నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

- ఆర్ఎస్ఎస్ -

ఆర్ఎస్ఎస్
సనాతన ధర్మం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సనాతన ధర్మం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, మే 2020, ఆదివారం

భక్తుడికి, భగవంతుడికి మధ్య అనుసంధాన గంధం - Bhaktuni, Bhagawantumi, Anusandhanam, Link between God and human

భక్తుడికి, భగవంతుడికి మధ్య అనుసంధాన గంధం - Bhaktuni, Bhagawantumi, Anusandhanam, Link between God and human
క్తుడికి, భగవంతుడికి మధ్య అనుసంధానం అనేది అత్యంత ప్రధానమైనది. అనుసంధానంలేని సాధన వ్యతిరేక దిశల్లో పయనిస్తున్న రెండు మనసులవంటిది. అవి ఎన్నటికీ కలవవు. అలాగే ఎన్ని తీవ్ర సాధనలు చేసినా భగవంతునితో అనుసంధానం కుదరనప్పుడు అదంతా వృథా ప్రయాస అవుతుంది. చిరునామా లేని ఉత్తరంలా, గమ్యంలేని పయనంలా అగమ్య గోచరం అవుతుంది.

అనుసంధానం కలిగి ఉండటమంటే-'నేను నీ వాణ్ని. నీకోసమే ఉన్నవాణ్ణి. నీకై నన్ను నేను 'మీదు' కట్టుకున్న వాణ్ని. నా సాధన, నా శోధన, నా వేదన అన్నీ నీ కోసమే' అనే భక్తుని ఉద్దేశాన్ని, ఆవేశాన్ని, ఆర్తిని, హఠాన్ని భగవంతుని వరకూ చేర్చాలి. గర్భస్థ శిశువు తల్లిపేగుతో అనుసంధానమై ఉన్నట్లు సాధకుడు తన ఇష్టదైవంతో సదా కలిసివున్న భావనతో ఉండాలి. ఆ భావన ఆయనకూ కలిగించాలి. ఆయనను అనుసంధాన తంత్రిలోకి తెచ్చుకునే వీలుకై ప్రయత్నించాలి. మనకు, ఆయనకు మధ్య ఇరువురినీ కలిపే ఒక బంధనాన్ని, ఒక మాధ్యమాన్ని సృజించుకోవాలి. ఒక తంత్రిని బిగించుకోవాలి. ఏమిటా తంత్రి? ఎలాంటిదా మాధ్యమం? ఆయనతో మన మనసును అనుసంధించటమే. అంటే కలపటమే. సదా సంధించి ఉంచటమే. అందరూ, ముఖ్యంగా ప్రారంభ సాధకులు దైవంతో మనసును కలపటం అంత సులభమా? కాదు. నిజమే. అందుకే కొన్ని బాహ్య వస్తువుల సాయం తీసుకోవాలి. పసుపు, కుంకుమ, కుంకుమ పువ్వు, గంధం, గరిక లాంటివి భగవంతునితో అనుసంధానానికి ఎంతో ఉపయోగపడతాయి. అయితే ఈ బాహ్య వస్తు జాతాలకంటే మనసును అనుసంధానిస్తే అంతకుమించిన ఉత్తమ అనుసంధాన సాధనం మరోటి ఉండదు. ఇందుకోసం బాహ్యవస్తు సహకారం తీసుకున్నా కేవలం వాటిమీదే ఆధారపడకుండా మనసును పదేపదే ధ్యేయ వస్తువు మీద లగ్నం చేస్తూ సాధన చేయాలి.

మూడు ముళ్ల బంధంతో భార్యాభర్తలు అనుసంధానమై ఉంటారు. బిడ్డ ఎక్కడున్నా, ఎంతదూరాన ఉన్నా తల్లితో అనుసంధానమయ్యే ఉంటాడు. విడదీయలేని ఆ అనుసంధాన గ్రంధి బిడ్డకు జీవితాంతం పిచ్చుక కాలికి దారం కట్టినట్లు తల్లితో తీయని బంధాన్ని కలిగి, శ్రీరామ రక్షగా నిలిచి ఉంటుంది. అనుక్షణం ఇలాంటి ప్రియమైన, ఇంతకంటే బలీయమైన అనుసంధానాన్ని కలిగి ఉండాలి సాధకుడు భగవంతుడితో.

మనసును మరెక్కడో ఉంచి ఎంతగా బాహ్యవస్తు సాయం తీసుకున్నా సాధన, మనసు తలోదారిగా మారి ఎన్నడూ కలవని భిన్న ధ్రువాలైపోతాయి. అనుసంధానం అనే ప్రక్రియ గర్భస్థ శిశువుకు తల్లిలా అనుక్షణం రక్షణ కవచంలా ఉంటుంది. సాధనా ప్రక్రియ- నుంచి వైదొలగకుంటే, మార్గాయాసం లేకుండా గమ్యం చేరటం సాధ్యమవుతుంది. అమ్మ కళ్ళలోకి చూస్తూ స్తన్యం గ్రోలుతున్న బిడ్డలా- భక్తుడు భగవంతుని అనుసంధాన గంధాన్ని ఆహ్వానిస్తూ, ఆయనతో స్నేహ సౌరభాన్ని ఆస్వాదిస్తూ నిర్భయంగా, తృప్తిగా, ఆనందంగా జీవన ప్రస్థానం సాగిస్తాడు.

రచన: చక్కిలం విజయలక్ష్మి

14, మే 2020, గురువారం

హనుమంతుడు వివరించిన " భక్తి రహస్యము " - Hanuman, Anjaneyudu, Bhakti Rahasyamu

హనుమంతుడు వివరించిన " భక్తి రహస్యము " - Hanuman, Anjaneyudu, Bhakti Rahasyamu
శ్లో||  హరిః ఓం|| వాచకః ప్రణవోయస్య క్రీడా వదఖిలం జగత్‌
       శ్రుతివాఙ్మానసాతీతం వందే దేవకీ సుతమ్‌ ||
భక్తి : అఖండమైయున్న సత్య వస్తువు భ్రాంతి వలన నానాత్వముగా గోచరించుచుండగా, విభక్తమైన వ్యష్టి జీవుడు, తిరిగి సమష్టి రూపమైన ఈశ్వరునియందు స్నేహ భావముతో దగ్గరై సుఖమునందుటను భక్తి అందురు. ఈ విధముగా భ్రాంతి రహితమై అఖండ సహజ స్వరూపమైన పరమాత్మ లక్షణముగా ఉండిపోవుటను పరాభక్తి లేక మోక్షము అందురు.

ప్రపత్తి : భగవంతునిపై విశ్వాసముతో తన భారమును ఆయనపై ఉంచినట్టి శరణాగతి, అంతా భగవదేచ్ఛ నాది అనేదేమీ లేదు అని నిశ్చింతగా యుండుటను ప్రపత్తి అందురు. కైంకర్యమే ప్రపత్తి.
 •  ప్రపర్ణులు : భక్తులు
 •  నాయనారులు : శివ భక్తులు
 •  ఆళ్వారులు : విష్ణు భక్తులు
 •  భాగవతోత్తముడు : దేవునికి చెందినవాడు. భగవదనుభూతి పొందివాడు. భగవంతునితో సమానమైనవాడు.
 •  శేషి : భగవంతుడు
 •  శేష భూతులు : భగవంతుని చేతిలో ఆయన కార్యక్రమము నిమిత్తము ఆయనకు పనిముట్టుగా నున్నవారు.
 •  దేవుడు : స్వయముగా ప్రకాశించుచూ వ్యాప్తమైయున్నవాడు. అది నిరుపాధికమైన ఆది మధ్యాంత రహితమైన జ్ఞాన ప్రకాశ రూపము.
 •  వాసు దేవుడు : అన్నిటియందు తాను వశించుచు, అన్నిటినీ ప్రకాశింప జేయుచూ, అన్నీ తనయందే వసించుచుండగా, తాను మాత్రము స్వయం ప్రకాశరూపుడైనవాడు. సర్వమును ప్రకాశింపజేయుచు, వ్యాప్తమై యున్నవాడు.
 •  భగవంతుడు : భగములు కలవాడు భగవంతుడు. భగము అనగా జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, శ్రీ, యశస్సు, ఆనందము అను ఆరు లక్షణములు.
 •  షడ్గుణైశ్వర్యుడు : జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, శ్రీ, యశస్సు, ఆనందము అనే ఆరు లక్షణములు కలవాడు.
 •  దేవతలు : ఈశ్వర చైతన్యము యొక్క విభూతులే దేవతలు. ఆ చైతన్యము యొక్క ఒక్కొక్క తరంగము ఒక్కొక్క దేవతగా పిలువబడును.
 •  వైశ్వ దేవులు : ఏ పరమాత్మ చైతన్యము ఈ విశ్వమంతా విరాజమానమై చిత్కళలుగా వెలుగొందుచున్నదో, ఆ కళలే వైశ్వ దేవులు.
 •  సురులు : మంచిని తీసుకొనుచు, మంచి స్వభావులుగా ఉన్నవారు దేవతలు.
 •  అసురులు : చెడును తీసుకొనుచు, చెడు స్వభావులుగా ఉన్నవారు రాక్షసులు.
 •  శివ : శుభము, మంగళము, శాశ్వతమైన స్థిరత్వముగా నున్నవాడు అనగా జ్ఞాన స్వరూపుడు.
 •  శంకర : శుభమును, కైవల్యమును చేకూర్చువాడు
 •  రుద్ర : రుత్‌+ద్ర = దుఃఖమును నశింప జేయువాడు
 •  పరమేశ్వర : సృష్టికి మూలాధారము
 •  మహేశ్వర : సర్వ భూతాంతర్యామి, సర్వ ప్రాణాధిపతి
 •  ఈశ : సర్వ స్వతంత్రుడు, ప్రభువు అయిన కేవలాత్మ, పరమాత్మ
 •  అగ్నిహోత్ర : ప్రాణుల శరీరములలో అగ్ని రూపముగా ప్రకాశించే ఆత్ముడు.
 •  సప్త జిహ్వలు : పంచ వాయువులు, మనస్సు, బుద్ధి. ఈ ఏడు అగ్ని హోత్రుని సప్త జిహ్వలు.
 •  విఘ్నేశ్వర రూపము : మనోసాధన, అంతఃసాధన, ప్రాణ క్రియాసాధన, జీవసాధన, ఆత్మ సాధన అనెడి పంచ సాధనలలో పంచ విధములగు విఘ్నములు కలుగును. వాటిని తొలగించుకొనే సాధన చేసి భగవత్సాక్షాత్కారము పొందవలెను. ఈ సాధన పంచకమే విఘ్నేశ్వర రూపము.
 •  ప్రజాపతి : జీవాత్మలు అనెడి అనేకత్వమునకు ప్రభువు.
 •  హృషీకేశ : హృషీకములనగా ఇంద్రియములు. ఈశ అనగా ప్రభువు. ఇంద్రియములను జయించియున్న ప్రభువే హృషీకేశుడు.
 •  గోవింద : జీవులను లేక భూమిని ఉద్ధరించువాడు
 •  విష్ణువు : కేవల చైతన్య వ్యాపకత్వము, సర్వమూ తానై సర్వముగా వ్యాపించియున్న పరబ్రహ్మ. మొదటిది చేతనాంశము. రెండవది ఆభాసాంశము.
 •  వైకుంఠము : కుంఠితము కానిది. అనగా దోషములు లేనిది. మోక్ష ధామము.
 •  హరి : ఇంద్రియోన్ముఖమైన వృత్తులను హరింపజేయువాడు.
 •  నారాయణ : న+అరాః+అయన = దోషములు లేని నిలయము = త్రిగుణ దోషములు లేనిది = మోక్షము = పరబ్రహ్మ.
 •  మాధవుడు : మా+ధవుడు = లక్ష్మి+పతి = లక్ష్మీపతి, ప్రకృతి+ప్రభువు=  ప్రకృతిని జయించిన పురుషుడు.
 •  రామ : విశుద్ధ సత్వము వలన కలిగిన ఆనందము, తనలో తాను రమించువాడు. ఇతరులను రమింపజేయువాడు కూడా.
 •  ఆత్మా రాముడు : తనలో తాను రమించు ఆత్మ స్వరూపుడు.
 •  దుర్గ : దుర్లభమైనది, అతి కష్టము చేతనే పొందదగినది. దుర్గతి నుండి రక్షించునది అనగా సద్గతిని కలిగించునది.
 •  సరస్వతీ : స+రసవతీ= విద్యలన్నింటిలోను సారము, రసము అయిన విద్యా రూపము. ఆధ్యాత్మిక విద్యా రూపమును జ్ఞాన సరస్వతి అందురు.
 •  శ్రీ : విష్ణువు నుండి వెలువడి, జీవజగత్తులను ఆక్రమించిన చైతన్య ప్రకాశము, మోక్షమనే సంపదనిచ్చునది. శ్రీ అనగా శక్తి త్రయము. నిర్గుణ పరమాత్మను సగుణముగా చూపే శక్తి.
 •  లక్ష్మీ : జీవులలో వ్యాపించియున్న చైతన్య ప్రకాశము. జీవులలో ఆత్మగా పిలువబడే విష్ణుసాన్నిధ్యమునకు గొనిపోవునది. లక్ష్యమును సిద్ధింప జేయునది లక్ష్మీ. ఈ లక్ష్మీ యనునది మొదట మంచితనము వలన కలిగి పెద్దరికము వలన పెరిగి దక్షత వలన పాదుకొనునది. నిగ్రహము కారణముగా నిలిచియుండి లక్ష్య సిద్ధి కలిగించును.
 •  లక్ష్మీదేవి మెచ్చే గుణములు : గురు భక్తి, దేవ పితృ పూజలు, సత్యమును పలుకుట, దానశీలత, పరధన పరదారలను కోరకుండుట, నిజ బ్రాహ్మణ భక్తి, పగటిపూట నిద్రించకుండుట, వృద్ధులను, పేదలను, బలహీనులను, స్త్రీలను ఆదరించుట, శుచి, అతిధులకంటే ముందుగా భుజించకుండుట, వారు తినగా మిగిలినది తినుట మొదలగునవి.
 •  లక్ష్మీదేవి మెచ్చని గుణములు : ధర్మమును వదలుట, అరిషడ్వర్గమునకు లోబడుట, బలి బిక్షలు పెట్టకుండుట, గర్వము, క్రూరత్వము దురుసుగా మాట్లాడుట మొదలగునవి.
 • ⭄ లక్ష్మీదేవిని వృద్ధి పొందించుట : బుద్ధి, ధైర్యము, నీతి, శ్రద్ధ, వినయము, ఓర్పు, శాంతి, మరియు ఎనిమిదవదైన లక్ష్మీదేవి. ఈ దేవతలు లక్ష్మీని వృద్ధి చెందించును. లక్ష్మీ దేవినే శ్రీ అని, భూతి అని కూడా అందురు.
కృష్ణ:
 • కృష్‌+ణ = ఎల్లప్పుడూ ఉండునది+ఆనంద రూపము=సదానంద రూపము.
 • కృష్‌+ణ= భూమి + నివృత్తి = ఐహిక భోగ నివృత్తి = మోక్షము, పరబ్రహ్మ
 • కృష్‌ అనగా కర్షణ శక్తి, తనలోనికి ఆకర్షించుకొనుట అనెడి కర్షణ శీలి. అనగా భక్తులకు తనతో ఐక్యతను ప్రసాదించేవాడు.
 • ఆరాధన : రాధ్‌ అనగా తృప్తి. ఆరాధ్‌ అనగా తృప్తిపరచుట. ఆరాధన అనగా భగవంతునికి ప్రీతి కలిగించుట. రాధ అనగా భగవత్ప్రేమ స్వరూపిణి.
 • భరత : ప్రకాశము, జ్ఞానముల పై రతి, లేక ఆసక్తుడైయున్నవాడు. జ్ఞాన విషయములో ఆసక్తమైయున్న దేశము భారత దేశము.
 • ముప్పది మూడు కోట్ల దేవతలు : అష్ట వసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, ఇంద్రుడు, ప్రజాపతి కలిసి ముప్పది మూడు. వారి వారి గణములతో కూడి ముప్పది మూడు కోట్ల దేవతలు.
పంచాయతనము లేక పంచ మూర్తులు :
 • 1. స్వర్ణముఖీ నదిలో అమ్మవారి శిలలు
 • 2. కొండలలోని స్పటికములనుండి సూర్య భగవానుని రూపములు
 • 3. నర్మదానదిలో శివలింగములు
 • 4. గండకీ నదిలో విష్ణు సాలగ్రాములు
 • 5. గోమతీ నదిలో వినాయకుని శిలలు
 • పంచామృతము : ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయి, తేనె, నారికేళ జలము (లేక నీరు)
 • పంచగవ్యము : గోవుకు సంబంధించిన పాలు, పెరుగు, నేయి, పేడ, పంచితము (మూత్రము)
విభూతి :
1. గోమయమును భస్మము చేయగా వచ్చినది.
2. రావి, మోదుగ పుల్లల భస్మము
విభూతి యొక్క పవిత్రత, విభూతి ధారణ ఫలితములు : గోమయ భస్మమునకు ఐదు పేరులు.
 • 1. విభూతి : ఆధ్యాత్మిక శక్తినిచ్చును గనుక విభూతి యని పేరు. సద్యోజాత - ఐశ్వర్యము నిచ్చును, సద్యోజాతము నుండి భూమి, భూమి నుండి నిర్వృత్తి. నిర్వృత్తి నుండి కపిల వర్ణముగల నంద అనే గోవు పుట్టెను. ఆ గోవు  యొక్క గోమయము నుండి విభూతియను భస్మమును చేయుదురు.
 • 2. భస్మము : సర్వ పాపములను దహించునది గనుక భస్మము అని పేరు. అఘోర - పాపహరణ చేయును. అఘోర నుండి అగ్ని, అగ్ని నుండి విద్య, విద్యనుండి రక్త వర్ణము గల సురభియను గోవు పుట్టెను. దాని గోమయము నుండి భస్మమును చేయుదురు.
 • 3. భసితము : బోధ అనగా జ్ఞానమును కలిగించునది గనుక భసితము అని పేరు. వామదేవ - తేజోవంతము చేయును. వామదేవ నుండి నీరు, నీరు నుండి ప్రతిష్ఠ, ప్రతిష్ఠ నుండి కృష్ణ వర్ణముగల భద్ర అనే గోవు పుట్టెను. గోమయమునుండి భసితమును చేయుదురు.
 • 4. క్షారము : ఆపదలను పోగొట్టును గనుక క్షారము అని పేరు. తత్పురుష - పాపహరణము చేయును. తత్పురుష నుండి వాయువు, వాయువు నుండి శాన్తి, శాన్తి నుండి శ్వేత వర్ణముగల సుశీల అనే గోవు పుట్టెను. దాని గోమయమునుండి క్షారమును చేయుదురు.
 • 5. రక్ష : భూత, ప్రేత, పిశాచ, బ్రహ్మ రాక్షసులు, అపస్మారకము, సంసార భయముల నుండి రక్షించునది గనుక రక్ష అని పేరు. ఈశాన - సంసార భయనాశనము చేయును. ఈశాన నుండి ఆకాశము, ఆకాశము నుండి శాంత్యాతీతము, శాంత్యాతీతము నుండి చిత్ర వర్ణముగల సుమన అనే గోవు పుట్టెను. దాని గోమయ భస్మమే రక్ష అని పేరు గలది అయ్యెను.
 •          (సద్యోజాత, అఘోర, వామదేవ, తత్పురుష, ఈశానులు ఐదును మహేశ్వరుని యొక్క పంచరూపములు. నిర్వృత్తి, ప్రతిష్ఠ, విద్య, శాన్తి, శాన్త్యాతీతములనెడివి పంచ కళలు)
 •               గోవు సర్వ దేవతామయము. గోమయము శక్తిమంతము. శివుడు సృష్టించిన జగత్తులో ద్వంద్వములతో కూడిన భ్రమ ఉన్నది. శివుడనగా జగద్విషయక అగ్ని రూపము. విభూతి ద్వంద్వరూప భ్రమను భస్మము చేయగల శక్తి గలది. అగ్ని - విభూతిల కలయిక శివ-శక్తుల కలయిక. కనుక విభూతి ధారణ వలన శివక్త్యైక్యము సిద్ధించును గనుక అది పవిత్రము.
శ్రీ మహా విష్ణుతత్త్వమును ఎరిగినవారు : 
 •  1. మహేశ్వరుడు 
 •  2. ప్రజాపతి 
 •  3. కుమార స్వామి 
 •  4. కపిలుడు 
 •  5. నారదుడు 
 •  6. భీష్ముడు 
 •  7. మనువు 
 •  8. బలి 
 •  9. జనకుడు 
 • 10. ప్రహ్లాదుడు 
 • 11. వ్యాసుడు 
 • 12. శుకుడు. ఈ పండ్రెండు మందికే పూర్తిగా తెలుసునని ప్రతీతి.
భగవద్గీతను అప్పటికప్పుడు విన్నవారు :
 • 1. కర్మ రంగములో పరిణతి పొందిన అర్జునుడు. తనలోని రజోగుణమును శుద్ధపరచుకొని అజ్ఞానావరణను తొలగించుకొనెను.
 • 2. పూర్తిగా తమో గుణములో మునిగియున్న ధృతరాష్ట్రునికి మమకార వ్యామోహములకు కారణమైన పుత్రులు, రాజ్యము వదలిపోయినవి.
 • 3. సాకార నిష్ఠలో ఇష్టదైవమును దర్శించిన ఆంజనేయుడు, నిరాకార తత్త్వములో విలయమయ్యెను.
 • 4. దివ్య దృష్టితో తెలుసుకున్న జితేంద్రియుడైన సంజయుడు ధృతరాష్ట్రునికి బోధించుటకు వినియోగించెను.
 • 5. సర్వజ్ఞుడైన వ్యాసమహర్షి భగవద్గీత అమూల్య సందేశమును మహా భారతములో పదిలపరచి, భావి తరములకు అందించెను.
 • దేవతలు వశమగు విధము : భక్తి, బలి, నమస్కారము, హోమము, మంత్రము, యజ్ఞముల వలన వశమగుదురు. సాహసము, ఎదురించుట వలన వశము గారు
 • మంత్రము : దైవమును, ఆత్మను తెలియజేయునది.
 • మంత్రార్థము : దైవమనగా, లేక ఆత్మయనగా ఏమి అర్థమో దానిని తన లక్ష్యముగా తెలియుట.
 • మంత్రాతీతము : ఎవరు తెలుసుకొను ప్రయత్నము చేయుచున్నారో, వారు లేకుండా పోయి, దైవముగాని ఆత్మగాని స్వతస్సిద్ధమై యుండుట.
 • శ్రీ దక్షిణామూర్తి : జ్ఞాన స్వరూపుడు
 • శ్రీ దత్తాత్రేయులు : బోధ స్వరూపుడు
 • శ్రీమన్నారాయణ : మోక్ష ప్రదాత
 • శ్రీ సూర్య భగవానుడు : ఆరోగ్య ప్రదాత
 • శ్రీ గాయత్రీ మాత : వేదమాత
అత్రి అనసూయ పుత్రులు :
1. బ్రహ్మ ఆశీస్సులతో సోముడు
2. శివుని ఆశీస్సులతో దుర్వాసుడు
3. విష్ణువు ఆశీస్సులతో దత్తాత్రేయులు జన్మించిరి. వీరిలో దత్తాత్రేయులు మాత్రమే త్రిమూర్తుల లక్షణములన్నీ కలిగియుండెను.

