నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

నూతన విశేషాలు !

latest
randomposts3

హిందూ ధర్మం

హిందూ ధర్మం/block-2

సంస్కృతి

సంస్కృతి Culture/block-2

భక్తి

భక్తి - Bhakti/block-5

ధర్మ సందేహాలు

ధర్మ సందేహాలు/block-1

సంప్రదాయం

సంప్రదాయం/block-8

ఆలయం

ఆలయం-Temple/block-9

- ఆర్ఎస్ఎస్ -

ఆర్ఎస్ఎస్

Latest Articles

3, డిసెంబర్ 2020, గురువారం

సార్వజనీనం.. గురునానక్ సందేశం - Baba Guru Nanak

సార్వజనీనం.. గురునానక్ సందేశం - Baba Guru Nanak
– అనంత్ సేథ్
బాబా నానక్ గా గుర్తింపు పొందిన గురునానక్ ఈ దేశంలో ఉద్భవించిన మహోన్నత తత్వవేత్తలు, కవులు, సామాజిక సంస్కర్తలు, ఆధ్యాత్మిక గురువులలో ఒకరు. ఆయన 1469 లాహోర్ దగ్గర రాయ్ భోయికి తల్వండీ (దీనినే ఇప్పుడు నాన్ కానా సాహిబ్ అని అంటున్నారు) గ్రామంలో జన్మిచారు. ఆయన జన్మించిన ఇంటిలోని గది నేడు నాన్ కానా సాహిబ్ గురుద్వారా ప్రధాన స్థానం(గర్భగుడి) అయింది.
   చిన్నతనం నుంచి గురునానక్ ఎక్కువ సమయం ధ్యానంలోనే గడిపేవారు. సనాతన ధర్మాన్ని సమూలంగా నాశనం చేయాలని ఇస్లాం మతఛాందసవాదులు అనేకరకాలుగా ప్రయత్నిస్తున్న సంక్షుభిత కాలంలో ఆయన జీవించారు. అలాగే అప్పుడే భక్తి ఉద్యమం ద్వారా హిందుసమాజంలో అంతర్గత సంస్కరణ సాగుతోంది. `నా దేవుడు, నా దారి’(మతమౌఢ్యం) అనే ధోరణికి, `నీ దేవుడు, నీదైన దారి’(సమన్వయం, సహనశీలత) అనే ఆలోచనకు మధ్య సంఘర్షణ జరుగుతున్న రోజులవి.  చేరుకునేందుకు అనేక మార్గాలు ఉన్నా భగవంతుడు మాత్రం ఒక్కడే (పవిత్ర గురుగ్రంథ్ సాహెబ్ లోని ప్రారంభ వచనం – ఇ(ఎ)క్ ఓంకార్) అని గురునానక్ బోధించారు.

