోని కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగ, సిబ్బందికి 2000 మాస్క్లు, 100 లీటర్ల శానిటైజర్ను విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో సేవా సమితి అధికారులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
 • ఇందూర్ జిల్లా: ఆర్మూర్ నగరంలోని ఏడు బస్తీలలో రేషన్ కార్డు లేని నిరుపేద 80 కుటుంబాలకు నిత్యావసర వస్తువులైన బియ్యం, పప్పు, నూనె, కూరగాయలు- పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నగర సంఘచాలక్ పోల్కం నారాయణ, నగర కార్యవాహ రుద్ర మధు తదితరులు పాల్గొన్నారు.
 • నల్గొండ జిల్లా: సేవాభారతి ఆధ్వర్యంలో హాలియా (అహల్య) గ్రామంలో 50 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఖండ శారీరక ప్రముఖ్ బొమ్మపాల కోటేష్ సహా శారీరక ప్రముఖ్ కె.వెంకట్, భాజపా నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు చెన్నువెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
 • జగిత్యాల జిల్లా: సేవాభారతి అర్వర్యంలో ఇ్రహీంపట్నం మండలం చేములకుర్తి గ్రామంలో 23 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు (బియ్యం, నూనె, వప్పులు) అందించారు. ఈ కార్యక్రమంలో వర్పంచ్, యం.వి.టి.సి, సేవాళారతి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
 • భాగ్యనగర్ : సేవాభారతి ఆధ్వర్యంలో బర్కత్పురా భాగ్లోని లింగాలగడ్డ, మాణికేశ్వర్నగర్, బతుకమ్మకుంట, డి.డి. కాలనీ, గోల్నాక, మధురానగర్ తిలకనగర్, శాంతినగర్, గంగాబౌలి, వినాయక్నగర్ 20 బస్తీలలో నిత్యావసర వస్తువులను, మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగ్ కార్యవాహ దిలీప్ సహని, సహకార్యవాహ శివాజీ, పురుషోత్తం, సంపర్క్ ప్రముఖ్ కస్తూరీ రంగన్, భాగ్ కార్యకారిణీ సభ్యులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.

మూలము: జాగృతి వారపత్రిక
« PREV
NEXT »