నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

- ఆర్ఎస్ఎస్ -

ఆర్ఎస్ఎస్
ఆలయం-Temple లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆలయం-Temple లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, సెప్టెంబర్ 2020, శనివారం

ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం - Dwadasa Jyotirlinga Darshanam


ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం - Dwadasa Jyotirlinga Darshanam

శ్లో|  సౌరాష్ట్రదేశే విశదేరమ్యే జ్యోతిర్మయం చంద్రకలావతంసం
భక్తి ప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే
శ్రీశైల శృంగే విబుధాతిసంగే తులాద్రితుంగే పి ముదావసంతమ్
త మర్జునం మల్లికా పూర్వమేకం నమామి సంసార సముద్ర సేతుమ్

అవంతికాయం విహితావతారం ముక్తిప్రదానాయ ఛ సజ్జనానామ్
అకాల మృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశమ్

కావేరికా నర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ
సదైవ మాంధాతృపురే వసంతామోంకార మీశం శివమేకమీడే
పూర్వోత్తరే ప్రజ్జ్వలికా నిదానే సదా వసంతం గిరిజాసమేతం

సురాసురారాధిత పాదపద్మం శ్రీవైద్యనాథం తం మహం నమామి
యామ్యే సదంగే నగరేతి రమ్యే విభూషి తాంగం వివిధైశ్చభోగైః
సద్భక్తిముక్తి ప్రదమీశ మేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే

మహాద్రిపార్శ్వే చ తటేరమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః
సురాసురైర్యక్ష మహోరగాద్యైః కేదారమీశం శివమేకమీడే
సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరీతీర పవిత్ర దేశే
యద్దర్శనా త్పాతకమాశునాశం ప్రయాతి తం త్ర్యంబకమీశమీడే
సుతామ్రపర్ణీ జలారాశియోగే నిబధ్యసేతుం విశిఖై రసంఖైః

శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి
యం ఢాకినీ శాకినికా సమాజే నిషేవ్యమాణం పిశితాశనైశ్చ
సదైవ భీమాది పడ ప్రసిద్ధం తం శంకరం భక్తిహితం నమామి

సానంద మానంద వనే వసంత మానందకాండం హతపాపబృందం
వారాణసీనాథ మనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే
ఇలాపురే రమ్యవిశాలకేస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యం

వందే మహోదారాతర స్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రప్రద్యే
జ్యోతిర్మయ ద్వాదశలింగకానం శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ
స్తోత్రం పఠిత్వామనుజోతి భక్త్యాఫలం తదాలోక్య నిజం భజేచ్ఛ ||

జ్యోతిస్వరూపుడైన మహేశుడు ఈ పవిత్ర భారతావనిలో పన్నెండుచోట్ల జ్యోతిర్లింగ స్వరూపంలో వెలసి భక్తులను కరుణిస్తున్నాడు. 

భారతదేశంలోని నాలుగుదిక్కులలో పన్నెండు జ్యోతిర్లింగాలున్నాయి. సముద్రపుఒడ్డున రెండు (బంగాళాఖాతాతీరంలో రామేశ్వరలింగం, అరేబియా సముద్రతీరాన సోమనాథలింగం) పర్వత శిఖరాలలో నాలుగు (శ్రీశైలంలో మల్లిఖార్జునుడు, హిమాలయాలలో కేదారేశ్వరుడు, సహ్యాద్రి పర్వతాలలో భీమశంకరుడు, మేరుపర్వతాలపై వైద్యనాథలింగం) మైదాన ప్రదేశాలలో మూడు (దారుకావనంలో నాగేశ్వరలింగం, ఔరంగాబాద్ వద్ద ఘృష్ణేశ్వర లింగం, ఉజ్జయినీ నగరంలో మహాకాళేశ్వర లింగం) నదుల ఒడ్డున మూడు (గోదావరీతీరాన త్ర్యంబకేశ్వర లింగం, నర్మదాతీరాన ఓంకారేశ్వరుడు, గంగానదీతీరాన విశ్వేశ్వరుడు). ఇలా మొత్తం పన్నెండు జ్యోతిర్లింగ రూపాలలోనున్న ఈ లింగాలు పరమశివుని తేజస్సులు. 

ఇవి ద్వాదశాదిత్యులకు ప్రతీకలు. పదమూడవ లింగం కాలలింగం. తురీయావస్థను పొందిన జీవుడే కాలలింగము. 

తైత్తీరీయోపనిషత్తుననుసరించి:
 •  1. బ్రహ్మ 
 •  2. మాయ 
 •  3. జీవుడు 
 •  4. మనస్సు 
 •  5. బుద్ధి 
 •  6. చిత్తము 
 •  7. అహంకారాము 
 •  8. పృథ్వి 
 •  9. జలము 
 • 10. తేజస్సు 
 • 11. వాయువు 
 • 12. ఆకాశం – ఈ పన్నెండు తత్త్వాలే పన్నెండు జ్యోతిర్లింగాలు. ఇవన్నీ ప్రతీకాత్మకంగా మన శరీరంలో ఉన్నాయి. 
ఖాట్మండులోని పశుపతినాథలింగం ఈ పన్నెండు జ్యోతిర్లింగాలకు శిరస్సు వంటిది. ఈ జ్యోతిర్లింగాలలో ఒక్కొక్క జ్యోతిర్లింగానికి ఒక్కొక్క మహిమ ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించినా, స్పృశించినా అనేక మహిమలు మన జీవితాలలో ప్రస్ఫుటమవుతుంటాయి. పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకోలేనివారు, కనీసం ఒక్కలింగాన్నైనా దర్శించగలిగితే అనంతకోటి పుణ్యం లభిస్తుందనేది పెద్దలవాక్కు.


సోమనాథ జ్యోతిర్లింగం - Samanata Temple
సోమనాథ జ్యోతిర్లింగం - Samanatha Temple 

1. సోమనాథ జ్యోతిర్లింగం

స్వామి సోమనాథునిగా వెలసిన కథ స్కాంద పురాణంలో ఉంది.

బ్రహ్మదేవుని మానసపుత్రుడైన దక్షప్రజాపతికి అశ్విని నుంచి రేవతి వరకు 27 కుమార్తెలున్నారు. తన కుమార్తెలను చంద్రునికి ఇచ్చి ఘనంగా అం జరిపించాడు దక్షుడు.
అయితే చంద్రుడు రోహిణిని మాత్రం అనురాగంతో చూస్తూ, మిగిలినవారిని అలక్ష్యం చేయసాగాడు. మిగిలినవారు తండ్రితో ఈ విషయాన్ని మొరపెట్టుకోగా, దక్షుడు అల్లుడైన చంద్రుడిని మందలిస్తాడు. అయినప్పటికీ, చంద్రుని ప్రవర్తనలో మార్పురాకపోవడంతో, క్షయరోగగ్రస్తుడవు కమ్మని చంద్రుని శపిస్తాడు దక్షుడు. ఫలితంగా చంద్రుడు క్షీణించ సాగాడు.

చంద్రకాంతి లేకపోవడంతో ఔషధాలు, పుష్పాలు ఫలించలేదు. ఈ పరిస్థితిని చూసిన సమస్తలోకవాసులు, తమ కష్టాలు తీరేమార్గం చూపమని బ్రహ్మ దేవుని ప్రార్థించారు. బ్రహ్మ ఆదేశాన్ననుసరించి ప్రభాసక్షేత్రంలో మహామృత్యుంజయ మంత్రానుష్ఠానంగా శంకరుని అస్థరాధించిన చంద్రుదు, పార్థివలింగాన్ని ప్రతిష్టించి పూజించగా, శంకరుడు ప్రత్యక్షమై, చంద్రుని రోగ విముక్తుని గావించి, కృష్ణపక్షంలో చంద్రకళలు రోజు రోజుకీ తగ్గుతాయనీ, శుక్లపక్షంలో దిన మొకకళ చొప్పున పెరుగుతుందని అను గ్రహించాడు. ఆనాటి నుండి చంద్రుని కోరిక మేర, అతని కీర్తిదశదిశలా వ్యాపించేందుకై చంద్రుని పేరుతో సోమనాథునిగా, కుష్టు వంటి మహా రోగాలను తగ్గించే సోమనాథ జ్యోతిర్లింగరూపునిగా పార్వతీదేవిసమేతంగా వెలసి భక్తులను కరుణిస్తున్నాడు.

సోమనాథ ఆలయం సమాచారం కోసం సంప్రదించండి:
Shree Somnath Trust
 • ➛ C12/A,Om Villa Flats,Nr. Telephone Exchange,Next to Om Tower,F.C.I. Godown Road,Shahibaug, AHMEDABAD-380004.GUJARAT, INDIA.
 • ➛ Phone and Fax No : +91-79-22686335
 • ➛ Phone No : +91-79-22686442,
 • ➛ Email : somnathshahibaug@gmail.com
 • ➛ Shri. Vijay Vasante
 • ➛ Mobile : +91-99982 37189
మల్లిఖార్జున జ్యోతిర్లింగం - Srisailam Mallikarjuna Swamy
మల్లిఖార్జున జ్యోతిర్లింగం - Srisailam Mallikarjuna Swamy

2. మల్లిఖార్జున జ్యోతిర్లింగం

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కోపోద్రిక్తుడై తల్లిదండ్రులను వదలి, క్రౌంచపర్వతానికి చేరుకోగా, కుమారుని వదలిఉండలేని పార్వతీపరమేశ్వరులు ఈ ప్రాంతంలోనే ఆగిపోయారని పురాణ కథనం. అందుకే ‘శ్రీశైల శిఖరాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండద’ని అంటారు. అలాగే పర్వతుడనే ఋషి తపఃఫలంగా పరమశివుడు ఇక్కడ లింగపూరమ్లో ఆవిర్భవించాడని మరోకథనం.
కాశ్యాంతు మరణాన్ముక్తిః స్మరణా దారుణాచలే
దర్శనాదేవ శ్రీశైలే పునర్జన్మ న విద్యతే ||

కాశీ క్షేత్రంలో మరణం, అరుణాచలంలో భగవన్నామస్మరణం, శ్రీశైలంలో లింగ దర్శనం ముక్తిదాయకాలు. కృతయుగంలో హిరణ్యకశిపుడు, త్రేతాయుగంలో రావణ సంహారానంతరం శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగంలో అరణ్యవాసానంటరం పాండవులు, శ్రీశైలానికి వచ్చి భ్రమరాంబ సమేత మల్లిఖార్జునస్వామివారిని దర్శించుకున్నట్లు పురాణకథనం. సీతారాములు రామసహస్రలింగం, సీతాసహస్రలింగాలను ప్రతిష్టించినట్లు ప్రసిద్ధి. ఈ కలియుగంలో ఆదిశంకరాచార్య, ఆచార్యనాగార్జునుడు, కృష్ణదేవరాయలు, ఛత్రప్రతి శివాజీ వంటివారెందరో స్వామిని దర్శించుకుని పూజలు జరిపించారు.

శ్రీ శైలం ఆలయ సమాచారం కోసం సంప్రదించండి:
Srisaila Devasthanam,
 • ➛ Srisailam - 518101,
 • ➛ Kurnool (Dt),
 • ➛ Andhra Pradesh (State).
 • ➛ E-Mail : eo@srisailamonline.com, endow-eosri@gov.in
 • ➛ ఫోన్ నంబర్లు: S.T.D CODE : 08524 - 8333901351, 8333901352, 8333901353, 8333901354, 8333901355


మహాకాలేశ్వర జ్యోతిర్లింగం - Mahakal Temple Ujjain
మహాకాలేశ్వర జ్యోతిర్లింగం - Mahakal Temple Ujjain

3. మహాకాలేశ్వర జ్యోతిర్లింగం - ఉజ్జయిని

పరమేశ్వరునికి అత్యంత ఇష్టం. ఈ భూమిపైనున్న సిద్ధక్షేత్రాలలో నైమిశారణ్యం – పుష్కరం – కురుక్షేత్రం ముఖ్యమైనవి.

కురుక్షేత్రం కంటే పదిరెట్లు కాశీ పుణ్యప్రదమైనది. కాశీ కంటే మహాకాలవనం పదిరెట్లు గొప్పది. తీర్థాలలో అత్యుత్తమైనది ప్రభాసం – శ్రీశైలం – దారుకావనం. వీటన్నిటికంటే మహాకాలవనం గొప్పది. ఎందుకంటే, స్మశానం – ఏడారి – పొలం – పీఠం – అరణ్యం అంటూ ఐదు ఉన్న ప్రదేశం ఉజ్జయిని. పూరవం వేదప్రియుడనే శివభక్తునికి దేవ ప్రియుడు, ప్రియమేధుడు, సుకృతుడు, ధర్మవాహి అనే నలుగురుకుమారులుండేవారు.

ఈ నలుగురు కూడ శివభాక్తులే. ఇదిలాఉండగా, రత్నమాల పర్వతంపై నివసిస్తున్న దూషణా సురుడనే రాక్షసుడు, వీరి పూజలకు ఆటంకాన్ని కలిగిస్తూ, అందరినీ హింసిస్తూ ఉండేవాడు. ఆ రాక్ససుని బాధలను తట్టుకోలేని అన్నదమ్ములు పార్థివలింగాన్ని ప్రతిష్టించి పూజించాగా, శివుడు మహాకాలుడై ఆవిర్భవించి, దూషణాసురుని, అతని సైన్యాన్ని భస్మం చేసాడు. అప్పట్నుంచి ఉజ్జయినీ నగరంలో విలసిల్లుతున్న మహాకాలేశ్వరుడు త్రిభువన లింగాలలో ప్రసిద్ధునిగా వెలుగొందుతున్నాడు.

మహాకాలేశ్వర ఆలయ సమాచారం కోసం సంప్రదించండి:
Shree Mahakaleshwar Temple
 • ➛ E-mail: office@mahakaleshwar.nic.in
 • ➛ Tel.: 0734-2550563
 • ➛ Dharmshala: 0734-2551714, 0734-2585873, IT: 0734-2551295

ఓంకారేశ్వర జ్యోతిర్లింగం - Omkareswar Jyothirlinga
ఓంకారేశ్వర జ్యోతిర్లింగం - Omkareswar Jyothirlinga 

4. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం

ఒకసారి వింధ్యపర్వతం తనకంటే గోప్పవారెవరూ లేరని విర్రవీగురుచుండగా, నీకంటే మేరుపర్వతం గొప్పమహర్షి దని నారదమహర్షి చెప్పగా, కుపితుడై, ఓంకార క్షేత్రానికివెళ్ళి శివదేవుని పార్థివలింగాన్ని భక్తితోపూజిస్తూ తపస్సు చేసాడు. శివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకొమ్మనగా, వింధ్యుడు ‘స్వకార్యాని సాధించుకునే శక్తిని ప్రసాదించ’ మని వేడుకున్నాడు. శివుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు. అప్పుడు సమస్త దేవతలంతా స్వామివారిని ఓంకారేశ్వారంలో కొలువై ఉండమని ప్రార్థించారు. వారి కోరికను మన్నించిన స్వామి ప్రాణవాకారంలో ఓంకారేశ్వరునిగా కొలువైయ్యాడు.

ఇదిలాఉండగా, శివునినుంచి వరాన్నిపొందిన వింధ్యుడు, వరగర్వంతో ఎంతో ఎత్తుకు పెరిగి సూర్యచంద్రుల గమనానికి కూడ అడ్డుతగులసాగాడు. వింధ్యుని చేష్ట వలన సమస్తలోకాలు అంధకారంలో తల్లడిల్లాయి. అప్పుడు దేవతల మొరలను ఆలకించిన పరమేశ్వరుడు వింధ్యుని గర్వమణచమని అగస్త్యమునిని పురమాయించాడు. అగస్త్యుని రాకను గమనించిన వింధ్యుడు మర్యాద పూర్వకంగా తన ఎత్తును తగ్గించి గౌరవించగా, తాను తిరిగి వచ్చేంత వరకు ఎత్తు పెరగకుండా ఉండమని దక్షిణాదికి వెళ్ళి మరలా ఉత్తరాదికి వెళ్ళలేదు అగస్త్యుడు. ఫలితంగా వింధ్యుడు ఎత్తు పెరుగలేదు.

ఓంకారేశ్వర ఆలయ సమాచారం కోసం సంప్రదించండి:
Shree Omkareswar Temple
 • ➛ Omkareshwar, Khandwa Omkareshwar, Madhya Pradesh 451115, India
 • ➛ సంప్రదించండి: +91 72802 71228, +91-7280-271228
 • ➛ వెబ్ సైట్:  www.shriomkareshwar.org

వైద్యనాథ జ్యోతిర్లింగం - Baba Baidyanath Dham
వైద్యనాథ జ్యోతిర్లింగం -  Baba Baidyanath Dham

5. వైద్యనాథ జ్యోతిర్లింగం

వైద్యనాథ జ్యోతిర్లింగ విషయంలో అనేక భేదాభిప్రాయాలున్నాయి. మహారాష్ట్ర పర్లీ గామంలోనిదే అసలైన జ్యోతిర్లింగమని, గణా ఖేడలోనిలింగం, పంజాబ్ కీరాగ్రామం లోని లింగం, హిమాచల్ ప్రదేశ్ లోని పఠాన్ కోట్ కు సమీపంలో లింగం, కర్ణాటకలోని గోకర్ణ లింగం…ఇవన్నీ శివుని ఆత్మలింగాలేనన్న వాదన బలంగా ఉంది.

అయితే జార్ఘండ్ వైద్యనాథమ్ లో వెలసినదే అసలైన జ్యోతిర్లింగమని విజ్ఞుల వాదన. పూర్వం రావణాసురుడు కఠోరానియమాలతో, ఒక చేట్టుకుండా అగ్ని గుండాన్ని ఏర్పరచి, పార్థివలింగాన్ని ప్రతిష్టించి, శివపంచాక్షరీమంత్రంతో, హవాన కార్యక్రమంతో నిష్ఠతో ప్రార్థించగా, శివుడు రావుణుడు కోరికననుసరించి తన ఆత్మలింగాన్ని ప్రసాదించాడు. అయితే ఆ లింగాన్ని భూమికి తాకించిన వెంటనే అక్కడే  స్థిరపడుతుందని హెచ్చరించాడు.