గురునానక్ తన జీవిత కాలంలో అనేక ప్రాంతాలలో పర్యటించారు. తూర్పున అసోమ్, దక్షిణాన శ్రీలంక, ఉత్తరాన టిబెట్, పశ్చిమాన బాగ్ధాద్ వరకు ఆయన పర్యటించారు.  భాయి బాల, భాయి మర్దానా (ముస్లిం) అనే తన ఇద్దరు శిష్యులతో ఆయన సుదూర ప్రాంతాలకు కూడా వెళ్ళి(ఈ సుదూర ప్రయాణాలను పంజాబీలో ఉద్దసి అంటారు. ఈ మాట నుంచే ఆంగ్ల పదం ఒడిసి వచ్చిఉండవచ్చును) అక్కడ సాధుసంతులు, మహాపురుషులను కలుసుకుని శాస్త్ర చర్చ చేసేవారు.
   తన మొదటి ఉద్దసి(1499-1507) పర్యటనలో గురునానక్ నేటి పాకిస్తాన్, భారత్ లోని దాదాపు అన్నీ ప్రాంతాలను చూశారు. రెండవ ఉద్దసి (1507-1514)లో ఆయన అయోధ్య శ్రీరామజన్మభూమి (1511), అలాగే దక్షిణ భారతంలోని అనేక ప్రాంతాలు, శ్రీలంకలకు వెళ్లారు. మూడవ ఉద్దసి(1514-1518)లో ఉత్తర భారతంలో కాశ్మీర్ తో సహా నేపాల్, సుమర్ ప్రభాత్, టిబెట్, సిక్కిం మొదలైన ప్రాంతాల్లో పర్యటించారు. నాలుగవ ప్రయాణంలో (1519-1521) పశ్చిమాన ఉన్న మక్కా, మదీనా, బాగ్దాద్ తో సహా పలు మధ్య ప్రాచ్య ప్రాంతాలకు వెళ్లారు. ఇంత సుదూర, సుదీర్ఘ పర్యటనలు చేసిన ప్రవక్త ప్రపంచంలో మరొకరు ఎవరూ లేరు. తన పర్యటనల ద్వారా ప్రజలను ఆధ్యాత్మిక మార్గం వైపు మరల్చాల్సిన భగవంతుని అనుజ్ఞ, ఆదేశాన్ని(హుకుం) ఆయన నిర్వర్తించారు.
   ఆయన తన పర్యటనలలో హిందువులు, బౌద్ధులు, జైనులు, ముస్లింలు, జొరాష్ట్రియన్ లు మొదలైన అనేక మతాలకు చెందిన వారిని కలిసేవారు. పవిత్ర హృదయంతో, నిస్వార్ధంగా భగవంతుని సేవించాలనే ఆదర్శాన్ని అనుసరించిన ప్రముఖ భక్తుడు సంత్ కబీర్ ను కలిసిన గురునానక్ కొంతకాలం ఆయనతోపాటు ఉన్నారు. అటు పండితులు, ఇటు పామరులతో కూడా ఆయన చర్చలు జరిపారు.
   తన బోధలు చేసేందుకు ఆయన పంజాబీ భాషను ఉపయోగించారు. మొదట్లో ఆయన అనుచరులు ఖత్రి కులానికి చెందినవారే ఉండేవారు. కానీ ఆ తరువాత ఆయన బోధనల ప్రభావానికి లోనై అన్నీ కులాలు, వర్గాలకు చెందినవారు ఆయన అనుచరులు, శిష్యులు అయ్యారు. ఆయన పంజాబీ భాష , కవితలు, గీతాలు, సంగీతం ద్వారా ఏకత్వాన్ని బోధించారు. మూఢచారాలు, మూఢనమ్మకాలను వదిలి వివేకం, బుద్ధి ఉపయోగించాలని ఆయన ప్రజలను ప్రోత్సహించారు. దేశ, కాలాలకు అతీతంగా విశ్వజనీనమైన సందేశాన్ని ఆయన ఇచ్చారు. ఆయన కాలంలోనే భారత్ చుట్టుపక్కల ప్రాంతాలు, ఇరాన్, ఇరాక్ వంటి సుదూర ప్రాంతాల్లో కూడా ఆ సందేశం చేరింది.

నాలుగవ ఉద్దాసి తరువాత గురునానక్ 1521లో కర్తార్ పూర్ చేరుకున్నారు. గృహస్తాశ్రమంలో ప్రవేశించారు. తన శిష్యులకు సూచించిన నామ్ జపో (దేవుడి నామాన్ని తలుచుకో), కీరత్ కరో (భజన చెయ్యి), వంద్ చక్కో (పంచుకో) అనే సూత్రాలను స్వయంగా ఆచరించారు. భగవంతుని కీర్తనలను గానం చేయడం, లంగర్ (సామూహిక ఆన్నదాన కార్యక్రమం) నిర్వహించడం రోజువారీ కార్యక్రమంగా ఉండేది.
   లంగర్ (సామూహిక ఆన్నదాన కార్యక్రమం) 1500 సంవత్సరంలో గురునానక్ ప్రారంభించిన వినూత్నమైన, సమానత్వాన్ని ప్రబోధించే సేవాకార్యక్రమం. దీని ద్వారా ప్రజల్లో భేదభావాలను తొలగించడానికి ఆయన ప్రయత్నించారు. దేవాలయాల్లో కూడా నిత్యాన్నదాన సత్రాలు నిర్వహించడం పురాతన కాలం నుంచి వస్తున్నదే. గుప్తుల సామ్రాజ్యంలో ఈ పద్దతి మరింత ప్రముఖంగా కనిపిస్తుంది. వీటికి వివిధ ప్రాంతాల్లో సత్రం, చౌల్ట్రీ, ఛత్రం అనే వేరువేరు పేర్లు ఉండేవి.
   గురునానక్ ఉపదేశాలు (వీటిని గురు ఆర్జన్ సమీకరించిన ఆది గ్రంథ్ లో చేర్చారు) కేవలం మతానికి చెందినవేకాక సామాజిక, కుటుంబ, ఇతర విషయాలకు సంబంధించినవి కూడా ఉన్నాయి. ఆయన సామాజిక సమానత, స్త్రిపురుష సమానత్వం వంటి విషయాలను బోధించారు. కులతత్వం, నిరంకుశ రాజ్యాధికారం వంటివాటిని నిరసించారు. వంద్ చక్నా(పంచుకునే తత్వం) వంటి భావనలు అనేకమంది దురాశాపరులకు నచ్చేవి కావు. ఆయన సతి ఆచారాన్ని కూడా నిరసించారు. అహంకారాన్ని తగ్గించుకునేందుకు సేవా మార్గాన్ని మించినది లేదని ఆయన బోధించారు. అది మనిషికి నైతిక, ఆంతరిక శక్తిని ఇస్తుందని ఆయన చెప్పారు.  ఆయన బోధనలను అనుసరించే గురుద్వారాల వద్ద సేవ చేసే పద్దతి వచ్చింది.
   గురునానక్ జయంతిని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా గురుగ్రంథ్ సాహిబ్ ను పఠించడం, గురునానక్ విశ్వజనీన సందేశాన్ని అనుసరించే ప్రయత్నం చేయడం ఆయనకు సరైన నివాళి అవుతుంది. భగవంతుడే అంతిమ, శాశ్వత సత్యం అని ఎవరు ఘోషిస్తారో వారికి శాశ్వత, పరమపదం లభిస్తుంది(జైకారా జో బోలె సో నిహాల్… సత్ శ్రీ ఆకాల్ ) అనే సందేశాన్ని మనమంతా గుర్తుపెట్టుకుందాం.