శమంతక పంచకము :
పరశురాముడు మదోన్మత్తులైన క్షత్రియులను 21 పర్యాయములు దండెత్తి సంహరించెను. వారి రక్తమును 5 మడుగులలో ఉంచి పితృ తర్పణము చేసెను. పితృ దేవతలు శమించి, వారు పరశు రాముని శమించని కోరగా అతడు శాంతించెను. అందువలన ఈ 5 మడుగులకు శమంతక పంచకమని పేరు కలిగెను. ఈ ప్రాంతమునకే కురుక్షేత్రమని పేరు. అధర్మాన్ని శిక్షించి, ధర్మాన్ని రక్షించుట కొఱకు కురుక్షేత్రమే యుద్ధ క్షేత్రముగా శ్రీకృష్ణ పరమాత్మచే నిర్ణయించబడెను.

ఇష్టా పూర్తములు : 
 • ఇష్టములనగా అగ్ని హోత్రాది శ్రౌత కర్మలు. యజ్ఞ యాగాదులు, సహస్రానామార్చనలు, ఏకాగ్ర చిత్తముతో పరమాత్మను హృదయపూర్వకముగా ఆరాధించుట, పూజించుట మొదలగునవి.
 •          పూర్తములనగా బావులు, చెరువులను త్రవ్వించుట, శుభ్రము చేయుట, త్రాగునీటి వసతి, వైద్య వసతి సహాయములను అందించుట. అనగా సహజీవుల సౌఖ్యము కొఱకు చేసే కర్మలు. వీటిని నారాయణ సేవగా సర్వమూ భగవత్స్వరూపమేనని చేసే కర్మలు. భక్తుని చిత్తము పవిత్రమగును. స్వార్థము పోయి సమష్ఠి భావమును పొందును. ఇష్టా పూర్తముల వలన ఇహలోక పరలోక సుఖములు కలుగును. అందుకొఱకు పునర్జన్మ తప్పదు. ఈ సత్కర్మలు సత్త్వగుణమును పెంపొందింపజేయును.
అవతారముల విశిష్టత :
 • 1. రామాయణ భాగవతములలో నారాయణుడు అవతరించి, నరుణ్ణి ఉద్ధరించెను. ఇవి నారాయణుని చరిత్రలు.
 • 2. భారతములో నారాయణుడు అవతరించి తన శక్తి వలన, తన సారధ్యము వలన నరుడే శక్తిని పుంజుకొని, నారాయణుని స్థాయికి ఎదిగి తరించెను. ఇది నరుని చరిత్ర.
అవతార సంభవము :
 • పూర్వ సృష్టిలోని ప్రాణుల కర్మభోగములనిచ్చుట కొఱకు, ఈశ్వరుడు సంసిద్ధమైనప్పుడు తగిన కాలమందు, ఈ జగత్తు ఉత్పత్తియగుగాక అని సంకల్పము జనించును. అప్పుడు జగత్తు సృష్టించ బడును. జగత్పాలన చేసెదను గాక అని ఈశ్వరునిలో సంకల్పము కలిగిన వెంటనే జగత్తు రక్షింపబడుచున్నది. ఆ పాలనా కల్పము మధ్యలో ఉపాసకుల ఉపాసనా బలము వలన రామ లేక కృష్ణ అనబడే అవతారము ప్రతీతియగు గాక అని సంకల్పము ఉదయించినప్పుడు అవతారము ప్రతీతమగును. ఇతడు జీవుల వలె కర్మాధీనము కాదు, భూత పరిణామము కాదు. ఈశ్వర చేతనమును ఆశ్రయించినట్టి మాయాపరిణామముగా అవతారుని దేహము ప్రతీతియగును.
 •          శిష్టుల పుణ్య ఫలితమైన సుఖ హేతువు, దుష్టుల పాప ఫలితమైన దుఃఖ హేతువు అవతార కల్పితమునకు కారణము. తిరిగి పుణ్య ఫలితముగా శిష్టులను రక్షించుట, పాప ఫలితముగా దుష్టులను శిక్షించుట, ఆయా అవతారుని యొక్క కర్తవ్యమై యుండును. జీవన్ముక్తులందరు అవతారులు కాదు. ఈశ్వరుడు తన చైతన్యాంశతో మాయాకల్పితమగు శరీరమందు చేరుట వలన, అది అవతారమని చెప్పబడును. ఈశ్వరుని సంకల్పముననుసరించి, ఇచ్ఛయించిన కార్యము ముగిసినంతనే ఈశ్వర చైతన్యాంశము ఆ అవతారుని శరీరము నుండి నిర్గమించును. ఇదియే అవతారుని శరీర విసర్జన.
 •          అవతారుని లోక వ్యవహారము లీలా విలాసము. శరీర ధారణ సమయములో కూడా స్వస్వరూప అపరోక్షానుభూతికి ఆటంకము కాదు. ప్రకృతిని ఉపకరణగా తీసుకొని యోగమాయచేత దేహ రూపములతో ప్రతీతియగుటను అవతరించుట లేక సంభవించుట అందురు.
భగవంతునికి అర్చన చేయుటకు కర్మకాండలు :
 • 1. వైదికము : వేదోక్తములైన మంత్రములతో కూడినది.
 • 2. తాంత్రికము : భౌతిక సంబంధమైన విధి విధానముల (తంతువుల)తో  కూడినది.
 • 3. మిశ్రమము : మంత్ర తంత్రములు రెండూ కలిపి అర్చించుట.
పూజా విధానము:
భగవంతునితో అనుసంధానమునకు దీక్ష తీసుకున్న భక్తుడు ఎటువంటి కాపట్యము లేకుండా, విద్యుక్తములైన పెద్దల ప్రవచనములను శాస్త్ర యుక్తముగా, విధి విధానములను అనుసరించి చేయవలెను. తనయొక్క స్వస్వరూపుడే అయివున్న భగవంతుడిని తనకు ప్రీతికరమైన నామ రూపములతో పూజించవలెను.

పూజకు ప్రతీకలు :
1. ప్రతిమలు 2. పవిత్ర పుణ్యక్షేత్రములు (భూమి). 3. అగ్ని 4. సూర్యుడు 5. తీర్థము, పుణ్యనది, కలశ జలము, 6. హృదయము.

ప్రతిమలు :
 • 1. శిలామయము 
 • 2. దారు(కొయ్య)మయము 
 • 3. లోహమయము 
 • 4. లేప్యముగాని చందనముతో గాని చేసినవి 
 • 5. లేఖ్యము అనగా వర్ణ చిత్రములు, పటములు 
 • 6. మణిమయము 
 • 7. సైకతము (ఇసుకతో చేసినవి) 
 • 8. మనోమయము. 
 • వీటన్నిటియందు భగవంతుడు వేంచేసియున్నాడని భావించవలెను.వీటికి ఆవాహన ఉద్వాసనలు లేవు.
         కాని అస్థిరమైన ప్రతిమలు అనగా మట్టితో గాని, పిండితో గాని, పసుపుతో గాని చేసిన వాటికి ఆవాహనాది షోడశోపచారములు చేసి, ఉద్వాసన పలికి పవిత్ర స్థలములో నిమజ్జనము చేయవలెను. ఈ విగ్రహములు మనోనిగ్రహము కొఱకే.

పూజలు ఫలవంతమగుటకు పవిత్రముగా ఉండవలసినవి:
 • 1. దేశము : శరీరము, పరిసరములు, పుణ్యక్షేత్రములు, వనములు, ఆశ్రమములు, నదీ తీరములు, దేవాలయములు, మొదలగు ప్రదేశములు శుచిగా ఉండవలెను.
 • 2. కాలము  : ఉదయ సాయం సంధ్యాకాలములు, బ్రహ్మీముహూర్తము, పుణ్య తిథులు, ఏకాదశి, పౌర్ణమి, మార్గశిర మాసములు పవిత్రము.
 • 3. ద్రవ్యము : అనాఘ్రాణిత తాజా పుష్పములు, అక్షితలు, తమలపాకులు, చందనము, కర్పూరము, సాంబ్రాణి, ఊదొత్తులు, పసుపు, కుంకుమ మొదలుగునవి పవిత్రము.
 • 4. కర్త : భక్తి, సత్త్వ గుణము, శ్రద్ధ, వినయము, శరణాగతి, నిష్కపటము, శమాదిషట్క సంపత్తి, యమనియమములు మొదలగునవి కర్తలో ఉండవలెను.
 • 5. మంత్రము : గురు ముఖతా ఉపదేశించబడిన మంత్రము ఫలవంతమగును.
భగవదారాధన:
 • 1. బింబము : విగ్రహ రూపములోనికి ఆవాహన చేసి పూజించుట
 • 2. కుంభము : కలశములోనికి ఆవాహన చేసి పూజించుట
 • 3. మండలము : ధాన్యరాశిపైకి ఆవాహన చేసి పూజించుట
 • 4. కుండము : అగ్నిని మంత్రపూతము చేసి ప్రజ్వలింపజేసి ఆహుతులను అర్పించుట.
విగ్రహారాధన:
ప్రతిమలన్నీ ప్రాణరూపుడైన ఈశ్వరుని ప్రతీకలు. ఋషులు వారి ధ్యానములో దర్శనము పొందిన రూపములన్నింటినీ విగ్రహముల రూపములలో స్థాపన చేసి, సాధారణ భక్తులు వాటిమీద శ్రద్ధ, నిష్ఠలతో ఆకర్షణ పూర్వకముగా పూజలు చేయవలెనని నిర్దేశించినవి. సాకార పూజ చేయుచూ చేయుచూ పోగా ఈశ్వరుని మీద భక్తిశ్రద్ధలు పెరిగి సమయము ఆసన్నమైనప్పుడు ఆత్మ సాధనలోకి మారునని ఋషుల సంకల్పము.

పుణ్య క్షేత్రములు:
 • 1. స్వయం వ్యక్తములు : భగవంతుడు స్వయంగా వెలసినవి. ఉదా : తిరుమల, అహోబిలము, వేదాద్రి, జంబుకేశ్వరుడు
 • 2. దివ్య క్షేత్రములు : దేవతలచే ప్రతిష్ఠింపబడినవి. ఉదా : శ్రీకూర్మము, మధురాంతకము
 • 3. ఆర్షములు : ఋషి ప్రతిష్ఠితములు. ఉదా : ద్వారకా తిరుమల, శ్రీశైలము, మంగళగిరి
 • 4. సైద్ధ్యములు : సిద్ధులచే ప్రతిష్ఠింపబడినవి. ఉదా : శ్రీరంగము, కాంచీపురము, చిదంబరము
 • 5. ప్రాకృతములు : పూర్వీకులచే ప్రతిష్ఠింపబడినవి. ఉదా : శ్రీకాళహస్తి, సింహాచలము
 • 6. నవీనములు : ఇటీవల మానవులచే క్రొత్తగా నిర్మింపబడుచున్నవి. ఉదా : షిరిడీ సాయినాధ దేవాలయములు
సాధకునకు ఆలంబనలు:
విగ్రహములను ప్రతీకలుగా, ఓంకారాదులను, స్తోత్రములను వాచకముగా పెద్దలచే ఏర్పాటు చేయబడినవి. ఇవి మనో పరిధిలోని సాధనలు.

 • భక్తి సాధనలు: పూజలు, స్తోత్రములు, జపము, తీర్థాటనము, పారాయణ, భజనలు, వ్రతములు, దాన ధర్మములు, సేవ, దీక్ష, యజ్ఞములు, క్రతువులు, స్వాధ్యాయము, పురాణ శ్రవణము, భాగవత రామాయణ గ్రంథ పఠనము, తపస్సు, సాధు దర్శనము, సత్సంగము మొదలగు సత్కర్మలు.
 • భగవంతుని పొందుటకు సాధన: ప్రప్రథమముగా భగవంతుడున్నాడని, అనుగ్రహించునని విశ్వాసముండవలెను. విచారణచేత ఆ విశ్వాసమును బలపరచుకొని ఆయనను చేరవలెననే తపన కలుగవలెను. ఆ తపన భక్తిగా మారవలెను. భక్తివలన శ్రద్ధ కలుగవలెను. విశ్వాసము, భక్తి, శ్రద్ధ ఈ మూడింటి వలన వినయము వచ్చును. ఆ వినయమే అహంకార నాశనమునకు దారి తీయును. అహంకారము నశించగానే భగవదనుభూతి కలుగును. అప్పుడు ఉదయించే జ్ఞానము వలన తానే భగవంతుడై యుండును.
 • అనన్య భక్తి: అనేకత్వములో భగవంతుని ఏకత్వము నెరుగుట. అన్యములేని పరమాత్మ సర్వదా సర్వత్రా ప్రకాశించుచున్నాడని నిశ్చయ జ్ఞానము కలుగుట. భ్రూమధ్యమందు గాని, బ్రహ్మరంధ్ర పర్యంతము లక్ష్యముంచి, ఆ భగవంతుని తదేక నిష్ఠతో ధ్యానించుట. జీవసాక్షియైన భగవంతుని తెలుసుకునే చరమ దశయే అనన్య భక్తి.
 • ముఖ్య భక్తి: శాంత రూపము, ముఖ్య రూపము, భక్తునిలోనే కేవలమైన ఆంతరిక అనుభూతి. వీరు తీర్థస్నానములకు పవిత్రతను కలిగించెదరు. సర్వశాస్త్రములకు ప్రమాణమును కలిగించెదరు. సకల కర్మలను పావనము చేయుదురు. వారి తపో మహిమచేత తీర్థములకు, క్షేత్రములకు పవిత్రత కలుగును. అవి భక్తుల పాపములను హరించును. అందువలన భక్తులు క్షేత్ర తీర్థ మహిమలను, వాటికి కారణమైన ఋషుల చరిత్రను తెలుసుకొని వారి భక్తిని వృద్ధి చేసుకొనవలెను. తీర్థయాత్రలు వినోదయాత్రలు కాకూడదు.