ఆత్మలింగంతో లంకానగారానికి తిరుగు ప్రయాణమైన రావణుడు సంధ్యావందనం చేసేందుకు ఒక పశువుల కాపరికి (దేవతల కోరికపై వినాయకుడు ఈ వేషాన్ని ధరించాడు) లింగాన్ని ఇవ్వగా, ఆ కాపరి ఆత్మలింగాన్ని కిందపెడతాడు. ఫలితంగా ఆ లింగం అక్కడే స్థిరపడిపోతుంది. రావణుడు ఎంతగా ఆ ఆత్మలింగాన్ని పెకలించి లంకానగారానికి తీసుకెళదామని ప్రయత్నించినప్పటికీ ఫలితం ఉండదు.

వైద్యనాథ్ దేవాలయంలో ఒక విశేషం ఉంది. సాధారణంగా శివాలయ మందిర శిఖరంపై త్రిశూలం ఉంటుంది. కానీ, ఈ ఆలయ మందిర శిఖరంపై పంచాశూలం ఉంది. మరి ఏ ఇతర జ్యోతిర్లింగ ఆలయాలలో ఇలాంటి అమరిక లేదు. పంచాక్షరీమంత్రంగా కలిగిన పంచముఖ శివునకు పంచప్రాణాలు అంతర్నిహితంగా కలిగిన శివతత్త్వమే ఇందులోని గూడార్థం.

వైద్యనాథ ఆలయ సమాచారం కోసం సంప్రదించండి:
Baba Baidyanath Dham
 • ➛ Mr. Vishal Sagar, SDO-cum-Temple Incharge, Baba Baidyanath Mandir, Deoghar,
 • ➛ Phone : +91 6432 232295 (Temple)
 • ➛ Mr Anand Kumar Tewari, Assistant Temple Incharge,
 • ➛ Mobile: +91 9430322655
 • ➛ Mr Ramesh Kumar Parihast, Temple Manager,
 • ➛ Mobile: +91 8986563071
 • ➛ Fax: (91-6432) 232967
 • ➛ Email: dcdgr@rediffmail.com, contact@babadham.org
 • ➛ వెబ్ సైట్: www.babadham.org

నాగేశ్వర జ్యోతిర్లింగం - Nageshwar jyotirlinga
నాగేశ్వర జ్యోతిర్లింగం - Nageshwar jyotirlinga

6. నాగేశ్వర జ్యోతిర్లింగం

పశ్చిమ సముద్ర తీరాన, దారకుడనే రాక్షసుడు, ‘దారుక’ అనే తన భార్యతో కలసి ప్రజలను చిత్రహింసలకు గురిచేయసాగాడు. యజ్ఞయాగాదులను నాశనం చేస్తూ, ముని జనులను హింసించసాగారు. వీరి హింసను తట్టుకోలేని ఋషులు ఔర్వమహర్షికి విన్న విన్చుకున్నారు. ఔర్వమహర్షి ఆ రాక్షస దంపతులను సతీసమేతంగా మరణించునట్లుగా శపించాడు. ఆ మునిశాపం భూమి పై పనిచేస్తుంది.

కనుక, రాక్షసదంపతులు సముద్రమధ్యంలో నివాసమేర్పరచుకుని సముద్రయానం చేసేవారిని పీడించసాగారు. ఇలా కనబడిన ప్రయాణీకులందరి ధనవస్తువులను అపహరిస్తూ చెరసాలలో బంధించసాగారు. అలా బంధింపబడినవారిలో సుప్రియుడొకడు. ఇతడు పరమ శివ భక్తుడు. రాక్షసబాధలను తట్టుకోలేక సుప్రియుడు ఆర్తనాదం చేయగా, దివ్యతేజః పుంజము కళ్ళు మిరిమిట్లు గోలుపునట్లు ప్రకాశించింది. ఆ కాంతికి దారుకునితోపాటు సమస్త రాక్షసులు నేలకొరిగారు. అక్కడ పరమశివుడు నాగారూపమై జ్యోతిర్లింగమై వెలిసాడు. ఈ స్వామిని దర్శించి, సేవించుకున్నవారికి శాశ్వత పుణ్యలోకవాసం సిద్ధిస్తుందని ప్రతీతి.

నాగేశ్వర ఆలయ సమాచారం కోసం సంప్రదించండి:
 • ➛ Daarukavanam, Dwarka, Gujarat 361345, India
 • ➛ contact: +91-79-23977200

కేదారేశ్వర జ్యోతిర్లింగం - Kedarnath Alayam
కేదారేశ్వర జ్యోతిర్లింగం - Kedarnath Alayam

7. కేదారేశ్వర జ్యోతిర్లింగం

ఒకప్పుడు బదరికావనంలోని నరనారాయణులు అత్యంత నిష్ఠాగరిష్టులై తపస్సు చేయసాగారు. వారు కేదారక్షేత్రానికెళ్ళి మందాకినిలో స్నానం చేస్తూ, పార్థివలింగాన్ని ప్రతిష్టించి పూజ చేయసాగారు. వారి తపస్సును మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా, జ్యోతిర్లింగరూపంలో వెలసి, జనులను గర్భవాసనరకమునుంచి తొలగించి ముక్తిని ప్రాసాదింపమని ప్రార్థించారు.

ఈ క్షేత్రం అత్యంత ప్రాచీనమైనది. నరనారాయణులు, పంచపాండవులు, ఉపమన్యుమహర్షి, ఆదిశంకరులవారు ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించుకున్నట్లు ఆధారాలున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఏడవదిగా ప్రసిద్ధి పొందిన ఈ కేదారేశ్వరలింగం హిమాలయాలపై సముద్రమట్టానికి 11,760 అడుగుల ఎత్తులో ఉంది. కే

దారేశ్వర జ్యోతిర్లింగం లింగాకారంకాక పట్టక రూపంలో ఉంటుంది. స్వామిని భక్తులు తాకి అభిషేకాలు చేస్తుంటారు. వైశాఖ శుద్ధ పాడ్యమి మొదలు ఆశ్వయుజ బహుళ చతుర్దశి వరకు ఆరుమాసాలు మాత్రమే ఆలయం తెరచి ఉంటుంది. దీపావళి రోజున స్వామికి నేతితోవెలిగించిన దివ్యజ్యోతి ఆరుమాసాల తరువాత తెరచినప్పటికీ వెలుగుతూకనిపిస్తుంది. ఆరునేలలపాటూ ఆలయంమూసి ఉన్నసమయంలో కొండదిగువన ఉర్విమఠంలో స్వామి కొలువై భక్తులకు దర్శనమిస్తుంటాడు. ఇక్కడ స్వామి అర్చనకై బిల్వ దళాలు దొరకనందున రుద్రప్రయాగ నుండి బ్రహ్మకమలాలను తెప్పించి పూజ చేస్తారు.

ఇక్కడ ఆమవారైన కేదార గౌరి ఆలయానికి దక్షిణం వైపు సింహద్వారముంది. ఆలయ సభామంటపంలో నంది, పాడవులు, ద్రౌపది, కుంతి, శ్రీకృష్ణ భగవానుని విగ్రహాలున్నాయి. దేవాలయం పైభాగంలో కనిపించే మూడు శిఖరాలు త్రిశూలాన్ని తలపిస్తాయి. దేవాలయానికి ఎనిమిది దిక్కులలో రేతకుండం, శివకుండం, భృగుకుండం, రక్తకుండం, వహ్ని కుండం, బ్రహ్మతీర్థం, హింసకుండం, ఉదక కుండం అంటూ అష్టతీర్థాలున్నాయి. స్వామికి అభిషేకం చెసేందుకు ఇక్కడ గంగనీరు దొరకదు. కాబట్టి, భక్తులు హరిద్వార్, రుద్రప్రయాగ వంటి చొట్ల నుండి సీసాలలొ గంగను పట్టుకెళ్ళి స్వామికి అభిషేకం చెయిస్తుంటారు.

కేదారేశ్వర ఆలయ సమాచారం కోసం సంప్రదించండి:
Shri Kedarnath Dhaam
 • ➛ Omkareswar Temple,
 • ➛ Post Ukhimatt, District Rudraprayag, Uttarakhand
 • ➛ Contact Number- 01364-284228


త్రియంబకేశ్వర్ జ్యోతిర్లింగం - trimbakeshwar temple
త్రియంబకేశ్వర్ జ్యోతిర్లింగం - Trimbakeshwar temple

8. త్రియంబకేశ్వర్ జ్యోతిర్లింగం

ఈ క్షేత్రాన్ని త్రిసంధ్యాక్షేత్రమని కూడ పిలుస్తారు. త్రియంబకేశ్వరుడు స్వయంభువు. అమ్మవారు త్రియంబకేశ్వారి. స్వామివారి ఆకృతి విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ పానవట్టం మధ్యలో లింగం ఉండదు.

ఆ స్థానంలో రుబ్బురోలు లోపలిభాగంవలె గుంటతో లోతుగా ఉంటుంది. పరమశివుడు త్రిమూర్త్యత్మకంగా, త్రిగుణాత్మకమన్నట్లు మూడు భాగాలుగా ఉంటుంది. వనవాసంలోనున్న శ్రీరామచంద్రులవారు సీతా, లక్ష్మణ సమేతంగాగా పంచవటిలో పర్ణశాలను నిర్మించుకుని ఉంటుండగా, లంకేశ్వరుని సోదరి శూర్పణఖ శ్రీరాముని కామించాగా, అందుకు తగిన ప్రాయశ్చిత్తంగా లక్ష్మణుడు ఆమె ముక్కుచెవులను కోసి, ఇంటిదారి పట్టించాడు.

శూర్పణఖ ముక్కు (నాసిక) కోసిన ప్రాంతమే నేడు ‘నాసిక్’ గా పిలువబడుతోంది. ఇక్కడే గోదావరి పుట్టింది. ఇక్కడ బ్రహ్మగారి అనే పర్వతం ఉంది. ఈ పర్వత శిఖరాగ్రాన గౌతమమహర్షి అహల్యాసమేతంగా తపస్సు చేస్తున్న సమయం. జనహితం కోరి, గౌతమ ముని ద్వారా దివి నుంచి గంగను భువికి రప్పించాలని నిర్ణయించిన మునులు తగిన పథకాన్ని గౌతమమహర్షి తన ఆశ్రమంలో వరిపైరును సాగుచేస్తున్నాడు.

ఆ వరి పైరు పైకి దర్భతో సృష్టించిన ఆవుదూడలను పంపించారు ఆ మునులు. తపస్సులో నున్న గౌతమ మహర్షి ఒక దర్భతో వాటిని తోలగా, దర్భ తాకినంతనే అవి చనిపోయాయి.

మునుల పన్నాగం ఫలించింది. గోహత్యాపాతకం నుంచి బయటపడాలంటే గంగను భూమికి రప్పించి, ప్రాయశ్చిత్తంగా స్నానం చేయమన్నారు.

వెయ్యేళ్ళు శివునిప్రార్థించి గంగను భూమికి రప్పించాడు గౌతమమహర్షి. గౌతమమునీంద్రుల తపస్సువలన భూమికి తీసుకురాబడి నందున కారణంగా ‘గౌతమీనది’ అని, గోవు ప్రాణం వదిలిన ప్రదేశం నుంచి ప్రవహించిన కారణంగా ‘గోదావరి’ అని ప్రఖ్యాతి చెందింది.

ఈ పుణ్య గోదావరీ నది దీనజనోద్ధరణ నిమిత్తమై దారణా, ప్రవరా, అజంతా, ఎల్లోరా గుహలను దాటుకుంటూ ప్రాణహిత, చంద్రావతి, శబరిప్రాంతాలలో ప్రవహిస్తూ, దక్షిణ వాహినిగా మారి సుమారు 900 కి.మీ. ప్రయాణం చేసి మనరాష్ట్రంలో కోటిపల్లి దగ్గర సాగరుని చేరుకుంటుంది. గౌతమీనది పుట్టిన త్ర్యంబకంలో స్వయంభువుగా వెలసిన స్వామి, భక్తులను తనన కరుణాపూరిత దృక్కులతో కాపాడుతున్నాడు.

త్రియంబకేశ్వర్ ఆలయ సమాచారం కోసం సంప్రదించండి:
 • ➛ Sau.Manasi Ajit Chandwadkar
 • ➛ 170, Main Road, Opp. Satyanarayan Mandir
 • ➛ Near Kushavarta Kund,
 • ➛ Trambakeshwar .Nashik 422212.
 • ➛ Mobile: +91 9822222530
 • ➛ Mobile:- +91 9371004172
 • ➛ Land Line :+912594234070

రామేశ్వర జ్యోతిర్లింగం - Rameswaram
రామేశ్వర జ్యోతిర్లింగం - Rameswaram

9. రామేశ్వర జ్యోతిర్లింగం

రావణాసురుని వధించిన శ్రీరామచంద్రుడు సీత, లక్ష్మణ హనుమత్సమేతంగా పుష్పక విమానంలో అయోద్యానగారానికి తిరిగి వస్తూ, గంధమాదవ పర్వతంపై కాసేపు విమానాన్ని ఆపాడు.
రామేశ్వర జ్యోతిర్లింగం
 • ⧫ అక్కడున్న మునివరులను బ్రహ్మవంశానికి చెందిన రావణుని చంపిన పాపాన్నుండి బయటపడే మార్గాన్ని చెప్పమని అడుగుతాడు. 
 • ⧫ అప్పుడు ఆ మహర్షులు, శివలింగాన్ని ప్రతిష్టించి, పూజించడం కంటే ఉత్తమమైన మార్గం లేదని చెబుతారు. 
 • ⧫ శ్రీరాముడు శివలింగాన్నోకటి తీసుకురమ్మని హనుమను పురమాయిన్చాగా, శివలింగాన్ని తెచ్చేందుకు కైలాసానికి బయలుదేరుతాడు ఆంజనేయుడు. అయితే శివలింగాన్ని ప్రతిష్టించేందుకు ముహూర్తం సమీపిస్తున్న కొలదీ హనుమ రాక ఆలస్యమైంది. 
 • ⧫ వేరే మార్గం లేక మునివరుల సలహాననుసరించి సీతచే సైకత లింగాన్ని (ఇసుకలింగాన్ని) ప్రతిష్టింపజేస్తాడు శ్రీరాముడు. 
 • ⧫ ఈలోపు కైలాసం నుంచి శివలింగంతో తిరిగి వచ్చిన హనుమతుండు, శివలింగ ప్రతిష్ట జరిగిందని తెలుసుకుని పరిపరి విధాలుగా చింతిస్తాడు. 
 • ⧫ ఆంజనేయుని బాధను గమనించిన శ్రీరాముడు ఆ సైకతలింగాన్ని తొలగించి, రజతాచలంనుంచి తను తీసుకువచ్చిన లింగాన్ని ప్రతిష్టించమని చెబుతాడు. 
 • ⧫ రాముని మాటలను విన్న ఆంజనేయుడు ఉత్సాహంతో ఇసుకలింగాన్ని తొలగించడానికి  ఎన్నో విధాలుగా ప్రయత్నించి విఫలుడవుతాడు. 
 • ⧫ చివరకు తోకతో లింగాన్ని పెకిలించడానికి ప్రయత్నిస్తాడు. 
 • ⧫ ఆంజనేయుని అవస్థలను గమనించిన శ్రీరామచంద్రుడు, సుముహుర్త బలం, మంత్రబలం సైకత లింగానికి మహాత్మ్యాన్ని కలిగించాయని, కాబట్టి కైలాసం తీసుకొచ్చిన లింగాన్ని సైకత లింగం ప్రక్కనే ప్రతిష్టించమని చెప్పాడు. 
 • ⧫ అలా శ్రీరాముడు ప్రతిష్టించిన లింగం రామేశ్వరలింగమని, హనుమంతుడు ప్రతిష్టించిన లింగం హనుమదీశ్వరలింగమని పూజలందుకొంటున్నాయి. 
 • ⧫ రామేశ్వరలింగాన్ని పూజించినవారికి బ్రహ్మహాత్యాది దోషాలు తొలగిపోతాయి. 
 • ⧫  కాశీయాత్ర చేసినవారు గంగాజలంతో రామేశ్వరలింగాన్ని అభిషేకిస్తే ఈశ్వరానుగ్రహం కలుగుతుందని ఋషివాక్కు, సమస్త ఐశ్వర్యసిద్ధి కలుగుతుంది.
రామేశ్వర ఆలయ సమాచారం కోసం సంప్రదించండి:
 • ➛ Arulmigu Ramanathaswamy Temple
 • ➛ Ramanathapuram, District,
 • ➛ Rameswaram - 623 526.
 • ➛ Phone No. : 04573 - 221223
 • ➛ Fax and Computer Section No. : 04573 - 223230
 • ➛ E-Mail ID : lordramnath2012@gmail.com
భీమశంకర జ్యోతిర్లింగం - Bheema Shankara Jyotirlingam
భీమశంకర జ్యోతిర్లింగం - Bheema Shankara Jyotirlingam

10. భీమశంకర జ్యోతిర్లింగం

త్రేతాయుగంలో భీమాసురుడనే రాక్షసుడు సహ్యాద్రిపై తల్లి కర్కటితో కలసి జీవిస్తూ, ప్రజలను పీడిస్తూండేవాడు.
 • ⭄ కర్కటి, పుష్కసి – కర్కటుల కూతురు. లేక లేక పుట్టిన కూతుర్ని అత్యంత గారాబంగా పెంచసాగారు ఆ రాక్షస దంపతులు. యుక్తవయస్కురాలైన కర్కటిని విరాదునికి ఇచ్చి పెండ్లి చేశారు. 
 • ⭄ ఆ విరాధుడు, శ్రీరామునితో జరిగిన యుద్ధంలో మరణించగా, మరలా కర్కటి తల్లిదండ్రులను ఆశ్రయించింది. ఒకరోజు అగస్త్యుని శిష్యుడైన సుతీక్షణుడు భీమానడిలో స్నానం చేస్తుండగా, కర్కటి తల్లిదండ్రులు అతనిని కబళించేందుకు ప్రయత్నించి, ఆ ముని శాపానికి గురై భస్మమయ్యారు. తల్లిదండ్రులను కోల్పోయిన కర్కటి అనాథగా మిగిలింది. 
 • ⭄ అనాథగా సహ్యపర్వతంపై తిరుగుతున్నాకర్కటిని చూసి, మోహావేశుడైన రావణుని సోదరుడు కుంభకర్ణుడు, ఆమెను బలాత్కరించి, లంకా నగరానికి వెళ్ళిపోయాడు. 
 • ⭄ ఫలితంగా కర్కటి గర్భవతి అయి భీమాసురునికి జన్మనిచ్చింది. 
 • ⭄ తన తల్లి కథను విన్న భీమాసురుడు, దీనంతటికీ కారకుడు రామావతారం ధరించిన విశ్నువేనని, విష్ణువుపై తన పగను తీర్చుకోవాలని, వేయి సంవత్సరాలపాటు బ్రహ్మ గురించి తపస్సుచేసి వరాలను పొందాడు. 
 • ⭄ ఎల్లలోకవాసులను గడగడలాడించిన  భీమాసురుడు కామరూప దేశాదిపతి సుదక్షిణుని ఓడించి కారాగ్రుహంలో బంధించాడు. అతని భార్య సుదక్షిణాదేవిని కూడా బంధిస్తాడు. 
 • ⭄ కారాగారంలో సంకెళ్ళతో బంధింపబడినప్పటికీ ఆ దంపతులు, మానస గంగాస్నానం చేసూ, ఇసుకలింగాన్ని చేసి ఆరాధించసాగారు. 
 • ⭄ వారి పూజలను చూసిన భీమాసురుడు ఈ లింగం మిమ్ములను రక్షిస్తుందా అంటూ తన కరవాలాన్ని విసురుతాడు. 
 • ⭄ రాక్షసుని కత్తి పార్థివలింగాన్ని తాకినంతనే కోటి సూర్యప్రభలతోస్వామి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి, త్రిశూలంతో రాక్షససంహారం గావించాడు. 
సకలలోకవాసులు సంతోషించారు. అప్పట్నుంచి స్వామి లోక కళ్యాణార్థం అక్కడనే ఉంటూ భక్తజనా వళిని కరుణిస్తున్నాడు. ఎందరో భక్తుల కోరికలను ఈడేరుస్తున్నాడు.

