నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

- ఆర్ఎస్ఎస్ -

ఆర్ఎస్ఎస్
హిందూ ధర్మం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
హిందూ ధర్మం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, జులై 2020, శనివారం

వర్ణ ధర్మములు - Varna Dharmamulu

వర్ణ ధర్మములు - Varna Dharmamulu

వర్ణ ధర్మములు

శ్లో||  జన్మనా జాయతేశూద్రః | కర్మణా జాయతే ద్విజః
       వేదపాఠంతు విప్రాణాం | బ్రహ్మజ్ఞానంతు బ్రహ్మణః

వర్ణములు చేతనాశక్తి భేదము చేత నిర్ణయింపబడినవి :


1. బ్రాహ్మణులు :

మనస్సు, బుద్ది, చిత్తము, అహంకారము - ఈ నాలుగు ఎవరిలో చక్కగా పనిచేయునో వారే బ్రాహ్మణులు. వీరి స్వభాము శమము, దమము, సత్యము, అహింస, మొదలగు సద్గుణములు కలిగియుండుట.

2. క్షత్రియులు :

మనస్సు, బుద్ధి, అహంకారము - ఈ మూడు ఎవరిలో బాగుగా పనిచేయునో వారే క్షత్రియులు. వీరి స్వభావము తేజస్సు, బలము, శౌర్యము, ఐశ్వర్యము కలిగి యుండుట.

3. వైశ్యులు :

మనస్సు, బుద్ధి, ఈ రెండు చక్కగా ఎవరిలో పనిచేయునో వారే వైశ్యులు. వీరి స్వభావము ఆస్తికత్వము, దానము, నిష్ఠ, ధన సంచయము కలిగియుండుట.

4. శూద్రులు :

మనస్సు ఒక్కటే ఎవరిలో పనిచేయునో వారే శూద్రులు. వీరి స్వభావము ఇతర మూడు వర్ణములలో చెప్పబడినవి లేకుండుట. అందువలన దేవ, గో, బ్రాహ్మణ సేవ చేయుచు, వారికి సహాయము చేయుట వలన వారి స్వభావమును క్రమముగా పెంపొందించుకొనగలరు.

5. అంత్యజులు :

శుచి శుభ్రతలు లేకుండుట, అబద్ధములాడుట, దొంగతనము చేయుట, నాస్తికత్వము, కలహ ప్రియము, కామక్రోధ తృష్ణలు, కలిగియున్నవారు అంత్యజులు. ఈ వర్ణములు వారి వారి గుణకర్మ స్వభావములను బట్టి నిర్ణయింపబడినవే గాని తల్లిదండ్రుల నుండి సంక్రమించినవి కాదు. స్వభావమును మెరుగుపరచుకున్నవారు తగిన వర్ణస్థులగుదురు. జన్మతః వర్ణములందు ఉచ్ఛనీచములు లేవు.

స్వాభావిక లక్షణములు:

బ్రాహ్మణులు :
 • ☀ శమము అనగా మనో నిగ్రహము. దమము అనగా ఇంద్రియ నిగ్రహము; 
 • ☀ శౌచము అనగా పవిత్ర భావములు, భగవత్‌ ప్రసాద బుద్ధి, దైవేచ్ఛ అనే ప్రపత్తి; 
 • ☀ తపస్సు అనగా భగవత్‌ విశేషములపట్ల, సాధనలపట్ల తపనతో కూడిన ప్రయత్నము చేయు స్వభావము; 
 • ☀ సంతోషము అనగా ఏది ప్రాప్తించినా సంతోషము తృప్తి కలిగియుండి అవగాహన పెంపొందించుకొను స్వభావము; 
 • ☀ క్షాంతి అనగా కష్ట సుఖాలు రెంటిని సాధన కొఱకు పెట్టిన పరీక్షలనే భావముతో ఉంటూ, ఆత్మ దృష్టి కలిగి యుండుట, ఆర్జవము అనగా త్రికరణములు ఏకీకృతమై; 
 • ☀ శుద్ధిగా నుండునట్లు అభ్యసించుట. భక్తి అనగా పరాభక్తి, పరాప్రేమను పెంపొందించుకొనుట; 
 • ☀ దయ అనగా తానుకోరే దయను, అట్లే సహజీవుల యెడల కలిగియుండుట, ఇతరుల కష్టములు తనవైతే ఎట్లో, అట్లే భావించి, వీలైనంత సహాయము చేయుట, సత్యము అనగా సర్వజీవులలోని నిత్యమైన సత్యమును ఆశ్రయించుచు, సందర్శించుచు, అవలంబించుచు, ఆరాధించుచు ఉండే స్వభావము.
క్షత్రియులు:
 • ☀ తేజస్సు అనగా విషయములను సత్య దృష్టితో, పవిత్ర దృష్టితో ఆకళింపు చేసుకునే వివేక కాంతితో విరాజిల్లుట; 
 • ☀ బలము అనగా శరీర మనోబుద్ధుల బల సంపన్నతను పెంపొందించుకొనుట; 
 • ☀ ధృతి అనగా ధైర్య స్థైర్య సంపన్నత; 
 • ☀ శౌర్యము అనగా సమస్యలను సమర్ధతతో ఎదుర్కోగల ఉత్సాహము, సాహసము వృద్ధి చేసుకొనుట; 
 • ☀ తితిక్ష అనగా సహనము, ఓర్పు అలవరచుకొనుట, ఔదార్యము అనగా ఉదారత త్యాగ నిరతి, ఇతరుల సుఖశాంతులు, సంతోషముకొఱకు ఏదైనా చేయాలనే స్వభావము, ఉద్యమము అనగా కార్యములను చేపట్టి సఫలము చేయుటకు ఉత్సాహముతో ఉద్యమించు శక్తి సంపన్నత.
వైశ్యులు :
 • ☀ ఆస్తిక్యము అనగా పరమాత్మ యొక్క సర్వతత్త్వ స్వరూపముపట్ల తన బుద్ధి చిత్తములను ఆయత్తపరచి పెంపొందించుకొను స్వభావము; 
 • ☀ దానము అనగా దానధర్మములు నిర్వర్తించే శ్రద్ధ, అభ్యాసములను పెంపొందించుకొను స్వభావము; 
 • ☀ నిష్ఠ అనగా శాస్త్రములలో చెప్పబడే విధి విధానములను తాను నిర్వర్తించవలెనని నియమనిష్ఠలు కలిగియుండుట; 
 • ☀ అదంభము అనగా దంభము, దర్పము, గర్వములను త్యజిస్తూ, అణకువ, ప్రపత్తి, శరణాగతితో కూడిన స్వభావము, సంపద అనగా సంపదలను వృద్ధి చేసుకొనవలెననెడి ఉత్సాహము, బ్రహ్మ సేవనము అనగా బ్రహ్మజ్ఞులు, వేదజ్ఞులపట్ల సేవాభావము.
శూద్రులు:
శుశ్రూష అనగా దేవ, గురు, బ్రాహ్మణ, సాధు, సన్న్యాసులపట్ల నిస్వార్థ నిష్కపట సేవా నిరతి కలిగియుండి, దైవచింతన, సేవాభావంతో జీవనం సాగించుట.

అంత్యజులు:
పై చతుర్వర్ణస్థుల ధర్మ నిరతిని ఏమరచినవారు. అశౌచము, అనృతము, స్తేయము, నాస్తిక్యము, కామక్రోధ ప్రధానములు కలిగియుండు స్వభావము, ఇంద్రియ విషయములపట్ల సదా మననము, తపన కలిగియున్న స్వభావము, ఎంత పొందినా కృతజ్ఞత ఉండక, అసంతృప్తితో అలమటించే స్వభావము.

బ్రాహ్మణ్యము :
బ్రహ్మ జ్ఞానులను సేవించి, తద్వారా లోకహితమును తెలుసుకొని, అమలు చేయు స్వభావము.

అన్ని వర్ణముల వారు ఆచరించవలసిన ధర్మములు :
 • 1. అహింస : శారీరకముగా గాని, మానసికముగా గాని, బాధించకుండుట.
 • 2. సత్యము : సత్యమును ఆశయముగా కలిగియుండి, సత్యమును దర్శించుట, సత్యమును ఆశ్రయించుట, సత్యము పలుకుట, సత్యాన్వేషణ జరుపుట.
 • 3. అస్తేయము : ఇతరుల సంపదను ఉచితముగా గాని, అక్రమముగా గాని పొందే బుద్ధి లేకుండుట.
 • 4. అక్రోధము : క్రోధావేశములను నిగ్రహించి, పోగొట్టుకొనుట.
 • 5. అలోభము : నాది నాకే ఉండవలెననియు, ఎవరితోనూ పంచుకొనను అనే బుద్ధిని విడచిపెట్టుట.
 • 6. భూతప్రీతి : సహజీవులకు ప్రీతి, సంతోషము కలుగజేయు ఉద్దేశ్యము.
 • 7. భూత హితము : ఇతరుల హితము, శ్రేయస్సు కోరుకొనుట, ప్రయత్నించుట. జంతువులు, పక్షులు, వృక్షములు మొదలగు భూతములకు ఆహార పానీయములనిచ్చి సంతోషపెట్టుట.

చతుర్వర్ణ ధర్మములు 

1. బ్రాహ్మణులు :
వేదాధ్యయనము పరమ ధర్మము. విహిత కర్మలను వేద ప్రమాణముగా నియమ నిష్ఠలతో చేయవలెను. దయ కలిగి యుండవలెను. శాంతమును విడువరాదు. ఉదాత్తమైన పద్ధతిలో లభించిన ధనమును కేవలము తన సంతానమునకే గాక, యోగ్యులైన వారికి ధర్మ మార్గములో పంచవలెను. గర్వము పనికిరాదు.

2. క్షత్రియులు :
యజ్ఞములు చేయుట, దానక్రియలు, వేదాధ్యయనము, దుర్మార్గులను శిక్షించుట, ప్రజలనుండి అనురాగమును పొందే విధముగా రాజ్యపరిపాలన, నిర్భీతితో పరాక్రమించుట, యుద్ధము చేయుట.

3. వైశ్యులు :
వేదాధ్యయనము, దానములు, యజ్ఞముల నిర్వహణ, న్యాయముగా ధనార్జన, సక్రమముగా ఖర్చు చేయుట, పశు సంరక్షణ.

4. శూద్రులు :
పై మూడు వర్ణముల వారికి మంచిగా పనులు చేసి పెట్టుచు, బ్రతుకుట.

నాలుగు వర్ణముల వారికి గల ధర్మములు :
కోపము ఉండకూడదు. సత్యమే మాట్లాడవలెను. కట్టుకున్న భార్యతోనే భోగించవలెను. శుచిగా ఉండవలెను. డాంబికము లేకుండా ఒదిగి యుండవలెను. ఎవరికీ ద్రోహము తలపెట్టరాదు.

క్షత్రియుని లోక తంత్రములు :
ఆత్మ, ధృతి, దాక్షిణ్యము, దేశము, కాలము, పరాక్రమము అనే అయిదు లోక తంత్రములు. వీటిని బాగుగా తెలుసుకొని, ధర్మవిదుడైన ఉత్తమ క్షత్రియుడు తన రాజ్యమును చక్కగా పాలించును.

చతుర్వర్ణ కర్మోపాసకులు :
 • 1. బ్రాహ్మణులు : వీరిలో బ్రహ్మయతులు అని ఉందురు. ఇదంతా పరబ్రహ్మ స్వరూపమే కదా! నాతో సహా సర్వమూ అద్వితీయ నిరామయ నిరాకార నిర్గుణ బ్రహ్మము యొక్క చమత్కార సంప్రదర్శనమే అనెడి అవగాహన పెంపొందించుకొనుటకు మనస్సు యొక్క శుద్ధి కొఱకై కర్మలు, ఉపాసనలు విధిగా చేపట్టేవారు బ్రహ్మయతులు. వీరిది సాత్వికోపాసన
 • 2. క్షత్రియులు : వ్యవహార దక్షత, కార్య దీక్ష, పరిస్థితుల సానుకూల్యత, పేరు ప్రతిష్ఠలు - ఇట్టి వ్యవహారికమైన ఆశయములతో వాటి సముపార్జనకై పరమాత్మను ఉపాసించేవారు. ఇది సామర్ధ్య రాజసికోపాసన.
 • 3. వైశ్యులు : వస్తు సమృద్ధి, ధన, గృహ సంపద మొదలైనవి పొందుటకు లక్షితులై దైవోపాసన చేయువారు. వీరిది సంపద సిద్ధి రాజసికోపాసన.
 • 4. శూద్రులు : ఇంద్రియ సంబంధమైన అనుభవముల సంప్రాప్తికై దైవోపాసనను ఆశ్రయించేవారు. వీరిది ఇంద్రియానంద ఆశ్రిత తామసికోపాసన.
ఉర్వి :
వర్ణాశ్రమ ధర్మములు నశించి, అధర్మము, పాపము పెరిగి భూమి క్రుంగిపోగా, కశ్యప మహర్షి తన ఊరువులను దన్నుగా పెట్టి, భూమిని పైకి లేవనెత్తినందు వలన, భూమికి ఉర్వి అని పేరు వచ్చినది.

కృతయుగము పేరు :
ఈ యుగారంభములో హంస అను ఒకే వర్ణముండెను. చాతుర్వర్ణములు లేవు. హంస శబ్దార్థము పరతత్త్వమే. జనులు జన్మతః అనన్య భక్తి పరాయణులై జగత్తును ఈశ్వర భావముతో ఉపాసించుచూ అతి త్వరగా కృతకృత్యులయ్యేవారు. ఇది హంస యోగము. అందువలన ఈ యుగమునకు కృతయుగమనే పేరును శాస్త్రవేదులు నిర్ణయించిరి. ఈ యుగములో వేదము ప్రణవాత్మకముగా అనుభవమయ్యేది.

కలియుగములో వర్ణసాంకర్య ఫలితములు :
మానవులు సత్యమునకు, ధర్మమునకు దూరమగుదురు. ఆయుఃప్రమాణము తగ్గిపోవును. అజ్ఞానము, ప్రబల మోహము, దాని వలన లోభము కలిగి కామమునకు దారి తీయును. దానివలన క్రోధము, దానివలన వైరము ఉద్భవించును. సకల వర్ణములలో ఒకరినొకరు బాధించుకునే శత్రుత్వము ఉదయించును. హద్దులు మీరి అందరూ వర్ణ సాంకర్యము చేయుదురు.

బ్రాహ్మణులు జపతపములు, స్వాధ్యాయము, నియమ నిష్ఠలు విడచిపెట్టెదరు. అదే సమయములో శూద్రులు అధిక తపస్సంన్నులగుదురు. అరాచకము ప్రబలి ధర్మము నశించి ధనాపేక్షగల నీచ జాతులతో నిండిపోవును. అన్ని వర్ణముల వారిలో, వారి స్వధర్మము క్షీణించి, శారీరక మానసిక బలహీనతలు పెరుగును. మద్యపానము, వ్యభిచారము, అపనమ్మకము పెరిగి అందరూ భ్రష్టులగుదురు.

రస వస్తువులలో, సుగంధ ద్రవ్యములలో గుణము తగ్గిపోవును. పాడిపంటలు తగ్గును. నాణ్యత తగ్గిపోవును. పన్నులు అధికముగా వసూలు చేసెదరు. జనులు భయాందోళనలో జీవించుచుందురు. మోసము అధికమగును. శరీరముపై ఆసక్తి కలిగి దానినే ఆరాధించెదరు. వారికి ముక్తి అసాధ్యమగును. కలియుగాంతములో పదహారు సంవత్సరములే పూర్ణాయువు. ఏడెనిమిదేళ్ళకే ఆడపిల్లలు బిడ్డలని కందురు. వేదధర్మములు శూద్రులు చెప్పగా బ్రహ్మణులు ఆసక్తితో విందురు. గురువంటే శిష్యునికి లక్ష్యముండదు. కుటుంబ వ్యవస్థ పాడైపోవును. యుద్ధములు, ఉత్పాతములు సంభవించును. దేవతారాధనలు, పితృకార్యములు, వేద బోధ ఆగిపోవును. పెద్దల బోధను పెడచెవిన పెట్టెదరు. దుష్టులు అధికమయ్యెదరు.

కలియుగాంతములో శంబళ గ్రామములో విష్ణువు విష్ణుయశుడనే పేరుతో కల్కిగా అవతరించి, కృతయుగ ధర్మమును మరలా స్థాపించును.

శ్లో||  యదాయదాహి ధర్మస్యగ్లా నిర్భవతి భారత |
 అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్‌ ||

తా|| ధర్మమునకు హాని కలిగినప్పుడును, అధర్మము పెచ్చు పెరిగినప్పుడును నన్ను నేను సృజించుకొందును, అనగా సాకార రూపముతో అవతరించెదను.

- శ్రీకృష్ణ పరమాత్మ


సంకలనం: చల్లపల్లి విజ్ఞాన స్వరూప్

24, జులై 2020, శుక్రవారం

నాగ పంచమి - Naaga panchami

నాగపంచమి - Naagapanchamiచలి చీమ నుండి ... చతుర్ముఖ బ్రహ్మ వరకు , రాయి - రప్ప , చెట్టు -చేమ , వాగు-వరద , నీరు -నిప్పు , అన్నిటా అందరిలోనూ దైవత్వాన్ని దర్శించే విశిష్టమైన సంస్కుతి హిందువులది . మంచో , చెడో ... విపరీత ధోరణి ఇది . హిడువుల దృష్టిలో పాము కుడా పరమాత్మ స్వరూపమే . వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తి కి పానువు . వాసుకి పమేస్వరుడి కన్టాభరణమ్ . వినాయకుడు నాగ యజ్ఞోప వీతుడు . ఈ విధం గా బ్రాహ్మణులూ , ఋషులు , మునులు ... మానవజాతిని నమ్మించి సన్మార్గములో పయనించేటట్లు చేసారు .

నాగ జాతి జనము : 
కశ్యప ప్రజాపతికి , కద్రువ దంపతులకు .. అనంతుడు ,తక్షకుడు , వాసుకి , ననినాగుడు ,
శంఖుడు , కర్కోటకుడు , ఉగ్రకుడు పిందారకుడు , హహుషుడు , ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనబడిన వారినల్లా కాతువేస్తూ భయభ్రాంతులను చేయసాగారు .