పరాభక్తి లక్షణములు:
 • 1. పరప్రేమ స్వరూపము, మనస్సు ద్రవీభూతమై ప్రేమాకారమగుట
 • 2. అమృత స్వరూపము, తనలో తాను రమించుట
 • 3. పరమ తృప్తి, పరమశాంతి, పరమానందము
 • 4. విషయాసక్తి లేనిది, ఏదీ కోరనిది
 • 5. భక్తితో మనస్సు సవికల్పమై యుండుట, ఏకాంత భక్తి రూపము
 • 6. సర్వమును భగవత్‌ లీలా విలాసమనే దృష్టి కలుగుట.
 • 7. తనలో భగవంతుడు ప్రతీతి అగుట, భగవత్సాక్షాత్కారము
 • 8. లౌకిక వేద విహిత వ్యాపారములు నిరోధించబడుట
 • 9. సకల వ్యాపారములు భగవత్‌ కైంకర్యమగుట, భగవద్వియోగ భయము
 • 10. భక్తి ఇంద్రియములకు సోకి, కర్తృత్వరహితమగుట, భగవత్‌ ఉన్మత్తత
 • 11. అనాది కర్మలు నశించుట, లౌకికమైన రాగాదులు లేకుండుట
 • 12. తన్మయత, మైమరపు, ఆర్ధ్రత చెందిన హృదయము
 • 13. భగవద్భక్తిలో తెంపును, వియోగమును భరించలేకుండుట
 • 14. సాలోక్యాది ముక్తులు మొదలగునవి పరాభక్తి లక్షణములనబడును.

శ్రు||  భక్త్యావినా బ్రహ్మజ్ఞానం క దాపి నజాయతే |
                                               - మహానారాయణోపనిషత్‌
తా|| భక్తి లేనిచో బ్రహ్మ జ్ఞానము ఎన్నటికీ లభించదు.


శ్లో||  దేహ బుద్ధ్యా-స్తి దాసో-హం | జీవ బుద్ధ్యాత్వ దంశకః
       ఆత్మ బుద్ధ్యా  త్వమే వాహమితి | మే నిశ్చితామతిః
                                                    - శ్రీ సీతారామాంజనేయ సంవాదము
తా||  దేహాత్మాభిమానమున్నప్పుడు నేను నీకు దాసుడను. జీవాత్మాభిమాన మున్నప్పుడు నీలోని అంశమగుదును. ఈ రెండభిమానములు వదలినప్పుడు ''కూటస్థుడే నేను'' అని నిశ్చయమై మనకిరువురకును భేదమే లేదు. ఈ విధముగా మీ అనుగ్రహము వలన నాయందు నిశ్చయమైనది.
 - శ్రీ ఆంజనేయులు చెప్పినది.

సంకలనం: చల్లపల్లి

31, జనవరి 2020, శుక్రవారం

"సనాతన ధర్మం" దీనిని ఎవరు, ఎప్పుడు స్థాపించారు? - Sanaatana Dharma Staapana Yevaru Chesaru

ప్రశ్నోత్తరాల ద్వారా హిందూధర్మం - రెండవ అధ్యాయము

"సనాతన ధర్మం" దీనిని ఎవరు, ఎప్పుడు స్థాపించారు?

ప్రపంచంలోని ఇతర మతాలలాగా హిందూమతం ఒక వ్యక్తి చేత, ఒకానొక నిర్దిష్టకాలంలో స్థాపించబడినది కాదు.

అది కేవలం ఒక వ్యక్తి ఆధ్యాత్మికానుభూతి మీద కాకుండా ఎంతోమంది సత్యద్రష్టలైన ఋషుల అతీంద్రియ దర్శనాల మీద, ఆధ్యాత్మిక అనుభవాల మీద స్థిరంగా ప్రతిష్ఠించబడి ఉన్నది.

మళ్ళీమళ్ళీ పరిశీలన చేసినా తట్టుకుని నిలిచే ఈ ఆధ్యాత్మిక అనుభూతులు సత్యాలు, పరంపరగా, వేలాది సంవత్సరాల నుండి, గంగానది ప్రవాహంలాగా, అవిచ్ఛిన్నంగా మస్తున్నాయి. కనుకనే ఇది 'సనాతన ధర్మ' మని పిలువబడుతోంది.

రచన: స్వామీ హర్షానంద,
అనువాదము: శ్రీ దయాత్మానంద స్వామి
ప్రచురణ: రామకృష్ణ మఠం

30, జనవరి 2020, గురువారం

హిందూధర్మము అంటే ఏమిటి? - Hindu Dharma Q&A

హిందూధర్మము అంటే ఏమిటి? - Hindu Dharma Q&A

ప్రశ్నోత్తరాల ద్వారా హిందూధర్మం - మొదటి అధ్యాయము

హిందూధర్మం అంటే ఏమిటి?
ప్రాచీన పారశీకులు (పార్శీలు) 'సింధు' నది ఉన్నఈ దేశాన్ని హిందూదేశమనీ, ఇక్కడి జనులను హిందువులనీ హిందూధర్మమనీ పిలుస్తూ ఉండేవారు. వారు 'స' అనే అక్షరాన్ని పలుకలేక, 'హ' గా ఉచ్చరించటం వల్ల 'సింధు మారిపోయి, హిందుగా రూపుదిద్దుకుంది.

ఈ విధంగా చూస్తే భారతదేశంలో పుట్టి పెరిగిన ధర్మాలన్నీ హిందూధర్మాలే అవుతాయి. జైన, బౌద్ధ, సిక్కు ధర్మాలు కూడా హిందూధర్మపు వివిధ శాఖలే అవుతాయి. కాని నిజంగా చూస్తే వేదాలను ఆలంబనగా చేసుకుని ఆర్యులు అనుష్ఠించిన హిందూధర్మమని పిల్లవటం సబబు. 
హిందూమతం అసలు పేరు 'సనాతన ధర్మం', అంటే అతి ప్రాచీనమైన, శాశ్వత విలువలు కలిగిన ధర్మమని అర్థం.
ధర్మం అంటే ఈ ప్రపంచాన్ని ధరించే శక్తి, నిలిపే శక్తి: దీనినే పరమాత్మ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరమాత్మను అనుభూతి చెందడం సాధ్యమే. అటువంటి పరమాత్మానుభవాన్ని లభింపజేసే సాధనామార్గాలను కూడ ధర్మమని పిలువవచ్చు. అత్యంత ప్రాచీనకాలం నుండీ, తరతరాలుగా, శ్రద్ధాభక్తులతో అనుష్ఠించిన వారందరికీ హిందూధర్మపు వివిధ ఉపాసనామార్గాలు భగవదనుభూతిని కలిగిస్తున్నాయి. 

ధర్మం అంటే ఈ ప్రపంచాన్ని ధరించే శక్తి, నిలిపే శక్తి: దీనినే పరమాత్మ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరమాత్మను అనుభూతి చెందడం సాధ్యమే. అటువంటి పరమాత్మానుభవాన్ని లభింపజేసే సాధనామార్గాలను కూడ ధర్మమని పిలువవచ్చు. అత్యంత ప్రాచీనకాలం నుండీ, తరతరాలుగా, శ్రద్ధాభక్తులతో అనుష్ఠించిన వారందరికీ హిందూధర్మపు వివిధ ఉపాసనామార్గాలు భగవదనుభూతిని కలిగిస్తున్నాయి.

ఈ మార్గాలను అనుసరించి ఒకరిద్దరు కాక అసంఖ్యాకులైన సాధకులు భగవత్సాక్షాత్కారాన్న పొందారు. భగవంతుణ్ణి చేరుకోవటానికి విధివిధానాలను సూచించే ఈ ధర్మాలు అనాదికాలంగా వస్తున్నందుచేత, పైగా అవి శాశ్వతమైన ధర్మాలు కావటంచేత హిందూమతానికి మరొక పేరు "సనాతన ధర్మం".

రచన: స్వామీ హర్షానంద,
అనువాదము: శ్రీ దయాత్మానంద స్వామి
ప్రచురణ: రామకృష్ణ మఠం

5, డిసెంబర్ 2019, గురువారం

మతము కాదు మన హైందవ ధర్మం - ఇది ఒక మానవధర్మం - Sanatana Dharma is The Way of Life

 మతము కాదు మన హైందవ ధర్మం - ఇది ఒక మానవధర్మం - Sanatana Dharma is The Way of Life
ఓం
హైందవ ధర్మం అనేది మతమనుకుంటాం. కాని నిజానికది ఓ భారతీయ ధర్మం. భరత ఖండమంతటికీ చెందిన ఓ సైద్ధాంతిక ధర్మం. దీనినే మానవధర్మమనీ అంటాం.

‘ఆత్మవత్సర్వ భూతేషు’ అని చెప్పగలిగే ధర్మం. సనాతనధర్మమే! సాటివారెవ్వరికీ ఏ బాధా - అవరోధమూ కలగకుండా మోక్షాన్ని దర్శింపచేసేది కేవలం హైందవ ధర్మమే. ఏ మతంకూడా ఏ ఇతర ధర్మాన్నీ అవహేళన చేయని, వ్యతిరేకించని ఛెప్పదు.

పరబ్రహ్మకీ, సర్వవ్యాపకతకీ హైందవ ధర్మమే మూలాధారమైనది మనది పుణ్యభూమి, తపోభూమి, కర్మభూమి.
పవిత్ర గంగా నది 
ఇక్కడ పవిత్రనదులు సజీవంగా ప్రవహిస్తున్నాయి. మహోన్నత పర్వతాలున్నాయి. ప్రాచీనమైన సభ్యతా - సంస్కృతులు విరాజిల్లుతున్నాయి. మానవజీవనానికి అనువైన శీతోష్ణ స్థితి వుంది రమణీయ ప్రకృతి శోభిల్లుతూ ఉన్నది. వనరులెనె్నన్నో సమృద్ధిగా ఉన్నాయి.

పరోపకారంమిదం శరీరం అన్న ఆర్యోక్తికి అంకితమై అజరామరులైన తపోధనలు, ఋషులు, యోగులు, సిద్ధులు, కవులు, కళాకారుల గురించి మన మెరుగుదుము. ఈ అఖిల జగతిని సుఖంగా, క్షేమంగా వుంచగల శాశ్వత సూత్రాలకు ఆచార సంహితను ‘ధర్మం’ అని నామకరణం చేశారు. దీనినే మానవధర్మం, సనాతన ధర్మం, హైందవ ధర్మం అన్నారు.

హైందవ ధర్మం ఓ ప్రవక్తవల్లనో, ఓ వ్యక్తి తపస్సు వల్లనో ఏర్పడింది కాదు. అనేకవేల సంవత్సరాల సాధనలోంచి, కాలక్రమేణా ఆవిర్భవించిన మహాధర్మమిది. ఎందరో యోగిపుంగవుల, ఋషుల, దార్శనికుల ఆత్మజ్ఞానానికి ప్రతీకలైన వేదాలు, ఉపనిషత్తులు, పురాణగాధల రూపంలో ఆవిష్కృతమైన జీవన విధానమిది.

వైదికత్వం నిజానికి జీవితానికి - ప్రకృతికీ సంబంధించిన ఆధ్యాత్మిక మార్గం. మన ఆధ్యాత్మిక సంపదను వేదాంతమన్న పేరూ ఉంది. వేదాంతంలో మోక్షం గురించి, ఆత్మ సాక్షాత్కారం గురించి, పరబ్రహ్మ, సృష్టికర్త, ఆత్మ, ప్రకృతి, కర్మసిద్ధాంతం, పునర్జన్మ బంధనాలు, స్వేచ్ఛ మొదలైన అనేక అంశాలపైన చర్చలుంటాయి. తాత్విక చింతన యోగవిద్య వీటిలో అంతర్లీనమై ఉంటాయి. అసలు వేదాంతమే హైందవ ధర్మసారం. ఇలా రూపుదిద్దుకున్న హిందుత్వం (వైదికత్వం) అందించిన జీవన రచనా విధానం వల్లనే హైందవ సమాజం ‘చిరంజీవి’ అయింది.

బాధాతప్తుల బాధను దూరం చేయడమే మానవుడి పరమధర్మమని మనధర్మం చెబుతోంది. మానవజన్మ లభించినందుకు మనం గర్వించాలి. పొంగిపోవాలి. ఏ త్యాగానికైనా సిద్ధపడాలి.

మనకర్మలే మన జీవితాన్ని ఆదేశిస్తాయన్న వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తోంది హైందవ దృక్పథం.

ఇహపరాల సంగతి సరే - నేటి మన రాజకీయ, సామాజిక, ఆర్థిక నైతిక సమస్యలకు పరిష్కారమార్గం చూపగలిగే మహత్తర శక్తి మన హైందవ ధర్మచింతన ప్రసాదిస్తున్నది.

ఈ దుర్లభమైన మానవజన్మను సద్వినియోగపరచుకోవాలంటే ఐహిక ప్రలోభాలకు తలొగ్గక, ఆత్మజ్ఞానాన్నీ, ఆత్మతతాత్త్వన్నీ ఆకళింపు చేసుకుని, హైందవ తాతిత్వకతను అవగాహన చేసుకోవాలి. తన జీవితానికి అన్వయిపరచుకోవాలి. తన జీవన కాలంలోని ప్రతి క్షణాన్నీ హైందవ ధర్మాచరణకు అంకితం చేసుకోవాలి.

ఓం 
రచన: సి.ఎం రెడ్డి 

27, అక్టోబర్ 2019, ఆదివారం

హైందవ ధర్మము, ఓ సైద్ధాంతిక మానవ ధర్మము - Hindu Dharmam
హిందూ ధర్మము ప్రాముక్యత
హిందూ ధర్మం అనేది మతమనుకుంటాం. కాని నిజానికది ఓ భారతీయ ధర్మం. భరత ఖండమంతటికీ చెందిన ఓ సైద్ధాంతిక ధర్మం. దీనినే మానవధర్మమనీ అంటాం. ‘ఆత్మవత్సర్వ భూతేషు’ అని చెప్పగలిగే ధర్మం. సనాతనధర్మమే! సాటివారెవ్వరికీ ఏ బాధా - అవరోధమూ కలగకుండా మోక్షాన్ని దర్శింపచేసేది కేవలం హిందూ ధర్మమే. ఏ మతంకూడా ఏ ఇతర ధర్మాన్నీ అవహేళన చేయని, వ్యతిరేకించని ఛెప్పదు.
ఓం
పరబ్రహ్మకీ, సర్వవ్యాపకతకీ హిందూ ధర్మమే మూలాధారమైనది మనది పుణ్యభూమి, తపోభూమి, కర్మభూమి. ఇక్కడ పవిత్రనదులు సజీవంగా ప్రవహిస్తున్నాయి. మహోన్నత పర్వతాలున్నాయి. ప్రాచీనమైన సభ్యతా - సంస్కృతులు విరాజిల్లుతున్నాయి. మానవజీవనానికి అనువైన శీతోష్ణ స్థితి వుంది రమణీయ ప్రకృతి శోభిల్లుతూ ఉన్నది. వనరులెనె్నన్నో సమృద్ధిగా ఉన్నాయి. పరోపకారంమిదం శరీరం అన్న ఆర్యోక్తికి అంకితమై అజరామరులైన తపోధనలు, ఋషులు, యోగులు, సిద్ధులు, కవులు, కళాకారుల గురించి మన మెరుగుదుము.

ఈ అఖిల జగతిని సుఖంగా, క్షేమంగా వుంచగల శాశ్వత సూత్రాలకు ఆచార సంహితను ‘ధర్మం’ అని నామకరణం చేశారు. దీనినే మానవధర్మం, సనాతన ధర్మం, హిందూ ధర్మం అన్నారు. హిందూ ధర్మం ఓ ప్రవక్తవల్లనో, ఓ వ్యక్తి తపస్సు వల్లనో ఏర్పడింది కాదు. అనేకవేల సంవత్సరాల సాధనలోంచి, కాలక్రమేణా ఆవిర్భవించిన మహాధర్మమిది. ఎందరో యోగిపుంగవుల, ఋషుల, దార్శనికుల ఆత్మజ్ఞానానికి ప్రతీకలైన వేదాలు ఉపనిషత్తులు పురాణగాధల రూపంలో ఆవిష్కృతమైన జీవన విధానమిది.

హిందుత్వం నిజానికి జీవితానికి - ప్రకృతికీ సంబంధించిన ఆధ్యాత్మిక మార్గం. మన ఆధ్యాత్మిక సంపదను వేదాంతమన్న పేరూ ఉంది. వేదాంతంలో మోక్షం గురించి, ఆత్మ సాక్షాత్కారం గురించి, పరబ్రహ్మ, సృష్టికర్త, ఆత్మ, ప్రకృతి, కర్మసిద్ధాంతం, పునర్జన్మ బంధనాలు, స్వేచ్ఛ మొదలైన అనేక అంశాలపైన చర్చలుంటాయి. తాత్విక చింతన యోగవిద్య వీటిలో అంతర్లీనమై ఉంటాయి. అసలు వేదాంతమే హిందూ ధర్మసారం. ఇలా రూపుదిద్దుకున్న హిందుత్వం అందించిన జీవన రచనా విధానం వల్లనే హిందూ సమాజం ‘చిరంజీవి’ అయింది.