భీమశంకర ఆలయ సమాచారం కోసం సంప్రదించండి:
Address for Corrospondance :
 • ➛ Shivtirtha Bhimashankar,
 • ➛ Shri Kshetra Bhimashankar, Via - Dimbhe Colony,
 • ➛ Taluka - Khed, Dist - Pune. Pincode : 410509
 • ➛ Email : ganesh@bhimashankar.in
 • ➛ Mobile : 9970045972 (Ganesh Gawande)


విశ్వేశ్వర జ్యోతిర్లింగం - SHRI KASHI VISHWANATH TEMPLE
విశ్వేశ్వర జ్యోతిర్లింగం - SHRI KASHI VISHWANATH TEMPLE 

11. విశ్వేశ్వర జ్యోతిర్లింగం

ఈ సృష్టికి ముందు నుంచే కాశీపురం పరమ పవిత్రమై విరాజిల్లుతోంది. ఇక్కడ పరమశివుడు సగుణరూపాన్ని ధరించాడు.

ఆ స్వరూపం శివశక్తి సమ్మేళనం. స్త్రీ, పురుష రూపాలకు భిన్నంగా ఉన్న ఆ రూపం నుండి ప్రకృతి, పురుషులు ఉదయించారు. పరమాత్మ తన నుండి తేజాన్ని వెలువరించి ఐదుక్రోసులమేరగల ఒక మహాపట్టణాన్నిప్రకృతి పురుషులు తపస్సు చేయడానికి  నిర్మించారు. అదే కాశీ పట్టణం.

పరమాత్మ ఆదేశానుసారం పురుషుడు సృష్టి నిర్మాణ సామార్థ్యాన్ని పొందేందుకు ఘోర తపస్సు చేసాడు. పరమపురుషుడైన శ్రీమహావిష్ణువు తపస్సు చేస్తుండగా, ఆ తపస్సు అతని వేడికి శరీరం నుండి నీరు కాలువలై ప్రవహించసాగాయి. ఆ జలప్రదేశాన్ని చూసి ఆది నారాయణుడు ఆశ్చర్యచకితుడై తల ఊపాడు. ఆ ఊపుకు మణులతో కూడిన చెవి కమ్మ ఊడి ఒకచోట పడింది. ఆ చెవి పోగు ఊడి పడిన స్థలమే ‘మణికర్ణిక’గా ప్రసిద్ధమైంది.

అనంతమైన జలరాశినుండి కాశీపట్టణాన్ని పరమశివుడు తన శూలాగ్రంతో ధరించి కాపాడాడు. జలం పైభాగంలో యోగనిద్రాపరవశుడైయున్న నారాయణుని నాభికమలంనుండి బ్రహ్మ ఉదయించి, శివాజ్ఞణు అనుసరించి సృష్టి చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు. ముందుగా బ్రహ్మ పంచాశత్కోటి యోజన పరిమితమగు బ్రహ్మాండాన్ని సృజించి, నాలుగు వైపులా పధ్నాలుగు భువనాలను నిర్మించాడు. ఆ బ్రహ్మాండం మజ్జిగలో వెన్నముద్ద వలె తేలియాడసాగింది.

ఐరావతాదులతో బ్రహ్మాండంలో సుస్థిరంగా నిలిచి ఉంది. ఈ బ్రహ్మాండంలో సగం మధ్య భాగం, మిగిలిన సగభాగంలో సగం ఊర్థ్వభాగం, ఇక మిగిలిఉన్న పాతికభాగం అథోలోకమని చెప్పబడుతోంది. అప్పుడు దెవతలంతా పరమశివుని ప్రార్థించి, భూలోక వాసులను కాపాడేందుకు ఇక్కడే శాశ్వతంగా ఉండమని విన్నవించుకున్నారు. వారి మొరలను ఆలకించిన పరమశివుడు విశ్వేశ్వరనామంతో జ్యోతిర్లింగమై కాశీ పట్టణంలో వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు.

ఈ క్షేత్రపాలకుడు కాలభైరవుడు, అష్టభైరవులు, డుంఢితో సహా 56 గనపతులు, నవదుర్గలు కాశీలో కొలువై ఉన్నారు. కాశీలో గంగాస్నానం చేసి, విశ్వేశ్వరుని, భిందు మాధవుని, డుండిగణపతిని, దండపాణిని, కాలభైరవుని, కుమారస్వామిని, అన్నపూర్ణను సేవించుకోవాలి. కాశీయాత్ర చెయలేనివారు, కాశీ పేరును తలచుకుంటే చాలు, యాత్రాపుణ్యఫలం దక్కుతుంది.

కాశీలో మరణించిన వారికి కుడిచెవిలో శ్రీరామతారక మంత్రోపదేశం లభించి మోక్షం సిద్ధిస్తుంది. రామేశ్వరం నుంచి ఇసుకను తీసుకొచ్చి కాశీ విశ్వేశ్వరుని అభిషేకిస్తే, ఎంతోకాలం పుణ్యం కలుగుతుంది. ఇక్కడ గంగాస్నానం చేసిన వారికి ముక్తి, అన్నపూర్ణాదేవిని పూజించినవారికి భుక్తికి లోటుండదు.

భీమశంకర ఆలయ సమాచారం కోసం సంప్రదించండి:
 • ➛ Chief Executive Officer
 • ➛ Shri Kashi Vishwanath Temple Help Desk
 • ➛ CK 37/40,41,42 Bansphatak, Varanasi-221 001
 • ➛ Phone : 0542- 2392629, +91-6393131608
 • ➛ Email :shrikashivishwanathtempletrust@gmail.com, support@shrikashivishwanath.org
 • ➛ Hours : सोमवार - शनिवार 6:00 AM - 6:00 PM

ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం - Grishneshwar Jyotirlinga
ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం - Grishneshwar Jyotirlinga 

12. ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం

పూర్వం దేవగిరి సమీపంలో సుధర్ముడు – సుదేహ అనే దంపతులుండేవారు.  వీరికి ఎంతకాలమైనప్పటికీ సంతానభాగ్యం కలుగలేదు. ఒకరోజు ఆ ఇంటికి బ్రహ్మతేజోవిరాజితుడైన ఒక యతీశ్వరుడు భిక్ష కోసం వచ్చాడు.అతనిని సాదరంగా ఆహ్వానించిన దంపతులు ఆ యతీశ్వరునికి భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు.
ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం
ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం
భోజనం చేస్తున్న సమయంలో ఆ దంపతులకు సంతాన భాగ్యం లేదన్న విషయాన్ని తెలుసుకున్న యతీశ్వరుడు, సంగంలోనే భోజనాన్ని వదిలేసి వెళ్ళసాగాడు. సంతానంలేనివారి ఇంట్లో భోజనం చేయకూడదన్నది ఆ యతీశ్వరుని నియమం.

ఆ దంపతులు యతీశ్వరుని కాళ్ళపైబడి ప్రార్థించగా, త్వరలోనే సంతాన భాగ్యం కలుగుతుందని దీవించాడు. పెళ్ళికి ముందు సుదేహ జాతక చక్రాన్ని పరిశీలించిన పండితులు, ఆమెకు సంతానప్రాప్తి లేదని చెబుతారు. ఆ విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్న సుదేహ, తెలుగున చెల్లెలు ఘుశ్మను పెళ్లి చేసుకోమని భర్తకు చెబుతుంది.

సుధర్ముడు ఒప్పుకోకపోయినప్పటికీ, సుదేహ పట్టుబట్టి భర్తకు రెండవ పెళ్లి జరిపిస్తుంది. అలా కొంతకాలం సుఖంగా ఉన్నారు. పరమపతివ్రతియైన ఘుశ్మ, అక్క సుదేహను తల్లిలా, భారతాన్నిఉ దైవసమానునిగా భావించి సేవిస్తుండేది. అచిరకాలంలోనే ఘుశ్మ గర్భవతి అయింది. ఒక శుభదినంలో ఘుశ్మ  మగబిడ్డను ప్రసవించింది. ఆ పిల్లవాడు దినదినప్రవర్ధమానంగా పెరగసాగాడు. అయితే సుదేహ మనసులో అసూయాజ్వాలలు రెడ్డిగాయి. తన చెల్లెలు, చెల్లెలి కొడుకుపై ఈర్ష్వాద్వేషాలను పెంచుకొసాగింది.

ఒకరోజు రాత్రి సుదేహ, పసివాని గొంతు కోసి, తనను మొండేన్ని వేరువేరుగా చెరువులో విసిరేసింది. ఇదంతా తెలియని ఘుశ్మ ఉదయాన్నే లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, స్నానం చేసేందుకు సరోవరానికివెళ్ళింది. అక్కడ ఆమె కుమారుడు తల్లి పాదాల దగ్గరకు ఈదుకుంటూవచ్చి, ‘అమ్మా! నేనొక పీడకల కన్నాను. అందులో నేను చచ్చి బ్రతికినట్లు కనిపించింది.’ అని చెప్పాడు.

కొడుకు చెప్పిన సంగతిని విన్న ఘుశ్మ దిగ్ర్భమ చెంది, ఎందుకిలా జరిగింది? ఇది కలా? నిజమా? అని ఆలోచించసాగింది. అలా ఆమె దీర్ఘాలోచనాలోనుండగా, శివుడు ప్రత్యక్షమై సుదేహ చేసిన ఘోరకృత్యాన్ని చెప్పి, ఆమెను శిక్షిస్తానని పలుకుతాడు. ఆప్పడు శివుని కాళ్ళపై బడిన ఘుశ్మ, తన అక్కకు ఎటువంటి దండన వద్దని, మారుగా ఆమెకు మంచి బుద్ధి, సౌశీల్యాన్ని అనుగ్రహించమని ప్రార్థించింది. ఆమె ప్రార్థనను విని సంతసించిన శివుడు, ‘తల్లీ! నీ కోరిక ప్రకారమే జరుగుతుంది ఘృష్ణేశ్వరనామంతో ఇక్కడె కొలువై ఉండగలవాడను. నీవు దీర్ఘసుమంగళెవై చిరకాలం వర్థిల్లి, చివరకు నా లోక్ర్థన్ని చేరుకుంటా’ వని ఆశీర్వదించి అంతర్థానమయ్యాడు. ఘృష్ణేశ్వర లింగాన్ని పూజించిన వారికి పుత్రశోకం కలుగదని ప్రతీతి.

ఘృష్ణేశ్వర ఆలయ సమాచారం కోసం సంప్రదించండి:
 • ➛ Grishneshwar Temple Contact
 • ➛ Phone  No :- 02437244585

- ద్వాదశ జ్యోతిర్లింగ దర్శన ఫలం -

ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను చూసినా, తాకినా, పూజించినా తలచినా మానవులు ఇహపర సుఖాలను పొందుతారు.
 • 1. సౌరాష్ట్ర దేశంలో చంద్రనిర్మితమైన, అయన పేరు తోనే అలరారుతున్నకుండంలో స్నానంచేసి, అక్కడ సోమనాథ జ్యోతిర్లింగాన్ని భక్తిశ్రద్ధలతో ఆరాధించిన వాళ్ళు కుష్ఠాపస్మారక్షయాది రోగవిముక్తులై ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతోజీవిస్తారు.
 • 2. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలంలో మల్లిఖార్జుననామంతో వెలసిన శివుడి  జ్యోతిర్లింగారాధన వలన సర్వవిధ దరిద్రాలు సమసిపోయి, సద్యశ్శుభాలేర్పడి, అనంతరం మోక్ష పదం కలుగుతుంది.
 • 3. ఉజ్జయిని ‘మహాకాల’ నామకమైన జ్యోతిర్లింగార్చనవలన భయ రాహిత్యం, విద్యాపాటవం, భోగభాగ్యాలూ సమకూరి అన్నింటా విజయం.
 • 4. అమరేశ్వర, పరమేశ్వర, ఓంకారేశ్వారాది సార్థకనామధేయలాతో ఓంకారేశ్వారంలో వెలసిన శివుడి జ్యోతిర్లింగాన్ని పూజించడం వలన ఇహపరాలు రెండింటా కృతార్థత లభిస్తుంది.
 • 5. శ్రీహరియొక్క రెండు అంశలైన నరనారాయణుల ప్రార్థనతో ఆవిర్భవించిన జ్యోతిర్లింగం హిమవత్పర్వతం మీద వుండి. కేదారేశ్వరుడిగా పేరు వహించిన ఇక్కడి లింగారాధన సర్వాభిష్టాలనూ నెరవేరుస్తుంది. ఇక్కడి రేతః కుండంలోని నీళ్ళతో మూడుసార్లు ఆచమించడమే ముక్తికి చేరువ మార్గమని ముని వాక్యం.
 • 6. ఢాకిని అనే ప్రదేశంలో ఉన్న జ్యోతిర్లిగం పేరు భీమశంకరలింగం. ప్రాణావసానుడై ఉన్న భక్తుడి రక్షణార్థమై వెలసిన ఈ లింగారాధన వలన అన్ని విధాల భయాలూ అంతరించి, శత్రుజయం కలుగుతుంది. అకాలమృత్యువులు తప్పిపోతాయి.
 • 7. సర్వప్రపంచం చేతా సేవించబడుతూన్న విశ్వేశ్వరలింగం కాశీలో ఉంది. ఈ పుణ్యక్షేత్ర దర్శన
 • మాత్రం చేతేనే సమస్తమైన కర్మబంధాల నుంచీ విముక్తులౌతారు. ఇక్కడ కొన్నాళ్ళు నివసించినా, లేదా కాలవశాన ఇక్కడనే దేహం చాలించినవాళ్ళు మోక్షాన్నే పొందుతారు.
 • 8. మహారాష్ట్ర నాసిక్ లో ఉన్న జ్యోతిర్లింగం పేరు త్రయంబకేశ్వర లింగం. దీని ఆరాధన వలన అన్ని కోరికలూ తీరుతాయి. అపవాదులు నశిస్తాయి.
 • 9. చితాభూమిలో ఉన్న జ్యోతిర్లింగం వైద్యనాథుడు. ఈ లింగారాధన వలన భుక్తి ముక్తులే కాకుండా అనేక విధాలైన వ్యాధులు హరించబడతాయని ప్రతీతి.
 • 10. నాగేశ్వర జ్యోతిర్లింగం. ఈ లింగ దర్శనార్చనాడుల వలన సమస్తమైన భవభయాలే కాకుండా, మహాపాతక ఉపపాతాకాలు కూడా నశించిపోతాయి.
 • 11. శ్రీరాముని కోరికమేరకు రామేశ్వరంలో జ్యోతిర్లింగంగా వెలిసిన శివుడు, రామేశ్వరుడనే పేరుతోనూనే రాజిల్లుతున్నాడు. కాశీలోని గంగా జలాన్ని తెచ్చి, ఇక్కడి లింగానికి అభిషేకం
 • చేసిన వాళ్ళు జీవన్ముక్తులవుతారని ప్రఖ్యాతి.
 • 12. ‘ఘృష్ణేశ్వరుడు’. శివాలయమనే కొలనులో భక్తరక్షణార్థమై ప్రభవించిన ఈ స్వయంభూలింగం భక్తుల ఇహపర భోగాలను అందజేస్తుంది.

సంకలనం: నాగవరపు రవీంద్ర

4, ఆగస్టు 2020, మంగళవారం

హిందువుల దేవాలయాలలోనికి ఇతర మతస్థులకు ప్రవేశాధికారం ఉందా - Anyamatastula Alaya Pravesam

హిందువుల దేవాలయాలలోనికి ఇతర మతస్థులకు ప్రవేశాధికారం ఉందా - Anyamatastula Alaya Pravesam
హిందువుల దేవాలయాలలోనికి ఇతర మతస్థులకు ప్రవేశాధికారం ఉందా?

