నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

- ఆర్ఎస్ఎస్ -

ఆర్ఎస్ఎస్
ఆరోగ్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆరోగ్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, సెప్టెంబర్ 2020, ఆదివారం

సంతాన భాగ్యము- వేదవిహిత ఉపాయము - Santanam

సంతానము లేక చాలా మంది దంపతులు అన్ని రకాల ప్రయత్నాలూ చేసి ఫలము దక్కక విసిగి వేసారి ఉంటారు. భౌతికంగా, లైంగికముగా , మానసికముగా వారిలో ఎట్టి లోపాలూ ఉండవు. అయినా సంతానము కలగదు. దానికి కారణము ఎవరూ చెప్పలేరు. అయితే వేదము మనకు ఆ కారణాన్ని తేటతెల్లము చేస్తుంది.
నిజానికి ఇదేమీ కొత్తవిషయము కాదు. వేదోక్తమైన కర్మలను అనాదిగా ఆచరిస్తూ, సంతానాన్ని పొందినవారు అన్నికాలాల్లోనూ ఉన్నారు. సంతానము కోసము యాగాలు చేయుట మనకు తెలిసినదే. దశరథుడి వంటివాడే పుత్రకామేష్టి యాగము చేసినాడని పురాణము చెబుతుంది.
అయితే, సంతానము కోసము, యాగమే ఎందుకు చేయాలి ? ఇతర పద్దతులు లేవా ? 
ఈ ప్రశ్నకు సమాధానము కూడా వేదమే చెబుతుంది. కృష్ణ యజుర్వేదములోని రెండవ కాండములోని, మొదటి ప్రశ్నలో ఈ విషయము దీర్ఘముగా చర్చించబడినది.

అసలు, సంతానము కలుగుటకు, కలగక పోవడానికి గల కారణాలు తెలిస్తే, మిగతావి సులభముగా అర్థము అవుతాయి. మొదట తెలుసుకోవలసినది, సంతానానికి కారణము మన దేహములో చరించే వాయువు. ఈ వాయువే ఐదురకాలుగా పిలవబడుతుంది. వీటినే పంచప్రాణాలు అంటారు. దేహములో వాయు సంచారమే ప్రాణము ఉండుటకు, లేకపోవుటకు కారణము. ఉఛ్చ్వాస నిశ్వాసాలు లేకపోతే ప్రాణము ఉంటుందా ?

ఈ ఐదు ప్రాణాలలో, ప్రాణము, అపానము -- ఇవి రెండే సంతానానికి కారణము. మన ముఖమునుండీ బయటికి సంచరించే వాయువే ప్రాణము. మన దేహములో ఉదరభాగములో లోలోపలే సంచరించు వాయువే అపానము. దీనినే నియుత్ అని వేదభాషలో అంటారు.
ఈ ప్రాణము, అపానము ఒకదానినొకటి పొందినపుడు-- అనగా కలసినపుడు మాత్రమే , సంతానము కలిగే సాధ్యత ఉంటుంది. ప్రాణము , అపానము ఒకదానినొకటి కలియక, వేరువేరు అయిపోతే అప్పుడు ఆ మనుష్యుడికి సంతానము కలుగదు. కాబట్టి, ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతానము కలుగక పోవుటకు, ఈ ప్రాణాపానాలు దూరమగుటయే  కారణము.

మరి, వాటిని కలుపుట ఎలాగ ? 
దీనికి వాయువే మనకు సహకరించాలి. అనగా , వాయువు మనకు సహకరించుటకు తగ్గ ప్రయత్నాలు మనము చేయాలి.  అది ఎలాగ అంటే, వాయువు అతివేగముగా సంచరించువాడు. అందుకే వాయువేగము... అంటుంటాము. వాయువు అతివేగముగా సంచరించినట్టే, అతివేగముగా ఫలము కూడా ఇస్తాడు. కాబట్టి వాయువు అనుగ్రహము పొందాలంటే మనము చేయవలసినది-- శ్వేతపశు యాగము. శ్వేత పశువు వాయువుకు ప్రియమైనది.

అపానవాయువును ’నియుత్ ’ అంటారని తెలుసుకున్నాము కదా , నియుత్ అంటే , వాయువు సంచరించే రథము ను లాగే గుర్రాలు. అంటే దేహములో ఏదో రథము పరుగెడుతూ ఉంటుంది అని అర్థము కాదు. వేదము ఏమి చెప్పినా నేరుగా చెప్పదు. ఒక చిహ్నారూపముగానో, సంజ్ఞా రూపముగానో చెబుతుంది. ఈ నియుత్ అనే వాయువు దేహములో తిరుగుతుంది కాబట్టి, వాయువును ’ నియుత్వంతుడు ’ అంటుంది వేదము. ఈ నియుత్వంతుడికి, శ్వేత పశువు అతి ప్రియమైనది.....అని కూడా వేదము చెబుతుంది.

కాబట్టి, శ్వేతపశువు నుండీ వచ్చిన ద్రవ్యాలతో {అనగా తెల్లటి పశువు-- అది గుర్రము, మేక, ఆవు, గొర్రె వీటిలో ఏదైనా కావచ్చు.. అయితే గోవుకున్నంత శ్రేష్ఠత్వము, ప్రాముఖ్యత వలన పంచగవ్యాలతో} ఇట్టి యాగము చేయుట ఈ కలికాలములో రూఢియైనది.
ఈ శ్వేత పశుయాగము చేయడము వలన, వాయువు, తన భాగము తనకు దొరకుట వలన తృప్తుడై, దేహములో ప్రాణాపానములను కలియునట్లు చేస్తాడు. అప్పుడు సంతాన నిరోధకముగా ఉన్న దోషము తీరి, సంతానము కలుగుతుంది. ఇదే విధముగా దీర్ఘరోగుల శరీరములో కూడా ప్రాణాపానాలు కలియక, ఆ రోగి మరణించే అవకాశము ఉంటుంది. దీర్ఘ రోగులు ఈ శ్వేత పశుయాగము చేయడము వల్ల, వారుకూడా రోగము పోగొట్టుకొని ఆరోగ్యము పొందుతారు. ఇదేవిధముగా ధనప్రాప్తి కోసము కూడా ఈ యాగము చేస్తారు. అదే విధముగా, ప్రజల మీద అధికారము సంపాదించి నాయకుడు కాగోరినవారు కూడా ఇదే యాగాన్ని చేసి ఫలితాన్ని పొందవచ్చు.

ఇప్పుడొక ముఖ్య ప్రశ్న: 
ఈ యాగము వలన అనేక ఫలితాలు కలుగుతాయి నిజమే, కానీ అందరికీ ఇది సాధ్యమా? 
అందరికీ సాధ్యము కాకపోవచ్చు. యాగమంటేనే ఖర్చుతో కూడినది. పైగా ఎన్నెన్నో వసతులు, సౌకర్యాలు ఉండాలి. అవిలేనివారు, ప్రతి దినమూ బ్రహ్మ యజ్ఞములో వేదములోని ఈ రెండవ కాండము, మొదటి ప్రశ్న లోని మొదటి అనువాకాన్ని [ వాయుర్వై క్షేపిష్ఠా దేవతా.... ] పారాయణము చేసినా అంతే ఫలితము ఉంటుంది. బ్రహ్మ యజ్ఞములో కాకపోయినా, మామూలుగా అయినా పారాయణ చేయవచ్చు. అది కూడా వీలుకాని వారు, వేదవిదుడైన బ్రాహ్మణుడితో తమ స్వగృహమునందు నలభై రోజులు ఈ పారాయణము చేయించవచ్చు.
వేదము ఉన్నది మానవుల అభ్యుదయము , క్షేమము కోసము మాత్రమే గనుక, వేదములో చెప్పబడిన ఈ విధానాన్ని పాటించి సత్ఫలితాలను పొందుదాము.


|| జగదంబార్పణమస్తు || 
|| వేద నారాయణార్పణమస్తు || 

దీనినే ఈనాటి శాస్త్రజ్ఞులు, వైద్యులు పరిశోధనలు చేస్తే, ఈ కారణాలను, పరిష్కారాన్ని ఇప్పటి పదజాలము ఉపయోగించి, సంతాన సాఫల్య కేంద్రాలలో కొత్తపేరు పెట్టి , యాగానికి ప్రత్యామ్నాయాలను కనుగొని అదే ఫలితము వచ్చునట్టుగా చేయగలరేమో..

సంకలనం: జనార్ధన శర్మ గురువు గారు

9, ఆగస్టు 2020, ఆదివారం

కరోనాను తరుముతున్న సాంప్రదాయ ఆవిరి మంత్రం - Traditional steam mantra chasing the corona

కరోనాను తరుముతున్న సాంప్రదాయ ఆవిరి మంత్రం - Traditional steam mantra chasing the corona

కోవిడ్ ను తరుముతున్న ఆవిరి వైద్యం

కరోనా నియంత్రణలో ఇప్పుడు సంప్రదాయ వైద్యానికే జేజేలు పలుకుతున్నారు. భారతీయ సంప్రదాయాల్లో ఆనాదిగా ఉన్న ఆవిరి పట్టే పద్దతి ది బెస్ట్ గా వైద్యనిపుణులు అనేక పరిశోధనలు చేసి తేల్చారు.. దేశంలోని పలువురు నిపుణులతో పాటు ఇతర దేశాల్లోనూ దీనిపై అధ్యయనాలు జరగ్గా, ఇపుడు ఆవిరికి కరోనా వైరస్ను తగ్గించగలిగే కతిఉందని తేల్చారు. కరోనా రోగులపై ఆవిరి పట్టే పద్దతిని అమలుచేయగా, వారంరోజుల్లోనే ఇది గణనీయ ప్రభావం చూపుతోందని, వైరస్ను తగ్గించగలిగిందని పరిశోధనల్లో తేలిందట. ముంబైకు చెందిన ఓ వైద్యుడు కూడా మూడునెలల పాటు రోగులపై దీనిని పరిశీలించి స్టీమ్ థెరపీ గొప్పతనంపై అంచనా కొచ్చారు.

ఎవరిపై ఎలా పనిచేస్తుంది?
 • ➧ మొదటి గ్రూపులోని లక్షణాలు లేని బాధితులకు రోజుకు మూడుసార్లు ఆవిరిచికిత్సచేయగా, మూడు రోజుల్లోనే కోలుకున్నారు.
 • ➧ లక్షణాలుండి తీవ్రత ఎక్కువగా ఉన్నవారు ప్రతి మూడుగంటలకోసారి ఐదునిమిషాలు ఆవిరిపట్టగా వారంలో సాధారణ సిత్తికి వచ్చారు.
 • ➧ కొన్నిరకాల క్యాప్సూల్స్, అల్లం, పతంజలి బామ్, పతంజలి దివ్య ధార ఇలా కొన్నింటితో ఆవిరిపట్టడం వల్ల ప్రయోజనం బాగా ఉంటోంది. 
 • ➧ మొత్తంగా లక్షణాలు లేని వారు ఆవిరి మంత్రం వల్ల వారంరోజుల్లో పేకోలుకుంటుండగా, లక్షణాలున్న వారు వారం నుండి పదిరోజుల్లో కోలుకుంటున్నారట.
 • ➧ మే, జూన్ మాసంలో పలు మందులు అందుబాటులోకి రావడంతో పాటు అనేక క్లినికల్ ట్రయల్స్
 • ➧ జరగ్గా, అదే పద్దతిలో ఆవిరి ప్రభావంపై కూడా జాగ్రత్తగా అధ్యయనాలు చేశారు. ఫలితం అద్భుతంగా ఉందని వైద్యనిపుణులు ఉత్సాహపడుతున్నారు.
 • ➧ ఆవిరివల్ల శ్లేశ్మం తొలగించబడి నాసిరారంధ్రాలు గొంతు స్వేచ్చగా గాలిపీల్చుకునే వెసులుబాటు కలిగిస్తాయి. ముక్కు, గొంతులో శ్వాసమార్గాలను స్వేచ్చాయుతం చేస్తాయి.
 • ➧ 70నుండి 80డిగ్రీల సెంటిగ్రేడ్ ఆవిరితో కొవి వైరస్ చనిపోతున్నట్లు తేలిందని, వైరస్ తగ్గి తోలుకున్న తర్వాత వీరి ద్వారా ఇతరులకు సోకలేదని కూడా నిర్ధారణ జరిగినట్లు పరిశోధనలు చేసిన వైద్యనిపుణులు చెబుతున్నారు. 
మూలము: ఆంధ్రప్రభ

గమనిక:
పైనుదహరించిన ఆరోగ్య సూచనలు అవగాహన కొరకే, మరింత సమాచారం కోసం వైద్యులను సంప్రదించగలరు.

8, ఆగస్టు 2020, శనివారం

ఆకుపూజతో ప్రసన్నుడయ్యే హనుమంతుడు - Aaku Pooja , Anjaneyudu


ఆకుపూజతో ప్రసన్నుడయ్యే హనుమ

హనుమంతుడికి ఆకుపూజ చేస్తే అనేక గండాలు, ఆర్థిక ఇబ్బందులు, ఈతిబాధలు తొలగిపోతాయని ఆస్తికుల అనుభవపూర్వకమైన నమ్మకం. హనుమంతుడు పూలతో కూడిన పూజ,జేన్,ఎం కంటే ఆకు పూజకే అధిక ప్రాధాన్య ఇస్తాడు. అదే ఆంజనేయునికి అమిత ఇష్టం.

ఎందుకంటే హనుమంతుడు లంకానగారానికి వెళ్లి సీతమ్మవారి జాడను తెలుసుకొన్నాడు. ఆమెకి ధైర్యం చెప్పాడు. శ్రీరాముడి సైన్యం పట్ల లంకానగర వాసులకు భయం కలిగేలా చేసాడు. ఆ తరువాత అక్కడి నుంచి తిరిగి వచ్చి రాముడితో సీతను చూసిన విషయం తెలిపాడు. ఎంతో సంతోషించిన శ్రీరాముడు అక్కడ గల తమలపాకులను తెంపి మాలగా చేసి ఆంజనేయుని మేడలో వేసి అభినందించాడు.

శుభవార్తను తెచ్చినవారికి తమ దగ్గర గల ఖరీదైన వస్తువును బహూకరించడం అప్పట్లో ఒక సంప్రదాయంగా ఉండేది. రాముడు వనవాసంలో ఉన్నాడు. ఇక హనుమంతుడు లంకా నగరంలోని కొన్ని భవనాలను తగలబెట్టి మరీ వచ్చాడు. అందువలన ఆయన శరీరం వేడిగా ఉండటంతో, తాపాన్ని తగ్గించడం కోసం రాముడు ఆయన మెడలో తమలపాకుల మాలను వేసినట్టు పురాణాలు చెబుతున్నాయి.

ఆ తమలపాకుల మాల మెడలో పడగానే అప్పటివరకూ హనుమంతుడు పడిన శ్రమనంతా మరిచి సంతోషంతో పొంగిపోయాడు. అందుకే తమలపాకులతో పూజ చేస్తే కోరుకున్న వరాలను హనుమంతుడు ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం.