దాంతో సకల దేవతలు అంటా బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు . అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై " మమ్మల్ని మీరే సృస్తించి మాకీ విధంగా శాపమివ్వడం న్యాయమా " అని వేడుకున్నారు .

"విషయుక్తం గా పుట్టినంత మాత్రాన అందర్నీ కాటువేసి ప్రాణికోటిని నశింప జేయడం తప్పు కదా ' నిష్కారణం గా ఏ ప్రాణినీ హిమ్సించరాడు . గరుడ మంత్రం చదివే వారిని , ఔషధ మని సమేతులను తప్పించుకు తిరగండి .దేవతా విహంగ గణాలకు , జ్ఞాతులైన మీరు మీమీ స్థాన గౌరవాలను నిలిపుకోండి . వాయుభాక్షకులై సాదుజీవులు గా మారండి . మీ నాగులంతా ఆటలా వితల పాతాళ లలో నివాసం చేయండి" అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు .

దాంతో డేవాగానామంతా నాగులను ప్రశంసించారు . భూలోక వాసులంతా ప్రార్ధనలు చేశారు నాగులకు . దివ్య ప్రభావ సంపన్నమయిన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకం గా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజచేయడం మొదలు పెట్టారు .

వైదిక కాలం నుండి కార్తీక మాసం ఐదవ రోజు పంచమి ఉత్సవాలు జరుపుకునే సంప్రదాయం దేశమంతా ఉంది. పుట్టలో ఆవుపాలు , వడపప్పు , చలిమిడి , అరటిపండ్లు , కోడి గ్రుడ్లు జారవిడిచి నైవేద్యం గా సమర్పిస్తారు .

పార్వతీ దేవికి పరమేశ్వరుడు చెప్పినట్లు గా పురాణాలులో చెప్పడం జరిగినది .
ఓ పార్వతీ దేవి... శ్రావణ మాస శుక్ల పంచమినాడు నాగారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఈ నాగపంచమినాడు ద్వారానికి ఇరువైపులా సర్వ చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం. చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం వెండి, కర్రతోగానీ, లేదా మట్టితోగానీ వారి వారి తాహతుని అనుసరించి ఐదు పడగల పామును చేయించాలి. లేదంటే పసుపు, చందనంతోగానీ ఏడు తలల పాము చిత్ర పటములు గీచి ఆ రూపాలకు జాజి, సంపెంగ, గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి. పాయసము, పాలు నివేదన చేయాలని పరమేశ్వరుడు వివరించాడని పురాణాలు చెబుతున్నాయి.
శ్రావణమాసం, శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్ర వచనం. ఇదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే శుక్లపంచమినాడు జరుపుకునే నాగ పంచమి కూడా ఈ సంప్రదాయానికి చెందినదేనని పండితులు అంటున్నారు.
అందుచేత శ్రావణమాసం న వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను పూజించాలి. నాగచతుర్థి రోజున (నాగపంచమికి ముందురోజు) ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి. గరుడ పంచమిగా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందేలేచి శుచిగా స్నానమాచరించి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి.

ఇంటి గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమకు నేతితోనూ, పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం, పానకం, వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇవ్వాలి. నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి. ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాకుండా పాపాల నుంచి విముక్తి లభించడం, సర్ప భయం తొలగిపోవడం వంటివి జరుగుతాయి.
నాగ పంచమి వ్రత కద :
పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి వుడేది ... ప్రతిరోజూ సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లు గా ఆమెకు కలలు వస్తుదేవి , దానితో ఆమె భయకంపితురాలైంది . ఒక రోజున వారి కులగురువు వారి ఇంటికి వచ్చి ఆమె దీన గాధను విన్నారు . విని "అమ్మా " నువ్వు గతజన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు , అందువలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యము సంక్రమించినది అని చెప్పి నివారణకోసం నాగపంచమి నోము నోయమని , పాముల భయం తొలగి పోతుందని చెప్పెను . ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైనది . నాగపంచమి వ్రత కధల్లో ఇది ఒకటి .

ఈ కధ వెనుక ఒక సామాజిక మైన హితవు ఉన్నది .. ఇతరులకు ఎవ్వరికీ ఇబ్బంది కలగని విధంగా ఎవరైనా తన కుటుంబ ఆచారాన్ని తానూ పాతిస్తున్నట్లయితే వారిని పరిహసించకూడదు .. ఎవరి విస్వాశము వారిది . ఈ నాగపూజా వెనుక యోగాపరమైన అంతరార్ధము కుడా ఉన్నది .. మన వెన్నెముక కు అడుగుభాగము లో మూలాధార చక్రమున్నది . ఆ చక్రం లో కుండలినీ శక్తి ఇమిదివున్నది .. అదే నాగదేవత , ధ్యానం తో ఆ కూడలిని కదిలించి సహస్రారం దాకా తీసుకొని వెళ్లి నట్లయితే మానవుడు మహానీయుదవుతాడు .. అదీ నాగశక్తి .

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

18, జులై 2020, శనివారం

ఇళ్ళలోనూ, దేవాలయాలలోనూ చేయబడుతున్న పూజకు అర్థం - Poojaku Ardham

ఇళ్ళలోనూ, దేవాలయాలలోనూ చేయబడుతున్న పూజకు అర్థం ఏమైనా ఉందా దీనికేమైనా నిర్దిష్టమైన పద్ధతి ఉందా?

మనం ప్రేమించే బంధువులు, మిత్రులు మన ఇంటికి వస్తే వారిని మనం ఎంతో ఆప్యాయంగా ఆదరిస్తాము. అలాగే దేవుడు మన ఇంటికి వచ్చినట్లు భావించి మనం చేసే ఉపచారమే పూజ.

ఆహ్వానం లేక ఆవాహనం, కూర్చోవటానికి 'ఆసనం, కాళ్లు చేతులు కడుక్కోవటానికి నీళ్లు, స్నానం లేక అభిషేకం గంధచందనాలు, పుష్పం, ధూపం, కర్పూర హారతి, దీపహారతి సమర్పించడం, నైవేద్యం, వీడ్కోలు మొదలైనవి పూజలో ముఖ్యాంగాలు. దేవాలయాలలో అభిషేకం అలంకరణ ఇత్యాదులు వైభవోపేతంగా విశేషరీతిలో చేయబడతాయి. శ్రద్ధతో చేయబడే పూజ వల్ల మనస్సుకు సుఖశాంతులు లభిస్తాయి. విధ్యుక్తంగా, శాస్తోక్తంగా ప్రతిష్ఠించబడిన ఉపయోగించబడే ప్రతీకలలో భగవంతుని ప్రతిరూపం విశేషంగా ఆవిర్భవించి నెలకొంటుందని ఆగమశాస్త్రాలు వచిస్తున్నాయి.

సంకలనం/రచన: స్వామి హర్షానంద

4, జులై 2020, శనివారం

పూజామంత్రాలను సంస్కృతంలోనే ఎందుకు చెప్పాలి? - Samskrutamlo Pooja mantramulu

పూజామంత్రాలను సంస్కృతంలోనే ఎందుకు చెప్పాలి? - Samskrutamlo Pooja mantramulu
పూజామంత్రాలను సంస్కృతంలో వాడటానికి బదులుగా అందరికీ అర్థమయ్యే మాతృభాషలోనే ఎందుకు చెప్పకూడదు?

పూజ, హోమం మొదలైనవి పవిత్రమైన ధార్మిక క్రియలు. వీటియొక్క క్రమాన్ని వాటికి సంబంధించిన మంత్రాలను మనకి తెల్సినవారు మన సంప్రదాయకర్తలైన ఋషులు. వారికి ఈ మంత్రాలు ధ్యానంలో దైవంచే అనుగ్రహించబడ్డాయి. ఇవి వారు రచించినవి కావు. మనస్సులో ఊహించి, కల్పించినవి కావు. అందుకే వాటిని మనం మంత్రాలు అంటాం.

కనుక వారు మనకు ఏ రూపంలో, ఏ భాషలో వాటిని ఇచ్చారో అదే రూపంలో, అదే భాషలో ప్రయోగించటం సబబుగా ఉంటుంది. దానివలన ఒక పవిత్రమైన వాతావరణం ఏర్పడుతుంది. అంతేకాక మంత్రశాస్త్ర ప్రకారం ఈ మంత్రాలను సరిగా ఉచ్చరించినప్పుడు అవి వినేవారి మనస్సులలో ఉత్కృష్టమైన ఉల్లాసభరిత స్పందనలను కలుగజేస్తాయి.

కొన్ని శతాబ్దాలుగా వేలమంది పవిత్ర మనస్సుతో, విశ్వాసంతో అవే అక్షరాల కూర్పుతో భగవంతుణ్ణి ఉపాసిస్తూ వస్తున్నారు కనుక దైవశక్తి వాటిలో గర్భితంగా దాగి ఉంటుంది. మంత్రాలు శబ్దరూప పరబ్రహ్మగా మారతాయి.

ఇంతకుముందు తెలిపినట్లు అవి పరదైవమే ప్రసాదించినవి కాబట్టి మంత్రమంటే శబ్దరూప పరబ్రహ్మమే. కనుక వీటిని ఇతర భాషలలో చెప్తే అవి కేవలం అనువాదాలౌతాయి కాని 'మంత్రాలు' కావు.

ఐతే ఒక పని చేయవచ్చు పూజలో చేసే కర్మలను గురించిన విషయాల వివరాలు మంత్రాలు, వాటియొక్క అర్థం, వాటిని ప్రయోగించే పద్ధతులను గురించి ప్రాంతీయ భాషలలో వివరించి చెప్పి తర్వాత సంస్కృతంలోనే వాటిని ఉచ్చరించి, విధ్యుక్తరీతిలో పూజాదులను చేస్తే అది అందరికీ ఇతోధికంగా తోడ్పడుతుంది. ఇతర మతాలలో కూడా ధర్మకార్యాలన్నీ వాటి మూలశాస్త్రాలు ఏ భాషలలో ఉన్నాయో ఆ భాషలలోనే నెరవేర్చబడతాయన్న సంగతి మనం మరచిపోకూడదు.

రచన: స్వామి హర్షానంద

25, జూన్ 2020, గురువారం

ధర్మము - Dharmam


ధర్మము - Dharmam
ది చాల క్లిష్టమైన ప్రశ్న! వెంటనే వివరించి చెప్పటానికి కుదరని గంభీరమైన ప్రశ్న!  ఎందుకంటే ధర్మం అనే రెండక్షరాల శబ్దానికి చాల లోతువుంది. చాలా సంక్లిష్టత ఉంది. చాలా నిగూఢత ఉంది. చాలా విశాలత ఉంది.

‘ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతమ్’
ధర్మాలన్నియు సాక్షాత్ పరమాత్ముని నుండి లభించాయి.
ధరించునదిగాబట్టి ధర్మము అని ధర్మ శబ్దానికి ఉత్పత్తి అర్ధము. (ధృ – ధారణే). ధర్మము నిత్యసత్యమై వుండేదైనా దేశకాల ప్రాంతాదుల ననుసరించి ధర్మం మారుతుంటుంది.

ధర్మము – సామాన్యధర్మం, విశేషధర్మం అని రెండు రకాలు.

శ్లో|| ధృతిః క్షమా దమో స్తేయం, శౌచమింద్రియ నిగ్రహః|
       హ్రీర్విద్యాసత్య మక్రోధః ఏతత్ ధర్మస్త్య లక్షణమ్ ||

“ధృతి – క్షమ – దమం – అస్తేయం – శౌచం – ఇంద్రియ నిగ్రహం – హ్రీః (సిగ్గు) – విద్య – సత్యం – అక్రోధం”, ఈ పది లక్షణాలు కలిగియున్న ధర్మమని శాస్త్రం చెబుతోంది. 
అంటే;
 • 1. మానవుడు ఏదైనా పని ప్రారంభిస్తాడు. తనకు సంబంధించినది కానివ్వండి, కుటుంబానికి సంబంధించినది కానివ్వండి, సమాజానికి సంబంధించినది కానివ్వండి! ప్రారంభించేటపుడు ఏ సమస్యలు ఉండవు. కాని ప్రారంభించిన కొన్ని రోజులకే నూటొక్క సమస్యలు ప్రారంభమవుతాయి. కువిర్శలు ప్రారంభమౌతాయి. ఎన్నెన్నో అడ్డంకులు కలిగి నిరాశ కల్గుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆత్మబలంతో అకుంటిత దీక్షతో ‘ధృతి’ చెడకుండా ముందుకి సాగిపోవాలి. ‘ఇది ధర్మం’.
 • 2. మనిషి ఏ విషయంలోనైనా, ఏ పనిలోనైనా ఓర్పు కలిగి వుండాలి. క్షమాగుణంతో ఉండాలి. ప్రతిదానినీ ప్రతివారినీ, ప్రతి విషయాన్నీ, క్షమాశక్తితో ఎదుర్కోనాలి. కోపగించుకోకూడదు. ఓర్పుగుణం వున్నవారిని ఏ శక్తులూ ఏమీ చేయలేవు. ‘ఇది ధర్మం’.
 • 3. మనం ఒక పని చేసేటపుడు మన మనస్సు సంపూర్ణంగా ఆ విషయంలోనే లగ్నం కావాలి. ఒక పనిచేస్తూ మరొక దానిని గురించి ఆలోచించకూడదు. ఏ విషయంలోనైనా ముఖ్యం. చదువుతున్నా, వింటున్నా, పని చేస్తున్నా, మాట్లాడుతున్నా, మనస్సును పరిపరిమార్గాలకు పోనివ్వకుండా వుండాలి ‘ఇది ధర్మం’.
 • 4. తనకు తెలియని విషయాలను తాను తెలిసికొనక, పెద్దలు, పూర్వులు, చెప్పినదానిని అంగీకరించక, స్వతంత్ర నిర్ణయం తీసికోనలేక, నిస్తేజంగా నిర్వికారంగా, నిరాశగా, నిర్లిప్తతగా, నియమరాహితుడుగా, ఉండకూడదు. ‘ఇది ధర్మం’.
 • 5. మనిషి ఎల్లపుడూ మనస్సునూ, శరీరాన్నీ, మాటనూ ఆలోచననూ, సంసారన్నీ, ఇంటినీ, పరిసరాన్నీ, ధరించే వస్త్రాలనూ పరిశుభ్రంగా శుచిగా వుంచుకోవాలి. మనసు పరిశుభ్రంగా వుండాలి. మాత్రమే పరిశుభ్రంగా ఉండాలి. మనిషి పరిశుభ్రంగా ఉండాలి. ‘ఇది ధర్మం’.
 • 6. చదువువున్నా, సంపదలున్నా, కీర్తివున్నా, బలంవున్నా ఇంద్రియ నిగ్రహం లేనివానికి ఏదో ఒకరోజు పతనం తప్పదు. కాబట్టి మనస్సును దాని ఇష్టానికి దాని వదలివేయకుండా మన చెప్పుచేతల్లో ఉంచుకోవాలి. ‘మనస్సును గెలిచినవాడు దేవేంద్రుడైనా గెలుస్తాడు’ మనస్సును తమ చెప్పుచేతల్లో ఎవరుంచుకొంటారో వారిని భూతప్రేతాలుగాని, దెయ్యాలు గాని, యక్షకిన్నర కిమ్పురుశులుగాని, గ్రహాలు గాని, రోగాలు గాని, కష్టసుఖాలుగానీ, మరణంగానీ, వశంలో వుంటాయి. కాబట్టి మనస్సును, మాటను, దృష్టిని, శరీరాన్నీ, చేతలనూ అదుపుచేయాలి ‘ఇది ధర్మం’.
 • 7. ప్రతి విషయానికీ సంకోచపడటం, సిగ్గుపడటం, అనుమానపడటం, తనను తాను తక్కువగా భావించటం కూడదు ‘ఇది ధర్మం’.
 • 8. మనిషి సత్యవ్రతం కలిగిఉండాలి. అకారణంగా, అనవసరంగా, ఒకరి మెప్పుకోసం, ఒకరిని మెప్పించటంకోసం, తన పనిని సాధించుకోవటం కోసం, తాను ఏ విధంగానైనా ప్రయోజనం పొందటంకోసం. తనవారిని తృప్తిపెట్టట్టంకోసం అబద్దాలు చెప్పకూడదు. అబద్ధం కలిగిస్తుంది. అబద్ధం అల్పసుఖాన్ని మాత్రమే కల్గిస్తుంది. అబద్ధం మరోకనాటికి అవమానం పాలు చేస్తుంది. అబద్ధం మనిషి విలువను మట్టిచేస్తుంది. మన శక్తినీ, మనకీర్తినీ, మన గోప్పదనాన్నీ పాతాళానికి త్రోక్కివేస్తుంది. కాబట్టి సాధ్యమైనంతవరకూ సత్యధర్మాన్ని వదలకూడదు. ‘ఇది ధర్మం’.
 • 9. మానవునికి ఆహరం ఎంత ముఖ్యమో, వివేకం కూడ అంతే ముఖ్యం. వివేకవంతుడు కావాలంటే విద్యావంతుడు కావాలి. శాస్త్రాలు, పురాణాలు ఇతిహాసాలు విన్నంత మాత్రాననే వివేకం సిద్ధించదు. విన్న విషయాలను స్వానుభవానికి మళ్ళించుకోవాలంటే మనిషికి విద్య కావాలి. ‘విద్యావిహీనః పశుః’ అని ఆర్యవాణి. మనిషిగా పుట్టి మట్టిబొమ్మగా జీవిత గడపకూడదు. ఎంతటి పెడతానం పెనవేసుకొనివున్నా, స్థితిగతులు ఎంతటి బాధాకరమై వున్నా,భిక్షమెత్తి అయినా చదువుకోవాలి అని ఋషివాక్యం. విద్య ప్రతి వ్యక్తికీ నిర్బంధంగా ఉండాలి. ‘ఇది ధర్మం’.
 • 10. పగ, హింస, కోపం, ప్రతీకార మనస్తత్వం ఇవన్నీ మనిషిని  పతనావస్థకు నేడతాయి. పగ, ప్రతీకారాలు మనిషిని అశాంతికి గురిచేసి అనారోగ్యాన్ని కల్గిస్తాయి. తన అభివృద్ధికి తానే ఆటంకంగా నిలవాల్సివస్తుంది. తనను కన్నవారికీ, తాను జన్మనిచ్చిన వారికీ, తనను నమ్మి బ్రతికేవారికీ అన్యాయం కల్గుతుంది.
అకారణంగా సాటి ప్రాణుల్ని హింసించట, ఆహారం తింటూవున్న ప్రాణుల్ని, నీరు త్రాగుతున్న ప్రాణుల్ని, ఆడమగ కలుస్తున్న జంటల్ని హింసించటం, భయపెట్టటం, రాళ్ళతో కర్రతో హింసించతం, తన దారిన తాను వెళుతున్న ప్రాణుల్ని భయపెట్టి పరుగెత్తించటం మంచిది కాదు.

