నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

17, అక్టోబర్ 2020, శనివారం

తుఫాను బాధిత ప్రజలకు ఆర్.ఎస్.ఎస్ స్వయంసేవకుల ఆసరా - RSS volunteers support people affected by the cyclone

త వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ లో అనేక చోట్ల ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ నీటి ప్రవాహంతో కనీసం నడవడానికి కూడా వీలులేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో  సేవాభారతి కార్యకర్తలు, స్వయంసేవకులు వరద బాధితులకు తమ వంతు సాయంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. మల్కాజిగిరి ప్రాంతంలో  భారీగా నీట మునిగిన ప్రాంతాల్లో స్వయం సేవకులు వారి ప్రాణాలను పణంగా పెట్టి అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. ఉప్పల్, మేడిపల్లి లో వరదల్లో చిక్కుకుపోయిన సుమా రెసిడెన్సి కాలనీ, ప్రగతి నగర్ కాలనీ ప్రజల్ని సేవాభారతి కార్యకర్తలు సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి భోజనం ఇతర సదుపాయాలను కల్పించారు. సికింద్రాబాదులోని నాగారం లో వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు పాలు, తాగునీటిని అందించారు.
దాతలు ముందుకు రావాలి : 
 మానవ సేవయే మాధవ సేవగా భావించి వరదల్లో చిక్కుకున్న బాధితులకు తమ వంతు సాయంగా దాతలు ముందుకు రావాలని సేవాభారతి పిలుపునిస్తోంది. నిత్యవసర వస్తువులు, నీళ్ల బాటిల్లు, బిసిట్లు, స్నాక్స్ , టార్పాలిన్ కవర్లు, దుస్తులు, దుప్పట్లు, ప్యాకింగ్ సామగ్రి, మెడికల్ కిట్లను అందించి సేవా గుణాన్ని చాటు కోవాలని దాతలను సేవాభారతి విజ్ఞప్తి చేస్తోంది.
కిషోర్ వికాస్ కార్యకర్తలు కూడా తమ వంతు సహాయంగా ఎంజీ నగర్, షేక్ పేట బస్తిలకు చెందిన 113  మంది వరద బాధితులకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. చార్మినార్ బాగ్ లోని ఉప్పుగూడ, జగ్గంపేట, గౌలిపుర ప్రాంతాల్లోని వరద బాధితులను సేవాభారతి కార్యకర్తలు, స్వయం సేవకులు పరామర్శించి వారికి భోజనం, ఇతర సహాయక చర్యలు చేపట్టారు. కొన్నిచోట్ల సేవాభారతి కార్యకర్తలు స్వచ్ఛందంగా పడవలను తయారుచేసి వాటి ద్వారా వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి నిత్యవసరాలు, దుప్పట్లు, టార్పాలిన్ కవర్లు, దుస్తులు, పాత్రలను, ప్రథమ చికిత్స సమగ్రిని అందజేశారు.

_విశ్వ సంవాద కేంద్రము
« PREV
NEXT »