నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

14, మే 2020, గురువారం

లాక్ డౌన్ వేళ పూజనీయ సర్ సంఘచాలక్ జి మార్గదర్శనం - Sir Sanghachalak Dr. Mohan Bhagwat Ji Guidelines during lockdown

లాక్ డౌన్ వేళ పూజనీయ సర్ సంఘచాలక్ జి మార్గదర్శనం - Sir Sanghachalak Dr. Mohan Bhagwat Ji Guidelines during lockdown

పూజనీయ సర్ సంఘచాలక్ జి మార్గదర్శనం

 • 1. లాక్ డౌన్ తొలగిన తరువాత అస్తవ్యస్త స్థితి ఏర్పడుతుంది. అప్పుడు ప్రజలకు ఒక దిశ నిచ్చే పని మనది.
 • 2. గుంపులు కాకుండా పాఠశాలలు, బజార్లు తదితర ప్రదేశాలలో ప్రజలు నియమాలు పాటించేలా, తద్వారా కరోనా తిరగబెట్టకుండా చూసుకోవాలి.
 • 3. రోగ నిరోధక శక్తి ప్రజల్లో పెరగడానికి ఆయుష్ వారి సూచనలు అలవాటు చేయాలి. మనం దానిలో ఉదాహరణగా ఉండాలి.
 • 4. కరోనా అనేక జీవన సత్యాలను ప్రజలకు చక్కగా అర్థం చేయించింది. కాబట్టి వాటి ఆధారంగా జాతి పునర్నిర్మాణ కార్యానికి ఒక కొత్త అంకం ప్రారంభం కావడం లో మనం అగ్రేసరులం కావాలి.
 • 5. గ్రామాలకు వలస వస్తున్నారు. అనేక ఉపాధిపరమైన సమస్యలు వస్తాయి. దీని వల్ల కొంతమందికి నష్టం జరుగుతుంది. ప్రజలను సంసిద్ధం చేయాలి.
 • 6. స్వావలంబనకు అనగా స్వ ఆధారిత తంత్ర అవలంబనకు శ్రీకారం చుట్టాలి. తక్కువ వ్యయంతో,ఉపాధి కల్పిస్తూ, పర్యావరణానికి హాని చేయని మన పారంపరిక ఆలోచనలకు అనుగుణంగా యుగానుకూల రచనను- DEVELOPMENT MODEL ను నిర్మాణం చేసుకోవాలి.
 • 7. మన మన ప్రాచీన దృష్టిని, నేటి సాంకేతికతను జోడించి ఒక క్రొత్త DEVELOPMENT MODEL ను నిర్మాణం చేయాలి.
 • 8. ఈ పని ప్రభుత్వాలు,పరిపాలనా యంత్రాంగం మాత్రమే కాదు. ప్రజలు కూడా పూనుకుంటేనే చేయగలం. ప్రజలను సంసిద్ధం చేసే పని మనం చేయాలి.
 • 9. సాధ్యమైనంతవరకు స్వదేశీ ఉత్పత్తులే వాడాలి. మన ఉత్పత్తులు లేకపోతే అవి లేకుండా కూడా బ్రతకవచ్చు అనిపిస్తే అవి లేకుండానే బ్రతకడం నేర్చుకోవాలి. ఒకవేళ అది తప్పనిసరిగా అవసరం అనిపిస్తే మన షరతుల ప్రకారం మాత్రమే, వీలైనంత తక్కువ గానే దానిని వాడడం అలవర్చుకోవాలి.
 • 10. స్వదేశీ వస్తువుల లభ్యత, వాటి నాణ్యత పై కూడా పారిశ్రామికవేత్తలు, ఉత్పత్తిదారులు దృష్టి పెట్టాలి. మన సమాజాన్ని విదేశాలపై ఆధార ఆధార పడని విధంగా రూపొందించుకోవాలి.
 • 11. ఈ సమయంలో లో పర్యావరణం పరిశుభ్రంగా తయారయింది.లాక్ డౌన్ తర్వాత మన ఏ అలవాట్లు పర్యావరణాన్ని మళ్లీ కలుషితం చేస్తాయో ఆ అలవాట్లను మనం వీలైనంత మానుకోవాలి.
 • 12. నీరు, చెట్లు సంవర్ధన, సంరక్షణ పై విశేష దృష్టి ఉంచాలి.
 • 13. ప్లాస్టిక్ వాడకం నుండి విముక్తం కావాలి.
 • 14. స్వచ్ఛత పట్ల మరింత శ్రద్ధ, అలవాట్లు కొనసాగాలి.
 • 15. సేంద్రీయ వ్యవసాయం,గోపాలన గ్రామాలలో పెంపొందించాలి.
 • 16. రసాయనాలతో వ్యవసాయాన్ని మాన్పించాలి.
 • 17. వీటికి ప్రభుత్వాల కృషి మాత్రమే సరిపోదు. ప్రజల దృష్టి,అలవాట్లు పెరగాలి. దానికి కుటుంబాలలో శ్రద్ధ సంస్కారం కలిగించాలి.
 • 18. సమాజం కూడా పెద్ద కుటుంబం. అక్కడ కూడా ప్రబోధం, అలవాట్లు చేసే నియమిత సంస్కారాలు అందించే వ్యవస్థలు చేయాలి.
 • 19. అతి ముఖ్యమైనది పౌరుల అనుశాసనం. నివేదిత దీనినే దేశభక్తి అన్నారు. అంబేద్కర్ కూడా చట్టం శాసనాల పై ప్రజల శ్రద్ధ మాత్రమే రాజ్యాంగానికి,దేశానికి రక్ష అన్నారు.
 • 20 ఈ కరోనా కష్టకాలాన్ని మనందరం ఒక అవకాశంగా భావించి ఒక నూతన ఉజ్వల భారతానికి శ్రీకారం చుడదాం.
పైన వారు సూచించిన విషయాలన్నింటిలోనూ స్థానికంగా చిన్న చిన్న ప్రయోగాలు చెయ్యాలి. సఫల ప్రయోగాలకు Echo system నిర్మాణం చేయాలి.

సంకలనం: కోటి మాధవ్ బాలు
« PREV
NEXT »