బాధాతప్తుల బాధను దూరం చేయడమే మానవుడి పరమధర్మమని మనధర్మం చెబుతోంది.మానవజన్మ లభించినందుకు మనం గర్వించాలి. పొంగిపోవాలి. ఏ త్యాగానికైనా సిద్ధపడాలి. మనకర్మలే మన జీవితాన్ని ఆదేశిస్తాయన్న వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తోంది హైందవ దృక్పథం. ఇహపరాల సంగతి సరే - నేటి మన రాజకీయ, సామాజిక, ఆర్థిక నైతిక సమస్యలకు పరిష్కారమార్గం చూపగలిగే మహత్తర శక్తి మన హిందూ ధర్మచింతన ప్రసాదిస్తున్నది. ఈ దుర్లభమైన మానవజన్మను సద్వినియోగపరచుకోవాలంటే ఐహిక ప్రలోభాలకు తలొగ్గక, ఆత్మజ్ఞానాన్నీ, ఆత్మతతాత్త్వన్నీ ఆకళింపు చేసుకుని, హైందవ తాతిత్వకతను అవగాహన చేసుకోవాలి. తన జీవితానికి అన్వయిపరచుకోవాలి. తన జీవన కాలంలోని ప్రతి క్షణాన్నీ హైందవ ధర్మాచరణకు అంకితం చేసుకోవాలి

అనువాదం: కోటి మాధవ్ బాలు చౌదరి

తెలుగు భారత్ వాట్సాప్ గ్రూపులో చేరేందుకు ఇక్కడ 🖝 క్లిక్ చేయండి 

26, అక్టోబర్ 2019, శనివారం

ధర్మం - Dharmamధర్మం - Dharmam
ధర్మం అంటే ఏమిటి?

మానవులు అనుష్టించాల్సిన ధర్మాలేంటి?
శాస్త్ర విహితమయిన కర్మలు "ధర్మం" అనబడతాయి. మన నడవడి, మన చేష్టలు, మన
వృత్తి యితరులకు ఇబ్బంది కలిగించనవి, సజ్జనులకు హాని కలిగించని ధర్మం అనిపించుకుంటాయి. వ్యవస్థాగతంగా వున్న నియమాలు, సంఘ నియమాలు, సంస్కృతి
నియమాలు ధర్మ మార్గాలు అనిపించుకుంటాయి.

స్వాధ్వౌయం, బ్రహ్మచర్యం, దానం, యజనం, ఔదార్యం, సారళ్యం, దయ, అహింస, ఇంద్రియ విజయం, క్షమాగుణం, ఆత్మ సంయమనం, శుచిత్వం, సత్సం కల్పత్వం శివకేశవ భాస్కర దేవ్యౌదుల పట్ల భక్తి ఇవి మానవులు అనుష్టించవలసిన ధర్మాలు.

వీటిలోనే వృత్తిరీత్యా కులం రీత్యా కొన్ని మార్పులు శాస్త్రాలలో చెప్పారు.

ఉదాహరణకు
 • అందరికీ అహింసయే పరమధర్మం అని చెప్పినా, సైనికులకు మాత్రం శత్రుజయం ధర్మం అని చెప్పారు.

తెలుగు భారత్ వాట్సాప్ గ్రూపులో చేరేందుకు ఇక్కడ 🖝 క్లిక్ చేయండి 

1, జులై 2019, సోమవారం

అవధూత అంటే అర్ధం - Meaning of Avadhuta

అవధూత అంటే అర్ధం - Meaning of Avadhuta

తెలుగులో అవధూత అనుపదమునకు పూర్తి అర్థము ఇచ్చుటకు ప్రయత్నిస్తాను.
అవధూతగీత ప్రకారముః"అక్షరాత్, వరేణ్యాత్, ధూతసంసారబంధనాత్, తత్వమస్యాధిలక్ష్యత్వాత్, అవధూత ఇతీర్యతే".
అవధూతగీత 

అవధూత పదంలోని

పదానికి ఆశాపాశమునుండి విముక్తి పొందినవాడు, ఆదిమధ్యాంతములందు నిర్మలుడు, ఆనందాన్ని నిరంతరము పొందుతుండేవాడు అని.

పదానికి వాసనలనుండి (పూర్వకర్మలనుండి) విడివడినవాడు, నిరామయమైన, పరబ్రహ్మగా పేర్కొనదగినవాడు, వర్తమానములోనే (భూతభవిష్యత్తుల గురించిన ఆలోచనలేక) ఉండేవాడు అని

ధూ పదానికి ధూళితో కూడిన శరీరము కలిగినవాడు, మనస్సును స్వాధీనము చేసుకొన్నవాడు, దోషరహితుడు, ధ్యాన ధారణలు లేనివాడు అని

పదానికి తత్వ చింతన కలిగినవాడు, తమోగుణమును, అహంకారమును విడచినవాడు అని
అర్ధము.

ఇక అవధూతోపనిషత్తు ప్రకారము

అ - అనగా అక్షరుడు, నాశములేనివాడు,

- అనగా వరేణ్యుడు (బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు),

ధూ - అనగా ధూత (విదిలించుకొన్న) సంసార బంధనములు కలవాడు,

- అనగా తత్వమస్యాది వాక్యములకు లక్ష్యమైనవాడు

ఇలాంటివారిని అవధూత అని పిలవబడుతున్నారని అవధూతగీత మరియు అవధూతోపనిషత్తు చెప్తున్నాయి.

అయితే అవధూతోపనిషత్తు మరియు అవధూత గీత రెండూ శ్రీ గురు దత్తాత్రేయులు చెప్పినవే.

అనువాదం: కోటి మాధవ్ బాలు చౌదరి

13, సెప్టెంబర్ 2018, గురువారం

జంధ్యము ధరించుట ( యజ్ఞోపవీతము ) నియమాలు - Jhandyamu Dharinchuta

handyamu-dharinchuta-jhandyamu-yagnopavitamu

యజ్ఞోపవీతము (జంధ్యము)యొక్క వివరణ:
 • ఉపనయనములో ధరించునది - “బ్రహ్మ సూత్రము”
 • వివాహంగముగా ధరించునది - “యజ్ఞ సూత్రము”
యజ్ఞోపవీతము లోని దారములు 3X3=9 ఆతొమ్మిది దారముల వివరణ

1. ఓంకారము – ప్రధమ తంతౌన్యసాని
2. అగ్ని - ద్వితీయ తంతౌన్యసాని
3. నాగాన్ - తృతీయ తంతౌన్యసాని
4. సోమం - చతుర్ధ తంతౌన్యసాని
5. పితౄన్ - పంచమ తంతౌన్యసాని
6. ప్రజాపతి - షష్ఠ తంతౌన్యసాని
7. వాయుమ్ - సప్తమ తంతౌన్యసాని
8. సూర్యం - అష్టమ తంతౌన్యసాని
9 సర్వాన్ దేవాన్ – నవమ తంతౌన్యసాని

ఈ యజ్ఞోపవీతము యొక్క విలువ ప్రాశస్త్యము ఈ విధముగా ఉండడమేకాక
“ఇదం ద్యావా పృధివీ సత్తమస్తు Iపితర్మా తర్యది హోప భృవేవా
భూతందేవానామావమేఅవోభిః Iవిద్యామేషం వృజనం జీరదనుమ్”.
జందెపు పోగు తెగినపుడు, జాతశౌచము, మృతాశౌచము, గ్రహణము తర్వాత, ప్రతి నాలుగు మాసములకు, శవమును తాకినపుడు నూతన యజ్ఞోపవీతమును విధిగా ధరించాలని వేదము తెలియచేస్తున్నది. మూత్రవిసర్జన సమయంలో జంద్యమును కుడిచెవికి చుట్టుకోవలయును.
పురీషాది శౌచకర్మలందు (బహిర్బూమిలో) జంద్యమును ఎడమ చెవికి చుట్టుకోవలయును.
గోదాన సమయములో గురువులకు, బ్రాహ్మణులకు మొII వారికి యజ్ఞోపవీతము దానమీయవలయును. పితృదేవతలను పూజించి వస్త్రములతోపాటు యజ్ఞోపవీతమును దానముగా ఇవ్వవలయును. శ్రాద్దమున వస్త్రములను దానము చేయలేనివారు యజ్ఞోపవీతమును దానము ఇవ్వవలయును.

handyamu-dharinchuta-jhandyamu-yagnopavitamu
యజ్ఞోపవీతమును ఎలా ధరించాలి:

యజ్ఞోపవీత ధారణ విధిః

తూర్పుదిశగా కూర్చొని ఆచమనము చేయాలి.
 • ఓం కేశవాయ నమః
 • ఓం నారాయణాయ నమః
 • ఓం మాధవాయ నమః
 • ఓం గోవిందాయ నమః
 • ఓం విష్ణవే నమః
 • ఓం మదుసూధనాయ నమః
 • ఓం త్రివిక్రమాయ నమః
 • ఓం వామనాయ నమః
 • ఓం శ్రీధరాయ నమః
 • ఓం హృషీకేశాయ నమః
 • ఓం పద్మనాభాయ నమః
 • ఓం దామోధరాయ నమః
 • ఓం శ్రీ వాసుదేవాయ నమః
తర్వాత ప్రాణాయామము చేయాలి:-

1. ముక్కుతో, గాలి వదులుతూ, కుడి ముక్కును మూసి, ఎడమ ముక్కుతో, గాలిని పీల్చుతూ, చేయునది పూరకం.
“ ఓం భూః ,ఓం భువః, ఓం స్వః,ఓం మహః, ఓం జనః,ఓం తపః,ఓం సత్యం.”
2. కుంభకం:- రెండు ముక్కులు మూసి గాలిని లోపల బంధించడం.కుంభకం చేస్తూ
“ఓం తత్స వితుర్వరే ణ్యం భర్గోదేవస్య ధీ మహి! ధీయోయోనః ప్రచోదయాత్!
ఓ మాపో జ్యొతీ రపోమృతం బ్రహ్మ ”
3. రేచకం:- ఎడమముక్కును మూసి, కుడిముక్కుతో గాలిని పూర్తిగా వదలడం.
కుడిముక్కునుండి గాలిని వదులుతూ
“భూర్భువ స్సువరోమ్ ”
అని చెప్పిన తర్వాత కుడిచేతితో కుడిచివిని తాకవలెను.

తర్వాత వినాయక ప్రార్ధన:-
శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజంప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే.
సంకల్పము:
శ్రీ గోవింద! గోవింద! గోవింద! శ్రీ మహావిష్ణో రాజ్ఞయా .................................................. భగవత్ భాగవత ఆచార్య కైంకర్యరూపేణ మమ శ్రౌత స్మార్త నిత్య కర్మానుస్టాన యోగ్యతా సిధ్యర్ధే నూతన యజ్ఞోపవీత ధారణే వినియోగః.

యజ్ఞ్యోపవీతమును ఒక తట్టలో మన ముందుంచుకొని తీర్థముతో ఈ క్రింది మంత్రముతో అభిమంత్రించవలెను.
అపోహి ష్టేతి త్రిర్చస్యసూక్తస్య సింధుద్వీప అంబరీష ఋషిః
అపోదేవత గాయత్రీఛందః జలప్రోక్షణే వినియోగః |
అపోహిష్టామయో భువస్తాన ఉర్జేదధాతన
మహేరణాయ చక్షసే||
యోవశ్శివతమోరసస్తస్య భాజయతేహవః |
ఉశతీర్ వ మాతరం||
తస్మా అరంగమామవో యస్యక్షయాయ జివ్వాధ |
అపోజనయాధాచనః ||
ఓం హిరణ్యవర్ణాశ్శుచయః పవకా యా సుజాతః కశ్యపోయా స్వింద్రఃఅగ్నింయాగర్భం దధీరేవసునాస్తాన ఆపశ్యం స్యోనాభవంతుయాసాంరాజా వరుణో యాతిమధ్యే సత్యానృతే అనపశ్యంజనానాంమధుశ్చుత శ్శుచయో యాః పావకా స్తానా ఆపశ్యంస్యోనాభావంతుయజ్ఞోపవీతమును చేతిలో (దోసిలిలో) ఉంచి సూర్యమండల మధ్యవర్తి నారాయణునికి చూపుతూ మూడు పర్యాయములు ఈ క్రింది మంత్రమును పఠించాలి.
ఉద్యన్నద్యేతి యజ్ఞోపవీతం తిసృభిః సూర్యాయ దర్శయిత్వా
ఓం ఉద్యన్నద్య మిత్రమహః ఆరోహ న్నుత్తరాం దివమ్ |
హృద్రోగమ్మమసూర్య హరిమాణం చ నాశయ ||

యజ్ఞోపవీతమును గాయత్రిమంత్రముతో ఒక్క మారు స్పృశించవలెను
ఓం భూర్భువస్స్వః తత్స వితుర్వరే ణ్యం భర్గోదేవస్య ధీ మహి! ధీయోయోనః ప్రచోదయాత్!
కుడి అరచేయిని పైకి వచ్చు విధముగా కుడి అరచేతిలో యజ్ఞోపవీతము ముడి అంగుష్టంవైపు ఉండునట్లుగా, ఎడమ అరచేయని క్రిందకువచ్చు విధముగా అరచేతిలో యజ్ఞోపవీతమును ఉంచుకొని రెండు చేతులూ ముందుకుచాచి ఈ క్రింది మంత్రమును, మంత్రయుక్తముగా అనుసంధానము చేసుకొని యజ్ఞోపవీతమును కంఠము నందు ధరించవలెను.

యజ్ఞోపవీతమితి మంత్రస్య పరబ్రహ్మఋషిః, పరమాత్మా దేవతా, త్రిష్టుప్ ఛందః, మమ శ్రౌత స్మార్త నిత్య కర్మానుస్టాన యోగ్యతా సిధ్యర్ధే నూతన యజ్ఞోపవీత ధారణే వినియోగః.
ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపటతేర్యత్సహజం పురాస్తాత్!
ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః !

గృహస్తు మరి రెండు యజ్ఞోపవీతములను పైవిధముగా ఆచమనం చేసి మంత్రమును,
మంత్రయుక్తముగా అనుసంధానము చేసుకొని యజ్ఞోపవీతధారణ చేయవలయును.
జీర్ణ యజ్ఞోపవీతమును (మనము ధరించియున్న పాత యజ్ఞోపవీతమును) విసర్జిస్తూ ఈ క్రింది శ్లోకమును అనుసంధాన ము చేసుకొని యజ్ఞోపవీతమును పైకి అనగా, శరీరము తలవైపునుండి తీయరాదు. శరీరము క్రింద భాగమునుండి అనగా కడుపు, కాళ్ళవైపు నుండి కాళ్లు తగలకుండా పవిత్రముగా, భక్తితో తీయవలయును. పాత యజ్ఞోపవీతమును పళ్ళెములో ఉంచి పవిత్ర జలముతో సంప్రోక్షించిన తర్వాత ఆ యజ్ఞోపవీతమును కళ్ళకు అద్దుకొని ప్రక్కన పెట్టవలయును.
ఉపవీతం యజ్ఞసూత్రం కశ్మలమ్ మలదూషితం
విసృజామి హరే బ్రహ్మన్ వర్చో దీర్ఘాయురస్తుమే!
జీర్ణ యజ్ఞోపవీతం విసృజ్య
సముద్రంగచ్చస్వాహేతి మంత్రేణ విసర్జయేత్!
ఓం సముద్రం గచ్చస్వాహాతరిక్షం గచ్చస్వాహ దేవగుం సవితారం గచ్చస్వాహ||
జీర్ణ యజ్ఞోపవీతమును తొలగించిన తర్వాత ఎవరూ త్రొక్కని ప్రదేశములో వదలివేయవలయును.
తర్వాత మళ్ళీ ప్రాణాయామమును చేసి, గాయత్రీ మంత్రమును అనుసంధానించవలయును.

ముఖ్యగమనిక :- యజ్ఞోపవీతమును ధరించిన ప్రతి ఒక్కరూ నిత్యమూ ఉభయ సంధ్యావందనములు విధిగా ఆచరించి తీరవలయును.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి


27, మే 2018, ఆదివారం

విగ్రహారాధన ప్రాముఖ్యత ఏమిటి, ఎందుకు విగ్రహారాదన చేయాలి - Vigraha Aaradhana

విగ్రహారాధన ప్రాముఖ్యత ఏమిటి, ఎందుకు విగ్రహారాదన చేయాలి - Vigraha Aaradhana
 కప్పుడు చైతన్యుడు అనే భక్తుడు ఉండేవాడు తను గురువు ద్వారా నారాయణ మంత్రాన్ని ఉపదేశం పొంది ఒక నారాయణుడి విగ్రహం ఇచ్చి దాని మీద దృష్టి సారించమని చెప్పాడు! చైతన్యుడు కూడా మంత్రాన్ని వల్లిస్తూ నిత్యం ఆ విగ్రహాన్ని పూజిస్తుండేవాడు , కానీ విగ్రహం లో చలనం లేదు దేవుడు కూడా తనని గుర్తించినట్టు కనపడలేదు !!