కోపాన్ని జయించితే మనుష్యుల్ని జయించవచ్చు. సమస్యల్ని అధిగమించవచ్చు. కోపం ఎప్పుడూ మనకే నష్టాన్ని కల్గించి ఎదుటివారికి లాభాన్ని కల్గిస్తుంది. కోపం ఆత్మీయుల్ని దూరం చేస్తుంది. కోపం భవిష్యత్తును ఛిద్రం చేస్తుంది. కోపం జీవితాన్ని పతనం చేస్తుంది. కోపాన్ని అడుపులో ఎల్లపుడూ వుంచుకోవాలి. ‘ఇది ధర్మం’. వీటినే ధర్మంగా గుర్తించారు పెద్దలు.

విశేష ధర్మాలు:

సామాన్య ధర్మాల వస్తే చెప్పవలసిన ధర్మాలు ఎన్నో వున్నాయి. సామాన్య ధర్మాలు అంటే శాస్త్రాలు చెప్పనివి చెప్పనక్కరలేని చెప్పినవి కూడా సామాన్య ధర్మాల క్రిందకే వస్తాయి.
 • ● విజ్ఞానాన్ని దాచుకోకుండా బోధించటం గురుధర్మం!
 • ● భయభక్తులతో విద్యను నేర్చుకోవటం శిష్యధర్మం!
 • ● న్యాయమార్గంగా సంపాదించి సంసారాన్ని పోషించటం యజమాని ధర్మం!
 • ● భర్త సంపాదనను సక్రమంగా పెట్టి గృహాన్నీ నడపటం ధర్మం!
 • ● సైనికుడుగా వుండి దేశాన్ని ప్రజలను కాపాడటం సైనిక ధర్మం!
 • ● వృద్ధులైన తల్లిదండ్రుల్ని ఆదరించి పోషించటం పుత్రధర్మం!
 • ● తాను జన్మనిచ్చిన బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయటం తండ్రి ధర్మం!
 • ● తన ఇంటికీ, తనను కున్నవారికీ పేరు ప్రతిష్ఠలు తేవటం బిడ్డలందరి ధర్మం!
 • ● తన వృత్తి ఎటువంటిదైనా వృత్తిని గౌరవించటం ప్రతివాని ధర్మం!
 • ● తాను సంపాదించినదాన్ని తనవారితో పంచుకొని తినటం సంసార ధర్మం!
 • ● అసహాయులను కాపాడటం మానవతా ధర్మం!
 • ● చెప్పిన మాటను నిలుపుకోవటం సత్య ధర్మం!
 • ● ధర్మసాక్షిగా పెండ్లాడిన భార్యను వదిలివేయకుండా వుండటం వివాహ ధర్మం!
 • ● తన భర్త అందహీనుడైనా, స్థితిపరుడుకాకున్నా, నమ్మివుండటం భార్య ధర్మం!
 • ● నమ్మిన మిత్రునికి అపకారం చేయకుండటం మిత్ర ధర్మం!
 • ● సోమరితనం లేకుండటం పురుష ధర్మం!
– ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ధర్మాలుంటాయి.

‘అమ్మా! తల్లీ! ధర్మం చేయి తల్లీ’ అని మనం యింటిముందు నిలబడి భిక్షకోసం అరుస్తుండటం ప్రతిరోజూ చూస్తుంటాంగదా! ఇందేంటి ‘ధర్మాన్ని చేయటం’ ఏమిటి అని మీకేపుడూ అన్పించలేదా!

‘ధర్మం చేయండి’ అని యాచించటంలో ఒక ధార్మిక విషయం దాగి ఉంది. మనిషి సంఘజీవి. సంఘశ్రేయస్సే మనిషికి శ్రేయస్సు! సంఘ సుఖమే మనిషికి సుఖం! సంఘం ఆరోగ్యంగా వుంటేనే మన ఆరోగ్యంగా ఉంటాం!

ధర్మాన్ని చేయమని చెప్పి యాచించటం ఎందుకంటే మనిషి సంఘజీవి కాబట్టి మనకు ఉన్నదాన్ని ఎంతో కోంత లేనివారికి దానం చేయటం సామాజిక ధర్మంగా పూర్వ కాలం నునీ మన ఆచారంగా వస్తోంది. బహుజన సుఖం, బహుజనహితం భారతీయ ధర్మంగా అనాదికాలంనుండి ఋషులు మనకు బోధించారు. నీదగ్గర ఉన్నదాన్ని నీవోక్కడవే తినటం ధర్మంకాదు. నీవు నివసిస్తున్న సమాజంతో సమానంగా పంచుకోవాలి. ఆహారం అందరికీ అందాలి. ఎవరు పస్తులతో ఉండకూడదు. సమాజంలో ఆకలి బాధలు ఆకలిచావులు ఉంటే అరాచకత పుడుతుంది. దొంగతనాలు, దోపిడీలు, హత్యలు తయారై మానవకులాన్ని కలుషితం చేస్తాయి. అందుకే ఆర్యులు ‘అతిథి దేవోభవ’ అని చెప్పారు.

అందువల్ల ‘దానం చేయటం కూడా ఒక ధర్మం’ అని గుర్తించాలి. ఆకలిబాధ ఎంతటి దుర్మార్గాన్ని అయినా చేయిస్తుంది కదా! నీకు శక్తివుంటే, ఎంతోకొంత సాయం చేయటం మానవధర్మం. మనిషికి ఏం లేకపోయినా పర్వాలేదు. ఆకలిబాధ ఉండకూడదు కదా! ఆహారం నిద్ర అందరికీ అవష్యకమే. వేదం కూడా ఇదే చెబుతోంది.

“స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయ్యేవ మార్గేణ
మహిం మహీశాః | గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం
లోకాః సమస్తాః సుఖినోభవంతు | అపుత్రాః పుత్రిణః పంతు |
పుత్రిణ స్సంతుపౌత్రిణః | లోకావుయం క్షోభారహితః |
అధనాః సాధనాః సంతు | జీవస్తు శరీదశ్శతమ్||”

“పాలకులు ప్రజలను న్యాయమార్గమున ధర్మబద్ధంగా పరిపాలించుగాక! గోసంతతికి పండితులకు శుభం కలుగుగాక! సంతతి లేనివారికి సంతతి కల్గుగాక! సంతతి వున్నవారికి మానుమ సంతతి కల్గుగాక! ప్రపంచం శాంతితో నిండియుండుగాక! దరిద్రులు ధనమూ పొందుదురుగాక! అందరూ ఏ ఆపదలు కల్గియుండక నూరు సంవత్సరాలు జీవించుదురు గాక!” అని చెబుతుంది వేదం.

పూర్వకాలం ‘దానధర్మం’ ఒక కర్తవ్యంగా ఉండేది. బ్రాహ్మణ వర్ణం వారికి ఇల్లు తప్ప, స్థిరాస్థులు ఉండేవికాదు. విద్యార్జన చేయటం సమాజానికి హితాన్ని బోధించటం, ప్రజలకు విద్య బోధించటం వారి పని. బ్రాహ్మణ బ్రహ్మచారులు ఇంటింటికీ భిక్షమెత్తుకొని వచ్చి గురువుకి సమర్పించేవారు. ఆ విధంగా యాచకం చేస్తూ చదువుకోవాలి. విద్య నేర్పుతున్నందుకు గురువు ఏ విధమైన ప్రతిఫలం ఆశించటం తప్పుగా ఉండేది. అప్పటి ఆ కాలంలో మనకు అల్లోపతి వైద్యంలేదు. ఆయుర్వేద వైద్యం అందరికీ ఉచితంగా అందుతుండేది. బ్రాహ్మణులే ఈ పనిని చేస్తూ ఉండాలి. విద్య, వైద్యం, జ్ఞానం ఎవరూ అమ్మకూడదు. ఎవరూ కొనకూడదు. పొరపాటు జరిగితే శిక్షకు గురికావలసిందే!

ఈనాటికీ బౌద్ధమత ప్రచారకులు “దానధర్మం”తో జీవిస్తూ ధర్మప్రచారం చేస్తున్నారు. బౌద్ధసూక్తి మీకు తెల్సుగదా!
 • “ధర్మం శరణం గచ్ఛామి !
 • సంఘం శరణం గచ్ఛామి!
 • బుద్ధం శరణం గచ్ఛామి!”
ధర్మాన్ని శరణు పొందుతున్నాను! సంఘాన్ని శరణు పొందుతున్నాను.బుద్ధుని (జ్ఞానాన్ని) శరణు పొందుతున్నాను. అంటూ ‘ధర్మయానం’ చేస్తుంటారు.

‘ధర్మోరక్షతి రక్షితః’
“ధర్మాన్ని నీవు రక్షించితే ధర్మం నిన్ను సర్వదా రక్షిస్తూ వుంటుంది.” నీవు ఎపుడు ధర్మాన్ని నిర్లక్షం చేస్తావో ధర్మం నిన్నేపుడూ రక్షించదు.”

ధర్మాన్ని నమ్మాలి – ధర్మాన్ని ఆచరించాలి.
ధర్మాన్ని ఆశ్రయించాలి – ధర్మమార్గాననే నడవాలి. ధర్మాన్ని గౌరవించాలి. శ్రీరాముడు ప్రభుధర్మం కోసమే సీతా పరిత్యాగం చేయవలసి వచ్చింది. ధర్మ మార్గాన నడవటం వల్లనే యుధిష్ఠిరుని ధర్మరాజు అని పిలుస్తున్నాం.

“యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతా!
అభ్యుత్దాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్||”
– అని చెప్పాడు యోగీశ్వరుడైన శ్రీకృష్ణపరమాత్ముడు. పాండవులు ధర్మపరాయణులు కాబట్టే కృష్ణుడు పాండవపక్షాన నిలిచి వారికి సహకరించాడు. అధర్మంతోనే త్రొక్కివేశాడు.

అధర్మపరులను అధర్మంతో ఎదుర్కొనవచ్చు. తప్పుగాదు. ధర్మపరులను అధర్మంతో దెబ్బతీయకూడదు. ఇది పాపకార్యం. ఋతుధర్మంవల్లనే వర్షాలు వస్తున్నాయి. చెట్లు పండ్లు ఫలాలను ఇస్తున్నాయి. కాలధర్మం వల్లనే మనిషి మరణిస్తున్నాడు. సంయోగ ధర్మంవల్లనే మళ్ళీ జన్మిస్తున్నాడు. ‘ధర్మోరక్షతి రక్షితః’

సంకలనం: నాగవరపు రవీంద్ర

24, జూన్ 2020, బుధవారం

హిందువుల దేవాలయాలలోనికి అన్య మతస్థులకు ప్రవేశాధికారం ఉందా - Devalayam, Anya Mathastulu - Entry of other religious persons into Hindu


హిందువుల దేవాలయాలలోనికి ఇతర మతస్థులకు ప్రవేశాధికారం ఉందా

ఇప్పుడిప్పుడే అన్యమతస్థులను కూడా మన దేవాలయాలలోనికి రానిస్తున్నారు. కొన్ని చోట్ల దేవాలయాలలోని కొన్ని ప్రదేశాలకు మాత్రం ఇతర మతస్థులను రానివ్వరు. 

దేవాలయాలలోనికి అసలు అడుగు పెట్టనీయకపోయినా తప్పేమీ లేదు. కారణమేమంటే, వారు తమతమ దేవాలయాలను సందర్శించేటప్పుడు పవిత్రస్థలాలుగా భావించి ఎటువంటి శ్రద్ధాభక్తులతో వెళతారో అలాగే మన దేవాలయంలోకి వస్తే మనకేమి అభ్యంతరం ఉండదు. కానీ శ్రద్ధ లేకుండా కేవలం యాత్రికులుగా, విమర్శనాత్మక బుద్ధితో, దోషాలు ఎంచటానికి వస్తే మాత్రం దానివల్ల వారికి కలిగే లాభంఉండదు. పైగా అది మన ఆస్తిక భక్తుల మనోభావాలను కంచపరిచినట్టవుతుంది.

ముందు మనం హిందూమతంలోని అన్ని వర్గాలవారికి ఎలాంటి వివక్షత లేకుండా దేవాలయాలలోనికి ప్రవేశం కల్పించాలి. ఒక పద్దతి ప్రకారం అందరికీ దైవాన్ని దర్శించుకునేందుకు వీలు కల్పించాలి. ఇతరులకు ప్రవేశం కల్పించే విషయం తరువాత ఆలోచించవచ్చు. ప్రస్తుతానికది పెద్దసమస్య కాదు.

సంకలనం: దయాత్మానంద స్వామి

18, జూన్ 2020, గురువారం

కనుమరుగవుతున్న హిందూ కుటుంబ విశిష్టత - The disappearing Hindu family Values


హిందూ కుటుంబ విశిష్టత

సృష్టి ప్రారంభంలో ఒకే పరమాత్మ వున్నాడని హిందువుల విశ్వాసం. పరమాత్మునిలో ఒక ఆలోచన వచ్చింది - "ఏకోహం బహుస్యామ" - “ఒకడిని అనేకులు కావాలి". ఈ ఆలోచన అమలు చేయడం ద్వారా పరమాత్మ కుటుంబ వ్యవస్థ రూపొందించాడని అంటారు.

కుటుంబం నుంచి సమాజ రచన, సమాజంలో పరస్పర అవగాహన, ఉన్నత సంస్కారాలు గల వ్యక్తుల నిర్మాణం, ఇరుగు పొరుగు వ్యక్తులు, పశువులు, పక్షులు, చెట్లు మొక్కలు, రాళ్ళు, మట్టి, ఇలా సృష్టి లోని అన్నింటితో ఆత్మీయతా వ్యవహారం, అహం' (నేను) అనే స్వార్థ భావనను విడనాడి 'వయం' (మనం) అనే సమష్ఠి భావనను అలవరచుకోవడం ఈ విషయాలన్నింటిని ఆచరణలో పెట్టడంలో హిందూ కుటుంబ జీవనం ఎంతో దోహదం చేస్తుంది.

ఇటువంటి ఉత్తమ లక్షణాలు గల కుటుంబంలో పెరిగిన వ్యక్తికి పరస్పర స్నేహ భావం, సహకారం, విశ్వాసం తదితర మంచి గుణాలు అలవడతాయి. దానితో పాటు సమస్యలు ఎదురైనప్పుడు ఇతరులకు సహాయం చేయడానికి తన వ్యక్తిగత అవసరాలను ప్రక్కన బెట్టి స్పందించే గుణం కూడా అలవాటపుతుంది. కుటుంబంలోని సభ్యులందరి సంక్షేమమే తన సంక్షేమంగా వ్యక్తి భావిస్తాడు, ఈ ఆలోచననుంచి ఇంకా ఉన్నతంగా ఎదిగి 'నేనే అంతా....' అన్న స్థాయినుంచి అందరి అభిప్రాయాలు స్వీకరించే మనస్తత్వం అలవాటవుతుంది.  హిందూ కుటుంబంలో మరొక విశిష్టత ఇది.

నేడు ప్రపంచం స్వార్ధంతో నిండిపోయి పుంది. దీనివల్ల అనుమానం, ద్వేషం, హింస పెరిగిపోతున్నది. సంఘర్షణ చేయడమే జీవన విధానంగా మారిపోయింది. సంపాదించడమే లక్ష్యం అయిపోయింది. సంపాదించడమే మన సంస్కృతి అని భావిస్తున్నారు.  ఇది మంచి ఆలోచనేనా? కాదని సమాధానం వస్తుంది. అయితే 'మంచి ఏమిటి?' అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఈ ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు.

ప్రస్తుతం హిందూ కుటుంబం ఈ సైద్ధాంతిక డోలాయమానంలో పడిపోయింది. హిందూ కుటుంబ విశిష్టత సంఖ్యలో లేదు. వ్యక్తుల హృదయాలలో వుంది. సహృదయత, ఆత్మీయతానుబంధంతో ముడివడిన కుటుంబం... అంటే పిల్లలకు మార్గదర్శనం, ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలు నూరిపోయడం, యువకులలో వ్యక్తిగత సుఖం కన్నా కుటుంబ, సమాజ శ్రేయస్సులో సుఖమున్నదని తెలియజెప్పడం, సమాజ హితం కోసం పరిశ్రమ చేసే మనస్తత్వం, వృద్ధుల పట్ల గౌరవం, చిన్న పిల్లల పట్ల స్నేహ భావం... తదితర గుణాలు పెంపొదించడం... ఇదే నిజానికి హిందూ కుటుంబ విశిష్టత.

_హిందూ నగారా

14, జూన్ 2020, ఆదివారం

గౌతమ మహర్షి - న్యాయ దర్శనం - Gautama Maharshi, Nayadarshanam


న్యాయ దర్శనం గౌతమ మహర్షి చే రూపొందించబడిన న్యాయ విద్యా విభాగం.న్యాయ దర్శనం ఆస్తిక విభాగానికి చెందినది.గౌతముడు 5 వ శతాబ్ది కాలానికి చెందిన మహర్షి.అతనిని అక్షపాద అని కుడా అంటారు.

షడ్-ధర్శానాలన్ని విజ్ఞానానికి సమాన ప్రాదాన్యతను ఇచ్చాయి.అలాగే న్యాయశాస్త్రం లో విజ్ఞానానికి ఇచ్చిన ప్రాదాన్యతను ప్రమాణాలు అంటారు.ఈ న్యాయ విధానాన్ని న్యాయశాస్త్రం గాను,తర్కశాస్త్రం గాను వ్యవహరిస్తారు.

న్యాయ శాస్త్రం లో ముఖ్యంగా నాలుగు ప్రమాణాలు ఉంటాయి.

అవి :
 • 1.ప్రత్యక్షము.
 • 2.అనుమానము.
 • 3.ఉపమానము.
 • 4.శబ్ద గుణము.
తర్కమునకు చర్చకు ఇవి మూలములు.
న్యాయ దర్శనం భగవద్ నామాన్ని అంగీకరిస్తుంది.ఆ భగవంతుడిని ఈశ్వరుడిగా సంభోదిస్తూ సమస్త సృష్టికి కారణం గా వ్యవహరిస్తుంది.