ఇప్పుడిప్పుడే అన్యమతస్థులను కూడా మన దేవాలయాలలోనికి రానిస్తున్నారు.  కొన్ని చోట్ల దేవాలయాలలోని కొన్ని ప్రదేశాలకు మాత్రం ఇతర మతస్థులను రానివ్వరు.  ఒకవేళ వారిని దేవాలయాలలోనికి అసలు అడుగు పెట్టనీయకపోయినా తప్పేమీ లేదు. కారణమేమంటే, వారు తమతమ దేవాలయాలను సందర్శించేటప్పుడు పవిత్రస్థలాలుగా భావించి ఎటువంటి శ్రద్ధాభక్తులతో వెళతారో అలాగే మన దేవాలయాలలోకి వస్తే మనకేమీ  అభ్యంతరం ఉండదు.

కానీ శ్రద్ధ లేకుండా కేవలం యాత్రికులుగా, విమర్శనాత్మక బుద్ధితో, దోషాలు ఎంచటానికి వస్తే మాత్రం దానివల్ల వారికి కలిగే లాభం ఉండదు. పైగా అది మన ఆస్తిక భక్తుల మనోభావాలను కించపరిచినట్టవుతుంది. హిందూమతంలోని అన్ని వర్గాలవారికి ఎలాంటి వివక్షత లేకుండా దేవాలయాలలోనికి ప్రవేశం కల్పించాలి.

ఒక పద్ధతి ప్రకారం అందరికీ దైవాన్ని దర్శించుకునేందుకు వీలు కల్పించాలి. ఇతరులకు ప్రవేశం కల్పించే విషయం తరువాత ఆలోచించవచ్చు. ప్రస్తుతానికది పెద్దసమస్య కాదు.

రచన: స్వామీ హర్షానంద

19, జులై 2020, ఆదివారం

హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి ఆలయం చరిత్ర - History of Hanuman Junction Anjaneya Swamy Temple

హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి ఆలయం చరిత్ర

ఐదవ నెంబరు జాతీయ రహదారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు హనుమాన్ జంక్షన్ రాగానే, మన అందరం వెతుక్కునేది ఆంజనేయ స్వామి విగ్రహం. అలా కారులోనో, బస్సు లో నో వెళ్తూ, ఆ విగ్రహానికి నమస్కారం చేస్తాం. హనుమాన్ జంక్షన్ కే ఒక ఐకాన్ ఈ, ఆంజనేయ స్వామి విగ్రహం. అంత పేరు ఉంది ఈ విగ్రహానికి. కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలను సరిహద్దులో ఉంది ఈ విగ్రహం. స్వామి పాదాలు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల సరిహద్దుగా ఉన్నాయి.

గర్భగుడి పశ్చిమగోదావరి జిల్లాలో, మెట్లు కృష్ణా జిల్లాలో ఉన్నాయి. ఆంజనేయ స్వామి విగ్రహం ముఖంలో వానర లక్షణాలకంటే మానవ ముఖం లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. ఇంకో స్పెషల్ ఏంటి అంటే, నాలుగు ప్రధానమైన రోడ్డుల కూడలి కనుక, దీన్ని జంక్షన్ అని కూడా అంటారు. ఏలూరు రోడ్,గుడివాడ రోడ్, నూజివీడు రోడ్, విజయవాడ రోడ్, ఈ నాలుగు రోడ్డులు ఇక్కడే కలుస్తాయి. స్వామి వారి విగ్రహాన్ని 1938వ సంవత్సరం లో ప్రతిష్టించారు.

ఈ విగ్రహం ఎవరు ప్రతిష్టించారు ? హనుమాన్ జంక్షన్ కు ఆ పేరు ఎలా వచ్చింది ?
పూర్వం ఈ ప్రాంతాన్ని, నూజివీడు జమిందారు శ్రీ ఎం.ఆర్ అప్పారావు గారు పరిపాలించేవారు. ఆయన తండ్రి, శ్రీ మేకా వెంకటాద్రి బహద్దూర్ గారు 1938వ సంవత్సరం లో, ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు.

జమిందార్ మేకా వెంకటాద్రి బహద్దూర్ హనుమాన్ జంక్షన్ ప్రాంతానికి వచ్చారు అప్పుడు ఆయనకు విపరీతమైన ఆకలి వేయడం తో ఆహారం కోసం వెతికారు. ఎటుచుసిన బీడు భుములు, డొంకల, ముళ్ళు పొదలతో నిండి అక్కడ అంతా నిర్మానిష్యముగా ఉంది. జమిందార్ కి ఆకలి బాధ ఎక్కువ అయింది. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. హటాత్తుగా అక్కడకు ఒక కోతి వచ్చి జమిందార్ చేతి లో అరటిపండు పెట్టి అదృశ్యమైపోయింది. ఆకలితో ఉన్న జమిందార్ ఆ పండును భుజించగానే అతనికి ఎంతో శక్తి వచ్చినట్లుయింది.

సాక్షాత్తు ఆంజనేయుడే కోతి రూపంలో వచ్చి అరటిపండు ను ఇచ్చి వెళ్ళాడని గ్రహించి, భక్తపారవశ్యం తో తన్మయత్వం చెంది శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహం అక్కడ ప్రతిష్టించాలని భావించారు. భక్తులను దుష్టగ్రహ పిడముల బారి నుండి రక్షించే నిమత్తం ఆంజనేయ స్వామి నిలువెత్తు విగ్రహాన్నితయారు చేయించి నాలుగు రోడ్ల కూడలి అయిన హనుమాన్ జంక్షన్ లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అనాడు దండకారణ్యం లో శ్రీ రాముడికి ఆకలివేయగా, ఆంజనేయస్వామి వచ్చి అరటి పండు ఇచ్చి స్వామి ఆకలి తీర్చాడు. అదే విదంగా ఈ జంక్షన్ లో ఆంజనేయ స్వామి "రామా. ఆగు ఇవిగో అరటిపండ్లు" అంటున్నట్లుగా ఉన్న ఆంజనేయ విగ్రహన్ని, ఆంజనేయస్వామి గుడి ఎదురుగా రోడ్డు అవతల రామాలయాన్ని నిర్మించారు.

సంకలనం: కోటేశ్వర్

27, జూన్ 2020, శనివారం

శ్రీ కూర్మక్షేత్రం - Śrī kūrmakṣētraṁ

శ్రీ కూర్మక్షేత్రం - Śrī kūrmakṣētraṁ

భారత దేశంలో ఏకైక కూర్మక్షేత్రం

భారతదేశం ఆధ్యాత్మిక దేశం. ఎందరో ఋషి పుంగవుల, తపోధనుల పాదస్పర్శతో పునీతమైన ప్రదేశమిది. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులకు పుట్టినిల్లిది. ఎన్నోన్నో ప్రత్యేక క్షేత్రాలు తమ తమ మహిమలతో ఈ భూమిపై వెలసి, ప్రతీ ఒక్కరిని ప్రభావితులను చేస్తూన్నాయి. తరింపజేస్తున్నాయి. అటువంటి మహత్తు కలిగిన క్షేత్రమే ఆంద్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా గార మండలంలో ఉన్న ‘శ్రీకూర్మం’.

“కూర్మావతారం ఛ సంశ్రుతం పాపనాశనమ్” అని అగ్నిపురాణం (3-1) చెబుతోంది. అనగా, లోకహితం కోసం ఆ నారాయణుడు మత్స్యకూర్మాది అవతారాలను ధరించాడు. పురాణాలు చెబుతున్న కూర్మావతారం గురించి వింటే పాపాలు నశిస్తాయి. ఇహ…కళ్ళతో ప్రత్యక్షంగా ఆ మూర్తిని తిలకిస్తే ఇంకెంత ముక్తిదాయకమో కదా! విష్ణుమూర్తి సలహాపై దేవదానవులు పాలసముద్రములో, మందార పర్వతం కవ్వంగా, వాసుకిని తాడుగా చేసుకొని, మధిస్తున్న సమయంలో ప్రతీసారి పర్వతం సరిగ్గా నిలువకుండా కడలిలో పడిపోయేది. సంగతిని తెలుసుకున్న దేవతలు శ్రీహరిని ప్రార్థించగా, కూర్మావతారాన్ని ధరించి, తన సువిశాలమైన వీపుభాగాన మందార పర్వతాన్ని ధరించి (మద్య మానేతదా తస్మిన్ కూర్మరూపే జనార్థనః) కార్యం నిర్విఘ్నంగా ముగించేటట్లు చేసాడని భాగవతం చెబుతోంది. దశావతారాలలో రెండవ అవతారం శీకూర్మ అవతారం.

“యావద్భారతంలో కూర్మావతార క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకూర్మం,
శ్రీకూర్మవతారమైన విష్ణువుకు అంకితమైనందున శ్రీకూర్మంగా పిలువబడుతోంది.”

కాల నిర్ణయం

ఆలయస్థల పురాణాన్ని అనుసరించి, శ్వేతమహీపతిని అనుగ్రహించాడనికి స్వామి ముందుగా ఇక్కడికి విచ్చేశాడట. అలాగే రోగి అస్తికలను ఇక్కడి శ్వేతపుష్కరిణిలో వేయగా, అందులో నీరు తాబేళ్ళుగా మారాయనీ, అందుకనే అశుచి కలిగిన మనుషులు అక్కడి నీళ్ళను టాక కూడదన్న నిబంధన ఉంది. 

ఈ దేవాలయాన్ని గురించి “కాలవివరాలు” అంత సమగ్రంగా లేవు. దాదాపు రెండవ శతాబ్దంనాటి దేవాలయం ఉన్నట్లుగా కొందరి చరిత్రకారుల అభిప్రాయం. ఏడవ శతాబ్దానికి దేవాలయ వైభవం ఉచ్ఛస్థితిలో ఉన్నట్లుగా తెలిపే శాసనాలు, ఆలయ మండపంలోగల స్తంభాలపై లిఖించబడ్డాయి. చోళ చక్రవత్రుల కాలంలో ఈ వైభవం తారాస్థాయికి చేరినట్టుగా మరి కొన్ని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ శాసనాలనీ కూడా తూర్పు కళింగ, గంగుల పరిపాలలో ఉన్న అనంగభీముడు నిర్మించిన “తిరుచుట్టుమండపం” స్తంభాలపై ఒరియా, తెలుగు, దేవనాగరి, ప్రాకృత భాషలలోకనిపిస్తాయి. ఈ మండపంలో నిర్మించిన 71 నల్లరాతి స్తంభాలు గాంధార శిల్పకళతో అలరారుతుంటాయి. సింహాచలం “కప్పు స్తంభం” మాదిరిగానే ఈ క్షేత్రంలో కూడా “ఇచ్ఛాప్రాప్తిస్తంభం” ఉంది. దీనిని కౌగిలించుకుంటే కోరికలు తీరుతాయని శాసనాలు తెలియజేస్తున్నాయి. ఈ స్తంభాలపి కలంకారి రంగులతో చిత్రించిన చిత్రములు, శిల్పాలు వగైరా దేనికదే పోలికలు లేకుండా చిత్రించబడటం ఆనాటి కాల నైపుణ్యానికి ప్రతీక.

ఆలయం విశేషాలు:
శ్వేతకీర్తి చక్రవర్తి నిమిన్చినట్లుగా చెప్పబడుతున్న ఈ ప్రాచీన దేవాలయం, భారతదేశంలోని అతి ప్రాచీన దేవాలయాలలో ఒకటి. అపురూప శిల్పకళ సంపదతో, ప్రతికృతిలో సౌందర్యాలతో అలరారుతున్న ఇటువంటి దేవాలయమం ప్రపంచంలో మరెక్కడా లేదు. దేవాలయ నిర్మాణము తూర్పు గంగ వంశస్థుల శిల్పకళా శైలిని తలపిస్తుంది. కృతయుగంలో వెలసిన ఆది కూర్మనాధుడే ఈ యుగంలో కూర్మనాధదేవునిగా ఇక్కడ వెలశాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ దేవాలంలో మూలవిరాట్ గర్భాఆలయంలో ఒక ప్రక్కగా వెలసినట్లు కనిపిస్తుంది. సాధారణంగా దేవతావిగ్రహాలు తూర్పు దిక్కుకు అభిముఖంగా ప్రతిష్టించబడటం సహజం. కాని, ఈ క్షేత్రంలో పశ్చిమాభిముఖంగా స్వామిముఖం, తోక భాగాన గల సుదర్శనశాలిగ్రామం తూర్పుకు అభిముఖంగా వెలయడంచేత దేవాలయంలో రెండు ధ్వజస్తంభాలున్నాయి.

ఈ విధంగా మరే దేవాలయంలో కూడా లేకపోవడం ఒక విశేషం. ఆలయమ్లోకి ప్రవేశించగానే ముందు కూర్మం తోక, ఆ తర్వాత కాస్త పశ్చిమంగా వెళితే ముఖం కనిపిస్తుంది. అనంతరం భోగమంటపం, భోగమంటపానికి ఇరు వైపులా పద్మనిధి, శంఖనిధి ఉన్నాయి. భోగామంతాపం తర్వాత పుష్పాంజలిమంటపం, ఆస్థానమంటపం ఉన్నాయి. వీటిని బ్రహ్మదేవుడు నిర్మించాడని ప్రతీతి.

“శ్రీకూర్మనాథస్వామి స్వయంవ్యక్తమూర్తి అనీ, ఈ దేవుని కంఠంలో ఉన్న సాలగ్రామమాలికతో పాటూ శ్రీమహావిష్ణువు కూర్మాక్రుతి పొందాడని భక్తుల విశ్వాసం. స్వామివారిని భక్తితో ఆరాధిస్తే సమస్త పాపాలు తొలగి, పునర్జన్మ ఉండదని నమ్మకం! అలాగే ఈ క్షేత్రదర్శనంతో అమరావతి, కాశీ పుణ్య క్షేత్రాలకు యాత్ర చేసినంత ఫలితం ఉంటుంది.”

ఆలయంలోకి ఈ దేవాలయాన్ని నారద, ఇంద్ర, బ్రహ్మాది దేవతలు తిలోత్తమవంటి అప్సరసలు, మునులు, కవులు దర్శించుకుని తరించారు. త్రిమతాచార్యులకు ఆరాధిం శ్రీకూర్మనాధస్వామి. అష్టపదులను రచించిన జయదేవుడు, చైతన్య ప్రభూ, శ్రీనరహరితీర్థులు, శ్రీనాధమహాకవి, శ్రీకృష్ణదేవరాయలువంటివారు స్వామిని దర్శించినట్టుగా చారిత్రిక కథనాలు తెలియజేస్తున్నాయి. 

ఈ ఆలయానికి క్షేత్రపాలకునిగా కాలభైరవుడు, రక్షకుడుగా హనుమంతుడు, పరివార దేవతలుగా వైష్ణవీదుర్గా (జమ్మూకాశ్మీర్ ప్రాంత్రం లోగల వైష్ణోదేవీ విగ్రహాన్ని పోలిన విగ్రహం ఈ ఆలయంలో ఉంది) నరసింహస్వామి, గణపతి, శివుడు, వేణుగోపాలస్వామిని బ్రహ్మ ప్రతిష్టించినట్లుగా బ్రహ్మాండపురాణ కథనం. 

ఈ క్షేత్రానికి పశ్చిమభాగంలో కాలభైరవుడు పూర్వభాగస్థితి వంశధారాది సంగమ ప్రదేశంలో కర్పూరేశ్వరుడు, పశ్చిమభాగస్థితి హరుకేశ్వరస్వామి కొలువయి భక్తులను కరుణిస్తున్నారు. ఇది పంచాలింగారాధ్య క్షేత్రం. అంటే, ఐదుగురు శివులు క్షేత్రపాలకులై స్వామిని ఆరాధిస్తున్నారు. వంశధార సాగరసంగమ ప్రాంతమైన కళింగపట్నంలో కర్పూరేశ్వరుడు, పడమట సింధూర పర్వతంపై (సింగుపురంకొండ) హటకేశ్వరుడు, దక్షిణాన నాగావళి తీరానగల (శ్రీకాకుళపట్టణంలో) రుద్రకోటేశ్వరుడు, ఉత్తరాన “పిప్పల” (ఇప్పిలి) గ్రామంలో సుందరేశ్వరుడు శ్రీకూర్మ క్షేత్ర సుధాకుండతీర్థంలో పాతాళసిద్దేశ్వరుడు ఉన్నారు. ఇక్కడున్న అష్ట తీర్థములలో స్నానం చేస్తే, సమస్తరోగాలు నశిస్తాయని బ్రహ్మాండ, మార్కండేయ పురాణాలు తెలియజేస్తున్నాయి. నారదగుండం, సుధాగుండం, చక్రతీర్థం, మాధవతీర్థం, కౌటిల్యతీర్థం, వక్రతీర్థం, నరసింహపాతాళం, మహారథి అనే సముద్రం అష్టతీర్థాలుగా ఉంది భూలోక వైకుంఠంగా అలరారు తున్నది క్షేత్రం.

భారతదేశంలో శ్రీహరికూర్మరూపంలో స్థిరంగా ఉన్నాడని, ఆయన దక్షిణకుక్షిలో ఆంద్రరాష్ట్రంలో వెలసియున్నాడని మార్కండేయ పురాణం తెలియజేస్తోంది.కూర్మనాదుడ్ని శ్రీకాకుళంజిల్లాలోని శ్రీకూర్మంలో అర్చించడం ముక్తిదాయకమని పురాణాల ఉవాచ. అంతేకాక ఈ క్షేత్రదర్శనం వలన ముక్తి మోక్షాలు కలుగుతాయని పద్మపురాణంలో 30 అధ్యాయాల్లో, బ్రహాండపురాణంలో మూడవ అధ్యాయంలో చెప్పబడింది. 

ఈ క్షేత్రదర్శనం వలన పునర్జన్మకు అవకాశం లేదని పద్మపురాణం ప్రతి సంవత్సరం ఫాల్గుణమాసంలో డోలోత్సవం ఎంతో ఘనంగా జరుగుతుంది. వైశాఖ సప్తమి-పూర్ణిమ దాకా కల్యానోత్సవం జరుగుతుంది.

సంకలనం: నాగవరపు రవీంద్ర

23, జూన్ 2020, మంగళవారం

పూరి జగన్నాథ - Purii Jagannath


భారతీయ సంస్కృతిలో అదో అద్భుతం. పౌరాణిక- చారిత్రిక ప్రాధాన్యం కలిగిన పుణ్యక్షేత్రం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒకానొక దివ్యయాత్రా ధామం. అక్కడ విగ్రహం నుంచి ప్రసాదం వరకూ అంతా విశిష్టమే. ఆషాడ మాసంలో జరిగే జగన్నాథ రథయాత్ర మహిమ ఏమిటి? మన సంస్కృతీ- సంప్రదాయాలకూ ఇక్కడి యాత్రకూ సంబంధమేంటి? జగన్నాథుడు దేవేరులతో కాక సోదర- సోదరీ మణులతో దర్శనమివ్వడానికి కారణాలేమిటి?

రథోత్సవం అంటే అదే. అశేష భక్తజనులను ఒక్కసారిగా దర్శించాలంటే ఆ ఉత్సవాలకు వెళ్తే సరి. ప్రపంచంలో భక్తజనం పోటెత్తే.. కొన్నంటే కొన్ని ఉత్సవాల్లో దీనికి ప్రత్యేక స్థానముంది. ఆ ఉత్సవాల్లో పాల్గొనడం అంటే  జనసంద్రాన్ని దగ్గరుండి చూడ్డం. సోదర తత్వానికీ, మత సామరస్యానికీ ప్రతీక అయిన జగన్నాథ్ రథయాత్ర విశేషాలు ..
 • 9 రోజులు
 • 18 ఏనుగులు
 • 38 మంది మల్లయోధులు
 • 101 వాహనాలు
 • 136వ రథయాత్ర
 • మొత్తంగా  = 420 ఏళ్ల చరిత్ర..
ఇదీ గణాంకాల్లో పూరీ జగన్నాథ రథయాత్రా వైభవం. జగన్నాథుడంటే విశ్వానికి అధిపతి అని అర్ధం. అలాంటి జగన్నాథుడు కొలువైన పురుమే పూరీ. అంతటి జగన్నాథమూర్తికి చేసే రథయాత్ర ఎలా వుండాలి? అదే కనిపిస్తుందీ యాత్రలో. ఈ వేడుకలు తొమ్మిరోజుల పాటూ అంగరంగ వైభవంగా జరుగుతాయి. కుల- మత- వర్గ బేధాలను మరచి దేశవిదేశీ భక్తులు పోటెత్తుతారు. బలభద్ర, సుభద్రా సమేత జగన్నాథుడ్ని తనివితీరా దర్శిస్తారు. 

ఎప్పటికప్పుడు కొత్తగా చేసే రథాలతో ఆ ఉత్సవ తీరు అద్భుతం. మూలవిరాట్, ఉత్సవ విగ్రహాలు రెండూ ఒకటిగా వుండే ఏకైక ఆలయం. అంతే కాదు  మహావిష్ణు అవతారాల్లో ఒకటైన కృష్ణుడు  ఇక్కడ తన దేవేరులతో కాక, సోదరుడు బలరాముడు.. సోదరి సుభద్రలతో దర్శనమిచ్చే అరుదైన పుణ్యధామం.. పూరీ జగన్నాథ్  దేవాలయం. 

వైష్ణవాలయాల్లో పూరీ జగన్నాథ్ కి విశిష్ట స్తానముంది. ఆదిశంకరుల వారి దృష్టిలో ఈ క్షేత్రానికి విశేష ప్రాముఖ్యత వుంది. 17వ శక్తి పీఠంగా ఇక్కడి విమలాదేవి పూజలందుకుంటోంది. శివకేశవ తత్వానికి ప్రతీక. వైష్ణవ శక్తికి కేంద్రంగా భక్తుల నీరాజనాలందుకుంటోన్న వైభవ క్షేత్రం పూరీ. ప్రతి హిందువూ తన జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించి తీరాలనుకునే ఒకానొక దివ్యధామం. చార్ ధామ్ క్షేత్రాల్లో అత్యంత ప్రధానమైంది.
పూరీ రథోత్సవం
జగన్నాథ్ రథయాత్ర శ్రీకృష్ణ భగవానుడు గోకులం నుంచి మధుర వరకూ చేసే యాత్రగా పరిగణించబడుతుంది. ఆలయంలో బలభద్ర, జగన్నాధ, సుభద్రల విగ్రహాలను తెచ్చి.. రథంలో పత్రిష్ఠించి యాత్ర జరుపుతారు. ఆలయం ముందు నుంచి మొదలయ్యే యాత్ర.. కిలో మీటరు దూరంలోని 'గుండీచ' మందిరం వరకు సాగుతుంది.  రథయాత్ర ప్రారంభంమయ్యే ముందు రథాన్ని, అక్కడి ప్రాంతాన్ని.. రాజ వంశీయులు బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. రాజైనా.. దేవుడి ముందు సేవకుడే అని తెలిపేందుకు అనాదిగా ఈ ఆచారం పాటిస్తుడటం విశేషం. 

రథోత్సవాలు ఎన్నో జరుగుతాయి. కానీ పూరీ రథోత్సవానికి మాత్రమే విశేషమైన ప్రాధాన్యత వుంది. ఇక్కడి జగన్నాథుడు రథమెక్కి వూరేగడానికే ఉన్నాడనిపిస్తుంది. ఇంతకీ రథోత్సవ సంబరం దేన్ని సూచిస్తుంది? జగన్నాథడి తత్వం ఇందులో దాగి వుందా? రథాల తయారీ నుంచి విగ్రహాల మార్పు వరకూ జగన్నాథుని ఇతర విశేషాలేమిటి? 

రథోత్సవం అంటే సాక్షాత్తూ ఆ భగవంతుడే భక్తుడెక్కడ వున్నాడో వెతుక్కుని మరీ రావడం. కృష్ణుడసలే భక్తజనసమ్మోనుడు. అందుకే ఆయనకు జనార్ధనుడన్న పేరు. నరులతో అత్యంత సన్నిహిత సంబంధాలుంటాయి కనుకనే, నరనారాయణ స్వరూపుడిగా  పూజలందుకుంటాడు. ఆయనకు భక్తజనులతో కలసి మెలసి వుండటం అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయన బాల్యం, యవ్వనం, జనసమూహంతో కలసి కనిపిస్తుంది. కృష్ణుడికి చిన్నప్పుడు ఎందరో మిత్రులు. పెద్దయ్యాక పదహారు వేల మంది గోపికలతో సహవాసం. అష్టభార్యలతో సంసారం. ఇలా కృష్ణుడు ఏది తీసుకున్నా అసంఖ్యాక భక్తజనంతో సరస-సంభాషణలు సాగిస్తున్నట్టు కనిపిస్తుంది. భాగవతం చదివితే కృష్ణుడెంతటి ప్రజాదైవమో అర్ధమవుతుంది. కనుక జనమంటే కృష్ణుడు కృష్ణుడంటే జనంగా భావించడం వుంది. అందుకే జగన్నాథుడి రథోత్సవానికి  భక్తజనులు అంతగా పోటెత్తుతారు.

జగన్నాథ రథయాత్ర విశేషాల సమాహారం. అందులో ప్రతిదానికీ ఓ వైశిష్ట్యం వుంది. రథయాతల్రో జగన్నాథుని రథాన్ని 'నందిఘోష్‌' గా  వ్యవహరిస్తారు. ఎరుపు, పసుపు రంగులతో చేయబడిన దివ్య వస్త్రాలతో అలంకరించబడిన ఈ రథం 45 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. దీనికి  పదహారు చక్రాలుంటాయి. బలభద్రుడి రథాన్ని 'తాళ్‌ధ్వజ్‌'  పేరుతో పిలుస్తారు. ఎరుపు, ఆకుపచ్చ రంగులతో ఉన్న దివ్య వస్త్రాలతో దీన్ని అలంకరిస్తారు. దీని ఎత్తు 44 అడుగులు. తాళ ధ్వజ్ కు 14 చక్రాలు ఉంటాయి. అదేవిధంగా సుభద్రాదేవి రథాన్ని 'దర్ప దళన' అంటారు. ఈ రథానికి 12 చక్రాలుంటాయి.  జగన్నాథుడు ఎన్ని ఆటంకాలనైనా దాటుకుని తన భక్తజనాన్ని కలుసుకోడానికి పెద్ద పెద్ద చక్రాలను రథానికి పూన్చుకుని అంగరంగ వైభవంగా వస్తాడు.  అందుకే వాటికి 'జగన్నాథ రథచక్రాల్' అన్న పేరొచ్చింది. 

గర్భాలయంలో రత్న సింహాసనంపై కొలువై ఉంటాడు జగన్నాథుడు. జగన్నాథుడు, ఆయన సోదరుడు బల భద్రుడు, సోదరి దేవి సుభద్ర దేవతా మూర్తులను ఆలయ సింహద్వారం గుండా బయటకు తీసుకువచ్చి అలంకరించిన రథాలలో ఉంచి ఊరేగింపు చేస్తారు. ఈ సందర్భంగా భక్తులు తన్మయత్వం మాటల్లో చెప్పడం కష్టం. విశేష పూజలు నిర్వహిస్తారు.  ప్రత్యేక రీతిలో మూడు రథాలు  ముందుకు కదులుతూ అదో సంబరంగా ఉంటుంది. రథం కదిలే సమయంలో శంఖారావం, గంటానాదం చేస్తారు. ప్రాచీన ఐరోపా నావికులు ఈ రథచక్రాల కింద ప్రమాదవశాత్తు పడటమో, మొక్కు కోసం ఆత్మబలిదానాల ఇవ్వడమో జరిగేదని కథలు కథలుగా చెబుతారు.

జగన్నాథ విగ్రహాలు, రథాల నిర్మాణానికి  ఒక విధానముంది. జగన్నాథ ఆలయంలో జరిగే విశేష పూజలు కూడా నియమనిష్టలతో కూడి వుంటాయి.  ప్రతి పన్నెండు నుంచి పందొమ్మిదేళ్లకొకసారి ఏ ఏడాదిలో ఆషాడ మాసం రెండుసార్లు వస్తుందో.. అప్పుడు 'నబకలేవర' ఉత్సవం పేరుతో చెక్క విగ్రహాలను  మారుస్తారు. ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజున జరిగే 'చందన యాత్ర'  రథాల నిర్మాణం మొదలు పెట్టడాన్ని సూచిస్తుంది. ప్రతి సంవత్సరం 'స్నానయాత్ర' పేరుతో జ్యేష్ట మాసంలోని పౌర్ణమి రోజున జగన్నాథ తదితర ప్రతిమలకు వేడుకగా స్నానం చేయించి అలంకరిస్తారు. అలాగే వసంతకాలంలో 'డోలయాత్ర' వర్షాకాలంలో 'ఝులన్‌' యాత్ర పండుగలు చేస్తారు. 
పంచాంగం ప్రకారం పవిత్రోత్సవం, దమనక ఉత్సవాన్ని జరుపుతారు. అలాగే కార్తీక, పుష్య మాసాలలో ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తుంటారు. ఆగమ, జ్యోతిష, గ్రహగతుల లెక్కల ప్రకారం ఈ మూర్తులను ఖననంచేసి వాటిస్థానే కొత్తవి చేర్చటం జరుగుతుంది. అయితే జగన్నాధుని నాభిపద్మం మాత్రం పాతవాటి నుండి కొత్త విగ్రహాలకు మార్చబడుతుంది కానీ, తీసి వేయటం జరుగదు.
సుదర్శన చక్రం
ఇంతకీ పూరీ జగన్నాథ ఆలయ చరిత్ర ఏమిటి? స్థలపురాణం ఏం చెబుతోంది. జగన్నాథ ఆలయంపై నున్న సుదర్శన చక్రానికీ, ఎగిరే జెండాకూ అర్ధం ఏమిటి? జగన్నాథ ఆలయానికీ బౌద్ధానికీ వున్న సంబంధమేమిటి?  తెలుసుకుందాం.

వాస్తవానికి మహావిష్ణువును జగన్నాథుడితో పాటు పద్మనాభుడని కూడా పిలుస్తారు. విష్ణువు నాభిలోంచి బ్రహ్మ పుట్టాడని చెబుతుంది విష్ణు పురాణం. అందుకే జగన్నాథుడి విగ్రహాలను మార్చినా, నాభి మాత్రం అలాగే వుంచుతారు. జగన్నాథుడి నాభిలో బుద్ధుడి దంతం పొందుపరచబడి వుండేదన్న మరో కథనం కూడా ప్రచారంలో వుంది. అందుకే ఇక్కడి మూర్తి నాభికి అంతటి విలువని చెబుతారు. బుద్ధడి దంతానికీ ఇక్కడి ఆలయంలోని స్థూపానికీ సంబంధముందని కూడా చెబుతారు. బుద్ధుడి దంతం కూడుకున్న స్థూపం.. తర్వాతి కాలంలో శ్రీలంకలోని కాండీకి తరలించబడిందని అంటారు.  

జగన్నాథుడ్ని హిందువులందరూ దర్శించవచ్చు. కానీ అన్యమతస్తులకు అనుమతి లేదు. ఇలాంటి వారు దగ్గర్లోని రఘునందన లైబ్రరీ భవనంపై నుంచి ఆలయం మొత్తాన్ని చూడవచ్చు. ఇక్కడ బడే కృష్ణ, రోహిణీ, మార్కండేయ, మహారథి, నరేంద్ర అనే పంచతీర్ధాలున్నాయి. బడే కృష్ణ, రోహిణీ తీర్ధాలు వీటిలో ప్రముఖమైనవి. నరేంద్ర తీర్ధం స్వచ్ఛమైన జలాలతో నిండి వుంటుందట. అందువల్ల దీనిలో స్నానం చేస్తే మంచిదని చెబుతారు.


పూరీ జగన్నాథ ఆలయ గోపురపు అంచు మీద.. సుదర్శన చక్రం దర్శనమిస్తుంది. ఇది నారాయణ రూపంలో నాలుగోది. దీనిపై ఒక పసుపు జెండా ఎగురుతూ కనిపిస్తుంది. దీనిలోని ఎరుపు గుర్తు జగాన్నాథుడు ఆలయంలోనే వున్నాడని సూచిస్తుందని భావిస్తారు. 
ఈ మధ్య కనుగొన్న గంగా రాజవంశానికి చెందిన రాగి ఫలకాల ప్రకారం, ప్రస్తుతమున్న జగన్నాథ ఆలయం ఎప్పటిదో తెలిసింది.  ఆలయ నిర్మాణాన్ని కళింగ పరిపాలకుడైన 'అనంతవర్మన చోడ గంగాదేవ' ప్రారంభించాడట. ఈ ఆలయంలోని జగన్మోహన, విమన భాగాలు ఈ రాజు హయాంలో.. అంటే 1078 - 1148 CE మధ్య కాలంలో నిర్మించబడ్డాయి. అయితే 1174 CE లో ఒరిస్సా పాలకుడైన అనంగ భీమదేవ దీన్ని పునర్నిమించాడని తెలుస్తోంది.  ప్రస్తుతమున్న ఆలయ రూపు అప్పటిదే అంటున్నారు.

ఈ ఆలయ మూలాలకు సంభందించిన సంప్రదాయ గాథల గురించి  చెప్పాల్సి వస్తే కృతయుగానికి వెళ్లాల్సి వుంటుంది. ఇక్కడ ప్రచారంలో వున్న కథనం ప్రకారం, కృతయుగంలో  జగన్నాథుడు  పూరీ సముద్రతీర సమీపంలోని మర్రి చెట్టు దగ్గర ఇంద్రనీల ఆభరణంగా అవతరించాడట. అది ఎంత ప్రకాశావంతమైందంటే, దాన్ని చూసిన వారికి తక్షణ మోక్షం లభిస్తుందన్న నమ్మకం వుండేది. ఈ నీలాభరణాన్ని యముడు   భూమిలో దాచిపెట్టాలనుకున్నాడట. అందులో విజయం సాధించాడు కూడా. ద్వాపర యుగంలో మాల్వాకి చెందిన ఇంద్రద్యుమ్న అనే రాజు.. అంతుపట్టని ఆభరణ రూపం గురించి తెలుసుకోవాలన్నాడట. అందుకోసం ఘోర   తపస్సు చేసాడట. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమయ్యి, జగన్నాథ పురి సముద్ర తీరానికి వెళ్లి.. అక్కడ తేలుతున్న చెట్టు దుంగను కనుక్కొని.. దాని కాండం నుంచి తనకు కావలసిన రూపు తయారు చేయమని ఆజ్ఞాపించాడట.

విష్ణు మూర్తి ఆజ్ఞ ప్రకారం.. రాజు చెక్క దుంగను కనుక్కొన్నాడట. తర్వాత అద్భుతమైన యజ్ఞాన్ని నిర్వహించాడు.  యజ్ఞ ఫలంగా యజ్ఞ నరసింహరాజు ప్రత్యక్షమై.. నారాయణుడ్ని నాలుగు రూపాల్లో నిర్మించమని చెప్పాడట. అలా చెట్టు దుంగ నుంచి జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన రూపాలను తయారు చేశాడు.  ఆ రూపాలే వాసుదేవ, సంకర్షణ, యోగమయీ, సుదర్శన రూపాలు. ఇలా కృష్ణమూర్తి తన సోదరులు, సుదర్శన చక్రంతో దర్శనమిస్తూ.. భక్తజన నీరాజనాలు అందుకుంటున్నాడు. 

హైందవాలయాల్లో మూలవిరాట్టును రాతి రూపంలో, ఉత్సవ విగ్రహాలను పంచ లోహ విగ్రహాల్లో చేస్తారు. కానీ పూరీలో విగ్రహాలను కొయ్యతో చేస్తారు. ఎందుకిలా? దీనికి కారణంగా పౌరాణిక గాథలను చెప్పుకున్నా.. ఇందులో మరేదైనా సాంస్కృతిక మర్మం దాగి వుందా? ఇక్కడి విగ్రహం ధర్మం, ప్రధాన ద్వారం, ప్రసాదం వరకూ ప్రతిదీ ఓ చారత్రాత్మక- సాంస్కృతిక- ఆధ్యాత్మిక వైభోగమే. అదేమిటో చూద్దాం.

జగన్నాథ్ ఆలయమున్న స్థలాన్ని శ్రీక్షేత్రగా పిలుస్తారు. ఇది మన   భారతీయ సంస్కృతులకు అద్దం పడుతుందని అంటారు.  ఈ స్థలాన్ని భారతీయ చరిత్రలోకెల్లా భిన్నమైందిగా భావిస్తారు. పౌరాణికాంశాలను పక్కన పెట్టి చరిత్ర ప్రస్తావిస్తే.. శబరాలనే ఆదివాసీలు జగన్నాథుడ్ని చెక్కరూపంలో చెక్కి నారాయణ రూపంగా పూజించేవారు. ఈ చెక్క విగ్రహాలు, ప్రాచీన కాలం నుంచి వస్తున్న చెక్క స్తంభాలను కొలవటం అనే ఆచారంతో ముడిపడిన అంశాలని అంటారు. అంతేకాదు ఒడిశ్శాకు చెందిన ఆదివాసీ వంశస్థులుగా చెప్పుకొనే ధైతపతులు ఇప్పటికీ ఆలయంలో జరిగే పూజా కార్యకలాపాల్లో పాల్గొంటారు. దీన్ని బట్టి..  శ్రీక్షేత్ర చరిత్ర హైందవ- ఆదివాసీ సంస్కృతులకు చెందిందని చెప్పవచ్చు. 

ఇలా జగన్నాథ సేవ భారతీయ సంస్కృతిలో భాగమయ్యింది. అంతే కాదు జైన సంప్రదాయానికీ జగన్నాథ ఆరాధనకూ సంబంధముంది. ఈ మూడు విగ్రహాలు.. త్రిరథ జైన ఆచారాలుగా పిలిచే సమ్యక్ దర్శన్, సమ్యక్ జ్ఞానంద్, సమ్యక్ చరిత్రకు ప్రతీకగా భావిస్తారు.  మోక్షం లేక అనంతమైన ఆనందానికి మార్గమని దీనర్ధం. 

జగన్నాథుడు  ఇక్కడ వైష్ణవ రూపుగా కొలవబడుతున్నాడు. అదే సమయంలో ఈ ఆలయంలోని మరికొన్ని విగ్రహాలను శివ రూపమైన భైరవ, శివ పత్ని  విమలగా కొలుస్తుంటారు.  పూరి జగన్నాథ్ శ్రీక్షేత్ర  సంస్కృతీ సంప్రదాయాలు.. హైందవంలోని శివ-శక్తి- వైష్ణవ తత్వాలకు ప్రతీకలుగా నిలిచాయి. అలాగే జైన, బౌద్ధమతాల్లోని అంశాల మేలుకలయికతో ఏర్పడినట్టు కూడా చెబుతారు.   

పూరీ ఎంతటి ప్రసిద్ధ క్షేత్రమంటే, ఇప్పటి వరకూ ప్రతి హైందవ మతాచార్యుడూ ఈ క్షేత్ర దర్శనం చేశారు. ఒక్క మాధవాచార్యులు తప్ప.. ఈ క్షేత్రాన్ని ప్రముఖ ఆచార్యులందరూ దర్శించారు. ఆదిశంకరాచార్యులు ఇక్కడ గోవర్ధన మఠాన్ని స్థాపించారు. అలాగే రామానుజాచార్య, నింబర్కాచార్యలతో పాటు గుడియ వైష్ణవ మతానికి చెందిన అనేక మఠాలను ఇక్కడ చూడవచ్చు. శ్రీపాద వల్లభాచార్య కూడా పూరీని సందర్శించినప్పుడు.. ఇక్కడ తన భైఠకాన్ని ఏర్పరుచుకున్నారు. గురునానక్, కబీర్, తులసీదాస్ లు కూడా ఈ స్థలాన్ని దర్శించిన ఆధారాలున్నాయి. 

పూరీ ఆలయం విశాలమైంది. నాలుగు లక్షల చదరపు అడుగుల  కన్నా ఎక్కువ వైశాల్యంలో నిర్మించబడి వుంది. ఇందులో సుమారు 120 ఉపాలయాలు, ఇతర పూజా స్థలాలున్నాయి. ఒడిశ్శా నిర్మాణ శైలిలో.. అమోఘమైన శిల్ప సంపద దర్శనమిస్తుంది. అందుకే పూరీ జగన్నాథ ఆలయాన్ని భారత అద్భుత కట్టడాలలో ఒకటిగా చెబుతారు. ప్రధాన ఆలయంలో విష్ణువుకు చెందిన శ్రీచక్ర నిర్మించబడి వుంటుంది. ఇది ఎనిమిది ఆకుల చక్రం. దీన్ని "నీలచక్ర"గానూ పిలుస్తారు. అష్టదాతుతో తయారైన ఈ చక్రం ఎంతో పవిత్రమైంది. ఈ ఆలయ ధ్వజస్తంభం ఎత్తైన  రాతి దిమ్మపై ఉంది. ఇది విగ్రహాలున్న గర్భగుడి కన్నా ఎత్తులో వుంటుంది. 

మాములుగా ఆలయంలోకి వెళ్లే ప్రధాన ప్రవేశ ద్వారాన్ని సింహద్వారంగా పిలుస్తుంటారు. పూరీ ఆలయం చూస్తే ఇలా ఎందుకు పిలుస్తారో అర్ధమవుతుంది. దీనికా పేరు రావటానికి కారణం.. ద్వారాలకు ఇరువైపులా వుండే రాతి సింహాలు. ఆలయంలోని మిగిలిన మూడు ద్వారాల పేరేమిటో తెలుసా.. హాథీద్వార, వ్యాఘ్రద్వారా, అశ్వద్వారా. అంటే ఏనుగు, పులి, గుర్రపు ద్వారాలన్నమాట. ప్రధానమైన సింహ ద్వారం.. తూర్పు ముఖంగా ఉండి 'బడా దందా' గా పిలిచే  పెద్ద రోడ్డు కు దారి చూపుతుంది . బైసీ పహచ అంటే, ఇరవై రెండు మెట్ల వరుస.. ఆలయంలోకి దారి చూపుస్తుంది. 

రథయాత్ర మొదలయ్యే ముందు జగన్నాథ్, బలభద్ర, సుభద్రల విగ్రహాలను ఈ దారిలోనే తీసుకెళ్తారు. వాటిని గుండీచ మందిరం నుంచి తీసుకు వచ్చేటప్పుడు తనను నిర్లక్ష్యం చేసి  యాత్రకు తీసుకు వెళ్లనందుకు అలిగిన మహాలక్ష్మిని జాతర రూపంలో శాంత పరుస్తారు. అప్పుడే విగ్రహరూపంలో ఈ ద్వారం తలుపులపై ఉన్న మహాలక్ష్మి వారిని ఆలయంలోకి రావడానికి అనుమతిని ఇస్తుందని నమ్ముతారు. అంతే కాదు పూరీ ఆలయ ప్రసాదం కూడా అద్భుతమైన రుచి కలిగి వుంటుంది. నూనె చుక్క వాడకుండా మట్టికుండలను ఒకదానిపై ఒకటి పెట్టి, వేడి చేసి వుడక పెడతారిక్కడి ప్రసాదాన్ని. దీనికింతటి రుచి రావడానికి కారణం..  సాక్షాత్తూ ఆ మహాలక్ష్మీ దేవి పర్యవేక్షణలో వంటావార్పు జరగడమే అని నమ్ముతారు.  

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి 

20, జూన్ 2020, శనివారం

అంగ్‌కోర్ వాట్ దేవాలయం - కంబోడియా - Angkor Wat Temple - Cambodia
అంగ్‌కోర్ వాట్ దేవాలయం - కంబోడియా - Angkor Wat Temple - Cambodia

భారతీయ సంస్కృతికి చిహ్నంగా.. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా వెలుగొందుతోంది కంబోడియాలోని "అంగ్‌కోర్‌ వాట్ దేవాలయం". ప్రపంచ చారిత్రక కట్టడాలలో ఒకటిగా పేరు సంపాదించిన ఈ ఆలయం.. అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో నిర్మించబడి, హిందూ సంస్కృతీ సౌరభాలను వెదజల్లుతోంది. భారతీయ పురాణేతిహాసాలను తనలో ఇముడ్చుకుని అందర్నీ ఆకర్షిస్తోంది.

కంబోడియా జాతీయ పతాకంలో కూడా చోటు దక్కించుకున్న అంగ్‌కోర్ వాట్.. ప్రపంచ ఆధునిక నాగరికతల్లో ఒకటిగా చెప్పబడే "ఖ్మేర్" సామ్రాజ్య కాలంలో నిర్మించినట్లు చెబుతుంటారు. ఈ దేవాలయ గోడలపై విష్ణుమూర్తి మొదలగు హిందూ దేవుళ్లతోపాటు.. రామాయణ, మహాభారత కాలంనాటి అద్భుతమైన ఘట్టాలు శిలా రూపాల్లో అత్యద్భుతంగా చెక్కబడి మనకు దర్శనమిస్తాయి.
అంగ్‌కోర్ వాట్ దేవాలయం
అంగ్‌కోర్ వాట్ దేవాలయం
కంబోడియాలోని "సీమ్ రీప్" అనే పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది "అంగ్‌కోర్ వాట్" దేవాలయం. ఖ్మేర్ సామ్రాజ్యకాలంలో ఈ ఆలయానికి అంకురార్పణ జరిగినట్లు తెలుస్తోంది. క్రీస్తు శకం 12వ శతాబ్దంలో అంగ్‌కోర్ వాట్‌ను రాజధానిగా చేసుకుని పరిపాలించిన రెండవ సూర్యవర్మన్ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు పలు చారిత్రక ఆధారాలు రుజువు చేస్తున్నాయి.

"టోనెల్ సాప్" సరస్సు తీరాన, 200 చదరపు కిలోమీటర్ల సువిశాలమైన ప్రదేశంలో.. "కులేన్" పర్వత శ్రేణుల పాదాలవద్ద అంగ్‌కోర్ వాట్ దేవాలయం నిర్మించబడింది. ఇది ప్రపంచంలోని అతి పెద్ద హిందూ దేవాలయంగానే కాకుండా.. అతిపెద్ద మహావిష్ణుదేవాలయంగా కూడా పేరు సంపాదించింది.

అంగ్‌కోర్ వాట్.. చాలా దేవాలయాల సముదాయం. పురాతన కాలంలోనే ఖచ్చితమైన కొలతలు, అద్భుతమైన ఆర్కిటెక్చర్ పనివిధానంతో ఈ ఆలయాన్ని రూపొందించటం ఇప్పటికీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. హిందూ సాంప్రదాయ అస్థిత్వం ఉండే భారత ఉపఖండంలో కూడా ఇంత పెద్ద దేవాలయం లేదని చెబితే అతిశయోక్తి కాదు.
అంగ్‌కోర్ వాట్ దేవాలయం లోపలి దృశ్యం
అంగ్‌కోర్ వాట్ దేవాలయం లోపలి దృశ్యం 
ఈ దేవాలయాన్ని నిర్మించేందుకు సుమారు 30 సంవత్సరాల కాలం పట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ దేవాలయ నిర్మాణం.. అచ్చం తమిళనాడులోని దేవాలయాలను పోలి ఉండటం విశేషం. తమిళ చోళ రాజుల కాలంనాటి నిర్మాణ పద్ధతులు అంగ్‌కోర్ వాట్ ఆలయ నిర్మాణంలో గోచరిస్తూ ఉంటాయి. అదీ.. ఖ్మేర్ సామ్రాజ్య కాలంలో నిర్మించిన ఇతర దేవాలయాలకు కాస్త భిన్నంగా.. అంగ్‌కోర్ వాట్ ఆలయం పశ్చిమ ముఖద్వారాన్ని కలిగి ఉంటుంది.

ఖ్మేర్ పరిపాలనలో నీటిని నిల్వ ఉంచుకుని.. కరువు కాటకాలప్పుడు వాడుకునే టెక్నాలజీని అప్పట్లోనే అమలు చేశారు. కాబట్టే.. ఆ సామ్రాజ్యంలో కరువు ఛాయలు ఉండేవికావట. వీరు నీటిని నిల్వ ఉంచేందుకు వాటిన టెక్నాలజీలో.. నీరు పల్లం నుంచి ఎత్తుకు ప్రవహించేదట.. ఇదే టెక్నాలజీని అంగ్‌కోర్ వాట్ ఆలయ నిర్మాణంలో వాడారు.

ఈ టెక్నాలజీ ఎలా సాధ్యమయ్యిందనే విషయం నేటి ఆధునిక సాంకేతిన నిపుణులకు సైతం అంతుబట్టకుండా ఉంది. 5 మైళ్ల పొడవు, ఒకటిన్నర మైలు విశాలంతో నిర్మితమైన "బారే" (రిజర్వాయర్లు)లు ఆనాటి అద్భుతమైన ఇంజనీరింగ్ పనితీరుకు అద్దంపట్టేలా దర్శనమిస్తున్నాయి.
అంగ్‌కోర్ వాట్ దేవాలయం - కంబోడియా
అంగ్‌కోర్ వాట్ దేవాలయం గగన దృశ్యం - కంబోడియా
అదలా ఉంచితే.. ఈ ఆలయ సందర్శనం జీవితంలో ఓ మరపురాని అనుభూతిగా మిగులుతుందటే ఆశ్చర్యపడాల్సింది లేదు. పచ్చగా పరచుకున్న పరిసరాలలో మమేకమవుతూ... మెకాంగ్ నదీమార్గం గుండా పడవలో ప్రయాణిస్తూ చేసే ప్రయాణం ఓ అందమైన జ్ఞాపకమవుతుంది. వియత్నాంలోని చావూ డాక్ నుంచి బయల్దేరి కంబోడియా రాజధాని "నోమ్ పెన్" మీదుగా సీమ్ రీప్ చేరుకోవచ్చు

అంగ్‌కోర్ వాట్ దేవాలయం ముఖద్వారం నుంచి లోపలికి వెళ్లగానే పచ్చదనంతో కూడిన పరిసరాలు హాయిగా స్వాగతం పలుకుతాయి. ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా దర్శనమిచ్చేవి అద్భుతంగా నిర్మితమైన మూడు ఆలయ గోపురాలు. మధ్య గోపురం నుంచి ప్రయాణిస్తే.. అనేక గోపురాలు దర్శనమిస్తాయి.

ఈ ఆలయంలో ప్రత్యేకంగా సూర్యోదయం గురించి చెప్పుకోవాల్సి ఉంది. సూర్యోదయం వేళలో ఆలయ దర్శనం అద్భుతంగా ఉంటుంది. గోపుర ద్వారం నుంచి లోపలికి అడుగుపెట్టగానే.. గోపురం చాటు నుంచీ దోబూచులాడుతూ కిందకు జాలువారే ఉదయభానుడి లేలేత కిరణాలు ఓ అద్భుతమైన సుందర దృశ్యాన్ని కళ్లముందు నిలుపుతాయి. ఆ దృశ్యాన్ని చూసేందుకు రెండుకళ్లూ చాలవనిపిస్తుంది.

భారతదేశంలోగల అన్ని హిందూ ఆలయాలకుమల్లే అంగ్‌కోర్ వాట్‌ గోడలపై కూడా అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉంటాయి. ఈ ఆలయంలోని మరో అద్భుత ప్రదేశం "బ్యాస్ రిలీఫ్స్" గ్యాలరీ. నాలుగు గోడలతో నిర్మితమైన ఈ మంటపంలో ఎక్కడ చూసినా హిందూ పురాణ గాథలు కనిపిస్తాయి. ముఖ్యంగా తూర్పువైపున ఉండే "మంటన్" గ్యాలరీ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. రామాయణ, మహాభారత దృశ్యాలు.. దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన క్షీరసాగర మథన దృశ్యాలు అందర్నీ అబ్బురపరుస్తాయి.

ఆలయం తూర్పున పుట్టుక, అవతారాల గురించిన శిల్పాలు, పశ్చిమాన ఉండే మంటపం గోడలపై యుద్ధాలు, మరణాల గురించిన ఆకృతులు లో దర్శనమిస్తాయి. కురుక్షేత్ర యుద్ధం, రామ-రావణ యుద్ధంలాంటి అద్భుత సంఘటనలు సైతం ఈ గోడలలో అద్భుతంగా చెక్కబడి ఉంటాయి. ఇక దక్షిణ మంటంలో రెండవ సూర్యవర్మన్ సైనిక పటాలం.. మహామునులు, అప్సరసల నాట్య విన్యాసాలు, యమధర్మరాజు కొలువుదీరిన యమసభలాంటి అనేక కళాఖండాలు ఆయల గోడలపై సాక్షాత్కరిస్తాయి.

అంగ్‌కోర్ వాట్ దేవాలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే మరో అద్భుత ప్రదేశం "అంగ్‌కోర్ థోమ్". ఖ్మేర్ సామ్రాజ్యంలోని చివరి చక్రవర్తులలో ఒకరైన జయవర్మన్-6 ఈ థోమ్‌ను రాజధానిగా పరిపాలించినట్లు చారిత్రక ఆధారాలవల్ల తెలుస్తోంది. దీన్నే "గ్రేట్ సిటీ" అని కూడా పిలుస్తుంటారు. 9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది.
అంగ్‌కోర్ వాట్ దేవాలయంలో ఉన్న విష్ణు భగవానుని భారీ విగ్రహం
అంగ్‌కోర్ వాట్ దేవాలయంలో ఉన్న విష్ణు భగవానుని భారీ విగ్రహం
ఈ థోమ్‌లో కూడా అనేక పురాణ కళాకృతులు మన చూపును మరల్చనీయవు. ముఖ్యంగా బౌద్ధమత సంస్కృతి ఉట్టిపడేలా ఉండే ఈ ఆలయంలో ఏనుగుల మిద్దెలు, లెపర్ రాజు ప్రతిమలు, బెయాన్, బఫూన్ లాంటి అనేక నిర్మాణాలు అనేకం ఉన్నాయి. ఈ ఆలయం మధ్యలో చిన్న చిన్న మిద్దెలతో నిర్మించిన గోల్డెన్ టవర్ (బెయాన్) చూపరులను ఆకట్టుకునేలా ఉంటుంది. 54 అంతస్తులతో నిర్మితమైన ఈ బెయాన్‌ అంగ్‌కోర్ థోమ్‌కే ఓ ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు.