చైతన్యుడు నిరాశతో తన గురువు దగ్గరకు చేరి తనకు విష్ణుమూర్తి (విగ్రహం) కరుణించటం లేదని తనకు మరొక కొత్త ఉపదేశం చేయాల్సిందిగా గురువు ని కోరుకుంటాడు ! చైతన్యుడి అజ్ఞానానికి నవ్వుకొని సరే అంటాడు !
ఈ మారు శిష్యుడికి శివ మంత్రాన్ని ఉపదేశించి శివుడి మూర్తిని ఇచ్చి , భోలే నాథుడు త్వరగా కరుణిస్తాడు అని చెప్పి శిష్యుడిని పంపిస్తాడు !
చైతన్యుడు ఆరు నెలల పాటు నిర్విరామంగా మంత్ర జపము మరియు శివ మూర్తి ఆరాధనాలో నిమగ్నమయ్యాడు !! మునపటి నారాయణుడి మూర్తిని పూజించకుండా దుమ్ము పట్టిన అటక ఎక్కించేశాడు ! చాలా రోజులు శివుడి మూర్తిని పూజించి మంత్రాన్ని జపించినా కూడా చైతన్యుడికి ఫలితం కనిపించక మరీ నిస్పృహ చెంది తిరిగి గురువు దగ్గర కి పయనమయ్యాడు!
గురువు ని చేరిన చైతన్యుడు నిర్వేదం తో శివుడి మూర్తి కూడా కరుణించలేదు కావున తనని అనుగ్రహించు దేవ మూర్తిని ప్రసాదించమని కోరుకున్నాడు ! గురువు జ్ఞానోదయానికి సమయం ఆసన్నమైంది అని తలచి శిష్యుడితో ఇలా అన్నాడు ! ఈ యుగానికి కాళీ మాత మూర్తి అన్నిటి కన్నా శ్రేష్టమైనది కావున కాళీ మాత మూర్తిని పూజించమని చెప్పి కాళీ మంత్రాన్ని కూడా ఉపదేశించాడు ! చైతన్యుడు సంతోషం గృహోన్ముఖుడయ్యాడు!
శివ మూర్తిని కూడా మునుపటి విష్ణు మూర్తి పక్కన అటక ఎక్కించేశాడు ! కాళీ మాత మూర్తిని ఆరాధించటం మొదలెట్టాడు ! కాళీ మాత మూర్తి ముందర ధూపాన్ని వెలిగించి పూజించడం మొదలు పెట్టాడు ! ఆ ధూపం గది మొత్తం నిండిపోతూ ఉంది ! అటక మీద ఉన్న శివుడి మూర్తిని సమీపించగానే చైతన్యుడు కోపం తో వెళ్ళి నన్ను అనుగ్రహించని ఈ మూర్తి (విగ్రహం) కాళీ మాత మూర్తికి అర్పించిన ధూపాన్ని పీల్చకూడదు అని ఆ మూర్తి యొక్క నాసిక రంధ్రాల్లో పత్తిని పెట్టబోయాడు !
అంతలో ఆ విగ్రహం మాయం అయ్యి కళ్ల ఎదుట పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ! పరమేశ్వరుడు చిద్విలాసం చేస్తూ దయతో కోరిక కోరుకో అన్నాడు !
ఈ హటత్పరిమాణానికి సంభ్రమాశ్చర్యాల్లో మునిగి పోయిన చైతన్యుడు పరమేశ్వరుడిని ఇలా అడిగాడు !
స్వామి ఇన్ని రోజుల నా జప మరియు పూజలకి స్పందించని వాడి వి నీ మూర్తి (విగ్రహం) నన్ను అనుగ్రహించటం కోసం కాదు అని తలచి నిన్ను పక్కన కి పెట్టిన తర్వాత ఇప్పుడు నన్ను అనుగ్రహించటానికి కారణం ఏమి అని అడిగాడు ?

పరమేశ్వరుడు ఇలా సమాధానం ఇచ్చాడు!
కుమారా చైతన్య నువ్వు ఇన్ని రోజులు పూజించిన ఆ మూర్తిలో నేను ప్రాణం తో ఉన్నాను అన్న భావం తో పూజించలేదు , ఇన్ని రోజులు కేవలం ఒక రాతి విగ్రహంగానే భావించావు , కానీ ఈ రోజు నా మూర్తికి ప్రాణం ఉంది అన్న భావనతో నేను ధూపాన్ని పీలుస్తాను అని నా మూర్తిలో ప్రాణం తో కూడిన నేను ఉన్నాను అని తలచావు కావున నీకు అనుగ్రహం లభించింది అని చెప్పాడు !
వేదం కూడా ఇదే చెప్తోంది కేవలం ప్రకృతిని , విగ్రహాలని పూజిస్తే లాభం లేదు అని ! దాని అర్థం తెలుసుకోలేని మూర్ఖులు వేదాలలో విగ్రహారాధన లేదు అని వితండవాదం చేస్తుంటారు ! మనం ఎప్పుడైతే విగ్రహం లో పరమాత్మ ని చూడగలుగుతామో అప్పుడే మనకి ఫలితం ఉంటుంది ! ఏదో విగ్రహానికి దండం పెట్టేశామా వెళ్లిపోయామా అన్న చందాన కాకుండా ఎప్పుడైతే ఆ విగ్రహం లో పరమాత్మ స్వరూపాన్ని స్మరిస్తామో అప్పుడే దానికి తగ్గ ఫలితం తప్పక లబిస్తుంది.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

17, మే 2018, గురువారం

గతించిన మన పితృదేవతలకు ఆహారం ఎందుకు సమర్పిస్తారు - Pitrudevatalu

పితృదేవతలు ఆహారం స్వీకరించడం ఏమిటి?
దేహధారులకు ఆయా దేహానికి సంబంధించిన ఆకలిదప్పులు తప్పవు. ఇప్పుడు మనం ఉన్నది మాంసశరీరం. ఈ శరీరాన్ని విడిచిన తరువాత వారికి యాతనాశరీరం ఇవ్వబడుతుంది. దేవతలకు దివ్య శరీరం. ఒకొక్కరికి ఒకొక్క రీతిలో శరీరనిర్మాణం జరుగుతుంది.
శరీరం ఉన్నవారికి యాతనలు తప్పవు. దేవతలు కూడా మనం ఇక్కడ చేసిన యజ్ఞయాగాదులు హవిస్సులను గ్రహించి మనకు ఇక్కడ కావలసిన వరాలను ఇస్తున్నారు. ఈ విషయం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినది ప్రామాణికం. 
ఇక్కడ శరీరం వదిలిన 13 రోజులలో యాతనాశరీరం తయారవుతుంది. వారికి ఆ యాతనాశరీరం సంపూర్ణంగా తయారయే విధంగా మనం 11 రోజులూ క్రతువులతో సపిండీకరణ కావించి వారికి ఆ శరీరపటుత్వాన్ని కలుగ చేస్తాం.
ఇదేలాగా అంటే మనకు పుట్టబోయే బిడ్డ కోసం మనం డాక్టర్ల వద్దకు వెళ్లి ఐరన్, ఇతర పోషక పదార్ధాలు కలిసిన మందులు తీసుకుంటూ, వారికి ఆరోగ్యంగా ఉండేట్టు ఇంజక్షన్లు తల్లి తీసుకున్నట్టు, శరీరం విడిచిన జీవునికి ఆ సంవత్సర యాత్రా సుఖంగా ఉండేటందుకు వారికి పటుత్వం ఉండేటందుకు ఈ అపరకర్మలు చేస్తాము. అంతేకాక నెలనేలా మాసికాలు, 180 రోజులకు ఊనశన్మాసికాలు, ఇతరత్రా వ్యవాహారాలు వారికి ఆ శరీరం యందు సుఖం కలుగ చెయ్యడం కోసమే. ఏమి అవి చెయ్యకపోతే వారికి శరీరాలు రావా అంటే వస్తాయి, ఏ జాగ్రత్తలు తీసుకొని తల్లులకు కూడా పిల్లలు పుట్టినట్టు. కానీ తెలిసిన విధానంలో వారికి తగుపోషణ తీసుకుంటే ఏవిధంగా ఆరోగ్యవంతమైన శిశువు పుడతాడో, అదే రకంగా శాస్త్రం చెప్పిన కర్మలు చేస్తే వారికి అంత సౌకర్యవంతమైన శరీరం అందుతుంది.

దేవతలకు అగ్నిపూర్వకంగా హవిస్సులు స్వాహాకారంతో అర్పించగా హవ్యవాహనుడు అయిన అగ్నిభట్టారకుడు వారికి ఆ హవిస్సులను అందచేస్తున్నాడు. ఇదే విధంగా స్వధాకారాలతో అర్పించిన పిండాలను యాతనాశారీరంలో ఉన్న పితృదేవతలకు వారికి అందచేస్తున్నాడు. అంతేకాక మనం నల్లనువ్వులతో కలిపి అర్పించిన అన్నపిండాలను పశుపక్ష్య, జలచరాల రూపంలో, నువ్వులతో వదిలిన తర్పణాలను సూక్ష్మరూపంలోనూ, బ్రాహ్మణులకు పెట్టిన భోజనాన్ని వసురుద్రఆదిత్య రూపంలో అతని ద్వారా గ్రహిస్తున్నారు. కాబట్టి పితృదేవతలు మనం ఇచ్చిన భక్ష్యభోజ్యాలను, పిండాలను, తర్పణాలను తగువిధంగా వారికి తగ్గరీతిలో గ్రహిస్తున్నారు, గ్రహించి మనల్ని అనుగ్రహిస్తున్నారు. ఇక్కడ పితృదేవతలు అంటే కేవలం శరీరం వదిలిన తల్లితండ్రులు మాత్రమె కాదు, వసు, రుద్ర ఆదిత్య రూపంలో ఉన్న గణాలు. మనం వీరిద్వారా ఆ పిత్రుగాణాలను సంతృప్తి పరుస్తున్నాము.


మరి ఆయా పితృదేవతలకు చేసే క్రతువులలో ఎలా ఉండాలి యజమాని, ఆ గృహిణి అంటే శాస్త్రం ఎన్నో కట్టుబాట్లు చెప్పింది. కొంతమంది ఏమి మేము పంజాబీ డ్రస్సులు వేసుకుంటే వారు రారా అన్న వితండ వాదం చేస్తుంటారు. వారికి సమాధానం కొన్నింటికి కొన్ని మర్యాదలు ఉంటాయి. ఇప్పుడు అదే చెఫ్ గా ఉండమనండి, ఒక apron వేసుకుని నెత్తిన ఒక టోపీ పెట్టుకుని తయారవుతారు, లేదా ఒకడిని ఇంటర్వ్యూ కి వెళ్ళమంటే సూటు, బూటు వేసుకుని టై కట్టుకుని హుందాగా వెళ్తాడు, ఏమి ఇవి లేకుండా వెళ్ళలేరా అంటే అది సభామర్యాద. ఏ పని చేసేటప్పుడు ఆ విధంగా ఉండాలి. ఇక్కడ ఎంతో శ్రద్ధతో చేసే శ్రాద్ధానికి శాస్త్రం మడి బట్టను కచ్చ పోసి కట్టుకోమంది. నువ్వు చేసే శ్రద్ధను గమనిస్తారు పెద్దలు. శ్రాద్దాలలో నీ శ్రద్ధనే ప్రధాన పెట్టుబడి, మిగిలినవి అన్నీ శాస్త్రం చెప్పినట్టు చెయ్యడమే. నీ శ్రద్ధకు మురిసి నీ పితృదేవతలు మిగిలిన దేవతలతో పోట్లాడి అయినా సరే నీకు జరగవలసిన మంచిని జరిపిస్తారు. నీ పితృదేవతలు నీకు అతిదగ్గరగా ఉన్న దేవతలు, ఇతర దేవతలకన్నా నీమీద అనురాగం మరింతగా ఉన్నవారు. శాస్త్రం ముందు పితృదేవతలను చెప్పి అటుపై దేవతార్చన చెబుతుంది, అంటే వారి ప్రాముఖ్యత ఏమిటో గ్రహించండి. అటువంటి వారికి మనం చేసే క్రతువులలో మరెంత శ్రద్ధ కనబర్చాలో తెలుసుకోండి.

!! ఓం నమో వేంకటేశాయ !! 
!! సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

16, ఏప్రిల్ 2018, సోమవారం

సంస్కృతభాషను ప్రపంచ భాషలకు తల్లి భాష అని ఎందుకు అంటారు - Samskruta Bhasa

samskruta-bhasa-nijalu
సంస్కృతభాష__ప్రపంచాన్ని_తనవైపు_తిప్పుకుంటోంది

సంస్కృతభాషను గురించి మీరు ఆశ్చర్యపోయే నిజాలు ఏమిటో చూద్దాం. ఈ నిజాలను గుర్తించిన ప్రపంచం సంస్కృతాన్ని నెత్తిన పెట్టుకోవడం ప్రారంభించింది.

1.NASA వారి ప్రకారం ప్రపంచంలోని అన్ని భాషలలో అత్యంత స్పష్టమైన ఉచ్చారణ కలిగిన భాష సంస్కృతమే

2.ప్రపంచంలోని అన్ని భాషలలోనూ ఎక్కువ శబ్దకోశం (vocabulary) ఉన్నది సంస్కృతానికే.

3. ప్రస్తుతానికి సంస్కృతభాషలో 102,78 కోట్ల 50 లక్షల శబ్దాలు ఉన్నాయి.

4.సంస్కృతమనేది ఏ పదానికైనా ఒక ఖజానా వంటిది. ఉదాహరణకు 'ఏనుగు' అనే పదానికి సంస్కృతంలో 100 పైన పదాలున్నాయి.

5.NASA వద్ద ప్రస్తుతం 60,000 తాళపత్ర గ్రంథాలున్నాయి. వాటిలోని విషయాలపై పరిశోధన జరుగుతోంది.

6.1987 లో Forbes మ్యాగజీన్ computer software కు సంస్కృతభాష అత్యంత ఉపయోగకరం అని ప్రచురించింది.

7. మిగతా భాషలతో పోలిస్తే సంస్కృతభాషలో అతితక్కువ శబ్దాలతోనే వాక్యనిర్మాణం పూర్తిచేయవచ్చు.

8. ప్రపంచంలోని అన్ని భాషల ఉచ్చారణలో, నాలుక యొక్క మాంసగ్రంథుల పూర్తి వినియోగం జరిగేది కేవలం సంస్కృత భాష మాట్లాడుటలోనే.

9. అమెరికన్ హిందూ యూనివర్సిటీ ప్రకారం సంస్కృతభాష మాట్లాడేవారికి షుగర్ వ్యాధి కానీ, రక్తపోటు ఎన్నటికీ రావు.

10. సంస్కృతసంభాషణ వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. Speech therapy కి ఈ భాష అత్యంత ఉపయోగకరం.

11.జర్మనీ లోని 14 యూనివర్సిటీ లలో సంస్కృతబోధన జరుగుతోంది.
samskruta-bhasa-nijalu

12. NASA వారు అంతరిక్షంలోని వ్యోమగాములకు సందేశాలు పంపుతుంటే అవి చేరేటప్పటికి అందులోని పదాలు అస్తవ్యస్తమవుతున్నాయట. చివరికి వారు సంస్కృతాన్ని ఆశ్రయించి వారి ప్రయత్నంలో విజయం సాధించారు. ఎందుకంటే సంస్కృతవాక్యాలలోని పదాలను ఇటూఅటూ మార్చినా వాక్యార్థమూ మారదు. ఉదాహరణకు ఈ సంస్కృతవాక్యం చూడండి. "నేను పాఠశాలకు వెళ్ళుచున్నాను" అని చెప్పాలంటే
1. అహం పాఠశాలాం గచ్ఛామి ,అని చెప్పాలి. ఇందులోని పదాలు ఇటుఅటు అయినా అర్థం మారదు. దానినే
2.పాఠశాలాం గచ్ఛామి అహం.
3 గచ్ఛామి అహం పాఠశాలాం. ఇలా చప్పినా అర్థం మారదు అన్న నిజం NASA వారిని ఆశ్చర్యచకితులను చేసింది.

13. ఇంకొక విషయం. కంప్యూటర్ ద్వారా గణితసమస్యలకు programming language లో వ్రాసే algorithms సంస్కృతభాషలోనే వ్రాయబడి ఉన్నాయి గానీ ఇంగ్లీషు లో కాదు.

14.NASA వారి ద్వారా ప్రస్తుతం 6th మరియు 7th జనరేషన్ సూపర్ కంప్యూటర్లపై పరిశోధన జరుగుతోంది. ఇవి 2034 కల్లా తయారవుతాయట. అందులో వారు ఉపయోగిస్తున్న భాష సంస్కృతమే.

15.సంస్కృత భాషాభ్యాసం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుందని, జ్ఞాపకశక్తి పెరుగుతుందని పరిశోధనలలో ఋజువు పరచుకుని ప్రస్తుతం ఇంగ్లండ్ మరియు ఐర్లాండ్ లలో సంస్కృతాన్ని compulsory language గా బోధించటం ప్రారంభించారు.

16. ప్రస్తుతం ప్రపంచంలోని 17 దేశాలలో (  కనీసం ఒక యూనివర్సిటీ లోనన్నా ) Technical Courses లో  సంస్కృతబోధన జరుగుతోంది.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

5, మార్చి 2018, సోమవారం

ధర్మ సూక్ష్మములు మరియు సనాతన ధర్మమము - Dharma's subtle and classical dharma

sanatana-dharmamu-dharma-sukshmamlu


సనాతన ధర్మమము మరియు ధర్మ సూక్ష్మములు.:
వేదః అఖిలః ధర్మమూలమ్.
అహింసా పరమోధర్మహః , ధర్మోరక్షతి రక్షితః
ధర్మము అనగా ఏమి? ఇది ఎప్పుడు పుట్టినది, ఎప్పటినుండి ఉంది? మనది సనాతన ధర్మము. సనాతనము అనగా ఎప్పుడు పుట్టినదో ఎలా పుట్టినదో తెలియనిది నాలుగు యుగములకంటే ముందునుంచి ఉన్నది కావున ఇది సనాతనము.

ఈ విశ్వములో అనగా నాలుగు యుగములలో అందరూ (ఎంతటి వారైనా) పాప పరిహారార్థం ధర్మపరులై,ధర్మవర్తనములో జీవించువానే ఆశ్రఇస్తారు. ఎందుకనగా ధర్మాచరణ పరులను, ధర్మాత్ములను దర్శించి వారి దివ్య ఆశీస్సులు పొందుటవలన మనము చేసిన పాపములు పఠాపంచలైపోతాయి. “ధర్మేణ పాప మపనుదతి” కదా. మరియు ధర్మమే ఈ జగత్తుకు మూలాధారము. “ధర్మో విశ్వస్య జగతః” అన్నారు. అంటే ఈ సృష్టి, స్థితి, లయములకు ధర్మమే కారణము ధర్మమే ఆధారము.

