నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

- ఆర్ఎస్ఎస్ -

ఆర్ఎస్ఎస్
ఆధ్యాత్మికం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆధ్యాత్మికం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, సెప్టెంబర్ 2020, గురువారం

హరిహర సుతనే ధర్మశాస్త్ర అయ్యప్ప - Harihara Sutane Dharmasastra Ayyappa

హరిహర సుతనే ధర్మశాస్త్ర అయ్యప్ప - Harihara Sutane Dharmasastra Ayyappa

ధర్మశాస్త్ర అయ్యప్ప

వర్ణనాతీతమైన దివ్యమైన ఙ్ఞానమంగళ విగ్రహం. హరిహరాత్మకమైన ఏక చైతన్యం, తత్వమసి, అహం బ్రహ్మాస్మి మొదలైన మహా వాక్యాల ద్వార ప్రతిపాదింపబడుతున్న అద్వైత తత్వానికి సాకారం. ధ్యానిస్తే చాలు సమస్త తత్వసారమూ సాక్షాత్కారమవుతుంది. అయ్యప్ప మహిమ జగద్విదితం. స్వామి లీలలు స్కాందాది (శివరహస్య ఖండాంతర్గత) పురాణగాధల్లో వర్ణించబడ్డాయి.

హరిహరాత్మకం:

నారాయణుడు, శివుడు వేరు తత్వతః ఒక్కరే అని వేద, పురాణాలు సుస్పష్టంగా వక్కాణిస్తున్నయి.

యోహం సత్వం జగచ్చేదం

స దేవాసురమానుషం

అవిద్యా మోహితాత్మానః

పురుషా భిన్నదర్శినః

"శంకరా, నేను దేవాసుర మనుషాది సహితమైన ఈ జగత్తు నీ స్వరూపమే. అవిద్యామోహితులు భిన్నభిన్నంగా భావిస్తారు" అని విష్ణుపురాణంలో విష్ణువచనం,

అహం త్వం సర్వగోదేవ

త్వమేవాహం జనార్దన

ఆవయోరంతరం నాస్తి

శబ్దై రర్ధై ర్జగత్త్రైయే

"నేను సర్వగతుడవైన నీవే. నీవే నేను. శబ్దాలచే గాని, అర్ధాలచే గాని మన ఉభయులకు భేదం లేదు" అని హరివంశంలో శంకరుడు విష్ణువుతో అన్నమాటలు. ఈ అభేద ప్రతిపత్తి అయ్యప్ప రూపంలో రూఢి అవుతోంది. హరి, మోహిని రూపం ధరించగా, హరుడు మోహించాడని కథ. నారీవేషం ధరించిన విష్ణువు సాక్సాత్తు పరాశక్తి. "పుం రూపా విష్ణువిగ్రహా" అని లలితోపాఖ్యానం చెప్తోంది.

 • "లలితాదేవి ధరించిన పురుష రూపమే విష్ణువు" ఇద్దరిలో ఒకే లక్షణం ఉంది, అందుకే ఆమె వైష్ణవి. పద్మనాభ సహోదరి (విష్ణు సోదరి). ఏకలక్షణం చేత వారు సోదర స్థానీయులు.
 • ఉమాదేవి స్వయంగా విష్ణువు. ఇదే విషయాన్ని " శివానందలహరి"లో "బాణత్వ్"శంకరా, ఆ విష్ణువు నీకు భార్యగా అర్ధ భాగాన్ని స్వీకరించాడు" అని అన్నారు శంకర భగవత్పాదులు.

శివుడు అగ్ని తత్వం కాగా, నారాయణుడు జల తత్వం. ఈ విశ్వమంతా అగ్నిసోమాత్మకం(జలం). స్త్రీవాచకంగా చెప్పినప్పుడు సోమం-ఉమాదేవి. పురుష వాచకంగా - విష్ణువు.అగ్నిసోమంగా విశ్వవ్యాప్తమైన చైతన్యం పరమాత్మ. ఆ ఏకత్వ ప్రతిపాదకమైన పరమాత్మ శివ నారాయణాత్మక జ్యోతిస్వరూపంగా దర్శించారు. అదే అయ్యప్పమూర్తి.

అన్ని యోగ రహస్యాలు స్వామి మూర్తిలోనూ, తత్సన్నిధి కోసం జీవుడు చేసే యాత్రలోనూ ప్రస్ఫొటమవుతుంటాయి. 18 పరిపూర్ణతను సాదించిన ఙ్ఞానికి సంకేతం. ఆ ఙ్ఞాన సాధనే 18 మెట్లు ఎక్కడం.

అయ్యప్పకు మరో పేరు 'ధర్మశాస్తా. 'శాస్తా అంటే గురువు అని అర్ధం. ఆదిశంకరులు 'శాస్తారం ప్రణమామ్యహం' అంటూ ఆ స్వామిని స్తుతించారు. " ఇది ధర్మం, ఇది యోగం" అని శాసించి ఆచరింపచేసేవాడు కనుకనే గురువును "శాస్త" అన్నారు.

స్వామి 'చిన్ముద్ర ధరించి ఉంటారు. అంటే "బొటనవేలు చూపుడు వేలు కలిపి" ఉంచే ముద్ర. మనం దక్షిణామూర్తి లో ఈ ముద్రను దర్శించవచ్చు. అయ్యప్ప కూడ చిన్ముద్ర ధారి. మండలం పాటు దీక్ష గా ఉండి స్వామిని దర్శించాలన్నారు. దీక్షతో వెళ్ళిన వారికే "యాత్రా ఫలం" లభిస్తుంది.

40 రోజులనేది చాలా శాస్త్రీయమైన సంఖ్య. మన శరీరమానసిక చైతన్య వ్యవస్థగా రూపుదిద్దుకోడానికి 40రోజులు పడుతుంది. { ఆయుర్వేదంలో కూడ ఒక మందు మండలం రోజులు వాడితే కాని ఫలితం ఉండదు అంటారు } అందుకే మండలదీక్ష నిర్ణయించారు.

అయ్య, అప్ప - అనే దేశీయమైన పదాలు "ఆర్యా""పితా" అనే ఆర్ష శబ్దాల రూపాలే. గురువే ఆర్యుడు. ఆయనే పరమాత్మ. ఉపాసకుల కోసం ఒకే పరతత్వం వివిధ రూపాలుగా దర్శనమిస్తుంది. అలా ధరించిన యోగ ఙ్ఞానమయ మంగళమూర్తి - ధర్మశాస్త.

"స్వామియే శరణం అయ్యప్ప" అనే మాట పరమ మంత్రమై సాధకులకు సిద్ధిని ప్రసాదిస్తోంది.

" హరిహర సుతన్, ఆనంద చిత్తన్, అయ్యన్, అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్పా......"

 

ఆధారం : షణ్ముఖశర్మగారి ప్రవచనం

27, ఆగస్టు 2020, గురువారం

గుణాలు వాటి స్వభావాలు - Gunalu Vaati Swabhavalu

గుణాలు వాటి స్వభావాలు - Gunalu Vaati Swabhavalu

గుణాలు వాటి స్వభావాలు

భగవద్గీతలో శ్రీ కృష్ణుడు గుణాల గురించి చాల బాగ వివరణ ఇచ్చాడు. అదియే “గుణత్రయవిభాగ యోగము”

ఆత్మ నాశన రహితమైనది. కాని ప్రకృతివల్ల ఉద్భవించిన సత్వ రజస్ తమో గుణములు జీవాత్మను శరీరమున బంధించును. అనుచు శ్రీకృష్ణుడు ఈ మూడు గుణముల స్వభావమును, ప్రభావమును వివరించెను. అందరిలోను ఉన్న సత్వరజస్తమో గుణాల ప్రభావం వలన జీవులు భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి. ఈ త్రిగుణాలు ప్రకృతితోపాటు ఉద్భవించి క్షేత్రజ్ఞుడిని క్షేత్రంలో బంధించి ఉంచుతాయి. బ్రహ్మాండమంతా భగవంతుని కారణంగానే సృజింపబడుతుంది.

త్రివిధాభవతిశ్రద్ధా, దేహినాంసాస్వభావజా
సాత్వికీరాజసీచైనా, తమసీచేతితాంశృణు ||   (భగవద్గీత)
జీవులకు గల శ్రద్ద, పుర్వజన్మ వాసనా బలము వలన లభ్యము. అది రాజసము, సాత్వికము, తామసములని మూడు విధములుగా వున్నది.

తత్రసత్త్వంనిర్మలత్వా, ప్రకాశకమనామయమ్ |
సుఖసజ్గేనబద్నాతి, జ్ఞానసజ్గేనచానషు ||   (భగవద్గీత)
అర్జునా! త్రిగునములలో సత్వగుణము నిర్మలమగుటంచేసి, సుఖ జ్ఞానభిలాషల చేత, ఆత్మను దేహమునందు బంధించు చున్నది. 
సత్వగుణం నిర్మలమైనది, ప్రకాశింపజేయునది, జీవునికి సుఖంపట్ల మరియు జ్ఞానం పట్ల ఆసక్తిని పెంచి జీవుని బంధిస్తుంది.

రజోరాగ్మాతకంవిద్ధి, తృష్ణాసజ్జిసముద్భవమ్ |
తన్నిభధ్గ్నాతికౌన్తేయ, కర్మసజ్గేనదేహినమ్ ||   (భగవద్గీత)
ఓ కౌన్తేయ ! రజోగుణము కోరికలయందు అభిమానము అనురాగము పుట్టించి, ఆత్మను బంధించుచున్నది.
రజోగుణం ఇంద్రియ విషయాలపై అనురక్తిని, తృష్ణను కలుగజేసి జీవుని నిరంతర కార్య కలాపాలలో బంధించి ఉంచుతుంది.

తమస్త్వజ్ఞానజంవిద్ధి, మోహనంసర్వదేహినామ్
ప్రమాదలస్యనిద్రభి: తన్నిభాద్నాతిభారతా ||    (భగవద్గీత)
అర్జునా ! అజ్ఞానము వలన బుట్టునది తమోగుణము, అది సర్వప్రాణులును మొహింపజేయునది .ఆ గుణము, మనుజుచి ఆలస్యముతోను, అజాగ్రత్తతోను, నిద్రతోను బద్దునిజేయును. 
తమోగుణం అజ్ఞానం వలన కలుగుతుంది. భ్రమ, అజాగ్రత్త, నిద్ర, సోమరితనం వంటి వాటిలో జీవుని బంధిస్తుంది.
సత్వ గుణం వలన జ్ఞానము, రజోగుణం వలన లోభము, తమోగుణం వలన మూఢత్వము కలుగుతాయి.

మనవమనాయో: తుల్యస్తుతుల్య:మిత్రారిపక్షయో:
సర్వారంభపరిత్యాగీ, గుణాతీతస్స ఉచ్యతే ||    (భగవద్గీత)
మానవమానములయందు, శత్రుమిత్రులయందు సమమైన మనస్సు గలవానిని త్రిగుణాతీతుడందురు.

తేజక్షమద్రుతిశ్సౌచం, అద్రోహూనాతిమానితా
భవన్తిసంపదందైవీం, అభిజాతస్యభారతా ||
డమ్బోదర్పోభిమానశ్చ, క్రోధ:పారుష్యమేవచా
అజ్ఞానంచాభిజతస్యా, పార్థా! సంపదమాసురీమ్ ||   (భగవద్గీత)
పార్థా ! సహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరుల వంచింప కుండుట, కావరము లేకయుండుట మొదలగు గుణములు  దైవాంశ సంభూతులకుండును. అట్లే డంభము, గర్వము, అభిమానము, క్రోదము, కఠీనపు మాటలాడుట, అవివేకము మొదలగు గుణములు రాక్షసాంశమున బుట్టిన వారికుండును .

త్రివిధంనరకస్యేదం, ద్వారంనాశనమాత్మన:
కామ:క్రోధస్థథాలోభ;, తస్మాదేత్త్రయంత్యజేత్ ||   (భగవద్గీత)
కామ, క్రోధ,లోభములు ఆత్మను నాశనము చేయును. అవి నరక ప్రాప్తికి హేఅతువులు కావున, వాటిని వదలి వేయవలెను.

యజన్తేసాత్వికాచేవాన్, యక్షరక్షాంసీరాజసా:
ప్రేతాన్భూతగణంశ్చాన్న్యే , యజన్తేతామసాజనా: ||    (భగవద్గీత)
సత్వగుణులు దేవతలను, రజోగుణులు యక్షరాక్షసులును, తమోగుణులు భూతప్రేతగణంబులను శ్రద్ధాభక్తులతో పూజించు చుందురు.

దేనినీ ద్వేషింపకుండా, కాంక్షించకుండా, సమత్వంతో నిర్మ మనస్కుడైనవాడు అమృతత్వాన్ని పొందుతాడు. భగవంతుని అచంచల భక్తి విశ్వాసాలతో ఆరాధించేవాడు గుణాతీతుడై బ్రహ్మ పదాన్ని పొందడానికి అర్హుడౌతాడు.
న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వ పునః |

సత్త్వం ప్రకృతిజైర్ముక్తం యదేభి: స్యాత్త్రిభిర్గునై: ||              (భగవద్గీత 18:40)

భూమి, ఆకాశం, దేవతలు, లేక ఏ ఇతర లోకలలోనైన  ప్రకృతి నుండి ఉత్పన్నమైన మూడు గుణాలు లేకుండా ఏ ప్రాణి వుండదు.

సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసంభవాః |

నిబద్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయమ్ ||                                     (భగవద్గీత 14:15)

ప్రకృతిలో సత్వరజస్తమో గుణాలు వున్నవి. ఇవి శాశ్వతమైన జీవుని శరీరంలో బందిస్తున్నవి.

శరీరంలోని పురుషుడు(ఆత్మ) ప్రకృతి లోని ఘటనల వలన సుఖదుఃఖాలను అనుభవించినపుడు పరిస్థితుల ఆధారంగా శరీర తత్వంలోని సత్వ, రజ, తమో గుణాల ప్రభావముల ననుసరించి స్పందించి పనులు చేయుటకు నిశ్చయించుకొనును. ఆ విధంగా త్రిగుణాలు జీవునిని శరీరములలో బంధిస్తున్నాయి .

సత్త్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత |

జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత ||                    (భగవద్గీత 14:9)

సత్వ గుణము సుఖములందు, రజోగుణము పనులలోను, తమో గుణము జ్ఞానాన్ని కప్పివేసి ప్రమాదాలలో బందించును.

రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత |

రజఃసత్త్వం తమశ్చైవ తమః సత్వం రాజస్తథా ||                                 (భగవద్గీత 14:1౦)

రాజస్తమోగుణాలను అణచి సత్వ గుణము వృద్దిచెందును. అదేవిదంగా సత్వతమోగుణాలను అణచి రజోగుణము, సత్వరజోగుణాలను అణచి తమో గుణము వృద్ది చెందును.శరీర, పరిసర పరిస్థితులను అనుసరించి త్రిగుణాలలో ఎదో ఒక గుణము వృద్ది చెందును.

సర్వద్వారేషు దేహే స్మిన్ ప్రకాశ ఉపజాయతే |

జ్ఞానం యద తద విద్యత్ వివృదం సత్వమిత్యుత్ ||                             (భగవద్గీత 14:11)

ఎప్పుడు మనషి చేసే పనులన్నీ జ్ఞానంతో తెజోవంతమై వుంటావో అప్పుడు సత్వ గుణము వృద్దినొంది ఉన్నట్లుగా తెలుసుకొమ్మని చెప్పబడింది.

లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమః స్పృహా |

రజస్యేతాని జాయంతే వివ్రుద్దే భరతర్షభ ||                                        (భగవద్గీత 14:1౩)

రజోగుణము అధికమైనపుడు లోభము, అణచలేని కోరిక, పనుల ప్రయత్నము, క్రియాశీలత్వము వృద్దినొందును.

అప్రకాశో ప్రవ్రుత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ |

తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన ||                                   (భగవద్గీత 14:1౩)

తమో గుణము వృద్దినొందగా నిస్తేజం, సోమరితనం, బుద్దిహీనత, మోహం వ్యక్తములగును.

సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ |

ప్రమాదమౌహో తమసో భవతో జ్ఞానమేవ చ ||                                 (భగవద్గీత 14:17)

సత్వ గుణమునుండి జ్ఞానము పెంపొందును.రజో గుణము నుండి లోభము, తమో గుణం నుండి బుద్దిహీనత, మోహము, అజ్ఞానము తప్పక ఉత్పన్నమగును.

ఆయు:సత్త్వబలారోగ్యసుఖప్రీతివివర్ధనః |

రస్యాః స్నిగ్దాః స్థ్హిరా హ్రుద్యాః ఆహారాః సాత్త్వికప్రియాః ||                                   (భగవద్గీత 17:18)     

ఆయువు, బుద్ది, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతిని వృద్దిపరుచునట్టి రసవంతరములు, పుస్టికారము, దృఢము, మనః ప్రీతిని కలిగించు ఆహారములు సత్వగుణమదికముగా ఉన్నవారికి ఇష్టమైనవి.

కత్వమ్లలవ ణాత్యుష్ణతీక్ష్న్ రూక్షవిదాహినః |

ఆహారా రాజసస్యేష్ట దుఃఖశోకామయప్రదాః ||                                     (భగవద్గీత 17:9)

చేదు, పులుపు, ఉప్పు, కారం రుచులు మిక్కిలి వేడిగా వున్నట్టివి, ఎండినవి, మంట కలిగించునట్టి ఆహారములు రజోగుణము ఎక్కువగా ఉన్నవారికి ఇష్టము. అవి దుఃఖము, చింత, రోగములు కలిగించును.

యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ |
ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్ ||   (భగవద్గీత 18:20)
తినడానికి బాగా ముందు వండినవి, రుచిలేనివి, చెడు వాసన కలిగి కుల్లినట్టివి, వేరొకరు తిని వదిలినవి, నిషిద్ధ పదార్థాలు తమో గుణం ఎక్కువగా ఉన్నవారికి ఇష్టం.   

సర్వభూతేషు యేనైకం భావమవ్యయమీక్షతే |
అవిభక్తం విభక్తేషు తద్ జ్ఞానం విద్ధి సాత్వికమ్ ||  (భగవద్గీత 18:20)
విభజింపబడిన సర్వప్రాణుల యందు అవిభక్తమైన నాశనము లేని ఒకే భావాన్ని (పరమాత్మ) ఏ జ్ఞానముతో చూచునో ఆ జ్ఞానము సాత్విక జ్ఞానమని తెలుసుకో.

