నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

23, ఆగస్టు 2020, ఆదివారం

దేశ దురాక్రమణదారుల అవశేషాలు అవమానకరమే - Durakramana


ప్రపంచ చరిత్రను పరిశీలించినట్టయితే దురాక్రమణదారుల అవశేషాలను నిర్మూలించు కోవడమనే చర్య కనిపిస్తుంది. దీనిని ఆత్మగౌరవ ప్రకటనగా కూడా భావిస్తారు.

దురాక్రమణదారులు, దురాక్రణకు గురైన వారు ఒకే మతానికి చెందిన వారే అయినప్పటికి వారిలో దురాక్రమణదారుల పట్ల మొగ్గు చూపే లక్షణం కానరాదు. 12 వ శతాబ్దంలో మూర్ అనే ఇస్లామిక్ జాతి స్పెయిన్ దేశాన్ని ఆక్రమించుకుంది. స్పెయిన్ దేశీయులు క్రైస్తవులు. మూర్ జాతే కాదు, అసలు ఏ ఇస్లాం సంప్రదాయం ప్రకారమైనా, వారి స్వభావం మతాంతరీకరణ. స్పెయిన్లోను ఇదే జరిగింది.

ప్రజలను బలవంతంగా ఇస్లాంలోకి మతాంతరీకరణ గావించారు. చర్చిలన్నిటిని మసీదులుగా మార్చివేశారు. కానీ 16 వ శతాబ్దం వచ్చేసరికి పరిస్థితి మారింది. స్పెయిన్ దేశ క్రైస్తవులు మూర్ జాతి నుండి స్వదేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. స్వతంత్రాన్ని పొందారు.

స్వతంత్రులైన స్పెయిన్ క్రైస్తవులు తమ దేశంలో ఉన్న ముస్లిములందరికి మూడు అవకాశాలు ఇచ్చారు. అవి - తిరిగి క్రైస్తవ మతాన్ని స్వీకరించడం. మూర్స్తో పాటు దేశం విడిచి వెళ్లడం లేదా చావడం.ఈ మూడింటిలో ఒకటి ఎంచుకోమన్నారు.

మసీదులన్నింటిని తిరిగి చర్చ్లుగా మార్చివేశారు. ఆనాటి పునః క్రైస్తవీకరణ కూడా బలవంతంగానే జరిగినది. స్పెయిన్ దేశస్తులు తమ స్వాభిమానాన్ని, సంస్కృతిని తిరిగి కాపాడుకున్నారు. ఈ చర్యను ప్రపంచంలో ఎవ్వరు విమర్శించలేదు రష్యా వారు పోలెండ్ దేశాన్ని ఆక్రమించుకున్నారు. రష్యా వారు క్రైస్తవులే. పోలాండ్ వారు క్రైస్తవులే. పోలెండ్ రాజధాని వార్సాలో రష్యా వారు రష్యన్ ఆర్డోడాక్స్ చర్చిలను నిర్మించారు. 118లో రష్యా ఆక్రమణ అంతమైనది. పోలెండ్ పౌరులు స్వతంత్రులైనారు.

పోలెండ్ ప్రజలు వార్సాలో మొదట చేసిన పని రవ్యన్లు నిర్మించిన రష్యన్ ఆర్టోడాక్స్ క్రిస్టియన్ కేథడ్రాల్స్ ను కూలగొట్టడం. నిజానికి పోలెండ్ ప్రజలు క్రిష్టియన్లు జీసుస్ను కేథడ్రాల్లోనే పూజిస్తారు కూడా. కానీ వారు రష్యన్లు నిర్మించిన కేథడ్రాలును ఆరాధన స్థలంగా భావించలేదు, ఆ కట్టడాలను తమ బానిసత్వాన్ని గుర్తు తెచ్చే ప్రదేశంగా భావించి వాటన్నింటిని కూల్చి వేశారు.
 భాగయ్య, సహ సర్ కార్యవాహ, ఆర్ఎస్ఎస్
 భాగయ్య, సహ సర్ కార్యవాహ, ఆర్ఎస్ఎస్
ఇది ప్రసంచ స్వాభిమాన స్వాతంత్ర చరిత్ర:

దేశంలో ఉన్న మన ముస్లింలకూ బాబరు కూ ఏ రకమైన సంబంధం లేదు. వీరందరూ మతం మారిన హిందువులు. బాబర్ విదేశీ దురాక్రమణ దారుడు. కానీ మన ముస్లింలను కొంతమంది స్వార్ధ రాజకీయ నాయకులు శత్రు శిబిరంలోకి నెట్టివేశారు. మరికొంతమంది ముస్లిం స్వార్ధపర నాయకులు అధిక సంఖ్యాకుల మీద వీరిని రెచ్చగొట్టే పనిని నిరంతరం చేస్తూనే ఉన్నారు.  కుహనా సెక్యులర్ వాదులు భావదాస్యంతో విదేశీ దురాక్రమణదారుడిని సమర్థిస్తూనే ఉన్నారు.

ప్రపంచంలో అనేక దేశాల ప్రజలు, నాయకులు ఆగష్టు 5వ తేదీన శ్రీరామజన్మభూమి భూమిపూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో తిలకించారు. బ్రిటిష్ ప్రధానమంత్రి వారి సతీమణి కలిసి శ్రీరాముడికి అభిషేకం చేసారు. భారత సర్వోన్నత న్యాయస్థానం ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం అయోధ్య రామునికే చెందుతుందని ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది అసంబద్ధ వాదనలు చేయడాన్ని చరిత్ర క్షమించదు.

మన జాతి చరిత్ర ఏమిటి? జాతీయ మహాపురుషులు ఎవరు? విదేశీ దురాక్రమణదారులు ఎవరు? వంటి ప్రశ్నలు మేల్కొంటున్న భారతదేశం వేసుకుంటున్నది. విశ్వజనీనమైన మన సంస్కృతిని యావత్తు ప్రజానీకం అర్థం చేసుకోవలసిన సమయం ఆసన్నమైనది. మన దేశానికే కాదు, మొత్తం ప్రపంచంలోనే నూతన దశ దిశా ఆరంభం కాబోతున్నది.

సత్యమేవ జయతే

వ్యాసకర్త : భాగయ్య, సహ సర్ కార్యవాహ, ఆర్ఎస్ఎస్ - జాగృతి
« PREV
NEXT »