నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

12, ఏప్రిల్ 2020, ఆదివారం

లాక్ డౌన్ లో సేవ కార్యక్రమాల విషయమై 'ఆర్ఎస్ఎస్ తెలంగాణ' – పత్రిక ప్రకటన - RSS Telangana - News Release on Lockdown

లాక్ డౌన్ లో సేవ కార్యక్రమాల విషయమై 'ఆర్ఎస్ఎస్ తెలంగాణ' – పత్రిక ప్రకటన - RSS Telangana - News Release on Lockdown
స్వయంసేవకులు ప్రభుత్వానికి సహకరిస్తారు ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు సంభవించినప్పుడు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయంసేవకులు సహజంగానే సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమవుతారు. వివిధ సంస్థాలతోపాటు పనిచేస్తూ ప్రజలకు సహాయం అందిస్తారు. చైనా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్ డౌన్ లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తీర్చడం కోసం కూడా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయంసేవకులు వివిధ సేవా, సహాయ కార్యక్రమాలు చేపట్టిన సంగతి అందరికీ తెలిసినదే. 

ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే స్వయంసేవకులు 369 స్థలాల్లో జరుగుతున్న కార్యక్రమాల ద్వారా 25వేల కుటుంబాలను ఆదుకున్నారు. ఈ కార్యక్రమాల్లో 2678 మంది స్వయసేవకులు పాలుపంచుకున్నారు. వివిధ సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలతోపాటు కలిసి స్వయంసేవకులు పనిచేస్తున్నారు. 

ప్రభుత్వ సిబ్బంది కోరిన మీదట వారికి సహకారం అందిస్తున్నారు. అయితే స్వయంసేవకులు ప్రభుత్వోద్యోగుల విధుల్లో జోక్యం చేసుకుని, ఐడి కార్డులు తనిఖీ చేస్తున్నారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇందులో ఏమాత్రం నిజం లేదు. స్వయంసేవకులు కేవలం స్థానిక అధికారులు కోరిన మేరకే వారికి సహకారం అందిస్తారు తప్ప పని అంతా తమ చేతుల్లోకి తీసుకోరు.

శ్రీ కాచం రమేష్
ప్రాంత కార్యవాహ, ఆర్ ఎస్ ఎస్ తెలంగాణ

« PREV
NEXT »