ప్రుథక్వేన తు యద్ జ్ఞానం నానాభావాన్ ప్రుధగ్విధాన్ |
వేత్తి సర్వేషు భూతేషు తద్ జ్ఞానం విద్ధి రాజసమ్ ||   (భగవద్గీత 18:21)
ఏ జ్ఞానము వలన విభిన్న శరీరములలోనున్న భావాన్ని విభిన్న ప్రాణులుగా తెలుసుకొనునో ఆ జ్ఞానము రజోగుణ సంబంధమైనదని తెలుసుకో.       

యత్తు క్రుత్స్న్ వదేకస్మిన్ కార్యే సక్తమహైతుకమ్ |
అతత్న్వ ర్దవదల్పం చ తత్తామసముదాహృతమ్ ||   (భగవద్గీత 18:22)
కారణం లేకుండా తత్వార్ధరహితంగా అల్పమైన ఒక పనిలో అదే సర్వస్వమైనట్లు ఆసక్తితో ఏ జ్ఞానము వలన ఉండునో అది తమో గుణ సంబందమైనదిగా చెప్పబడింది.

ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయభయే |
బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి: సా పార్దా సాత్వికీ ||    (భగవద్గీత 18:౩౦)
చేయవలసినది, చేయరనిది, చేయుట, చేయలేకపోవుట, భయము, నిర్భయము, బంధ మోక్షాన్ని తెలుసుకొనేది సాత్విక బుద్ధి.

యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ |
ఆయథావత్ ప్రజానాతి బుద్ధి: సా పార్త రాజసీ ||   (భగవద్గీత 18:31)
ధర్మాధర్మాలను , చేయదగినది, చేయవలసినదానిని సరిగా తెలుసుకోలేని బుద్దిని రాజస బుద్ది అందురు.

అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా |
సర్వార్థాన్ విపరీతంశ్చ బుద్ధి: సా పార్ధ తామసీ ||   (భగవద్గీత 18:32)
భ్రాంతిచే కప్పబడి అధర్మాన్ని ధర్మంగాను , అన్ని విషయాలను తప్పు అనే విదంగా భావించేది తామస బుద్ధి .

ధృత్యా యయా ధారయతే మనఃప్రాణే0దరియ క్రియాః |
యోగేనావ్యభిచారిణ్యా ధృతి: సా పార్ధ సాత్వికీ ||   (భగవద్గీత 18:34)
అంతరాయము లేని యోగాభ్యసముచే మనస్సు, ప్రాణము, ఇంద్రియముల పనులను నియంత్రించు నిశ్చయమును సాత్విక ధృతి అందురు.  

యయా తు ధర్మాకామార్థన్ ధృత్యా ధారయతేర్జున |
ప్రసంగేన ఫలాకాంక్షి ధృతి: సా పార్ధ రాజసీ ||   (భగవద్గీత 18:34)
కానీ ఏ నిశ్చయముతో ధర్మార్ధకామ విసయాలలో ఫలాపేక్ష కలిగివుండునో ఆ నిశ్చయమును రాజస ధృతి అందురు.

యయా స్వప్నం భయం శోకం విషాదం మదనేఅవ చ |
నా విముంచతి దుర్మేధా ధృతి: సా పార్ధ తామసీ ||    (భగవద్గీత 18:35)
కలలతో కూడిన నిద్ర, భయము, దుఃఖము, మదము, చింతనలు వదలని చెడు బుద్ధి కలవని నిశ్చయమును తామస ధృతి అందురు.

సుఖం త్విదానీం త్రివిధం శృణు మెఅ భరతర్షభ |
అభ్యాసాద్రమతే యత్ర దుఃఖా౦తమ్ చ నిగచ్ఛతి ||    (భగవద్గీత 18:36)

యత్తదగ్రే విషమివ పరిణామేమ్రతోపమమ్|
తత్సుఖం సాత్వికం ప్రోక్తమ్ ఆత్మబుద్ధిప్రసాదాజమ్ ||   (భగవద్గీత 18:37)
ఇక మూడు విధములగు సుఖములను వినుము. వానిలో అనుభవించుట, దుఃఖా౦తము (మోక్ష మార్గం) పొందుట కూడా జరుగును. ఆరంబమున విసయములేనున్నాను చివరలో బుద్దినుండి పుట్టిన ఆత్మ జ్ఞానము వలన కలిగిన అమ్రుతముతో సమానమైనదట్టిది సాత్విక సుఖ మనబడును.

విషయే౦ద్రియసంయోగాత్ యత్తదగ్రేమ్రతోపమామ్|
పరిణామే విషమివ తత్శుఖం రాజసం స్మ్రుతమ్ ||    (భగవద్గీత 18:38)
ఇంద్రియార్ధములు ఇంద్రియములతో కలియుట వలన కలుగు సుఖము మొదట అమ్రుతముతో సమానముగను చివర విషమువలెను ఉండును. అట్టి సుఖము రజోగుణముతో కూడినదని భావింపబడును .

యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః |
నిద్రాలస్యప్రమాదోత్తం తత్తామసముదాహృతమ్ ||   (భగవద్గీత 18:39)
నిద్ర, సోమరితనము, మోహముల వలన కలిగి మొదటినుంచి చివరి వరకు ఆత్మను అదే సుఖమనిపించే భ్రాంతిలో ఉంచేది తామస సుఖం .


బుద్ధి: జ్ఞానమాసమ్మోహః క్షమా సత్యం దమః శమః |
సుఖం దు:ఖం భావో భయం చాభయమేవ చ ||    (భగవద్గీత 10:4)

అహింసా సమతా తుస్టి: తపో దానం యశో యశ : |
భవంతి భావ భూతానం మత్త ఏవ పృథగ్విధా: ||   (భగవద్గీత 10:5)
బుద్ధి, జ్ఞానము, భ్రాంతి లేకుండుట, క్షమా గుణము, సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, సుఖము, దుఃఖoము, పుట్టుక, మరణము, భయము, నిర్భయము, అహింస, సమభావము, తృప్తి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి, మున్నగు వివిధ భావములు జీవులకు నానుండియే  కలుగుతున్నవి.

సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి 

20, ఆగస్టు 2020, గురువారం

జీవాత్మ - Jivatma

జీవాత్మ - Jivatma

- జీవాత్మ -
ఓం నమో పరమాత్మయే నమః
జీవాత్మ:
పరమాత్మ మరియు ఆత్మ అంటే వివరించాను. ఆత్మ (పరమాత్మ) అంటే శాశ్వతమైనది, నిత్యమైనది.

జీవాత్మ అంటే మనిషి పుట్టిన తరువాత శరీరము చేసే కర్మలను అజ్ఞానముతో మరియు అవిద్యతో తనే చేస్తున్నాడు అనుకోని  బందము ఏర్పరచుకొని తన స్వస్వరూపమైన ఆత్మకు బంది అవుతున్నాడు.

అంటే శరీరము చేసే పనులు కర్మానుసారంగా జరుగుతూ వుంటాయి . కానీ మనము వాటిని(కర్మలను) అజ్ఞానముతో, వాటి ఫలితాలను ఆశించి మరల మరల బంధాలను ప్రోగు చేసుకోనుచున్నాము. ఆ విదంగా మనకు మనముగా అవివేకముతో బందీలమవుతున్నాము.

ఈ విదంగా ఏ విదమైన సంబందము లేని నువ్వు(ఆత్మ) ఇక్కడి (ప్రకృతి) బంధాలను(కర్మలను) కలుపుకొని జీవాత్మ గా తయారవుచున్నావు. కాని ఈ జీవాత్మ ఎప్పుడైతే తన స్వస్వరూపమును తెలిసికొని తన హృదయములో సాక్షాత్కరించుకు0టుందో అప్పుడు అది విముక్తి పొంది తన నివాసానికి చేరుకుంటుంది (అదే పరమాత్మ లో ఐక్యం అవుతుంది)   

నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా నా భూయ: !
అజో నిత్య: శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే ||  (భగవద్గీత 2:20)
భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఎన్నడైనా ఆత్మకు జన్మగాని, మరణముగాని లేదు. జన్మ లేనిది, నిత్యమూ, శాశ్వతము అయిన ఆత్మ శరీరము చంపబడినను చావదు.

దేహినోస్మిన్యథాదేహే, కౌమారంయవ్వనంజరా
తథాదేహాస్తరప్రాప్తి; ధీరస్తతరనముహ్యతి ||   (భగవద్గీత)
జీవునకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలి తనము ఏట్లో మరొక దేహమును పొందుట కూడా అట్లే. 
అంటే జీవుడు తన స్వస్వరుపమును తెలిసికోనంత వరకు అతను మరల మరల పుడుతుంటాడు . అయితే అది మరల మానవ జన్మే అని మాత్రమూ చెప్పలేము. అందువలన ఇప్పుడు పొందిన మానవ జన్మను సార్ధకపరచుకోవలెను మనము.


కర్మన్యెవాధికారస్తే, మఫాలేషుకదాచనా
మకర్మఫల హేతుర్భు: మాతేసజ్గోస్త్వకర్మణి ||  (భగవద్గీత)
కర్మలను ఆచరించుట యందు నీకు అదికారము కలదు కాని, వాని ఫలితముపైన లేదు. నీవు కర్మఫలమునకు కారణమూ కారాదు. అట్లని కర్మలను చేయుట మానరాదు.
అంటే ఇక్కడ శ్రీ కృష్ణుడు ఎంత బాగా చెప్పాడో చూడండి. కర్మలను ఆచరించండి కానీ వాటి ఫలితాలను మాత్రము నాకు సమర్పించండి. అప్పుడు మీరు బంద విముక్తులవుతారు అని ఎంతో విపులంగా విషదీకరించాడు.

మమైవా0శో జీవలోకే జీవభూత: సనాతన: |
మన:షష్టనీందరియాణి ప్రకృతిస్థాని కర్షతి ||  (భగవద్గీత 15:7)
జీవ జగత్తులోని జీవుడు నిశ్చయముగా శాశ్వతమైన నా అంశ(భాగము). మనస్సుతో కలిపి ఆరు (కర్మ) ఇంద్రియములతో భౌతిక ప్రకృతిలో కష్టపడుచున్నాడు.
అంటే ఇక్కడ జీవుడు (కర్మ మరియు ఆత్మ కలిపి) ప్రకృతిలో తను అజ్ఞానముతో ఆపాదించుకున్న కర్మలను చేయుచున్నాడు.

శ్రోతం చక్షు: స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ |
అధిష్ఠాయ మనశ్చాయం విసయనుపసేవతే || (భగవద్గీత 15:9)
విని, చూసి, స్పర్స, రుచి, వాసన పొంది మనస్సుతో జీవుడు విసయాన్ని అనుభవిస్తున్నాడు. అంటే ఇక్కడ జీవుడు అన్నిటిని అనుభవిస్తున్నాడు అంతేకాని ఆత్మకు ఇవి అన్నియు ఏమి సంబందము లేదు.

ఉత్క్రామన్తం స్తితం వాపి భుంజానం నా గుణాన్వితమ్ |
విముడా నానుపస్యంతి పశ్యంతి జ్ఞానచక్షుష: ||  (భగవద్గీత 15:10)
జీవాత్మ శరీరము నందుండి గుణ ప్రభావమున అనుభవించుటగాని, శరీరమును విడుచుటగాని అజ్ఞానులు చూడజాలరు. జ్ఞాని చూడగలడు.


యతంతో యోగినశ్చైనం పశ్య0త్యాత్మన్యవస్తితమ్ |
యతంతో ప్యకృతాత్మనో నైనం పస్యంత్యచేతస: ||  (భగవద్గీత 15:11)
ప్రయత్నించి యోగులు కూడా ఆత్మస్తితులై దీనిని(ఆత్మ) చూడగలరు. ఆత్మానుభూతి లేని అజ్ఞానులు ఎంత ప్రయత్నించిన దీనిని(ఆత్మ) చూడలేరు.
అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాల ఏమిటంటే ఆత్మను ఈ ప్రకృతితో నిర్మితమైనవి(మన కళ్ళు) ఏవియును చూడలేవు. ఆత్మను మన ఈ కళ్ళతో చూడదగినది కాదు . ఆత్మ దర్శనము పొందాలంటే ఇంద్రియములను జయించి, దృష్టిని భ్రుమద్యమున నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంబింపజేసి, మనస్సును, బుద్దిని, స్వాదీన మొనర్చుకొని, మొక్షాసక్తుడై యుండునో అట్టివాడు ఆత్మ దర్శనము చేసుకోగలడు(అంటే ద్యానములో కూర్చొని మాత్రమే ఆత్మ దర్శనము చేసుకోగలడు).


ఏషాబ్రాహ్మీస్తితి:పార్థా, నైనాంప్రాప్యవిముహ్యతి
స్తిత్వాస్యామన్తకలేపీ, బ్రహ్మనిర్వాణమ్రుచ్చతీ ||  (భగవద్గీత)
ఆత్మజ్ఞానపూర్వక కర్మానుస్టారము, బ్రహ్మప్రాప్తిసాదనము కలిగిన జీవుడు సంసారమున బడక, సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు. 

హరే రామ హరే కృష్ణ 

12, ఆగస్టు 2020, బుధవారం

పాప పుణ్యాల ఫలం - Paapa Punya phalam

పాప పుణ్యాల ఫలం - Paapa Punya phalam
మంచిఫలం పుణ్యరూపంలో, చెడు ఫలం పాపరూపంలో ఉంటుంది. శరీరాన్ని ఆశ్రయించి కుడి, ఎడమ చేతులు ఉన్నట్లే, మానవుడు చేసే పనుల ద్వారా ఫలితాలు ఉంటాయి. పుణ్యకార్యం ద్వారా లభించే ఫలంతో మనిషికి రాజ్యాలు, పశు సంపదలు, ధనం, బంగారం వంటి సమస్త ఐశ్వర్యాలు లభిస్తాయి. కొన్ని పనులకు ఫలం వెంటనే లభిస్తుంది. మరికొన్నిటికి తర్వాత లభిస్తోంది.

ఉదాహారణకు: రైతు భూమిలో విత్తనం నాటిన రోజున పంట లభించాలంటే అది సాధ్యం కాదు కానీ ఎర్రగా కాలిన నిప్పుపై చేయి పెట్టామంటే వెంటనే దుఃఖరూపంలో అనుభవమవుతుంది.

భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునితో నీకు కర్మ చేయడానికి అధికారముంది. ఫలితం మాత్రం పరమాత్ముని ఆధీనంలో వుంటుందని చెప్పాడు. అనుభవించవచ్చు లేదా ఆ తరువాత జన్మలోనైనా అనుభవించవచ్చు. ఇది నిర్ణయించేది సృష్టికర్త అయిన పరమాత్ముడని శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించాడు. 

3, ఆగస్టు 2020, సోమవారం

పరమాత్మ : Paramatma

పరమాత్మ : Paramatma

పరమాత్మ ఎవరు?

ఓం ׀׀ ఆత్మా వ ఇదమేక ఏవాగ్ర ఆసీన్నాన్యత్ కించన మిషత్ ׀
స ఈక్షత లోకాన్ను సృజా ఇతి ׀׀   (ఐతరేయోపనిషత్ 1:1)
ఈ సృష్టి జరగక ముందు ఒకే ఒక శక్తి మొత్తం అంతయు ఉండింది. అంటే ప్రారంభంలో భగవంతుడు ఒక్కడు మాత్రమే ఉన్నాడు. నేను లోకాలను సృష్టిస్తాను అని అనుకున్నాడు సృష్టించాడు.
సృష్టి ఆరంభమునకు ముందు అంతయూ శూన్యమే. ఎక్కడను ఏమియు లేదు. సృష్టి అరంభమవగానే శూన్యము నుండి శక్తి బయల్పడి అది వ్యాపింప నారంభించెను. ఆవిధంగా శూన్యము నుండి లక్షల కోట్ల సౌర మండలాలు ఉద్భవించి వాటిలో ప్రకృతి , పెక్కు చరాచరులు, జీవరాశులు ఏర్పడినవి.

స ఈక్షతేమే ను లోకా లోకపాలాన్ను సృజా ఇతి ׀ సో ద్భ్య ఏవ పురుషం
సముద్ధ్రుత్వా మూర్ఛయత్ ׀׀ (ఐతరేయోపనిషత్ 1:౩
లోకాలను సృస్తిచేశాను. ఇక లోకరక్షకులను సృష్టిస్తాను. అని అయన అనుకున్నాడు. ఆ విధంగా బ్రహ్మ దేవుణ్ణి సృష్టించాడు. ఆయన నుండి సమస్త జీవరాశులు పుట్టినవి.
మొదట ఆరంభంలో శూన్యం నుండి (అంటే శక్తి) నుండి పంచభూతాలు సృష్టించబడినవి. అంటే ఈ పంచభూతాలు కూడ ఆ భగవంతుడే. ఈ చరాచర జీవ రాసులు మొత్తం ఆ భగవంతుడే. మనకు కనిపించే ప్రతిది ఆ భగవంతుడే. ఆయనే ప్రకృతి అయి (ప్రకృతి రూపంలో) ఉన్నాడు. అంటే అయన కాకుండా ఈ చరాచర జగత్తులో ఏదియును లేదు.

మయాద్యక్షేణ ప్రకృతిం సూయతే సచరాచరం !
హేతునాణేణ కౌన్తేయ జగద్విపరివర్తతే !!  (భగవద్గీత : 9:10)
నా అద్యక్షతన భౌతిక ప్రకృతి చరచారాలను (ప్రాణుల్ని) సృస్టించును . ఆ కారణంగా జగత్తు పనిచేయుచున్నది.

స ఏతమేవ సీమానం విదార్యేతయా ద్వారా ప్రాపద్యత ׀ సైషా విద్రుతిర్నామ ద్వాస్త
దేతన్నాన్దనం ׀ తస్య త్రయ ఆవసథా:  త్రయ: స్వప్నా: అయమావసథొ యమావస   
థొ యమావస ఇతి ׀׀   (ఐతరేయోపనిషత్ 2:12)
భగవంతుడు తన నుండే పంచభూతాలను సృష్టించి అందు నుండే ఎన్నో చరాచర జీవులను మరియు మనిషిని సృష్టించాడు. ఆ తరువాత సృష్టించబడిన అన్నిటికి ఒక శక్తీ కావాలి (ఎందుకంటే అవి నిర్జీవమైనవి కదా, అవి ప్రకృతి నుండి ఉద్భవించబడినవి).అందువలన ఆ భగవంతుడే వాటి అన్నిటిలోనూ ప్రవేశించాడు. (అంటే సముద్రము నుండి ఒక నీటి బిందువును పక్కకు తీస్తే అది సముద్రము నీటికి ఏవిదంగా సమానమో) ఆ విధంగా ఈ చరాచర జీవులలో మరియు మన శరీరాలలో వున్న ఒక ఆ దివ్య శక్తీ ఆ భగవంతుడే.