గౌథముని సృష్టి వివరణలో ఒక ముఖ్యమైన వాఖ్యం.. "ఈ సమస్త విశ్వం శక్తి స్వరూపం లోని ఈశ్వరునిచే నిర్మించబడి,ఆయననుంచే అణువులు, కాలము, ఆలోచన,అంతరిక్షము, జీవ రాశి సృష్టించబడ్డాయి".

న్యాయ దర్శనమును తర్క శాస్త్రము అని కూడా అంటారు. కాని ఇది పూర్తిగా తర్క శాస్త్రం కాదు. ఇందులో మొత్తము 524 సూత్రాలుంటాయి. గౌతముని న్యాయ సూత్రాలు ఇలా ప్రారంభం అవుతాయి.
ప్రమాణ ప్రమేయ సంశయ ప్రయోజన
దృష్టాంత సిద్ధాంతావయవ తర్క నిర్ణయ
వాద జల్ప వితండాహేత్వాభాసచ్ఛల
జాతి నిగ్రహ స్థానానాం తత్వజ్ఞానా
న్నిఃశ్రేయ సాధిగమః
1. ప్రమాణములు
న్యాయ దర్శనం పదహారు పదార్థాలను (షోడశపదార్థములు) తెలుసుకుంటే నిశ్శ్రేయసం (మోక్షం) ప్రాప్తిస్తుందని వాగ్దానం చేస్తుంది.

అవి:
ప్రమాణం, ప్రమేయం, సంశయం, ప్రయోజనం, దృష్టాంతం, సిద్ధాంతం, అవయవం, తర్కం, నిర్ణయం, వాదం, జల్పం, వితండం, హేత్వాభాసం, ఛలం, జాతి మరియు నిగ్రహ స్థానం.
ఈ పైన సూచించిన (షోడశపదార్థములు) ప్రమాణములు జ్ఞాన సాధనములు.

2.ప్రమేయములు
ఆత్మ, శరీరము, ఇంద్రియము, అర్థము, బుద్ధి, (జ్ఞానము), మనస్సు, ప్రవృత్తి, దోషము, ప్రేత్య భావము, ఫలము, దుఃఖము మరియు అపవర్గము. వీటన్నింటి వివరణే న్యాయ దర్శనము. వైశేషిక దర్శనం తరువాతి అంశం.

ఓం నమః శివాయ.

సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి

18, మే 2020, సోమవారం

మనుస్మృతి లో శూద్రులను అణగద్రొక్కారనేది నిజామా, విశ్లేషణ ! - Manusmruti, Sudrulanu Anagdokkevaara

మనుస్మృతి లో శూద్రులను అణగద్రొక్కారనేది నిజామా, విశ్లేషణ ! - Manusmruti, Sudrulanu Anagdokkevaara

 శూద్రులను అణగద్రొక్కారా?: 

శూద్రులను గురించి మనువు అభిప్రాయాలని చూద్దాము. “శోచంతి ఖిద్యస్త ఇతి శూద్రా" కష్టపడేవారని అమరము. బ్రాహ్మణులు విరాట్పురుషుని ముఖం నుంచి. శూద్రులు పాదాలనుంచి పుట్టారని మనుస్మృతి. 
 • ➣ శరీరంలో ముఖం ఎంత ముఖ్యమో పాదాలు అంతే ముఖ్యము. 
 • ➣ ఛందస్సు వేదపురుషునికి పాదాల వంటిది అన్నదాని భావం కూడా అంతే. 
 • ➣ మనిషి సర్వాం గములతో కూడిన వాడైనప్పటికీ, కాళ్ళు లేకపోతే ఎంత కష్టమో, అట్లాగే కష్టపడి
 • ➣ పంటలు పండించి, సేవలుచేసే వాళ్లు లేక పోతే కూడా అంతే కష్టము. అదే మనువు భావంగా కన్పిస్తుంది.
 • ➣ అట్లాకాకపోతే అంటరానివాడైన శూద్రుడు కూడా ఆ విరాట్పురుషుని నుంచే పుట్టినట్లుగా ఎందుకు వర్ణిస్తాడు? కనుక పై కులాల వారందరికీ శూద్రుడే ఆధారభూతుడని అర్థం చేసుకోవాలి.
అదీకాక - పౌండ్రకులు, ఓడ్రులు, ద్రావిడులు, కారిభోజులు, యవనులు, శకులు, పారదులు, పప్లవులు, చీనులు, కిరాతులు, దరదులు, ఖశులు మొదలైనవారు సంస్కార రాహిత్యం వల్లనే శూద్రులయినారని చెప్పబడింది. కనుక సంస్కారదూరులైన వారంతా ఆ రోజులలో శూద్రులుగా పరిగణింపబడే వారని తెలుస్తుంది
 • ➣ అంతేకాదు - వృద్ధుడైన శూద్రుడు బ్రాహ్మణునికి గౌరవింపదగినవాడేనట.
 • ➣ ఆకలితో ఉన్న బ్రాహ్మణుడు శూద్రునికంటె తక్కువ వారి ఇంటకూడా భోజనం తినవచ్చును. అందుకు బ్రాహ్మణాలులైన విశ్వామిత్రుడు, భరద్వాజుడు వంటివారే నిదర్శనము.
 • ➣ కనుక వీటన్నింటిని బట్టీ ఆలోచిస్తే ఆనాటి శూద్రులు, మనమనుకొనే శూద్రులు కారనిపిస్తోంది. 
అయితే - శూద్రుడు తాకితే అతని నాలుక కోసి వెయ్యాలని, శూద్రుడు ఉన్నత జాతి స్త్రీతో రమిస్తే లింగచ్ఛేదం చెయ్యాలని మనుస్మృతిలో కన్పిస్తోంది. అది తీవ్రమైన నాటి శిక్షావిధానానికి నిదర్శనం ఎందుకంటే దొంగతనం చేస్తే శిరచ్చేదం చెయ్యమని మనువే చెప్పాడు. 

ఏమైనప్పటికీ అంత క్రూరమైన శిక్షలు అలనాటి పరిస్టుల బట్టి ఉండేవని తెలుస్తోంది. ఏమైనప్పటికి ఇలాంటివి సమర్థనీయములు కావు.

రచన: నల్లందిగళ్ లక్ష్మీనరసింహ ఆచార్యులు

దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు - Danadharmalu, Danalu, Danamదానాలు చేయడం వలన కలిగే ఫలితాలు - Danadharmalu, Danalu, Danam

దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు

 •  1. బియ్యాన్ని దానం చేస్తే – పాపాలు తొలుగుతాయి.
 •  2. వె౦డిని దానం చేస్తే – మనశ్మా౦తి కలుగుతుంది.
 •  3. బ౦గారం దానం చేస్తే – దోషలు తొలుగుతాయి.
 •  4. ప౦డ్లను దానం చేస్తే – బుద్ధి. సిద్ధి కలుగుతాయి.
 •  5. పెరుగు దానం చేస్తే – ఇ౦ద్రియ నిగ్రహ౦కలుగుతుంది.
 •  6. నెయ్యి దానం చేస్తే – రోగాలు పోతాయి. ఆరోగ్య౦గా ఉ౦టారు.
 •  7. పాలు దానం చేస్తే – నిద్ర లేమిఉండదు.
 •  8. తేనె దానం చేస్తే – స౦తానంకలుగుతుంది.
 •  9. ఊసిరి కాయలు దానం చేస్తే – మతిమరుపు పోయి, జ్ఞాపకశక్తీ పెరుగుతు౦ది.
 • 10. టె౦కాయ దానం చేస్తే – అనుకున్న కార్య౦సిద్ధిస్తు౦ది.
 • 11. దీపాలు దానం చేస్తే – క౦టి చూపు మెరుగు పడుతుంది.
 • 12. గోదానం చేస్తే – ఋణ విముక్తులౌతారు ఋషుల ఆశీస్సులు లభిస్తాయి.
 • 13. భూమిని దానం చేస్తే – బ్రహ్మలోకదర్శనం లభిస్తుంది
 • 14. వస్త్రదానం చేస్తే – ఆయుష్షు పెరుగుతు౦ది.
 • 15. అన్న దానం చేస్తే – పెదరికంపోయి, ధనవృద్ధి కలుగుతుంది.
పైవన్నీమన వేదాల్లో చెప్పినవే…
వీటి‌లో మీకు సాధ్యపడేది ఒక్కటైన చేయ్యమని అర్థం. చేసే సహాయం చిన్నదైనా సరే మనస్తూర్తిగా, శ్రద్ధగా చేస్తే ఫలితం అధికంగా కలదు.

సంకలనం: భానుమతి అక్కిశెట్టి

4, మే 2020, సోమవారం

ఓ సెక్కులర్ హిందూ, ధర్మ వినాశకా....- Secular Hindu

హిందూ ధర్మాన్ని నాశనం చేసేది అధిక శాతం హిందువులే !
 • ( ఈ సెక్యులర్ హిందువుల మాటలు ఉద్దేశాలు నా అనుభవాలో )
 • 1. అందరు దేవుళ్ళు ఒకటే అంటారు, - వీళ్లు దగ్గర ఉండి చూసినట్లు
 • 2. అన్ని మతాల సారం ఒక్కటే అంట, - వీళ్ళు ప్రపంచ జ్ఞానులు
 • 3. అన్ని మత గ్రంధాలు చెప్పేది ఒకటే అంటాడు, - వీడు అన్ని గ్రంధాలు చదివినట్లు
 • 4. వాడి మతం వాడిది మన మతం మనది అందులో తప్పులు మనం ఎత్తిచూపకూడదు అని ఉచిత సలహా ఇస్తుంటారు.
 • 5. వాడు మన మతాన్ని తిడితే వాడిపాపాన వాడిపోతాడు అనడం
 • 6. క్రైస్తవులు ప్రతి ఇంటికి వచ్చి మత ప్రచారం చేస్తూ యేసు ఒక్కడే దేవుడు మీరు రాళ్లకు రప్పలకు పూజిస్తే నరకానికి పోతారు అని మత ప్రచారం చేస్తే వాళ్ళ మతం కోసం వాళ్ళు చెప్పుకుంటున్నారు మీకేంటి అని అనడం
 • 7. క్రైస్తవుల ఇంటికి ప్రాద్దనకు కి వెళ్లి కేకులు బిర్యానీ తిని వస్తారు వాళ్ళు మన పూజకు రారు ప్రసాదం పెడితే తినరు దానికి ఈ సిగ్గులేని వెధవలు వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు అంటాడు వీళ్ళు దెయ్యాన్ని నమ్ముకున్నట్లు
 • 8. హిందువులను హిందు గ్రంధాలను హిందూ దేవుళ్లను తిట్టేవాళ్లను ప్రశ్నించిన హిందువులను నీకు మతపిచ్చి పట్టేసింది మతోన్మాదిలా తయారయ్యావు అని విమర్శిస్తారు.
 • 9. హిందూ ధర్మం గొప్పతనాన్ని  ప్రచారం చేస్తుంటే ఇలా ప్రచారం చేస్తున్నందుకు వీళ్ళకి పైనుంచి డబ్బులు వస్తున్నాయి అందుకే చేస్తున్నారు అని అంటారు.
 • 10. పూర్తిగా అవగాహన లేకుండా హిందూ ధర్మం కోసం వీళ్ళే అసత్యాలు ప్రచారం చేస్తారు(ఉదా, కృష్టుడికి 16 వేలమంది భార్యలు )
 • 11. స్వార్ధం తో రోజు గుడికెళ్లి ఆ దేవునికి అభిషేకాలు పొర్లు దన్నాలు పెడతారు అదే దేవుడిని వేరే మతం వారు తిడుతుంటే చేతకాని చవట దద్దమ్మ లాగా మనల్ని కాదన్నట్లు చూస్తూ ఉరుకుంటారు.
 • 12. వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా వీళ్లకు మంచి జరగకపోతే వ్యక్తిగత స్వార్థంతో హిందూమతాన్ని దూషించి మతం మారిపోతారు.
ఈ సెక్యులర్ హిందువులే - (హిందూ ధర్మాన్ని నాశనం చేసేవారు) ఇప్పుడైనా మారండి 
నిజం తెలుసుకోండి !

సనాతన ధర్మాన్ని  నీ దేశాన్ని కాపాడుకో.

సంకలనం: హిందూ శ్రీ రాజ్

27, ఏప్రిల్ 2020, సోమవారం

హిందూమతోద్ధారకుడు.. ఆది శంకరాచార్యుడు - Saint Aadi Shankaracharya

Saint Aadi Shankaracharya

హిందూమతోద్ధారకుడు... ఆదిశంకరుడు

సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరా చార్యుడు. ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడే ఈ ఆచార్యుడు హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథముడు. గొప్ప పండితుడు, గురువు, మహాకవి. ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. క్రీ.శ. 788-820 మధ్యకాలంలో శంకరుడు జీవించాడని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నారుు. శంకరుడు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం ఉంది.

సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యుడు. ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడే ఈ ఆచార్యుడు హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథముడు. గొప్ప పండితుడు, గురువు, మహాకవి. ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. క్రీ.శ. 788-820 మధ్యకాలంలో శంకరుడు జీవించాడని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి. శంకరుడు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం ఉంది.

బౌద్ధమతం ప్రభావం వల్ల క్షీణించిన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడం. అయితే ఈ ప్రక్రియలో (భౌతికంగా) ఏ విధమైన బల ప్రయోగం లేదు. దేశదేశాలలో పండితులతో వాదనలు సాగించి, వారిని ఒప్పించి, నెగ్గి, శంకరుడు తన సిద్ధాంతాన్ని వారిచే మెప్పించాడు.

ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు, విష్ణు సహస్ర నామాలకు భాష్యాలు వ్రాశాడు. తరువాత శంకరుని అనుసరించినవారికీ, శంకరునితో విభేదించిన వారికీ కూడా ఇవి మౌలిక వ్యాఖ్యా గ్రంధాలుగా ఉపయుక్తమయ్యాయి. శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం - అనే నాలుగు మఠాలను స్థాపించాడు. అవి శంకరుని సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నాలుగు దిక్కులా దీపస్తంభాలలా పనిచేశాయి.

గణేశ పంచరత్న స్తోత్రం, భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకధారా స్తోత్రం, శివానందలహరి, సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్ధనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్తమవుతున్నాయి.

ఆదిశంకరుని జీవితగాధ...
శంకరుని జీవితానికి సంబంధించిన వివిధ గాధలు, నమ్మకాలు ‘శంకర విజయం’ అన్న పేరుతో పిలువబడుతున్నాయి. ఇటువంటి చరిత్రలలో కొన్ని - శంకరుని జీవిత గాధలో ఎన్నో అసాధారణమైన, అధిభౌతికమైన సంఘటనలు మనకు గోచరిస్తాయి.
 • మాధవీయ శంకర విజయం - 14వ శతాబ్దికి చెందిన మాధవుని రచన.
 • చిద్విలాస శంకర విజయం - 15 - 17 శతాబ్దుల మధ్యకాలంలో చిద్విలాసుని రచన.
 • కేరళీయ శంకర విజయం - 17వ శతాబ్దికి చెందిన రచన.
వెయ్యి సంవత్సరాల పాటు బౌద్ధమతం ప్రచారంలోకి వచ్చాక, సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడింది. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకరులు జన్మించారు. బౌద్ధ మతం ధర్మం గురించీ, సంఘం గురించీ చెప్పింది కాని దేవుడిని గుర్తించలేదు. బౌద్ధమత ధర్మాల వ్యాప్తి ఉద్ధృతిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. ఆ సమయంలో శంకరాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచగలిగారు.
జననం...

సదాశివుడే ఆదిశంకరుని రూపంలో భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం. కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ, శివగురువులకు కేరళ లోని పూర్ణానది ఒడ్డున ఉన్న కాలడి లో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్‌ కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ, శివగురువులు త్రిచూర్‌ లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్ధించి, ఆయన అనుగ్రహంతో పుత్రుడ్ని పొందారు. పార్వతీ దేవి, సుబ్రహ్మణ్య స్వామికి ఏవిధంగా జన్మనిచ్చిందో, ఆర్యమాంబ శంకరునికి అదేవిధంగా జన్మనిచ్చింది అని శంకరవిజయం చెబుతోంది.

శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి (ఈ తిథి ఈ ఏడాది 15 మే 2013న వస్తుంది) నాడు శివుని జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్చస్థితి లో ఉండగా జన్మించారు. ఆదిశంకరుని జన్మ సంవత్సరం గురించి కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. శృంగేరి శంకరమఠం ప్రకారం శంకరులు క్రీ.శ. 788లో జన్మించారు, కంచి మఠం ప్రకారం స్వామి రెండు వేల సంవత్సరాలకు పూర్వం, క్రీ.పూ. 509 సంవత్సరంలో జన్మించారు.

బాల్యం...
శంకరుని బాల్యంలోనే తండ్రి మరణించారు. ఆర్యమాంబ కొడుకు పోషణ బాధ్యతలు స్వీకరించి, శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించింది. శంకరులు ఏకసంథాగ్రాహి. బాల్యంలోనే వేదవిద్యలు, సంస్కృతం అభ్యసించారు. బాలబ్రహ్మచారిగా శంకరుడు ఒకరోజు భిక్షాటనం చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగగా, భిక్ష వేసేందుకు ఏమీ లేక, తన ఉపవాసాన్ని విరమించడం కోసం ఉంచుకొన్న ఉసిరి కాయను దానం చేసింది. దానికి చలించిన శంకరులు, ఆశువుగా కనకధారా స్తోత్రాన్ని చెప్పారు. కనకధారా స్తోత్రంతో పులకించిన లక్ష్మీ దేవి బంగారు ఉసిరికాయలు వర్షింపజేస్తుంది. ఒకరోజు శంకరుని తల్లి ఆర్యమాంబ పూర్ణా నది నుండి నీళ్ళు తెచ్చుకుంటుండగా స్పృహతప్పి పడిపోయింది. అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి, నదిని ఇంటివద్దకు తెప్పించారు. ఆవిధంగా నదీ ప్రవాహ మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యచకితులయ్యారు.