___ విశ్వ సంవాద కేంద్రము

ఇస్లామిక్ దేశంలో పాఠ్యాంశంగా 'భగవద్గీత' - Bhagavad Gita as a subject in the Islamic country

ఇస్లామిక్ దేశంలో పాఠ్యాంశంగా 'భగవద్గీత' - Bhagavad Gita as a subject in the Islamic country
దుబాయిలో భగవద్గీత ని సిలబస్ గా  పెట్టుకొని ఏకంగా పరీక్షలే రాస్తున్నారు. అంటే భగవద్గీత ఎంత గొప్పదో తెలుసుకోండి  అంత గొప్పది కాబట్టే దుబాయ్ లో సైతం భగవద్గీత చదువుకుంటున్నారు. చదివిస్తున్నారు. పరీక్షలు రాస్తున్నారు. 
కానీ! హిందూ ధర్మం సనాతన ధర్మం అయినటువంటి మన భారతదేశంలో మాత్రం చాలా మంది యువకులు గాని  పెద్దమనిషులు గాని భగవద్గీత చదవట్లేదు. అంతేకాకుండా UKG నుండి PG వరకూ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్ని బుక్సుల్లోనూ క్రీస్తు కీర్తి, అల్లా అనుగ్రహం వంటి పాఠ్యాంశాలే!!! మన చదువుల్లో ఎక్కడా భగవద్గీత ప్రస్తావనే లేదు, భగవద్గీత మతం కాదు. సనాతన ధర్మం. కాబట్టి! మన చదువులో కూడా భగవద్గీత పెట్టాలి.
భారతీయ సనాతన ధర్మాన్ని తెలుసుకోండి... నువ్వు ఆచరించు.... ఇతరుల చేత ఆచరింప చెయ్ ...

__హైందవ సేన

2, డిసెంబర్ 2020, బుధవారం

కాశీలో దేదీప్యమానంగా ‘దేవ దీపావళి’ - 'Deva Diwali' in Kashi

రమ పవిత్రమైన కాశీ మహాక్షేత్రం దీప కాంతుల నడుమ దేదీప్యమానంగా వెలిగిపోయింది. గంగానది ఘాట్ల వద్ద వెలిగించిన 15 లక్షల దీపాలతో వారణాసి నగరం మిరుమిట్లు గొలిపింది. ప్రధాని నరేంద్రమోడీ మొదటి దీపాన్ని వెలిగించి ‘దేవ దీపావళి’ వేడుకను ఆరంభించారు. ఆయన వెంట ఉత్తరప్రదేశ్ ‌ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఉన్నారు. మోడీ తర్వాత ఘాట్లలో ఏర్పాటు చేసిన దీపాలను అనేక మంది భక్తులు వెలిగించారు. ఆ కాంతుల నడుమ కాశీని చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు!