భగవంతుడు మనిషి నడినెత్తి చీల్చుకొని , ఆ ద్వారం గుండా లోపలికి ప్రవేశించాడు. ఆ ద్వారం పేరే విద్రుతి. ఆయన విద్రుతి అనే ద్వారం గుండా మన శరీరంలో ప్రవేశించి ఉన్నాడు.

స జాతో భుతాన్యభివైక్ష్యత్ కిమిహన్యం వావదిషదితి ׀ స ఏతమేవ పురుషం
బ్రహ్మ తతమమపశ్యత్ ׀ ఇదమదర్శమితి ׀׀
మనిషిగా జన్మించిన అతడు మాత్రం తక్కిన జీవరాసుల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు (ఎందుకంటే భగవంతుడు మనిషికి బుద్దిని ప్రసాదించాడు) ఆలోచించటానికి ఏముంది . శరీరంలో కొలువైన ఆత్మే సర్వత్ర వ్యాపించి, భగవంతుడుగా ఉండడాన్ని అతడు చూసాడు. దీనిని నేను కనుగొన్నాను  అని ఆశర్యబోతూ చెప్పాడు.

పరమాత్మ అంటే ఒక శక్తి అనగా నిరాకారుడు ఆకారం లేనివాడు, నిర్గుణుడు అంటే ఎటువంటి గుణాలు లేనివాడు, సత్యుడు అంటే ఎప్పటికి నిలిచి వుండే వాడు, శాశ్వతుడు, నశ్వరుడు అంటే నాశనమ లేనివాడు, జనన మరణములు (పుట్టుక అంటూ) లేనివాడు, నిత్యుడు అంటే నిత్యమూ వుండే వాడు అన్నిటికి మించి తానే జ్ఞాన స్వరూపుడు అంటే అయన దివ్య దర్శనంతో మాత్రమే మనం సంపూర్ణ దివ్య జ్ఞానాన్ని సంపాదిస్తాము అంటే ఆ భగవంతునిని మన శరీరం అంతరంలో(హృదయంలో) సాధన (ధ్యానం) ద్వార దర్శించడమే.

సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి

26, జులై 2020, ఆదివారం

బ్రహ్మముహూర్తం - Brahmamuhurtam

 బ్రహ్మముహూర్తం - Brahmamuhurtam

బ్రహ్మముహూర్తం - ఓ అద్భుతమైన వరం..

 • ☀ పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. 
 • ☀ ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. 
 • ☀ ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. 
 • ☀ అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. 
 • ☀ ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే… ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. 
 • ☀ సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే ‘బ్రహ్మముహూర్తం’ అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. 
 • ☀ ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది.
నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మమూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది.

పురాణగాథ:
బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణగాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది. ఈ బ్రహ్మ ముహూర్తకాలమున చదివే చదువు.. చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు.

చేయవలసిన కార్యములు:
ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేని సమయం.

ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులుహిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్లు.
 • ☀ చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది.
 • ☀ బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. 
 • ☀ పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి అ సమయంలో మనోశక్తి లభిస్తుంది. 
 • ☀ మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిముషాలు ఏదైన కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది.
 • ☀ బ్రహ్మముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది.
 • ☀ అందుకే ఋషులు, యోగులు, ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. 
 • ☀ ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది. 
 • ☀ ముందు మనం మన అంతర్యామిలోని ఆత్మలో లీనమై తద్వారా పరమాత్మను చేరుకుంటాము.

సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి

24, జులై 2020, శుక్రవారం

నాగ పంచమి - Naaga panchami

నాగపంచమి - Naagapanchamiచలి చీమ నుండి ... చతుర్ముఖ బ్రహ్మ వరకు , రాయి - రప్ప , చెట్టు -చేమ , వాగు-వరద , నీరు -నిప్పు , అన్నిటా అందరిలోనూ దైవత్వాన్ని దర్శించే విశిష్టమైన సంస్కుతి హిందువులది . మంచో , చెడో ... విపరీత ధోరణి ఇది . హిడువుల దృష్టిలో పాము కుడా పరమాత్మ స్వరూపమే . వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తి కి పానువు . వాసుకి పమేస్వరుడి కన్టాభరణమ్ . వినాయకుడు నాగ యజ్ఞోప వీతుడు . ఈ విధం గా బ్రాహ్మణులూ , ఋషులు , మునులు ... మానవజాతిని నమ్మించి సన్మార్గములో పయనించేటట్లు చేసారు .

నాగ జాతి జనము : 
కశ్యప ప్రజాపతికి , కద్రువ దంపతులకు .. అనంతుడు ,తక్షకుడు , వాసుకి , ననినాగుడు ,
శంఖుడు , కర్కోటకుడు , ఉగ్రకుడు పిందారకుడు , హహుషుడు , ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనబడిన వారినల్లా కాతువేస్తూ భయభ్రాంతులను చేయసాగారు .

దాంతో సకల దేవతలు అంటా బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు . అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై " మమ్మల్ని మీరే సృస్తించి మాకీ విధంగా శాపమివ్వడం న్యాయమా " అని వేడుకున్నారు .

"విషయుక్తం గా పుట్టినంత మాత్రాన అందర్నీ కాటువేసి ప్రాణికోటిని నశింప జేయడం తప్పు కదా ' నిష్కారణం గా ఏ ప్రాణినీ హిమ్సించరాడు . గరుడ మంత్రం చదివే వారిని , ఔషధ మని సమేతులను తప్పించుకు తిరగండి .దేవతా విహంగ గణాలకు , జ్ఞాతులైన మీరు మీమీ స్థాన గౌరవాలను నిలిపుకోండి . వాయుభాక్షకులై సాదుజీవులు గా మారండి . మీ నాగులంతా ఆటలా వితల పాతాళ లలో నివాసం చేయండి" అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు .

దాంతో డేవాగానామంతా నాగులను ప్రశంసించారు . భూలోక వాసులంతా ప్రార్ధనలు చేశారు నాగులకు . దివ్య ప్రభావ సంపన్నమయిన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకం గా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజచేయడం మొదలు పెట్టారు .

వైదిక కాలం నుండి కార్తీక మాసం ఐదవ రోజు పంచమి ఉత్సవాలు జరుపుకునే సంప్రదాయం దేశమంతా ఉంది. పుట్టలో ఆవుపాలు , వడపప్పు , చలిమిడి , అరటిపండ్లు , కోడి గ్రుడ్లు జారవిడిచి నైవేద్యం గా సమర్పిస్తారు .

పార్వతీ దేవికి పరమేశ్వరుడు చెప్పినట్లు గా పురాణాలులో చెప్పడం జరిగినది .
ఓ పార్వతీ దేవి... శ్రావణ మాస శుక్ల పంచమినాడు నాగారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఈ నాగపంచమినాడు ద్వారానికి ఇరువైపులా సర్వ చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం. చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం వెండి, కర్రతోగానీ, లేదా మట్టితోగానీ వారి వారి తాహతుని అనుసరించి ఐదు పడగల పామును చేయించాలి. లేదంటే పసుపు, చందనంతోగానీ ఏడు తలల పాము చిత్ర పటములు గీచి ఆ రూపాలకు జాజి, సంపెంగ, గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి. పాయసము, పాలు నివేదన చేయాలని పరమేశ్వరుడు వివరించాడని పురాణాలు చెబుతున్నాయి.
శ్రావణమాసం, శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్ర వచనం. ఇదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే శుక్లపంచమినాడు జరుపుకునే నాగ పంచమి కూడా ఈ సంప్రదాయానికి చెందినదేనని పండితులు అంటున్నారు.
అందుచేత శ్రావణమాసం న వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను పూజించాలి. నాగచతుర్థి రోజున (నాగపంచమికి ముందురోజు) ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి. గరుడ పంచమిగా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందేలేచి శుచిగా స్నానమాచరించి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి.

ఇంటి గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమకు నేతితోనూ, పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం, పానకం, వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇవ్వాలి. నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి. ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాకుండా పాపాల నుంచి విముక్తి లభించడం, సర్ప భయం తొలగిపోవడం వంటివి జరుగుతాయి.
నాగ పంచమి వ్రత కద :
పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి వుడేది ... ప్రతిరోజూ సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లు గా ఆమెకు కలలు వస్తుదేవి , దానితో ఆమె భయకంపితురాలైంది . ఒక రోజున వారి కులగురువు వారి ఇంటికి వచ్చి ఆమె దీన గాధను విన్నారు . విని "అమ్మా " నువ్వు గతజన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు , అందువలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యము సంక్రమించినది అని చెప్పి నివారణకోసం నాగపంచమి నోము నోయమని , పాముల భయం తొలగి పోతుందని చెప్పెను . ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైనది . నాగపంచమి వ్రత కధల్లో ఇది ఒకటి .

ఈ కధ వెనుక ఒక సామాజిక మైన హితవు ఉన్నది .. ఇతరులకు ఎవ్వరికీ ఇబ్బంది కలగని విధంగా ఎవరైనా తన కుటుంబ ఆచారాన్ని తానూ పాతిస్తున్నట్లయితే వారిని పరిహసించకూడదు .. ఎవరి విస్వాశము వారిది . ఈ నాగపూజా వెనుక యోగాపరమైన అంతరార్ధము కుడా ఉన్నది .. మన వెన్నెముక కు అడుగుభాగము లో మూలాధార చక్రమున్నది . ఆ చక్రం లో కుండలినీ శక్తి ఇమిదివున్నది .. అదే నాగదేవత , ధ్యానం తో ఆ కూడలిని కదిలించి సహస్రారం దాకా తీసుకొని వెళ్లి నట్లయితే మానవుడు మహానీయుదవుతాడు .. అదీ నాగశక్తి .

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

14, జులై 2020, మంగళవారం

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి జీవిత విశేషాలు - Brahmaśrī Chāgaṇṭi kōṭēśvararāvu


ఆధ్యాత్మిక వేత్త,ప్రసిద్ధ ప్రవచనకారుడు పూజ్యులు "బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు"

జననం 14 జూలై 1959
బ్రహ్మశ్రీ చాగంటి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త. అయన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వాస్తవ్యులు. తండ్రి చాగంటి సుందర శివరావు, తల్లి సుశీలమ్మ. 1959 జూలై 14వ తేదిన రావుగారు జన్మించారు. కోటేశ్వరరావు సతీమణి సుబ్రహ్మణ్యేశ్వరి. వీరికి ఇద్దరు పిల్లలు; అయన ధారణ శక్తి, జ్ఞాపకశక్తి చెప్పుకోదగ్గవి. మానవ ధర్మం మీద ఆసక్తితో అష్టాదశ పురాణములను అధ్యయనము చేసి, తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలను అందిస్తూ, భక్త జన మనసులను దోచుకున్నారు. ఉపన్యాస చక్రవర్తి, శారదా జ్ఞాన పుత్ర, ఇత్యాది బిరుదులను అందుకున్నారు.

మండల దీక్షతో 42 రోజుల పాటు సంపూర్ణ రామాయణమును, 42 రోజుల పాటు భాగవతాన్ని, 30 రోజుల పాటు శివ మహా పురాణాన్ని,, 40 రోజుల పాటు శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రమును అనర్గళంగా ప్రవచించి పండిత, పామరుల మనసులు దోచుకొని, విన్నవారికి అవ్యక్తానుభూతిని అందిస్తున్నారు. కాకినాడ పట్టణ వాస్తవ్యులనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నఎంతో మంది తెలుగు వారికి తనదైన శైలిలో ఎన్నో అమృత ప్రవచనములు అందజేయుచున్నాడు.

చాగంటి వారికి ఆరేడేళ్ల వయసులో జనకులు గతించారు. అయనకు ఇద్దరు అక్కలు, ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. తల్లిగారు కస్టపడి నలుగురు పిల్లలను పెంచారు. వారికి ఆస్తిపాస్తులు లేవు. నిరుపేద కుటుంబం. సంసారానికి తాను మాత్రమే పెద్ద దిక్కు అన్న స్పృహ పొటమరించగా చాగంటి వారు అహోరాత్రాలు సరస్వతీ ఉపాసనే లక్ష్యంగా విద్యను అభ్యసించారు. పాఠశాల స్థాయినుంచే అయన విద్యాబుద్ధులు వికసించాయి. అయన యూనివర్సిటీ స్థాయివరకు గోల్డ్ మెడలిస్టుగా ఎదిగారు.
 • ➧ అయన ధారణాశక్తి చాలా గొప్పది. ఒకసారి శంకరుల సౌందర్యలహరి తిరగేస్తే అది మొత్తం అయన మదిలో నిలిచిపోతుంది. ఎక్కడ ఏ పేజీలో ఏమున్నదో చెప్పగలరు.
 • ➧ అయన ఉద్యోగంలో చేరాక తోబుట్టువుల బాధ్యతను స్వీకరించారు. అక్క, చెల్లెలు, తమ్ముడుకు తానే తన సంపాదనతో వివాహాలు చేశారు. కుటుంబం కోసం తన కష్టార్జితాన్ని మొత్తం ధారపోశారు.
 • ➧ అప్పుడపుడు కాకినాడలో అయ్యప్ప దేవాలయంలో సాయంత్రం కూర్చుని భక్తులముందు భారత భాగవత ప్రవచనాలు ఇచ్చేవారు. ఏనాడూ డబ్బు పుచ్చుకునే వారు కారు. అయన స్వరలాలిత్యం, ధారణ, విజ్ఞానం, విశదీకరణ భక్తులను ఆకర్షించాయి. అభిమానులు పెరిగారు.
 • ➧ పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అనుకుంటాను.. ఎక్కడో ఒకచోట చాగంటి వారిని కలిశారు. "మీ గురించి ఎంతో విన్నాను. మీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అసాధారణం. మీ ప్రవచనాలు నాకు బాగా నచ్చాయి. ముఖ్యంగా మీ పాండితీప్రకర్ష అమోఘం. ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను. ఏమైనా అడగండి. చేసిపెడతాను" అన్నారు పీవీ.
 • ➧ చాగంటి వారు నవ్వేసి "మీకూ, నాకు ఇవ్వాల్సింది ఆ పరమాత్మే తప్ప మరెవరూ కారు. మీ సహృదయానికి కృతజ్ఞతలు. నాకేమీ ఆశలు లేవు." అని నమస్కరించి బయటకు వెళ్లిపోయారు.
అయన బయటప్రాంతాల్లో ప్రవచనాలు ఇవ్వడం వారి అమ్మగారు 1998 లో స్వర్గస్తులు అయ్యాక ప్రారంభించారు. ఎందుకంటే చాగంటి వంశంలో గత ఆరు తరాలుగా ఆ సరస్వతి కటాక్షం ఎవరో ఒక్కరికే వస్తున్నది. ఈ తరంలో ఆ శారదాకృప నలుగురు పిల్లలలో చాగంటి కోటేశ్వర రావు గారిపై ప్రసరించింది. ఆ మాత దయను తృణీకరించలేక తనకు తెలిసిన జ్ఞానాన్ని లోకానికి పంచుతున్నారు చాగంటి వారు.

సంకలనం: పద్మనాభరావు దరపనేని

13, జులై 2020, సోమవారం

"హారతి" వలన కలిగే ఆరోగ్య , ఆధ్యాత్మిక లాభములు - "Hārathi" valana kaligē lābhamulu

 "హారతి" వలన కలిగే ఆరోగ్య , ఆధ్యాత్మిక లాభములు - "Hārathi" valana kaligē lābhamulu

"హారతి" వలన లాభము ఏమిటి?

గృహములోను, పూజాగదిలోనే కాడు, గుడిలోనూ, శుభకార్యాలప్పుడూ….పిల్లల పుట్టిన రోజుల వేడుకలలోను, క్రొత్త పెళ్లికూతురు గృహములోకి ప్రవేశించేతప్పుడూ హారతి ఇస్తుంటారు. 
 • ➧ ఎక్కడ హారతి పట్టినా ఓ ఆరోగ్య సూత్రం ఉంది. సుభాకార్యాల్లో ఎన్నో కుటుంబాలకు సంబంధించిన వారు ఒకేచోట చేరుతారు. 
 • ➧ అలాగే దేవాలయాలలో అనేక మంది భక్తులు దేవుడిని దర్శిస్తుంటారు. దానివలన పరిసర ప్రాంతపు గాలి అపరిశుభ్రం అవుతుంది. అనేక క్రిములు చేరతాయి. 
 • ➧ కనుక హారతి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా అనేక సూక్ష్మక్రిములు కర్పూర పొగాకు నశిస్తాయి. 
 • ➧ ముక్కుకు సంబంధించిన వ్యాధులూ, అంటూవ్యాధులూ ప్రబల కుండా ఉంటాయి. 
 • ➧ కర్పూర హారతి ఎలాగైతే క్షీణించిచేసిన పోతుందో, అలాగే మనం తెలిసీ సమసిపోవాలని కోరుకుంటూ హారతిని కళ్ళకద్దుకోవటమే అసలు సిసలు ఆధ్యాత్మిక అర్థం, పరమార్థం.

సంకలనం: నాగవరపు రవీంద్ర

11, జులై 2020, శనివారం

పరస్త్రీ వ్యామోహం, ఎంగిలి ఆకుతో సమానం - Parastri vyamoham

పరస్త్రీ వ్యామోహం, ఎంగిలి ఆకుతో సమానం - Parastri vyamoham
కసారి ఒక రాజు గుర్రంపై సవారీ చేస్తూ ఒక ఇంటి దగ్గర నిల్చున్నాడు. ఆ ఇంటిలోని ఇల్లాలు వాళ్లాయనకు అన్నం వడ్డిస్తూ వుంది.

ఆమె చాల అందగత్తె, ఆవిడ అందం చూసి రాజుకు ఆశ్చర్యం కలిగింది. ఆమె అందానికి వివశుడై మోహంలో పడిపోయాడు. నా రాజ్యములో ఇంత ఆందమైన అమ్మాయిని ఇదివరకు చుడానేలేదే అని అనుకున్నాడు.