సన్యాస స్వీకారం...
సన్యాసం తీసుకొనే సమయం ఆసన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కోరారు. శంకరుడు సన్యాసం తీసుకొంటే తాను ఒంటరినవుతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరుడు పూర్ణానదిలో స్నానం చేస్తూండగా ఒక మొసలి పట్టుకుంది.

సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమని, ఆ విధంగా మరణించే సమయంలోనైనా తాను సన్యాసిగా ఉంటాననీ తల్లిని కోరాడు. దానికి ఆమె అంగీకరించింది. దీనిని ఆతురన్యాసం అని అంటారు. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తూండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరులను వదిలేసింది.

గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారతయాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ, ప్రాతఃకాలం, రాత్రి, సంధ్యాసమయాల్లో ఏసమయంలోనైనా, స్పృహలో ఉన్నపుడూ, స్పృహ లేనపుడూ నన్ను తలచుకోగానే, నీవద్దకు వస్తాను అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి, అంతిమ సంస్కారాలు చేస్తాననీ చెప్పారు.

శంకరుని అసమాన ప్రతిభ...
ఒకరోజు శంకరుడు గంగా నది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళ్తుండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడకు వచ్చాడు. శంకరులు వ్రాసిన భాష్యాల మీద చర్చకు దిగాడు. 8 రోజుల చర్చ తరువాత, ఆ వచ్చింది సాక్షాత్తూ వ్యాసుడేనని పద్మపాదుడు గ్రహించి, అ విషయం శంకరునికి చెప్తాడు. శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి, తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా, వ్యాసుడు సంతోషించి బ్రహ్మ సూత్రాలు అసలు అర్థాన్ని గ్రహించింది శంకరుడు మాత్రమేనని ప్రశింసించాడు.

వేదవ్యాసుడు నిష్ర్కమించ బోవడం చూసి, శంకరుడు ‘‘నేను చెయ్యవలసిన పని అయిపోయింది, నాకు ఈ శరీరం నుండి ముక్తి ప్రసాదించ’’మని వ్యాసుని కోరుతాడు. అప్పుడు వ్యాసుడు ‘‘లేదు, అప్పుడే నీవు జీవితాన్ని చాలించరాదు. ధర్మ వ్యతిరేకులనేకులను ఎదుర్కోవలసిన అవసరం ఉంది. లేకపోతే, నీ కారణంగా రూపుదిద్దుకుని, ఇంకా శైశవ దశలోనే ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్ఛానురక్తి అర్ధాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది.

నీ భాష్యాలను చదవగా కలిగిన ఆనందంలో నీకు వరాన్నివ్వాలని అనిపిస్తోంది. బ్రహ్మ నీకిచ్చిన 8 సంవత్సరాల ఆయుర్థాయానికి అగస్త్యాది మునుల అనుగ్రహంతో మరో ఎనిమిది ఏళ్ళు తోడయింది. పరమశివుని కృప చేత నీకు మరో 16 ఏళ్ళు అయుష్షు లభించుగాక’’ అని దీవిస్తాడు.
జగద్గురు ఆది శంకరాచార్య:
సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం
కైలాస వాసుని అవతారంగా భావించబడే శంకరుల కృప వలన మనకు ఈ రోజు హిందూ మతములో స్పష్టత, పారదర్శకత, లోతు, ఐక్యత ఉన్నవని అనుటలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. ఎందరో మహర్షుల, ఋషుల నోట అంతర్యామి వాక్కులుగా పలుకబడిన శక్తి వేదములుగా ప్రకాశిస్తున్నాయి. ఎవరో రచించి, మరెవరో పరిశీలనము, విమర్శ చేసేందుకు అవి పురాణాలు, నవలలు కావు. విశ్వవ్యాప్తుని మనోకమలము నుండి స్వయంగా మహాపురుషుల నోట వెలువడిన సచ్చిదానందములు వేదములు. అంతటి వేదములకు కూడా వక్ర భాష్యము చెప్పి, భారతీయ సమాజంలో విభజన కలిగించి, మూఢ చాందస భావాలను ప్రేరేపించి అన్యమతముల వైపు ప్రజలను మళ్లించిన సమయంలో ఆ పరిస్థితిని చక్క దిద్దటానికి శంకరులు కాలడిలో శివ గురు శక్తితో ఆర్యాంబ గర్బములో ఉత్తరాయణ పుణ్య కాలమున వైశాఖ శుద్ధ పంచమి నాడు అవతరించారు. చిన్ముద్రతో, మౌనంతో జ్ఞానాన్ని వ్యాపింప జేసే దక్షిణామూర్తి రూపమైన పరమ శివుడు ఈ దంపతులను ఆశీర్వదించగా శంకరులు ఉదయించారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు ఆయన దైవిక శక్తి, మార్గము కాలడిలో ప్రస్ఫుటించాయి.

మూడవ యేటనే తండ్రిని కోల్పోయిన శంకరులకు ఐదవ యేట ఉపనయన సంస్కారము జరిగింది. బ్రహ్మచర్య దీక్షలో భాగంగా మాధుకరం కోసం భిక్షాటనకు వెళ్లిన శంకరులకు ఒక పేద బ్రాహ్మణుని యింటి యిల్లాలు వద్ద ఉసిరికాయ తప్ప ఏమీ దొరకలేదు. ఆమె దుస్థితికి కరిగిన శంకరులు లక్ష్మీదేవిని కనకధారా స్తోత్ర రూపంలో ప్రార్థించగా ఆ తల్లి కరుణించి ఆ ఇంట బంగారు ఉసిరికలు కురిపించి వారి దారిద్ర్యాన్ని పోగొట్టిందిట. దిన దిన ప్రవర్థమాన మవుతున్న శంకరులకు మహర్షులు వచ్చిన దేశాన్ని ఉద్ధరించాలన్న కర్తవ్యాన్ని గుర్తు చేస్తారు. తల్లి అనుమతితో సన్యాసం స్వీకరించి శంకరులు భారత దేశ యాత్ర మొదలు పెడుతారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నర్మదానదిని తన కమండలములో బంధించిన శంకరుని చూసి ముగ్ధులైన గురు గోవింద భగవత్పాదులు శంకరులను తన శిష్యునిగా స్వీకరిస్తారు. గోవింద భగవత్పాదులు శంకరులకు వేదవేదాంగాలు ఉపదేశిస్తారు. ఆత్మ, పరమాత్మ ఒక్కటే అన్న అద్వైత సిద్ధాంతాన్ని కూడా శంకరులకు బోధిస్తారు. ఆ సందేశాన్ని ప్రపంచానికి చాటమని శంకరులను ఆశీర్వదించి పంపిస్తారు.

శంకరులు కాశీకి పయనమవుతారు. అక్కడికి చేరే సమయానికి ఆయనకు చాలా మంది శిష్యులు ఏర్పడుతారు. ఒకసారి ఒక శిష్యుడు నది ఈవలి ఒడ్డున గురువుల వస్త్రములు ఆరవేస్తుండగా శంకరులు అతనిని ఆవలి ఒడ్డు నుండి పిలుస్తారు. గురువుగారి పూర్తి ధ్యాసతో ఆ శిష్యుడు అడుగులు వేస్తూ నదిని దాటుకుంటూ వెళుతాడు. ఆ శిష్యుడు అడుగు వేసిన ప్రతిచోట ఒక పద్మము వెలసి ఆయనను నీట మునగ కుండా కాపాడుతుంది. అంతటి మహిమాన్వితమైన గురుకృపను పొందిన ఆ శిష్యుడు పద్మపాదునిగా పేరు పొందాడు.

ఒక రోజు శంకరులు గంగానదిలో స్నానం ముగించుకుని శిష్యులతో కలిసి విశ్వనాథుని మందిరానికి వెళుతున్నప్పుడు ఒక నిమ్న జాతికి చెందిన వాడు ఎదురు పడతాడు. అప్పటి ఆచారాల ప్రకారం శంకరులు వాడిని తప్పుకో, దారి విడువుము అని అంటాడు. అప్పుడా చండాలుడు నీవు తప్పుకోమంటున్నది ఈ దేహమునా? నా ఆత్మనా? అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శంకరులు తన అహంకారానికి పశ్చాత్తాపపడి ఆ చండాలుని పరమశివునిగా గ్రహించి ప్రణమిల్లుతాడు. ఆ సందర్భంలో చండాలుని రూపములో ఉన్న శివుడు శంకరుని ఉద్దేశించి వేసిన ప్రశ్నలు మొదటి రెండు శ్లోకములు, అటు తర్వాత శంకరుల నోట వెలువడిన శ్లోకాలు మనీషా పంచకంగా పేరొందాయి. అద్వైతామృత సారమైన ఈ మనీషా పంచకం పరబ్రహ్మమొక్కటే అన్న సందేశాన్ని శంకర భగవత్పాదుల నోట మనకు అందించబడినది. తనలో ఉన్న ఆఖరి దుర్గుణమును ఈ సందర్భముగా శంకరులు దగ్ధము చేసుకునే అవకాశమును ఆ పరమ శివుడు చండాలుని రూపములో కలిగించాడు.

బ్రహ్మసూత్రాల కర్త అయిన వ్యాసుల వారి అనుగ్రహంతో వాటి భాష్యాలను అద్వైత సిద్ధాంతంతో పాటు దేశవ్యాప్తంగా ప్రచారం చేయటానికి పయనమవుతారు శంకరులు. దేశాటన చేస్తూ కాంచీపురంలో కామకోటి పీఠం, శృంగేరి శారదా పీఠం వంటి ఎన్నో క్షేత్రాలను స్థాపించారు. ఎన్నో వేల దేవాలయాలను పునరిద్ధరించారు. తిరువైమరుదూరు, తిరుచ్చి, శ్రీశైలము మొదలైన ప్రదేశాలలో ఎన్నో అద్బుతమైన స్తోత్రాల ద్వారా అక్కడి పుణ్యక్షేత్రాలను పునరుత్థానం చేసారు. హఠకేశ్వరం అడవులు శ్రీశైల ప్రాంతంలో ఉన్నాయి. ఇవి కీకారణ్యములు. ఇక్కడ కాపాలికులు నివసించే వారు. కాపాలికులు శ్మశానాలలో ఉంటూ ఆటవిక జంతు మానవ బలుల ద్వారా దేవతలకు ప్రీతి కలిగించే వారు. ఆది శంకరులు ఒకసారి ఇక్కడ తపస్సు చేస్తుండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరులను ఆ పరమేశ్వరునికి బలిగా రమ్మని అడిగాడుట. అందుకు శంకరులు సమ్మతించి బలికి సిద్ధమయ్యారు. కాపాలికుడు శంకరుల తల నరుకబోగా విష్ణుమూర్తి నృసింహ రూపంలో ప్రత్యక్షమై కాపాలికుని సంహరించాడు.

తల్లి ఆర్యాంబ మరణించినప్పుడు సన్యాసియైన తాను ఆమెకు ఉత్తరక్రియలు చేయకూడదని తన కంటి నుండి అగ్నిని సృష్టించి ఆమె చితికి నిప్పు రాజిల్ల జేస్తారు. తన అనుపమానమైన శక్తితో మూకాంబిక, కోటచాద్రి, తిరుమల, పురీ, ద్వారక మొదలైన క్షేత్రాలను అత్యంత మహిమాన్విత క్షేత్రాలుగా తీర్చిదిద్దుతారు శంకరులు.భక్తి, జ్ఞాన, వైరాగ్యములతో మానసికోత్థానం కోసం, హిందూ మత శాఖల, పీఠాల ఐక్యత కోసం, ఉనికి కోసం అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ఎందరో పండితులు, విమర్శకులను ఒప్పించి దేశ వ్యాప్తంగా పంచాయతన పద్ధతిలో పీఠాలు, మఠాలు, క్షేత్రాలు స్థాపించారు. పామరులనుండి పండితుల వరకు వారి వారి చేతనావస్థను బట్టి స్తోత్రాలు, ప్రకరణలు, లోతైన ఆధ్యాత్మిక గ్రంథాలు రాసి, ఈనాటి వరకు ఆ జ్ఞాననిధి, ఆధ్యాత్మిక వారసత్వ సంపద నిలిచేలా చేశారు.

తన యాత్రల చివరలో శంకరులు బదరీ క్షేత్రానికి వెళ్లినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయనను అలకనంద నదిలో ఉన్న తన విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేయమని నిర్దేశిస్తాడు. శంకరులు అక్కడ బదరీనారాయణ క్షేత్రాన్ని, జ్యోతిర్మఠాన్ని స్థాపించి ఆ పరమాత్మలో ఐక్యమవుతారు.ఆ శంకరుల కృప వలననే మనకు నేడు అష్టాదశ శక్తి పీఠములు, చార్ ధామ్ మొదలైన పుణ్య క్షేత్రాలు, వాటి వలన మనకు అత్యున్నతమైన హైందవ అద్వైత సిద్ధాంత సారమైన జీవనశైలి, సమాజము భాసిల్లుతున్నాయి.

శంకరుల రచనలు:
ఆయన చేసిన స్తోత్రాల్లో మనీషా పంచకము, సాధన పంచకము, భజగోవిందము, గోవిందాష్టకము, పాండురంగాష్టకము, శివ సువర్ణమాలా స్తోత్రము, అర్థనారీశ్వర స్తోత్రము, కాలభైరవాష్టకము, దక్షిణామూర్తి స్తోత్రము, నిర్వాణ షట్కము, అన్నపూర్ణాష్టకము, అచ్యుతాష్టకము, మహిషాసుర మర్దిని స్తోత్రము, త్రిపురసుందరీ స్తోత్రము, భుజంగాష్టకాలు, భవాన్యష్టకము, దేవీనవరత్నమాలికా, విశ్వనాథాష్టకము,

ఉమామహేశ్వర స్తోత్రము
ఇలా ఎన్నో సామాన్య జనులకు జీవన దిశానిర్దేశము చేసే స్తుతులను రచించారు. ఆధ్యాత్మికంగా ఇంకొక పై మెట్టులో సౌందర్యలహరి, శివానందలహరి, వివేకచూడామణి మొదలైనవి, ఇంకొక పై మెట్టుపై భాష్యాలు.

ఆదిశంకరుల రచనలు మూడు రకాలుగా విభజించవచ్చు. మొదటిది ఆధ్యాత్మికంగా బాగా ముందడుగు వేసిన వారికి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మీద రాసిన భాష్యాలు. రెండవది వీటి సారాన్ని ప్రకరణలుగా రాసినవి. మూడవది దేవతా స్తోత్రాలు. కొన్ని స్తోత్రాల వివరాలు.

విష్ణు షట్పది:
మనస్సుపై స్వాధీనము కొరకు విష్ణుని ప్రార్థిస్తూ రచించిన ఈ స్తోత్రము మానసిక ప్రశాంతతకు చాలా తోడ్పడుతుందని నమ్మకం. భయము, అహంకారముతో కప్పబడిన ఈ జీవితం భవ సాగరమై మరిన్ని జన్మలకు కారణము అవుతుంది. కావున, వాటిని అధిగమించి, మనసును లగ్నము చేసి, ధ్యేయము వైపు ధ్యానించి సత్య జ్ఞాన ప్రాప్తికి కృషి చేయవలెను అని ఈ స్తోత్రము ద్వారా మనకు ఆది శంకరులు చక్కని సందేశాన్ని అందించారు. భయమే మృత్యువు, భయమే శత్రువు. అహంకారమే పతనము. అహంకారమే అత్యంత ప్రమాదకరమైన శత్రువు. వాటిని అధిగమించటం ఆధ్యాత్మిక పరమార్థము. అదే పరమాత్ముని దర్శనము. అదే మోక్ష కారకము.

సాధనా పంచకము:
శంకరులు అద్వైత సిద్ధాంతమును కాలి నడకలో భారత దేశమంతా తిరుగుతూ ప్రచారం చేసి, దానికోసం కావలసిన పీఠాలను, ధార్మిక క్షేత్రాలను స్థాపించారు. సద్గురు సాంగత్యము, శిష్యరికము, దైవారాధన, నిత్య నైమిత్తిక చర్యలు, ధ్యానము, యోగము, సత్సంగము, భక్తి మొదలైన సాధనాలతో పరబ్రహ్మ తత్త్వమును గ్రహించి, అనుభూతి పొందవచ్చు అని శంకరులు మనకు దివ్యామృతమును అందజేశారు.

దీనికోసం ఏమి చేయాలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఐదు సూత్రాలను ఆదిశంకరులు మనకు సాధనా పంచకం రూపంలో ఇచ్చారు. ఇందులో విషయము చాలా సులభముగా అనిపించినా, అది ఆచరణలో పెట్టటానికి ఎంతో నియమము, నిగ్రహము, పట్టుదల అవసరం. ఉదాహరణకు - వేదములను అధ్యయనం చేద్దాము - అనేది ఒక ధ్యేయము. మరి దానికి సరైన గురువు, పాఠశాల, క్రమశిక్షణతో కూడిన దైనందినచర్య, అభ్యాసము, ఏకాగ్రత, సాధన - ఇవన్నీ కావాలి. అలాగే, అహంకారము వదలుట అనేది ఒక ధ్యేయము - మరి దీనికి మన అలవాట్లు, మానసిక స్థితి ఏవిధంగా ఉండాలో ఊహించండి. నియమిత సాత్త్విక ఆహారము తీసుకోవటం, సుఖములకు, దుఖములకు అతీతంగా, రాగద్వేషాలు లేకుండా - ఒక రకమైన ఉదాసీన వైఖరిని అలవరచుకోవాలి. దీనికి మళ్లీ పైన చెప్పిన గురువు, అభ్యాసము, సాధన, క్రమశిక్షణ అన్నీ అవసరం.సాధనా పంచకాన్ని ఒక శిఖర మార్గముగా తీసుకుని, దానిలో ఉన్న ప్రతి పరమాణు ధ్యేయములకు సద్గురువును ఆశ్రయించి, శ్రుతులను అనుగమిస్తూ, జీవన శైలిలో వాటిలో పయనిస్తూ, అవరోధాలను అధిగమిస్తూ అవరోహణ చెయ్యాలి. దీనికి భక్తి, జ్ఞానము, వైరాగ్యము, పరిశ్రమ, సహనము, శ్రద్ధ అన్ని తోడు చేసుకోవాలి. అప్పుడే ఆ సచ్చిదానంద స్థితిని పొందగలరు. ఈ పంచకము లోని భావమును, నిగూఢమైన ఆశయములను, సందేశమును తెలుసుకోవలసినదిగా సాధకులకు శంకరుల ఉద్దేశము.

