నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

6, ఆగస్టు 2020, గురువారం

30 ఏళ్ళ పోరాట ఫలితమిది : ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ - The result of 30 years of struggle: RSS Sir Sanghchalak Dr. Mohan Bhagwat


30 ఏళ్ళ పోరాట ఫలితమిది : ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్

“30ఏళ్ళ మన పోరాటానికి ఫలితం దక్కి మన ఆకాంక్షలు నేరవేరుతున్న ఈ వేళ ఎంతో ఆనందంగా ఉంది.” అని అయోధ్యలోని రామ మందిర నిర్మాణ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ అన్నారు.

“ఈ కార్యక్రమానికి మరికొందరు రావాల్సి ఉంది, కానీ కోవిడ్ -19 పరిస్థితి కారణంగా వారికి ఆహ్వానాలు అందలేదు” అని ఆయన తెలిపారు. “అద్వానీజీ ఇంటి దగ్గర తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటారు” అని ఆయన అన్నారు.

భారతదేశం ‘వసుధైవ కుటుంబకం’ అంటే ప్రపంచం అంతా ఒకే కుటుంబమని నమ్ముతుందని, అందరితో కలసి పయనించాలని భారతీయులు భావిస్తారని ఆయన అన్నారు. “ఈ రోజు సరికొత్త భారతదేశానికి ఒక కొత్త ప్రారంభం” అని ఆయన అన్నారు.

అశోక్ సింఘాల్ మరియు పరమహంస దాస్‌లను గుర్తుచేసుకుంటూ, శ్రీ మోహన్ భగవత్ ఆలయ నిర్మాణ ప్రారంభం ‘మనం చేయాలనుకున్నది చేయగలము’ అని రుజువు చేస్తోంది అన్నారు. “మన ఈ ఆకాంక్ష నెరవేరాలంటే మనం 20-30 సంవత్సరాలు కష్టపడాల్సి వస్తుంది.” అని అప్పటి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ పరమ పూజ్యనీయ బాలాసాహెబ్ దేవరస్ జీ చెప్పడం నాకు గుర్తుంది. అలాగే మనం 30 సంవత్సరాలు కష్టపడ్డాము. ఇప్పుడు 30 సంవత్సరాల అనంతరం, మన ఆకాంక్షను నెరవేర్చుకున్న ఆనందాన్ని మనము పొందుతున్నాము, ”అని ఆయన అన్నారు.

“ఈ రోజు మొత్తం దేశంలో ఆనందం ఉంది. శతాబ్దాల నాటి కల నేడు నేరవేరడంతో చాలా ఆనందంగా ఉంది. అన్నిటికంటే ఆనందకరమైన విషయం ఏమిటంటే, భారతదేశాన్ని స్వావలంబ భారత్ గా మార్చడం. మనలో వున్న “ఆత్మవిశ్వాసం లోపం” పోయి ఈరోజు సరికొత్త ఆత్మవిశ్వాసం స్థాపించబడింది.” అని శ్రీ మోహన్ భాగవత్ అన్నారు.

ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ ప్రసంగం పూర్తి వీడియో:

మూలము: విశ్వ సంవాద కేంద్రంము
వీడియో: నేషనలిస్ట్ హబ్ 
« PREV
NEXT »