ఆమె భర్త భోజనం చేసి తన పనికోసం బయటికి వెళ్ళాడు. భర్తను పంపించి ఆవిడ వాకిలి మూసేసి ఇంట్లోకి వెళ్ళింది. అప్పుడా రాజు ఇంటి తలుపు తట్టాడు. ఆవిడ తలుపు తెరిచి చూడగా ఆయన వేషధారణను బట్టి ఎవరో రాజ వంశానికి చెందిన వ్యక్తి అనుకున్నది. 'ఎవరు మీరు అని ప్రశ్నించింది'. రాజు తన గురించి చెప్పుకుంటూ నేను ఈ రాజ్యానికి రాజును, నీవు చాలా అందంగా వున్నావు నీ అందం నన్ను వ్యామోహంలో పడవేస్తోంది. నిన్ను నా భార్యగా చేసుకోవాలి అనుకుంటున్నాను. నీవు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుని నా రాజ్యానికి మహారాణిని చేస్తాను. నీవు చూడని సంపద చూడగలవు, నీ అడుగులకు మడుగులోత్తే పనివారు, కాలు కింద పెట్టకుండా చూసుకునే బాధ్యత నాది అన్నాడు.

ఆమె ఎంతో తెలివైంది. చక్కటి గుణవంతురాలు, మంచి సంస్కారం కలది. ఆవిడ రాజుతో ఇలా అంది.

రాజా !! తప్పకుండా మీ కోరిక తీరుస్తాను ముందు మీరు ఆలసిపోయి వచ్చి వుంటారు. శరీరం, మనసు రెండు ఆకలితో వుంటాయి. మీరు వెళ్లి కాళ్లు చేతులు కడుక్కొని రండి అని చెప్పింది.

ఆమె అంగీకారంతో రాజు ఆనందానికి అవధులు లేవు. ఇంత సులువుగా తన కోరిక తీరుతందని' ఆవిడ అంగీకరిస్తుందనీ ఊహించ లేదు.

ఆవిడ అంగీకరించకపోతే తన అధికారంతో అయినా ఆవిడను చేరబట్టాలను కున్నాడు. కానీ పరిస్థితులు అంత దూరం దారితీయనందుకు తన ఆనందం అంతా ఇంతా కాదు. కాళ్లు చేతులు శుభ్రం చేసుకొని ఇంటిలోనికి వెళ్ళాడు.

రాజా! మీరు భోజనం చేయండి అంటూ వాళ్ల ఆయన తిన్న అరిటి ఆకును రాజు ముందు వేసి ఇలా అంది. "ఇప్పుడే మావారు ఇదే ఆకులో భోంచేసి వెళ్ళారు, అదే ఎంగిలి ఆకులో మీరూ భోజనం చేయండి. మీ ఆకలి తీరాక నేనూ మీతో వస్తాను మీ ఆంతరంగిక కోరిక ఏమైనా తీరుస్తాను. మీ రాజ్యానికి మీతో పాటు వస్తాను అన్నది.ఊహించని ఆ పరిణామానికి రాజుకు ఆమెపై కోపం, ఆ ఎంగిలి ఆకును చూసి అసహ్యం కలిగాయి.

"దేశాన్నేలే ప్రభువును నేను, ఎప్పుడూ బంగారు పళ్లింలో ఘుమఘుమలాడే షద్రసోపేతమయిన వంటకాలు వేడి వేడిగా తినే నాకు ఈ ఒక ఎంగిలి ఆకులో భోజనం వడ్డించడానికి నీకెంత ధైర్యం అని గద్దించాడు."

అందుకు సమాధానంగా ఆమె ఇలా చెప్పింది! "మహరాజా! నా భర్త భోజనం చేసిన విస్తరాకు ఎంగిలిది అంటున్నారే, మరి నా శరీరాన్ని ప్రేమించే మీకు ఎంగిలి అడ్డు రాలేదా. పెళ్లైన నన్ను మళ్లీ పెళ్లి చేసుకోవడానికి అడ్డురాని ఎంగిలి, భోజనం చేసే విస్తరాకు విషయంలో కలిగిందా, ఎంత ఆశ్చర్యం" అన్నది

రాజుకు ఆమె మాటలలోని అంతరార్ధం అర్ధమయ్యింది. కనువిప్పు కలిగింది. మోహం పటా పంచలయ్యింది. ఆవిడ సంస్కారానికి, సమయస్ఫూర్తికి ముగ్గుడయ్యాడు. ఆవిడ పాదాల మీద పడి నమస్కరించాడు. చేతులు జోడించి "తల్లీ నన్ను క్షమించు. కేవలం బాహ్య సౌందర్యాన్ని చూసి ఇంద్రియ నిగ్రహం కోల్పోయి అవివేకంతో అజ్ఞానిలా ప్రవర్తించాను. నీవు ఎంతో నేర్పుగా నాకు సూక్ష్మాన్ని దర్శింపజేశావు. నేను చూపిన ఆశలకు లోబడక నీ పాతివ్రత్యాన్ని ప్రదర్శించావు. నీవంటి మాతృ మూర్తులవల్లే ధర్మం ఇంకా జీవించి ఉంది" అని అక్కడి నుండి వెళ్లిపోయాడు

_జాగృతి

4, జులై 2020, శనివారం

దేవుడి ప్రత్యక్ష రూపం - Dēvuḍi pratyakṣa rūpaṁ


దేవుడు ఈ కలికాలంలో మనిషికి ప్రత్యక్ష రూపంలో కనిపించే అవకాశం ఉందా?

దేవుడు అంతటా ఉంటాడు. కాని అమూర్తంగా స్థిరాకారంగా ఉండాడు. ఆయన చర్మచక్షువులకు కనిపించడు. కనిపిస్తే ఆయన “దేవుడే” కాదు అంటారు కొందరు. అసలు దేవుడుంటే గదా కనిపించటానికి అని వాదించే వాళ్ళ సంఖ్య తక్కువేమి కాదు. అదేమిటంటే “నేను హేతువాదిని, నాది శాస్త్రీయమైన దృక్పథము. దేవుడున్నాడనేందుకు నా మనసుకు నచ్చే సాక్ష్యాధారాలు ఇంతవరకూ నాకెవరూ చూపలేదు. ‘నేనున్నాను’ అని నిరూపించుకొనేందుకు ఆయన కూడ ఇంతవరకూ నా ముందు హాజరు కాలేదు. కనుక దేవుడున్నాడనటం ఒక ఆంధవిశ్వాసం. లేదనటం హేతుబద్ధం దేవుడు లేదని గ్రహిస్తే తప్ప, మానవాళి ‘అభ్యుదయం’ ‘సాధించదు’ అంటారు.

ఇంతవరకూ నాకు కనబడని, తెలియని వస్తువు అసలు ఉండదేందుకే అవకాశం లేదనటం హేతువాదానికి కంటే, వితండవాదానికి దగ్గరగా ఉంటుంది. ఇప్పటి వరకూ తెలియనిదీ, అనుభవంలోకి రానిదీ ఇక ముందు రావచ్చు. ఒకవేళ రాకపోయినా, అనుభవంలో లేని విషయం విశ్వంలోనే లేదని ఎలా చెప్పటం? ఉందో లేదో నాకు తెలియదు. ఇప్పటివరకూ నా అనుభవంలోకి రాలేదనటం హేతుబద్ధంగా ఉంటుంది. నాకు ముందు ఈ విషయాన్ని గురించి శోధించిన మేధావులూ, పేదలూ చెప్పిన మార్గంలో ప్రయత్నించి సత్యాన్వేషణ చేస్తాననటం మరింత సబబుగా ఉంటుంది. అది జిజ్ఞాసువు లక్షణం. జిజ్ఞాస ఉంటే ప్రమాణాలు, పూర్వపక్షాలూ, సిద్ధాంతాలు, నిరూపణల దాకా వెళ్ళే ప్రయత్నం చేయవచ్చు. భారతీయ ప్రాచీనతాత్త్వికులూ, మతాచార్యులూ ఎందరో నడిచి చూపిన బాట అదే. సత్యశోధనలో కనిపించిన విరుద్ధవాదాలన్ని వాళ్ళూ, చిత్తశుద్ధితో, శాస్త్రీయదృక్పథంతోనే విశ్లేషించారు. అది అలా ఉంచుదాం.

ఆస్తికత్వం, నాస్తికత్వం గురించి వెనకటికొక ‘లౌకికుడు’ చమత్కారంగా ఇలా చెప్పాడు..

సందిగ్దే పరే లోకే, హితం-ఏవ-ఆచరేత్-నరః
నాస్తి చేత్-నాస్తి నః-హానిః, ఆస్తి చేత్ నాస్తికః హతః
(పరలోకం ఉన్నదా లేదా అన్న విషయం సందిగ్ధంగా ఉన్నప్పుడు, మనిషి తనకు పుణ్యం కలిగించే మంచి పనులే చేయటం మంచిది. పరలోకం లేదనుకోండి, మనకు నష్టం లేదు. ఉందనుకోండి, లేదని తప్పుగా నమ్ముతున్న నాస్తికుడు దెబ్బతింటాడు). ఆస్తి-నాస్తి విచికిత్సలో ఆస్తికుడి నమ్మకం తప్పయినా నష్టం లేదు. సరైనదైతే లాభం. నాస్తికుడి నమ్మకం సరైనదైతే ఒరిగే లాభం లేదు. తప్పయితే మాత్రం కొంపమునిగిపోతుంది! ఇదొక తమాషా సమీకరణం. అదీ అలా ఉంచితే.

మన ముందున్న ప్రశ్న ‘దేవుడు మనిషికి ప్రత్యక్షమవుతాడా?’ అని –

స్వామి వివేకానందుడు, రామకృష్ణ పరమహంసను అడిగిన మొట్టమొదటి ప్రశ్న అదే. ‘మీరు దేవుడిని చూశారా?’ అని. ఆ ప్రశ్నే ఆయన అంతకు ముందు ఇతరులెందరినో అడిగాడు. సరయిన సమాధానం దొరక లేదు.

రామకృష్ణులు మాత్రం, ‘చూడకేం? చూశాను. ఇప్పుడు కూడా చూస్తున్నాను. నువ్వు ఎంత స్పష్టంగా కనిపిస్తున్నావో దేవుడు కూడా ఇంతే స్పష్టంగా కనిపిస్తున్నాడు’ అని సమాదానమివ్వటంతో, ఆ గురుశిష్యుల సుదీర్ఘమైన, అద్భుతమైన అనుబంధం మొదలైంది. ఆ పరమహంసకు, వివేకానందుడిలో కనిపించింది జ్ఞానికే సర్వే సర్వత్ర కనిపించే విశ్వవ్యాపి అయిన పరమాత్మ స్వరూపం. 

ఈశావ్యాసం ఇదం సర్వం,
యత్ కించ జగత్యాం జగత్!
(ఈ జగత్తులో చైతన్యవంతమై చలించేది సర్వమూ ఆ పరమేశ్వర పరివ్యాపితమే) అంటుంది ఉపనిషత్తు. ఇక ఈశ్వరుడు పరత్యక్షరూపంలో కనిపించనిదెక్కడ?

అయితే, అది జ్ఞానులకు మాత్రమే అనుభవమయ్యే విషయం. మరి సామాన్యులకు దేవుడు ప్రత్యక్షరూపంలో దర్శనమిస్తాడా?
ఆ భగవంతుడిలో అనన్యభక్తిగల భక్తులకూ భగవత్ సాక్షాత్కారం ఎక్కడపడితే అక్కడ కలుగుతుంది. భాగవతంలో ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు ఎలాగైనా ఆ శ్రీమన్నారాయణుడిని వెతికి పట్టుకోవాలని విశ్వప్రయత్నం చేశాడు. సాధ్యం కాలేదు. ‘నీ నారాయణుడు ఎక్కడుంటాడో చెప్పమని కుమారుని నిలదీశాడు.

‘అదేమిటి నాన్నగారూ, మీకు ఎక్కడ చూసినా, ఎంత వెదికినా నారాయణుడు కనబడ లేదంటారు? నాకయితే ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తున్నాడు’ అంటూ

 • ఇందుగల, డందులేడని
 • సందేహము వలదు, చక్రి స్వరోప గతుం(డు)
 • ఎందెందు వెతకి చూచిన
 • అందందే గలడు దానవాగ్రణి వింటే
అన్న సత్యం బోధిస్తాడు ప్రహ్లాదుడు. అంతేకాదు. అప్పటికప్పుడు ఆ చక్రిని తండ్రి ముందు ప్రత్యక్షం చేయిస్తాడు. సరే, ఇది అనన్య భక్తి బలం. ప్రహ్లాదుడిలాంటి మహానుభావులకు సాధ్యం. సామాన్య మానవమాత్రుల విషయమేమిటి? వారికి దైవసాక్షాత్కారం కలుగుతుందా కలగదా? చిరకాలం కఠోర తపస్సు చేసిన తపస్వులకు దేవుడు, ఇష్టదేవతారూపంలో ప్రత్యక్షమై, కోరిన వరాలు ఇచ్చాడని అనేక పురాణ కథలలో వింటూంటాం. తులసీదాసు, పోతన త్యాగరాజు లాంటి పరమభాక్తులు కూడా తమ ఇష్టదేవతల సాక్షాత్కారాన్ని పొందిన వారేనని చేస్తారు.

అంతెందుకు? భగవంతుడిని ఇష్టదేవతారూపంలో నిశ్చలమైన ఏకాగ్రతతో ధ్యానించి స్వప్నంలోనే ధ్యానం లోనోనన్నా ఆయన సాక్షాత్కారం పొందిన యోగుల అనుభవాలు కోకొల్లలు. అంతేకాదు, కేవలం ఆపన్నులై ఆర్తిగా భగవంతుడిని ప్రార్థించి, ఆ ప్రార్థన ప్రభావంవల్ల దైవానుగ్రహం పొంది, లౌకికమైన కష్టసుఖాలలో సాఫల్యం చవిచూసిన అనుభవంగల సామాన్యభక్తులు ఎందరులేరు? ఇది హిందూమతంలోనే కాదు. అన్ని మతాలవారిలోనూ చూస్తుంటాం, వింటూంటాం. అదీ అలా ఉంచండి. మీరు ప్రార్థించిన, ప్రార్థించక పోయినా, ధ్యానించినా, ధ్యానించకపోయినా, కనిపించే భగవంతుడి ప్రత్యక్ష రూపాలున్నాయి. ప్రాణుల ప్రమేయం లేకుండా, నియమబద్ధంగా నడిచే ప్రాకృతికశక్తులన్నీ వాటిని నడిపిస్తున్న అలౌకికశక్తి తాలూకూ ప్రత్యక్షరూపాలు కావా?

ఈశ్వరుడు, మనిషికి ఎనిమిది ప్రత్యక్ష రూపాలలో నిత్యమూ దర్శనమిస్తూనే ఉన్నాడంటాడు కాళిదాస మహాకవి. ‘అభిజ్ఞాన శాకుంతలమ్’ నాటకం నాంది శ్లోకంలో.

యా సృష్టి – స్రష్టురాద్యా, వహతి విధిహుతం
యా హవిః – యా ఛ హో త్రీ,
యే ద్వే కాలం విధత్తిః, – శ్రుతి విషయ గుణా
యా స్థితా వ్యాప్య విశ్వం,
యాం-ఆహుః సర్వ బీజ ప్రకృతిః – ఇతి,
యయా ప్రాణినః – ప్రాణవంతాః,
ప్రత్యక్షాభిః – ప్రపన్నః –  అనుభిః – అవతు – వః
తాభి రష్టాభి రీశః!

ఈశ్వరుడికి ఎనిమిది ప్రత్యక్ష స్వరూపాలు. మొదటిది సృష్టికర్త సృష్టించిన మొదటిసృష్టి. అంటే జలం. నీరు. రెండవది, యథావిధిగా హోమం చేయబడ్డ హవిస్సును దేవతల కందజేసే అగ్ని. ‘అగ్నిముఖావై దేవాః’ అని శ్రుతి.

మూడోది, యా చ హోత్రీ. యజ్ఞం చేసె యజమాని రూపం. యజ్ఞంలోక క్షేమం కోసం మాత్రమే చేసె పుణ్య కార్యం కనుక ఆ యజ్ఞం జరిగేంతసేపూ, యజ్ఞకర్త అయిన యజమానిని శివుడి ప్రత్యక్ష రూపంగా భావిస్తారు. యాజమాన-ఆహ్వాయా మూర్తిః విశ్వస్య శుభాదాయినీ. యజమాని అనే పేరుగల మూర్తి జగత్ సంక్షేమం చేకూర్చగలదు.

నాలుగూ, అయిదూ రూపాలు కాలాన్ని నియంత్రించే సూర్య చంద్రులు. ఆరో ప్రత్యక్షరూపం, శబ్ద విషయం గుణంగా కలిగి విశ్వమంతా వ్యాపించి నిలిచినా ఆకాశం. ఏడోది, ఈ పృథ్వి. ఇది సర్వబీజాలకూ వృద్ధికి మూలం కదా, ఈశ్వరుడి ఎనిమిదో ప్రత్యక్షరూపం వాయువు. యయా ప్రాణినః ప్రాణవంతః. దేనివల్ల నయితే ప్రాణులకు ప్రానమనేది కలుగుతుందో, ఆ ప్రాణవాయువు ఈశ్వర స్వరూపమే గదా!

ఈ ఎనిమిది ప్రత్యక్ష రూపాలుగల ఆ ఈశ్వరుడు మిమ్మల్ని రక్షించుగాక, అని మహాకవి కాళిదాసు ప్రార్థన. ఆ స్వామి మనల్ని తప్పకుండా కాపాడుతాడు. తథాస్తు!

