పరమాత్మ పట్ల మనం కృతజ్ఞతగా ఉన్నామా?

0

పరమాత్మ పట్ల కృతజ్ఞతా? కృతఘ్నతా?:

ఈ శరీరంలో నిలబడడం (భుక్తి) కోసం, మనము, మనకు నిర్ణయించిన కాలమునకు, మన పనిని మనము, చేయుచున్నామా లేదా?

ఉదా:-ఒక ఉద్యోగికి ఉదయం 10 గం|| ఆఫీసు. ఆ టైమ్ కు వెళుచున్నాడా లేదా? ఒక కూలి ఉదయం 8 గం|| వెళ్ళుచున్నాడా?, ఒక కార్మాగార ఉద్యోగికి మధ్యాహ్నం 2గం|| లకు duty కరెక్టుగా ఆ timeకు వెళ్లుచున్నాడ లేదా?, ఒక వ్యాపారి ఉదయం 8గం|| వ్యాపారం ప్రారంబించాలి, చేస్తున్నాడా లేదా?, ఇంట్లో ఇల్లాలు తన భర్త పిల్లలు ఉదయాన 7గం|| బయలుతేరి వెళ్లాలంటే, పాపం ఆ ఇల్లాలు, వేకువజామునే ఏ నాలుగింటికో లేచి, కాలకృ త్యాలు తీర్చుకొని, పిల్లలకు, భర్తకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఉదయం 7గం||కు, సిద్దం చేసి వారి వారి విధులకు, భంగం కలగకుండా వారిని, పంపుతోందా?, పైన వివరించిన వివిధ పనులు వివిధ సమయ పాలన ఎందుకు.

కేవలం భుక్తి కొరకు. మన సంసారం పిల్లలు అందరి శరీరాలు భుక్తితో నిలబడడానికేనా? బాగా ఆలోచించండి? మరి ఒకొక్కరూ రోజుకు 8గం||లు, మరీ అదనపు ఆదాయం ఇస్తామంటే, ఇంకా ఎక్కువ గంటలు పనిచేయడం లేదా? మరి భగవంతుడు మనకు ఈ మానవ శరీరం, మానవ ఉపాధి ఇవ్వకపోతే, ఇవన్నీ మనము చేయగలమా? మాన ఉపాధి కాక (ఏ కుక్కో, ఏ పామో, ఏ బల్లో) ఉపాధి అయితే ఇవన్నీ సాధ్యమా? ఈ జనజీవనంలో మిగతా ఉపధులను మనము చూడడంలేదా? అవి ఎలా బ్రతుకుతున్నాయో, మనము నిత్యమూ చూడడంలేదా? అవి ఉపాధులు కావ వాటికి జీవం లేదా? అవి బ్రతకడంలేదా? వాటికి క్రమశిక్షణ ఉన్నదా? మంచి చెడులు ఆలోచించే జ్ఞానము కలదా? మరి భగవంతుడు మనకు ఇంతగొప్ప ఉపాధిని ఇచ్చి దీనితో వేదములు, ఉపనిషత్తులు, పురాణములు చదివి, విని అర్ధంచేసుకొనే శక్తినిచ్చి, పెద్దలు చెప్పిన విధముగా బ్రతుకమని, నిత్యమూ ధర్మమును గురించి ఆలోచించుచూ, సత్త్య భాషణమే చేయుచూ, పరోపకారియై, ధర్మాన్ని రక్షించుచూ, నిత్యమూ భగవంతుని పూజలో, భగవంతుని ధ్యానముతో బ్రతుకమని భగవంతుడు మనకు అవకాశము ఇస్తే దానిని ఇలా వృధా చేయడం న్యాయమా?

పరమాత్మకు మనము మాతృ గర్భములో ఉన్నప్పుడే పరమాత్మను ప్రార్ధించాం, ప్రమాణము చేశాము.పరమాత్మా నన్ను త్వరగా ఈ (మురుకి కూపమునుండి) మాతృగర్భము నుండి బయట పడవేయుము. బయటకు వచ్చిన తర్వాత నేను నీకుకృతజ్జ్ణుడుగా (నన్ను ఈమురుకి కూపమునుండి బయట పడ వేసినందుకు) ఉంటూ నిత్య పూజలతో, భజనలతో, ధ్యానముతో నిన్ను మరువను, పొరపాటునకూడ ఈ సంసార బంధనములో చిక్కుకోను, నన్ను నమ్ము అని మాట ఇచ్చి, పరమాత్మకు ప్రమాణము చేసి, ప్రస్తుతము మనము చేయుచున్న దేమిటి? ఒకసారి హృదయ ము మీద చేయి వేసుకొని ఆలోచించి నిస్పక్ష పాతముగా చెప్పండి? రోజూ, ఒక గంటసేపైనా స్వామికి పూజ చేయడానికి మనకు, తీరిక, సమయము లేదా? పురాణ కధలు వినడానికి, తీరిక, సమయము లేదా? ఇంతగొప్ప ఉపాధిని ఇచ్చిన పరమాత్మను, ఆలయమునకు వెళ్ళి చూడడానికి, ఆలయములకు వెళ్ళడానికి, తీరిక, సమయము లేదా? మిగతా అడ్డమైన తిరుగుళ్ళు తిరగడానికి, అడ్డమైన పనులు చేయడానికి, సోల్లు కబురులు చెప్పుకోవడానికి, పరనిందలు చేయడా నికి, తీరిక, సమయమూ, పుష్కలంగా ఉందా? ఒక్కసారి బాగా లోతుగా ఆత్మవిమర్శ చేసుకొని గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి?
నిజం చెప్పాలంటే మనము పరమాత్మ పట్ల చూపు వినయము,విధేయత, చేయు సేవ, దాస్యము,ధ్యానమూ పూజ, హోమము కేవలం పరమాత్మ కొరకు మాత్రమేకాదు.

మన అభ్యున్నతికి, మన చుట్టూ ఉన్న సమాజము అభ్యున్న తికి, మన పిల్లలూ, వారి పిల్లలూ (వంశాబివృద్ధికి, దేశాభివృధికి) అభివృద్ధికి మాత్రమేనని మరచిపోకండి. ఈ మానవ ఉపాధి, శరీర పోషణకు ఆహారము, నీరు, గాలి, వెలుతురు ఎంత అవసరమో, మనలోని జీవాత్మకూ, పరమాత్మల పోషణకు సత్యభాషణమూ, ధర్మానుష్టానమూ, నిత్య పూజ, నిరంతర స్మరణ అంతే అవసరము.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top