పరమోత్కృస్టమైనది ధర్మము ధర్మాన్ని పట్టుకోవడం, ఆచరించడం అంత సులభముకాదు. ధర్మాని పట్టువదలకుండా పట్టుకొని ఆచరించాలంటే అందుకు చాలా ఓర్పు, సహనం, ధైర్యము, మనోనిబ్భరము కావలయును. ఎన్నో క్లేశములను, మనస్తాపాలను ఎదుర్కోవలసి వస్తుంది. కావున ఓర్పు, సహనము మనోనిబ్భరము లేనివారు ధర్మాచారణ చేయలేరు. అదియునూ కాక ధర్మము తన ఫలములను వెంటనే ఇవ్వదు. ఎంతో ఓరిమి వహిస్తేకాని ఆ ఫలములు మనకు అందవు. మరియు ఆ అందిన ధర్మ ఫలములు శాశ్వితములు.
“ధర్మోఏవహతో హన్తి ధర్మోరక్షతి రక్షితః,
తస్మోద్ధర్మన త్యజామి మానోధర్మో హాతోవధీత్.” 
యజుర్వేదాంతర్గత, తైత్తరీయ, శిక్షావళ్ళి నుండి.

ఎవరైతే ధర్మాన్ని పట్టుకుంటారో అనగా మాటలలో కాదు, ధర్మము తెలిసి ఉండడముకాదు, చేతలలో ధర్మాని జీవితములో ఆచరించి పట్టువిడవకుండా ధర్మానిపట్టుకొని జీవిస్తారో వారిని సర్వకాలసర్వావస్తలయందు ధర్మము వారికి అంగరక్షకుడుగా నిలబడి కాపాడుతుంది. ఎవరైతే ధర్మాన్ని తప్పి ధర్మానికి క్లేశము, హాని కలిగిస్తారో వారిని ధర్మమే నశింపచేస్తుంది. ఇది వారు వీరు చెప్పినమాట కాదు సాక్షాత్తు వేదమాత వేదములో యజుర్వేదములో, తైత్తరీయోపనిషత్తు లో, శిక్షావళ్ళిలో చెప్పిన వేదప్రమాణము.

ధర్మబద్ధముగా జీవించాలి, వేదప్రమాణము కానీ పనులను, కుకర్మలను చేయరాదు. “కుశయనం, కుస్త్రీ,కుభోజ్యం వ్రజః” దుష్టమైన చోట నిదురించరాదు, దుష్టస్త్రీ సాంగత్యము చేయరాదు, దుష్టాహారము తినరాదు. వీటివలన మరణము అనారోగ్యము కలుగును.
ధర్మయుతముకాని, వేదమంగీకరించని సంపాదన, సుఖము, సంతోషము, భోగము, విద్యలు నిరుపయోగములు. నిరుపయోగమేకాక వాటివలన వచ్చు ఆ తాత్కాలిక సుఖము, భోగము, సంతోషము, సంపాదనల పాపము కలుగడమేకాక వీటివలన జీవితము నరకప్రాయమౌతుంది. ఆ పాపము మనలను మాత్రమేకాక మన వంశాన్ని (వంశములో ముందు తరాలవారిని వెనుక రాబోవు వంశోద్ధారకులను) కట్టి కుదుపుతుంది. కావున
“శ్రోత్రత్వక్కు చక్షురవ్సు జిహ్వఘ్రాణ జ్ఞానేంద్రియాణి,
వాక్పాణి పాదయూ పస్థాఖ్యాని కర్మేంద్రియాణి” 
ఐదుజ్ఞానేంద్రియములు, ఐదుకర్మేంద్రియములు, ఐదుప్రాణములు, ఒక మనస్సు, ఒక బుద్ధి వీటితో నడచుచున్న ఈ ఉపాధిని చాలాజాగ్రత్తగా సర్వకాల సర్వావస్తలయందు అనగా ధన సంపాదనను, వాక్కును, కర్మను (చేసే పనులు) మనసును, చూపులను, వాసనలను ధర్మమార్గములో ఉండునట్లు జీవించే విధముగా మలచుకోవాలి. ఈ విధముగా వేదప్రోక్తముగా, పరమాత్మ మెచ్చుకొను విధముగా జీవించే జీవితము ధన్యము.

పంచమవేదమని పిలువబడే మహాభారతములో శౌనకుడు ధర్మరాజుతో ధర్మము గురించిన ధర్మవిచారము ఏమనగా విషయవాంఛలచేత రాగము, దానిచే కామము, దానిచే తృష్ణ, దానిచే సర్వపాపములు కలుగును. అర్థమే (డబ్బు) అన్ని అనర్ధములకూ మూలము. అర్ధము వలన లోభ, మోహ, మద, మాత్సర్య, గర్వ గుణములు వృద్ధి చెందును. ఈ ధనాశచే ధర్మమునకు హాని తలపోయును. కావున ధర్మవిదితమైన ధనసంపాదనే యోగ్యము శ్రేయోదాయకము.

మహాభారతములో లోశమ మహర్షులవారు ధర్మరాజుతో ధర్మాధర్మ విషయములను ఈ విధముగా నుడివిరి. అధర్మపరులకు అభివృద్ధి నేనువెంటనే కలుగును. కానీ అది క్షణికము. అధర్మమును ఆశ్రఇంచినవాడు దుష్ట బుద్ధితో ఎదుటవారిని గోతిలో పడవేయడానికి ఒక పెద్ద గొయ్యి తీసి ఉంచుతాడు. కానీ ఆ గోతిలో తానే పడి విలవిలలాడుతాడు. అధర్మము వలన ధనము,(అధికారము), దానివలన దర్పము, స్వాభిమానము, దానివలన క్రోధము, దానివలన కలిగిన గర్వముతో విచక్షణా హీనులై, లజ్జాహీనులై శీలమును కోల్పోతారు. ఎప్పుడైతే శీలమును కోల్పోతారో అపుడు లక్ష్మీదేవి వారిని వీడి వెళ్లిపోతుంది. లక్ష్మీదేవి వెళ్ళిపోవడముతో ధైర్యము వెళ్లిపోతుంది. అందువలన సర్వమూ కోల్పోయి అష్ట దరిద్రు లవుతారు. మరి ధర్మమును నమ్ముకొని ధర్మాచారరణతో జీవించువారు ఎన్నో కష్టాలను, అవమానములను, మనస్తాపము లను ఎదుర్కొని వాటిని భరిస్తారో వారు అధర్మ పరులకంటే వేయి రెట్లు సుఖ సంతోషములను పొందుతారు. అలా పొందిన సుఖ సంతోషములు శాశ్వితమైనవి.

మార్కండేయ మహర్షులవారు ధర్మరాజుతో యుగధర్మములను గురించి ఈ విధముగా వివరించారు. కృత యుగములో ధర్మము నాలుగు పాదములతోనూ, త్రేతాయుగములో ధర్మము మూడు పాదములతోనూ, ద్వాపరయుగ ములో ధర్మము రెండు పాదములతోనూ, కలియుగములో ధర్మము ఒంటి పాదముతోనూ వర్తించును. మరియు కొన్ని కలియుగ లక్షణములను ఈ విధముగా వివరించారు. ఆవు పాలు తరిగి శంకరజాతి పాడి పెరుగును. నవరసముల రుచి తగ్గును. జలచరములు భోగ్య, భోజ్య వస్తువులగును. ధనము కొరకు విప్రులు శూద్ర సేవలతో, వేదపఠనము మరచి సంద్యావందనము, నిత్యపూజాది క్రతువులకు తిలోదకాలిచ్చి మదోన్మత్తులై మధుపానము, మాంస భక్షణము,వేదవిక్రయము, చేయుచుందురు. భ్రూణహత్యలు, స్త్రీ పతనం, వేదధూషణం, కపటవ్యాపారములు ఇత్యాది అకృత్యములు చేయుటలో ఉత్సాహవంతులై వర్ణాశ్రమ వ్యవస్థను పూర్తిగా పతనము చేయుచుందురు. కృతయుగమున తపముచేత, త్రేతాయుగమున యజ్ఞయాగాదులచేత, ద్వాపరయుగమున కర్మచేత,కలియుగమున కేవలము భాగవన్నామ జపముచేత మరియు వేదప్రోక్తమైన ధర్మాచరణముచేత ముక్తి పొందగలరని సెలవిచ్చారు.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

నోము లేక వ్రతము - అసలు నోములు అంటే ఏమిటి ? - Nommulu or Vratamu

Nommulu or Vratamuనోము లేక వ్రతము ... అనగా దీర్ఘకాలాను పాలనీయమైన సంకల్పము. సంకల్పము అనగా "ఇది నేను చేయవలెను, విడవరాదు" అనుకొనుట. జీవితపు నాలుగు దశలలో ఆచరించు నోములున్నవి. సంస్కృత సారస్వతంలో మూడు వందల ఇరవై నోములు కలవని ప్రతీతి.

ఆంధ్ర దేశమున స్త్రీలు, పిల్లలు నోములు నోచుట అనాదిగా ఆచారముగా ఉన్నది. స్త్రీలకు బాల్యము నుంచి సదాచార సంపత్తులను సంప్రాప్తింప జేయుటకు గాను ఈ నోముల ఆచారం ఏర్పడి ఉండవచ్చును. ఈ నోములలో చిన్నతనం నుండి స్త్రీలు కోరవలసిన సామాన్య సుఖసంతోషాలు మొదలుకొని వార్ధక్యములో వాంఛించు కైవల్యప్రాప్తి కొరకు కోరికలకు తగినట్లుగా ఆచరించవలసిన నోములు కలవు.

మన దేశములో బాల్య వివాహములు ఆచరణలో ఉన్నందున వివాహానంతరము నోములు నోచుటయే ఆచరణలో నున్నది. ఈ వ్రతములందు త్రిమూర్తులు దేవీ సహితులై పూజింపబడుచుందురు. ఈ వ్రతములలో కొన్ని పురాణ వ్యాఖ్యాత సూత మహర్షి చెప్పినవి కూడా కలవు. త్రిలోక సంచారియైన నారదు చెప్పినవి కొన్ని కలవు. స్త్రీలు ప్రాతఃకాలముననే లేచి చేయవలసిన నిత్యకృత్యములన్నీ ఈ వ్రతాలు ఆచరించడం ద్వారా సిద్ధిస్తాయి.

ఈ నోములలో నిగూఢమై యున్న మొదటి ధర్మము వితరణం అనగా ఉన్నంతలో పండో, పత్రమో, వస్తువో, ధనమో, ధాన్యమో, భోజనమో ఇతరులకు ఇవ్వడము. ఇతర ప్రయోజనములు భగవద్భక్తి, సదాచార సంపత్తి, ఉదయమే లేచుట, నిత్యకృత్యములు తీర్చుకొనుట, స్నానమాచరించుట, మడి వస్త్రములు ధరించుట, పచన కార్యములు నెరవేర్చుట, భక్తిశ్రద్ధలతో షోడశోపచారములతో దైవము నారాధించుట, దైవ నివేదితమైన ప్రసాదమును అందరికి పంచి తాను స్వీకరించుట..
సన్మార్గం వీడి చరియించువారల పట్టి కాపాడుటే వ్రతము . నియమ-నిబంధనలతో ఉపవాసము తో చేసే పూజ లేక అరాధన . వ్రతము లో సంకల్పము , దీక్ష , కథాపఠనము తప్పనిసరి . వ్రతము చేయుటవలన సమస్త పాపములు పోయి ... పుత్ర పౌత్ర సంపదాభివృద్ధి , సర్వ సౌభాగ్యములు కలుగును . వ్రతాలను నోములని కూడా అంటారు .

కొన్ని రకాల నోములు:
 • ఉదయ కుంకుమ నోము.
 • పదారు ఫలముల నోము.
 • పూర్ణాది వారముల నోము.
 • సంపద శుక్రవారం నోము.
 • వరలక్ష్మీ వ్రతం.
 • దైర్యలక్ష్మీ నోము.
 • నందికేశ్వర వ్రతం.
 • మూగ నోము.
 • వావిలి లక్ష్మీవారము నోము.
 • పెండ్లి గుమ్మడి నోము.
 • సూర్యచంద్రుల నోము.
 • పోలి స్వర్గమునకు వెళ్ళు నోము.
 • సావిత్రీ వ్రతం.
 • గౌరీ వ్రతం.
 • బొమ్మల నోము.
 • పువ్వు తాంబూలము నోము.
 • దంపతుల తాంబూలము నోము.
 • శ్రావణ మంగళవారము నోము.
 • రేగుల గౌరీ నోము.
 • కేదారేశ్వర వ్రతం.
 • సోమవార వ్రతం.
 • చంద్రోదయ ఉమావ్రతము ,
 • క్షీరాబ్ధిశయన వ్రతం.
 • కోజగారీ వ్రతము ,
 • పోలేరమ్మ వ్రతము.
 • కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం.
 • కేదారేశ్వర వ్రతం.
 • చాతుర్మాస్య వ్రతం
 • దూర్వాగణపతి వ్రతం.
 • వట సావిత్రీ వ్రతము.
 • రంభా వ్రతము ,
 • వరలక్ష్మీ వ్రతం.
 • కోజగారీ వ్రతము ,
 • చంద్రోదయ ఉమావ్రతము,
 • పాశుపత వ్రతము ,
 • పోలేరమ్మ వ్రతము,
 • మంగళ గౌరీవ్రతము ,
 • శ్రావణ గౌరీవ్రతము ,
 • శ్రీ సత్యనారాయణ వ్రతము
 • ఋషిపంచమి వ్రతము - Rushipanchami ,
 • అరుంధతి వ్రతం -Arundhati vratam

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

17, నవంబర్ 2017, శుక్రవారం

యజ్ఞోపవీతం - The Vedic Sacred thread

yagnopavidamu-Sacred-thread

'యజ్ఞ+ఉపవీత ' అను రెండుపదాలలో ఈ యజ్ఞోపవీతశబ్దం ఏర్పడుతుంది. యజ్ఞ = యజ్ఞార్థము- అనగా ఉత్తమ కర్మలాచరించుటకు చిహ్నంగా ధరింపబడు, ఉపవీతం = దారం. కనుక దీనిని యజ్ఞోపవీతమంటారు. "యజ్ఞో వై శ్రేష్ఠతమం కర్మ"- శ్రేష్ఠమైన (సత్) కర్మలన్నీ యజ్ఞపదంతో చెప్పబడుతాయి. కావున యజ్ఞోపవీత శబ్ధంలోని యజ్ఞ పదం మానవుడు పురుషార్థ సాధనకు చేయునుత్తమకర్మల కన్నింటికి బోధకంగా- సూచకంగా- ఉంటుంది. కనుక ఆర్యులు వ్రతమయంగా జీవితం గడుపదలంచి దీనిని వ్రతచిహ్నంగా - దీక్షాచిహ్నంగా - ధరిస్తారని గ్రహించాలి.

ఈ యజ్ఞోపవీతధారణ ఉపనయన సంస్కారంలో చేయబడుతుంది. ఉపనయన సంస్కారంలో రెండు భాగాలున్నాయి. ఒకటి యజ్ఞోపవీతధారణ, రెండు వేదారంభము (గాయత్రీ మంత్రోపదేశము). బాల్యంలో ఐదవయేటనో ఎనిమిదవయేటనో బాలబాలికలకు ఉపనయనం చేయబడుతుంది. బ్రహ్మచర్యాశ్రమంలో ఉండి విద్యాబుద్ధులార్జించుటకు తమచెంత చేరిన విద్యార్థినీ విద్యార్థులకు ఉపనయన సమయంలో గురువులు మొదట విద్యాచిహ్నంగా యజ్ఞోపవీతధారణ చేస్తారు.

సత్యవ్రత మంత్రాలతో జీవితం వ్రతమయంగా గడపాలని బోధిస్తారు. పిమ్మట గాయత్రీ మంత్రోపదేశంతో వేదారంభం చేస్తారు. కాబట్టి వ్రతమయంగా జీవితం గడపడానికి యజ్ఞోపవీతం బాహ్యచిహ్నంగా ధరింపబడుతుందనుటలో సందేహంలేదు. అయితే బాహ్యచిహ్నం ధరించినంతమాత్రన శారీరకంగా మానసికంగా ప్రవృత్తిలో మార్పువస్తుందా? యజ్ఞోపవీతధారి ఉత్తముడగునా ? అని ప్రశ్నింపవచ్చు. బాహ్యచిహ్నం బాహ్యచిహ్నమే. బాహ్యచిహ్నంలో ఒక విశేష కార్యాచరణకు పురికొల్పు శక్తి ఉండనేరదు. అయితే, ఒక విషయం చూడాలి. యూనివర్సిటీవారు గ్రాడ్యుయేటుకు చిహ్నంగా గౌను ఇస్తారు గదా! ఆ గౌను గ్రాడ్యుయేటు నొనరిస్తుందా ? ఒనరించదు. కాని అంతమాత్రాన అది అనావశ్యక మనగలమా ? అనజాలము. గ్రాడ్యుయేటు గౌను నాన్ గ్రాడ్యుయేటులనుండి భేదింపజేస్తుంది. బాలభటుడు దుస్తులు తదితరుల నుండి వానిని వేరుస్తారు. ఇట్లు చిహ్నము లన్నీ భేదబోధకములే అవుతాయి. చిహ్నలక్షణమే భేదబోధకత్వం. అట్లే ఆర్యులకు, అనార్యులకు (దస్యులకు) భేదబోధక చిహ్నమే యజ్ఞోపవీతం అవుతుంది. ఇతర చిహ్నాలను ఆదరించినట్లే సమాజం యజ్ఞోపవీతాన్ని కూడ ఆదరించాలి. యజ్ఞోపవీత నియమాలను బోధించి, పాలించి, పాలింపజేసి సమాజం దానిని ఆదరిస్తూఉంటే తప్పకుండా యజ్ఞోపవీతంవల్ లజనులకు (యజ్ఞోపవీతధారులకు) మేలు కలుగుతుంది. యజ్ఞోపవీతధారులు శ్రేష్ఠులు అవుతారు. సందేహం లేదు.
అయితే యజ్ఞోపవీతధారులై కూడా కొందరు దృఢసంకల్పంతో దాని నియమాలు పాలించకపోవచ్చు. అట్టి వారికి దాని ప్రయోజనం లభించదు. ఏలయనగా- ప్రార్థనలో మొదటి భాగం సంకల్పం మాత్రం చేసి, రెండవ భాగమైన ప్రయత్నం - ఆచరణ - చేయనిచో (ప్రార్థన పూర్తికాకుండ) ప్రార్థనా ఫలం ఎట్లు సిద్ధిస్తుంది.? రెండుభాగాలు నెరవేర్చిననాడే ప్రార్థన పూర్తవుతుంది. ఫలితం సిద్ధిస్తుంది. ఇది నియమం.
యజ్ఞోపవీత నిర్మాణం:
యజ్ఞోపవీత పరిమాణం దానిని ధరించు మానవుడి పొడవు (ఎత్తు)ననుసరించి ఉంటుంది. యజ్ఞోపవీతాన్ని ధరించి కుడిచేతి బొటనవ్రేలి పంగలో తగిలించుకొని చేయి సాచినపుడు అది వదులుగాగాని బెట్టుగాగాని లేకుండ ఉండటమే దానిని ధరించువారికి తగిన పరిమాణం అని నిర్ణయింపబడింది. ఆ యా యజ్ఞోపవీతధారుల బెత్తకు (నాలుగువ్రేళ్ల మొదట) దారమును తొంబదియారుచుట్లుచుట్టి దాని నొక ఆకునకు తగిలించాలి. తరువాత ఆ కొనను త్రెంచకుండానే మడచి రెండవ పేట చేర్చి దానినంతయు రెండవ ఆకునకు చుట్టాలి. అట్లే దారం త్రెంచకుండ మరల మడచి మూడవా పేటగా చేర్చి దానినింకొక ఆకునకు చుట్టాలి. అప్పుడది మూడు పేటలవుతుంది. అట్లు చుట్టడానికి మోదుగాకు నుపయోగించుట ప్రశస్తంగా చెప్పబడింది. లేక మరొక విధంగా మెలికవేయుచు ఒకే పర్యాయం మూడుపేటలు వచ్చునట్లు బెత్తకు తోడవచ్చును. అట్లు చుట్టిన మూడు పేటలను కలిపి చేతి తకిలితో వడికి పురి పెట్టాలి. దానిని మరల ముప్పేటగా మడచి వడికి పురిపెట్టాలి. ఇప్పటికి తయారైన పోగునందు తొమ్మిది ఒంటిపోగులుంటాయి. దానిని మరల యజ్ఞోపవీత-ఆకారంగా మూడు చుట్లు త్రిప్పి మూడు పోగులు సమానంగాజేసి మెలికలు పడకుండ, జారిపోకుండ గట్టిగా ముడివేయాలి. ఆ ముడిని బ్రహ్మముడితో పోలుస్తారు.