సంకలనం: నాగవరపు రవీంద్ర

30, జూన్ 2020, మంగళవారం

గురుశబ్దం త్రిమూర్తితత్త్వం - Guru Shabdam


గురుశబ్దం త్రిమూర్తితత్త్వం - Guru Shabdam

గురుబ్రహ్మ

గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురురువేనమః

గురుశబ్దం త్రిమూర్తితత్త్వం. సృష్టి, స్థితి, లయకారం, అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును ప్రసాదించేవాడు గురువు. 
 • ➧ గురూ అనే శబ్దాన్ని విడదీస్తే ‘గ్ – ఉ – ర్ – ఉ’ అనే అక్షరాలు కనబడుతుంటాయి. 
 • ➧ వీటిలో ‘గ’ కారం సిద్ధకమైన బ్రహ్మకు, ‘ర’కారం పాపనాశకరమైన శివశాక్తికి సంకేతాలు. 
 • ➧ ఈ రెండూ పాలస్వభావం కలిగిన ‘విష్ణుశక్తి’తో కలిసినప్పుడే ‘గురు’ అనే పదం ఏర్పడి ‘గురు’తత్త్వం మూర్తీభవిస్తుంది. 
 • ➧ అందుకే గురువును మనం త్రిమూత్రిస్వరూపంగా భావిస్తూ పూజించుకుంటున్నాం.
‘గురి’ని కల్పించేవాడు గురువు. లక్ష్యసాధనామార్గాన్ని చూపేవాడే గురువు అని స్థూలార్థం. గురువు పరంపరాగత క్రమశిక్షణగలవాడైతే, శిష్యునకు ఉపదేశ మివ్వడానికి అర్హుడనీ,  అతడే సద్గురువు అని భావించాలి. శిష్యుడు గురువును గురువుగా ఎన్నుకున్నంత మాత్రానికే, ఆయన వెంటనే గురువు కాజాలడు. ఆయన కూడా అతడిని శిష్యునిగా ఎన్నుకోవాలి. తన గురువును ఎన్నుకునే అధికారం శిష్యునికి ఉన్నట్లే, శిష్యుని ఎంపిక చేసుకునే అధికారం గురువుకు ఉంది. నిదానించి, పరిశీలించి శిష్యార్హతను నిర్ణయిస్తాడు గురువు.

గురువు నడుచుకోవలసిన ప్రవర్తనా నియమావళి అంటూ ఉంటుంది. కానీ, ఏదో ఒకనాడు ఆ ప్రవర్తనా నియమావళిని అతిక్రమించినట్టు కనబడితే, శిష్యులు తమ నిర్ణయాన్ని మార్చుకుని మరో గురువుకై అన్వేషిస్తారు. అటువంటివారు ఉభయభ్రష్టులవుతారు. కావున శిష్యులు తమ హృదయాలను నిష్కల్మషంగా ఉంచుకుని సహజమైన శాంతి, తృప్తి, సహనాన్ని కలిగి ఉండాలి. సత్త్వగుణ సంపన్నుడైన గురుస్థానం శివస్థానంగా ఎంచి తన హృదయాన్ని పరిపూర్ణంగా గురువుకి అంకితమివ్వాలి. అదే శిష్యుని నిజమైన గురుత్వం. అలాగే గురువు కూడ ‘గురుతత్త్వం’ కలిగి ఉండాలి. తనను పరిపూర్ణంగా విశ్వసించిన శిష్యునికి, తాను పరిపూర్ణంగా ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించాలి. అటువంటివారే సద్గురువులుగా భావించబడతారు.

కొంతమంది, గురువులను మూడు విధాలుగా పేర్కొన్నారు.
 • 1. జన్మదాత (తండ్రి), 2. విద్యాగురువు, 3. మోక్షగురువు.
 • 1. ఉపదేశ గురువు, 2. కులగురువు, 3. జగద్గురువు.
 • 1. మాతా, 2. పితా, 3. ఆచార్యుడు.
ఈ ముగ్గురు గురువులలో విద్య నేర్పే గురువు అధికుడు. జీవుని యాత్రలో గురుయాత్ర గొప్పది. విశ్వామిత్రుడు బాలకులైన రామలక్ష్మణులను వెంటబెట్టుకుని వెళ్ళి అనేక అస్త్రవిద్యలను నేర్పి, బల, అతిబల విద్యలలో వారిని ఆరితేరులను గావించి, వారి సాయంతో నిర్విఘ్నంగా యజ్ఞాన్ని పూర్తి చేసి, అడ్డుగా వచ్చిన తాటకి, మారీచ సుబాహులు హతమారునట్లు చేశాడు. అదొక వనయాత్ర, సాహసయాత్ర లేక విజ్ఞానయాత్ర లేక శుభయాత్ర అని అనవచ్చు.

ఇక జ్ఞానాన్ని అందించే గురువులు ఐదుగురు
 • 1. పంచసంస్కార ప్రదాత, 
 • 2. బ్రహ్మప్రదాత, 
 • 3. ప్రబంధ ప్రదాత, 
 • 4. బ్రహ్మార్థప్రదాత, 
 • 5. పంచమోప్రాయప్రదాత.
ఇక ఆరు విధాలైన గురువులు: 
 • 1. ప్రేరకుడు,
 • 2. సూచకుడు,
 • 3. వాచకుడు,
 • 4. దర్శకుడు,
 • 5. బోధకుడు,
 • 6. శిక్షకుడు.
అనంతరం అష్ట గురువులు:
 • 1. అక్షరాభ్యాసాన్ని చేయించినవారు,
 • 2. గాయత్రీ మంత్రోపదేశాన్ని చేయించినవారు,
 • 3. వేదాధ్యయనం చేయించినవారు,
 • 4. శాస్త్రాభ్యాసం చేయించినవారు,
 • 5. పురాణేతిహాసాలను చెప్పినవారు,
 • 6. మతాచార సంప్రదాయాలను బోధించినవారు,
 • 7. ఇంద్రజాలాది మంత్రబోధకుడు,
 • 8. బ్రహ్మజ్ఞానోపదేశికుడు.
వీరిలో చివరి గురువే (బ్రహ్మజ్ఞానోపదేశికుడు) మోక్షగురువు. మిగిలినవారు సఛ్చీళ జీవనయాత్ర సాగడానికి ఉపయోగపడేవారు.
ఇంకా-
 • 1. బొధగురువు, 
 • 2. వేదగురువు, 
 • 3. నిషిద్ధగురువు, 
 • 4. కామ్యకగురువు, 
 • 5. సూచకగురువు, 
 • 6. వాచకగురువు, 
 • 7. కారణగురువు, 
 • 8. విషిత గురువు అంటూ ఎనిమిది మంది గురువులున్నారు.
1. గూఢుడు, 2. దృఢుడు, 3. ప్రీతుడు, 4. మౌని, 5. సకృత్ కామగతుడు అనే పంచవిధ గురువులున్నారు.

ఇలా గురువుల గురించి ఎన్నో అపురూపమయిన విషయాలున్నాయి. ఇక, లోకంలో అనేకావతారాలున్నాయి. కాని, శ్రీదత్తావతారంలో గురు ప్రభావములు, గురు విలక్షణలు గ్రహింపదగినవి. జగద్గురువు అయిన తనకు కూడా ప్రవృత్తిమార్గాన్ని చూపిన గురువులున్నారని శ్రీగురుదత్తాత్రేయుడు భాక్తవరడుడైన ప్రహ్లాదునితో వివరించినట్లుగా మనకు తెలుస్తోంది.

“ప్రహ్లాదా! నా స్మృతిపథంలో ఉన్నవి అవి, అవి రెండే రెండు గురువులు. అవియే, ఎలా ఉండకూడదో చెప్పింది జుంటీగ. ఎలా ఉండాలో చెప్పింది కొండచిలువ. అనగా, జుంటీగ వైరాగ్యాన్ని నేర్పింది. కొండచిలువ సంతుష్టిని నేర్పింది” అని గూఢాతిగూడమైన గురుతత్త్వాన్ని బోధించాదు దత్తాత్రేయులు.

అలాగే, శ్రీకృష్ణపరమాత్మ ఆవిర్భవించిన యాదవ వంశానికి మూలపురుషుడైన “యదువు” అనే మహారాజునకు ఒకప్పుడు శ్రీఅవధూత దత్తస్వామి దర్శనం లభించింది. వారిలో చీకూచిన్తలేని స్థితిని చూసిన యడురాజు, “స్వామీ! అంతర్గతంగా ఏ ధర్మాన్ని ఆశ్రయించి ఉండటం వలన మీకీ స్థితి లభించింది? దయతో నాకు ఉపదేశించండి” అని అభ్యర్థించాడు.

అతని మాటలోనున్న ఆర్తిని, వినయాన్ని చూచిన శ్రీ అవధూత ఇలా సమాధానమిచ్చారు.

“యదురాజా! నేను లోకాన్ని విస్తృతంగా పరిశీలించి, ఎందరెందరో గురువుల నుండి రవ్వంత జ్ఞానాన్ని సంపాయించాను. రాజా! నాకు ఇరువది నలుగురు గురువులున్నారు. 
జాగ్రత్తగా విను.
 •  1. భూమి, 
 •  2. వాయువు, 
 •  3. ఆకాశము, 
 •  4. నీరు, 
 •  5. అగ్ని ఇవియే పంచభూతాలు. 
 •  6.సూర్యుడు, 
 •  7. చంద్రుడు, 
 •  8. పావురాలు, 
 •  9. అజగరము(కొండచిలువ), 
 • 10. సముద్రము, 
 • 11.మిడత, 
 • 12. తుమ్మెద, 
 • 13. గజము, 
 • 14. మధుహారి (తేనెటీగ), 
 • 15. లేడి, 
 • 16. చేప, 
 • 17. ‘పింగళా’ – అనే వేశ్య, 
 • 18. కురరము (లకుముకిపిట్ట), 
 • 19. బాలుడు, 
 • 20. బాలిక, 
 • 21. శరకారుడు, 
 • 22. సర్పము, 
 • 23. సాలీడు, 
 • 24. పురుగు ఇవి నా గురువులు.
వాటి నుండి గ్రహించినది విను.
 • భూమి నుండి – క్షమా, పరోపకారత్వం
 • వాయువు నుండి – నిస్సంగత్వము, నిర్లేపత్వము
 • ఆకాశము నుండి – సర్వవ్యాపకతత్త్వం
 • జలం నుండి – నిర్మలత్వం, మాధుర్యం, స్నిగ్ధత్వం
 • అగ్ని నుండి – తేజస్సు, ఈశ్వరతత్త్వం
 • ➧ సూర్యుని నుండి – జలగ్రాహి, జలత్యాగియు. లోక బాంధవుడతడు. సర్వలోకాలకు అతడొక్కడే.
 • చంద్రుని నుండి – వ్రుద్ధిక్షయాల రూపుడు, అట్టివి షడ్భావ వికారాలు దేహానికేకాని, తనకు (ఆత్మకు) కావని చంద్రుడు నేర్పించాడు.
 • ➧ పావురాల జంటనుండి – కామక్రోధాలకు వశమైనచో ‘ఆత్మానురాగం’ కోల్పోతారని గ్రహింపు.
 • అజగరము నుండి – దైవికంగా లభించినదానికి తృప్తి చెంది, ఆత్మనిష్ఠ కలడైయుంటుంది.
 • సముద్రం నుండి – తనలో దేన్నీ ఉంచుకోదు. అపవిత్రమైనది కల్మషమైనదియు అనగా అడియోగాతత్త్వం కలది. కామాన్నీ, వికారాన్నీ కూడా తనలో చేరనీయదు. తన మనోభావాన్ని బైటకు పొక్కనీయదు.
 • మిడత నుండి – మ్రుత్యురూపమైన మోహమనెడి జ్వాలాగ్నికి బలియవడం, సుఖమను తలంపుతో మృత్యురూపం పొందుతుంటుంది.
 • తేనెటీగ నుండి – ఏ పూవును కూడ బాధించకుండ తను పొందాల్సినదానిని (మధురమును) పొంది జీవిస్తుంది. యోగి కూడ ఎవరిని నొప్పించకుండా భిక్ష గ్రహించి పోషించుకొంటాడు. ప్రతి పుష్పాన్ని వదలక ఉండటమనేది, ముని ప్రతీ శాస్త్రాన్ని అధ్యయనం చేయడం, నేర్పుతో సారాన్ని గ్రహించడం, కానీ, కూడబెట్టిన మధుసంపద రేపటికిని ఉంచుకొంటే అది పరుల సోత్తగునని గ్రహించదు. అందుకే ముని తాను పొందిన భిక్ష మరునాటికని ఉంచుకొనడు. ఉంచుకొన్నా అది పనికిరానిదవుతుంది కదా!
 • గజం నుండి – తానెంత బలిష్ఠమైనదో, అంట మ్రుత్యురూపమగు మోహంగలది. అనగా స్త్రీలౌల్యం కలది. ఆ మోహంలోపడి తాను ఇతరులకు వశమవుతుంది.
 • మధుహారి నుండి – ఇతరులు కూడబెట్టుకొనిన వస్తువు (మధువు)ను, లోభం చేత న్యాయాన్యాయాలు లెక్కించక, అపహరించువాడు కడు నీచుడు.
 • లేడి నుండి – అమాయకత్వంలో సంగీతంమోజుతో వేటగానికి చిక్కుతుంది, ఋష్యశృంగముని సంగీత నాట్యాలకు భ్రమసి మాయ వలలో పడ్డాడు.
 • చేప నుండి – ‘ఎర’కు (జిహ్వ) చాన్చాల్యంతో ఇంద్రియనిగ్రహం కోల్పోయి గాలానికి చిక్కుతుంటుంది. ‘జిహ్వ’ కానరాని దొంగ కదా!
 • పింగళ నుండి – ధనాశతో కాలహరణం, భౌతిక వాంఛకు శరీరాన్ని భ్రష్టత్వమొనర్చుకొనుట.
 • కురరము నుండి – తనకు ప్రియమైనది, ఇతరులకు ప్రియమైనది లెక్కించక పోటీపడుటలో పొందు దుఃఖము.
 • బాలుడు నుండి – యోగితో సమానుడు. పాప పుణ్యాలు ఎరుగనివాడు. భగవత్ర్పాప్తి వల్ల నిరుద్యముడై ఉంటాడు.
 •  కన్యక నుండి – తనకున్న లేమిని కనబరచకుండా కుటుంబ గౌరవాన్ని కాపాడుకొంటుంది.
 • శరకారుడు నుండి – ఏకాగ్రతను సాధిస్తాడు.
 • సర్పము నుండి – ఈ శరీరం క్షణ భంగురమని, తనకంటూ ఒక గృహము ఏర్పరచుకోదు.
 • సాలెపురుగు నుండి – పరబ్రహ్మతత్త్వం తెలియును. సృష్టిలయములు క్రియస్వరూపి.
 • పురుగు నుండి – రోదచేస్తున్న తుమ్మెదనే చూస్తూ మనస్సనంతయు ఆ తుమ్మెదవైపు లగ్నమొనర్చినా, కొంతసేపటికి, తాను ఆ తుమ్మెద రూపం పొందుతుంది. అనగా భక్తుడు దేనిపై లగ్నమొనర్చునొ అటుల రూపధారి అవుతాడు. ఉదా|| భరతుడు. (శ్రీరాముని తమ్ముడు).
అలాగే, అనకు ప్రతీ అణువు గురువేయని, తనలోని మనస్సే తనగురువని కూడ చాటాడు అవధూత శ్రీదత్తాత్రేయులు. ఇక, ఆచార్యులు జ్ఞానంతో పాటూ సదనుష్టానాన్ని కలిగివుండాలి. అటువంటి ఆచార్యులకు చక్రవర్తియైనప్పటికీ తలొంచవలసిందే. ఆ రోజుల్లో గురువులకు ఈ

క్రింది లక్షణాలు ఉండేవి.
 • ➣ శిష్యవాత్సల్యం
 • ➣ విషయపరిజ్ఞానం
 • ➣ బోధనా కౌశలం
 • ➣ మనస్తత్త్వాన్ని తెలుసుకుని ఉండటం అనే లక్షణం
 • ➣ అందరిపట్ల సమభావాన్ని కలిగి ఉందటం
అయితే, ప్రస్తుత గురువులలో చాలామంది ‘చెవిలో మంత్రం చేతిలో ధనం’ అన్నట్లుగా ఉంటున్నారు. ఇది భవిష్యతరాలకు మంచిది కాదు. శిష్యులు కూడ గురువుల పట్ల భక్తిప్రపత్తులతో మెలగాలి. అప్పుడే మన జీవితానికైన జ్ఞానార్జన లభిస్తుంది.

సంకలనం: నాగవరపు రవీంద్ర

6, మే 2020, బుధవారం

అందము, స్నేహం, ప్రేమ - అందంగా ఎవరు కనబడినా ప్రేమించేయడమేనా - Andam, Sneham, Premaluఅందము, స్నేహం, ప్రేమ - అందంగా ఎవరు కనబడినా ప్రేమించేయడమేనా - Andam, Sneham, Premalu
అందంగా ఎవరు కనబడినా ప్రేమించేయడమేనా!! 
వయసురీత్యా కానీ, చదువురీత్యా కానీ ఇప్పుడిప్పుడే మీరు బయటి ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. మంచి ఉపాధి చూసుకుని జీవితంలో స్వతంత్రంగా నిలదొక్కుకోవడానికి ముందువచ్చే దశ ఇది. 

ఈ దశలో మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసేవి - స్నేహితాలు. స్నేహం చేయడం గొప్పకాదు, దాన్ని నిలబెట్టుకోవడం గొప్ప. ఈ వేళ స్నేహం చేస్తారు, ఎక్కడో ఒక చిన్నదోషాన్ని అడ్డుపెట్టుకుని స్నేహాన్ని చంపేసుకుంటారు. 

దోషంలేని వారెవరుంటారు! ఎక్కడ దోషం ఉందో అదే మాట్లాడాలి తప్ప వ్యక్తి శీలం మొత్తాన్ని గురించి మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు.

కిందటేడాది వచ్చినప్పుడు రామాచారిగారు నాకు గొప్ప మిత్రుడండీ అని పరిచయం చేశాను. ఈ ఏడాది వచ్చినప్పుడు ‘రామాచారిగారేరండీ’ అని అడిగారనుకోండి, ‘‘ఏమో అనుకున్నాను గానీ, ఆయన అంత మంచి వాడు కాదండోయ్, ఇప్పుడు నేనూ ఆయనా మాట్లాడుకోవడం లేదు’’ అన్నాననుకోండి. ఇప్పుడు తప్పు ఆయనది కాదు, నాది. ఎందుకంటే.... స్నేహమంటే కాపాడుకోవాలి. అందరిలో అన్నీ సుగుణాలే ఉండవు. ఏవో బలహీనతలు ఉండొచ్చు. 

స్నేహితుడంటే కోడిపెట్ట పిల్లల్ని కాపాడుకున్నట్లు స్నేహితులను కాపాడుకోవాలి. ఒకవేళ దోషం కనిపిస్తే ఒక్కడిగా ఉన్నప్పుడు అతని లోపాన్ని దిద్ది అతని ఉన్నతికి కారణం కావాలి. ఆయనలో ఉన్న మంచిని పదిమందికీ చెప్పాలి తప్ప, దోషాల్ని కాదు. ఎక్కడో ఒక దోషం కనిపించగానే అతనిపట్ల వ్యతిరేకభావాల్ని పెంచుకుని గతంలోని వాటిని కూడా దుర్భిణీ వేసి వెతికి పట్టుకుని నిందలు వేయడం మన బలహీనతను సూచిస్తుంది.