ఏటా కార్తీక పౌర్ణమి రోజున కాశీలో దేవ దీపావళిని జరుపుకోవడం ఆనవాయితీ. ఈ ఏడాది ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట కాశీ విశ్వేశ్వర లింగానికి ఆయన పూజలు చేశారు. వేద పండితులు ‘శ్రీ రుద్రం’ చదవగా గంగాజలం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పండ్లరసాలతో మహాదేవుడిని అభిషేకించారు. ఆ తర్వాత రాజ్ ఘాట్ కు వెళ్లి మొదటి దీపాన్ని వెలిగించి దేవ దీపావళిని ఆరంభించారు. కళాకారుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, లేజర్‌ షోను వీక్షించారు. గంగా నదిలో బోటులో విహరిస్తూ ప్రజలకు అభివాదం చేశారు. అంతకుముందు ఆయన సంత్‌ రవిదాస్ కు నివాళి అర్పించారు.


కోవిడ్‌-19 వల్ల దేశంలో అనేక మార్పులు వచ్చినప్పటికీ కాశీ ప్రభ, భక్తి, శక్తిలో ఎలాంటి మార్పులేదని ప్రధాని మోడీ అన్నారు. వందేళ్ల క్రితం చోరీకి గురైన అన్నపూర్ణా మాత విగ్రహాలు తిరిగి భారత్ కు వస్తున్నాయని తెలిపారు. ఇదో గొప్ప అదృష్టంగా పేర్కొన్నారు. ఆ విగ్రహాలు మన అమూల్యమైన వారసత్వంలో భాగమని ఆయన వెల్లడించారు.

__ విశ్వ సంవాద కేంద్రము

తెగువ, సాహసంతో ఒక గ్రామాన్నే కాపాడిన ఆర్ ఎస్ ఎస్ స్వయంసేవక్ - RSS volunteer who bravely and courageously saved a village

RSS volunteer who bravely and courageously saved a village
నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన శ్రీ కేతా శ్రీధర్ రెడ్డి (వెంకటేశ్వర్లు రెడ్డి) ఓ స్వయంసేవక్ (కొత్తపల్లి సంఘమండల కార్యవాహ). నివర్ తుఫాన్ సృష్టించిన విధ్వంసంలో ఒంటరిగా అత్యంత ధైర్యసాహసాలు, తెగువ ప్రదర్శించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. కొత్తపల్లి-కచ్చిరిదేవరాయపల్లి మార్గంలో కొమ్మలేరు ఉధృతి( 51/2అడుగులు) ఒకవైపు, పెన్నా(3లక్షల క్యూసెక్కులు) ఉధృతి మరో వైపు. ఆ రెండు గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయ్. రాక పోకలు ఆగిపోయాయ్. ప్రభుత్వాధికారులు సహాయక చర్యలు చేపట్టడానికి కూడా ఆ గ్రామాలకు చేరుకోలేని పరిస్థితి.

ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ప్రభుత్వాధికారులు, సిబ్బంది, గ్రామస్థులు అందరూ వద్దన్నాకూడా, ఒంటరిగా ముందుకు నడుస్తూ, పోలీసు, ప్రభుత్వ శాఖలకు మార్గదర్శనం చేస్తూ ముందుకు సాగిపోయారు శ్రీధర్ రెడ్డి. కచ్చిరిదేవరాయపల్లి గ్రామానికి చేరుకుని సుమారు 200మందిని కొత్తపల్లి పునరావాస కేంద్రానికి చేర్చారు. తన స్నేహితులతో కలిసి 27 సాయంత్రంనుండి 29సాయంత్రం వరకు తమ స్వంత నిధులతో పునరావాస కేంద్రంలోని వారికి అన్నివసతులూ సమకూర్చారు. గ్రామాల పర్యవేక్షణకు వచ్చిన రాష్ట్ర మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి విషయం తెలుసుకుని శ్రీ శ్రీధర్ రెడ్డిని ప్రశంశించారు. ఆర్ఎస్ఎస్ అంటే సమాజహితం కోసమేనని మరోసారి నిరూపించారు శ్రీ శ్రీధర్ రెడ్డి.__విశ్వ సంవాద కేంద్రము (ఆంధ్రా)

28, నవంబర్ 2020, శనివారం

భారత రాజ్యాంగం హిందూ హృదయం - Bharata Rajyangam - Constitution of India is Hindu of Heart

భారత రాజ్యాంగం హిందూ హృదయం - Bharata Rajyangam - Constitution of India is Hindu of Heart
వ్యక్తులు, వర్గాల స్వేచ్ఛాయుతమైన సమ్మతిపై ఆధారపడిన ఏ ప్రజాస్వామిక వ్యవస్థ అయినా స్వీయ నాగరకతా విలువలను ప్రతిబింబించాలి. శతాబ్దాలుగా భారత్‌లో విలసిల్లిన సామాజిక, సాంస్కృతిక విలువలు, విధానాలను హిందుత్వంగా సాక్షాత్తు సుప్రీంకోర్టు గుర్తించడం సాధారణమైన విషయం కాదు.

ఈ దేశపు సామాజిక, రాజకీయ, ఆర్థిక, ధార్మిక వ్యవస్థకు మూలం హిందుత్వం అని ప్రతి నిత్యం నిర్థారణ అవుతున్నా దానిని కాదనడం సెక్యులరిస్టులమని చెప్పుకునే వారికి అలవాటు. అయితే హిందుత్వపు ప్రాతిపదికను స్వాతంత్య్రోద్యమ నాయకులు అందరూ గుర్తించారు, గౌరవించారు. అందువల్లనే స్వతంత్ర భారతంలో రూపుదిద్దుకొనే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ విలువలను ఇమిడ్చారు. ప్రజాస్వామిక, సహనశీల హిందుత్వ విలువలే ఈ దేశపు భిన్నత్వాన్ని కాపాడి ప్రజాస్వామిక రాజ్య వ్యవస్థను ఏర్పరచగలవని వారు నమ్మారు.
   హిందువులు అధికసంఖ్యాకులుగా ఉన్నా ఇతర మతాలవారి హక్కులకు ఎలాంటి ముప్పు ఏర్పడదని విశ్వసించారు. అందుకనే రాజ్యాంగంలో ఎక్కడా ‘సెక్యులర్‌’ అనే పదాన్ని చేర్చలేదు, వాడలేదు. (1977 ఇందిరాగాంధీ కాలంలో రాజ్యాంగ సవరణ ద్వారా సెక్యులర్‌, సోషలిస్ట్‌ అనే రెండుపదాల్ని మూల పీఠికలో చేర్చారు. అప్పటి వరకు ఆ పదాలు రాజ్యాంగంలో లేవు). ప్రపంచంలో ఎక్కడైనా ముస్లిముల సంఖ్య పెరిగినప్పుడు అక్కడ ఇస్లామీకరణ, మతరాజ్య స్థాపన జరిగాయన్నది అందరికీ తెలిసిన సత్యం. అలాగే హిందువులు ఎక్కువగా ఉన్నచోట్ల ప్రజాస్వామ్య విలువలు, స్వేచ్ఛ, రాజకీయ సెక్యులరిజానికి పూర్తి అవకాశం ఉంటుందన్నది కూడా నిరూపితమైన నిజం. అందుకు కారణం ఆయా నాగరకతలకు చెందిన ఆదర్శాలు, లక్ష్యాలే తప్ప సంపద, పాశ్చాత్య జోక్యం వంటివి కాదు. రాజ్యాంగ సభ ఆమోదించిన రాజ్యాంగపు తుది ప్రతిని పరిశీలిస్తే హిందూ వారసత్వాన్ని రూపకర్తలు గుర్తించినట్లే కనిపిస్తుంది. రాజ్యాంగంలో ఇరవై రెండు రేఖా చిత్రాలు ఉన్నాయి. వాటి జాబితాను చూస్తే ఆసక్తికరమైన అనేక విషయాలు తెలుస్తాయి.