లోకంలో వ్యక్తిగతమైన మతాలు వెలసి సంప్రదాయాలు పెరిగినకొలది ఈ ముళ్ళలో మార్పులు చేయబడి శైవముడి, వైష్ణవముడి, స్మార్తముడి అంటూ రకరకాలుగా భేదాలు కల్పించబడినాయ్. కాని యేది యెట్లు మారినా మూడుపోగులు వేరువేరుగా విడిపోకుండునట్లు, మెలికలు పడకుండునట్లు వేయు గట్టి ముడియే ఇట ఉద్దిష్టము. ఆముడి వేస్తూ ఉండగా చూచియే గ్రహించాలి. ఇట్లు తయారుచేయబడిన యజ్ఞోపవీతం బెత్తకు చుట్టితే తొమ్మిది బెత్తలుంటుంది. బారుగా తీసిచూస్తే పదునెనిమిది బెత్తలవుతుంది. ఈ బెత్తలు కొంచెం పెద్దవి. జేనలతో కొలిచినచో ఏడుజేనలుంటుంది. ప్రతి మనుష్యుడు తనజేనతో ఏడుజేనలే పొడవుంటాడు. యజ్ఞోపవీత నిర్మాణంలో ఈ అభిప్రాయం గర్భితమై ఉంది. పర్యవసానంగా తేలిన యజ్ఞోపవీతంలోని మూడుపోగులలోను ఇరవై యేడు ఒంటిపోగులుంటాయి. కావున బెత్తల లెక్కలలో చూస్తే బెత్తల పొడవుగల ఒంటిపోగుంటుంది. కాని మొదట తీసికొన్నపుడు బెత్తల బారు తీసుకొన్నాం. వడివేసి ముడివేయగా సుమారు ఏడవ వంతు బారు తగ్గిపోతుంది. ఇది యజ్ఞోపవీతం యొక్క బాహ్య స్వరూపం; నిర్మాణ (పద్ధతి) విధానం.

యజ్ఞోపవీత నామములు:
యజ్ఞోపవీతమునకు బ్రహ్మసూత్రమను నామము సమస్త సూత్ర గ్రంధములందు, సంస్కారకోశములందును వాడబడింది. బ్రహ్మశబ్దమునకు 'వేదము, విద్య, జ్ఞానము 'అను నర్థములు సంస్కృతకోశములలో వ్రాయబడినాయి. కావున బ్రహ్మ (వేద) ఆరంభసమయంలో ధరింపజేయబడుటవల్లనిది బ్రహ్మసూత్రమనబడుతున్నది. కనుకనే మహర్షి దయానందసరస్వతి తన సత్యార్థ ప్రకాశంలో ("బ్రహ్మణి వేద గ్రహణకాలే- ఉపనయన సమయే ధృతం యత్సూత్రం ఇతి బ్రహ్మసూత్రమ్."- వేదారంభ కాలంలో ఉపనయన సంస్కారమునందు ధరింపబడు సూత్రం గనుక బ్రహ్మసూత్రమనబడును.) విద్యకు చిహ్నము యజ్ఞోపవీతమని పేర్కొన్నారు. కాలాంతరంలో ఈ బ్రహ్మసూత్రమే యజ్ఞసూత్రం, యజ్ఞోపవీతం, వ్రతబంధం మొదలగు నామాలతో ప్రఖ్యాతమైంది. యజ్ఞమునకు తద్భవరూపం జన్నము, ఆ జన్నమునుండి (యజ్ఞోపవీతర్థములో) ఏర్పడినదే 'జన్నిదమూ అనేపదం. జన్నిద పదమే జందెముగా మారినది. కాగా యజ్ఞోపవీతమను సంస్కృత పదానికి బదులుగా తెలుగులో జన్నిదము, జందెము అను పదాలు వాడబడుతున్నయ్. జంధ్యము అనునది అపభ్రంశరూపంగా కనబడుతుంది. ఉపవీత శబ్దానికి సూత్రం అని అర్థం. సాధారణంగా జందెమనునర్థంలో ఇది వాడబడుతుంటుంది. ఉపవీతమునకు బదులుగా వేదములో పరివీత శబ్దం కూడ వాడబడుటుంది. ఈ రెండు శబ్దాలలో 'ఉప, పరీ- ఉపసర్గం భేదమేగాని అర్థంలో భేదంలేదు. ఉపవీతమన్నా పరివీతమన్నా జందె మనియే అర్థం.

యజ్ఞోపవీత మంత్రం:
 • ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం 
 • ప్రజాపతే ర్యత్ సహజం పురస్తాత్ | 
 • ఆయుస్య మగ్ర్యం ప్రతిముంచ శుభ్రం 
 • యజ్ఞొపవీతం బలమస్తు తేజః 
 • యజ్ఞొపవీత మసి యజ్ఞస్య త్వా 
 • యజ్ఞొపవీతేన ఉపనహ్యామి || 
హే వత్సా! జందెము మిక్కలి పవిత్రమైనది. అంత:కరణ శుద్ధికి అది తోడ్పడుతుంది. జీవున కాదికాలమునుండి ప్రాణముతోపాటు శరీరంలో ఉండేదిగా నిర్ధిష్టమైంది. అది అయుర్వర్ధకమై సాటివారిలో అగ్రేసరత్వమును కలిగిస్తుంది. తేజోబలములను చేకూరుస్తుంది. కాన దీనిని ధరింపుము.

వత్సా! నీవు వేదాధ్యయనం కొరకు నాచెంత చేరితివి. ఉత్తమ జీవనాదుల సంపాదించుకొరకు ఈ యజ్ఞోపవీతముతో నిన్ను వ్రతధారిని చేయుచున్నాను." అనుచు గురువు యజ్ఞోపవీత మంత్రంలో శిష్యునికి ఉపనయనసంస్కార సమయంలో యజ్ఞోపవీతధారణ చేస్తారు.
యజ్ఞోపవీత మంత్రం వలన ఈక్రింది విషయాలు ప్రకటితములవుతున్నయ్.

పరమం పవిత్రం:-
జీవితాన్ని వ్రతమయంగా పరమ పవిత్రంగా చేసుకోవడానికే యజ్ఞోపవీతం ధరించబడుతుంది. కనుక యజ్ఞోపవీతధారి జీవితం పరమ పవిత్రంగా ఉండాలి.

ఆయుష్యం:-
వ్రతమయంగా నియమబద్ధంగా జీవితం ఉంటుంది. కనుక య్జ్ఞోపవీతధారికి దీర్ఘాయువు లభిస్తుంది.

అగ్ర్యం:-
లోకహితకరములగు శ్రేష్ఠకార్యములందు యజ్ఞోపవీతధారి అగ్రగామిగా ఉండాలి.

బలమస్తు తేజ :-
యజ్ఞోపవీతధారి తేజోబల సమన్వితుడుకావాలి.

శుభ్రం:-
పవిత్రతకు చిహ్నమగు యజ్ఞోపవీతం సదా పరిశుభ్రంగా ఉండాలి. పసుపు కుంకుమలు పూయరాదు.

యజ్ఞోపవీతధారణ:
 • యజ్ఞోపవీతధారణ చేయుటకు ముందు-
 • ఓం అమృతో ప స్తరణ మసి స్వాహా '
 • ఓం అమృతా పిధాన మసి స్వాహా|
 • ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీః శ్రయతాం స్వాహా |
అను మంత్రములతో ముమ్మారు ఆచమనం చేయాలి. ఆచమనము- కంఠము నుండి హృదయము వరకు తడుపునంత మాత్రమే నీటిని అఱచేతిలో పోసుకొని, అఱచేతి మొదటను నడుమను పెదవులనుంచి పీల్వవలయును. దీనివలన కంఠమునందలి కఫము, పిత్తము కొంత నివర్తిస్తాయి.

పిమ్మట -
 • ఓం వాజ్మే ఆస్యే అస్తు.
 • ఓం నసోర్మే ప్రాణోస్తు.
 • ఓం అక్ష్ణో ర్మే చక్షురస్తు.
 • ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తు.
 • ఓం బాహ్వొర్మే బలమస్తు.
 • ఓం ఊర్వోర్మే ఓజోస్తు.
 • ఓం అరిష్టాని మేజ్గాని తనూ స్తన్వా మే సహ సంతు.
అను మంత్రములతో నీటిని ఆ యా అంగములపై చల్లుకోవాలి. దీనివలన బద్ధకము దూరమవుతుంది. పిదప జందెమును సరిచేసి రెండు చేతులతో పట్టుకొని యజ్ఞోపవీత మంత్రాన్ని చదివి తలమీదుగా మొదట మెడలో హారములాగ వేసుకోవాలి. అనంతరం కుడిచేతి క్రిందికి తీసుకోవాలి. వ్రతచిహ్నమయిన యజ్ఞోపవీతంలో మూడుపేట లుంచబడినాయి. ఆ మూడుపేటలు ఈ మూడు రుణాలను తీర్చవలెనని స్ఫురింపజేస్తూ ఉంటాయి. మరియు యజ్ఞోపవీతంలోని మూడు పోగులు వ్రతమయంగా జీవితం గడపు మానవుని కర్తవ్యాలెన్నింటినో సూచిస్తూ ఉంటాయి.

ప్రపంచ సమస్యల పరిష్కరించుకొనుటకు సృష్టికి అనాది (మూల) పదార్థములయిన జీవేశ్వర ప్రకృతుల గుణకర్మ స్వభావములదెలుసుకోవాలి - అను సూచన ఈమూడు పోగులలో గర్భితమై ఉంది. అంతేగాదు. పదార్థ విజ్ఞానము ద్వారా అనాది పదార్థములయిన జీవేశ్వర ప్రకృతుల యొక్క గుణకర్మ స్వభావములను గుర్తెరిగి నిష్కామంతో వేదవిహిత ధర్మకర్మలాచరిస్తూ అంతఃకరణశుద్ధి సంపాదించాలి. అనంతరం అనన్య చిత్తంతో ధ్యానించి పరమేశ్వర సాక్షాత్కారం మానవుడు పొందాలి. అనగా పరమ పురుషార్థ సాధనకు జ్ఞానకర్మోపాసనలు మూడు అవసరం- అను సూచనయు ఈమూడు పోగులలో ఉన్నది. ఇంకను ప్రపంచం యొక్క సృష్టి స్థితి లయములు, ప్రకృతి యొక్క సత్వరజ స్తమో గుణములు, పురుషార్థములగు ధర్మాథకామములు, ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆధిదైవికములను త్రివిధ దుఖములు, తల్లి తండ్రి ఆచార్యుడు నను త్రివిధ విద్యాసంస్థలు, మనోవాక్కాయకర్మలు- ఇత్యాది త్రిత్వముల జ్ఞానం సంపాదించి జీవితం వ్రతమయంగా మానవుడు గడుపాలను సూచన ఈ మూడు పోగుల నిర్ణయంలో గర్భితమైఉంది. మరియు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్తములను మూడు ఆశ్రమముల వరకు ఈ యజ్ఞోపవీతధారణ పరిమితమను సూచనయు నిందు గలదు. సన్యాసులకు శిఖాయజ్ఞోపవీతములుండవు. మరియు శరీరంలో కుడివైపును దక్షిణభాగంగాను, ఎడమవైపును ఉత్తర భాగంగాను చెప్పుతుంటారు. యజ్ఞోపవీతం ఎడమ భుజం మీదుగా కుడి చంక క్రిందికి ధరింపబడుతుంది.

అంటే యజ్ఞోపవీతం యొక్క పైభాగం ఉత్తర దిశకు ఒరిగి క్రింది భాగం దక్షిణ దిశకు ఉంటుంది అన్నమాట. గోళాకారంగా ఉన్న భూమి కూడ పైభాగం ఉత్తర ధృవం వైపునకు ఒరిగి క్రింది భాగం దక్షిణ దిశకు ఉంటుంది. కావున యజ్ఞోపవీతధారి మెడలో వృత్తరూపంగా ఉన్న యజ్ఞోపవీతం భూగోళాన్ని స్ఫురింపజేస్తూ ఉంటుంది. దీనినిబట్టి మానవుడు భూగోళంలో బంధితుడై ఉన్నట్లు బోధపడుతుంది. కాన నాతడు స్వార్థపరుడై సాటిమానవుల శ్రేయస్సే తన శ్రేయస్సుగా భావించి వ్యవహరింపవలసి యుంటుందని యజ్ఞోపవీతం సూచిస్తుంది.

యజ్ఞోపవీతము గాయత్రీబోధకము:-
మూడు పెద్ద సూత్రములు, బ్రహ్మముడి కలది యజ్ఞోపవీతము. ఒక్కొక్క పెద్ద సూత్రానికి మూడేసి అంతర సూత్రములు, ఒక్కొక్క అంతర సూత్రానికి మూడేసి ఒంటిపోగులు ఉంటాయి. కాగా యజ్ఞోపవీతంలో మొత్తం ఇరువదియేడు ఒంటిపోగులుంటాయి.

అ + ఉ + మ్ = ఓమ్- అకార ఉకార మకారములతో కూడినది ప్రణవం. భూః, భువః, స్వః- ఈ మూడు మహావ్యాహృతులు.
 1. తత్సవితుర్వరేణ్యం
 2. భర్గో దేవస్య ధీమహి
 3. ధియో యో నః ప్రచోదయాత్
ఈ మూడు గాయత్రీమంత్రంలోని మూడు పాదములు.

యజ్ఞోపవీతం అర్థసహితంగా గాయత్రీ మంత్రాన్ని జ్ఞప్తికి తెస్తూ యజ్ఞోపవీతధారికి ప్రయోజనకారి అవుతుంది. ఇట్టి పరమ పవిత్రమైన యజ్ఞోపవీతాన్ని దీక్షా చిహ్నంగా ఆర్యులు ధరిస్తారు.

యజ్ఞోపవీత మంత్రార్ధము:-
యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యత్సహజం పురస్తాత్| ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః తా|| వేదోక్త కర్మలు చేయు అధికారము పొందుటకు తయారుచేయబడిన, పరమ పవిత్రమయినది, బ్రహ్మ దేవునికి సహజముగా సిద్ధించినదియు, మొదట పుట్టినదియునగు ఈ యజ్ఞోపవీతము నేను ధరించుచున్నాను. యజ్ఞోపవీతము నాకు ఆయుర్వృద్ధి, నిర్మలత్వము, బలమును, పుష్టి, తేజస్సును ఇచ్చుగాక.

నందీసమారాధన :-
శోభన దేవత స్వరూపులైన ఐదుగురు బ్రహ్మచారులను పూజించి పసుపు బట్టలనిచ్చుట ఆచారము.
శ్లో|| వటురక్షార లవణం సప్రాణాహుతి ముత్తమమ్|
ఏక ఏవమి భుంజీత వ్రతే క్రమ పీడయన్||
తా|| బ్రహ్మచారి కారము, ఉప్పు విడిచి ప్రాణాహుతులతో పాత్రకమైన, ఉత్తమైన ఆహారమును ఈ వ్రతమందు వ్రతభంగము కాకుండా భుజించవలెను. అనగా బ్రహ్మచారి తన బ్రహ్మచర్య దీక్షా వ్రతము పూర్తి అగువరకు ఉప్పు, కారంలేని భోజనం చేయవలెను.

శ్లో|| మాత్రసహకుమారం భోజయేత్ తా|| గాయత్రీమంత్ర ప్రోక్షణతోసహా సహపంక్తిలో వటుడు భోజనము చేయవలెను. మాత్రాసహ అంటే తల్లితో కలిసి అని భావించి మధ్వులు ఆవిధంగా ఆచరిస్తున్నారు. కాని మాత్రాసహా అంటే గాయత్రీ మంత్రముతో సహా అని అర్ధము. ఆ సమయమున ఆచార్యుడు గాయత్రీ మంత్రము చెప్పగా వటుడు అన్నముపై ఉదకము ప్రోక్షించును. అమృతో పస్తరణమసి అనుచోట ఉదకము బదులు నేయి వేయవలెను.