భావోద్వేగాలు:
ఈ భావోద్రేకాలు ఒక్కొక్కసారి ఎక్కడిదాకా పోతాయంటే... చిన్నచిన్న విషయాలకు చచ్చిపోతానంటాడు. 
 • ➣ పరీక్ష ఫెయిలయ్యాడా చచ్చిపోతాడు. అదా పరిష్కారం ? 
 • ➣ అమ్మ కొట్టింది - ఏట్లో పడిపోయాడు, 
 • ➣ నాన్నగారు కొట్టారు - రైలు కింద తలపెట్టేశాడు, 
 • ➣ టీచర్ దెబ్బలాడాడు - కొండెక్కి కిందకు దూకాడు. 
స్నేహం, ప్రేమ:
ఇక ఎవరైనా లోకంలో అందంగా కనిపిస్తే మనం ప్రేమించేయడమే! కన్నవాడికి ఎన్ని ఆశలుంటాయి? వీడు ప్రేమించాట్ట - ఆ అమ్మాయి ఒప్పుకోలేదట - యాసిడ్ పోసేస్తాడట - లేకపోతే ఐదో అంతస్థు ఎక్కి దూకేస్తాడట! ఎంత అర్థంలేని జీవితం? కంటికి కనబడినవన్నీ కావాలన్నవాడు...

అదో గొప్ప సౌందర్యంగా భావించి, జీవితాంతం నేను సద్భావనతో స్నేహం చేయగల ఉత్తమురాలు అని ఎందుకు సంభావించలేడు? మంచి సంస్కారం ఉంటే మంచి ఆలోచనలొస్తాయి.

ఇవి క్లాసురూములో వింటే వచ్చేవి కావు, జీవితంలో ప్రయత్నపూర్వకంగా అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి. ఇంత ఎమోషనల్ ఫెలో జీవితంలో ఏం సాధిస్తాడు? తన పిల్లలకు కూడా తాను ఎలా ఆదర్శంగా నిలబడగలడు ? ఒక మంచి పొరుగింటి వ్యక్తిగా కానీ, ఒక మంచి అన్నగా కానీ, ఒక మంచి గురువుగా కానీ, ఒక మంచి ఉద్యోగిగా కానీ ఎలా అవుతాడు? ఇంత ఎమోషనల్‌గా ఉంటే తనకు గానీ, తన కుటుంబానికి గానీ ఎలా ఉపయోగపడగలడు?
అలాగే చిన్న కష్టం వచ్చిందనుకోండి. అయిపోతుందనుకున్నాడు... అయిపోలేదు.

మృత్‌పిండంలా నేలవాలిపోకూడదు. మట్టిముద్దను చేత్తో పట్టుకుని ఉన్నప్పుడు అది చెయ్యిజారి కిందపడిందనుకోండి. అది నేలను అంటుకుపోతుంది. అదే... బంతి చేతిలో నుంచి కింద పడితే మళ్ళీ పైకి లేస్తుంది. మనిషి బంతిలా ఉండాలి. అంతేకానీ జీవితంలో ఏదైనా ఒక విషయం అనుకున్నట్లు జరగనప్పుడు బెంగ పెట్టుకోకూడదు. నెల్సన్ మండేలా, మహాత్మాగాంధీ వంటివారి జీవిత చరిత్రలు చదివితే తెలుస్తుంది - మహాత్ముల జీవితాలు వడ్డించిన విస్తళ్ళు కావు. ఎంత కష్టమొచ్చినా వారు నేలపడిపోలేదు. ఒక్క క్షణం నిర్వేదం పొందినా మళ్ళీ పుంజుకుని ముందుకెళ్ళారు.
అందుకే చెబుతున్నా - ఎవరి జీవితంలోనైనా అన్నివేళలా విజయాలే ఉండవు. పడినా లేచి నిలబడడం చేతకావాలి. అలా కావాలంటే - భావోద్రేకాలలో సమతౌల్యత ఉండాలి.

ఆధ్యాత్మిక పురోగతి
ఇక ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా నిరంతరం పురోగతిని సాధిస్తూనే ఉండాలి. ఆధ్యాత్మికత అన్నదానికి మీ స్థాయిలో మీకు బాగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే దానికి పర్యాయపదాలు చెబుతాను - అవి వశవర్తి అగుట, లొంగి ఉండుట. లొంగకపోతే ఆ వ్యక్తి జీవితంలో ఓఋద్ధిలోకి రాలేడు. ఒక ఏనుగు మావటికి లొంగితే, వశవర్తి అయితే దాని కుంభస్థలం మీద భగవంతుడి ఉత్సవమూర్తిని ఉంచి ఉరేగింపుగా తీసుకెడతారు. అది లొంగలేదనుకోండి స్వామిని దింపి, ఆ ఏనుగును తీసుకెళ్ళి ఇనుప గొలుసులతో కట్టేస్తారు.

ఒకసారి ఒక ఏనుగు మాడవీథులలో ఊరేగింపు సమయంలో కట్టుతప్పి విచ్చలవిడిగా ప్రవర్తించినందుకు దానిని వేరుగా ఇనుప గొలుసులతో బంధించి ఉంచారు. తర్వాత దాన్ని అరణ్యంలో వదిలే ఏర్పాటు చేశారు.

ఇంత బుద్ధినిచ్చి, మేధస్సునిస్తే ఎవరికీ లొంగకుండా, ఎవరిమాటకూ వశపడనన్నవాడిని ఏం చేయాలసలు? ఏనుగు కాబట్టి మావటి లొంగేటట్లు చేస్తాడు. మరి మనిషో! మనిషి స్వచ్ఛందంగా వశపడాలి. ఎవరికి వశపడాలి? తల్లికో, తండ్రికో వశపడాలి, అథవా భార్యకయినా వశపడాలి. జీవితాంతం తనతో కష్టసుఖాలు కలిసి పంచుకున్న భాగస్వామి, ఆమెకయినా వశపడాలి. అది క్రమేణా భగవంతుడికి వశపడేటట్లు చేస్తుంది. ఆధ్యాత్మికతకు అసలు అర్థం - భగవంతుడికి వశపడేటట్లు చేయడమే.

అంటే నాకంటే, నా బంధుమిత్రులకంటే, నా చుట్టూ ఉన్న ప్రపంచంకంటే శక్తిమంతుడైనవాడు ఒకడున్నాడని అంగీకరించడం. వాడికి లొంగితే, వాడికి నేను పూర్తిగా వశవర్తి అయితే వాడు ప్రసన్నుడై నాకు పెద్ద దిక్కయి ఉండగా ఇక నాకు ఎదురేముందన్న భావన. దీనితో నీ మీద, నీ శక్తిమీద నీకు నమ్మకం ఏర్పడుతుంది. ప్రతి సంక్షోభంలోనూ నిన్ను చెయ్యిపట్టుకుని క్షేమంగా ఒడ్డుకు చేరుస్తుంది.

వ్యాఖ్యానము: బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు  

29, ఏప్రిల్ 2020, బుధవారం

మానవ జన్మ - ఋషి పరంపర - Manava Janma, Rushi Parampara

మానవ జన్మ - ఋషి పరంపర
ఈ సృష్టి లో 84 లక్షల జీవరాశులున్నాయంటుంది వేదం ఈ జీవరాశులన్నింటినీ నాలుగు తరగతులుగా వర్గీకరించారు.
 • 1. జరాయుజములు - మావితోపుడతాయి.
 • 2. అండజములు -గుడ్డు బద్దలు కొట్టుకుని బయటికి వస్తాయి.
 • 3. స్వేదజములు -చెమట నుండి పుడతాయి, పేలవంటివి.
 • 4. ఉద్భుజములు - భూమిని చీల్చుకుని పైకి వస్తాయి, చెట్లవంటివి.
ఈ నాలుగురకాలైన ప్రాణులలో కొన్ని కోట్ల జన్మలు తిరిగి తిరిగి అంటే పుట్టి చచ్చీ, పుట్టిచచ్చీ, దాన్ని సంసార చక్రం అంటారు. అంటే జననమరణ చక్రమందు తిరుగుట అని. దీనికి అంతుండదు. శరీరం తీసుకోవడం విడిచిపెట్టడం, తీసుకోవడం విడిచిపెట్టడం. ఈ సంసార చక్ర పరిభ్రమణం తాపం అంటే వేడితో ఉంటుంది. ఎందుచేత? అమ్మ కడుపులో పడి ఉండడం అన్నది అంత తేలికయిందేమీ కాదు.
సృష్టి చక్రము
భాగవతంలో "కపిలగీత" చదివితే పుట్టుక ఇంత భయంకరంగా ఉంటుందా! అనిపిస్తుంది. శుక్రశోణితములు కలిసిన దగ్గర్నుంచీ తల్లి కడుపులో బుడగగా ఆకృతి ఏర్పడి, తర్వాత ఆ పిండం పెరిగి పెద్దదై, మెల్లమెల్లగా అవయవాలు సమకూరిన తరువాత తలకిందకు, కాళ్లు పైకీ పెట్టి గర్భస్థమైన శిశువు పడి ఉన్నప్పుడు దానికి నాభిగొట్టం ద్వారా.ఆహారం అంది చైతన్యాన్ని పొంది, జీవుడు అందులోకి ప్రవేశించిన తరువాత సున్నితమైన క్రిములు కరిచేస్తుంటే, తొమ్మిది నెలలు.అమ్మ కడుపులో కటిక చీకట్లో కొట్టుకుని కొట్టుకుని పరమేశ్వరుని ప్రార్థన చేసి, ఆయన అనుగ్రహించి ప్రసూతి వాయువు బయటికి తోసేస్తే అమ్మ కడుపులోంచి బయటికి వచ్చి పడిపోతాడు జీవుడు.

మనుష్యజన్మ ఎత్తడానికి ముందు ఎన్ని కోట్ల జన్మలెత్తాడో! ఆఖరికి చేసుకున్న పాపాలన్నీ చాలా భాగం తగ్గిపోయిన తర్వాత జన్మపరంపరలో పూర్తి చేసుకోవడానికి అవకాశమివ్వబడే చిట్టచివరి అవకాశం మనుష్య శరీరం. ఇదే మనుష్య శరీరానికి ఉన్న గొప్పతనం అంటారు శంకరులు, జననమరణాలు పోగొట్టుకునే అవకాశం ఒక్క మనుష్య శరీరానికి తప్ప మరే శరీరానికి ఉండదు. దానితో ఒక్క మనుష్యుడు మాత్రమే కర్మానుష్ఠానం చేయగలడు.

కర్మలు:
మనుష్యజన్మ వైశిష్ట్యాన్ని అంతసేపు చెప్పి చివరన "కురుపుణ్య మహోరాత్రం" అన్నాననుకోండి. అంటే మంచి కర్మలు చేయండి అన్నప్పుడు మనుష్య శరీరం కానప్పుడు అదెలా సాధ్యం? మనుష్య శరీరం కానిది కేవలం నమస్కారం కూడా చేయలేదు. రెండు చేతులు కలిపి అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు కలిపి తలమీద ఉంచి బుద్దిస్థానాన్ని దానితో కలిపి పదకొండింటినీ భగవంతుని పాదాల వద్ద న్యాసం చేయడం నమస్కారం. ఇలా ఏ ఇతర ప్రాణీ చేయలేదు.

అందుకే అలా కర్మలను చేయుటవలన భక్తితో జీర్ణించిన కారణంచేత ఈశ్వరుని అనుగ్రహం ఏదో ఒకనాటికి కలుగుతుంది. అప్పుడు మోక్షాన్ని పొందుతాడు. అందుకే.. “జంతూనాం నరజన్మ దుర్లభం" అంటారు శంకరాచార్యులు. అంటే మనుష్యుడు కూడా జంతువే. మనుష్యుడు జంతువెలా అవుతాడు? జంతువును సంస్కృతంలో 'పశు' అంటారు. పాశంచేత కట్టబడినది కాబట్టి పశువు అయింది. నాలుగు కాళ్ళు, రెండు కాళ్ళు ఉన్నవే కాదు, శాస్త్రంలో మనుష్యుడు కూడా జంతువుగానే పరిగణింపబడతాడు. ఎందుకంటే తత్త్వాన్నిబట్టి మనకు కూడా ఆ మూడూ ఉంటాయి. అందువల్ల మనల్ని కూడా పశువులు అని పిలుస్తారు అయితే అలా అంటే మనం కాస్త చిన్నబుచ్చుకుంటామేమోనని శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ అదేదో తన మీద పెట్టుకున్నారు.

"ఓ పరమేశ్వరా! నేను పశువుని, నీవు పశుపతివి" అన్నారు. మనకు పశువుకులాగే ఒక శరీరం, మెడలో ఒక తాడు. ఆ తాడు కట్టడానికి ఒక రాయి. మెడలో తాడు అంటే కర్మపాశాలు. కర్మపాశాల చేత జన్మ అనే రాయికి కట్టబడతాడు. అలా కట్టబడి ఉంటాడు కనుక మనిషిని కూడా పశువు అని పిలుస్తారు. ఏ జంతువయినా పాశాలను విప్పుకుంటే యజమాని పట్ల ధిక్కార ధోరణి ప్రదర్శించిందని గుర్తు. కానీ మనుష్యుడి విషయంలో ఇది భిన్నంగా ఉంటుంది.

సర్వేజనా సుఖినోభవన్తు.....

21, ఏప్రిల్ 2020, మంగళవారం

ఓంకారం - Omkaramఓంకారం - Omkaram
ఓం కారం మహత్యం
ప్రతి మంత్రానికి ముందు ‘ఓం’కారం ఉంటుంది. ‘ఓం’కారాన్నే ప్రణవం అని కూడా అంటారు. పరమాత్మను శబ్దరూపంలో ‘ఓం’కారంతో సూచిస్తారన్నమాట. ఏ ప్రార్థన, పూజలైనా ఓంకారంతో మొదలౌతుంది. ఇది ఏకాగ్రతకు, ధ్యానానికి సహాయకారిగా ఉంటుంది. ‘ఓం’కారంలోని ‘అ, ఉ, మ’ అనే అక్షరాలు మూడు అవస్థలైన జాగ్రదవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థలకు అనుభవాలకు సంకేతం. మూడు అక్షరాలు కలిపి ‘ఓం’ కారంగా ఉచ్చరింపబడినపుడు నాలుగవ స్థితియైన తురీయావస్థను చేరుకోవడానికి మార్గం సుగమమవుతుంది.
ఓం కారం
ఓం కారం
స్త్రీలు “ఓం కారాన్ని” చదవరాదని ఒక నియమం పెట్టారు. ఎందుకంటే ఓంకారాన్ని బిగ్గరగా జపించేటప్పుడు దీర్ఘమైన, క్రమమైన, నెమ్మదైన విధానంలో శ్వాసను బ యటకు విడువవలసి ఉంటుంది. ఓంకారంలో ఇలాంటి శబ్ధ తరంగాలు ఉత్పన్నమౌతున్న మద్య భాగంలో గర్భాశయం ఉన్న కారణంగా ఈ శబ్ధ తరంగాలు గర్భాశయాన్ని విరుద్దంగా ప్రభావితం చేయటం,మూత పడిపోవటం వంటివి జరిగే ప్రమాదం ఉంది అని స్త్రీలు “ఓంకారం”జపించరాదనే నియమం పెట్టారు.

న్యూయార్క్‌, క్యాలిఫోర్నియా, బోస్టన్‌లో ధెరపిస్ట్స్‌ ఓంకార నాదంపై ల్యాబరేటరీలలో పరిశోధనలు చేశారు. కడుపునొప్పి, మెదడు, గుండె సంబంధ వ్యాధిగ్రస్తులు ఓంకారాన్ని చేసి రోగ విముక్తురైనారట. ప్రణవ నాదం వల్ల ఉదరం, ఛాతి మెదడులో కదలికలు కల్గి నూతనోత్తేజం కల్గిస్తాయి. న్యూయార్కలోని కొలంబియా ప్రెస్బిస్టీరియన్‌ హాల్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ధెరపిస్టులు రోగులను సర్జరీకి ముందు ఓంకార జపం చేయిస్త్తున్నారు. అంతేకాక, సర్జన్లు, నర్సులలో ఓంకార జపం చేసినందువల్ల 'ఆపరేషన్‌ సస్కెస్‌' ధృడ నమ్మకం కలుగుతుందని తెలియ జేశారు. శరీరంలో ఒత్తిడి పెరిగితే, స్టెరాయిడ్స్‌ శాతం పెరుగుతాయి. ఆపరేషన్‌కు ముందు, తర్వాత ధ్యానం, ఓంకారం చేస్తే, స్టెరాయిడ్స్‌ శాతం గణనీయంగా తగ్గుతాయి. డా||హెర్బర్ట్‌ గత 40 సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్నారు.

శ్రీకృష్ణభగవానుడు శ్రీమద్‌ భగవద్గీతలో 'ఓమిత్యేకాక్షరం బ్రహ్మ శ్లోకంలో ఎవరైతే అంతిమ ఘడియలలో ఓంకారాన్ని జపిస్తారో వారు మోక్షాన్ని పొందుతారన్నారు.సామవేదంలోని సన్యాస ఉపనిషత్తులో 'ఎవరైతే ఓంకార జపాన్ని 12 నెలలు చేస్తారో వారు భగవంతుని సాక్షాత్కారం పొందుతారన్నది. మహర్షివేద వ్యాసుడు 'మంత్రాణాం ప్రణవసేతు: అంటూ అత్యంత ప్రాధాన్యాన్ని ఓం కారానికి కల్పించారు.యజుర్వేదం ఓంకారంలో బ్రహ్మయిమిడి ఉన్నాడన్నది. మహర్షి పుష్కరుడు 'ఎవరైతే ఓం కారాన్ని నాభివరకూ నీటిలో వుండి జపిస్తారో వారి సర్వపాపాలు హరిస్తాయన్నారు.

మానసిక అశాంతిని తొలగించటానికి ప్రణవ నాదం బాగా పనిచేస్తుందనేది సాధకుల ద్వారా విశ దమైనది. నాభినుండి వచ్చే తరంగాలు మొత్తం దేహంపై ప్రభావాన్ని కలుగ జేస్తాయి. నిర్మలమైన ప్రదేశంలో కూర్చొని ఓంకారాన్ని నినదిస్తే, చక్కటి ఫలితాలు లభిస్తాయనేది పరిశోధకులు తేల్చి చెప్పారు. ముఖ్యంగా బ్రహ్మముహూర్తాన, గోధూళివేళ అనగా సాయం సమయాన, రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఓంకారాన్ని జపించాలి.

సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి

పురుషసూక్తం - PurushaSuktamపురుషసూక్తం - PurushaSuktam
పురుషసూక్తం - PurushaSuktam
పురుష అనగా "తత్వం". (పురుషుడు అని అర్ధం కాదు. వివరించే అంశానికి రూపం లేదు, లేదా ఆ రూపాన్ని వివరించే సమానమైన ఉన్నతమైన నామం లేదు. 

పురుష అనేది శక్తి తత్వాన్ని చూపుతుంది). మనం ఈ భూమి పైకి రాక ముందు మన నివాసం అమ్మ. మన ఈ శరీరభాగాలు అమ్మ అందించిన వరాలు. అలాగే ఈ అనంత కోటి గ్రహనక్షత్ర సముదాయం అంత జగదాంబ నుంచి ఉద్బవించాయి.
మనలోని ఈ బలానికి మూలం, కారణం అమ్మ ఎలా అవుతుందో!!!, ఈ సృష్టి యొక్క ఉత్పతి కి కారణం కూడా అమ్మే అవుతుంది!!!.
సృష్టి ఆవిర్బావం వివరణ చేయాలంటే ఒక స్వరూపం కావాలి కనుక విశ్వమాత ఐన జగదాంబను శక్తితత్వంగా గ్రహిస్తున్నాను...పురుష సూక్తంలో పురుష అనే పదం శక్తి యొక్క స్వభావాన్ని,తత్వాన్ని తెలుపునది .ఈ చరాచర జగత్తుని నడిపిస్తున్న శక్తి స్వరూపం ఎలా ఉంటుంది??? అని ప్రశ్నించుకుంటే. దానికి సమాధానం ఈ పురుష సూక్తం!!!. సమస్తం ఇందులో ఉంది.
ప్రారంభం. 
(శ్లో) హరి ఓం||
తచ్చం యోరావృనీ మహే|గాతుం యజ్ఞ్యయా |
గాతుం యజ్ఞయ పతయే|దైవీ స్వస్తిరస్తునః |
స్వస్తిర్మానుషేబ్యహ|ఊర్ద్వమ్ జిగాతు భేషజం |
శంనో అస్తు ద్విపదే|శం చతుస్పదె |
ఓం శాంతిశాంతిశాంతిహీ ||
వివరణ:- అజ్ఞానం చేత కప్పివేయ్యబడి నిర్లక్షం చెయ్యబడిన ఈ విజ్ఞానాంశాన్ని భగవదనుగ్రహం కోసం ఆ స్వరూపం పైన భక్తి,ప్రేమా కలిగేవిధంగా తెలుసుకోవాలి అని నిర్నయించుకుంటూ, శ్లోకజనీత పదములకు అధిపతి వైన నీవు. ఈ శ్లొకార్దరూపం లోని వేడుకోలుకి ప్రసన్నమై నీ కృపాకటాక్ష వీక్షనాలతో నన్ను, ఈ ప్రపంచాన్ని,సమస్త జంతు పశు పక్ష్యాదులను రక్షిస్తూ.నీ అనుగ్రహం తో వాటిని ఆరోగ్యకరంగా ఉంచుము.

విరాట్స్వరూప వర్ణన ప్రారంభం:
సహస్ర శీర్షా పురుషః|సహస్రాక్షః సహస్రపాద్ |
సభూమిం విశ్వతో వృత్వా|అత్యద్ష్ట దశ అంగుళం ||
వివరణ:- ఈ విశ్వం లోని గ్రహాలను,నక్షత్రాలను శిరస్సులుగా. నేత్రములుగా, పాదములుగా కలిగి వెయ్యి తలలు వేల కన్నులు, పాదాలు కలిగి ఉండి.వాటి ద్వారా ఈ ప్రపంచానికి దిక్కులు,ఆకాశం ను కలిగించి ఎల్లప్పుడు ఈ శక్తి స్వరూపం రక్షిస్తూ ఉంటుంది. ఈ శక్తితత్వం యొక్కరూపాలు పదివేళ్ళతో లెక్కపెట్టలేనన్ని సంఖ్యలో ఉంటాయి.

పురుష ఏ వేదాగం సర్వం|
యద్బూతం యత్ చ్చభావ్యం |
ఉతామృతత్వస్యేసానాహా |
యదన్నే నాతిరోహాతీ ||
వివరణ: ఈ శక్తి స్వరూపం లేక శక్తి తత్వం సర్వాన్ని ఆవరించి ఉండి..,. ఏదైతేజరిగిందో, ఏదైతే జరుగుతోందో ఇంకా ఏదైతే జరగబోతోందో అన్నింటికి ఆ శక్తియే కారణమై ఉంటుంది. అన్నం నచ్చక పోయినంత మాత్రాన,తినకపోయినంత మాత్రాన అన్నపదార్దం విషతుల్యం అవ్వదు.నమ్మకపోయినంత మాత్రాన విజ్ఞానం అజ్ఞానం కానేరదు.

ఏతా వానస్య మహిమా |
అతోద్యయాగంశ్చ పురుషః |
పాదోస్య విశ్వా భూతాని |
త్రిపాదస్యామృ తందివి ||
ఆ శక్తి తత్వాన్నికి గల బలం అంతం లేనిది.అంతం లేనట్టి ఆ శక్తి తత్వం ఎల్లప్పుడు విజయాన్నే పొందుతుంది.మహా విశ్వం అంతయు ఆ శక్తి నుంచి ఉద్భవించినదై. నాలుగు వంతులుగా విస్తరించి ఉంది,అందులో ఒక వంతు మన భూలోకం గాను.మిగిలినవి మూడు వంతులు మూడులోకాలగాను ఉద్భవించాయి.

త్రిపాదూర్ద్వా ఉదైత్పురుషః |
పాడో సైహ భావాత్పునః |
తతో విస్వజ్వ్యక్రమాత్ |
సాశనానశనె అభి ||
వివరణ: శక్తి (జగన్మాత) నుంచి ఈ మూడు లోకాలను పాలించుటకు ముగ్గురు అధిపతులు సృష్టించబడ్డారు.వారు సృష్టి స్తితి లయ కారులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు.వీరు సృష్టి,స్తితి,లయ క్రియలు అదుపుచేస్తూ ఈ సమస్త విశ్వాన్ని వారి ఆధీనంలో ఉంచుకుని ఉండటం వలన,ఈ సమస్త విశ్వం వారి ఆజ్ఞానుసారం నడుస్తూ ఉంటుంది.

తస్మాత్ విరాడ జాయత |
విరాజో ఆదిపురుషః |
సజాతో అత్యరిచ్యత ||
పస్చ్చాద్భూమి మదోపురః|
వివరణ : యోగ నిద్ర లో ఉన్న స్తితి క్రియాదిపతి అయిన విష్ణువు నాభి నుంచి ఉద్భవించిన పద్మపు మద్యలో ఉన్న బ్రహ్మ మొదటగా యోగ నిద్ర నుంచి మేల్కున్నాడు(అది పురుషః).బ్రహ్మ ద్వారా భూమి పుట్టుక,ప్రాణి పుట్టుక జరిగింది.మొదట సనక సనందాదులు,బ్రహ్మ మానస పుత్రులు,ప్రజాపతులు వీరి నుంచి దేవతలు ఉద్భవించారు.

యత్పురుషేన హవిషా |
దేవా యజ్నమతన్వత |
వసస్తో అస్యాసిదాజ్యం |
గ్రీష్మ ఇద్మ్స్సరద్దవిహ్ ||
బ్రహ్మ సృష్టి నిర్మాణానికి పూనుకున్నాడు.యజ్ఞం చెయ్యటానికి నిర్ణయించుకుని యజ్ఞం చేయటం ప్రారంభించాడు.ఆ యజ్ఞం నుంచి ముందుగా పంచ భూతాలు ఉద్భవించాయి.ఆకాశం(అంతరిక్షం),భూమి,నీరు,వాయువు మరియు అగ్ని.వీరిని ప్రదాన దేవతలుగా చేసి యజ్ఞాన్నిఅగ్నిమరియు మిగిలిన పంచభూతాల సహాయంతో ఉదృతం చేయసాగాడు.తద్వారా వాతావరణం,ఋతువులు మరియు కాలాలు ఏర్పడ్డాయి.

సప్తాస్యాసన్ పరిధయః|
త్రిస్సప్త సమిధః కృతాః |
దేవా యద్యజ్ఞం తన్వానాః |
అభధ్నన్ పురుషం పశుమ్ ||
వివరణ: యజ్ఞం చెయ్యటానికి సమిధలు,నెయ్యి కావాలి.కావున ఆ కాలంలో సమిధలుగా ఏడుగురు దేవతలు సమిధలు గాను,వసంతం నెయ్యి గాను మారి యజ్ఞ కార్యానికి తొడ్పడినారు.కావున యజ్ఞానికి తోడ్పడిన దేవతల పేరు మీదుగా ఈ ప్రక్రియను పిలవటం జరుగుతుంది.కావున వీరి నుంచి మూడు ఏదుల ఇరవై ఒక సూత్రాలు ఏర్పడినాయి.ఇలా వీరి సహాయం తో యజ్ఞం చేస్తూ బ్రహ్మ కామదేనువు(గోమాత,ఆవు)ను సృష్టించాడు.

తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్|
పురుషం జాత మగ్రతః |
తేన దేవా అయజన్త |
సాధ్యా ఋషయశ్చ యే ||
వివరణ: ప్రాణి పుట్టుక లో భాగం గా యజ్ఞం నుంచి మొదట నీటిలో ద్రవ్య రూపం లోని శైవళం ఏర్పడింది.ఈ శైవళం జాతి క్రమంగా మొక్కల వరకు చెట్ల వరకు అభివృధి చెందింది.తరువాత విజ్ఞులు,దేవతలు యజ్ఞాన్ని కొనసాగించారు.

తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః|
సంభ్రుతం పృషదాజ్యమ్ |
పశూగంస్తాగం శ్చక్రే వాయవ్యాన్|
ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే ||
వివరణ: ఈ యజ్ఞం నుంచియే బ్రహ్మ పక్షులను గాలిలో ఎగరటానికి,పశువులను అడవులలో పెరగటానికి సృష్టించాడు.

తస్మా ద్యజ్ఞాత్ సర్వహుతః|
ఋచః సామాని జజ్ఞిరే |
ఛందాగంసి జజ్ఞిరే తస్మాత్|
యజు స్తస్మా దజాయత ||

ఆ యజ్ఞం నుంచియే మొదట వేదానికి పునాది పడింది.

తస్మా దశ్వా అజాయన్త|
యే కే చోభయా దతః |
గావో హ జజ్ఞిరే తస్మాత్|
తస్మా జ్జాతా అజావయః ||
వివరణ: ఈ యజ్ఞం నుంచి ఒక దవడ లేక రెండు దవడలు దంతాలు గల నెమరువేసే జంతువులు.(గుర్రం,ఒంటె,గొర్రె,మేక మొ..) ఉద్భవించాయి.సమస్త ప్రాణి స్వరూపం,ప్రతి రేణువు,ప్రతి రసాయనం ఈ యజ్ఞం నుంచి శాకోపశాకలుగా పుట్టినవే. ఈ విదంగా యజ్ఞం ద్వారా బ్రహ్మ ఈ భూప్రపంచాన్ని సృష్టించాడు.

సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి

8, ఏప్రిల్ 2020, బుధవారం

పరమాత్మ మనకు ప్రసాదించిన వేదములు, ఉపనిషత్తులు గురించి మీకు తెలుసా? - Vedamulu, Upanishattulu

vedamulu-upanishattulu-gurinchi-telusukondi


యుగములు-వేదములు-ఉపనిషత్తులు- పురాణములు:
కాలము, యుగము రూపములో తిరుగుచున్నది. కావున పరమేశ్వరుడు, ప్రతియుగములోనూ సకలజీవములకు, రక్షణ కల్పించుటకు మానవ మనుగడ, సనాతన ధర్మమార్గములో నడిపించడానికి, మానవ జీవోద్దరణకు, మనకొరకు పరమాత్మ, వేదములను ప్రసాదించాడు.
నాలుగు యుగములలో అనగా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము ఈ మూడు యుగములలో,భగవంతుడు కరచరణాదులతో మానవులతో, కలసి మెలసి జీవించి, మానవ జాతిని ఉద్ధరించాడు. కానీ కలియుగములో,పరమాత్మ కరచరణాదులతో కనిపించడు. కాబట్టి పరమాత్మ మనకు, వేదములను ప్రసాదించాడు. వేదములే మనకు ప్రమాణము. అంతకు మించిన ప్రమాణము లేదు.

ఈ వేదములు నాలుగు కానీ మహాభారతము పంచమ వేదముగా పిలువబడి, వేదములు ఐదుగా విరాజిల్లుచున్నవి. వేదముల నుండి, వేదాంగములు అందుండి ఉపనిషత్తులు, వేదాంతమునకు, భక్తికి, వేదములు ప్రారంభస్థానమైతే, వేదాంతమునకు వేదసారములకు ఉపనిషత్తులు చివరి భాగము.
వేదములు పఠిస్తున్న గణేశుడు - Ganesg Readin Vedas
వేదములు పఠిస్తున్న గణేశుడు
ఉపనిషత్తులు 108. ఈ ఉపనిషత్తులు ఐదు వేదముల నుండి వచ్చాయి.
 1. ఋగ్వేదము నుండి 10 ఉపనిషత్తులు
 2. శుక్ల యజుర్వేదము నుండి 19 ఉపనిషత్తులు
 3. కృష్ణ యజుర్వేదము నుండి 32 ఉపనిషత్తులు
 4. సామవేదము నుండి 16 ఉపనిషత్తులు
 5. అధర్వణ వేదము నుండి 31 ఉపనిషత్తులు = మొత్తం 108
ఈ 108 ఉపనిషత్తులలో ప్రధానమైనవి 12 ఉపనిషత్తులు.
 1) ఈశోపనిషత్తు
 2) కేనోపనిషత్తు
 3) కఠోపనిషత్తు
 4) తైతిరీయోపనిషత్తు
 5) ఐతరేయోపనిషత్తు
 6) ప్రశ్నోపనిషత్తు
 7) ముండకోపనిషత్తు
 8) మాండుక్యోపనిషత్తు
 9) ఛాందోగ్యోపనిషత్తు
10) శ్వేతశ్వతరోపనిషత్తు
11) బృహదారణ్యకోపనిషత్తు
12) మహానారాయణకోపనిషత్తు

ఎనిమిది ఉపప్రధానమైన ఉపనిషత్తులు .
1) కైవల్యకోపనిషత్తు
2) కౌషితకోపనిషత్తు
3) ఆత్మోపనిషత్తు
4) అమృతబిందోపనిషత్తు
5) బ్రహ్మోపనిషత్తు
6) పరమహంసొపనిషత్తు
7) సర్వోపనిషత్తు
8) అరుణేయోపనిషత్తు

ఈ ఉపనిషత్తుల నుండి అష్టాదశ పురాణములు వచ్చాయి. అవీ మన సౌకర్యము కొరకే.
అష్టాదశపురాణములు మూడు భాగములుగా ఉండి ఒక్కో భాగములలో ఆరు పురాణములు.
బ్రహ్మపురాణములు, బ్రహ్మతత్వమును గురించి విష్ణుపురాణములు, విష్ణుతత్వము గురించి
శివపురాణములు, శివతత్వమును గురించి వివరిస్తూ ఉన్నాయి.

