హిందువులకు అంతమంది దేవుళ్ళా అనే వారికి సమాధానం - Why Hindus have so many gods? the answer to this..

0
హిందువులకు అంతమంది దేవుళ్ళా  అనే వారికి సమాధానం - Why Hindus have so many gods? the answer to this..
పార్వతి మాత - గణేశుడు - photo credit: Artist Shri Kailash Raj

హిందువులకు అంతమంది దేవుళ్ళా  అనే వారికి సమాధానం! 
కసారి ఒక ఆంగ్లేయుడు సత్యశోధన కోసం అనేక మత గ్రంధాలు శోధించాడు అయన స్వతహాగా క్రీస్టియన్. అన్ని మతాలు వెదికి చివరికి హిందూ సనాతనధర్మం లో ఉన్న రామాయణ, భారత, భాగవత, పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు చదివాడు. ఎన్నో ఏళ్ల నుండి తను చేస్తున సత్యాన్వేషణ హిందూ సనాతన ధర్మం వలన లభించింది అని అన్నాడు.
  అయితే హిందువుల్లో అంతమంది దేవుళ్ళు ఎందుకుంటారు అని అడిగేవాళ్లకు లేదా ఎగతాళి చేసేవాళ్లకు అయన ఇలా సమాధానం చెప్పాడు. ”తల్లి తన బిడ్డకి ఆకలి వేసినప్పుడు చేతిలో గరిటెలు పట్టుకుని అన్నపూర్ణా దేవిలా మారుతుంది. అమ్మా ఈ లెక్క నాకు అర్థం కాలేదు అంటే పుస్తకం తీసుకొని ఇలా చెయ్యమని సరస్వతి అవుతుంది. అమ్మ ఖర్చులకి డబ్బులు కావాలంటే తన చేతితో డబ్బు ఇచ్చి లక్ష్మిదేవిలా మారుతుంది. ఏదైనా తప్పు చేస్తే దండించి ఆదిపరాశక్తి లా మారిపోతుంది. ఇలా ఎదురుగా ఉన్న తల్లి వివిధ సందర్భాలలో వివిధ రకాలైన అవతారాలు ధరిస్తుంటే, తను సృష్టి చేసిన దేవుడు తన పిల్లల కోసం ఎన్ని అవతారలైనా ధరిస్తాడు. అందుకే హిందూ మతంలో ఇన్ని మంది దేవుళ్ళు, దేవతలు ఉన్నారు ” అన్నాడు.
  అలానే కాకుండా హిందూ ధర్మంలో ఉండి ఏమి లేదు అనుకునేవారు కూడా సరిగ్గా ఆరాధిస్తే ఆ ఫలితం తెలుస్తుంది. ఎలాగంటే… మంచు చూడడానికి మనకి ఒకేలా కనిపిస్తుంది. కాని ఆ మంచులో నివసించేవారు చెప్పే మాట “మంచులో మొత్తం 47 రకాలు ఉన్నాయి” అంటారు. దూరంగా ఉండే మనకి ఒకటే. కాని దగ్గరకి వెళ్లి పరిశీలించిన వారికే తెలుస్తుంది.
   ఇటు తనవారికి సందేశం ఇచ్చాడు. మరో ప్రక్క అశ్రద్ధ చేస్తున్న మనకీ సందేశం ఇచ్చాడు. విలువలు తెలుసుకోకపొతే కూలబడేది మనమే. మన సంప్రదాయాలు అశ్రద్ధ చేయకండి అంటూ నానా పాటేకర్ యావత్ భారత జాతికి ఈ విషయాన్నీ తెలియచేసాడు.

రచన: అపర్ణా దేవి (ఎఫ్)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top