అశ్వారోహణము:- అగ్నిహోత్రమునకు ఉత్తరపువైపున ఆచార్యుని వలే తూర్పు తిరిగి కూర్చొనవలెను. దక్షిణ దిశగా శానము (సన్నికల్లు లేక రాయి) ఉంచి, ఉపనయనము చేయుచున్న వ్యక్తి (ఆచార్యుడు)"అతిష్టేమ" అను మంత్రమును చెప్పి, సన్నికల్లును త్రొక్కించవలెను. ఈ రాయివలె చాలాకాలము బ్రహ్మచర్య నిష్ఠలో స్థిరుడవై యుండుమని దీని యర్ధము.

వస్త్రధారణ:- పంచల చాపు ఉత్తరించి ఆచార్యుడు వాటిని అభిమంత్రణచేసి రాతిమీదనే మంత్రయుక్తముగా వటువనకు కట్టవలెను. ఈ వస్త్రములు దేవతలు తయారుచేసినవి. నీవు నిండు నూరేళ్ళు సుఖముగాయుండుటకు ధనము సంపాదించి ఆప్తులకు, అర్ధులకు యివ్వవలెను అని మంత్రార్ధము.

మౌంజీ మేఖల ధారణ:- ఆచార్యుడు "ఇయందురుక్తా....సుభగామేఖలేయం" అను మంత్రమును జెప్పి ముంజగడ్డితో పేని ముప్పిరవేసిన త్రాడును వటువు మొలకు ప్రదక్షిణముగా మూడు చుట్లు త్రిప్పి కట్టవలెను. వటువుచే కూడ ఈ పైమంత్రము చెప్పించవలెను. ఈ మంత్రార్ధమేమనగా ఈ మౌంజీ దేవతలకు ప్రియమైనది. ఉఛ్ఛ్వాసనిశ్శ్వాసములచేత ఆత్మ బలమును శరీర బలమును కూడా కలిగించునది. దీనిని ధరించుటచే ఆపదలు రావు. మిత్రస్య అను మంత్రముచే కృష్ణాజినమును ఆచార్యుడు వటుడు మెడలో ఉపవస్త్రముగా వేయవలెను. ఈ కృష్ణాజినము విశేష తేజస్సు, కీర్తి, వృద్ధిగలది. ధూర్తులకు ఉపయోగపడనిది. అన్నమును యిచ్చునది. స్తోత్ర పాత్రమైనది. సూర్యుని నేత్రమయినది. దీనిని వస్త్రముగా ధరించుచున్నాను అని మంత్రార్ధము.

గమనిక:- మౌంజీ, మేఖలలు క్షత్రియ వైశ్యులకు వేరువేరుగాయున్నవి. ఆచార్యుడు వటువును దగ్గరకు తీసుకొని పంచల చావు (నూతన వస్త్రము) యిద్దరిపై కప్పి"సుప్రజ" అను మంత్రమును వటుని చెవిలో చెప్పవలెను.

సుప్రజాః ప్రజయా భూయాస్సువీరో వీరై సువర్చా వర్చసా సుపోషః పోషైః| తా|| మంచి సంతానము గలవాడవై పుత్ర పౌత్రాదులచే మంచి వర్చస్సు గలవాడవై పోషకులగు పుత్రులచే వృద్ది చెందుము.

వటువు చెప్పవలసిన మంత్రము:-
మం|| బ్రహ్మచర్య మాగా ముపమానయస్య దేవేన సనితా ప్రసూతః తా|| నేను బ్రహ్మ చర్యవ్రతమును వేదాధ్యయనము కొరకు స్వీకరించితిని. ఓ ఆచార్యా! మీరు సూర్యుని అనుమతితో వేదోపదేశము చేయుటకై మీ దగ్గర ఉంచుకొనుమని వటువు చెప్పును. బ్రహ్మోపదేశం:- తూర్పు దిక్కుగా ఆచార్యుడు కూర్చుండగా కుమారుడు అభిముఖముగా ఆచార్యుని కుడిపాదమును కుడిచేతితో పట్టుకొని అయ్యా! గాయత్రీ మంత్రోపదేశమును ఆచార్యుడు వటువు కుడి చెవిలో చేయవలెను.

ఉపదేశ విధానము:-
 • మం|| ఓం భూః తత్సవితురువరేణ్యం |
 • ఓం భువః భర్గోదేవస్య ధీమహి
 • ఓ గుం సువః ధీయోయోనః ప్రచోదయాత్||
 • ఓం భూః తత్స వితురువరేణ్యం భర్గోదేవస్య ధీమహి | ఓం భువ: ధీయోయోనః ప్రచోదయాత్|
గోదానము:- ఓ ఆచార్యుడా నీకు వరమును (వరమనగా గోవు అని వేదమున గలదు) ఇచ్చుచున్నానని గురువునకు వటువు శేష్ఠమైన గోవునీయవలెను. గురువు 17సార్లు ప్రణవము చేయవలెను. లేచి "దేవస్యత్వా" అను మంత్రమును చదివి గోవును స్వీకరించవలెను. పిమ్మట ఆచార్యుడు పడమట దిక్కుగా కూర్చొన్న వటుని 'ఉదాయుషా' అను మంత్రము చదువుచు లేవదీసి వానిచే చెప్పించవలెను.

ఉదాయుషా మంత్ర భావము:- నూరు వత్సరముల ఆయువుతో బలకరమైన ఔషధముల రసముతో మేధుని యొక్క బలముతో దేవతలను ధ్యానము చేయుటకులేచి నిలబడుచున్నాను. సూర్యుని దర్శించుట: "తచ్చక్షుః" అను మంత్రము మొదలుకొని - సూర్యం దృశే అని ఆచార్యునిచే చెప్పబడిన పదిమంత్రములతో వటుకు సూర్యుని సేవించవలెను.

అవి:
1. తచ్చక్షుర్దే వహితం పురస్తాచ్ఛు క్రముచ్చరత్
తా|| నేత్రములయందు ఇంద్రునిచే యుంచబడినదియు తూర్పుదిక్కున బయలుదేరి వెళ్ళునదియు శుభ్రమైనదియునగు ఆ ప్రసిద్ధమైన సూర్య తేజస్సును.

2. పశ్యేమ శరదశ్శతమ్||
తా|| నూరు సంవత్సరములు చూచెదను(జీవింతును)

3. మం||జీవమ శరదశ్శతమ్||
తా|| నూరు సంవత్సరములు జీవించగలను

4. మం|| నందామ శరదశ్శతమ్
తా|| నూరు సంవత్సరములు ఆనందంగా ఉండగలము

5. మం|| మోదామ శరదశ్శతమ్
తా||నూరు సంవత్సరములకు బ్రహ్మానందమును పొందుచుందుము

6. మం|| భవామ శరదశ్శతమ్
తా|| నూరు సంవత్సరములు సంపదగలవారమైయుందుము

7. శృణవామ శరదశ్శతమ్||
తా|| నూరు సంవత్సరముల వరకు వేద శాస్త్రములలు వినుచుందుము

8. మం|| ప్రబ్రవామ శరదశ్శతమ్
తా|| నూరు సంవత్సరములు చక్కగా మాట్లాడుచుండగలము

9. మం|| అజీతాశ్యామ శరదశ్శతం
తా|| నూరు సంవత్సరముల వరకు హింసలేని వారమైయుందుము

10. మం|| జ్యోక్చసూర్యం దృశే||
తా|| జీవించినంతకాలము అంధత్వము లేక మంచి దృష్టిగలవారమైయుందుము సూ|| యంకామయేత............... విధిమాహ|| స్నాతకవ్రత పర్యంతము ఈ వటువు నన్ను విడువకుండ నుండవలెనని ఆచార్యుడు కోరుచు క్రింది యస్మిన్ భూతంచ అను మంత్రమును చెప్పి అతని కుడిచేతితో వటువు కుడిచేయి పట్టుకొనవలెను.
మం|| యస్మిన్ భూతంచ-------- గృహ్ణామి నారాయణశర్మన్||
తా|| జరిగినదియు, జరుగుచున్నదియు, జరుగబోవుచున్నదియునగు ప్రపంచమునకు సృష్టికర్తయగుయే బ్రహ్మయందు సమస్తలోకములు నిలిచియున్నవో ఆ బ్రహ్మయొక్క అనుమతిచే నిన్ను నామనసునందెపుడును ధ్యానము చేయచుండెదను.వటువు మూడు అహోరాత్రములు ఈ అగ్ని అవిచ్ఛన్నముగా నిలుపుకొనవలెను. ఈ అగ్నిలోనే ఉదయము, సాయంకాలము హోమము చేయవలెను. మూడు రోజుల తరువాత నుండి సమావర్తనము వరకు రెండుపూటల లౌకికాగ్నిలో సమిధలు హోమము చేయవలెను.

భిక్షా కార్యము : ఆచార్యుడు వటువునకు ఏదైనా ఒక వస్తువుతో కూడిన పాత్రను యిచ్చి ముందుగా తల్లిని యాచించమని చెప్పవలెను. కుడి చెవిని ఎడమ చేతితోను ఎడమ చెవిని కుడి చేతితోను పట్టుకోని ఈ క్రింది మంత్రమును చెప్పవలెను. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు-----------ఋషులపేర్లు సంఖ్య చెప్పి-- గోత్రస్య (గోత్రం పేరు చెప్పాలి) ---- శర్మ (తనపేరు చెప్పాలి) అహంభో అభివాదయే అని చెప్పి పాదములకు నమస్కరించి స్త్రీలనయితే భవతి భిక్షాందేహి అని పురుషులనైతే భవాన్ భిక్షాందదాతు అని భిక్ష అడిగి నడుముకు కట్టుకున్న వస్త్రము కొనను రెండు చేతులతోను పట్టుకొని అందులో భిక్ష స్వీకరించాలి. మొదట తల్లి పళ్ళెములో బియ్యము తెచ్చి వెండి గిన్నెతో రెండు సార్లు బియ్యం వటువు యొక్క వస్త్రములో వేసి మూడవసారి గిన్నెతోసహా బియ్యమును వేయవలెను. ఈ వెండి గిన్నె బ్రహ్మగారు తీసుకొనుచున్నారు. ఉంగరము(భటువు) వేలికి తొడుగుట కొందరి ఆచారముగా యున్నది.

వస్త్రమునిచ్చుట: సూ|| వానశ్చరుర్ధీ ముత్తరయా దత్తే దతృదావ్యః | గురోవానస్తేదదామీతి దద్యాత్||వటువు ఉపనయనమునాడు తనకు గట్టిన వస్త్రమును ఓ గురువర్యా ఈ వస్త్రమును నీకు యిచ్చుచున్నాను అనుచు ఈయవలెను.

ఉపాకర్మ: ఉపనయనమైన తర్వాత వచ్చు మొదటి శ్రావణ పూర్ణిమరోజున గ్రహణం సంభవించిన భాద్రపద పూర్ణిమనాడు ఉపాకర్మ చేయాలి. కాని ఉపాకర్మ యిపుడు ఎవరు చేయటంలేదు.

బ్రహ్మచర్య ధర్మములు: బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు ఉపనయనము అయినది మొదలు బ్రహ్మచర్య వ్రతము ప్రాంభమగును. ఉపనయనమైన తర్వాత గురుకులమున 12 సంవత్సరములు బ్రహ్మచర్యమును పాటించుచు ఒక వేదమునైనను పూర్తి చేయవలయును. సూ|| ద్వాదశ వర్షాణ్యేకవేదే బ్రహ్మచర్యం చరేత్| ఒక్కొక్క వేదమునకు, 12 సంవత్సరములు చొప్పున బ్రహ్మచర్యము జరుపవచ్చును. కానియది విధికాదు. మరియు ఋషుల మతమున కలియుగములో దీర్ఘబ్రహ్మచర్యము పనికిరాదు. కాబట్టి 12 సంవత్సరములే బ్రహ్మచర్యము చాలును, దీనిని బట్టి బ్రాహ్మణుడు కనీసము 20 సంవత్సరములవయస్సులోను, క్షత్రియుడు 23 సంవత్సరముల వయస్సులోను, వైశ్యుడు 24 సంవత్సరముల వయస్సులోను వివాహము చేసికొనుట శాస్త్రసమ్మతమని తెలియును. శూద్రుడు గురుకులమున కేగనక్కరలేదు. కావున ఆయుర్దాయములో నాల్గవవంతు అనగా 25 ఏండ్లు వయస్సు వరకు ఆతడు అవివాహితుడుగానుండి పిమ్మట వివాహమాడవలయును.
 • బ్రహ్మచర్యాశ్రమములో బహు ప్రయోజనములు సాధింపవలసియున్నవి.
 • ద్విజులు వేదమునభ్యసించుట, ఇతరులు పురాణేతిహాసముల పఠించుట.
 • ఇంద్రియముల నిగ్రహించుట నలవఱచుకొని మనస్సును పరమార్థ జీవితమున కనుకూలముగా చేసికొనుట.
 • శరీరరము భోగపరము కాకుండ శ్రద్ధ వహించుట.
 • శారీరక తేజస్సును వృద్ధినొందించుకొనుట.
 • దీర్ఘాయుష్యమునకు తగినరీతిగా వ్యవహరించుట.
మానవుడు గృహస్ధాశ్రమములో భోగములను తగినరీతిననుభవించుటకును, భోగములకు లోబడి ధర్మమును విస్మరింపకుండుటకు, వివేకియై లౌకిక, వైదిక ధర్మములను నిర్వర్తించుటకును బ్రహ్మచర్యాశ్రమము యొక్క శిక్షణ సహకరించును. బ్రహ్మచర్యాశ్రమములో ఉపర్యుక్తమైన శారీరక మానసిక సాధన కంగములుగ నియమములనేకములు గలవు.
 • బ్రహ్మచారి వాక్ నియమము గల్గియుండవలెను.
 • బ్రహ్మచారి చేష్టానియయము గల్గియుండవలెను.
 • బ్రహ్మచారి ఉదర నియమము గల్గియుండవలెను.
 • బ్రహ్మచారి మితభాషియై సత్యవాక్యమునే పల్కవలెను.
 • బ్రహ్మచారి తనకర్తవ్యమునకు మించిన యేపనిలోను జోక్యము కల్గించుకొనరాదు.
 • బ్రహ్మచారి సత్వగుణ వర్థకమగు నాహారమునే మితముగ తినవలయును.
 • బ్రహ్మచారి భిక్షచేసి యాహారము తెచ్చుకొని దానిని గురువునకు చూపి యాతని అనుమతిగైకొని భుజింపవలయును.
ఉప్పు, కారము, మాంసము, మధువు మున్నగు రజోగుణ ప్రకోపకములైన పదార్ధములను తినరాదు.

బ్రహ్మచారి ఆచరించవలసిన ఇతర ధర్మములు: గంధేత్యాది సుగంధ వస్తువులను ధరింపరాదు. పగలు నిద్రపోరాదు. కాటుక పెట్టుకొనుట మొదలగు శృంగార విషయములను వీడవలయును. తైలాభ్యంగనము చేయరాదు. విలాసార్థమై బండి మొదలగు వాహనముల ఎక్కరాదు. చెప్పులను తొడగరాదు. కామమును దరిచేరనీయరాదు. క్రోధము పనికిరాదు. దేనియందును లోభము తగదు. వివేకమును వీడరాదు. వదరుబోతుగా నుండరాదు. వీణా వాదనాదుల యందనురక్తుడు కారాదు. వేడినీటి స్నావము చేయరాదు. సుంగంధాదులచే విలాసముగా దంతధావనాదులు చేయరాదు. దేనిని చూచినను సంతోషముతో పొంగిపోరాదు. నృత్యగానములందు ఆసక్తుడు కారాదు. పరుల దోషములనెంచరాదు. ప్రమాదముల చెంతకుపోరాదు. బ్రహ్మచారి యిట్టి నియమములు గలవాడై, భిక్షచే జీవించుచుసాయం ప్రాతఃకాలములందగ్ని కార్యము చేసికొనుచుండవలయును. సూ||బహిః సంధ్యత్వంచ|- సంధ్యా వందనమును గ్రామముయొక్క బయటకుపోయి చేసికొనవలయును.

బ్రహ్మచారి ప్రధానముగ చేయవలసిన ధర్మము రేతస్సంరక్షణము. ఆ ధర్మముచెడినచో బ్రహ్మచర్య వ్రతము చెడినట్లే. అట్లు బ్రహ్మచర్యము పోగొట్టుకొన్నవారికి అవకీర్ణియని పేరు. అవకీర్ణికి ఘోరములైన ప్రాయశ్చిత్తములు విధింపబడినవి. కాబట్టి బ్రహ్మచర్యమునకు భంగము కల్గించు ప్రసక్తులన్నియు బ్రహ్మచారికి నిషేధింపబడినవి. శృంగార విషయమునకు సంబంధించినవన్నియు విడిచి విడిచి పెట్టవలసినదే.

ఇతర నియమములు:
వటువు అద్దములో తన ముఖమును చూచుకొనుట కూడ నిషిద్ధమైయున్నది.
బ్రహ్మచారి స్త్రీలముఖమును చూడరాదు; వారితో సంభాషింపరాదు.
బ్రహ్మచారి అధ్యయనము చేయునపుడు గురుదక్షిణనేమియు నీయనక్కరలేదు.

యజ్ఞోపవీతాన్ని వ్రతచిహ్నంగా భావించి దాని పూర్తి ప్రయోజనం పొందదలచినవారు తాము స్వయంగా తయారుచేసుకోవడం ఉత్తమం. యజ్ఞోపవీతం తెగినప్పుడు, మురికియైనపుడు నూతన యజ్ఞోపవీతాన్ని ఈ క్రింది శ్లోకాన్ని పఠించి తలపైగా తీసి నదిలోగాని, ఏదైనా చెట్టుపైనగాని వేయాలి.
"ఏతావద్దినపర్యంతం బ్రహ్మ త్వం ధారితం మయా
జీతత్వాత్ త్వ త్పరిత్యాగో గచ్చ సూత్ర యథాసుఖం"
"ఓ బ్రహ్మ సూత్రమా! ఇంతవరకు నిన్ను నేను ధరించితిని. జీర్ణమగుట వల్ల ఇప్పుడు నిన్ను త్యజించుచున్నాను. నీవు సుఖంగా పొమ్ము" అని శ్లోకార్ధము.
ఓం తత్ సత్.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి