శివతత్వం: భక్తి, ఆత్మశుద్ధి, ధ్యానం, నిరాడంబరత - Shivatatvam

శివతత్వం: భక్తి, ఆత్మశుద్ధి, ధ్యానం, నిరాడంబరత - Shivatatvam
నటరాజుడు
శివతత్వం: భక్తి, ఆత్మశుద్ధి, ధ్యానం, నిరాడంబరత
   నేడు మహాశివరాత్రి...ఏనాడూ భగవన్నామస్మరణ చేయనివారు కూడా ఈ ఒక్కరోజు క్షణం సేపు భక్తితో మనస్పూర్తిగా ‘ఓం నమః శివాయః’ అంటూ పంచాక్షరీ మంత్రం జపిస్తే చాలు ఆత్మశుద్ధి, పాపహరణ జరుగుతుందని పెద్దలు చెపుతారు. సూక్షంలో మోక్షం అంటే ఇదేనేమో? ఏమీ తెలియని భక్త కన్నప్ప తన చిన్నబుర్రకు తోచినట్లు శివయ్యకు భక్తితో పూజలు చేసినందుకు మోక్షం పొందాడు. ఇంత సులువైనది శివపూజ.

ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల..చితశుద్ధి లేని శివపూజలేలయా..? అనే పెద్దల మాటను మరిచి చాలా మంది కేవలం పుణ్యం, మోక్షం సంపాదించుకోవాలనే తపనతో పూజాపునస్కారాలు చేస్తుంటారు. పరమేశ్వరుని భక్తి భావంతో పూజలు చేయాలి తప్ప కోర్కెల జాబితాలను మనసులో చదువుకొంటూ కాదు. క్షణం పాటు భగవన్నామస్మరణ చేసినా ఆ భగవంతుని రూపాన్నే మనసులో ప్రతిష్టించుకొని భక్తితో ధ్యానం చేయడం చాలా ముఖ్యం. శివుని తపోముద్ర, నిర్వికారమైన లింగాకారం రెండూ సూచిస్తున్నవి అవే. కనుక ఎంత అట్టహాసంగా శివపూజలు చేశామని కాక ఎంత భక్తితో చేశామనేదే ముఖ్యం. శివతత్వం చెపుతున్న మరోవిషయం నిరాడంబరత. సకలజగత్తును శాసిస్తున్న ఆ మహాశివుడు ఒక యోగిగా మనకు కనబడటంలో పరమార్ధం అదే. సామాన్య మానవులమైన మనం బంధాలు, ఆశలు, కోర్కెలకు అతీతంగా జీవించలేకపోవచ్చు కానీ ఈ శివతత్వం అర్ధం చేసుకొని నిరాడంబరతను అలవరచుకొంటే దానిలో నుంచే ఆత్మానందం..ఆత్మశుద్ధి..చివరికి మోక్షప్రాప్తి కలుగుతాయి. 

ఓం నమః శివాయః, ఓం నమః శివాయః, ఓం నమః శివాయః....

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top