ఇక చివరిగా చెప్పుకోవాలంటే.. ఖ్మేర్ సామ్రాజ్య పురాణ గాథల ఆధారంగా చూస్తే... ఖ్మేర్ సామ్రాజ్యాధినేత "కాము"తో భరత ఖండానికి సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఆ ఖ్మేర్ నాగరికత తరువాత కొన్ని శతాబ్దాల అనంతరం భారతీయ సంస్కృతి కంబోడియాకు వ్యాపించి.. సంస్కృతం అధికార భాషగా.. హిందూ, బౌద్ధమతాలు అధికార సంప్రదాయాలుగా వెలుగొందాయట. కాబట్టి భారత సంస్కృతిని అణువణువునా నింపుకున్న ఈ అద్భుత కట్టడాలను జీవితంలో ఒక్కసారయినా దర్శించుకుంటే జీవితం ధన్యమైనట్లే..!

సంకలనం: rmiddela

13, జూన్ 2020, శనివారం

వైకోమ్ మహాదేవ్ ఆలయం,వైక్కతప్పన్ - Vaikkathappan

వైకోమ్ శివాలయము: వైక్కతప్పన్

పురాతన సంస్కృత గ్రంథాలు, భార్గవ పురాణం & సనత్కుమార సంహిత ఈ స్థలాన్ని వైయఘ్ర గెహం మరియు వైయఘ్రాపురం అని పేర్కొన్నాయి.

ఇతిహాసాల ప్రకారం వ్యాఘ్రపాద మహర్షికి ఇక్కడ శివ దర్శనం జరిగినది, కాబట్టి దీనిని సముచితంగా వ్యాగ్రపాదపురం అని పిలిచేవారు. తరువాత, తమిళం వ్యాపించినప్పుడు, వ్యాఘ్ర అనే పదం వైకోమ్ గా రూపాంతరం చెందినది.

ఈ రోజు వైకోమ్ దక్షిణ భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన శివ మందిరాలలో ఒకటి. ఎత్తూమనూర్ శివాలయం, కడుతురుతి తాలియిల్ మహాదేవ ఆలయంతో పాటు ఉన్న ఈ ఆలయం శక్తివంతమైన త్రిశూలంగా పరిగణించబడుతుంది. ‘ఉచ పూజ’కు ముందు ఈ మూడు దేవాలయాలలో భక్తుడు పూజలు చేస్తే, అతని కోరికలన్నీ నెరవేరుతాయి అని నమ్మకము.
వైక్కత్తాష్టమి ఆలయంలో అందరికి బాగా తెలిసిన పండుగ అయినప్పటికీ, ఈ ఆలయములో అనేక ఇతర పండుగలను జరుగును, వాటిలో కొన్ని ఈ ఆలయానికి ప్రత్యేకమైనవి.
వైకోమ్ మహాదేవ్ ఆలయం
వైకోమ్ మహాదేవ్ ఆలయం
మాల్యావన్ నుండి శైవ విద్య ఉపదేశము అందుకున్న ఖరసురుడు చిదంబరానికి వెళ్లి, మోక్షం సాధించడానికి తీవ్రమైన తపస్సు చేసాడు. అతని తపస్సుకు సంతోషించిన శివుడు తాను అడిగిన అన్ని వరాలను మంజూరు చేశాడు మరియు తన నుండి తీసిన మూడు గొప్ప శివలింగాలను అతనికి సమర్పించాడు. అతను ఆ లింగములలో ఎప్పుడూ ఉంటాడని భరోసా ఇచ్చి, మోక్షాన్ని పొందటానికి లింగాన్ని పూజించమని ఖారాకు తెలిపి శివుడు అదృశ్యమయ్యాడు, . ఖారా మూడు లింగాలతో కుడి చేతిలో ఒకటి, ఎడమ చేతిలో ఒకటి మరియు మరొకటి మెడలో ఉంచుకొని హిమాలయాల నుండి దక్షిణమునకు తిరిగి వస్తున్నప్పుడు, అతను అలసిపోయి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి తీసుకున్న తరువాత అతను లింగాలను తీయటానికి ప్రయత్నించినప్పుడు, ఆ లింగములు కదల లేదు. ఇది శివుడి మాయ అని అతను గ్రహించి శివుని పిలిచినప్పుడు, అశరీరవాణి, “నేను ఇక్కడే ఆశ్రయం పొందుతు నన్ను శరణు జొచ్చిన వారికి మోక్షాన్ని ఇస్తాను”అని తెలిపెను. వ్యాఘ్రపాద ఋషి ఖారాను అదృశ్యంగా అనుసరించి వస్తుండగ ఖారా మోక్షాన్ని పొంది ఆ పవిత్ర లింగమును మహర్షి వ్యాఘ్రపాదకు అప్పగించి వాటిని రక్షించి పూజించమని వ్యఘ్రపాద ఋషిని కోరెను.

ఖరా అసురుడు తన కుడి చేతిలో తెచ్చిన శివలింగాన్ని వైకోం వద్ద, ఎడమ చేతిలో ఉన్న లింగాన్ని ఎత్తూమన్నూర్ వద్ద, మెడ ద్వారా కడతురుతి వద్ద పూజిస్తున్నారు అని నమ్మకము.

ఖారా తన మెడతో తీసుకువెళ్ళిన లింగము కడతురుతి వద్ద ఉందని, ఎడమ చేతితో ఉన్నది ఎత్తూమనూర్ వద్ద ఉందని నమ్ముతారు. వైకోమ్ నుండి కడతురుతికి అక్కడి నుండి ఎత్తూమనూర్ వరకు ఉన్న దూరం దాదాపు ఒకటే అనే వాస్తవం ఈ పురాణానికి విశ్వసనీయతను ఇస్తున్నది. కాబట్టి ఒకే రోజున ఈ మూడు లింగాల దర్శనం కైలాసము వద్ద ఉన్న శివ దర్శనంగా పరిగణించబడుతున్నది అని భక్తుల విశ్వాసము.

వృశ్చిక – కృష్ణ పక్ష – అష్టమి నాడు (మలయాళ కాల ప్రకారం), ప్రభువుల ప్రభువు మరియు దేవతలకు దేవుడు అయిన – శివ పరమేశ్వరుడు తన భార్య పార్వతి – జగత్ జననితో వ్యాఘ్రపాద మహర్షికి ప్రత్యక్షమయి, “ఈ స్థలాన్ని వ్యాఘ్రపాదపురం అని పిలుస్తారు” అని ప్రకటించి అదృశ్యమైనాడు. ప్రపంచ ప్రఖ్యాతము గాంచిన వైక్కథాష్టమి మరియు దానికి అనుసంధానించబడిన అన్ని పవిత్ర ఉత్సవాలు ఈ రోజు వరకు ఈ ఆలయములో వృశ్చిక – కృష్ణాష్టమి దినమున జరుపుకుంటున్నారు.

వ్యాఘ్రపాద మహర్షి కొంతకాలం శివ లింగ పూజను భక్తితో కొనసాగించి తీర్థయాత్రలకు వెడెలెను. నెలలు మరియు సంవత్సరాలు గడిచాయి. శ్రీ పరశురాముడు – చిరంజీవి ఒకరోజు ఆకాశం గుండా వెళుతూ మంచి శకునాలు ఇచట చూసి, అకాశయానము నుండి దిగి దివ్యమైన కిరణాలను వెదజల్లుతున్ననీటిలో ఉద్భవించిన లింగాన్ని చూసినారు. ఇది ఖారా ఉంచిన శివలింగం అని అతను గ్రహించెను.

పవిత్రమైన గొప్ప శివ చైతన్య, మోక్షము కోరుకొనే భక్తులకు గొప్ప ఆశ్రయం అని శ్రీ పరశురాముడు అనుకున్నాడు. ఆయన పవిత్రమైన లింగాన్ని తన పవిత్రమైన ప్రార్థనలతో మరియు శివ మంత్రాల పారాయణంతో అచట ప్రతిష్ట చేశారు. అతని గొప్ప భక్తుడు – విష్ణువు అవతారం అయిన పరశురాముడు మంత్రాలతో లింగమును ప్రతిష్ట చేసినందున అత్యంత దయాళువైన శివుడు వెంటనే తన భార్య పార్వతి దేవితో పరశురాముడికి ప్రత్యక్షమయినాడు. దయగల శివుడు పరశురాముడితో ఇలా అన్నాడు, “ఇకనుండి నేను ఇచట శైవ-వైష్ణవ చైతన్యగా ఉండి పరమానందాన్ని మరియు మోక్షాన్ని భక్తులందరికీ ఇస్తాను”.

పరమానందముతో, కృతజ్ఞతతో పరశురాముడు కొన్ని రోజులు శివలింగమునకు పూజలు చేసి స్వయంగా ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించి, తారుణ గ్రామానికి చెందిన ఒక గొప్ప బ్రాహ్మణుడుకు పూజా బాధ్యతలు అప్పగించారు. ఆ బ్రహ్మణునికి పూజ మంత్రాలు నేర్పించారు. బ్రాహ్మణుడు మొత్తం 28 శివగమాలను నేర్చుకున్నాడు మరియు రుద్రాక్ష మరియు భస్మము ధరించాడు. పరశురాముడు లింగముతో సహా ఆలయం మొత్తాన్ని బ్రాహ్మణులకు దానం చేసి అదృశ్యమయ్యాడు. ఆలయ విధులు మరియు పద్దతులను పరశురాముడే పధకముగా నిర్ణయించెనని భక్తుల నమ్మకము.

వ్యాఘ్రలయేష యొక్క మూడు భావాలు లేదా రూపాలు
ఈ పవిత్ర ఆలయంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు భావాలలో లేదా రూపాల్లో ‘వ్యాఘ్రలయేష’ (మూర్తి) భక్తులను ఆశీర్వాదించుతారని నమ్ముతారు.

ఉదయం పంతీరడి పూజ వరకు అతను దక్షిణామూర్తిగా – దేవుళ్ళు, మహర్షులు, అసురులు, యక్షులు, కిన్నారాలు, మరియు అన్ని జీవులు మరియు అన్ని ప్రపంచాలచే గౌరవించబడిన గురువులకు గురువు. అతను వివేకము, జ్ఞానం మరియు అవగాహనను దానమిచ్చువాడు.

మధ్యహన్నపూజ వరకు కిరాత మూర్తి భావములో
మధ్యాహ్నం సమయంలో మధ్యహ్న పూజ వరకు తన గొప్ప భక్తుడయిన అర్జునుడికి పశుపతాస్త్రం ఇచ్చిన కిరత మూర్తి యొక్క భావమును వహిస్తాడు. అప్పుడు అతను భక్తులకు అన్ని ప్రయత్నాలలో విజయం మరియు అన్ని అడ్డంకులను తొలగిస్తాడు – ‘సర్వకార్య జయం’ మరియు ‘సర్వ విజ్ఞోప శాంతి‘. సాయంత్రం శివుడు లేదా వైక్కతప్పన్ ‘శక్తి పంచాక్షరి’ యొక్క భావమును వహిస్తాడు- కైలాసము యొక్క నిరపాయమైన ప్రభువు – జగత్ పిత తన భార్య జగత్ మాత పార్వతి, కుమారులు గణపతి మరియు కార్తికేయలతో సంతోషంగా మరియు దయగల మానసిక స్థితిలో కూర్చొని దర్శనము. అప్పుడు అతను అన్ని ప్రాపంచిక ఆనందాలను మరియు భక్తుల కోరికలను తీరుస్తాడు. పై వాస్తవాలు భక్తుల నమ్మకం మాత్రమే కాదు, వారి ద్వారా నిరూపించబడినవి.

వైకోం యొక్క భస్మము లేదా బూడిద
 • ➣ వైక్కాతప్పన్ యొక్క అతి ముఖ్యమైన ప్రసాదం భస్మము-విభూతి. 
 • ➣ ఇది పెద్ద వంటశాల అగ్ని ప్రదేశం నుండి తీసుకోబడినది, 
 • ➣ ఇక్కడ శ్రీ వైక్కతప్పన్ బ్రాహ్మణుడిగా మారువేషంలో పని చేస్తాడని నమ్ముతారు.
 • ➣ ఇతిహాసాలు ఈ భస్మమును భయం, విషం, గాయాలు మరియు అపస్మారములకు పవిత్రమైన ఔషధంగా ప్రకటించబడినది. 
 • ➣ భస్మము యొక్క అద్భుత శక్తి యొక్కసాక్ష్యము భక్తుల నమ్మకం.
గంగా ప్రపత్త తీర్థము
ఒకసారి పరశురాముడు వ్యాఘ్రలయేషను ఆరాధించడానికి వచ్చినప్పుడు, ప్రజలు మరియు జంతువులు నీరు లేక బాధపడుతున్నారని తెలుసుకొని ప్రభువును ప్రార్థించి దుఃఖాలను తెలిపెను. ఏ వరం కావాలి అని అడిగినప్పుడు, పరశురాముడు “కలియుగలో పాపాలతో వచ్చిన భక్తుల కోసం, తాగడానికి, స్నానం చేయడానికి మరియు తర్పాణము చేయడానికి (పాపాలను కడిగి, దేవుళ్ళను, పూర్వీకులను ప్రసన్నం చేసుకునే ప్రక్షాళన కార్యక్రమం) “తీర్ధమును ప్రసాదించమని కోరెను. భక్తుల నమ్మకం. ఈ తీర్థములో , దేవతలు, కిన్నేరలు మరియు గాంధర్వులు ఆశీర్వదించిన శివుడి జడలో గంగ ఉన్నదని. ఆలయ సమ్మేళనం యొక్క ఉత్తర భాగంలో మనం చూసే పుష్కరిణి ఇది. దీనిని ‘గంగా ప్రపత్త తీర్థము’ లేదా వలియచిర అంటారు.

శివానంద తీర్థము:
ఒకసారి నిదఘ మహర్షి పాంచాల దేశము నుండి, శివుడిని ధ్యానం చేస్తున్న వ్యాగ్రపాద మహర్షి వద్దకు వచ్చారు. తనను శిష్యుడిగా శ్వీకరించమని మహర్షిని వేడుకున్నాడు. వ్యాఘ్రపాద మహర్షి నిదఘకు శైవ మంత్ర విద్య మరియు ఉపసనా యోగం నేర్పించి, శివ భజన ద్వారా అన్ని విజయాలు మరియు ముక్తిని సాధించవచ్చని ఆయనను ఆశీర్వదించారు. నిదఘ చాలా భక్తితో శివోపాసన చేస్తున్నాడు. ఒక అష్టమి రోజున వ్యాఘ్రపాద మహర్షి మరియు నిదఘ మహర్షి స్థంభ గణేష్ మరియు శివులను ఆరాధిస్తున్నప్పుడు, కైలాస ప్రభువు ఈశాన్య మూలలో కనిపించి ఆనంద తాండవ నృత్యము ప్రదర్శించారు. ఆ సమయంలో అతని జడల నుండి కొన్ని నీటి చుక్కలు కింద పడినవి. ఆ నీటిని ‘శివానంద తీర్థ’ అని అశీర్వదించి అంతర్ధానమయ్యాడు. వ్యాగ్రపాద మహర్షి, నిదఘ మహర్షి దాని నుండి నీరు తీసుకొని వారి శరీరాలపై చల్లుకొని తీర్ధముగా స్వీకరించారు.

ఈశాన్య మూలలో ఉన్న ఈ తీర్థము ఇప్పుడు బావిగా రూపాంతరం చెందినది, ఆ బావి నీటిని ఆలయంలోని పూజలకు మాత్రమే ఉపయోగిస్తున్నారు.

ఆర్తిహర తీర్థము:
శంకర మరియు ముకుంద, శాస్త్రాలు బాగా నేర్చుకున్న యువ బ్రాహ్మణులు కన్యా కుమారి నుండి కాశీకి ప్రయాణిస్తు వైకోమ్ చేరుకున్నారు. వైక్కతప్పన్ యొక్క భజన మరియు ప్రసాదము ఆనందించేటప్పుడు శంకర లేకుండా ముకుంద కాశీకి బయలుదేరాడు. ఒంటరితనంతోను గంగలో స్నానం చేయలేకపోతున్నాననే ఆలోచన శంకర చాలా వ్యధపడి తీవ్రమైన జ్వరంతో భాధ చెందెను. ఒక రోజు శంకర వ్యాఘ్రాలయేశకు హృదయపూర్వక ప్రార్థనానంతరము గాఢ నిద్రలో ఉండగా కలలో ప్రభువు తూర్పు చెరువులో స్నానం చేయమని కోరాడు. అతని కోరికలునెరవేర్చుతానని నమ్మబలెకెను. మహేశ్వర ఆదేశానుసారం, శంకర ఉదయాన్నే లేచి, మంత్రాలను పఠించుతు చెరువులో స్నానం చేశాడు. చెరువు నీటి నుండి లేచినప్పుడు గంగా తీర్థంలో ఉన్నట్లు గమనించిన శంకర ఆనందానికి హద్దులు లేవు.

తనను తాను మరచిపోయి శంకర శివుడిని ప్రశంసించాడు. అదే సమయంలో వ్యాగ్రపాద మహర్షి అక్కడికి చేరుకుని ముకుంద పద్దెనిమిది నెలల తర్వాత తిరిగి వస్తాడని మరియు స్నేహితుడితో తిరిగి వచ్చి స్థనమాలయ ఆరాదించి శివ సయూజ్యం సాధిస్తారని తెలిపెను. తూర్పున ఉన్న అదే తీర్థాన్ని ఆర్తి హర తీర్థ లేదా ఆర్తి వినసన తీర్థము అని పిలుస్తారు. ఇక్కడ స్నానం మరియు తర్పణము పవిత్ర గంగలో చేసినంత మంచిదని నమ్ముతారు.

వాస్తు శిల్ప కళ
ముంగిలి మరియు గోపురములు:
కేరళలోని పెద్ద దేవాలయాలలో ఈ ఆలయము ఒకటి. వైకోమ్ మహాదేవ ఆలయం సుమారు ఎనిమిది ఎకరాల ప్రాంగణంలో ఉన్నది. నది ఇసుకతో సమం చేయబడిన ప్రాంగణం నాలుగు వైపులా నాలుగు గోపురాల సమ్మేళనంతో ప్రహరీ గోడలతో ఉన్నది.

వ్యాఘ్రపాద స్థానము:
ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉన్నది. తూర్పు గోపుర సమీపంలో ఒక రక్షిత వేదిక ఉన్నది, ఇక్కడ రావి చెట్టు, మామిడి చెట్టు మరియు పనస చెట్టు అన్నీ కలిసి పెరిగాయి. ప్రస్తుతం రావి చెట్టు మాత్రమే సజీవంగా ఉన్నది. గొప్ప శైవోపాసకుడు వ్యాఘ్రపాద మహర్షి ఇక్కడ తపస్సు మరియు పూజలు చేశాడని మరియు అదే స్థలంలో అతనికి శివ-శక్తి దర్శనం మరియు అత్మససత్కర్ లేదా నెరవేర్పు లభించిందని, ఈ స్థలాన్ని వ్యాఘ్రపాద స్థనా అని పిలుస్తారు.

లోపలి నిర్మాణాలు మరియు మండపం
బంగారు ద్వజ స్థంభము నిజంగా ఈ ఆలయానికి గర్వకారణం. ద్వజస్థంబము దాటిన తరువాత బలిపీఠము(బలికలుపుర) లోకి ప్రవేశిస్తాము. బలిపీఠము ఈశాన్య దిక్కున కూర్చున్న స్తంభ గణేష్ సన్నది ఉన్నది. తరువాత నమస్కార మండపంలోకి ప్రవేశము. రామాయణ కథ నమస్కార మండపము పైకప్పుపై లోన చెక్కబడినది. ద్రవ్య కలశ, మార్ఘాళి కలశ పూజలు వైక్కతప్పన్ యొక్క ప్రధాన సమర్పణలు వేద మంత్రముల పఠనము ఈ మండపము నుండి నిర్వహిస్తారు. ఒకే రాతితో చేసిన భారీ నంది, అర్చన కోసము చిన్న నంది ఈ మండపానికి తూర్పున ఉన్నవి. తన భక్తుల ప్రతి కోరికను నెరవేర్చే అన్నదాన ప్రభు – శ్రీ వైక్కతప్పన్ యొక్క శ్రీకోవిల్ (గర్భగుడి) కు పేర్చిన రాతి మార్గము గుండా చేరుకొన వచ్చును.

శ్రీకోవిల్ లేదా ప్రధాన లోపలి ప్రాకారము:
శ్రీకోవిల్ గుండ్రని ఆకారంలో రెండు గదులతో ఉన్నది. ముఖ మండపం. రెండవ గది గర్భ గుడి పూర్తిగా చదరపు ఆకారంలో పైకప్పుతో సహా రాతితో నిర్మించబడింది. దాని మధ్యలో మూడు అడుగుల ఎత్తు పీఠమున్నది. ఈ పీఠముపై శ్రీ వైక్కాతప్పన్ యొక్క అత్యంత పవిత్రమైన, అత్యంత ప్రసిద్ధమైన మరియు అత్యంత గొప్ప శివలింగం ప్రతిష్టించబడినది. ఇది పవిత్రమైన నల్ల రాయితో చేసిన ఆరు అడుగుల ఎత్తులో ఉన్న లింగము. లింగమునకు నెలవంక, మూడు కళ్ళు, ముక్కు మరియు నాలుగు చేతులతో శైవ అభరణాలతో (ఆభరణాలు) స్వచ్ఛమైన బంగారంతో ‘అంకీ’ రూపంలో అలంకరించబడి ఉంటుంది. (శివ అభరణాలు పరసు, మృగ, వరద మరియు అభయ ముద్రలు). గర్భ గుడి లోపల నూని మరియు నెయ్యి దీపాలు కర్పూరం తో మాత్రమే వెలిగించి ఉన్నవి. ఈ ప్రదేశం యొక్క భావము లేదా రూపములను మరియు శాంతిని వర్ణించుట కంటే అనుభవించడానికి మాత్రమే. శ్రీకోవిల్ యొక్క బయటి గోడలు పురాణ కథల చిత్రాలు మరియు చెక్క శిల్పాలతో చక్కగా అలంకరించబడ్డాయి.

ఆరు మెట్లు మరియు వాటి అర్థం
గోపురము లేదా నడవ నుండి ఆరు మెట్లను దాటకుండా ఈ శ్రీకోవిల్‌లో ఉన్న శైవ చైతన్య దర్శనమును మనం పొందలేము అనేది చాలా ఆసక్తికరమైన మరియు విచిత్రమైన వాస్తవం. ఇది మనకు కామ, క్రోద, లోభా, మోహ, మధ మరియు మఠసార్య వంటి షట్ (ఆరు) వికారాలు (భావోద్వేగాలు) లేదా తాంత్రిక కల్పన ప్రకారం తాంత్రిక చక్రాలను గుర్తుచేస్తూ ఉండవచ్చు. అవి మూలాధర చక్రం, స్వాధిష్ఠాన చక్రం, మణిపురక చక్రం, అనాహత చక్రం, విసుధి చక్రం మరియు జ్ఞాన చక్రం.

విఘ్నేశ్వర ప్రతిష్ఠ
శ్రీకోవిల్ వెలుపల ఆగ్నేయ మూలలో రాతి పీఠంపై విఘ్నేశ్వర ప్రతిష్ఠ ఉన్నది, దక్షిణాన మహా గణపతి మరియు ఉత్తరాన శక్తి గణపతి గలవు. ఇవి పంచ లోహ విగ్రహములు.
మాత్రుశాల, విల్వ చెట్టు మరియు అష్టడదిక్పాలకులు మాన్య స్థానా ఉత్తరాన ఉన్న ఆలయ ప్రాంగణంలో, విల్వమంగళ స్వామికి గోడపై వైకత్తపన్ బ్రాహ్మణుడిలా ప్రతల్ ను తినడం కనిపించే ‘మన్య స్థాన’ అనే చాలా పవిత్ర స్థలము కలదు. వెలిగించిన భద్రదీపమును ఈ ప్రదేశంలో ఉంచి ప్రతల్ లేదా అన్నదాన ప్రారంభం ఇక్కడ నుండి జరుగుతుంది. పురాతన కాలం నుండి ఆలయ ప్రాంగణం యొక్క ఉత్తరం వైపున బ్రాహ్మణులకు ఇచట తదియారాధన జరుగుచున్నది.

పెద్ద వంటగది
మన్య స్థాన తూర్పు వైపు ప్రతల్ వండుటకు పెద్ద వంటగది కలదు. స్వామి వైక్కతప్పన్ ఈ వంటగదిలో పని చేస్తున్నట్లు కనిపించునని నమ్మకము. వంటగది పొయ్యి బూడిదను ఆలయ ప్రధాన ప్రసాదంగా వినియోగిస్తారు.

మూసిన తలుపు
వైకోం ఆలయం పాత రోజుల్లో నూట ఎనిమిది కుటుంబాల యాజమాన్యంలో ఉండేది. యజమానులను రెండు ముఠాలుగా ఏర్పడి ఒక సమూహం పాలకుడి పక్షంలో చేరినది. వారి వివాదాలు, తగాదాలు రోజురోజుకు పెరిగినవి. ఒక రోజు విభజించబడిన సమూహంలోని ఒక విభాగం అధ్యక్షుడు మధ్యాహ్నం ఆలయానికి వచ్చి మధ్యాహ్నం పూజను ఆపడానికి సిద్ధ పడిరి. ఆ సమయంలో నివేదాను నమస్కార మండపానికి పశ్చిమ భాగంలో ఉంచడానికి ఉపయోగించేవారు. పశ్చిమ ప్రాంగణంలో ప్రవేశ ద్వారం తలుపు పై తన ఉత్తరీయమును ఉంచి న్జల్లాల్ నంబూద్రి నివేదా వద్దకు వచ్చి నోటిలో యున్న కిల్లీ అవశేషాలను నివేదాపై ఉమ్మివేసి పూజకు అంతరాయం కలిగించిరి. అతను తలుపు పైనుండి తన ఉత్తరీయమును తీసుకుంటున్నప్పుడు, అత్యంత విషపూరితమైన పాము కాటుకు గురి అయినాడు. అతను పడమటి గోపురము వెలుపలకు ప్రాకి మరణించాడు. ఆలయ ప్రాంగణం యొక్క పశ్చిమ తలుపు అప్పుడు స్వయంచాలకంగా మూసివేయబడింది మరియు శ్రీకోవిల్ లోపల నుండి ఒక స్వరం “ఈ తలుపు ఇక తెరవకూడదు” వినిపించినది.

పనాచిక్కల్ భాగవతి
ఆలయ ప్రాంగణానికి దక్షిణం వైపున పనాచిక్కల్ భాగవతి అనే శక్తి సానిధ్యము కలదు. దాని మూలం ఇతిహాసాలలో ఈ క్రింది విధంగా వివరించబడింది:
అగస్త్య ముని అనేక మహర్షులతో ప్రదోష రోజు వైక్కతప్పన్‌ను పూజించిన తరువాత తిరిగి వచ్చుచుండెను. నీలకుండల అనే గాంధర్వ కన్య అప్పుడు తన పరివారముతో ప్రయాణిస్తున్నది. చాలా గర్వంగా ఉండటంతో ఆమె మహర్షులను, మహేశ్వరుడిని కూడా చూసి నవ్వినది. కోపంతో ఉన్న అగస్త్యుడు ఆమెను రాక్షసిగా శపించాడు. ఆమె పశ్చాత్తాపపడి షాప విమోచనము కోరినప్పుడు మహర్షి “86 సంవత్సరాల తరువాత మీరు ఇక్కడ పాప మోక్షాన్ని వ్యాఘ్రపాదపురంలో పొందుతారు” అని అన్నారు.

స్థంభ వినాయక
పరశురాము తీర్థయాత్రకు బయలుదేరిన రోజు నుండి ఆలయ రక్షణ బాధ్యతలను స్థంభ వినాయకుడు కలిగి ఉన్నారు. ఒక రోజు క్రూరమైన రాక్షసి అక్కడికి వచ్చి ప్రజలను, జంతువులను ఇబ్బంది పెట్టసాగాడు. ప్రజలు వ్యాఘ్రపాద మునిని ఆశ్రయించారు. అతను రాక్షసి యొక్క పాత కథను జ్ఞాపకం చేసుకొని స్థంభ వినాయకుడిని ప్రార్థించాడు. వినాయకుడు తన సేవకుడు భద్రాయుషును ఆమెతో వ్యవహరించమని ఆదేశించిన త్రిసూలముతో రాక్షసిని మూడు ముక్కలుగా నరికెను. మూడు ముక్కలు అప్పుడు మూడు దేవిలుగా రూపాంతరం చెంది వారికి మోక్షాన్ని ప్రసాదించినందుకు వైక్కతప్పన్ మరియు స్థంభ గణపతిని ప్రశంసించారు.
స్థంభ వినాయకుడి అభ్యర్థన మేరకు విక్కత్తప్పన్ వారికి ఒక్కొక్క చోటు కల్పించారు. మధ్య భాగం ఇక్కడ ఆలయ ప్రాంగణం యొక్క దక్షిణ భాగంలో ఉన్నది దీనిని పనాచిక్కల్ భాగవతి అని పిలుస్తారు. ఇతర దేవతలను దక్షిణాన్న చెరికుమెల్ మరియు ఉత్తరాన కూట్టుమెల్ పంపారు.

సర్ప సానిధ్య
ఆలయ ప్రాంగణానికి దక్షిణాన సర్పాలను (పాము దేవుళ్ళు) పూజిస్తారు. ఆచారాలు మరియు పూజలు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇక్కడ నిర్వహిస్తారు. అక్కడ ఒక రావి చెట్టు మరియు ఎత్తైన వేదిక ఉండెను, ఇది కొన్ని సంవత్సరాల క్రితం ధ్వంసమైంది. అచట కొత్త చెట్టును నాటి ఇటీవలి సంవత్సరాలలో వేదిక పునర్నిర్మించబడినది. మలయాళ మాసం కుంబ (ఫిబ్రవరి-మార్చి) లో సర్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

పూజలు:
 • ➣ సరస్వతి యమ తో ప్రారంబించి స్వామికి మేలుకొలుపు, నిర్మల్య దర్శనము, అభిషేకము.
 • ➣ ఉదయము: ఊష పూజ, ఎథిర్థు పూజ లేద ఆహ్వాన పూజ, పంథిరడి పూజ.
 • ➣ ఉచ్చ పూజ (మధ్యాఃన్న పూజ)
 • ➣ రాత్రి: అథళ పూజ.
 • ➣ మూడు రకముల శ్రీ బెలి కలవు: 1. ఎథిర్థు శ్రీబెలి, 2. ఉచ్చ శ్రీబెలి మరియు 3. అథళ శ్రీబెలి.
 • ➣ పంచకావ్యము, నవకం మరియు ప్రత్యేక అభిషేకములు ఉచ్చ పూజ సమయములో చేయుదురు.
ప్రత్యేక దినములలో సోమవారము, థిరువథిర, ప్రదోష, కృష్ణ పక్ష అష్టమి మరియు పౌర్ణమి రోజులలో సాయంత్రము కూడా అభిషేకము చెయుదురు. అలాటి ప్రత్యేక దినములలో లేద సంకరమ అప్పుడు వైక్కథప్పన్ రుషభ వాహనముపై అథళ శ్రీ బెలి కై ఊరేగింతురు. ఆలయము మరునాడు సాయంత్రము 04:00 గంటలవరకు మూసివేయబడును. ఘట్టియము పఠనము: ఘట్టియము పఠనము వైక్కథప్పన్ ఆలయములో మాత్రమే జరుగును, కేరళలో మరి యే ఆలయములలోను జరగదు. ఘట్టియము పఠనము దీపారాధన సమయములోను అథళ శ్రీబెలి మూడవ ప్రదక్షణ లోను జరుగును. శ్రీబెలిని శ్రివెలి అని వ్యవహరింతురు. ఒక 5 అడుగుల పొడవు గల ఇనుప కమ్మి వెండి రేకుతో కప్పబడి, చివర రిషభుడి విగ్రహముతో ఉన్న ఆ కమ్మిని ఒక ముదుసలి బ్రాహ్మణుడు వైథకప్పన్ వైపు చూస్తు స్లోకములను పఠించుతూ తిరుగును. ఇది ఘట్టియుము యొక్క ముఖ్య ఆంశము. ఆయిలము తిరునల్ ట్రావెంకోర్ మహరాజు 27వ తులం 1030 మళయలం కాలములో ప్రారంభించిరి.

ఒక అనాధ ముదుసలి బీద బ్రాహ్మణుడు శివ భక్తుడు ప్రథల్ కోసము కూర్చున్నప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చి కూర్చొనుటకు స్థలమునడిగెను. ఆ అనాధ బ్ర్రాహ్మణుడు తన కష్టములను ఆ బ్రాహ్మణునికి తెలుపుకొనగా నీవు ట్రివేన్డ్రము అయిల్యం మహ రాజు నాకు బాగా తెలియును నీవు ఆయన వద్దకు వెడలిన అతను అన్ని చూసుకొందురు అని వాగ్దానము చేసెను. ముదుసలి బ్రహ్మణుడు మరునాడు మహరాజు వద్దకు వెడలగా రాజు ఆయనని స్వాగతించి రాత్రి కలలో వైక్కథప్పన్, వైకోమ్ నుండి బ్రాహ్మణుడు వచ్చును నాకు అచట ఘట్టియము జరుగుటలేదు అతనికి రిషభ వాహనముము నుంచిన కమ్మిని ఇచ్చి ఘట్టియమును ప్రారంభించమని కోరినటుల తేలియజేసెను అని తెలిపెను. రిషభ వాహనము యున్న కమ్మిని రాజు వైకోమ్ ఆలయమునకు తీసుకొని వచ్చి వైక్కథప్పన్ ఆలయములో ఆ బ్రాహ్మణునికి ఇచ్చి ప్రతి దినము ఘట్టియము స్వామికి కైంకర్యము చేయవలెనని ఆ బ్రాహ్మణునికి ఆదేశించి తగిన పైకములు సమకూర్చి వెడలెను.

స్వామికి సమర్పణలు:
 •  1. ప్రథల్
 •  2. ఆనంద ప్రసాద
 •  3. సహస్ర కలస
 •  4. ద్రవ్య కలస
 •  5. ఆయిర కలస
 •  6. ఆయిరకుడం
 •  7. విల్వపత్ర మాల
 •  8. భస్మ మాల
 •  9. విలక్కు (దీపం)
 • 10. అప్పం నైవేద్యము
 • 11. క్షీర ధార
 • 12. అలువిలక్కు
 • 13. జలధార
మంత్రములు భజనలు :
 •  1. లింగాష్టకము, 
 •  2. శివసూక్తము, 
 •  3. శివశక్తి, 
 •  4. అమ్మ స్తోత్రము, 
 •  5. నారాయజ్ఞనె, 
 •  6. ఓమ్ నమః శివాయ, 
 •  7. బిల్వాష్టకము, 
 •  8. చంద్రశేఖరాష్టకము, 
 •  9. వ్యాఘ్రాలయెశ వందన శ్లోకము, 
 • 10. శివస్థుతి. 
 • 11. శివమంత్ర. 
 • 12. తిరువైక్కొం వళుం శివ శంబొః, 
 • 13. శివ మంగళాష్టకము, 
 • 14. చంద్రశేఖారాష్టకము, 
 • 15. శివ శ్లోకములు.
ఆలయ సమయములు: 3.30 AM to 11.30 PM and from 5 PM to 8 PM
వైకొమ్ కొట్టయం నుండి 32 కి.మీ ద్రూరము. బస్ స్టాండ్ నుండి ఆలయము 900 మీ దూరములో యున్నది. అన్ని రకముల వాహనములు ఆలయమునకు చేరుకొనుటకు కలవు.
రైలు మార్గము: వైకోమ్ రైల్వె స్టెషను 12 కి. మీ దూరములో కలదు.
ఆకాశ మార్గము: కొచ్చిన్ విమానాశ్రయము 58కి,మీ దూరములో కలదు.

గూగుల్ మ్యాప్ ద్వారా వీక్షించండి:


సంకలనం: జి వి కె ప్రసాద్