హిందూ సంస్కృతిలో తమలపాకు:

హిందూ సంస్కృతిలో ప్రతి పండుగలో, శుభకార్యాల్లో తమలపాకులకు ఎంతో ఫ్రాముఖ్యత ఉంది.
 • 🍃 తమలపాకుల తాంబూలం మన సంస్కృతిలో విశిష్ట స్థానం ఆక్రమించింది.
 • 🍃 ఆరోగ్యానికి తమలపాకు సేవించమని ఆయుర్వేదం సూచిస్తుంది. 
 • 🍃 దేవుళ్లకి తమలపాకులతో పూజలు చేయటం సంప్రదాయంగా పస్తోంది. 
 • 🍃 విశేషంగా ఆంజనేయస్వామికి ఆకు పూజ అత్యంత ప్రీతికరమైనది. 
 • 🍃 శత పత్ర పూజ చేస్తే వివిధ దోషాలకు పరిహారం చెల్లించినట్టే అని ఒక నమ్మకం. 
 • 🍃 వివిధ నోములు, ప్రతాలు, శుభ కార్యాలు జరిగినప్పుడు అరటిపళ్ళు.
 • 🍃 వస్త్రంతో పాటు రెండు తమలపాకులు ఇవ్వడం ఆచారం. 
 • 🍃 పూజ సమయంలో దేవుని ముందు ఉంచే కలశంలో తమలపాకులు ఉంచుతారు. 

ఆరోగ్యపరమైన అంశాల్లో
ఆధ్యాత్మిక విషయాలే కాకుండా ఆరోగ్యపరమైన అంశాల్లో కూడా తమలపాకుకు అగ్రతాంబూలం దక్కింది. శరీరానికి తాంబూల సేవనం చాలా ఉపయోగకరం.
 • ፨ ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 
 • ፨ ఎముకలకు మేలు చేసే కాల్పియం, ఫోలిక్ యాసిడ్, 'ఎ' విటమిన్. 'సి' విటమిన్లు తమలపాకులో పుష్కలంగాఉన్నాయి. 
 • ፨ ఫైబర్ - అంటే పీచు పదార్ధం తమలపాకులో ఎక్కువగా వుంటుంది. 
 • ፨ ఆకుకూరలు ఏవిధంగా అయితే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయో తమలపాకులు అంతకంటే ఎక్కువగా పని చేస్తాయి. 
 • ፨ సున్నం, తదితర కృత్రిమ పదార్థాలను చేరిస్తే మాత్రం తమలపాకు శరీరానికి హాని కాకంగా మారుతుంది. 
 • ፨ తమలపాకు యాంటాక్సిడెంట్గా పనిచేస్తుంది, అంటే ముసలితనపు ఛాయలు రాకుండా కట్టడి చేస్తుంది. 
 • ፨ ఈ ఆకురసంను గొంతునొప్పి, శ్వాసకోశ వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. 
 • ፨ చెవిలో రసంపిండిన చెవినొప్పి తగ్గిపోతుంది. 
 • ፨ తమలపాకులో 'చెవికాల్' అనే పదార్థం ఉంటుంది. ఇది బ్యాక్టీరియా పెరుగుదలను కట్టడి చేస్తుందని పరిశోధనలో తేలింది. 
 •  ፨ తమలపాకులకు నేయి రాసి గాయాలకు కట్టుకడతారు. అయితే తమలపాకుసు తొడిమతో సహా తింటే మహిళల్లో వంధ్యత్వం వచ్చే అవకాశం ఉంది.
_జాగృతి

28, జులై 2020, మంగళవారం

తులసి: ఆయుర్వేద మహర్షులు సూచించినది సమస్తరోగాలను హరిస్తుంది, వ్యాధినిరోధకశక్తి పెంచుతుంది - Tulasi Mokka

తులసి: ఆయుర్వేద మహర్షులు సూచించినది సమస్తరోగాలను హరిస్తుంది, వ్యాధినిరోధకశక్తి పెంచుతుంది - Tulasi Mokka

తులసి మొక్క భారతీయులకు అత్యంత పూజనీయమైనది. తులసిగాలి తగిలితేనే సమస్తరోగాలు సమసిపోతాయని ఏ రోగాలనైనా ఎదిరించగల వ్యాధినిరోధకశక్తి పెరుగుతుందని తెలుసుకున్న ఆయుర్వేద మహర్షులు ఇంటింటా తులసిమొక్కలను నాటించి వాటి ఉపయోగాలను ప్రజలకు వివరించి, నిత్యజీవితంలో తులసిని ఒకప్రధాన భాగస్వామిగా మార్చారు. తులసి గుణగణాలు వర్ణించడానికి మానవజీవితం సరిపోదు.

1. తులసికి అనేకపేర్లు:

సంస్కృతంలో తులసి, వైష్ణవి, బృందా, సుగంధా, పవిత్ర, పావని, విష్ణుప్రియ, లక్ష్మీప్రియ, కృష్ణవల్లభ, మాధవి, దేవదుందుభి అని, హిందీలో రామతులసి, కృష్ణతులనే అని, తెలుగులో లక్ష్మీతులనసీ, కృష్ణతులసి, భూతులని, అరణ్యతులని, గగ్గెర అని. లాటిన్లో Ocinum Sancturn అని, ఇంగ్లీషులో Basil అని అంటారు.

2. తులసి గుణ ప్రభావాలు:

లక్ష్తీతులసి ఆకుపచ్చని స్వభావంతో వుంటుంది. దీని ఆకులరసం లేక కాషాయం లేక వేరుకషాయం కొంచెం కారం చేదు కలిసి వుంటుంది. వేడిచేసే స్వభావంతో జ్వరాలను కఫాన్ని, దగ్గుసు, క్రిమిరోగాలను, కఫవాతములను హూరింపచేసి రుచిని పుట్టిస్తుంది. బుద్ధిని, జఠఠాగ్నిని పెంచుతుంది. ఇది వాత పిత్త కఫములనే త్రిదోషములను హరిస్తుంది.  కృష్ణతులసి లక్ష్మీతులసికన్నా అధిక శక్తివంతమైనది. ముఖ్యంగ అంటువ్యాధులను కఫ రోగములను ఉదరరోగములను చర్మరోగములను గుండెరోగములను పొగొట్టడంలో ఇది గొప్పది.

3. ముక్కులోపుండ్లు, గాలిఆడకపోవడం:

తులసిదళాలను నీడలో ఆరబెట్టి దంచి వస్త్ర ఘాలితం చేసి రెండుపూటలా చిటికెడుపొడిని ముక్కులతో నశ్యంలాగా పీలుస్తూవుంటే ముక్కులో పుండ్లు, జలుబు, గాలిఆడకపోవడం, కనుబొమ్మలు, నొసలు శిరస్సులలో నొప్పిరావటం హరించిపోతయ్.
➣ నిషేదములు: జలుబుచేసేవదార్దాలు నిషేధం

4. గజ్జి,తామర, చిడుములకు:

కృష్ణతులసి ఆకులు, నిమ్మకాయ రసంతో కలిపి మెత్తగా నూరి రెండు పూటలా పైన లేపనం చేస్వుంటే అతిత్వరగా ఆ చర్మరోగాలు హరించిపోతయ్.
➣ నిషేదములు: గోంగూర, పంకాయ, మాంసం, చేపలు నిషేధం.

5. మలేరియా మొ॥ విషజ్వరాలకు:

కృష్ణతులసి ఆకురసం 10నుండి 20 గ్రా|| తీసుకొని దానిలో 2గ్రా మిరియాలపొడి కలిపి రెండుపూటలా సేవిస్తూవుంటే మలేరియా హరించిపోతుంది. అంతే గాకుండా, విపరీతమైన జలుబు, అజీర్ణము, మండాగ్ని దగ్గు, ఒగర్పు, గొంతుపుండు కూడా తగ్గిపోతయ్.
➣ నిషేదములు:  అజీర్ణపదార్థాలు, మాంసాహారం నిషేధం

6. సంధివాతమునకు (కీళ్ళనొప్పులు):

కృష్ణతులసిఆకులు, వావిలాకులు, ఉత్తరేడి అకులు సమంగా నీడలో గాలికి ఆరబెట్టి పొడిచేసి వస్త్ర ఘాళితం పట్టి రెండుపూటలా 5గ్రా మోతాదుగా గోరువేచ్చని నీటితో సేవిస్తూవుంటే కీళ్ళనొప్పులు తగ్గిపోతయ్.
తులసితైలం : అలాగే, పైమూడుచెట్ల ఆకుల సమానరసం ఎంతవుంటే అంత నువ్వులనూనె కలిపి నూనెమిగిలేవరకు చిన్నమంటపైన మరిగించి వడపోసి, రెండుపూటలా గోరువెచ్చగా నొప్పులపైన మర్దన చేస్తుంటే అతిత్వరగా సంధివాతం సమసిపోతుంది.
➣ నిషేదములు: వాతకరపడార్థాలు మాంసాహారం నిషేధం

7. కుష్ఠు వ్యాధులకు:

పూర్వజన్మ పాపవశమున శరీరమంతా కుష్ణు వ్యాపించినప్పటికీ ఆరోగి నిర్బయంగా రోజు రెండుపూటలా కృష్ణతులసి మొక్కకు పూజచేసి దాని ఆకులరసం 10 నుండి 20 గ్రా॥| మోతాదుగా ఒక సంవత్సరంపాటు సేవిస్తే ఎంతవికృతంగా మారిన కుష్టురోగి అయినా తిరిగి తనస్వరూపాన్ని పొందగలుగుతాడని మహర్షులఆజ్ఞ, వయస్సును బట్టి మోతాదు నిర్ణయించుకోవాలి.
 ➣ నిషేదములు: మాంసం, చేపలు, గుడ్లు, వంకాయ, గోంగూర, చింతపండు మొ|| నిషేధం

8. పాముకాటుకు తులసి చికిత్స:

చరక, సుశ్రుత, వాగృటాది ఆయుర్వేద మహర్షులంతా ముక్తకంఠంతో తులసిరసం ద్వారా సర్పవిషాన్ని విరిచివేయవచ్చని ఎలుగెత్తి చాటారు. పాము కరిచిన వెంటనే గుప్పెడు కృష్ణతులసి ఆకులను నమిలించాలి. ఆవెంటనే ఆకులు, వెన్న కలిపినూరి ఆముద్దను అప్పుడు లోపలినుండి విషం బయటకులాగబడి తెల్లగావున్న వెన్న నల్లగా మారుతుంది. అదితీసివేసి మరలా కొత్తలేపనం చేయాలి. ఈవిధంగా వరుసగా లేపనం నల్లగా మారనంతవరకు మారుస్తూవుంటే, నర్సవిషం విరిగిపోతుందని నమస్త ఆయుర్వేద గ్రంథాలలో అనుభవపూర్వకంగా చెప్పబడింది.
 ➣ నిషేదములు:  పొగ, మద్యమాంసాలు నిషేధం

9. నపుంసకత్వమునకు మంగళం:

తులసివేర్లు, విత్తనాలు రెండింటిని సమంగా పొడిచేసుకొని ఆమొతానికి సమంగా మంచిబెల్లం కలిపిదంచి ముద్దచేసి నిలువచేయాలి. రోజూ రెండు పూటలా 5గ్రా॥నుండి 10గ్రా॥|మోతాదుగాతిని ఒక కప్పుపాలు సేవిస్తూ బ్రహ్మచర్యం పాటిస్తూవుంటే పురుషాంగం గట్టిపడి తిరిగి యౌవనం సిద్ధిస్తుంది.
➣ నిషేదములు: పులుపు, వేడిపదార్థాలు నిషేధం

10. పిల్లల లివర్ సమస్యలకు:

కప్పునీటిలో పదితులసిదళాలువేసి అరకప్పుకు మరిగించి వడపోసి గోరువెచ్చగా తాగిస్తూవుంటే లివర్ఆ రోగ్యవంతమౌతుంది.
➣ నిషేదములు: అతివేడిపదార్థాలు, మాంసాహారం నిషేధం

11. పిచ్చిచేష్టలు చేసేవారికి:

తులసిదళాలు 8, మిరియాలు 8, సహదేవిచెట్టు వేరు 5 గ్రా॥ వీటిని ఆదివారంనాడు విధిపూర్వకంగా స్వీకరించి ఒకతాయెత్తులో పెట్టి రోగులమెడలో కట్టివుంచితే క్రమంగా పిచ్చిచేష్టలు తగ్గిపోతయ్.
➣ నిషేదములు: పొగ, మద్యమాంసాలు నిషేధం

12. సృహతప్పి పడిపోతే:

తులశాకురసంలో చిటికెడు సైంధవలవణం కలిపి కరిగించి పడపోసి రెండుముక్కుల్లో మూడుచుక్కలు వేస్తే ఏవిధమైన స్పృహతప్పినా వెంటనే తెలివిలోకి వస్తారు.
➣ నిషేదములు: అజీర్ణకరపదార్థాలు నిషేధం

13. కడుపునొప్పి, కడుపుబ్బరం:

కడుపునొప్పి, కడుపుబ్బరం తులసిగింజలపొడి 3గ్రా, పటికబెల్లంపొడి 3గ్రా| ఒకమోతాదుగా గోరువెచ్చనినీటితో సేవిస్తూ వుంటే కడుపునొప్పి, ఉబ్బరం తగ్గిపోతయ్.
➣ నిషేదములు: అజీరకర్తపదార్థాలు నిషేధం

14. నీళ్ళ, జిగట విరేచనములకు:

తులశాకులరసం 20గ్రా|, చిటికెడు జాజికాయ పొడికలిపిసేవిస్తుంటే నీళ్ళవిరేచనాలు, జిగట విరేచనాలు కట్టుకుంటయ్.

15. ఉబ్బసానికి - ఉధృతమైనయోగం:

తులశాకులు 100గ్రా|, తానికాయబెరడు 200గ్రా|| కలిపి ఒకలీటరునీటిలో ఒకరోజంతా నాన బెట్టి పొయ్యి మీద పెట్టి పావులీటరు కషాయం మిగిలే వరకు మరిగించి వడపోసి రెండు ముూడు చెంచాల మోతాదుగా రెండుపూటలా ఆహారానికి ముందు సేవిస్తుంటే క్రమంగా ఉబ్బసం హరించి పోతుంది. ➤ పదార్థానికి బూజుపట్టకుండా జాగ్రత్తపడాలి.
➣ నిషేదములు: కఫంపెంచే చల్లనిపదార్ధాలు నిషేధం.

సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి

22, జులై 2020, బుధవారం

ప్రాణాయామం - శాస్త్రియకోణంలో సాధనం, శ్వాస. శ్వాసని, గతిని నియంత్రించే ప్రక్రియ - Pranayama - Practice in the scientific sense, breathing. Breathing, movement, regulating process

ప్రాణాయామం - శాస్త్రియకోణంలో సాధనం, శ్వాస. శ్వాసని, గతిని నియంత్రించే ప్రక్రియ - Pranayama - Practice in the scientific sense, breathing. Breathing, movement, regulating process
చలే వాయుః చలే చిత్తం', వాయు చలనంలో ఎక్కువగా చోటు చేసుకునే అవకతవకల వల్ల చిత్తం (అంటే మనసు కూడా) చలిస్తుంది. స్థిరత్వం లేక ఆందోళనలకు గురై, అన్ని రకాలయిన సైకో న్యూరో ఇమ్యూనోలాజికల్ రుగ్మతలకు దారితీస్తుంది. కనుక మనసుని నియంత్రించటానికి మనకి ఉన్న ఒకే ఒక సాధనం, శ్వాస. శ్వాసని, దాని గతిని నియంత్రించే
ప్రక్రియ ప్రాణాయామం.

     సరైన ఆసనాభ్యాసం శరీరాన్ని ప్రాణాయామానికి సిద్దపరుస్తుంది. ఈ ప్రాణం శరీరంలోకి శ్వాస ద్వారా ప్రవేశిస్తుంది. ఇది హృదయాన్ని చేరుతుంది.

హృదయం మూడు క్రియలకు నిలయం: 
 • 1, ఋదతి, అంటే తీసుకోవటం, 
 • 2. దదాతి అంటే ఇవ్వటం, 
 • 3. యానతి అంటే ప్రసరింపచేయటం. 
ఈ ప్రాణం శరీరమంతటా ప్రవహిస్తుంది. ఐదు రకాల ముఖ్య ప్రాణ వాయువులుగా, ఐదురకాల ప్రాణవాయువులుగా ఇది శరీరమంతటా (ఐయటికి) వ్యాప్తి చెంది ఉంటుంది.

ముఖ్యంగా వ్యాస అనే ప్రాణ వాయువు శరీర మంతటా ప్రవహిస్తూ బయటకు కూడా ప్రయాణం చేస్తూ ఉంటుంది. దీని ప్రయాణం వలననే మనకి శరీరమునందలి అన్ని కణాలకి విశ్రాంతి చేకూరుతుంది. కనుకనే మనం శరీరానికి అంటుకునేవి, బిగుతుగా ఉండే వస్త్రాలని ధరించినప్పుడు ఈ వాయు ప్రసరణకి అవరోధం ఏర్పడి మానసికంగా చికాకుని అసహనాన్ని కలుగచేస్తుంది. ఇటువంటి వస్త్రధారణ యోగాభ్యాసానికి పనికిరాదు ప్రాణాయామాన్ని శ్వాస ప్రవాహ నియంత్రణ అని అంటారు.

మన శరీరంలోని వ్యవస్థలలో శ్వాసక్రియ వ్యవస్థకి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది 'Dual nature' కలిగినది. శ్వాసను మన ప్రమేయం లేకుండానే పీల్చుకుంటాం. దీనిని ఇన్ వాలంటరీ అంటారు. శ్వాసని మనం వాలంటరీగా కూడా తీసుకోవచ్చు. అందుకనే బాగా దీర్ఘంగా కూడా శ్వాసని పీల్చగలం. కనుకనే శ్వాసప్రక్రియ వ్యవస్థ (వాలంటరీ / ఇన్ వాలంటరీ) Dual nature ని కలిగి ఉన్నది అని అంటారు. ఈ సౌకర్యం వల్లనే మనం ప్రాణాయామం చేయగలం.

   శ్వాస ద్వారా మనం గ్రహించే ఆక్సిజన్ తక్కువ ఉండటంవల్ల జీవక్రియలు మందగిస్తాయి. ప్రాణాయామంలోని దీర్ఘ శ్వాసక్రియ వలన అవి చైతన్యవంతమవుతాయి. నిమిషానికి 16 నుంచి 18సార్లు తీసుకునే సాధారణ శ్వాసక్రియ ప్రాణాయామ అభ్యాసం వల్ల క్రమంగా తగ్గి ఆక్సిజన్వి నియోగం పెరుగుతుంది.

     దీనివలన వంద ట్రిలియన్ జీవకణాలకి జరుగవలసిన ఆహారపదార్థాల సరఫరా, టాక్సిన్ల సేకరణ చక్కగా జరిగి Aging Process నిదానమవుతుంది. దీనివలన వ్యక్తి చురుకుగా, ఆరోగ్యంగా ఉంటాడు

ఒత్తిడిలేని దీర్ఘత్వాసల ద్వారా చేసే ఈ ప్రాణాయామం వలన శరీరంలో నిరంతరం పేరుకుపోతూ ఉండే మాలిన్యాలు బయటకు పోతాయి. కొన్ని చెమటరూపంలో, కొన్ని బహిశ్వాసతోపాటు తొలగిపోతాయి. శ్వాస గతిస్థిరంగాను, నిలకడగానూ ఉంటుంది. అంతేగాక ఈ ప్రాణాయామం ప్రత్యక్షంగా న్యూరో హార్మోనల్ వ్యవస్థలపైన పనిచేసి వాటికి తగిన విశ్రాంతిని కలుగజేస్తుంది. ముఖ్యంగా నేటి విషమ పరిస్థితులలో కరోనా వంటి వైరస్లు upper respiratory tract పైన చేరినపుడు వచ్చే గొంతు సంబంధ ఎలక్జీలు, అలానే Vocal Cordsకి సంబంధించిన సమస్యల నుంచి కాపాడటానికి ప్రాణాయామం ప్రయోజనకారి కాగలదు.

       ఆవేశకావేశాలకు గురైనప్పుడు తిరిగి మనసును సరియైన మార్గంలోకి తీసుకురావడానికి ప్రాణాయామం చక్కగా సహాయపడుతుంది. అయితే ఇది సరియైన పద్ధతిలోనే అభ్యాసం చేయాలి.
" ప్రాణాయామస్య యుక్తేన సర్వరోగ నివారణే
అయుక్తాభ్యాస యోగేన సర్వరోగ సముద్భవః "
అని హఠయోగంలో చెప్పారు. సరైన ప్రాణాయామ అభ్యాసం అన్ని రోగాలను నివారిస్తుంది. అయుక్తమయిన ప్రాణాయామ అభ్యాసంవల్ల శరీరం సర్వరోగాలకు నిలయమవుతుందని శాస్త్రం హెచ్చరించింది.  కనుక సరైన శిక్షకుల వద్ద అభ్యసిస్తే మంచి ఆరోగ్యానికి ఇది సహకరిస్తుంది.

స్వామి రాందేవ్ గారి ప్రాణాయామ సాధన వీడియో వీక్షించండి..

ప్రాణాయామ సాధనలో విదేశీ వనిత - వీడియో వీక్షించండి..


సంకలనం: జాగృతి

21, జులై 2020, మంగళవారం

వ్యాధి నిరోధకాన్ని పెంచే అద్భుత ఔషధం, "దేశవాళీ గోవు పాలు" - Desavali Cow Milk - Immunity Booster

వ్యాధి నిరోధకానికి అద్భుత ఔషధం, "దేశవాళీ గోవు పాలు" - Desavali Cow Milk - Immunity Booster
వపాలల్లో ఉన్న మాంసకృత్తులను బట్టి పాలు, 'ఏ1 బిటా కెసిన్' మరియు 'ఎ2 బీటా సీన్' అని రెండు రకాలుగా విభజించబడ్డాయి.

ఎ1' మరియు 'ఎ2' పాలకు మధ్య గల వ్యత్యాసం: 
ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ , అమెరికా, న్యూజిలాండ్ వంటి దేశాలలో ఉన్న ఆవులలో జన్యుపరమైన మార్పు జరగడం వలన, 'ఎ2' కెసీన్ పాలు 'ఎ1' కెసీన్ పాలగా మార్పుచెందాయి. 'ఎ1' పాలలో 'బీటా కెసొమొర్పిన్ 7' అనే పదార్థం ఉందని, 'అది టైప్ 1 చెక్కర వ్యాధి (డయాబెటిస్), ల్యాక్టోస్ ఇంటాలెరెన్స్, గుండె సంబంధిత జబ్బులు, నరాల సంబంధిత వ్యాధులు, ఆటిసమ్, షైజోఫ్రీనియా మొదలగు వ్యాధులకు కారకం అవుతుందని శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది.

జెర్సీ, హెచ్. ఎఫ్ లాంటి విదేశీ ఆవు పాలలో 80 శాతం ఎ1' రకం, 20 శాతం 'ఎ2' రకం ఉండగా, ఒంగోలు, గిర్, సాహివాల్ వంటి మన దేశీయ ఆవు పాలలో నూటికి నూరు శాతం 'ఎ2' రకం ఉండటం గమనార్హం. విదేశాలలో నానాటికి మన దేశవాళీ ఆవు పాల గిరాకీ పెరుగుతుండటం వలన, 'ఎ2' రకం పాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

స్వదేశీ - దేశీయ ఆవుపాల వలన ఆరోగ్య లాభాలు: 
 • ➲ దేశీయ ఆవు పాలు తల్లి పాలకు, చాలా దగ్గరగా ఉంటాయి. సులభంగా అరుగుదలకు తోడ్పడతాయి. మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులను తగ్గిస్తాయి. అల్సర్, కోలన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ మరియు చర్మ క్యాన్సర్, జీర్ణవ్యవస్థ సంబందించిన, ఎముకుల బలహీనత వంటి వ్యాధులను దరికి చేరనీయవు. 
 • ➲ దేశీయ ఆవు పాలు రకాల మినరల్స్, 'బి2', 'బి3' మరియు ఎ' విటమిన్లను అధిక మొత్తంలో కలిగి ఉండటం వలన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దేశీయ ఆవులలో, తెల్ల ఆవు పాలు వాతాన్ని, కపిల ఆవు (నలుపు, గోధుమ వర్ణముల కలయిక గల ఆవు) పాలు పిత్తాన్ని, ఎరుపురంగు ఆవు పాలు కఫాన్ని హరించి వేస్తాయి. దేశీయ ఆవులు, విదేశీ ఆవులతో పోలిస్తే ఎండ, చలి, కరువు లాంటి పరిస్థితులను తట్టుకోవడమే కాకుండా రోగనిరోధక శక్తిని అధికంగా కలిగి ఉంటాయి. 
 • ➲ దేశీయ ఆవులు అధిక సంతానోత్పత్తి కలిగియుండి, వాటి జీవిత కాలంలో అనేక ఈతల ద్వారా అధిక పాల ఉత్పత్తికి దోహదపడతాయి. 
 • ➲ కానీ విదేశీ ఆబోతులతో సంకరీకరణం జరపడం వలన, మన దేశీయ ఆవులలో జన్యుపరమైన మార్పులు జరిగి, వాటి జన్యురూపాన్ని కోల్పోతున్నాయి.
 • ➲ ఇప్పటికే మన దేశంలో ఉన్న 12 రకాల ఆవులలో అలంబాడి, బింజార్పూరి, కటియాలి, పులికులమ్, బర్దూర్, రాయచూరి రకాలను పోగొట్టుకోగా తార్పార్కర్, ఒంగోలు, హల్లికార్, నాగౌరీ, కె.వి. బ్లాక్, పుంగనూరు వంటివి అంతరించి పోవడానికి సిద్దంగా ఉన్నాయి. 
 • ➲ భారత ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించి, దేశీయ ఆవులు అంతరించి పోకుండా వివిధ పథకాలను, కార్యక్రమాలను చేపట్టింది. 
విదేశీ ఆబోతులతో సంపర్కం నిలిపివేసి, దేశీయ జాతి ఆబోతులతో సంపర్కాన్ని ప్రోత్స హించి, దేశీయ ఆవుల ఉనికిని సంరక్షించుకోవడం వలన, భావితరాలకి బంగారు బాటను వేసిన వాళ్ళమవుతాము.
దేశవాళీ ఆవు పాలను, పాల ఉత్పత్తులను ఆన్ లైన్ లో కొనాలనుకుంటే పతంజలి వారి దేశవాళీ గోవు ఉత్పత్తులను ఈ లింకు ద్వారా కొనవచ్చును లింక్: 🔗 ➤
దేశవాళీ ఆవు పాలను, పాల ఉత్పత్తులను ఆన్ లైన్ లో కొనాలనుకుంటే పతంజలి వారి దేశవాళీ గోవు ఉత్పత్తులను ఈ లింకు ద్వారా కొనవచ్చును లింక్: 🔗 ➤
దేశవాళీ ఆవు పాలను, పాల ఉత్పత్తులను ఆన్ లైన్ లో కొనాలనుకుంటే పతంజలి వారి దేశవాళీ గోవు ఉత్పత్తులను ఈ లింకు ద్వారా కొనవచ్చును లింక్: 🔗 ➤


సంకలనం: పి. రవికాంత్రెడ్డి, పి. హెచ్.డి స్కాలర్. ఎన్.టి.ఆర్. పశువైద్య కళాశాల, గన్నవరం. ఫోను : 7386247618

19, జులై 2020, ఆదివారం

గుండెకు మేలుచేసే యోగా ముద్రలు, యోగాసనాలు - Yoga for Blood Pressure and Healthy Heart

గుండెనొప్పి వంటి పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటే యోగా ముద్రలు, యోగాసనాలు:
 • వయసుతో పాటు వచ్చే ఈ సమస్యని ఆదుపులో ఉంచుకోవాలంటే చక్కని ఆహారం, వ్యాయామం చాలా అవసరం.
 • ఆహారంలో కొవ్వుని బాగా తగ్గించాలి. 
 • తాజా కాయగూరలు, పండ్లకి ప్రాధాన్యం ఇవ్వాలి.
 • ఉప్పు వాడకాన్ని తగ్గించాలి.
 • తరచూ పరీవక్షలు చేయించుకోవాలి. 
వాటితో పాటు ఈ ఆసనాలు వేయాలి:
ఆపాన వాయుముద్ర
1. ఆపాన వాయుముద్ర: సుఖాసనంలో కూర్చుని వెన్నెముక నిటారుగా ఉంచాలి. కుడిచేతి చూపుడు వేలుని, బొటనవేలు కింద ఉంచాలి. మధ్యవేలు ఉంగరం వేలు బొటనవేలికి కలపాలి. చిటికెన వేలును నిటారుగా ఉండాలి, ఇలా పావుగంట పాటు వెయ్యాలి. ఇది చాలా ముఖ్యమైన ముద్ర ఒక సారి గుండెనొప్పి లక్షణాలు కనబడి వైద్యుని వద్దకు వెళ్లే లోపు ఈ మంద్ర వేస్తే కొంత రక్షణ కలుగుతుంది. అందుకే దీనిని లైఫ్ సేవర్ ముద్ర ఆని కూడా అంటారు. గుండెకు సంబంధించి ఏ సమస్యలున్నా ఈ ముద్రని వేయొచ్చు. సమస్య ఉన్నవారు రోజులో మూడు సార్లు వేయొచ్చసు ఆస్పత్రిలో ఉండి కూడా వేయొచ్చు. ఈ ఆసనాలు చేస్తూనే వ్యతిరేక ఆలోచనలు, భావనలు, దుర్వసగాలకు దూరంగా ఉండాలి.

కటి ఆసనం

2. కటి ఆసనం: వెల్లకిలా పడుకొని రెండు కాళ్ళు ముడిచి  దగ్గరకు తీసుకౌని రెండు కాలి బొటనవేశ్లని పట్టుకోవాలి.  తర్వాత రెండు కాళ్లని నిటారుగా ఉంచాలి. కాళ్ల ఘధ్య కొద్దిగా దూరం పాటించాలి తల, భుజాలు పైకి కొంచెం లేపాలి మెడ నొప్పిగా ఉంటే తలని లేపకుండా చెయ్యాలి. ఆ ఆసనంలో ఆరనిమిషం పాటు ఉండాలి. ఇలా మూడు సార్లు చెయ్యాలి.

3. షుప్త గోరక్షాసనం: వెల్లకలా పడుకొని రెండు కాళ్ళు దగ్గరగా తీసుకొని రెండు పాదాలని కలిపి రెండు చేతులతో పట్టుకోవాలి.  తల, భుజాలని కొంచెం పైకి లేపాలి. రెండు చేతులు నిటారుగా ఉంచాలి. ఈస్థితిలో శ్యాస మీద ద్యాస నిలపాలి. ఇలా ఇరవై సెకన్ల పాటు ఉండాలి. మెల్లగా యధాస్థితికి రావాలి. తిరిగి మరలా చెయ్యాలి. ఇలా మూడు సార్లు చెయ్యాలి.


నీరసంగా, అలసట , లో-బిపి ఉన్నవారికి యోగాసనాలు:


1. వజ్ర ముద్ర: సుఖాసనంలో కూర్చుని చూపుడువేలు నిటారుగా ఉంచాలి. మధ్యవేలు, బొటనవేలు కలిపి ఉంచాలి. చిటికెనవేలు. ఉంగరం వేలు కొంచెం పక్కకి పెట్టాలి. ఈ ముద్ర ఐదు నిమిషాల పాటు చెయ్యాలి. వెన్నెముక నిటారుగా ఉంచి, కళ్లు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచాలి, ఈ ముద్ర ధరించడం వల్ల లోబిపిని త్వరగా అదుపులో పెట్టుకోవచ్చు. సమస్య ఎక్కువగా ఉంటే రోజులో మూడు సార్లు చెయ్యాలి.

2. విపరీత నౌకాసనం: పొట్ట మీద బోర్లా పడుకోవాలి. శ్వాస తీసుకొంటూ రెండు చేతులూ రెండు కాళ్లూ తలపైకి లేపాలి. ఇలా పదిసెకన్లపాటు వదులుతూ యథాస్థితికి రావాలి ఇలా ఆరు సార్లు చెయ్యాలి.

గమనిక:
పైనుదహరించిన యోగాసనాలు ప్రాధమిక అవగాహనకొరకే, మరింత సమాచారం కోసం యోగా నిపుణులను సంప్రదించగలరు.

రచన: యోగా నిపుణురాలు - అరుణ గారి సౌజన్యంతో

18, జులై 2020, శనివారం

కరోనా, ఒత్తిడి, యోగా - Carona - Oppthidi - Yoga


కరోనా - ఒత్తిడి - యోగా
కొత్త కరోనా వైరస్. అంటే కొవిడ్ 19 మమషులను దారుణమైన ఆందోళనకు గురి చేస్తుంది. కొవిడ్ 19లో ఈ కోణం చాలా ముఖ్యమైనదని, ప్రమాదకరమైనదని.

వైద్యులంతా ముక్తకంఠంతో చెబుతూనే ఉన్నారు. ఆందోళనకీ, వైరస్ నుంచి బయటపడడానికి ఉన్న బంధం ఏమిటి? ఆందోళసతో శరీరంలో రోగ నిరోధక శక్తి బలహీనవదుతుంది. అదే వైరస్ సోకడానికి దారి చూపుతుంది. కొనిడి 19 మనదేశంలే విస్తరించడానికి కాస్త ముందే బాబా రాందేవ్ ఈ విపత్కర సమయంలో యోగా అవసరాన్ని గుర్తు చేశారు.
బాబా రాందేవ్
బాబా రాందేవ్ 
దీని నివారణకు ప్రాణాయామాన్ని ఏ విధంగా అభ్యాసించాలో కూడా ప్రదర్శనలు ఇచ్చారు. ఆయనే కాదు, మన దేశానికి చెందిన యోగా గురువులతో పాటు, విదేశీయులు, హార్వార్డ్ మెడికల్ స్కూల్ ఆచార్యులు కూడా కరోనా నిరోధంలో యోగాభ్యాసానికి ఉన్న ప్రాధాన్యాన్ని నిర్ణ్వంద్వంగా వెల్లడించారు.

ఇంతకు ముందే యోగా గప్పతనం తెలుసుకున్నా, అగ్రరాజ్యం అమెరికా యోగాభ్యాసాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకుంది, మనసులోని కల్లోల కెరటాలను శాంతింప చేయడానికి ప్రస్తుతం ప్రపంచానికి కనిపిస్తున్న మార్గం యోగాభ్యాసమే. మందులు కాదు, ఆస్పత్రులు కాదు ప్రశాంత చిత్తమే మనిషిని కరోనా బారి నుంచి బయటపడేస్తుందని నేటి ప్రపంచం ఏక్రవంగా ఆమోదించింది.

రోనా ఒత్తిడి పెంచుతోంది. పెరిగిన ఒత్తిడి కరోనా వైరస్ బాధితుల సంఖ్యను పెంచుతున్నది.
 • ➲ ఈ విషవలయాన్ని అధిగమించడానికి యోగాభ్యాసం ఉపయోగపడుతుందని అమెరికాకు చెందిన ప్రఖ్యాత హార్వార్డ్ మెడికల్ స్కూల్ (వైద్య కళాశాల) సిఫారసు చేసింది.
 • ➲ ధ్యానం కూడా ఇందుకు ఉపకరిస్తుందని కూడా ఆ కళాశాల చెప్పింది. 
అమెరికాలో కరోనా వైరస్ చెలరేగిపోతున్న తరుణంలోనే, అంటే ఈ సంవత్సరం మార్చి మధ్యలో ఈ సిఫారసులు వచ్చాయి.  అప్పటికి ఇంకా అమెరికాలో కేసులు 3,485 మాత్రమే మరణాలు మాత్రం 65. ఆ సమయంలోనే యోగ, ధ్యానం, ఉచ్ఛ్వాసనిస్వాసాల మీద అదుపు సాంత్వనకు నిజమైన మార్గాలని ఆ వైద్య కళాశాల ఆచార్యులు పేర్కొన్నారు.

'కోపింగ్ విత్ కరోనా వైరస్ యాంక్సయిటీ' (కరోనా వైరస్ ఆందోళనను ఎదుర్కొందాం) పేరుతో వచ్చిన ఒక వ్యాసంలో ఈ విషయాలు ఉన్నాయి. జాన్ షార్స్ (హార్వార్డ్ మెడికల్ స్కూల్), డేవిడ్ గా ఫెన్ (స్కూల్ ఆఫ్ మెడిసిన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం) ఈ వ్యాసం రాశారు. ఇంతకు ముందు అలవాటు లేకపోతే ఇప్పుడు ఆ ప్రయత్నం చేయండి. కొన్ని సమయాలలో కొన్ని విషయాలు తెలుసుకుంటే ఎంతో బావుంటుందని కూడా యోగాను ఉద్దేశించి వారు రాశారు.

యోగా స్టూడియో, పాకెట్ యోగా అనే రెండు యాప్లు చక్కగా వీటిని వివరిస్తున్నాయని వారు సిఫారసు చేశారు.

యోగాభ్యాసం మూడు అంచెలుగా పని చేస్తుంది: 
 • ఒకటి: యోగా రోగ నిరోధక శక్తిని ఇతోధికంగా వృద్ధి చేస్తుంది. 
 • రెండు: యోగాభ్యాసం వల్ల నిరాశానిన్తృహలను అధిగమించవచ్చు.
 • మూడు: ప్రపంచం చేరవలసిన లక్ష్యాలను యోగా నిర్దేశిస్తుంది. దానితో మనం బలోపేతం కాగలం అంటారు ప్రముఖ భారతీయ యోగా గురువు భరత్ ఠాకూర్. 
అందోళన లేదా ఒత్తిడి నాడీమండలాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. దీనితో రక్తపోటు పెరుగుతుంది. కండరాల మీద కూడా ఒత్తిడికి లోనవుతాయి. దీనితో ఏకాగ్రత నశించిపోతుంది వీటన్నిటిని చల్లార్చే గొప్ప గుణం యోగ సొంతం.

ప్రయాణాల మీద పరిమితులు, ప్రతికూల వార్తల వెల్లువ, లాక్ డౌన్ కారణంగా భవిష్యత్తు గురించి అంతకంటే, ఆ నెల తరువాత సమకూర్చుకోవలసిన వస్తువుల అందుబాటు గుర్తించి చాలామంది ఆందోళనకు గురవుతున్నారు. అన్నింటికీ మించి లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు నిరుద్యోగం దారుణంగా పెరిగిపోతున్నది. నిరుద్యోగం బారిన పడిన వారు, భవిష్యత్తు అనేది ఒకటి ఉందని, మళ్లీ జీవితం వికసిస్తుందని భావించవలసి ఉంటుంది.  ఇందుకు యోగా పనికి వస్తుంది

ఒక్క నిమిషం ఆగ్రహం రోగ నిరోధక శక్తి మీద నాలుగైదు గంటల పాటు ప్రభావం చూపుతుంది. ఒక్క నిమిషం నవ్వుకోగలిగితే దాని ప్రభావం రోగ నిరోధక శక్తి మీద 24 గంటల పాటు ఉంటుంది' అంటాడు ప్రముఖ రచయిత లెస్ బ్రౌన్.

కరోనా వైరస్ భూమండలాన్ని ఆక్రమించుకోవడం మొదలు పెట్టిన తరువాత వైద్యులు చెప్పిన మొదటి మాట రోగ నిరోధక శక్తి గురించే. దేశం తరువాత దేశానికి క్షణాలలో వ్యాపిస్తూ భూగోళం మీద 219 దేశాలను కబళించిన కరోనాను చూసి ప్రపంచ ప్రజానీకం భయపడకుండా ఆందోళన చెందకుండా, ఇంకా చెప్పాలంటే నవనాడులూ కుంగిపోకుండా ఎలా ఉండగలరు.

భయం, ఆందోళన, ఒత్తిడి ప్రతి మనిషి అనుభవించిన సాధారణ లక్షణాలయిపోయాయి. మనిషికి రోగం వస్తే, మధుమేహం, బీపీ వంటి వాటితో ఒత్తిడితో రోగ నిరోధక శక్తి సన్నగిల్లి పోతుంది. ఇలాంటి సందర్భంలో మనసును ప్రశాంతంగా ఉంచుకుని, మన రోగ నిరోధక శక్తి మీద దుష్ప్రభావం ఏదీ పడకుండా చూసుకోవడం ఎలా? ఇదే అందరికీ వచ్చిన ప్రశ్న. యోగా ఈ సమయంలో చాలా ప్రతిభావంతగా పనిచేసే ఆయుధం. సాంత్వన చేకూర్చే చల్లని హస్తం.

మనసు అనేది నీళ్ల వంటిది. అది అతలాకుతలంగా ఉన్నప్పుడు చూడడం భయానకం. అది స్టిమితపడితే అంతా ప్రశాంతమే' అంటారు ప్రసాద్ మాహే. 1700 ఏళ్ల నాటి యోగా సూత్రాలలో వాటి కర్త పతంజలి మనసులోని అలలను కట్టడి చేసి నిశ్చలంగా ఉంచుకోవడం గురించే మాట్లాడాడు.
 • ➧ ఆందోళన, క్షోభ, భయం, నిరాశ, ప్రతికూల భావాల ఉద్వేగాలుమనసునులో చురుకుగా కదిలే అలలను సృష్టిస్తాయి. 
 • ➧ ఈ కల్లోలమే, సంక్షుభిత మానసిక స్థితే నాడీ వ్యవస్థ మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపగలుగుతుంది. ఇది తాత్కాలికమైతే శరీరానికి మంచిదే. రోగ నిరోధక శక్తికి కూడా దోహదం చేస్తుంది. 
 • ➧ అదే వారాలు, నెలల తరబడి కొనసాగితే రోగ నిరోధక వ్యవస్థ స్పందనను నీరసపడేటట్టుచేస్తుంది. 
 • ➧ రోగ నిరోధక శక్తి  తగ్గిపోవడంతోనే వైరస్ కు అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది. 
 • ➧ మనలోని రోగ నిరోధక శక్తి తగ్గిపోకుండా నిలబెట్టుకోవడానికి సహజ పద్ధతులలో ఉపయోగడేదే యోగాభ్యాసమని జర్నల్ ఆఫ్ బిహేవియరల్ మెడిసిన్ పేర్కొంటున్నది. 
క్రమం తప్పని యోగాభ్యాసంతో రోగ నిరోధక శక్తిని సాధించుకోవచ్చునని ఆ పత్రిక సిఫారసు చేసింది.

యోగ - వ్యాయామం ఒకటేనా?
యోగాభ్యాసం అంటే శారీరక వ్యాయామం అని మనలో చాలామంది అభిప్రాయపడుతూ ఉంటాం. కానీ యోగా అనే ఆకాశమంత చిత్రంలో అదొక రేఖ, అంతే పతంజలి మహర్షి చెప్పిన సనాతన యోగాభ్యాసం ఎనిమిది అంగాలతో కూడుకున్నది. దీనిని మానసంలోని, కలోలాన్ని నిరోధించడానికి నిర్మించారు. వాటినే ఆసనాలని పిలుచుకుంటాం. బ్రహ్మచర్యం (స్వీయ నియంత్రణ), శుచిత్వం, సంతోషం, స్వాధ్యాయ (నిరంతర జాగరూకత) ప్రాణాయామం యోగాలో చెబుతారు. ఈ బదు అంశాల యోగాభ్యాసం కరోనా ద్వారా మానవాళికి వచ్చే ఆందోళనను దూరం చేయగలుగుతుంది.

స్వీయ నియంత్రణ:
స్వీయ నియంత్రణ అనేది కరోనా వంటి సమయంలో అత్యవసరంగా కనిపిస్తుంది. దీనినే బ్రహ్మచర్యంగా పిలుస్తారు. రోగ నిరోధక శక్తిని భద్రంగా ఉంచుకోవలసిన సమయంలో వృథాగా శక్తిని కోల్పోకుండా చేయడానికి ఇది ఉపకరిస్తుంది. అంటే రోగ నిరోధక శక్తి స్పందన సక్రమంగా ఉండేటట్టు చేస్తుంది. ధూమపానం, మద్యపానం, అతిగా చక్కెర వాడకం, బయటి తిండి మన రోగ నిరోధక శక్తి మీద ప్రతికూలత కనపరుస్తాయి. 

'దేహమే నీ దేవాలయం. నీ ఆత్మ అధిష్టించడానికి వీలుగా దానిని పరిశుభ్రంగా ఉంచుకో' అంటారు ప్రఖ్యాత యోగా గురువు బీకేఎస్ అయ్యంగార్. యోగాభ్యాసంలోని శుచి నీ దేహాన్ని గౌరవంతో చూసుకుంటూ, శుచిగా ఉంచుకోవాలని ప్రబోధిస్తుంది. దీనిని ఒక యోగి వలె ఆహారం తీసుకుంటూ సాధించవచ్చు. శక్తిని కూర్చే పదార్థాలనే తినాలి. ప్రశాంతతను చెడగొట్టని
వాటినే తీసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్నే స్వీకరించాలి. ఇవే మన ఆహారంలో అరవై నుంచి ఎనభై శాతం ఉండాలి.

మనం శుచీశుభ్రతను పాటించడం ద్వారా కూడా యోగాభ్యాసం చేయవచ్చును. శరీరంలో తగినంత జలం ఉండేరీతిలో మంచినీటిని తీసుకోవడం ఒకటి. శరీరంలో తగినంత జలం లేకపోతే, లేదా కోల్పోతే రోగ నిరోధక శక్తి) తగ్గిపోతుందన్న వాస్తవాన్ని మనమంతా గుర్తు పెట్టుకోవాలి. తగినంత జలం లేకపోతే శరీరానికి రోగ నిరోధక శక్తిగా ఉపయోగపడే రక్తాన్ని, లింఫ్ గ్రంథులను అది బలహీన పరుస్తుంది. తగినంత జలం ఉన్నప్పుడే శరీరంలోకి చేరిన విష పదార్థాలను, బాక్టీరియాను బయటకు పంపించే శక్తి శరీరానిక ఉంటుంది, కాబట్టి శరీరంలోని బాక్జీరియాసు నిరోధించడానికి తగినంత జలం కూడా ఉండాలి.
హఠయోగ
హఠయోగ

లాక్ డౌన్, క్వారంటయిన్ ఒక నాణానికి అటు ఇటు ఉండేవే. లాక్ డౌన్ కాలంలో కొందరు సినిమా నృత్యాలు, పెద్దగా ఉపయోగం లేని ఆటలకు పరిమితమయ్యారు. కానీ కొందరు యోగాభ్యాసాన్ని ఆశ్రయించారు. మనసునీ, శరీరాన్నీ, ఆత్మనీ అనుసంధానం చేసే అద్భుత ప్రక్రియ యోగ. క్వారంటయిన్ అయిన వారందరికీ యోగ గురించి తెలిసే అవకాశం లేదు. పేరు విన్నా ప్రక్రియ గురించి తెలియకపోవచ్చు. క్వారంటయిన్లో ఉన్న కొత్తవారికి హఠయోగ మంచిదని శిక్షకులు చెబుతున్నారు.
 • యోగా శారీరక వ్యాయామానికి మించినది యోగాతో జీవితాలు బాగుచేసుకున్నవారు ఇప్పుడు విశ్వమంతటా కనిపిస్తారు. ఎలాంటి ప్రతికూల ప్రభావాలు లేకుండా ఆరోగ్యాన్నీ మానసిక స్వస్థతను యోగాభ్యాసం ఇవ్వగలుగుతుంది. కేవలం కరోనా ద్వారా కలుగుతున్న ఒత్తిడి నుంచి విముక్తి పొందడానికి కొన్ని ఆసనాలు చెబుతున్నారు.అందులో ఒకటి వీరభద్రాసనం. 

తాడాసనం, త్రికోణాసనం, అర్థకటి చక్రాసనం వీరభద్రాసనం కూడా యోగాభ్యాసం ఆరంభానికి అనుకూలంగా ఉంటాయి. కరోనా లేదా, క్వారంటయిన్ సమయంలో యోగ నిద్ర ఎంతో బాగా పనిచేస్తుందని ప్రముఖుల యోగా అధ్యాపకులు ఏనాడో వెల్లడించారు.

20 నిమిషాల యోగనిద్రతో ఆందోళనను, ఒత్తిడిని అధిగమించవచ్చు. కరోనా వైరస్ నుంచి బయటపడిన తొలి ఢిల్లీ వాసి చెప్పిన మాటను ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ప్రతి ఉదయం తాను చేసిన కపాలభాతి ప్రాణాయామం ఎంతో ఉపకరించాయని ఆయన చెప్పారు.

కపాలభాతి అంటే కపాలాన్ని శుద్ధి చేసుకునేది. యోగ, ధ్యానం మనిషికి ఇచ్చేవి ఏమిటి. శారీరక చురుకుదనం ఆరోగ్యకరమైన ఆహారం పట్ల మొగ్గు, ధూమపానం, మద్యపానం పట్ల విముఖత, సుఖనిద్ర, ఒత్తిడి స్థాయిని తగ్గించడం. మెదడులో గాబా అనే రసాయనాన్ని పెంచడం (దీనితోనే మనసు ప్రశాంతంగా ఉండగలగుతుంది), ఆందోళనకు గురిచేసే హార్మోన్లను తగ్గించడం. కరోనా కాలంలో దాని బయటపడడానికి చాలామందికి ఇవే కదా అడ్డంకిగా ఉన్నాయి.

సంతోషం కండరం వంటిది. ఉపయోగించేకొద్దీ బలపడుతుంది అంటారు పెద్దలు. యోగాభ్యాసంలో చెప్పే సంతోషానికి విస్తృతార్థం ఉంది. ఇక్కడ సంతోషం అంటే కృతజ్ఞతా భావంతో సాధ్యమయ్యే సంతృప్తి. అలాగే అవతలి వారి మంచి పనులను మనస్ఫూర్తిగా హర్షించడం. ఇవి మనలోని ఒత్తిడిని తగ్గించి రోగ నిరోధక శక్తిని కాపాడుతూ ఉంటాయి. ప్రకృతి అనండి లేదా భగవంతుడు అనండి, రోజుకి మనకి 86400 సెకెనులు ఇచ్చారు. అందులో కొన్ని సెకనులయినా అవతలి వారి పట్ల కృతజ్ఞత చూపడానికి ఉపయోగించగలుగుతున్నాను? అన్నది. మంచి ప్రశ్న. ఇక్కడ అవతలి వారిని బుట్టలో వేయడానికి ఉపయోగించే విద్యల గురించి అందుకు తోడ్పడే పొగడ్తల గురించి చెప్పడం లేదు. అశావాదం, అవతలి వారిని మెచ్చడం మన ఆరోగ్యం మీద చక్కని సానుకూల ప్రభావాన్ని చూపగల వని పరిశోధకులు చెబుతారు. ఆందోళనకు కూడా ఇదే విరుగుడు. నిజమే, మంచి పని చేసిన వారిని మనసు నిండా సంతోషంతో శ్లాఘించకపోతే ఎంత వెలితి? స్వాధ్యాయ బౌద్ధం నుంచి వచ్చిందంటారు. ఇది కూడా ఆందోళనకు విరుగుడే, అదే ధ్యానం.
వీరభద్రాసనం - 1
వీరభద్రాసనం - 1
జనరలైజ్డ్ యాంక్సయిటీ డిజార్డర్ ను, ఒత్తిడిని తగ్గించడంలో ఇది చక్కని పాత్ర పోషిస్తుంది. ఇక ప్రాణాయామం అనేది పూర్తిగా ఒత్తిడిని, ఆందోళనను నిరోధించేదే. ఆ విధంగా ఇది రోగ నిరోధక శక్తికి ప్రాణం పోస్తుంది. క్రమం తప్పని, శ్రద్ధతో చేసే ప్రాణాయామం భౌతిక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చక్కని అభ్యాసం వల్ల మన నాడీ మండలాన్ని రోగ నిరోధక శక్తితో, హర్మోన్ల విధానంతో అనుసంధానించే లక్షణం ఇందులో ఉంది. ఊపిరి మీద ఆదుపుతో లోలోపలి శక్తులను వెలికి తీయవచ్చు.
వీరభద్రాసనం
వీరభద్రాసనం - 2
యోగా శారీరక వ్యాయామానికి మించినది, యోగాతో జీవితాలు బాగుచేసుకున్న వారు ఇప్పుడు విశ్వమంతటా కనిపిస్తారు. ఎలాంటి ప్రతికూల ప్రభావాలు లేకుండా ఆరోగ్యాన్నీ, మానసిక స్వస్థతను యోగాభ్యాసం ఇవ్వగలుగుతుంది. కేవలం కరోనా ద్వారా కలుగుతున్న ఒత్తిడి నుంచి విముక్తి పొందడానికి కొన్ని ఆసనాలు చెబుతున్నారు. అందులో ఒకటి వీరభద్రాసనం. శరీరానికి చురుకును ఇచ్చి శరీరానికీ, మేధస్సుకీ మధ్య అనుబంధం పెంచే ఆసనమిది.
పర్వతాసనం
పర్వతాసనం
మరొకటి పర్వతాసనం. ఇది ఏకాగ్రతను పెంచుతుంది. కండరాల ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. అలాగే ఒత్తిడి నుంచి తప్పిస్తుంది. అయితే ఇవి గురుముఖంగా నేర్చుకోవడం అవసరం. అలగే సూర్య నమస్కారాలు. ఇవి మనిషి పరిపూర్ణతకు, సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

సంకలనం: జాగృతి

17, జులై 2020, శుక్రవారం

రోగనిరోధక శక్తి పెంచే సహజ ఆహారములు - Roganirodakam - Natural food that boosts immunity

రోగనిరోధక శక్తి పెంచే ఆహారములు

మనలో చాలామందికి మనం తీసుకునే ఆహారం మీద సరైన అవగాహన ఉండదు. సమయానికి ఏది పడితే అది తినేయడం ఆ తరువాత వ్యాధులను మన చేజేతులా మనమే కొనితెచ్చుకుంటున్నాం. మానవులకు రోగాలు రావడానికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారమే. అతిగా తినటం కూడా రోగకారణమే . ఆయుర్వేదం నందు ఒక సూక్తి ఉంది. " త్రికాల భోజనే మహారోగి , ద్వికాల భోజనే మహాభోగి , ఏకకాల భోజనే మహాయోగి " అని చెప్తారు . ఏది పడితే అది కడుపు నిండా తిని జబ్బులను కొనితెచ్చుకోవద్దు. మీరు తినే ఆహారం మీ ఉదరము నందు సగభాగం పట్టునట్టు తిని పావుభాగం నీటికొరకు , మిగిలిన పావుభాగం వాయుప్రసారానికి అనుగుణంగా వదలవలెను. మనం తీసుకునే ఆహారం తక్కువ మోతాదులో ఉన్నను మనశరీరానికి మంచి బలాన్ని , రోగనిరోధకశక్తి ఇచ్చే ఆహారం అయ్యి ఉండవలెను .

ఇప్పుడు మీకు శరీరము నందు రోగనిరోధక శక్తి మరియు బలాన్ని ఇచ్చే ఆహారాల గురించి వివరిస్తాను.

వరి,గోధుమ , ఇతర ధాన్యాలు

మన ప్రధాన ఆహారాలు ఐన వరి, గోధుమ వంటి ఆహారధాన్యాలు పైన పొట్టు తీయకుండా ( పాలిష్ ) తీసుకొనుచున్న ఇవి చాలా బలమైన ఆహారపదార్దాలు. పొట్టులో విటమిన్లు ఉంటాయి. పొట్టులో ఉండే ఒక ముఖ్యమైన విటమిన్ ధాన్యాన్ని పాక్షికంగా ఉడికించడం వల్ల ( ఉప్పుడు బియ్యం ) గింజలోపలి భాగానికి వెళ్తుంది . దంపిన బియ్యం , ఉప్పుడు బియ్యం పొట్టు తీసిన ( పాలిష్ ) బియ్యం కంటే చాలా మంచివి.

ఎండబెట్టిన మొక్కజొన్నలు

ఎండబెట్టిన మొక్కజొన్నలు వండే ముందు పలచటి సున్నపుతేటలో నానబెడితే వాటిలో ఉన్న " నియాసిన్ " అనే విటమిన్ , మాంసకృత్తుల్ని శరీరం బాగా ఉపయోగించుకోగలుగుతుంది.

రాగులు , సజ్జలు , చోళ్లు

వీటిలో ఖనిజ లవణాలు ఎక్కువుగా ఉంటాయి. ముఖ్యంగా క్యాల్షియం , ఇనుము ఎక్కువుగా ఉంటాయి. ఇవి వరి , గోధుమ కంటే చౌకైనవి , ఎక్కువ బలవర్థకమైన ఆహారాలు . వరి , గోధుమలకు బదులు వీటిని తీసుకోవచ్చు .

పప్పులు

ఏదో ఒక పప్పు కంటే అనేక పప్పుల మిశ్రమం మంచిది . ఒక్కో రకమైన పప్పులో ఒక్కో రకమైన మాంసకృత్తులు ఉంటాయి. పప్పుల మిశ్రమం శరీరానికి కావలసిన అన్నిరకాల మాంసకృత్తులను అందిస్తుంది.

చిక్కుళ్ళు , బటానీలు , సోయాబీన్స్

ఇవి చౌకగా దొరికే మాంసకృత్తులు . పొలాల్లో వీటిని పెంచడం వల్ల భూమిసారం పెరిగి తరువాత వేరే పంట వేస్తే బాగా పెరుగుతుంది . అందువల్ల పంటను మార్చుతూ ఉండాలి.

ఆకుకూరలు

ఎక్కువుగా పచ్చగా ఉన్న ఆకుకూరల్లో కొంచం మాంసకృత్తులు , కొంచం ఇనుము , విటమిన్ A ఎక్కువుగా ఉంటుంది. చిలగడదుంప , చిక్కుడు , బటాణీ , గుమ్మడికాయల ఆకులు చాలా బలవర్ధకమైనవి . వీటిని ఎండబెట్టి పొడిచేసి బిడ్డలకు అన్నంలో కలిపి పెట్టుచున్న మాంసకృత్తులు , విటమిన్లు లభిస్తాయి.

క్యాబేజి లాంటి లేతాకు పచ్చ ఆకుకూరలలో మాంసకృత్తులు , విటమిన్లు కూడా చాలా తక్కువ ఉంటాయి. మంచి పోషక విలువలు కలిగిన ఆహారం కాదు కాబట్టి పెద్దగా తీసుకోవలసిన అవసరం లేదు .

దుంపకూరల ఆకులు

ముల్లంగి , కర్రపెండలం మొదలైన మొక్కల్లో వాటి దుంపల కంటే ఆకులలో ఎక్కువ పోషకపదార్ధాలు ఉంటాయి. కర్రపెండలం ఆకుల్లో , దుంపల కంటే 7 రెట్లు అధికంగా మాంసకృత్తులు , విటమిన్లు ఉంటాయి. దుంపతో కలిపి తింటే ఇంకా ఎక్కువ బలం . లేత ఆకులు చాలా బలం ఇస్తాయి.

కాయగూరల్ని , బియ్యాన్ని , ఇతర పదార్ధాలని కొంచం నీటిలో ఉడకబెట్టాలి.  ఉడకబెట్టటానికి ముందు కాయగూరలను కోయవలెను . అతిగా ఉడకపెట్టకూడదు . అలా ఉడకపెట్టడం వలన కొంత విటమిన్లు , లవణాలు పోతాయి. ఉడకపెట్టాక మిగిలిన నీటిని పారబోయకూడదు . ఆ నీటిని తాగడమో లేక సూప్ లా చేసుకుని తాగిన చాలా మంచిది .

కాయగూరలని వండేప్పుడు కొంచం చింతపండు కలిపిన విటమిన్లు పోవు . ఎండి , వాడిపోయిన కూరగాయలకంటే తాజాగా ఉన్నవి ప్రశస్తమైనవి. బలమైనవి. అడవుల్లో దొరికే చాలా పండ్లలో విటమిన్ "C " సహజమైనది ఉండును. పంచదార కూడా అధికంగా ఉండును. విటమిన్ల కొరకు ఈ పండ్లను తీసుకోవచ్చు . తినడానికి ముందు అవి విషపూరితమైనవా ? కావా? అన్నది చూసుకోవడం ఉత్తమం.

ఇనప పాత్రలలో వండడం వలన లేదా చిక్కుళ్లు లాంటివి ఉడకపెట్టేప్పుడు పాత్రలో తుప్పుపట్టిన ఇనుప ముక్క వేసి ఉడకపెట్టిన ఆ ఆహారము నందు ఇనుము శాతం పెరిగి రక్తహీనత రాకుండా చూస్తుంది. బెల్లాన్ని ఇనుపపాత్రలో తయారుచేయడం వలన ఆ బెల్లము నందు ఇనుము శాతం ఎక్కువుగా ఉండును. పంచదారకు బదులు బెల్లం వాడటం ఆరోగ్యానికి చాలా మంచిది .

పైన చెప్పిన ఆహారాలు మాత్రమే కాకుండా , గుడ్లు , మాంసాహారం కూడా శరీరానికి బలం ఇచ్చును . ఇవి అలవాటు లేనివారు పప్పు , తాజా కూరగాయలు , పండ్లు తీసుకొని శరీరం నందు రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చు. ఎంత ఎక్కువ తింటున్నాం అన్నది కాదు , ఎంత బలమైన ఆహారం తీసుకుంటున్నాం అన్నది ముఖ్యం .

రచన/సంకలనం: కాళహస్తి వేంకటేశ్వరరావు, 9885030034 - అనువంశిక ఆయుర్వేద వైద్యులు

16, జులై 2020, గురువారం

పుదీనా - అద్భుత ఆయుర్వేద ఆరోగ్య ప్రయోజనాలు - Pudina, Mint - Amazing Ayurvedic Health Benefits

పుదీనా - అద్భుత ఆయుర్వేద ఆరోగ్య ప్రయోజనాలు - Pudina, Mint - Amazing Ayurvedic Health Benefits

పుదీనా గురించి సంపూర్ణ వివరణ - ఉపయోగాలు

ఆయుర్వేదం నందు పుదీనా కు ప్రత్యేక స్థానం ఉన్నది. 100 గ్రాముల పుదీనా ఆకు 56 క్యాలరీల శక్తిని ఇస్తుంది. ఇవే కాకుండా మరెన్నొ పోషకాలు ఉన్నాయి . వాటి గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను

100 గ్రాముల పుదీనా ఆకులో ఉండే పోషకాలు:
పిండిపదార్దాలు - 8 .40 గ్రా , ప్రొటీన్స్ - 5 .90 గ్రా , 0 .70 గ్రా ఫ్యాట్స్ , క్యాల్షియం - 440 మి.గ్రా , ఫాస్ఫరస్ - 70 మి.గ్రా , ఐరన్ - 19 .2 మి.గ్రా , విటమిన్లు - A , B1 , B2 , నియాసిన్ , ఆక్సాలిక్ ఆసిడ్ ఉన్నాయి.

పుదీనా ఆకు ఎక్కువుగా మాంసాహార వంటకాలలో వాడతారు . పచ్చడిగా మనవారు చాలాకాలం నుంచి ఉపయోగిస్తున్నారు. పుదీనా ఆకు నుంచి " పిప్పర్మెంట్ " నూనె తయారగును. దీనితో కూడా అనేక వైద్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నూనెని ఘనీభవింపచేసిన మనము కిళ్ళీలలో వాడే " పిప్పరమెంట్ " తయారగును. పిప్పర్మెంట్ నోట్లో వేసుకొనిన వేడిగా ఉండి బయట గాలి కొద్దిగా సోకగానే చల్లగా ఉన్నట్లు అనిపిస్తుంది.

పుదీనా ఆకుతో చికిత్సలు:

 • ➧ పుదీనా ఆకు రసములో 1 స్పూన్ నిమ్మరసం , కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ 3 సార్లు చొప్పున తీసుకొనుచున్న అజీర్తి , కడుపునొప్పి , పొట్ట ఉబ్బరం , పొట్టలో గ్యాస్ , విరేచనాలు , విరేచనములో నులిపురుగులు , రక్తహీనత సమస్యల నుండి విముక్తి లభించును.
 • ➧ పుదీనాకు కషాయం రోజుకి 2 లేక 3 పర్యాయాలు సేవిస్తున్న ఎక్కిళ్లు , దగ్గు , జలుబు , అజీర్తి తగ్గును.
 • ➧ బహిష్టులో నొప్పికి పుదీనాకు కషాయం బహిష్టుకు 3 నుంచి 4 రోజుల ముందుగా సేవించటం మొదలుపెట్టిన బహిష్టునొప్పి రాదు .
 • ➧ పుదీనాకు కషాయం నందు కొంచం ఉప్పు కలిపి గొంతులో పోసుకొని గార్గిలింగ్ ( గుడగుడ ) చేయుచున్న గొంతునొప్పి తగ్గును.
 • ➧ క్షయ , ఉబ్బసం , కొన్ని ఊపిరితిత్తుల వ్యాధులకు ఆయా మందులతో పాటు ఒకస్పూను పుదీనాకు రసములో 2 స్పూనుల వెనిగార్ , తేనె , కేరట్ రసము కలిపి రోజుకి 2 సార్లు సేవించిన మంచి టానిక్ లా పనిచేస్తుంది .
 • ➧ నోటి దుర్వాసన గలవారు ప్రతిరోజు పుదీనాకు కొంచం నములుతున్న దుర్వాసన నిర్మూలమగును . ఇంకా దంతాలు పుచ్చుట తగ్గిపోయి దంతాలు గట్టిపడును.
 • ➧ దంతాల నుండి చీముకారు సమస్య ఉన్నవారు పుదీనాకు నములుతున్న చీము కారుట తగ్గును. దంతాలు ఊడుట తగ్గును.
 • ➧ ప్రతిరోజూ నిద్రించుటకు ముందు పుదీనాకు ముఖమునకు రాసుకొనుచున్న ముఖంపైన మొటిమలు తగ్గిపోయి ముఖచర్మం మృదువుగా , అందముగా తయారగును.
 • ➧ గజ్జి , దురద వంటి చర్మవ్యాదులలో పుదీనాకు రసం పైపూతగా వాడుచున్న చర్మవ్యాధులు అంతరించును. నొప్పులు తగ్గును.
 • ➧ పిప్పరమెంట్ తైలములో కొద్దిగా పంచదారను కలిపి 2 నుంచి 3 చుక్కలు కడుపులోకి తీసుకొనుచున్న కడుపుబ్బరం , ఆహారం అరగకుండా ఉండటం , అజీర్తి తగ్గును.
 • ➧ కొబ్బరినూనెలో కొద్దిగా పిప్పరమెంట్ తైలం కలిపి కీళ్ళనొప్పులకు పైపూతగా రాయుచున్న గుణం కనిపించును.
 • ➧ గొంతునొప్పికి , గొంతులోని టాన్సిల్స్ కు పైపూతగా పిప్పరమెంట్ తైలాన్ని రాయుచున్న తగ్గును.
 • ➧ పిప్పరమెంట్ నూనెలో కొద్దిగా లవంగ నూనె కలిపి పుచ్చుపళ్ళలో పెడుతున్న నొప్పి తగ్గుటయే కాక క్రమక్రమంగా పుచ్చు అంతరించును.
 • ➧ నిమ్మరసములో కొద్దిగా పిప్పరమెంట్ తైలము కలిపి రాత్రిపూట ఒంటికి పట్టించుకుని పడుకున్న దోమలు దరిచేరవు .

పైన చెప్పిన యోగాలే కాకుండా విరేచనాలు , జిగటవిరేచనాలు యందు పనిచేయును . హృదయమునకు మంచిది . గర్భాశయ దోషాలను పోగొట్టి రుతుస్రావం సరిగ్గా అగునట్లు చేయును . బాలింతలకు వచ్చు జ్వరం నందు పుదీనాకుల రసం తీసి రెండు చెంచాలు చొప్పున తాగించుట మంచిది . జలుబు నందు పుదీనాకు ముద్దగా చేసి నుదురుకు పట్టించి జలుబు , తలనొప్పి తగ్గును.

గమనిక: 
పైనుదహరించిన ఆరోగ్య సూత్రాలు ప్రాథమిక అవగాహన కొరకేనని తెలియజేయడమైనది. పూర్తి వివరాలకు ఆయుర్వేద వైద్యులను సమర్దించగలరని మనవి..

రచన: కాళహస్తి వేంకటేశ్వరరావు, 9885030034 - అనువంశిక ఆయుర్వేద వైద్యులు.

13, జులై 2020, సోమవారం

సూర్యుడ్ని ఏ సమయాల్లో చూడరాదు? - Sūryuḍini ē ē samayāllō chudaarādu?

సూర్యుడ్ని ఏఏ సమయాల్లో చూడరాదు? - Sūryuḍini ē ē samayāllō chudaarādu?

సూర్యుడ్ని ఏఏ సమయాల్లో చూడరాదు?

 • ➧ ప్రభాతవేళ, సూర్యాస్తమయవేళ, మిట్టమధ్యాహ్న సమయమున రవిని సూటిగా చూడరాదు. 
 • ➧ అలాగే సూర్య మరియు చంద్రగ్రహణ సమయాల్లోనూ చూడరాదు. 
 • ➧ అట్టి సమయాల్లో సూర్యుని నుంచి వెలువడే కిరణాలు మానవశరీర నిర్మాణానికి కీడును కలిగిస్తాయి.
సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి

12, జులై 2020, ఆదివారం

ధృడమైన ఆరోగ్యకరమైన శరీరానికి "చద్దన్నం మూట" - Dhr̥uḍamaina ārōgyakaramaina śarīrāniki chaddannaṁ mūṭa

పెద్దల మాట చద్దన్నం మూట

పాతతరం పెద్దలు నేటి తరానికి ఏదైనా చెబితే ఆ... ఏముందిలే, పాత చింతకాయ పచ్చడి అని అంతా తీసిపారేస్తారు. వారు చెప్పే మాటలకు విలువనివ్వరు. కానీ నిజంగా పెద్దలు చెప్పే మాటలే కాదు, వారు తిన్న ఆహారం కూడా ఎంతో విలువైందే.

అమెరికన్ డైటెటిక్ అసోసియేషన్ వారు తేల్చి చెప్పింది కూడా ఇదే. ఇంతకీ వారు చెప్పింది దేని గురించో తెలుసా.. మజ్జిగ కలిపిన చద్దన్నం. రాత్రి మిగిలి పోయిన అన్నాన్ని పొద్దున్నే తినేందుకు ప్రస్తుత జనాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. రాత్రి అన్నం ఎంత ఉన్నా పొద్దున్నే పడేయడం కాని, ఎవరికైనా పెట్టడం కాని చేస్తూ ఉంటారు. అయితే ఆ చద్దన్నంలోనే ఎన్నో ఉపయోగకరమైన పదార్ధాలు ఉన్నాయి. చద్దన్నం తినడం వల్ల శరీరంలో చాలా మార్పులు వస్తాయని ఒక సర్వేలో తేలింది.

పాతతరం వారు చద్దన్నంను ఎంతో ఇష్టంగా తినేవారు. అందుకే వారి ఆరోగ్యం చాలా చక్కగా ఉండేది తాతల కాలంలో రాత్రి వండిన అన్నంను పొద్దున్నే పెరుగు కలుపుకుని, మామిడి కాయ చట్నీ వేసుకుని, పచ్చి మిర్చి, ఉల్లిగడ్డ నంజుకుని తినేవారు.

అన్నం పులవడం(ఒక రాత్రి ఉంచడం) వల్ల పెరిగే పోషకాలు ఎన్నో ఉన్నాయి. 
 • ➧ 50 గ్రాముల అన్నంను తీసుకుని రాత్రి పులియపెట్టినట్లయితే 1.6 మిల్లీ గ్రాములు ఉన్న ఐరన్ 35 మిల్లీ గ్రాములుగా పెరుగుతుంది. 
 • ➧ అలాగే పోటాషియం, కాల్సియంలు కూడా భారీ మొత్తంలో పెరుగుతాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
 • ➧ రాత్రి మిగిలిన అన్నంలో మజ్జిగ, ఉప్పు కలిపి కుండలో పెడితే ఉదయం అయ్యే సరికి ఆ అన్నం పులిసి మంచి పోషకాలతో రెడీ అవుతుంది. లేదంటే రాత్రి పూట అన్నం వండి అందులో కొన్ని పాలు పోసి తోడుకోవడం కోసం ఓ మజ్జిగ చుక్కను వేసినా ఉదయం లేచే సరికి మజ్జిగ, చద్దన్నం తయారుగా ఉంటుంది. 
 • ➧ దీన్ని పచ్చడితోనో, ఉల్లిపాయ, మిరపకాయలతోనో మనవాళ్లు ఉదయాన్నే తినేవారు. 
 • ➧ దీంతో వారు రోజంతా ఎంతో ఉత్తేజంగా, శక్తితో ఉండేవారు. అలా వారు అప్పటికీ, ఇప్పటికీ అదే శక్తితో ముందుకు సాగుతున్నారు.
అమెరికన్ డైటెటిక్ అసోసియేషన్ సంస్థ చేసిన పరిశోధన ప్రకారం సాధారణ అన్నం కన్నా పైన చెప్పిన విధంగా తయారైన చద్దన్నంలో ఐరన్, పొటాషియం, కాల్షియం. విటమిన్లు దాదాపుగా 20 రెట్లు ఎక్కువగా ఉంటాయని తెలిసింది.
 • ➧ చద్దన్నం తినడం వల్ల శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది.
 • ➧ పలు చర్మ వ్యాదుల నుండి చద్దన్నం కాపాడుతుందని, బీపిని కంట్రోల్లో ఉంచుతుందని తేలింది. పేగుల్లో ఉండే అనారోగ్య సమస్యలను సైతం ఈ చద్దన్నం తగ్గిస్తుంది.
అందుకే పెద్దల మాట చద్దన్నం మూట అనే మాట నేటికి వినిపిస్తోంది.

_జాగృతి

9, జులై 2020, గురువారం

మామిడి టెంక - అద్భుత ఆయుర్వేద ప్రయోజనాలు - Māmiḍi ṭeṅka - adbhuta āyurvēda prayōjanāluమామిడి టెంక - అద్భుత ఆయుర్వేద ప్రయోజనాలు - Māmiḍi ṭeṅka - adbhuta āyurvēda prayōjanālu

మామిడి టెంక - అద్భుత ఆయుర్వేద ప్రయోజనాలు

సాధారణంగా మనం మామిడి కాయ , పండు తినేసి, టెంకను పారేస్తాం.కానీ టెంక వల్ల చాలా వుపయోగాలు ఉన్నాయి.
 • 1. మామిడి టెంకను పొడి చేసుకొని ,జీలకర్ర, మెంతుల పొడితో సమనంగా కలిపి వండి,వేడీ వేడి అన్నం తో తింటే ఒంట్లో వేడి తగ్గుతుంది.
 • 2. ఉదరసంబంధ వ్యాధులకు మామిడి టెంక మంచి ఔషధం.
 • 3. మామిడి టెంక పొడి ని మజ్జిగలో కలిపి కాస్త వుప్పు చేర్చి తాగితే కడుపు ఉబ్బరం , జీర్ణ సంబంధ వ్యాధుల నుంచి వుపశమనం లభిస్తుంది.
 • 4. టెంక లొని గింజను చూర్నం చేసి రోజుకి 3 గ్మ్ చొప్పున తేనె తో కలిపి సేవిస్తే వుబ్బసం తగ్గుముఖం పడుతుంది.,దగ్గు సమసూలు తగ్గుతాయి.
 • 5. జీడిని పొడి చేసి ,మాడుకు పట్టిస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.
 • 6. టెంక లొని ఫ్యట్టీ యాసిడ్స్ ,మినరల్స్,విటమిన్స్, జుట్టుకు పొషననిస్తాయి.
 • 7. తెల్లబడే జుట్టుకు చెక్ పెట్టలంటే మామిడి టెంక పొడి లో కొబ్బరి,ఆలివ్,ఆవ నూనె లు కలిపి వెంట్రుకలకు పట్టించాలి.
 • 8. మామిడి టెంక పొడిలో వెన్న కలిపి ముఖానికి రాస్తే చర్మం మెరిసిపోతుంది.

గమనిక:
పై నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

2, జులై 2020, గురువారం

ఆయుర్వేద ఆరోగ్య ప్రదాయిని 'తానికాయ' - Āyurvēda ārōgya pradāyini Thānikāya


ఆయుర్వేద ఆరోగ్య ప్రదాయిని 'తానికాయ' - Āyurvēda ārōgya pradāyini Thānikāya

తానికాయ ఆయుర్వేద ఔషధాల తయారీలో అనేక విధాలుగా వాడబడుతుంది. దీని విదేశీ శాస్త్రీయ నామము -"తెర్మినలియా బెల్లిరికా".

ఔషధ గుణాలు:
కఫా వ్యాదులపై బాగా పనిచేస్తుంది, ఉప్పు తప్ప మిగిలిన ఇదు రుచులు కలిగి ఉంటుంది. వేడి చేస్తుంది. జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, మూత్ర మండలం దీని పరిదిలోనికి వస్తాయి. 

ఆరోగ్య ప్రదాయిని తానికాయ:
దీనిని అచ్చ తెలుగులో వాక కాయలుగానూ పిలుస్తుంటారు. తెర్మినలియా బెల్లిరికా విదేశీ శాస్త్రీయ నామం కలిగిన ఈ వృక్ష సంతతి ఆయుర్వేద వైద్యంలోనే కాదు వంటింటి చిట్కా వైద్యాలలోనూ తనదైన ఫలితాలను అందిస్తూ.... సామాన్యులకి చేరువగా ఉంటోంది. త్రిఫలములలో తానికాయ ఒకటి. త్రిదోషాలను హరించే శక్తి తానికాయకు ఉంది.

తీవ్రమైన వేడిని కలిగించే ఈ కాయలు మన రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో కనిపిస్తు న్నాయి. బాదం చెట్టును పోలి ఉండి అదే తరహా ఆకులతో ఆకుపచ్చ ఛాయ కలిగి, లేత పసుపు రంగు న్న పుష్పాలు, నక్షత్ర ఆకారపు చిన్నపాటి కంకులని కలిగి ఉంటుంది. చిన్న సైజులో ఆకుపచ్చ ద్రాక్షపళ్లను పోలి ఉండే ఈ తాని కాయలు గుండ్రంగా ఉండి.. కాస్త ఫలాలుగా మారాక ఉసిరి కాయ సైజులో మట్టిరంగులో కనిపిస్తాయి. ఉప్పు మినహా దాదాపు అన్ని రకాల రుచుల్ని కలిగి ఉన్న ఈ తాని కాయలు శ్వాస సంబంధిత వ్యాధులకు, జీర్ణ వ్యవస్ధలో వచ్చే రుగ్మతలను నివారించేందుకు ఉపయోగ పడుతుంది. 
తానికాయ - మూత్ర మండలం
తానికాయ - మూత్ర మండలం
ఇక మూత్ర మండలం శుభ్రపరిచేందుకు కూడా వీటిని ఆయుర్వేద వైద్యులు ఉపయోగిస్తారు. లివర్‌కి సంబంధించిన టానిక్‌ల తయారీలోనూ... అజీర్ణానికి చెందినమందుల తయారీలోనూ, దగ్గు, కఫం, క్షయ, ఆస్తమా, ఎలర్జీలను నివారణ కోసం తానికామ మంచి మందుగా వాడబడుతోంది. డయేరియా, డీసెంట్రీ, చిన్న పేగుల వాపు తదితర వ్యాధులు తగ్గటానికి, ఉదర వ్యాధులను శాంత పరిచేందుకు, కేశ సంపదని పెంపొందించేందుకు, జుట్టు నల్ల బడేందుకు, కంటి చూపుకు సంబంధించిన వ్యాధుల నివారణకు ఇది అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. 

తానికాయలలో వేడి చేసే గుణం మూల శంకలను నివారించేందుకు, అతిసారాన్ని అరికట్టేందుకు వాడబడుతోంది. ఇక త్రిఫల కషాయంగా దీన్ని తీసుకుంటే శూలాలను తగ్గించడమే కాకుండా మెదడు చురుకుగా పని చేసేందుకు ఉపయోగ పడుతుంది. తానికాయల కషాయానికి అశ్వగంధ చూర్ణాన్ని, బెల్లంతో కలిపి సేవిస్తే వాతం తగ్గుతుంది, దీనిలోని ఎలాజిక్‌ యాసిడ్‌, గ్లూకోజ్‌, సుగర్‌, మైనిటాల్‌, గ్లాక్టోజ్‌, ఫ్రక్టోజ్‌, రమ్‌నోస్‌, ఫాటియాసిడ్లు, గాలిక్‌ యాసిడ్‌, బెటాసిటోస్టిరాల్‌, తదితర వైద్యలక్షణాలు కలిగిన మందులు చాలా ఉన్నాయి. ఇక తాని కాయల గింజలు కూడా వైద్య పరంగా మంచి ఫలితాలను ఇస్తాయి. ఇందులో ఆక్సాలిస్‌ యాసిడ్లు, ప్రోటీన్‌లున్నాయి. తానికాయలని కాస్త కాల్చి చూర్ణంగా చేసుకొని, కాసింత సైంధవ లవణాన్ని కల్పి సేవిస్తే విరోచనాలు క్షణాలలో తగ్గిపోతాయి, అలాగే సర్పి అనే చర్మ వ్యాధితో బాధ పడేవారు తానికాయని అరగదీసి, ఆగంధాన్ని లేపనంగా పూస్తే ఉపసమనం దక్కుతుంది. తానికాయ చూర్ణాన్ని తేనెతో కల్సి తీసుకుంటే దగ్గు, ఉబ్బసం తదితరాలనుండి ఉపశమనం లభించడమే కాకుండా శ్వాస సంబంధిత ఇబ్బందులను, కఫదోషాలు తొలగిస్తుంది

తానికాయ తో కంటికి బలం:

 • 1. తానికాయ పెచ్చుల చూర్ణానికి సమానంగా చక్కెర కలిపి 1 స్పూను మోతాదులో ప్రతి రోజూ తీసుకుంటే కంటికి బలం చేకూరడంతో పాటు ,కంటి చూపు వ్రుద్ధి చెందుతుంది.
 • 2. 1 స్పూను తానికాయ చూర్ణానికి తగినంత తేనె కలిపి,చప్పరించి మింగుతూ ఉంటే బొంగురు గొంతు సమస్య పోవడంతో పాటు , గొంతు నొప్పి,దగ్గు తగ్గుతాయి.
 • 3. అర స్పూను గింజల పప్పును,రాత్రివేళ నిద్రకు ముందు నమిలి తింటే చక్కటి నిద్ర పడుతుంది.
 • 4. 10 గ్రాముల చూర్ణానికి రెట్టింపు తేనె కలిపి ,రోజుకు రెండు పూటలా సేవిస్తుంటే వుబ్బసం వ్యాధి త్వరగా తగ్గేందుకు తోడ్పడుతుంది.
 • 5. తాని గింజల పప్పును నూరి నిలువెల్లా పూసుకుంటే శరీరపు మంటలు తగ్గుతాయి.
 • 6. 3 గ్రాముల తానికాయల,7 గ్రాముల పాత బెల్లం కలిపి రోజూ రెండు పూటలా తీసుకుంటూ ఉంటే లైంగిక శక్తి పెరుగుతుంది.
 • 7. తానికాయ పెచ్చులు , అశ్వగంధ సమపాళ్ళలొ తీసుకుని చేసిన చూర్ణానికి సమానంగా పాత బెల్లం కలిపి సేవిస్తూ ఉంటే , వాతం వల్ల వచ్చే గుండె జబ్బులు తగ్గి పోతాయి.
ఆయుర్వేద ఉపయోగములు:
 • యాంటి హేల్మెంతిక్ (నులి పురుగులు నివారణకు), యంతిస్పమోదిక్, యాన్తి పైరేతిక్గా (శరీర వేడిని నిరోధి౦చుటకు) పనిచేస్తుంది, 
 • దగ్గు, క్షయ, ఆస్తమా, ఎలర్జీ లను నయం చేస్తుంది,
 • డయేరియా, డీసెంట్రీ, చిన్న ప్రేవుల వాపు తగ్గేందుకు వాడుతారు,
 • జీర్ణ కారి, లివర్ టానిక్, అజీర్ణం తగ్గిస్తుంది,
 • కంటి చూపు,కేశ సంపద కాపాడుతుంది,
 • జ్రుదయ వ్యాదుల్ని శాంత పరుస్తుంది,
 • కఫప్రకోపాన్ని కంట్రోల్ చేసి సంబందిత వ్యాదులను తగ్గిసుంది,
గమనిక:
పై నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

సంకలనం: కోటేశ్వర్

29, జూన్ 2020, సోమవారం

చలికాలంలో చర్మం పొడిబారడడం - ఆయుర్వేద పరిష్కారము - Skin Care on winter - Chalikālam


చలికాలంలో చర్మం పొడిబారడడం - ఆయుర్వేద పరిష్కారము - Skin Care on winter

చలికాలంలో చర్మం పొడిబారకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు


చలి నుంచి కాచుకోవడానికి స్వెట్టర్లు ధరించడమే కాకుండా చర్మం పొడి బారకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.
 • 1. గులాబి నీరు,తేనె సమానంగా తీసుకుని బాగా కలిపి ముఖం ,మెడకు రాసుకోవాలి.పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగివేయాలి.తేనె చర్మానికి తేమనందిస్తుంది.పొడి చర్మతత్వం ఉన్నవారు ఈ చిట్కాను రోజూ ప్రయత్నిస్తే చర్మం తాజాగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.
 • 2.పెదవులు పొడిబారి పగిలినట్లు అవూంటే తేనెలో కాస్త గ్లిజరిన్ కలిపి రాసుకోవాలి.ఇలా రోజులో రెండు ,మూడు సార్లు చేస్తుంటే పగుళ్ల సమస్య తగ్గి పెదవులు తాజాగా కనిపిస్తాయి.
 • 3. చర్మం పొడిబారినప్పుడు పాదాలు కూడా పగలడం కొందరిలో కనిపిస్తుంది.ఇలాంటివారు టేబుల్ స్పూన్ ఆలివ్ నూనెకు అరచెంచా నిమ్మ రసాన్ని కలిపి రాత్రుళ్లు పాదాలకు రాసుకుని సాక్సులు వేసుకోవాలి.ఇలా రోజూ చేస్తుంటే ఆ సమస్యలు తగ్గి కోమలంగా కనిపిస్తాయి.
 • 4.పెద్ద చెంచా వంతున నిమ్మ రసం,తేనె కలిపి ముఖానికీ,చేతులకూ రాసుకోవాలి.కాసేపయ్యాక కడిగెయ్యాలి.దీనివల్ల చర్మం బిగుతుగా మారడమే కాకుండా దురద,ఎలర్జీలాంటి సమస్యలు రావు.
 • 5. స్నానాకి ముందు కొబ్బరి లేదా ఆలివ్ నూనెను ఒంటికి పట్టించి గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మం పొడి బారదు.అలాగే చెంచా శనగ పిండికి చిటికెడు పసుపు,అరచెంచా పాలు లేదా పెరుగు కలిపి ముఖం ,మెడకు రాసుకుని బాగా మర్దన చేయాలి.ఆ తర్వాత స్నానం చేస్తే ముఖానికి తేమ అందుతుంది.
గమనిక:
పై నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

సంకలనం: కోటేశ్వర్

27, జూన్ 2020, శనివారం

మలబద్ధకం - ఆయుర్వేద చికిత్స - Malabad'dhakaṁ - ahāra,āyurvēda pariṣkārālu


మలబద్ధకం - అహార ,ఆయుర్వేద పరిష్కారాలు

ప్రస్తుత రోజుల్లో మలబద్ధకం చాలా మందికి ఒక సమస్యగా మారింది.దీనిని వెంటనే పరిష్కరించుకోకపోతే ఇది ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఐతే ఆహారంలో కొన్ని మార్పులు ,ఇంకా కొన్ని సులభమైన పద్ధతులు పాటిస్తే ఈ సమస్యను సులభంగా అధిగమించి చక్కటి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.
 • 1. ప్రతి రోజూ క్రమం తప్పకుండా 12 నుంచి 15 గ్లాసుల నీరు తాగాలి.పేగు వ్యవస్థలో కదలిక వస్తుంది.శరీరం డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది.
 • 2. రెండు ఖర్జూర పండ్లు గ్లాసుడు వేడి నీటిలో నానబెట్టి రాత్రి పడుకునే ముందు తినాలి.ఆ నీటిని చల్లార్చిన తర్వాత తాగొచ్చు.
 • 3. రాత్రి పడుకునే ముందు 5 నల్లని ఎండు ద్రాక్షలను 5-6 గంటలు నీటిలో నానబెట్టి ఉదయం పరగడుపున తినాలి.దీనిఒతో జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
 • 4. రెండు బొప్పాయి ముక్కలను గ్లాసుడు వేడి నీటిలో నానబెట్టి రాత్రి పడుకునే ముందు తినాలి.
 • 5. రెండు అంజీర పండ్లను గ్లాసుడు వేడి నీటిలో నానబెట్టి రాత్రి పడుకునే ముందు తినాలి.,
 • 6. 30 మి.లీ. అలోవెరా జ్యూస్ ను గ్లాసుడు నీటిలో కలుపుకుని రాత్రి పడుకునే ముందు తాగాలి.
 • 7. ఫైబర్ అధికంగా ఉండే పండ్లు,కూరగాయల జ్యూస్ లు వీటితో పాటు తీసుకోవాలి.
 • 8. ఈ సమస్య ఉన్నవారు చిప్స్,ఫాస్ట్ ఫుడ్ ,మాంసానికి దూరంగా ఉండాలి.
 • 9. ఖచ్చితంగా ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.బయటి ఆహారానికి దూరంగా ఉండాలి.సమయానికి భోజనం చేయాలి.
గమనిక:

పై నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

సంకలనం: కోటేశ్వర్

చర్మాన్ని రక్షించే విటమిన్-E లభించే పదార్థాలు - Carmānni rakṣin̄cē viṭamin E -విటమిన్ ఈ లభించే పదార్థాలు - పరిష్కరించే సమస్యలు.
 • 1. ఇది ప్రధానంగా బాదం,అవిశ గింజలు,పాలకూర,చిలగడ దుంప,పొద్దు తిరుగుడు గింజలు,ఆలివ్ నూనె వంటి వాటి నుంచి అధిక మోతాదులో లభిస్తుంది.నేరుగా దీనిని ఉపయోఇంచాలనుకుంటే మార్కెట్ లో ఈ నూనె దొరుకుతుంది,దానిని వాడుకోవచ్చు.
 • 2. కాలం ఏదైనా కొందరి చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది.విటమిన్ ఈ అందే పదార్థాలను రోజువారె ఆహారంలో తీసుకుంటే ఈ సమస్యను అధిగమించవచ్చు.రోజూ ఉదయాన్నే కాస్త విటమిన్ ఈ నూనెను తీసుకుని ముఖం,చేతులు,కాళ్ళకు రాసుకుంటే మంచిది.దీనివల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరిగి చర్మం నిగారింపుతో కనిపిస్తుంది.స్నానం చేసే ముందు కూడా దీనిని రాసుకోవచ్చు.ఐతే కొబ్బరి నూనె,లేదా ఆలివ్ నూనెతో కలిపి వాడుకోవచ్చు.ముఖ్యంగా కళ్ళ కింద నలుపుదనం,ముడతలు తగ్గుతాయి.ఇలా కనీసం వారానికి రెండు ,మూడు సార్లు రాసుకున్నా చాలు.
 • 3. విటమిన్ ఈ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. అతినీల లోహిత కిరణాలవల్ల దెబ్బ తిన్న చర్మానికి ఉపశమనం అందిస్తాయి.జుట్టు రాలడాన్ని అదుపులో ఉంచుతాయి.బలంగా,ఆరోగ్యంగానూ కనిపించేలా చేస్తాయి.శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతాయి.

సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి

ఆరు బయట ఆటలు, యోగాతో ఆరోగ్యం - Āru bayaṭa āṭalu, yōgātō ārōgyaṁరు బయటి ఆటలు, యోగా. దాని ద్వారా శారీరక. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యకరమైన ఆలోచనలు వస్తాయి. 

 అవును.. ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి చాలా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నాడు. తన జీవన ఉపాధికి  సమయం పోగా, మిగిలిన సమయాన్ని టీవీ ముందు, కంప్యూటర్ ముందో, చిట్ చాటింగ్ కో వాడుతున్నాడు.. కాస్త శారీరక శ్రమని కలిగించే ఆటలు గానీ, పనులని గానీ, యోగాసనాలు చెయ్యటానికి ప్రయత్నించడం లేదు.. 

నిజానికి మనిషి వయస్సు పెరుగుతున్నా కొలదీ తనలో వ్యాధి నిరోధకత లక్షణాలు తక్కువ అవుతూ ఉంటాయి. కండరాలు నెమ్మనెమ్మదిగా క్షీణతకి గురి అవుతూ ఉంటాయి. ఇలాంటి వారు త్వరగానే జబ్బులకి గురి అవుతుంటారు. ఆ జబ్బుల నుండి బయటపడటానికి మందులు వాడుతుంటారు. కొద్దిరోజుల తరవాత జబ్బులు ఆ మందులకు స్పందించడం మానేస్తాయి. ఇంకా వ్యాధులు ముదరడం మొదవుతుంది. ఫలితముగా మందుల గోళీలు పుట్నాల మాదిరిగా వేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు వేసుకున్నా ఫలితం అంతంత మాత్రమే. పైగా ఆర్ధిక భారం. ఇదంతా అవసరమా...? 

ఈరోజుల్లో కొందరు ఎంత సెన్సిటివ్ గా ఉంటున్నారూ అంటే - ఏసీ లేని ఇంట్లో - పగటి పూట కూడా స్వెటర్, మంకీ క్యాప్ లేకుండా ఉండటం లేదు.. ఇలా వృద్ధులు ఉంటే తప్పులేదు గానీ, యువకులు, యూత్ (30+) ఉంటున్నారు. వారిని చూస్తుంటే చాలా జాలేస్తున్నది. నిజానికి వీరికి ఆ అవసరం లేకుండా చెయ్యవచ్చును.

ప్రొద్దున్నే, లేదా సాయంకాలం సమయాల్లో - యోగా, వ్యాయామం చేస్తే లేదా ఆటలు ఆడితే శరీరానికి శారీరక శ్రమని కలిగించి, కాస్త క్రొవ్వు కరుగుతుంది, లోన కండరాల పటుత్వం పెరుగుతుంది. హార్ట్ బీటింగ్ బాగుంటుంది, శారీరక అందం బాగుంటుంది. 

వ్యాకర్ధ లక్షణాలు తక్కువ అవుతాయి. శరీరం మునుపటికన్నా మరింత క్రియాశీలముగా ఉంటుంది. శారీరకముగా బాగుంటాం.. మానసిక ఆరోగ్యమూ బాగుంటుంది. క్రొత్తగా ఏదో ఆరోగ్యాన్ని మన శరీరానికి అటాచ్ చేసుకున్నట్లుగా భావిస్తాం కూడా. ఇలా ఉన్నప్పుడు మనలో ఆరోగ్యకరమైన ఆలోచనలు మొదలవుతుంటాయి. ప్రొద్దున్నే లేవాలి. 

వ్యసనాల జోలికి వెళ్ళకూడదు.. ఆరోగ్యకరమైన పనులని చెయ్యాలి అని తీర్మానించుకుంటూ ఉంటాం.. ఇదంతా అందరికీ తెలుసు.. కానీ అంతగా చెయ్యటానికి ఇష్టపడం.. అదే సమయాన యే బార్ కో, రెస్టారంట్ కో వెళ్ళి వినోదిద్దాం అంటే చాలామంది లగెత్తుకొని వస్తారు. ఫలితముగా భవిష్యత్తులో వేలల్లో.. కాదు కాదు లక్షల్లో హాస్పిటల్స్ లలో కుమ్మరించాల్సి వస్తుంది. 

సంకలనం: కోటేశ్వర్

25, జూన్ 2020, గురువారం

ఇన్ ఫెక్షన్లతో పోరాడే సహజసిద్ధ ఆహారములు - Natural foods that fight in-fictions


ఇన్ ఫెక్షన్లతో పోరాడే సహజసిద్ధ ఆహార యాంటీ బయోటిక్స్

మనకు ఎన్నో రకాల అనారోగ్యాలు బ్యక్టీరియా,వైరస్ ఇన్ ఫెక్షన్ ల వల్ల కలుగుతాయి.వీటితో శరీరంలోరోగనిరోధక శక్తి తగ్గిపోయి పలు రకాల సమస్యలు ఎదుర్కొంటుంటాము.మనకు అందుబాటులోనే ఉండే పదార్థాలతో ఈ ఇన్ ఫెక్షన్ లను సమర్థంగా ఎదుర్కొనవచ్చు.
 • 1. క్రాన్ బెర్రీ జ్యూస్ ఇన్ ఫెక్షన్ లను సమర్థంగా తగ్గిస్తుంది.మూత్రాశయ , వెజైనల్ ఇన్ ఫెక్షన్ లు తగ్గుతాయి.తాజా జ్యూస్ తయారు చేసుకొని తీసుకోవాలి.రోజుకి రెండు , మూడు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.ఇది హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడుతుంది.ఇన్ ఫెక్షన్స్ తో బాధపడే గర్భిణీ స్త్రీలు కూడా తాగవచ్చు.
 • 2. టీ ట్రీ ఆయిల్ లో యాంటీ వైరల్ ,యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి.ఇవి బ్యాక్టీరియా,వైరస్లను సమర్థంగా నిర్మూలిస్తాయి.టీ ట్రీ ఆయిలో కలబంద గుజ్జును బాగా కలిపి చర్మం మీద రాస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి.
 • 3. కలబందలో యాంటీ ఇంఫమ్మేటరీ ,యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉన్నాయి.ఇన్ ఫెక్షన్ లను తగ్గించి,చర్మం పాడవకుండా చూసి,వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
 • 4. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ వైరల్,యాంటీ ఫంగల్ గుణాలు అధికంగా ఉండడం వల్ల ఇన్ ఫెక్షన్ లనుండి సమర్థంగా రక్షిస్తుంది.రోజూ ఏదో విధంగా 4 నుండి 6 వెల్లుల్లి రెబ్బలను తింటుంటే మంచి ఫలితం కనబడుతుంది.రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
 • 5. తేనెలో కూడా యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ వైరల్ గుణాలు అధికంగానే ఉన్నాయి.ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక స్పూన్ తేనెను కలిపి రోజూ తీసుకుంటే ఇన్ ఫెక్షన్ లను దూరం చేసుకోవచ్చు.తేనెను నేరుగా చర్మం పై రాసినా చర్మ సమస్యల నుండి రక్షణ పొందవచ్చు.తేనెవల్ల చెడు బ్యాక్టీరియా,చెడు వైరస్ లు శరీరంలోకి చేరకుండా ఉంటాయి.
 • 6. జీర్ణాశయం,శ్వాస సంబంధ ఇన్ ఫెక్షన్ లను అల్లం మెరుగ్గా తగ్గిస్తుంది.ఆయా సమస్యలు ఉన్నపుడు కొద్దిగా అల్లం రసం తాగితే ఫలితం ఉంటుంది.శరీరంలోని వేడిని ఇట్టే తగ్గిస్తుంది.రక్త సరఫరా మెరుగు పరుస్తుంది.శరీరంలోని చెడు బ్యాక్టీరియా నశిస్తుంది.
 • 7. బేకింగ్ సోడాలో యాంటీ బ్యాక్తీరియల్ గుణాలు బాగా కలవు.జీర్ణాశయం,పేగులు,శ్వాస సంబంధ ఇన్ ఫెక్షన్ లను బేకింగ్ సోడా తగ్గిస్తుంది.ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా కలుపుకుని తాగితే ఫలితం ఉంటుంది.
 • 8. సహజ్ సిద్ధమైన యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ వైరల్ గుణాలకు నిమ్మ రసం పెట్టింది పేరు.శ్వాస కోశ ఇన్ ఫెక్షన్ లను మెరుగ్గా నయం చేస్తుంది.చెడు వైరస్,బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది.విటమిన్ సి ఉండడం వల్ల ఇవి నశిస్తాయి.ఉబ్బసం / ఆస్త్మా వంటి వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది.కాలేయం శుభ్రపడుతుంది.
 • 9. రోజూ మనం వంటలో వాడే పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.యాంటీ వైరల్,యాంటీ ఫంగల్,యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ ఇంఫ్లమ్మేటరీ,యాంటీ ఆక్సిడెంట్ గుణాలకు పసుపు పెట్టింది పేరు.గాయాలపై పసుపు రాస్తే వెంటనే తగ్గిపోతాయి.యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉండడం వల్ల గాయం త్వరగా మానుతుంది.శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు పసుపును పాలలో కలిపి తీసుకోవాలి.జీర్ణాశయ సమస్యలు ఉంటే గోరువెచ్చని నీటితో కలిపి దీనిని తీసుకోవాలి.ఆయా సమస్యల నుండి సత్వరమే ఉపశమనం లభిస్తుంది.
 • 10. యాపిల్ సిడార్ వెనిగర్ లో యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ ఇన్ ఫెక్టివ్ గుణాలు అధికంగా ఉన్నాయి.శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియా ,వైరస్ లను ఇది నిర్మూలిస్తుంది.చర్మాన్ని రక్షిస్తుంది.జీర్త్ణాశయ ఇన్ ఫెక్షన్ లను పోగొడుతుంది.
సంకలనం: కోటేశ్వర్

పచ్చి మిరపకాయలు తింటే కలిగే లాభాలు - Benefits of eating green chilli


పచ్చి మిరపకాయలు తింటే కలిగే లాభాలు - Benefits of eating green chilli

పచ్చి మిరపకాయలు తింటే కలిగే లాభాలు.

చ్చి మిరప కాయలను మనం అనేక రకాలుగా ఆహరంలో వాడుకుంటుంటము.ఎండు కారం కు బదులుగా చాలా మంది కూరల్లో వేస్తారు.చక్కని రుచి వస్తుంది.కొందరు వీటిని అలాగే తినేస్తారు. కొందరు మజ్జొగలో కలుపుకుని తింటారు.రోజువారీ ఆహారంలో వీటిని తీసుకోవడం వల్ల మనకు అనేక లాభాలు ఉన్నాయి.
 • 1. విటమిన్ సి సమృద్ధిగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది.విటమిన్ బి6,ఏ,ఐరన్,కాపర్,పొటాషియం,నియాసిన్,ఫైబర్,ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
 • 2. వీటిని విత్తనాలతో సహా తింటే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేస్తుంది.ఆహారం సరిగా జీర్ణం అవుతుంది.ఉమ్మి ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల జీర్ణప్రక్రియ మెరుగవుతుంది.
 • 3. విత్తనాల్లో ఫైటోస్టెరాల్ అనే పదార్థం పుష్కలంగా ఉంటుంది.ఇది రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది.పేగుల నుండి కొలెస్టరాల్ రక్తంలోకి కలవకుండా చూస్తుంది.రక్తంలోని చెడు కొలెస్టరాల్ ను కరిగిస్తుంది.దీనితో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
 • 4. వీటిలో ఉండే క్యాప్సిసిన్ శరీర జీవ క్రియలను వేగవంతం చేస్తుంది.దీనితో క్యాలొరీలు అధికంగా ఖర్చవుతాయి.ఫలితంగా అధిక కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.అలాగే గుండె కొట్టుకునే వేగం సక్రమంగా ఉంటుంది.
 • 5. వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మ సమస్యలను పోగొడతాయి.
 • 6. దగ్గు , జలుబు , ఫ్లూ జ్వరం ఉన్నవారు పచ్చి మిరపను బాగా తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.ముక్కు దిబ్బడ ఉంటే ముక్కు ద్వారాలు క్లియర్ అవుతాయి గాలి బాగా పీల్చుకోవచ్చు.
గమనిక:
పై నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...