  ముస్లిం యుగానికి ముందు కాలానికి సంబంధించిన చిత్రాల్లో మొహంజొదారో ముద్ర, వైదిక ఆశ్రమం (గురుకులం), లంకపై రాముని యుద్ధం, గీతోపదేశం, బుద్ధభగవానుడు, మహావీరుడు, ధర్మప్రచారం, హనుమంతుడు, విక్రమాదిత్యుని ఆస్థానం, నలందా విశ్వ విద్యాలయం, ఒరిస్సాకు చెందిన శిల్పం, నటరాజ విగ్రహం, గంగావతరణ దృశ్యం మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ హిందూ సాంస్కృతిక విలువల్ని ప్రతిబింబించే చిత్రాలే. ఇవన్నీ దుష్టశిక్షణ, కర్తవ్యపరాయణత్వం, సేవాభావం, మానవత్వం, జ్ఞానం, ధర్మపరాయణత్వం వంటి హిందూ జీవన విలువల్ని చూపుతాయి. మధ్యయుగానికి ప్రతీకగా ఒరిస్సాకు చెందిన హిందూ శిల్పం, నటరాజ విగ్రహం, భగీరధుని తపస్సు, గంగావతరణాల చిత్రాలు తీసుకున్నారు. అంటే అప్పటి వరకు హిందూ పరంపర, సంస్కృతి అవిచ్ఛిన్నంగా సాగాయని రాజ్యాంగకర్తలు గుర్తించారు. ఆ తరువాత ముస్లిం యుగం ఈ అవిచ్ఛిన్న పరంపరను అడ్డుకుందని కూడా వాళ్ళు సూచించారు.
ఈ సాంస్కృతిక భావనే వివిధ రాజ్యాంగపు గుర్తులు, ప్రభుత్వ సంస్థల ఆదర్శ వాక్యాలలోనూ కనిపిస్తుంది. పార్లమెంటులో స్పీకర్‌ కుర్చీకి పైన ‘ధర్మచక్ర ప్రవర్తనాయ’ (ధర్మచక్రాన్ని తిప్పుటకొరకు) అని చెక్కి ఉంటుంది. ‘ధర్మ’ భావన హిందూ సంస్కృతిలో తప్ప మరెక్కడా కనిపించదు. (దీనిని మతంగా పొరబడు తుంటారు). అలాగే  ‘లోక ద్వార మపావార్ను పశ్యేమ వయం త్వా’ (ఛాందోగ్యోపనిషత్తు) (ప్రజాశ్రేయస్సు కొరకు ద్వారాన్ని తెరచి వారికి ఉదాత్తమైన సార్వభౌమత్వ పథాన్ని చూపించు) అని ప్రవేశ ద్వారం వద్ద రాసి ఉంటుంది. ఇక సెంట్రల్‌ హాల్‌ దగ్గర ‘అయం నిజ| పరోవేతి గణనా లఘు చేతసాం, ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం (పంచతంత్రం) (నావాళ్ళు, ఇతరులు అంటూ ఆలోచించటం సంకుచిత మార్గం. ఉదారశీలురైన వారికి సమస్త జగత్తు ఒకటే కుటుంబం) అని ఉంటుంది. సభలోని ఒక గుమ్మటం లోపలి వైపున ‘న సా సభా యత్ర న సంతి వద్ధా| , వృద్ధా| న తే యే న వదంతి ధర్మం, ధర్మ| స నో యత్ర న సత్యమస్తి, సత్యం న తద్‌ యచ్ఛలమభ్యుపైతి (మహాభారతం) (పెద్దలు లేని సభ సభ కానేకాదు, ధర్మానికి అనుగుణంగా మాట్లాడనివారు వృద్ధుడే కాదు. సత్యం లేనిదే ధర్మం నిలువజాలదు. ఏ సత్యమైనా సరే వంచనకు, కపటత్వానికి తావు లేనిదిగా ఉండాలి) అని రాసి ఉంటుంది. ఇక రెండవ గుమ్మటం లోపల ‘సభా వా న ప్రవేష్టాయ వక్తవ్యం వా సమంజసం, అబ్రువన్‌ విబ్రువన్‌ వాపి, నరో భవతి కిల్విషి (మనుస్మృతి) (సభలో ప్రవేశించకుండా ఉండడమో, లేక అందులో ఉంటే ధర్మానుగుణంగా మాట్లాడటమో చేయాలి. అసలు మాట్లాడనివారు, లేదా అసత్యంగాను, అధర్మంగానూ మాట్లాడేవారు పాపం చేస్తున్నట్లే) అని ఉంటుంది. ఇవే కాక అనేక ఆదర్శవాక్యాలు, సూక్తులు పార్లమెంటు గోడలపై కనిపిస్తాయి. ఇవన్నీ హిందూ సాంస్కృతిక విలువలేనని వేరే చెప్పక్కరలేదు.

(లోకహితం సౌజన్యం తో) - విశ్వ సంవాద కేంద్రము