శివ సువర్ణమాలా స్తుతి:
యాభై శ్లోకాలలో లయ బద్ధమైన పదాలు, భక్తి, సర్వస్య శరణాగతి, ఆత్మానుభూతి, లోతైన వివేచనము తో సాగే సువర్ణమాల స్తోత్రమును ఆ అపర శంకరుడు ఆది శంకరులు రచించారు. సాంబ = స+ అంబ - నిరంతరం ఆ జగదంబ అయిన పార్వతితో కూడి అర్థనారీశ్వరుడై ఉన్నాడు కాబట్టే ఆ పరమ శివుడు సాంబుడు అయినాడు. పార్వతీ సమేతుడవైన శివా! శంభో! నీ పాదములకు నమస్కారములు. నాకు శరణునిమ్ము అనే అంతరార్థంతో సాగే ఈ స్తోత్రములో శివుని అశేష కీర్తి, అగణిత గుణ గణములను ఆది శంకరులు నుతించారు. స్తోత్రము ముందుకు సాగుతున్న కొద్దీ ఆ పరమశివుని వర్ణన, కైలాసము ఎదుట ఉందా అన్న భావన ఆదిశంకరులు కలిగిస్తారు. యాభై శ్లోకాలు అనర్గళంగా ఒకే దేవతపై రాయాలంటే ఆత్మ జ్ఞాన పరిపూర్ణుడై, దైవ సాక్షాత్కారము కలిగి, ఎల్లప్పుడూ ఆ దైవము కన్నుల ఎదుట నిలిచి ఇటువంటి అనుభూతిని కలిగిస్తే, ఆ ఆవేశం స్తోత్ర రూపంలో వెలువడి ఇన్ని వేల ఏళ్ళు నిలబడ గలుగుతుంది.

ఆయన మహిమను తెలిపే ఒక స్తుతి - తోటకాష్టకము:
ఆ శంకరుని శిష్యులలో ఒకడైన ఆనందగిరి తన గురువులను స్తుతిస్తూ రచించిన తోటకాష్టకం ఆ శంకరుల లక్షణాలను, వైభవాన్ని, ఆధ్యాత్మిక శక్తిని ప్రతిబింబిస్తుంది.ఆనందగిరి ఈ స్తోత్రాన్ని తోటక ఛందములో రాయటం వలన దీనికి తోటకాష్టకం అని పేరు వచ్చింది. దీని వెనక ఒక చిన్న కథ ఉంది.

శంకరుల శిష్యులలో ఆనందగిరి కొంత మంద బుద్ధి. కానీ, అమితమైన గురు భక్తి కలవాడు. నిరంతర గురు సుశ్రూషలో ఉండేవాడు గిరి. ఒక రోజు, శంకరులు తన ప్రాతః కాల దినచర్యలో భాగంగా ఉపనిషత్ ప్రవచనం ఆరంభించారు. ఆ సమయంలో శిష్యులంతా శాంతి పాఠం మొదలు పెట్టారు. కానీ, గిరి మాత్రం అక్కడ లేదు. గురువు గారి వస్త్రములు ఉతకటానికి నది దగ్గరకు వెళ్ళాడు. శంకరులు ఇది గమనించి మిగిలిన శిష్యులను గిరి వచ్చేదాకా వేచి ఉండమని పలుకుతారు. అప్పుడు పద్మపాదుడనే శిష్యుడు గర్వముతో 'వాడు మూర్ఖుడు, వానికి శాస్త్రములు నేర్వవలసిన అర్హత లేదు. వానికోరకు ఎందుకు వేచి ఉండటం' అని అంటాడు. శంకరులు పద్మపాదుని గర్వము అణచుటకు, తన దైవ శక్తితో ఆనందగిరికి సకల శాస్త్ర పరిజ్ఞానమును క్షణకాలములో కలిగేలా చేస్తారు. నది వద్దనుండి తిరిగి వచ్చిన ఆనందగిరి గురువుగారిని నుతిస్తూ తోటకాష్టకాన్ని ఆశువుగా పఠించాడు మిగిలిన శిష్యులకు సిగ్గు, విస్మయం కలిగించేలా అతి కష్టమైనా తోటక ఛందములో ఎనిమిది శ్లోకాలతో అద్భుతంగా సాగుతుంది తోటకాష్టకం. అటు తర్వాత, ఆనందగిరి శృతి సార సముద్ధరణ అనే ఇంకొక రచన కూడ తోటక ఛందములో చేస్తాడు. శంకరుల నలుగురు ముఖ్య శిష్యులలో ఒకడై , తోటకాచార్యులుగా పిలవబడి, గురువులచేత బదరీలోని జ్యోతిర్మఠం నడపటానికి నియమించబడతాడు.

ముగింపు:
ఎంతో మంది స్వాములు, యతులు తర్వాత భారత దేశంలో జన్మించి, ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రచారం చేశారు, కానీ శంకరులు సుస్థిర పరచిన అద్వైత సారము, ధార్మిక సిద్ధాంతాలు, పద్ధతులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా, ప్రామాణికాలై కాలపు ఒడిదుడుకులను తట్టుకొని హిమాలయముల వలె ఉన్నతముగా నిలిచినది. ఇట్టి ఆధ్యాత్మిక సంపదను ఇచ్చిన ఆ పరమ శివ రూపమైన జగద్గారువులకు శత సహస్ర పాదాభివందనములు.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

4, ఏప్రిల్ 2020, శనివారం

భారత మాత సేవలో భారతీయ సన్యాసిని, సోదరి ‘నివేదిత’ - Sodari "Sister" Nivedithaభారత మాత సేవలో భారతీయ సన్యాసిని, సోదరి ‘నివేదిత’ - Sodari "Sister" Nivedita
నదేశం బ్రిటిష్‌వారి పాలనలో ఉన్న కాలమది. అనేక సమస్యలు, అవిద్య, పేదరికం ఇతర సామాజిక రుగ్మతలలో సతమతమవుతున్న మనదేశానికి పశ్చిమ దేశాల నుండి సేవాభావంతో సహాయం చేసేందుకు కొందరు వ్యక్తులు వచ్చారు. వారిలో మార్గరెట్‌ నోబుల్‌ ఒకరు. కేవలం సేవా భావమే కాకుండా భారత దేశపు సాంస్కృతిక జ్యోతి తనను ఆకర్షించిన కారణంగా భారతదేశమే తమ గమ్యంగా భావించి ఆజీవన పర్యంతం ఇక్కడి ప్రజలలో మమేకమై సోదరి నివేదితగా మనకు ప్రాతఃస్మరణీయురాలైనది.

స్వామీ వివేకానంద స్ఫూర్తి
1895 సంవత్సరంలో మార్గరెట్‌ జీవితం అసాధారణమైన మలుపుతిరిగింది. ఆమె స్నేహితు రాలు ఆమెకు ఒక భారతీయ సన్యాసిని పరిచయం చేయటానికి తన ఇంటికి తీసుకొని వెళ్ళింది. ఆ సన్యాసి ఎవరో కాదు స్వామి వివేకానంద. 1893లో చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో పాల్గొని తన స్ఫూర్తిదాయక ప్రసంగాలతో పాశ్చాత్య జనుల హృదయాలను జయించిన ఆ యుగ పురుషుని వ్యక్తిత్వం, తేజస్సు, ఆయన వాక్కు ఆమెను ఆకట్టు కున్నాయి. ఆయన ఉపదేశాలు, ప్రవచనాలు ఆమె ఆత్మను మేలుకొలిపాయి. భారతదేశానికి సేవ చేసే విధంగా ప్రేరేపించాయి.

మహిళా విద్యకు ప్రాధాన్యత
భారతదేశ స్థితిని గురించి స్వామిజీ ఆమెతో ఇలా అన్నారు ‘మా మహిళలు విద్యావంతులయ్యే వరకూ మా దేశం ప్రగతి సాధించదు. మా దేశపు మహిళల విద్య, అభివృద్ధి కొరకు, వారిని ఆ పనిలో నిమగ్నం చేయటానికి నువ్వు నాకు సహాయం చేస్తావా’. తనపట్ల స్వామిజీకి ఉన్న విశ్వాసానికి ప్రభావితురాలై స్వామీజీ దేశమే తన దేశంగా భావించి భారతదేశానికి రావటానికి నిర్ణయించుకొని 1898 జనవరి 28న కలకత్తా చేరుకుంది. ఆమెను స్వాగతించేందుకు స్వయంగా స్వామీజీ అక్కడికి వెళ్ళారు. త్వరలోనే ఆమె అక్కడ ప్రజలలో కలిసి పోయింది. బెంగాలీ భాష నేర్చుకుని ఆ సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేసింది. స్వామీజీ శిష్యులు అమెరికా నుండి ఇద్దరు వచ్చారు. ముగ్గురూ కలసి ఒక తమ నివాసాన్నే ఆశ్రమంగా మార్చేశారు. వారికి స్వామిజీ స్పష్టంగా ఒక సందేశం ఇచ్చారు. ”ఈ దేశాన్ని ప్రేమించండి. పూజించండి. ఇదే ప్రార్థన. ఇదే పూజ.” 1898 మార్చి 25న స్వామిజీ మార్గరెట్‌తో శివపూజ చేయించి ”నివేదిత” నామ కరణం చేశారు. నివేదిత అంటే నివేదించబడినది (సమర్పితమైనది) అని అర్ధం. ఆమెను భగవంతునికి తద్వారా భారతదేశానికి సమర్పించారు.

మహిళలకు, బాలికలకు విద్యనేర్పటానికి నివేదిత ఒక పాఠశాలను ప్రారంభించింది. ఇంటింటికీ వెళ్ళి బాలికలను బడికి పంపవల సిందిగా ప్రజలను కోరింది. వారినుండి ఎంత ప్రతికూలత వచ్చినా, వారికి నచ్చజెప్పి కొందరి బాలికలకు వ్రాయటం, చదవ టమే కాకుండా చిత్రకళ, శిల్పకళ కూడా నేర్పింది. అలా తన నిస్వార్ధ సేవా, సహయాలతో కలకత్తా ప్రజల హృదయాలలో స్థానం పొందింది.

బాధితుల సేవలో
1899 మార్చిలో కలకత్తాలో ”ప్లేగ్‌” వ్యాధి వ్యాపించింది. ఎంతోమంది ప్రాణాలు కోల్పో యారు. ఆ సమయంలో ప్రజల ప్రాణాలను రక్షించే సంకల్పం తీసుకుని మురికి వాడలను శుభ్రం చేయటం మొదలుపెట్టింది. ఆమె సేవాకార్యక్రమాల ప్రభావంతో మిగతా మహిళలు కూడా ముందుకు వచ్చారు. శుభ్రపరచడమేకాక రోగగ్రస్తులకు సేవచేయటం కూడా ఆమె ఆచరణ ద్వారా నేర్పింది.

పాఠశాలకు నిధులు సమకూర్చేందుకు ఆమె యూరప్‌కు ప్రయాణమైంది. నిధులకోసమేకాక క్రైస్తవ మిషనరీలు పాశ్చాత్య దేశాలలో మనదేశం గురించి ప్రచారం చేసే అసత్యాలను ఖండించి ఇక్కడి మ¬న్నత సంస్కృతిని గూర్చి వారికి సరియైన అవగాహన కల్పించేందుకు కూడా ఆమె తన యాత్రను ఉపయోగించుకున్నారు.

జనజాగృతి…
1902లో స్వామిజీ మహాసమాధి చెందారు. అంతకుముందు మన దేశ స్వాతంత్రంకోసం సంఘర్షణ చేయాలనే మరో కార్యాన్ని కూడా ‘నివేదిత’కు అప్పగించారు. అలా ఆమె భారత స్వాతంత్య్ర సాధనే తన జీవన కార్యంగా స్వీకరిం చింది. దేశమంతా పర్యటించి ప్రజలను స్వతంత్ర పోరాటానికి సమాయత్తం చేసే విధంగా ప్రేరణ దాయకమైన ప్రసంగాలు చేసింది.
అలా ఆమె మానసిక బానిసత్వం నుండి బయటపడే విధంగా ప్రజలకు ప్రేరణ కల్గించింది.

రచన: రమేష్‌ చంద్ర
మూలము: సమాచార భారతి

20, మార్చి 2020, శుక్రవారం

దేవుడు ఒక్కడే, అయిన బహు దైవారాధన ఏల? - Hinduvulu Devudu okkade Antunnaru, Mari Bahudaivaaradha Yela

దేవుడు ఒక్కడే, అయిన బహు దైవారాధన ఏల? - Hinduvulu Devudu okkade Antunnaru, Mari Bahudaivaaradha Yela
 దేవుడొక్కడే అని హిందువుల నమ్మకమయితే వారు శివుడు, విష్ణువు, దేవి మొదలైన అనేకమంది దేవుళ్ళను ఎందుకు పూజిస్తారు?  దీనివల్ల దేవుళ్ళు అనేకులని అంగీకరించినట్లు కాదా? 

హిందూధర్మం అనేక దేవతలను అంగీకరించినట్లు కన్సిస్తున్నా, దేవుడు లేక పరమాత్మ ఒక్కడే. ఇంద్రుడు మొదలైన దేవతలు మునుపటి సృష్టికాలంలో మనవంటి జీవులే. వీరు తమ అపూర్వ పుణ్యఫలంగా ఈ సృష్టిలో ఇంద్రుడు, వరుణుడు మొదలైన పదవులను సంపాదించారు.

సృష్టిలోని కొన్ని ప్రకృతిశక్తులను వీరు నియంత్రిస్తారు. వీరు మన ప్రభుత్వంలోని అధికారుల వంటివారు. తమ పుణ్యఫలం క్షీణించిన తరువాత వీరు తమ పదవులను కోల్పోతారు. తిరిగి వీరు ముక్తికోసం ప్రయత్నించాలి.

      ఇక బ్రహ్మ, విష్ణు, శివుల విషయం. వీరు ముగ్గురూ మూడు వేర్వేరు దేవతలు కారు. సృష్టి-స్థితి-లయాలు, చేయడానికి పూనుకున్న ఒకే పరమాత్మ యొక్క మూడు వేర్వేరు రూపాలు. ఏ విధంగా ఒకే వ్యక్తి ఇంట్లో తండ్రిగాను, ఆఫీసులో అధికారిగాను, అంగడిలో వినియోగదారుడిగా ఉంటాడో అలాగే దేవుడు కార్యానుసారంగా వివిధనామ రూపాలతో కనిపిస్తాడు.
ఈ దేవతలకుండే సృష్టి మొదలైన శక్తులను కూడ స్త్రీరూపాలుగా ఊహించి లక్ష్మి, సరస్వతి, పార్వతి మొదలైన పేర్లతో పిలుస్తారు. అగ్ని - దాని దహించే శక్తి విధంగా విడదీయరాని సంబంధాన్ని కలిగి ఉంటాయో, ఈ దేవీదేవతలు కూడా అలా అవినాభావసంబంధం కలిగి ఉంటారు.  ఈ  దేవతలందరూ కల్పించబడిన వాళ్ళని అనుకోకూడదు.  పంచదారతో చేయబడే బొమ్మలన్నీ పంచదార అయినట్లే ఈ దేవతారూపాలన్నీ ఒకే పరమాత్ముని వివిధ రూపాలు. ఊహాతీతుడైన పరమాత్మను నేరుగా ధ్యానించటం సామాన్యులకు అసాధ్యం.

భగవదనుగ్రహంవల్ల, ఆ పరమాత్మను సామాన్యుల బుద్దిశక్తికి అందుబాటులోకి తేవటం కోసం, ఋషులు వివిధ రూపాలనూ, నామాలనూ తమ తపశ్మక్తితో దర్శించి, మనకందించారు. కనుక ఈ దేవతల ధ్యానం వల్ల మనకు లభించేది ఆ పరమాత్ముని సాక్షాత్కారమే.

ఇక కొన్ని పురాణాలలో మనకు కన్పించే పరస్పర విరోధభావాలను గురించి ఒకటి రెండు మాటలు చెప్పుకుందాం. వందల కొలది సంవత్సరాల నుండి ప్రచారంలో ఉన్న ఈ పురాణాల మూలరూపం ఏదో కాలక్రమంగా వాటిలో చేర్చబడిన భాగాలు ఏవో విడదీసి చెప్పడం కష్టం.

శైవుల, వైష్ణవుల, శాక్తేయుల మధ్య అభిప్రాయ భేదాలు చెలరేగిన కాలంలో తమ మతాల శ్రేష్టత్వాన్ని నిరూపించటం కోసం ఆయా మతాల అనుయాయులు తమకు ఇష్టం వచ్చినట్లు వ్రాసి ఈ పురాణాలకు జోడించి ఉండవచ్చునని చెప్పుకోవడం సబబు. కనుక పాఠకులు ఈ పురాణాల ముఖ్యోద్దేశాన్ని మనస్సులో పెట్టుకొని, వాటి స్ఫూర్తికి వ్యతిరేకంగా యుక్తిహీనంగా కనబడే వ్రాతలను లక్షించకూడదు.

సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి
ముద్రణ: రామకృష్ణ మఠం

4, మార్చి 2020, బుధవారం

భగవంతుని స్వరూపం ఎటువంటిది - Hindu Dharmalo Bhagawantuni Swaroopam yetuvantidi

భగవంతుని స్వరూపం ఎటువంటిది - Hindu Dharmalo Bhagawantuni Swaroopam yetuvantidi
భగవంతుని స్వరూపం ఎటువంటిది
హిందూమతంలో వివిధ సంప్రదాయాలు భగవంతుని గురించి చెప్పే అభిప్రాయాల్ని, వాటివాటి
ఊహాపోహల్ని సంగ్రహంగా ఇలా పేర్కొనవచ్చును పరబ్రహ్మ ఒక్కడే. ఆయన సత్-చిత్ఆ నందస్వరూపుడు. ఆయన ఈ జగత్తును తన శక్తితో తననుండే సృష్టిస్తాడు; తానే కాపాడుతాడు; తిరిగి కొంతకాలం తర్వాత తనలోకే ఉపసంహరించుకుంటాడు. అంటే స్పష్టి, స్థితి, లయలు చేసేది భగవంతుడే.

సృష్టి తర్వాత స్థితికాలంలో ఒక చక్రవర్తిలాగా ఈ జగత్తును పోషించేవాడు ఆయనే. జీవుల
పాపపుణ్యాలకి తగిన ఫలాలను ఇచ్చేది దేవుడే. ఆయన సర్వజ్ఞుడు సౌందర్యనిధి, సకలసద్గుణాలకు నిలయం.

భగవంతునికి జీవుల మీద అపారమైన కరుణ ఉంటుంది. ఆయన సర్వశక్తిమంతుడు జ్ఞానమయుడు దయాస్వరూపుడు. ఈ ప్రపంచం అనే పాఠశాలలో జీవులు వివేకవిచక్షణలతో, రకరకాల అనుభవాలతో క్రమక్రమంగా తమ జ్ఞానాన్ని పెంపొందించుకుంటారనీ ఉన్నతమైన పరిణామాన్ని పొందుతారనీ, పొందాలనీ దేవుడు దీనిని సృష్టించాడు.

భగవంతుడు భక్తిప్రియుడు శరణాగతభావంతో అయనను ప్రేమించటం సులభందైవసాక్షాత్కారంతోనే మానవ జన్మ సార్థకమవుతుంది ఆయన సాకారుడే కాక, నిరాకారుడు కూడా దేవుడు ధర్మాన్ని తిరిగి స్థాపించటానికి, భక్తులను ఉద్దరించటానికి
ప్రతియుగంలోనూ ఈ లోకంలో అవతరిస్తాడు.

రచన: స్వామి హర్షానంద

3, మార్చి 2020, మంగళవారం

వైదిక పవిత్ర గ్రంథాలు, వాటి సారాంశము - Vaidika Grandhaalu vaati saaramsamu

వైదిక పవిత్ర గ్రంథాలు, వాటి సారాంశము - Vaidika Grandhaalu vaati saaramsamu
వేదాలు, ఉపనిషత్తులు కాక మనకున్నఇతర పవిత్ర గ్రంథాలు, వాటి సారాంశము
హిందూధర్మంలో పవిత్రాలు అని భావించబడే గ్రంథాలు కోకొల్లలు. అయినా సాంప్రదాయికంగా అంగీకరించబడినవి, మరియు హిందూ సమాజంలోని అన్ని సంప్రదాయాలకు చెందిన వ్యక్తులచే ఆదరించబడే ప్రధానమైన కొన్ని గ్రంథాలు మాత్రం ఇక్కడ ప్రత్యేకంగా పేర్కొనబడుతున్నాయి.
 • రామాయణం, 
 • మహాభారతం,  
 • భగవద్గీత,  
 • మనుస్కృతి, 
 • పరాశరస్మృతి, 
 • యాజ్ఞవల్క్యస్మృతి మొదలైనవి, ఇతర ఆగమాలు, పురాణాలు మరియు దర్శనాలు.
వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో మానవాళికి శీలనిర్మాణాన్ని బోధించే శ్రీరామచంద్రుడి కథ వివరించబడింది. వ్యాస మహర్షి వ్రాసిన మహాభారతంలో కౌరవ పాండవుల కథ మరియు కృష్ణభగవానుని గురించి విశదంగా చెప్పబడింది. జీవితంలో అనివార్యంగా వచ్చే కష్టనష్టాలను మహాపురుషులు ఎలా ఎదుర్కోగలిగారో తెలుసుకుంటే మనకి కూడ అటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొనగలిగే ధైర్యము, మనశ్శక్తి లభిస్తాయి.

 భగవద్గీత, మహాభారతంలో ఒక భాగం. ఇది సర్వజనప్రియమైన ధర్మగంథము. ఉపనిషత్తులు గోవులైతే గీత వాటి పాలవంటిది.  భగవంతుడైన శ్రీకృష్ణుడికీ, మహావీరుడైన ఆర్జునుడికీ మధ్య కురుక్షేత్ర యుద్ధభూమిలో జరిగిన సంభాషణయే గీత.  చేయవలసిన కర్తవ్యాన్ని, అదెంత కష్టమైనది అయినా, పట్టుదలతో నిస్స్వార్ధబుద్దితో చేయాలి. దైవప్రీతి కోసం, లోకకల్యాణం కోసం సమాజానికి మనవంతు ఋణాన్ని తీర్చడం కోసం స్వధర్మాన్ని మనం ఆచరించి తీరాలి.
తీరాలి.

స్వశక్తితో సాధించగల ఒక ఉన్నతలక్ష్యాన్ని కలిగివుండి, దానిని సాధించడానికి కావలసిన పట్టుదలనూ,  సంకల్పశక్తినీ పెంపొందించుకుంటూ,  ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి ప్రయత్నిస్తూ జీవించడమే స్వధర్మం.  స్వధర్మంలోనే శ్రేయస్సు ఉంది. పరధర్మాన్ని గుడ్డిగా అనుకరించడం చాలా ప్రమాదభరితం కాబట్టి అది భయావహమైనదని చెప్పబడింది. ఇదే క్లుప్తంగా గీతాసందేశము.

శ్రుతులు ప్రతిపాదించే సర్వోత్కృష్టమైన శాశ్వతమైన సత్యాలను జ్ఞాపకం  పెట్టుకొని (సృతి=జ్ఞాపకం) అనగా దృష్టిలో ఉంచుకుని, మారిపోయే కాలమాన పరిస్థితులకు అనుగుణంగా
హిందూసమాజాన్ని నియమించి, మార్గదర్శకత్వం వహించేవే స్మృతులు. మనువు, యాజ్ఞవల్క్యుడు పరాశరుడు మొదలైన మహర్షులచే రచించబడిన ఈ స్మృతులలో ప్రతి హిందువు యొక్క వ్యక్తిగత, సామాజిక జీవితం ఎలా ఉండాలో స్పష్టంగా వివరించబడింది.

ఇంకా వివిధ దేవతా పూజావిధానాలు, దేవాలయాలను గురించిన వివరాలను కలిగివుండి, ఆధ్యాత్మిక సాధనలను గురించి వివరించే గ్రంథాలు ఆగమాలు. చారిత్రాత్మకమైన విషయాలు అక్కడక్కడ ఉన్నా, ఎక్కువభాగం కథల ద్వారా, రూపకాల ద్వారా దృష్టాంతాల ద్వారా ధార్మిక సత్యాలను సామాన్యులు కూడా స్పష్టంగా అర్థం చేసుకునేట్లు తెలియజేయటమే పురాణాల ముఖ్య ఉద్దేశం. కృష్ణలీలలను వివరించే భాగనతము, విష్ణుపురాణం, పురాణాలలో ఎక్కువ ప్రిద్ధి
పొందిన గ్రంథాలు. దర్శనాలు అనే గ్రంథాలు ఆరు.

ఈ జగత్తు, సృష్టి, మూలతత్త్వం, ఆత్మ, భగవంతుడు మొదలైనవాటి గురించి వీటిలో చర్చించబడ్డాయి. వీటిలో పతంజలి విరచిత యోగశాస్త్రం, వ్యాసమహర్షి రచించిన వేదాంత దర్శనాలు ఇప్పటికీ జనప్రియాలుగానే విరాజిల్లుతున్నాయి.

రచన: స్వామి హర్షానంద
అనువాదం: శ్రీ దయాత్మానంద స్వామి

11, మార్చి 2018, ఆదివారం

పూజలో అక్షతలు అంతరార్థం - Akshintalu atne emiti

పూజలో అక్షతలు అంతరార్థం - Poojalo Akshintalu

అక్షతలు అనగా దెబ్బతిననివి, విరగనివి అని అర్థం. ఎటువంటి శతములు(దెబ్బలు) తగలని వాయువు రాకపోకలు నాసిక నుండే జరుగును.
 • వాసన చూచుట లో అక్షతలకు శతములు ఉన్ననూ ఆ వాయువు పరిశుద్ధి చేయును. 
 • పరిశుద్ధమైన అక్షతలను వెనుకవైపు వేయునపుడు’ మేరోపృష్ట ఋషి: ‘ అని స్మరించాలి. 
 • మన వెనుకవైపు మేరుపర్వతము, ముందువైపు ఉదయాచలం, ఉత్తరమున హిమపర్వతం, దక్షిణమున వింద్యా ఉన్న భావనతో సంకల్పం చేసుకోవాలి. 
 • వెనుకవైపు ఉన్న మేరు పర్వతమునకు మన దృష్టి అందదు కావున మన భావనకు ప్రతీకగా అక్షతలను వెనకకు వేసి మేరుపర్వతమును ఆరాధిస్తాము.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

5, మార్చి 2018, సోమవారం

పెళ్ళినాటి ప్రమాణాల అర్ధం పరమార్ధం - Pelliroju Pramanalaku ardham yemiti

pelli-roju-ardham-paramardham
 పెళ్ళి రోజు:
వివాహము అయిన సంవత్సరమునకు పెళ్ళిరోజున, ఇద్దరు దంపతులు తలస్నానము చేసి ఉదయము గుడికి వెళ్ళి పూజచేయించుకొనవచ్చును.

సాయంకాలము ఫ్రెండ్స్‌ను, బంధువులను పిలుచుకుని దండలు మార్చుకుని, కేకు కటింగుచేసి పిలిచిన అతిధులకు టీ పార్టీ కాని, భోజనము కాని ఏర్పాటు చేయాలి. బొట్టు, పండు తాంబూలము ఇవ్వవలెను. పెళ్ళి అయిన 25 సంవత్సరాలకు సిల్వర్‌ జూబ్లి అందురు. 50 సంవత్సరాలకు గోల్డెన్‌ జూబ్లి అందురు.

పెళ్ళినాటి ప్రమాణాల పరమార్ధం:
వ్యక్తి తానే కేంద్రబిందువుగా ఉండే స్థితినుంచి మరో వ్యక్తి కేంద్రబిందువుగా ఉండే స్థితికి ఎదిగే నిజమైన జీవిత యాత్ర వివాహంతోనే పెళ్ళి ఆరంభమవుతుంది. ఒక శిశువుకు తన కుటుంబము నుండి, పరిసరాల నుండి తన అంతఃచేతన ద్వారా అందిన నైతిక సూత్రాలనే బీజాలు వివాహం తరువాతనే మొలకెత్తి వేగంగా పెరగనారంభిస్తాయి. ప్రేమ, తన్మయత, త్యాగం, భక్తి, ఓరిమి మొదలైన సద్గుణాలు పూర్తిగా ఎదిగేందుకు వివాహ జీవితం ఎన్నో అవకాశాలను ఇస్తుంది. కుటుంబ జీవనంలో ఎదగడానికి వివాహ వ్యవస్థ అవసరం. ఈ భావాన్ని పెండ్లి కుమారునికి కలిగించడానికే వేదాలు ఇలా ప్రకటించమని అతనికి సలహా ఇస్తుంది.
 • ప్రియా! ఆవాహనం చేయబడిన దేవతల సన్నిధిలో, మన జీవితంలోని పవిత్ర సందర్భంలో, నీ పాణిగ్రహణం చేస్తున్నాను. ఆశీర్వదించబడిన ఓ స్త్ర్రీ రత్నమా! దీర్ఘకాలం నా జీవిత భాగస్వామిగా ఉండు. నా కుటుంబ బాధ్యతలను నీ కప్పగిస్తున్నాను. సంతోషముగా నీ బాధ్యతను నెరవేర్చు. పవిత్రమైన ఈ ప్రమాణం దైవసన్నిధిలో పెండ్లి కుమారుడు చేసే ఆ క్షణం నిజానికి ఎంతో ఆనందకరమైనది. ఆ రోజే ఇంటి బాధ్యతల విభజన జరుగుతుంది. జీవనోపాధి సంపాదనకు భర్త బాధ్యత వహిస్తే, గృహనిర్వహణను భార్య నిర్వహిస్తుంది. ఇద్దరూ శ్రధగా తెలివిగా తమ భాధ్యతలను నిర్వహించినప్పుడే వివాహ జీవితం సఫలమౌతుంది. పవిత్రమైన హిందూ వివాహంతో జీవితంలో పరీక్ష మొదలౌతుంది. కనుక చేసిన ప్రమాణాలకు పూర్తిగా కట్టుబడి ఉన్నప్పుడే వైవాహిక జీవితం అర్ధమవుతుంది. 
 • త్యాగం, నిష్టల నిర్వహణయే నిజమైన జీవితానికి మార్గదర్శకమౌతుంది. వివామాహోత్సవంలో చేసిన ప్రమాణాన్ని పూర్తిగా పాటించినట్లయితే, వైవాహిక జీవితంలో స్వర్గ సుఖాన్నిచ్చే వాతావరణాన్ని వ్యక్తి సృష్టించుకోగలుగుతాడు. నిజానికి భార్య భాగ్యాధి దేవతయైన లక్ష్మి అవతారమే. ఈ సంపద లేకపోతే మానవజీవితం సారవిహీనం, అనాకర్షణీయం అవుతుంది. పెండ్లికుమారుని ఈ ప్రకటనలో ఎంతో నిజం ఉంది. నీవు లక్ష్మివి. నీవులేని నేను ధనహీనుడను. నీవులేకపోతే నా జీవితంలో ఆనందమేలేదు. ఓ అందాలరాశీ! మన కలయిక సామవేదం, దానిలోని మంత్రం; అది భూమి, ఆకాశాల కలయిక వంటిది. పై వైదిక మంత్రంలో ఋషి వివాహానికి ఒక మంచి వివరణ ఇచ్చారు. వివాహ వ్యవస్థ ఒక వ్యక్తికి సంబంధించినది మాత్రమే కాదు. పూర్తి సంఘానికి సంబంధించినది. వివాహాలు ప్రమాణాలకు కట్టుబడే, పవిత్రత ముద్రను పొందలేవు. అందువల్ల ప్రతి జంటా తమ సాంఘికబాధ్యతలను గుర్తెరగాలి. 
తరతరాల శక్తినీ, సార్వభౌమాధికారాన్నీ, గౌరవాన్నీ యధాతధంగా నిలుపుతామనే ప్రమాణమే వివాహం. పురాణాలలో చెప్పబడిన శ్లోక సారంశం ఇది - 
వివాహ ముఖ్యోద్దేశం - పస్పర ప్రేమమయ జీవితం గడుపుతూ, దేశానికి నీతివంతులైన, శ్రేష్ట సంతానాన్ని అందించడం. పిల్లలకు జన్మనిచ్చి వంశవృక్షాన్ని నిలపడమే వివాహానికి ముఖ్య ఉద్దేశం. ప్రేమలోని ఘాడతను గుర్తిస్తూ కుటుంబాన్ని ఆనందంతో, ఐక్యంగా ఉంచడం కోసమే వివాహం. ఇతరుల మంచికోసం ఆత్మసమర్పణా భావాన్ని కలిగి ఉండి, నిజమైన జీవిత గమ్యాన్ని చివరికి గుర్తించగలగడమే. యదార్ధానికి వివాహం యొక్క పవిత్రోద్దేశం. స్త్రీ పురుష వివక్షత అనే అసాంఘిక ద్రుష్టిని విడనాడాలి. పరిపూర్ణ మైన ఆనందమయ జీవితాన్ని పొందడానికి ఆధారాన్ని వివరించిన మంత్రసారం ఇది -

పరిపూర్ణమైన ప్రేమ, అభిమానాలతో కూడిన ఉత్తమమైన జీవితాన్ని మనం గడప గలగాలి. మన భావాలు పవిత్రంగా ఉండాలి. శత సంవత్సరాలు ఆరోగ్యకరమైన జీవితాన్ని చూస్తూ, వసంతఋతు సంగీతాన్ని వింటూ, జీవించగలగాలి. భార్యాభర్తల ఐక్యత, ప్రేమ, సాన్నిహిత్యాలే వారి ఆనందమయ వివాహ జీవితానికి ఆధారాలు. కనుక వివాహాన్ని శారీరక ఆనందాన్ని ఇచ్చేదిగా కాక, జీవితాంతం వుండే సాంఘిక, ఆత్మ సంబంధమైన బాధ్యతగా గుర్తించాలి. జీవిత భాగస్వాములైన ఇద్దరు వ్యక్తులకు ఆత్మ భాగస్వాములుగా ఎదిగే అవకాశం కల్పించేదే వైవాహిక జీవితం.


వధూవరుల మంగళవచనములు:
 • వరుడు: త్రిమూర్తుల దివ్యస్వరూపం. విధాత చూపిన విజయోన్ముఖపథంలో విజ్ఞతతో నడవటానికి ఉద్యుక్తుడైన సిద్ధ పురుషుడు
 • వధువు: లక్ష్మీ, సరస్వతి, పార్వతిల ఏకాత్మతా రూపం పచ్చదనంతో లోకాన్ని చైతన్యపరిచే ప్రకృతి యొక్క శక్తి స్వరూపం.
 • బాసికము: మానవుని శరీరంలోని నాడులలో ఇడ, పింగళ, సుఘమ్న అనే మూడు నాడులు ముఖ్యమైనవి. వీటిలో సుఘమ్న అనే నాడికి కుడివైపు సూర్యనాడి, ఎడమ వైపు చంద్రనాడి ఉంటాయి. ఇవి రెండూ కలిసే చోటు ముఖంలోని భ్రూమధ్యం. దీనిపై ఇతరుల దృష్టి దోషం పడకుండా వధూవరులకు ఈ స్థానాన్ని కప్పడానికి బాసికధారణ చేస్తారు.
 • అడ్డుతెర: దీనికి మరోపేరు తెరశెల్ల తెల్లని వస్త్రంపై శ్రీ (స్వస్తిక్) అని వ్రాయబడి ఉంటుంది. వధూవరులను తూర్పు, పడమరలకు అభిముఖముగా కూర్చోబెట్టి, మంగళ వాయిధ్యాల మధ్య, ముత్తయిదువులు మంగళగీతాలు మరొకవైపు ఆలపిస్తుండగా, వధూవరులచే మహా సంకల్పం చెప్పిస్తారు.
 • కన్యాదానం: కన్యాదాన సమయంలో విష్ణు స్వరూపుడైన నీకు (వరునకు) బంగారు ఆభరణముల చేత అలంకరించబడిన నా కూతురు (వధువు)ను సమర్పించుకుంటున్నాను అనే భావంతో ఈ శ్లోకం చేబుతాడు కన్యాదాత. కన్యాంకనక సంపన్నాం కనకా భరణైర్యుతామ్
దాస్వామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా:
జీలకర్ర - బెల్లం: ఈ జీలకర్ర బెల్లం అనేది ఒక పాసిటిమ్ ఎలక్ట్రిక్ చార్టర్. వధూవరుల పరస్పర ఆకర్షణకు లోనుకావడానికి వేద ఋషులు దీనిని నిర్ణయించారు. సహజీవనానికి నాందిగా నిలపడానికి మేధస్సును చైతన్యపరిచే ఈ జీలకర్ర బెల్లం తలపై పెట్టుకుంటారు.


మాంగల్యధారణ:
మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా,
కంఠేబద్నామి శుభగేత్వం జీవం శరదశ్శతమ్
అర్ధం: నా జీవితానికి మూలమైన, హేతువైన ఈ సూత్రమును నీ కంఠమున నేను కట్టుచున్నాను. నీవు నూరు సంవత్సరములు జీవించాలి అంటూ వరుడు మాంగల్య ధారణ చేస్తాడు.
నాతిచరామి: 'ధర్మేచ అర్ధేచ కామేచ త్యయేషా నాతిచరితవ్యా నాతిచరామి' ధర్మార్ధ కామములందు ఒకరికొకరు తోడుగా వుంటామని ఇద్దరు కలసి చేసే ప్రతిజ్ఞ "నాతిచరామి"

అక్షింతలు: అక్షింతల తోటే పెళ్ళికి సంపూర్ణత్వం చేకూరుతుంది. క్షతము గానివి, అక్షింతలు, అనగా ఎప్పటికి నిలిచేవని, అమరమైనవి అనేది వేదార్ధము, తెల్లని బియ్యానికి పసుపు కలిపి అక్షింతలు తయారుచేస్తారు. బియ్యం చంద్రుడికి సంకేతం. చంద్రుడు మన కారకుడు, వధూవరుల మనోభీష్ఠిని సుస్ధిరపరచే శక్తిని సిద్ధింపచేయడానికి చంద్రగుణానికి సంకేతంగా బియ్యాన్ని అక్షింతలుగా వాడడం మన ప్రాచీన సంప్రదాయం.

తలంబ్రాలు: పెళ్ళి పండుగలో ఇది ఎంతో వేడుక కలిగించే కార్యక్రమం. ఇందులో మొదటగా వరుడు "సమాజశ్రేయస్సు కుటుంబవృద్ధి కాంక్షించే ఉత్తమ సంతానాన్ని అందివ్వమని" దోసిలి ఎత్తి తలంబ్రాలు పోస్తాడు. అందుకు వధువు తలవంచి అంగీకరిస్తూ" వధువు "ఆ సంతానజీవన గమనానికి అవసరమైన పాడిపంటలను సమృద్ధిగా అందించమంటూ" తనవంతుగా తలంబ్రాలు పోస్తుంది. దానికి సమాధానంగా వరుడు "నేను అందించే ఆర్ధిక సంపదను అణకువగా, సమయోచితంగా వినియోగించమని" తిరిగి తలంబ్రాలు పోస్తాడు. ఆ తరువాత ఇరువురూ "త్యాగంతో, ధనంతో సహజీవనము సాగిద్దాము, బ్రతుకు బాధ్యతను సమానంగా పంచుకుందామని" ఒకరిపై ఒకరు వరుసగా తలంబ్రాలు పోసుకుంటారు. ఇవి వధూవరులకు ప్రమాణాలు, చూసేవారికి వేడుకలు.

సప్తపది - ఏడడుగలు: వధూవరులు నిలబడి ఒక్కో అడుగు వేస్తూ దైవశక్తి మంత్రములు పఠిస్తారు. ప్రణాళికా బద్ధంగా ప్రగతి శీలమైన జీవనము కొరకు అగ్నిసాక్షిగా సంకల్పం తీసుకుంటూ దైవా నుగ్రహం జీవితమంతా లభిస్తుందని భావిస్తూ ఏడడుగులు వేస్తారు.
 1. మొదటి అడుగు - అన్నవృద్ధికి
 2. రెండవ అడుగు - బలవృద్ధికి
 3. మూడవ అడుగు - ధనవృద్ధికి
 4. నాల్గవ అడుగు - సుఖవృద్ధికి
 5. ఐధవ అడుగు - ప్రజాపాలనకి
 6. ఆరవ అడుగు - దాంపత్య జీవనానికి
 7. ఏడవ అడుగు - సంతాన సమృద్ధికి
అరుంధతీ దర్శనము:ఈ భూగోళము ధ్రువము ఈ ఉత్పత్తి స్ధానము ధ్రువము. నీవు ధ్రువముగా ఉందువుగాక! నక్షత్రముల సమూహమున అరుంధతీవలె ధ్రువత్వమును పొంది వర్ధిల్లుము.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

ధర్మం - అధర్మమానికి మధ్య ఏమిటి తేడా ? - Dharmam vs Adharmam

Dharmam vs Adharmam
అన్నింటి కంటే ధర్మం సర్వశ్రేష్టమయినది.:

ధర్మం అన్నివేళలా ఒకేలా ఉండదు. అందరికీ ఒకే రకంగా ఉండదు. ఈ ధర్మ విషయంలో గొప్ప గొప్ప మేధావులు జ్ఞానులు తబ్బిబ్బులు పడుతుంటారు.

ఉదా:- ఒక ఇంటి యజమాని తన భార్యతో సంభాషించేటపుడు భర్త ధర్మము. అదే కుమారునితో ఉన్నప్పుడు తండ్రి ధర్మము, సోదరునితో ఉన్నప్పుడు సోదర ధర్మమము, తండ్రితో సంభాషించేటప్పుడు కుమార(పుత్ర) ధర్మం. స్నేహితునితో ఉన్నప్పుడు స్నేహధర్మం, కార్యాలయానికి వెళ్ళి పని చేయుచున్నప్పుడు ఉద్యోగ ధర్మం. ఇంటికి ఎవరైనా అతిథులు, పూజనీయులు, జ్ఞానులు వచ్చినప్పుడు గృహస్తాశ్రమధర్మం. వానప్రస్థాశ్రమం స్వీకరిస్తే వానప్రస్తధర్మం. అలా ధర్మం అనేది దేశ కాల పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మారుతుంది.
భారత యుద్దములో అశ్వద్ధామ ఉపపాండవులను నిద్ర పోతుండగా సంహరిస్తాడు. అపుడు అర్జునుడు వెళ్ళి అశ్వద్ధామను బంధించి, తీసుకొనివచ్చి ద్రౌపతికి అప్పగించినప్పుడు, తల్లి ద్రౌపతి ఏమంటుందో చూడండి, కడుపుకోతలో,పుత్రశోకముతో, విలవిల లాడుచున్న ద్రౌపతి, తన పుత్రశోకమునకు కారకుడైన అశ్వద్ధామను చూచి, గురుపుత్రా,విప్రోత్తమా, మీరు పాండవుల గురుపుత్రులు, పాండవులు వారి పరమ పూజ్య గురువుగారిని మీలో చూచు కొనుచున్నారు.

నాబిడ్డలు ఉపపాండవులు:
“ఉద్రేకంబునరారు, శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు, కించిత్ ద్రోమున్ సేయరు, నిద్రాసక్తుల చిన్నిపాపల సంహరింప నకటా నీచేతులెట్లాడేనో.”
ఉపపాండవులు చిన్ని పాపలు, నిద్రపోవుచున్న వారిని చంపడానికి, మీకు చేతులు ఎలావచ్చాయి.. నిన్ను బంధించిన వాడు అర్జునుడని, ఆసాద్ధ్వీమతల్లి గురుపత్ని ఎంత భయపడుచున్నారో, పుత్రశోకము, ఎలాంటిదో, ఎలాఉంటుందో నేను అనుభవించుచున్నాను, ఆ పుత్రశోకము గురుపత్నికి కలుగకూడదని, ఆ సాద్వీమతల్లిది ఎంత ధర్మవర్తనో చూడండి,
“ఒరులే యవి యొనరించిన నరవర, అప్రియము తనమనంబునకగు, తా నొరులకు నవి సేయకునికి పరాయణ పరమధర్మపధములకెల్లన్.”

ప్రవర్తించకుండా ఇతరులు మనపట్ల ఎలా ప్రవర్తిస్తే మనకు బాధకలుగుతుందో,అలాంటి పనులు, ప్రవర్తన, మనము ఇతరులపట్ల, చేయకుండా ఉండడముకంటే గొప్పధర్మము వేరొకటిలేదు. అని ధర్మవిషయము లను వివరించి,అశ్వద్దామను తీసుకెళ్ళి గురుపత్నికి అప్పగించమని పాండవులను శ్రీ కృష్ణుని ప్రార్తిస్తుంది. చూచార అంతటిబాధలో అంతటి కడుపుకోత అనుభవించుచూ కూడా ధర్మమే మాట్లాడింది తల్లి ద్రౌపతీ అమ్మవారు .

శ్రీ రామచంద్రమూర్తి రావణాసురునితో యుద్ధము చేయునప్పుడు రావణాసురుడు బాగా అలసిపోయాడు, ఆ సమయానికి యుద్ధవిరామ సమయము కూడా కావడముతో, శ్రీ రాముడు రావణా ఈరోజువెళ్లి రేపురా అని యుద్ధ విరామము ప్రకటన చేస్తాడు శ్రీ రామచంద్రుడు. ఎందుకనగా, ఈ రాత్రికైన రావణాసురునికి జ్ఞానోదయమైతే రావణాసురుడు బ్రతికి సీతమ్మ వారిని రాములవారికి అప్పగించి, శరణార్ది నంటాడేమో అని, శ్రీరామచంద్రులవారు ఒక్క అవకాశమిచ్చాడు. అదే ధర్మము. తన భార్యను అపహరించిన వానికి కూడా, మారడానికి, తనతప్పును తను తెలుసుకోవడానికి, అవకాశ మిచ్చి ధర్మమునకు నిలబడిన, మహాపురుషుడు శ్రీరామచంద్రమూర్తి. అందు కొరకు రామాయణము, మహాభారతము,భాగవతము చదవాలి చదివిచాలి, వినాలి వినిపించాలి మనపిల్లలకు మనవారసత్వ సంపదగా అందివ్వాలి. ధనము,బంగారము, భూములు సంపదలుగా ఇచ్చినా అవి వారి జీవితకాలము శాస్వితముగా ఉంటాయన్న గ్యారంటీ లేదు. కానీ మన సంస్కృతి సంప్రదాయములు సనాతనధర్మములు భగవద్భక్తి ఇంతవరకు ఎవరినీ పాడుచేసిన ధాకలాలు లేవు.

ఆపద్ధర్మం ఉంది చూశారూ, జీవితం నడవడం కష్టమయినప్పుడు, సత్కర్మకు దోషం కలుగకుండా, ఏ పని చేసినా దోషం లేదు. అది ధర్మ విరుద్ధం కాదు. కానీ నిరంతరం ఆపద్ధర్మాన్ని అనుసరించడం ఆశ్రయించడం కూడదు.

ధర్మమార్గమున ఏది లభించినా పరమ ప్రీతితో స్వీకరించాలి.

మానవునికి నిద్రరాకపోవడానికి విదురుల వారు నాలుగు కారణములు చెప్పినారు.
 1. బలవంతులతో వైరం తెచ్చుకున్నా,
 2. పరుల సంపదను అపహరించినా,
 3. పరుల సంపదలను అపహరించాలనుకున్నా, పరుల సంపాదనను, సంపదను చూచి ఈర్ష్య చెందినా,
 4. పరస్త్రీని పొందుకోరుకున్నా,
ఈ నాలుగు కారణములు తప్ప నీతి శాస్త్రములో మానవ మాత్రులకు రాత్రి యందు నిద్రపట్టక పోవడానికి వేరు కారణాలు చూపలేదు.

మూర్ఖుల లక్షణాలు:-
 • అహంకారం, 
 • విద్యాశూన్యత, 
 • వివేకహీనత,
 • ఏ పనీ చేయకనే (శ్రమ పడకుండా) ఫలమాసించుట, 
 • దరిద్రంలో మునిగి తేలుతూ ఆకాశానికి నిచ్చెనలు వేయుట, 
 • ఊహలలో జీవించుట, 
 • శత్రువులను స్నేహితులుగా భావించుట, 
 • అడుగక పోయినా వచ్చి సలహాలిచ్చుట, 
 • ఎల్ల వేళలా ఎదుటివారిలో దోషముల కొరకు వెతుకుట, 
 • అకారణ క్రోధము, 
 • కలహములు ప్రోత్సహించుట, 
 • విషయ పరిజ్ఞానములేక భాషించుట, 
 • ధర్మాధర్మ విచక్షణ లేకుండుట, పరస్త్రీ వ్యామోహము, 
 • నిర్దయ,పరధనాపేక్ష, 
 • నిత్యమూ అనృతములు భాషించుట, 
 • దైవ దూషణము ఇత్యాది లక్షణ సంపన్నులు.
మోక్షదాయకములు:-
 • ధర్మము, 
 • నీతి రెండూ ఎప్పుడూ కలిసే నడుస్తుంటాయి.
 • నిరంతరం ఏదో కృషి చేస్తూ, 
 • సాత్విక స్వభావముతో సహన శీలతతో, 
 • నిశ్చల ధర్మదీక్షతో ఉండేవారు, 
 • ఎప్పుడూ సత్ఫలితాలనే పొందుతారు. 
 • వీరినే విద్వాంసులు అని అంటారు.
నీతి విషయములు:
ప్రజా రక్షణ చేయలేని ప్రభువు, నిరంతరం పరుషంగా భాషించే భార్య, విద్య నేర్పలేని గురువు, వనవాసం మీద ఆసక్తి చూపే వ్యాపారి వీరు ఎందుకు కొరగారు.
 • ఆరోగ్యము, 
 • ధర్మార్జనతో, 
 • ధర్మముతో కూడిన సంపదలు, 
 • అనుకూలవతి ఐన అర్థాంగి, 
 • చెప్పిన మాట వినే తనూభవుడు,
 • జీవన ఉపాధికి పనికి వచ్చే విద్య, 
 • చక్కని సలహాలిచ్చే స్నేహితుడు, 
 • ప్రపంచ శాంతి నాసించే శాంతి కాముకులు, 
 • పరోపకారాభిలాషులు వీరు సుఖంగా బ్రతుకగలుగుతారు.
సుఖ దుఃఖములు అనుభవించే జీవితం ఆశాశ్వతమైనదే, శాశ్వతమైనది ధర్మం ఒక్కటే.
“క్షీణే పుణ్యే మర్స్యలోకం విశంతి”
దేవతల యొక్క పుణ్యం ఖర్చు అయిపోతే వారు కూడా భూమి మీద వచ్చి పడిపోతారు.

రామాయణంలో హనుమ:-
“శతకృతుని వాసేనం నాగరాజస్య మూర్థనీ”అంటే భూమి మీద ఉన్న మనిషి, సరైన కర్మానుష్టానము చేసి ధర్మమమును పట్టుకొని ఆచారాన్ని పట్టుకొంటే తాను దేవత కాగలడు . దేవరాజు (దేవేంద్రుడు) కాగలడు.
శిష్టాచారము:-
వేదము పరమేశ్వర ప్రోక్తము (అపౌరిషేయము) వేదము భగవంతుని చేత చెప్పబడినది. వేదము చెప్పిన విధముగా వేద సమ్మతముగా నడచిన, అనుష్టించిన ధర్మమే, ధర్మము. అంతే కానీ మనకు ఇష్టం వచ్చిన రీతిలో మనకు అనుకూలంగా చేయడం ధర్మం కాదు.
కాలము రెండు కాళ్ళ మీద నడుస్తుంది.

సంవత్సరము.
రెండు ఆయనము పూర్తి అయితే సంవత్సరము.
 1. ఉత్తరాయణము:- పొందవలసిన మార్గము పొందుటకుమంచి కాలము.
 2. దక్షిణాయనము:- అనుష్టానములకు సంబందించి అనుకూలమైన కాలము(పవిత్రమైన కాలము)గణపతి నవరాత్రు లు,శారదా నవరాత్రులు, శ్రావణ మాసంలో మహాలక్ష్మీ అమ్మవారి సేవలు, నోములు వ్రతాలు అన్నీ ఈ ఆయనములో ఉంటాయి.
 3. ఆయనములలో ఋతువులు. ఋతువులలో మాసములు, మాసమూలలో పక్షములు, పక్షములలో రోజులు, రోజులో పగలు రాత్రి. రోజు అనుష్టానములో రాత్రి ఉండదు. రాత్రి పడుకునే అంత వరకు మాత్రమే అనుష్టానము.
ఆచారము=చరతి=అలాకదులుట. ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలాకాదలాడుట.
“ఆచారవ లభతే ధర్మం”
 • ఎప్పుడైతే ఆచారాన్ని పాటిస్తావో అప్పుడు ధర్మం అలవడుతుంది.
 • ఎప్పుడైతే ధర్మాన్ని పాటిస్తావో అపుడు మనకు తెలియకుండానే భగవంతుని వైపుకు మనము తిరుగుతాము.
 • ధర్మమము అనగా కాలము+దేశముతో ముడిపడి ఉండేదే ధర్మం.
 • ధర్మానుష్టానములో ఎప్పుడు కానీ సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలలో పడుకొనరాదు నిద్రించరాదు. భగవదారాధనకు అనుకూలమైన కాలము.
ప్రాతః సంధ్య:- సూర్యోదయమునకు 88 నిమిషముల ముందు ఉన్నకాలము. పరమ యోగ్యమైన కాలము. బ్రహ్మ ముహూర్తము.

ఉత్తర సంధ్య:- ప్రదోషకాలము. పడమటి సంధ్య వేళలో ఎలా ఉన్నాపడుకోరాదు. అనారోగ్యముతో ఉన్నా కనీసం పదినిమిషాలు కూర్చోనాలి.
“వృషీశ్వర యానంబున సంచరించుటది అభావ్యంబయ్యే”
ఉత్తర సంధ్యా సమయములో పరమశివుడు వృషభ వాహనము మీద తిరుగుచుంటాడని ఈ సమయంలో కేవలం భగవన్నామస్మరణ సంకీర్తన మాత్రమే చేయాలని దితితో కశ్యపుల వారు చెప్పిరి.

శివకేశవ బేధము:-
“శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే
శివశ్చ హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః”
“యధాశివమయో విష్ణురేవం విష్ణుమయ శ్శివః
యధాంతరం నవశ్యామి తధామేస్వ స్టిరాయుషి”
పగలుకు విష్ణువు, రాత్రికి శివుడు అధినాయకులు.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి