రాగి పాత్ర ఉపయోగాలు - Copper vessel Uses

0
రాగి పాత్ర ఉపయోగాలు - Copper vessel Uses
రాగి పాత్ర
: రాగి పాత్ర :
అందరిలో క్రమంగా ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. అనేక వ్యాధులకూ, ఆరోగ్య సమస్యలకు కారణం ఆధునిక జీవన శైలే అనే ఆలోచనతో... పాత పద్ధతులకు చాలామంది మళ్ళుతున్నారు. 
  • ఆహారంలో తృణ ధాన్యాలను, ఇతర పదార్థాలనూ భాగం చేసుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం రోజువారీ జీవనంలో భాగంగా మార్చుకుంటున్నారు.
  • అదే విధంగా వంటకూ, వడ్డనకూ, ఇతర అవసరాలకు వినియోగించే పాత్రల విషయంలోనూ మార్పులు చేసుకుంటున్నారు. 
  • ప్లాస్టిక్ సీసాల స్థానంలో రాగి గ్లాసులు , చెంబులు వచ్చి చేరుతున్నాయి . భోజనశాలలో కూడా రాగి పాత్రల్లో పదార్థాలను తెచ్చి , వడ్డించడం చాలా చోట్ల కనిపిస్తోంది.
శుభకార్యాల బహుమతుల్లో రాగి వస్తువులు చోటు చేసుకుంటున్నాయి . ఇంతకూ రాగి పాత్రల వినియోగం ఆరోగ్యానికి ఎంత వరకూ ప్రయోజనం ?
  • ఆయుర్వేదంలో రాగికి ఎంతో ప్రాధాన్యం ఉంది. రాగి వస్తువుల వాడకం కఫ , వాత , పిత్త సమస్యలను నివారిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది.
  • రాగికి గొప్ప విద్యుత్ వాహకత ఉంది . దీనిలో సూక్ష్మ జీవులను నివారించే లక్షణాలు ఉన్నాయనీ , రాగి పాత్రలో నీరు పోసి , రాత్రంతా ఉంచి , ఉదయాన్నే తాగితే ఎన్నో వ్యాధులు తలెత్తకుండా ఉంటాయనీ , గొంతు , నేత్ర , చర్మ సమస్యలు నయమవుతాయనీ నమ్మకం ఉంది.
  • నీటిని శుద్ధి చెయ్యడంలో రాగికి గొప్ప శక్తి ఉందనీ , థైరాయిడ్ , అజీర్తి నియంత్రణలో ఉంటాయనీ , కొలెస్ట్రాల్ , ఇన్ఫెక్షన్లు తగ్గుతాయనీ , పొట్టలోని మలినాలు తొలగిపోతాయనీ చెబుతుంది ఆయుర్వేదం . రాగిలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రభావం , నీటిని శుద్ధి లేదా స్టెరిలైజ్ చేసే సామర్థ్యం ఉన్నాయని కొన్ని అధ్యయనాలు కూడా వెల్లడించాయి.
  • రాగి పాత్రలో వేయకూడనివి రాగి ఒక లోహం అనే విషయం మరచిపోకూడదు . లోహాలను వేటి కోసం ఉపయోగించాలో , ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం ప్రధానం . పుల్లగా , ఉప్పగా ఉండే వస్తువులను ... అంటే ఆమ్ల తత్త్వం ఉన్న పదార్థాలను రాగి పాత్రల్లో వండినా , నిల్వ చేసినా వ్యతిరేక ప్రభావాలు కలుగుతాయి.
  • ముఖ్యంగా నిమ్మ , బత్తాయి , నారింజ , ఉసిరి లాంటి జ్యూన్లను రాగి గ్లాసుల్లో తాగడం , లేదా నిల్వ చేయడం మంచిది కాదు . అదే విధంగా రాగి పాత్రల్లో ఊరగాయలనూ , పుల్లటి పచ్చళ్ళనూ దాచకూడదు . అలాగే పాల పదార్థాల కోసం , పెరుగు తోడు వెయ్యడానికి రాగి పాత్రలను ఉపయోగించకపోవడం శ్రేయస్కరం.
  • ఒక లీటరు నీటిలో రెండు మిల్లీ గ్రాములకు మించి రాగి ఉండకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది . ఎంత ఎక్కువైనా రోజుకు పది మిల్లీ గ్రాములు దాటకూడదని పేర్కొంది .
  • ఆ ప్రకారం రాగి పాత్రలో నిల్వ చేసిన నీటిని రోజుకు మూడు కప్పుల కన్నా అంటే సుమారు ముప్పావు లీటరుకు మించి తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు . శరీరంలోకి ఎక్కువ రాగి వెళ్తే దీర్ఘకాలంలో దుష్ప్రభావాలు చూపించవచ్చని హెచ్చరిస్తున్నారు.
అలాగే ఎక్కువ కాలం రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని తాగితే వికారం , తల తిప్పడం , పొట్టలో నొప్పి లాంటివి తలెత్తే ప్రమాదం ఉంటుందనీ , పది గంటలకన్నా ఎక్కువ సేపు రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని తాగకపోవడమే ఉత్తమమనీ సూచిస్తున్నారు . పైగా , కాపర్ డెఫిషెన్సీ తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు . కనుక రాగి పాత్రల వినియోగం ఉపయోగకరమే.

కానీ ఏ పదార్థాలకు వీటిని వాడకూడదో , రాగి పాత్రల్లోని నీరు ఎంత మేరకు తాగాలో తెలుసుకుంటే దుష్ఫలితాలను నివారించుకోవచ్చు.

సంకలనం: సిద్దవటం నాగముని F

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top