విష్ణుసంబంధపురాణములు - 6
 1. భాగవత పురాణము:- 18 వేల శ్లోకముల సముదాయము.
 2. విష్ణుపురాణము:- 23 వేల శ్లోకములతో విష్ణు భక్తుల గురించి, వర్ణాశ్రమధర్మములను,వేదముల యొక్క ఆరు అంగములను, కలిపురుషుని లక్షణాలను, శ్వేతా వరాహ కల్పముల విషయములను తెలియచేయుచున్నది.
 3. నారదీయపురాణము:- 25 వేల శ్లోకములతో వేదాంత ముఖ్యమైన విషయములను, వేదాంత సారములను, పూరీజగన్నాథుడు,ద్వారకానాథుడు, బదరీనాథుల గురించి తెలియచేయుచున్నది.
 4. పద్మపురాణము:- 55 వేల శ్లోకములతో భాగవత, రామాయణ, జగన్నాథ, మత్య్సావతార, భృగు మొదలగు విషయముల గురించి తెలియజేయుచున్నది.
 5. గరుడపురాణము:- 19 వేల శ్లోకములతో భగవద్గీత, జనన మరణ, విష్ణు సహస్రనామముల గురించి తెలియజేయుచున్నది.
 6. వరాహపురాణము:- 24 వేల శ్లోకములతో కూడిన వ్రతరాజముల గురించి విష్ణు మహిమల గురించి తెలియజేయు చున్నది.
II. బ్రహ్మసంబంధపురాణములు-6
 1. బ్రహ్మానందపురాణము:- 12 వేల శ్లోకములతో వేదముల గురించి ఆదికల్పమును గురించి తెలియజేయుచున్నది.
 2. బ్రహ్మవైవర్తపురాణము:- 18 వేల శ్లోకములతో రాధా కృష్ణుల గురించి తెలియజేయుచున్నది.
 3. మార్కండేయ పురాణము:- 9 వేల శ్లోకములతో రామ కృష్ణుల లీలలను గురించి తెలియజేయుచున్నది.
 4. భవిష్యపురాణము:- 14500 శ్లోకములతో కృష్ణ భగవానుని మరియు చైతన్య ప్రభువును గురించి తెలియజేయు చున్నది.
 5. వామనపురాణము:- 10 వేల శ్లోకములతో త్రివిక్రమ స్వామిని గురించి తెలియజేయుచున్నది.
 6. బ్రహ్మపురాణము:- 10 వేల శ్లోకములతో దక్ష ప్రజాపతికి, బ్రహ్మదేవుడు వివరించిన, విషయములను గురించి తెలియజేయుచున్నది.
III. శివసంబంధపురాణములు:-6
 1. మత్స్యపురాణము:- 14 వేల శ్లోకములతో దేవాలయ నిర్మాణములు, అందు పాటించవలసిన నియమములు, వామనావతారము వరాహ కల్పమును గురించి తెలియజేయుచున్నది.
 2. కూర్మపురాణము:- 17 వేల శ్లోకములతో లక్ష్మీ కల్పము, ధన్వంతరి, కృష్ణ సూర్య, సంవాదముల గురించి తెలియజేయుచున్నది.
 3. లింగ పురాణము:- 10 వేల శ్లోకములతో గాయత్రి మాత నృసింహ,జగన్నాథ్, అంబరీషుల గురించి తెలియజేయు చున్నది.
 4. శివపురాణము:- 24 వేల శ్లోకములతో ఆరు సంహితలతో రోమర్పుల గురించి తెలియజేయుచున్నది.
 5. స్కందపురాణము:- 81 వేల శ్లోకములతో తారకాసురవధ, సుబ్రహ్మణ్యస్వామి గురించి తెలియజేయుచున్నది.
 6. అగ్నిపురాణము:- 15400 శ్లోకములతో సాలగ్రామములను గురించి వివరముగ తెలియజేయుచున్నది. మానవ జీవితమును ధర్మమార్గములో నడిపించేవి, నడిపించేందుకు ఆదర్శప్రాయ మైన, ప్రమాణికమైన, గ్రధరాజములు ఇతిహాసములు. ఇతి-హా-అసం 1.శ్రీ రామాయణము  2.మహాభారతము.
మన ముఖ్య ఇతర గ్రంథములు:-
 1) మనుస్మృతి
 2) అర్థశాస్త్రము
 3) ఆగమశాస్త్రము
 4) తంత్రశాస్త్రము
 5) స్తోత్రములు
 6) ధర్మశాస్త్రము
 7) దివ్యప్రబంధము
 8) తివరము
 9) రామచరిత మానస
10) యోగ వాశిష్టము

భక్తి నవవిధములు:-
శ్రీ నారద మహర్షులవారు సెలవిచ్చినవి నవవిధ భక్తి మార్గములు.
1. శ్రవణం
2. కీర్తనం
3. స్మరణం
4. పాద సేవనం
5. అర్చనం
6. వందనం
7. దాస్యం
8. సఖ్యం
9. ఆత్మ నివేదనం

ఇందులో ఒక్కొక్క భక్తి వలన కొంతమంది భక్తులు తరించారు, ముక్తిని పొందారు. ఏ ఏ భక్తి వలన ఎవరు ఎలా తరించి ముక్తిని పొందేరో .........చూడండి

1 శ్రవణం .......... :- వలన పరీక్షిత్ మహారాజు
2 కీర్తనం ......... :- వలన శ్రీ శుకుడు, శ్రీ త్యాగరాజ స్వామి, శ్రీ మదాసు, శ్రీ అన్నమయ్య, శ్రీ తులసీ దాస్
3 స్మరణం ........ :- వలన ప్రహ్లాదుడు
4 పాదసేవనం ....:- వలన లక్ష్మీదేవి
5 అర్చనం ........ :- వలన పృధు మహారాజు
6 వందనం ........ :- వలన అక్రూరుడు, గరుత్మంతుడు
7 దాస్యం ......... :- వలన హనుమంతుడు
8 సఖ్యం .......... :- వలన అర్జునుడు, ఉద్దవుడు,గోపాల బాలురు
9 ఆత్మనివేదనం :- వలన బలి చక్రవర్తి

శ్రీ నారదులవారు చెప్పిన నవవిధ భక్తిమార్గములే కాక
1 మూఢ భక్తి ... :- వలన తిన్నడు
2 కామభక్తి ..... :- వలన గోపికలు
3 భయ భక్తి .... :- వలన కంసుడు
4 వైర భక్తి ....... :- వలన శిశుపాలుడు
5 సంబంధ భక్తి.. :- వలన విష్ణు వంశమువారు, గోపాలురు
6 ద్వేష భక్తి ...... :- వలన హిరణ్యకశిపుడు, జరాసంధుడు
7 ప్రేమ భక్తి........ :- వలన పాండవులు
8 భక్తితో భక్తి..... ..:- వలన నారదుడు
9 వాలిన భక్తి .... :- వలన పోతనామాత్యులు

వీరందరూ భక్తి మార్గములలో సేవించి తరించినవారే. 

నమస్కారములు:
నమస్కారములు చాలా విధములు అందులో

1. సాష్టాంగ నమస్కారము:- ఏడు శరీరాంగములు + మనసు కలిపి ఎనిమిది అంగములు. ఈ ఎనిమిది అంగములు భూమికి తగిలేలా బోర్లాపడి నమస్కరించడమే సాష్టాంగ నమస్కారము.
“ఉరసా, శిరసా, దృష్ట్యా, మనసా, వచసా తధా, పద్భ్యాం కరాభ్యామ్, కర్ణాభ్యామ్, ప్రణామోస్థాంగముచ్యతే”
1కాళ్ళు 2 చేతులు 3 ముక్కు 4 చెవులు 5 ఉదరము 6 కళ్ళు 7 నోరు 8 మనస్సు
ముఖ్యగమనిక:- స్త్రీలు మాత్రము ఈ సాష్టాంగ నమస్కారము చేయరాదు అని వేదములు నొక్కి వక్కాణిస్తున్నాయి. స్త్రీలు కేవలం పంచాంగ నమస్కారము మాత్రమే చేయాలి.

2. పంచాంగ నమస్కారము:- పంచాంగములు 1 అరిచేతులు 2 మోకాళ్లు 3 మోచేతులు 4 పాదములు 5 శిరస్సు.

3. అభివాద నమస్కారము:- ప్రవరతోటి చేయు నమస్కారము. అభివాద నమస్కారము నిలబడి చేయరాదు. పూర్తిగా వంగి పాదముల మీద చేతులు ఉంచి మెల్లగా లేచి నమస్కారము చేయాలి. గురువుగార్లలను, ఆచార్యదేవులను, వేదపండితులను,నిత్యాగ్నిహోత్రులను, వయోవృద్దులను, జ్ఞానవృద్దులను దర్శించినపుడు లేదా వారి దగ్గరకు వెళ్ళినపుడు విధిగా అభివాద నమస్కారము చేయాలి.

4. ప్రణిపాతము:- ఆర్తితో చేయు నమస్కారము. నేలమీదపడి నమస్కారము చేయడము.
“మహృదయ క్షేత్రాలలో భక్తి, అనే బీజాలను నాటండి. దీనిని మనస్సుఅనే నీటితో తడపండి. దానికి నాలుగు దిక్కుల సంత్సంగం అనే కంచె వేయండి. దానివలన కామాది, వికృతరూప, పశువులు రాకుండా ఉంటాయి. మీరీ విధంగా వ్యవహరిస్తే ఆ బీజాలు చిగురించి పంట పండి తర్వాతి కాలంలో శాంతి ఆనందం అనే పంట ఫలాలు మన చేతికి వస్తుంది.”

ఉపనిషత్తులు అంటే ఏమిటి?
వేదములు-అపౌరుషేయాలు. అంటే తపస్సు చేయుచున్న ఋషులకు, పరమాత్మ ద్వారా కేవలం, ఉదాత్త, అనుదాత్త స్వరములతో మాత్రమే వినిపించేవి. వీటికి లిపి లేదు. ఆ వేదములు ఋషుల ద్వారా మానవాళికి, ఆధ్యాత్మిక ధర్మ సంప్రదాయము లకు ముఖ్య సూత్రములు. సనాత ధర్మమునకు జీవనాడులు. ఈ వేద వేదాంగముల సారమే ఉపనిషత్తులు.

ఉప-ని-షత్ అంటే గురువు వద్ద కూర్చొని నేర్చుకోనేది. వీటినే శృతులు అని అంటారు. ఈ ఉపనిషత్తులు 250 పైనే ఉన్నాయి. కానీ వాటిలో 108 మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ 108 లో కూడా ప్రామాణికమైనవి, ప్రాచీనమైనవి 14 మాత్రమే. ఈ 14 ఉపనిషత్తులకు పరమేశ్వరుడు, భూలోకానికి దిగి వచ్చి మన కొరకు ఆచార్యుల రూపాలలో పూజ్యపాద శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరాచార్యులు, పూజ్యపాద శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్యులు, పూజ్యపాద శ్రీ శ్రీ శ్రీ మధ్వాచార్యులు, పూజ్యపాద శ్రీ శ్రీ శ్రీ రమణ మహర్షులు, పూజ్యపాద శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర భారతీ సరస్వతీ స్వామి వారు ఇలా ఎందరో మహానుభా వులు వేదములకు, వేద-వేదాంగములకు, ఉపనిషత్తులకు భాష్యం చెప్పారు.

14 ఉపనిషత్తులు.
1. ఋగ్వేదము :– ఐతరేయ ఉపనిషత్తు, కౌషీతకోపనిషత్తు
2. కృష్ణయజుర్వేదము:- తైత్తరీయోపనిషత్తు, కఠఉపనిషత్తు, మైత్రాయనీయోపనిషత్తు, శ్వేతాశ్వరోపనిషత్తు
3. శుక్లయజుర్వేదము:- ఈశావాశ్యకోపనిషత్తు , బృహదారణ్యకోపనిషత్తు
4. సామవేదము:- ఛాదోగ్య ఉపనిషత్తు, కెనోపనిషత్తు
5. అధర్వణవేదము:- ప్రశ్నోపనిషత్తు, మాండుక్యోపనిషత్తు, ముండకోపనిషత్తు, కైవల్యోపనిషత్తు
ఈ ఉపనిషత్తులలో లేనివి ఈ ప్రపంచంలో లేదు. అన్నీ ప్రశ్నలకు, సమాధానాలకు ఈ వేదాలు ఉపనిషత్తు లు మరియు ఆచార్యులు భాష్యములే ఆధారము. మనిషి తల్లి గర్భ ప్రవేశము నుండి, మరు భూమికి చేరి మరలా జీవుని పరిస్థితిని, కాలగతిని, అన్నీ ఇందులో నిక్షేపింపబడినాయి.
మనకు(దేహానికి) అనారోగ్యము చేసినప్పుడు, డాక్టరుగారి దగ్గరకు వెళ్ళి డాక్టరుచే సూదులు వేయించుకొని డాక్టరుగారు ఇచ్చిన మందులు వాడుతాము కదా? మరి మన జీవికి (ఆత్మకు) వచ్చిన అనారోగ్యము(అంటే అరిషడ్వర్గములు బాధించే బాధలు జరా-మరణ బాధలు) మాటేమిటి? ఈ అనారోగ్యమునకు పూజ, జపము, ధ్యానములే మందులు. ఈ మందుల మోతాదును ఉపయోగించే విధానమును మనకు తెలియచేయు వైద్యుడే గురువు. ఈ విధముగా గురు ఆజ్ఞ మేరకు మనము ఆ మందులను వాడి, ఆ మందులు మన శరీరంలోని అణువు అణువు నిండి నిమిడీకృత మైతే, ఇక మనలో యున్న ఆత్మకు అనారోగ్యము లేదు.

మన శరీరంలో 72 వేల నాడుల ఉంటాయి. 
అందులో 14 నాడులు ముఖ్యమైనవి.:
 1) పింగళ,
 2) ఇడ
 3) సుఘమ్న
 4) సరస్వతి
 5) పూష
 6) వరుణ
 7) సప్తజిహ్వ
 8) యశస్విని
 9) అలంబస
10) కుహు
11) విశ్వోధార
12) పయస్విని
13) గాంధార
14) శుంభి.
ప్రధాన నాడులు. ఇడ,పింగళ, సుఘమ్న. వీటి మూడింటికి త్రిమూర్తులు అధినాయకులు. సుఘమ్న నాడికి కుడిప్రక్క సూర్యనాడి, ఎడమ ప్రక్క చంద్ర నాడి ఉంటాయి. ఈ సూర్య చంద్ర నాడులు కలుపు ప్రదేశమే భ్రూమధ్యము.

ఆజ్ఞాచక్రము:-
సూర్య చంద్ర నాడులు అంతర్ముఖముగా ప్రయాణించి పాలభాగము మీద అర్థ చంద్రాకృతిలో ఉంటాయి. అపుడు రెండు కనుబొమల మధ్య ఉన్న భ్రూకుటికి ఆజ్ఞా చక్రమని పేరు. ఈ ఆజ్ఞాచక్రము నిలబడి తెరుచుకుంటే దివ్యజ్ఞానము ప్రభాసిస్తుంది. దివ్యదృష్టి కలుగుతుంది.
శ్లో || నాస్తిలోభసమో వ్యాధిః | నాస్తి క్రోధసమోరివుః
నాస్థిదారిద్ర్యవత్ దుఃఖం | నాస్తి జ్ఞానాత్ పరం సుఖమ్ ||
లోభాన్ని మించిన వ్యాధి లేదు, క్రోధాన్ని మించిన శత్రువులు లేరు, దారిద్యాన్ని మించిన దుఃఖం లేదు, జ్ఞానాన్ని,తృప్తిని మించిన సుఖం లేదు.

పంచీకరణము పంచభూతపంచీకరణము

1.ఆకాశము 2. వాయువు 3.అగ్ని 4. జలము 5. భూమి

1.ఆకాశము :- ప్రధానముగా తీసుకొని ½ భాగము ఆకాశము, 1/8భాగము వాయువు,1/8 భాగము అగ్ని, 1/8భాగము నీరు, 1/8 భాగము భూమి.
2.వాయువు :ప్రధానముగా తీసుకొనినా ½ భాగము వాయువు, 1/8 భాగము ఆకాశము,1/8 భాగము అగ్ని, 1/8 భాగము నీరు,1/8 భాగము భూమి.
3.అగ్ని:- ప్రధానముగా తీసుకొన్న భాగము అగ్ని, 1/8 భాగము ఆకాశము, 1/8 భాగము వాయువు, 1/8 భాగము నీరు,1/8 భాగము భూమి.
4.జలమును:- ప్రధానముగా తీసుకొనిన 1/2 భాగము జలము, 1/8 భాగము ఆకాశము,1/8 భాగము వాయువు,1/8 భాగము అగ్ని, 1/8 భాగము భూమి.
5. భూమిని:- ప్రధానముగా తీసుకొనిన ½ భాగము భూమి, 1/8 భాగము ఆకాశము, 1/8 భాగము వాయువు, 1/8 భాగము అగ్ని, 1/8 భాగము జలము.

పై విధముగా పంచభూత పంచీకరము జరిపిన ఆభావములు తెలియవచ్చును.
కావున
1) ఆకాశమునకు శబ్దగుణము కలదు
2) వాయువుకు శబ్ద, స్పర్శ రెండు గుణములు
3) అగ్ని శబ్ద,స్పర్శ, రూప గుణములను కలిగి ఉంది.
4) జలమునకు శబ్ద, స్పర్శ, రూప, రస రూపములుంటాయి.
5) భూమికి శబ్ద,స్పర్శ, రూప, రస, గంథములనబడే ఐదు గుణములుంటాయి.

కావున పంచభూతములు ఈ సృష్టిలో,సృష్టిచే శక్తిని పొంది ఉన్నాయి. కావున ఈ సృష్టి అంతా పంచ భూతాత్మకము.ఈ పంచ భూతములను ఆధారముగా తీసుకొని ఇరవై అయిదు తత్వములు ఏర్పడ్డాయి వీనినే పంచ వింశతి తత్వము అంటారు. ఎలాగంటే పంచభూత పంచీకరణము ఆధారంగానే పంచ వింశతి తత్వములు వస్తాయి. పరబ్రహ్మము నుండి ఏర్పడిన ఈ పంచభూత పంచ వింశతిని జాగ్రత్తగా గమనిస్తే మనిషి మనుగడ మానవుని నడవడి అర్థమవుతుంది.

1. ఆకాశము ప్రదానమై రెండు భాగములు చేసిన అందు ½ భాగము ఆకాశధార పరబ్రహ్మము.
మిగిలిన అర్థభాగములో 1/8 వాయువు ఆధారంగా మనసు
మిగిలిన అర్థభాగములో 1/8 అగ్ని ఆధారంగా బుద్ది
మిగిలిన అర్థభాగములో 1/8 జలము ఆధారంగా చిత్తము
మిగిలిన అర్థభాగములో 1/8 భూమి ఆధారంగా అహంకారము

2. వాయువు ప్రధానమై రెండు భాగములు చేసిన అందు ½ భాగము ధారంగా ఉదాన వాయువు
మిగిలిన అర్థభాగములో 1/8 ఆకాశము ఆధారంగా సమానము
మిగిలిన అర్థభాగములో 1/8 అగ్ని ఆధారంగా వ్యానము
మిగిలిన అర్థభాగములో 1/8 జలము ఆధారంగా అపానము
మిగిలిన అర్థభాగములో 1/8 భూమి ఆధారంగా ప్రాణము

3. అగ్ని ప్రధానమైన రెండు భాగములు చేసిన అందు ½ భాగము అగ్ని చక్షువు
మిగిలిన అర్థభాగములో 1/8 ఆకాశము ఆధారంగా శ్రోత్రము
మిగిలిన అర్థభాగములో 1/8 వాయువు ఆధారంగా త్వక్కు
మిగిలిన అర్థభాగములో 1/8 జలము ఆధారంగా జిహ్వ
మిగిలిన అర్థభాగములో 1/8 భూమి ఆధారంగా ఘ్రాణము

4. జలము ప్రధానమై రెండు భాగములు చేసిన అందు ½ భాగము జలరసము
మిగిలిన అర్థభాగములో 1/8 ఆకాశము ఆధారంగా శబ్దము
మిగిలిన అర్థభాగములో 1/8 వాయువు ఆధారంగా స్పర్శ
మిగిలిన అర్థభాగములో 1/8 అగ్ని ఆధారంగా రూపము
మిగిలిన అర్థభాగములో 1/8 భూమి ఆధారంగా గంథము.

5. భూమి ప్రధానమై రెండు భాగములు చేసిన అందు ½ భాగము భూమి గుదము.
మిగిలిన అర్థభాగములో 1/8 ఆకాశము ఆధారంగా వాక్కు
మిగిలిన అర్థభాగములో 1/8 వాయువు ఆధారంగా పాణి
మిగిలిన అర్థభాగములో 1/8 అగ్ని ఆధారంగా పాదము
మిగిలిన అర్థభాగములో 1/8 జలము ఆధారంగా గుహ్యము

ఇలా స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణ శరీరములగుచున్నవి. స్థూల సూక్ష కారణ శరీరముల పైన పరమాత్మ ఉండును.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి