నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

- ఆర్ఎస్ఎస్ -

ఆర్ఎస్ఎస్
ధర్మ నీతి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ధర్మ నీతి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, ఆగస్టు 2020, ఆదివారం

పరోపకారార్థం 'మిదం శరీరం' - Paropakaram

పరోపకారార్థం 'మిదం శరీరం'

ధ్వరాజు చేసే అశ్వమేధయాగంలోని యాగాశ్వని మయూరధ్వజుడనే రాజు పట్టుకున్నాడు. అతడు పరాక్రమవంతుడు, ధర్మాత్ముడు కూడా. శ్రీకృష్ణుని పరమ భక్తుడు, మయూరధ్వజునితో యుద్ధం చేసి, యాగాశ్వం విడిపించేందుకు శ్రీకృష్ణార్జునులు ఇద్దరు వచ్చారు. శ్రీకృష్ణుడు కూడా అర్జునుని ప్రార్థనపై యుద్ధం చేశాడు. భగవంతునితో యుద్ధం చేయకూడదని ఉన్నా యుద్ధనీతి పాటించి ప్రతి బాణాం వేసే ముందు శ్రీకృష్ణ నామ స్మరణ చేస్తూ మయూరధ్వజుడు యుద్ధం చేశాడు. భక్తులచేతిలో ఓడిపోవటం భగవంతునికి పరిపాటి. అందుకే శ్రీకృష్ణార్జునులు మయూరధ్వజుని గెలవలేకపోయారు. "అతని సంహరించి యాగాశ్వం సంపాదించకూడదా" అని అడిగిన అర్జునునితో శ్రీకృష్ణుడు “ఫల్గుణా! నీ గాండీవం కాని నా సుదర్శన చక్రం కాని ఈ పరమభక్తుని మీద పని చేయవు. అతని ధర్మబుద్ధి ఎటువంటిదో నీకు చూపిస్తాను పద" అని అన్నాడు.

మరుసటి రోజున శ్రీకృష్ణార్జునులు బ్రాహ్మణవేషం ధరించి మయూరధ్వజుని ఇంటికి అతిథులై వెళ్ళారు. వారిని చూసి మయూరధ్వజుడు తన ఇంట ఆతిథ్యం స్వీకరించమని ప్రార్ధించాడు. మారువేషంలో ఉన్న పరంధాముడు ఇలా అన్నాడు. "రాజా! నీ ఇంట భుజించుటకు వ్యవధి లేదు, మాకొక ఆపద వచ్చింది. అది తీరిన తరువాతే మేం ఇతర విషయాలు ఆలోచిస్తాం" అయ్యా! మీ కష్టమేమిటో చెప్పండి. నా చేతనైన నహాయం చేస్తాను" అని మయూరధ్వజుడు వినమ్రంగా మాట ఇచ్చాడు.

“రాజా! మేం అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు నా కుమారుని ఓ పెద్దపులి పట్టుకుంది. ఆ పసివాడి శరీరాన్ని సగం తిన్న తరువాత ఒక అశరీరవాణి ఇలా పలికింది "మయూరధ్వజుని శరీరంలో సగభాగం ఈ పులికి అర్పిస్తే నీ పుత్రుడు సజీవుడు అవుతాడు". నాకు పుత్రభిక్ష పెట్టమని నిన్ను ప్రార్ధిస్తున్నాను" అని బదులిచ్చాడు.

ఆహా! ఈనాటికి కదా ఈ దేహానికి సార్థకత ఏర్పడింది. ఒక పసివాడి ప్రాణాలు కాపాడటానికి ఉపయోగ పడుతోంది. ఇంతకన్నా నేను కోరేది ఏమీ లేదు నిస్సందేహంగా నా శరీరంలోని' సగభాగం తీసుకోండి. ఆ పులికి సమర్పించండి" అని మయూరధ్వజుడు వేడుకొన్నాడు. వెంటనే తన భార్యాబిడ్డలను పిలిచి తన శరీరాన్ని రెండుగా చేసి అతిథులకు ఇవ్వమని చెప్పాడు.

ఏ పరమధర్మ సంరక్షణార్థమో ఏ మహత్తర కార్యానికో మయూరధ్వజుడిలా చేయమని వుంటాడని గ్రహించి ఎంతో బాధను దిగమ్రింగుకొని అతని శరీరాన్ని ఛేదించడం మెదలుపెట్టారు. మహాశ్చర్యకరమైన ఈ త్యాగాన్ని విగ్రహాల వలె నిల్చుని చూస్తున్న శ్రీకృష్ణార్జునులకు ఓ వింత కనబడింది మయూరద్వజుని ఎడమ కన్ను నుండి కన్నీళ్లు కారుతున్నాయి.

సర్వజ్ఞుడైన స్వామి అది చూసి కేవలం ఆ భక్తుని గొప్పతనం ప్రపంచానికి చాటడానికి ఇలా అన్నాడు "రాజా! బాధపడుతూ దానం ఇవ్వకూడదు. సంతోషంగా మనసూ్సూర్తిగా చేస్తేనే అది త్యాగమవు తుంది. ఎదుటి వాడి కష్టాలు చూసి బాధపడటం దివ్యత్వం. మనని చూసి మనమే కన్నీరు కార్చడం నైచ్యమ్”, "అయ్యా! నా శరీరం మనస్పూర్తిగానే మీకు సమర్పించాను. కాని నా శరీర కుడి భాగమే పరోపకారార్థం వినియోగపడుతోంది. ఎడమ భాగ శరీరం “నాకా అదృష్టం లేదే” అని విచారిస్తూ కన్నీరు కారుస్తోంది. మిగిలిన శరీరం దేనికీ ఉపయోగ పడకుండానే నాశనమవుతున్నదనే నా బాధ అని పలికాడు మయూరధ్వజుడు. ఆ రాజు పరోపకార బుద్ధికి సంతోషించిన శ్రీకృష్ణుడు తన నిజరూపం చూపించాడు. మయూరధ్వజునికి యథా రూపం కల్పించి దీవించాడు. ఆ రాజు నరనారాయణులకు నమస్కరించి యాగాశ్వాన్ని అప్పగించాడు.

|| సర్వే జనాః సుఖినో భవంతు ||

12, ఆగస్టు 2020, బుధవారం

పాప పుణ్యాల ఫలం - Paapa Punya phalam

పాప పుణ్యాల ఫలం - Paapa Punya phalam
మంచిఫలం పుణ్యరూపంలో, చెడు ఫలం పాపరూపంలో ఉంటుంది. శరీరాన్ని ఆశ్రయించి కుడి, ఎడమ చేతులు ఉన్నట్లే, మానవుడు చేసే పనుల ద్వారా ఫలితాలు ఉంటాయి. పుణ్యకార్యం ద్వారా లభించే ఫలంతో మనిషికి రాజ్యాలు, పశు సంపదలు, ధనం, బంగారం వంటి సమస్త ఐశ్వర్యాలు లభిస్తాయి. కొన్ని పనులకు ఫలం వెంటనే లభిస్తుంది. మరికొన్నిటికి తర్వాత లభిస్తోంది.

ఉదాహారణకు: రైతు భూమిలో విత్తనం నాటిన రోజున పంట లభించాలంటే అది సాధ్యం కాదు కానీ ఎర్రగా కాలిన నిప్పుపై చేయి పెట్టామంటే వెంటనే దుఃఖరూపంలో అనుభవమవుతుంది.

భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునితో నీకు కర్మ చేయడానికి అధికారముంది. ఫలితం మాత్రం పరమాత్ముని ఆధీనంలో వుంటుందని చెప్పాడు. అనుభవించవచ్చు లేదా ఆ తరువాత జన్మలోనైనా అనుభవించవచ్చు. ఇది నిర్ణయించేది సృష్టికర్త అయిన పరమాత్ముడని శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించాడు. 

17, జులై 2020, శుక్రవారం

మహాభారతలో ఇంద్రప్రస్థ - Mahābhāratanlō indraprastha


ఇంద్రప్రస్థం

ధర్మచింతనులైన పాండవులను దుర్యోధనాదులకు దూరంగా గెంటివేయాలన్న దురుద్దేశంతో చక్రవర్తి ధృతరాష్ట్రుడు వారిని పిలిచి "నాయనలారా, మీరు ఖాండవప్రస్థం అనే చోటికి వెళ్ళి అక్కడ సుఖంగా ఉండండి…" అని ఆదేశించాడు.

మహారాజు ఆదేశానుసారంగా పాండవులు ఖాండవప్రస్థం చేరారు. అయితే, అది పూర్తిగా కొండలు గుట్టలు, చెట్లూచేమలూ… జనసంచారం చాలాతక్కువ. మహాసౌధాలతో కళకళలాడే హస్తినాపురి ఎక్కడ ? ఈ అటవీప్రాంతమైన ఖాండవప్రస్థం ఎక్కడ? కానీ, ధృతరాష్ట్రులవారు మాత్రం -" నాయనలారా, హస్తినాపురి ఎంతో ఈ ఖాండవప్రస్థం కూడా అంతే సుమీ… మీరక్కడ సుఖశాంతులతో వర్థిల్లండి" అంటూ ఎలాంటి అనుమానాలకు తావులేదన్నట్టుగా తేల్చి చెప్పాడు.

పాండవులు హస్తినాపురి విడిచి ఖాండవప్రస్థం బయలుదేరారు. ఈ రాజ్య పంపకం హస్తినాపుర వాసులకు నచ్చలేదు. ఇది అన్యాయమని వాపోయారు. కానీ మహారాజు నిర్ణయాన్ని ఎదిరించలేకపోయారు. పాండవులు ఖాండవప్రస్థం వెళ్ళిచూశారు. అక్కడ మెరక, పల్లపు భూములు చాలానే ఉన్నాయి. చిన్నచిన్న గుట్టలు, భయంకరమైన అడవులు…అక్కడక్కడా పల్లెలు కనిపించాయి. ఇదీ ఖాండవప్రస్థ భౌగోళిక స్థితి. అయితే ఒకే ఒక్క సౌకర్యం ఉంది. ఈ ప్రాంతం పక్కనుంచే యమునానది ప్రవహిస్తోంది.

ఈలాంటి ఖాండవప్రస్థాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని యుధిష్టిరుడు సంకల్పం చెప్పుకున్నాడు. అందుకు శ్రీకృష్ణుడు మద్దతు పలికాడు. స్థానికుల సాయంతో అటవీభూములను వ్యవసాయానికి అనుకూలంగా మలుచుకున్నారు. సకాలంలో వానలు పడటంతో నదులూ వాగులూ ఒప్పొంగాయి. పంటలు బాగా పండాయి. తినడానికి తిండి, త్రాగడానికి నీరు సంవృద్ధిగా అందుబాటులోకి వచ్చింది. దీంతో అభివృద్ధికి బాటలుపడ్డాయి.

అవసరమైన చోట్ల రహదారులు నిర్మించారు. నెమ్మదిగా వాణిజ్యానికి అనుకూల వాతావరణం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న వర్తక శ్రేణులు తమ వ్యాపారాలను ఈ ప్రాంతానికే తరలించారు. ధనధాన్యరాశులు వచ్చిపడుతున్నాయి. పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం ఉరకలెత్తుతోంది.

హస్తినాపురికి తీసిపోని విధంగా ఖాండవప్రస్థం రూపుదిద్దుకుంటోంది. ఖాండవప్రస్థం కాస్తా ఇంద్రప్రస్థంగా మారిపోయింది. అంటే సాక్షాత్తు ఇంద్రుడు నివసించే ప్రాంతంలా విరాజిల్లింది. పాలనాపరమైన సౌకర్యాల కోసం ఒక రాజ్యసభ అవసరమైంది. దేవతలశిల్పి మయుడు ఆనాటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకుని అందమైన రాజ్యసభను నిర్మించారు. ఆసభకు "మయసభ" అన్న పేరు సార్థకమైంది. సామంతరాజులు ధర్మరాజుని కీర్తించారు.

అడవిలో పడి ఉండమని చక్రవర్తి శాసించినా కారడవిని మహానగరంలా మార్చిన పాండవుల తెలివితేటలు చూసి దుర్యోధనాదులకు కన్నుకుట్టింది. పాండవులు నిర్వహించిన రాజసూయ యాగంతో ఈర్ష పతాకస్థాయికి చేరుకుంది. వెళ్లకూడదనుకుంటూనే ధుర్యోధనాదులు రాజసూయ యాగానికి వెళ్ళారు. అక్కడి మయసభను విభ్రాంతితో చూశారు. దుర్యోధనుడు చిత్తభ్రాంతికి గురై మడుగులో కాలుజారి పడ్డాడు.

అదే సమయంలో అక్కడున్న పాంచాలి నవ్వింది. దీంతో పరాభవాగ్నితో దహించుకుపోతున్న దుర్యోధనుడ్ని శాంతిపచేయడానికి శకుని మాయాజూదం అంకానికి తెరతీశారు. ఫలితంగా చివరకు మహాభారత యుద్ధం జరిగింది. ఇదీ నాటి ఇంద్రప్రస్థ కథ

సంకలనం: శృతి వేణుమొగులు

23, జూన్ 2020, మంగళవారం

ధర్మబద్ధమైన కర్మ - Dharma, Karmaధర్మబద్ధమైన కర్మ - Dharma, Karma

ధర్మబద్ధమైన కర్మను చేయాలి !

కురుక్షేత్ర సంగ్రామంలో మోహంలో పడి యుద్ధ విముఖుడైన అర్జునుడికి తన ధర్మాన్ని గుర్తు చేసేందుకు భగవాన్ శ్రీకృష్ణుడు గీతను బోధించాడు. ఏం చేయాలి, ఎలా చేయాలి ? అనే విషయాలతో పాటు సమన్వయాత్మక దృష్టి కోణాన్ని ఈ గీత మనకు అందిస్తోంది. భగవద్గీతలో బోధించిన కర్మ సిద్ధాంతాన్ని మనం జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి. గీతలో కర్మ గురించి చెప్పబడిన క్రింది విషయాలు గమనిద్దాం. 

నిజానికి కర్మ చేయకుండా ఒక్క క్షణం గడవదు. అయితే ఆ కర్మ ఎలాంటిది ఉండాలి? అనేదే ప్రశ్న. ఉదాహరణకు దొంగతనం చేయడం కూడా కర్మే. అయితే ఇలాంటి కర్మ వల్ల వ్యక్తికీ, సమాజానికి కీడు కలుగుతుంది. అందువల్ల ధర్మబద్ధమైన కర్మ చేయాలని గీతా వాక్యం చెబుతుంది. కర్మను చేయటమే కాదు, ఆ కర్మ యొక్క ఫలితాన్ని నిస్వార్ధ బుద్ధితో పరిత్యాగం చేయడం గీతా ధర్మం యొక్క పరమ లక్ష్యం. కర్మ చేయకపోవటం వల్ల వ్యక్తి సమాజానికి భారం అవుతాడు. సమాజంలో ఇతరుల కర్మఫలం వల్ల తాను లాభపడతాడు.  

అంటే ఇతరుల శ్రమ ఫలాన్ని అక్రమంగా దోచుకున్న వాడవుతాడు. అందుకే వ్యక్తి కర్మ చేయాలి, ఆ కర్మ ఫలాన్ని తాను కోరక భగవంతుడికి అర్పించాలి. అట్లాగే విశ్వరూప సందర్శన యోగంలో భగవంతుడంటే ఈ చరాచర సృష్టి అనే భావం అర్జునుడికి స్పష్టమైంది. భగవదర్పణ చేయడమంటే ఏ సృష్టిలో తాను జీవిస్తున్నాడో, ఆ సృష్టికే ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా అర్పించడం. భగవద్భావనలో మరో విశేషం ఉంది. సామాజిక స్పృహ అనేది మనుషులకు మాత్రమే పరిమితమైనది. భగవద్భావన సమస్త సృష్టికి వ్యాప్తమైంది. 

సంకలనం: కోటేశ్వర్

14, జూన్ 2020, ఆదివారం

గౌతమ మహర్షి - న్యాయ దర్శనం - Gautama Maharshi, Nayadarshanam


న్యాయ దర్శనం గౌతమ మహర్షి చే రూపొందించబడిన న్యాయ విద్యా విభాగం.న్యాయ దర్శనం ఆస్తిక విభాగానికి చెందినది.గౌతముడు 5 వ శతాబ్ది కాలానికి చెందిన మహర్షి.అతనిని అక్షపాద అని కుడా అంటారు.

షడ్-ధర్శానాలన్ని విజ్ఞానానికి సమాన ప్రాదాన్యతను ఇచ్చాయి.అలాగే న్యాయశాస్త్రం లో విజ్ఞానానికి ఇచ్చిన ప్రాదాన్యతను ప్రమాణాలు అంటారు.ఈ న్యాయ విధానాన్ని న్యాయశాస్త్రం గాను,తర్కశాస్త్రం గాను వ్యవహరిస్తారు.

న్యాయ శాస్త్రం లో ముఖ్యంగా నాలుగు ప్రమాణాలు ఉంటాయి.

అవి :
 • 1.ప్రత్యక్షము.
 • 2.అనుమానము.
 • 3.ఉపమానము.
 • 4.శబ్ద గుణము.
తర్కమునకు చర్చకు ఇవి మూలములు.
న్యాయ దర్శనం భగవద్ నామాన్ని అంగీకరిస్తుంది.ఆ భగవంతుడిని ఈశ్వరుడిగా సంభోదిస్తూ సమస్త సృష్టికి కారణం గా వ్యవహరిస్తుంది.

గౌథముని సృష్టి వివరణలో ఒక ముఖ్యమైన వాఖ్యం.. "ఈ సమస్త విశ్వం శక్తి స్వరూపం లోని ఈశ్వరునిచే నిర్మించబడి,ఆయననుంచే అణువులు, కాలము, ఆలోచన,అంతరిక్షము, జీవ రాశి సృష్టించబడ్డాయి".

న్యాయ దర్శనమును తర్క శాస్త్రము అని కూడా అంటారు. కాని ఇది పూర్తిగా తర్క శాస్త్రం కాదు. ఇందులో మొత్తము 524 సూత్రాలుంటాయి. గౌతముని న్యాయ సూత్రాలు ఇలా ప్రారంభం అవుతాయి.
ప్రమాణ ప్రమేయ సంశయ ప్రయోజన
దృష్టాంత సిద్ధాంతావయవ తర్క నిర్ణయ
వాద జల్ప వితండాహేత్వాభాసచ్ఛల
జాతి నిగ్రహ స్థానానాం తత్వజ్ఞానా
న్నిఃశ్రేయ సాధిగమః
1. ప్రమాణములు
న్యాయ దర్శనం పదహారు పదార్థాలను (షోడశపదార్థములు) తెలుసుకుంటే నిశ్శ్రేయసం (మోక్షం) ప్రాప్తిస్తుందని వాగ్దానం చేస్తుంది.

అవి:
ప్రమాణం, ప్రమేయం, సంశయం, ప్రయోజనం, దృష్టాంతం, సిద్ధాంతం, అవయవం, తర్కం, నిర్ణయం, వాదం, జల్పం, వితండం, హేత్వాభాసం, ఛలం, జాతి మరియు నిగ్రహ స్థానం.
ఈ పైన సూచించిన (షోడశపదార్థములు) ప్రమాణములు జ్ఞాన సాధనములు.

2.ప్రమేయములు
ఆత్మ, శరీరము, ఇంద్రియము, అర్థము, బుద్ధి, (జ్ఞానము), మనస్సు, ప్రవృత్తి, దోషము, ప్రేత్య భావము, ఫలము, దుఃఖము మరియు అపవర్గము. వీటన్నింటి వివరణే న్యాయ దర్శనము. వైశేషిక దర్శనం తరువాతి అంశం.

ఓం నమః శివాయ.

సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి

6, జూన్ 2020, శనివారం

గర్వం తలకెక్కితే...గరుత్మంతుడికైనా అవమానం తప్పదు కాదా - Garutmantudi Garvabhangam, Garudaగర్వం తలకెక్కితే...గరుత్మంతుడికైనా అవమానం తప్పదు కాదా - Garutmantudi Garvabhangam, Garuda

గర్వం తలకెక్కితే...గరుత్మంతుడికైనా అవమానం తప్పదు
 • ⧫ ఇంద్రుని రథసారధి పేరు మాతలి. ఆ మాతలికి ఒక అందమైన, గుణవంతురాలైన కూతురు ఉంది. ఆమె పేరు గుణకేశిని. గుణకేశిని యుక్తవయస్సుకి వచ్చేసరికి ఆమెకు తగిన వరుని కోసం మాతలి పధ్నాలుగు లోకాలనూ వెతికాడు.!
 • ⧫ తన కూతురికి సరిపోయే జోడీ ఎవ్వరూ ఆయనకి కనిపించలేదు. ఇదే విషయాన్ని నారదుని దగ్గర ప్రస్తావించగా... పాతాళలోకంలో ఆర్యకుడు అనే రాజుకి, సుముఖుడు అనే మనవడు ఉన్నాడనీ... అతను గుణకేశినికి తగిన వరుడు కావచ్చునని సూచించాడు నారదుడు.
 • ⧫ నారదుని సూచన మేరకు సుముఖుడిని చూసిన మాతలికి, నిజంగానే అతను తన కూతురికి తగిన వరునిగా తోచాడు. ఈ విషయం ఆర్యకునికి చెప్పగానే అతను సంతోషంతో ఉప్పొంగిపోయాడు. కానీ అంతలో ఏం గుర్తుకువచ్చిందో కానీ విచారంలో మునిగిపోయాడు.
 • ⧫ ‘మాతలీ! నీ కూతురిని మించిన సంబంధం మరేముంటుంది? కానీ నా మనవడికి ఒక గొప్ప ఆపద పొంచి ఉంది. విష్ణుమూర్తి వాహనమైన ఆ గరుత్మంతుడు మా జాతి మీద పగపట్టిన విషయం తెలిసిందే కదా! అతని పగని చల్లార్చేందుకు మేమే స్వచ్ఛందంగా మాలో ఒకరిని అతనికి ఆహారంగా పంపుతూ వస్తున్నాము.
 • ⧫ ఇప్పటికే అలా సుముఖుని తండ్రి గరుత్మంతునికి బలైపోయాడు. ఇక త్వరలో సుముఖుని వంతు కూడా రాబోతోంది. త్వరలో చావు మూడబోతున్న వ్యక్తికి చూస్తూ చూస్తూ నీ కూతురిని ఇచ్చి వివాహం చేయలేవు కదా!’ అని వాపోయాడు.
 • ⧫ ఆర్యకుని విషాదం విన్న మాతలికి ఏం చేయాలో పాలుపోలేదు. అలాగని సుముఖుని వదులుకునేందుకూ మనసు ఒప్పలేదు. దాంతో సుముఖుని తీసుకుని నేరుగా దేవలోకానికి వెళ్లాడు మాతలి. అక్కడ కొలువై ఉన్న ఇంద్రునికి తన సమస్యను నివేదించాడు. మాతలి సమస్యను విన్న ఇంద్రుడు వారిని తీసుకుని విష్ణుమూర్తి చెంతకు చేరుకున్నాడు.
 • ⧫ వైకుంఠంలో విష్ణుమూర్తి చెంత ఇంద్రుడు, మాతలి, సుముఖుడు వినమ్రంగా నిలబడి ఉండగానే... అక్కడికి ప్రవేశించాడు గరుత్మంతుడు. అక్కడ ఏం జరుగుతోందో గమనించగానే అతని క్రోధానికి అడ్డులేకుండా పోయింది.
 • ⧫ నిప్పులు కక్కతూ- ‘ఇంద్రా! నా మాట కాదని ఈ సుమఖుని చిరాయువుగా చేసే ప్రయత్నం చేస్తావా. దగ్గరుండి ఇతని వివాహం జరిపించాలని తలపెడతావా. నా శక్తి గురించి నీకు తెలియదా! నిన్ను నేను అవలీలగా ఓడించిన రోజులు మర్చిపోయావా. ఈ విశ్వం మొత్తాన్నీ ఒక్క ఈక మీద మోయగలను. సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తినే మోసే సామర్థ్యం నాకు ఉంది...’ అంటూ ఇంద్రుని వైపు దూసుకుపోయాడు.
 • ⧫ ఇదంతా గమనిస్తున్న విష్ణుమూర్తి- ‘గరుత్మంతా! నేను ఇక్కడున్నానన్న విషయం కూడా మర్చిపోయి ప్రగల్భాలు పలుకుతున్నావే! నువ్వు అంతటి వీరుడవా? నన్ను సైతం అవలీలగా మోయగలవా! సరే నీ శక్తి ఏ పాటితో చూద్దాం ఉండు,’ అంటూ తన చేతిని గరుత్మంతుని మీద మోపాడు. అంతే! గరుత్మంతుడు ఒక్కసారిగా నేలకరిచాడు.
 • ⧫ నోట మాటరాక చెమటలు కక్కుతూ దిక్కు తోచక మిన్నకుండిపోయాడు. విష్ణుమూర్తి తన చేతిని తీసిన తరువాత కానీ అతను ఊపిరిపీల్చకోవడం సాధ్యపడలేదు.
 • ⧫ ‘నేను నీకు మోసే అవకాశం ఇస్తున్నాను కాబట్టే నువ్వు నన్ను మోయగలుగుతున్నావు. కానీ నీ బాధ్యత గర్వంగా మారి తలకెక్కినట్లుంది. నువ్వు మోసే బరువుకంటే తలబరువే ఎక్కువగా ఉన్నట్లుంది. ఆ గర్వం తగ్గించుకుని బుద్ధిగా ఉండకపోతే ఇలాంటి పరాభవం తప్పదు,’ అంటూ హెచ్చరించాడు విష్ణుమూర్తి.
 • ⧫ దేవాదిదేవుడైన ఆ విష్ణుమూర్తి చేతిలో గర్వభంగం పొందిన గరుత్మంతుడు తన తప్పుని తెలుసుకున్నాడు. ఆ తప్పుని మన్నించమంటూ ఇంద్రుని వేడుకుని, తల వంచుకుని అక్కడి నుంచి నిష్క్రమించాడు.
సంకలనం: శృతి వేణుమొగుల

3, జూన్ 2020, బుధవారం

కోరికలను జయించు ఉపాయము - Korika Jayinchu

కోరికలను జయించు ఉపాయము - Korika Jayinchu

కోరికలను జయించు ఉపాయములు

కోరికలను జయించవలెననే భావమే కోరిక. ధ్యానము, తపస్సు, యోగము మొదలగు సాధనలు చేయాలనేది కూడా కోరికే.
 • ➣ ఉపాయమేమంటే చేసే పనికి ఇష్టాయిష్టములు మూలము కాకూడదు. అత్యవసర కర్మ జరుపబడుచున్నట్లు ఉండవలెను. 
 • ➣ ముందుగా తలచుకోకుండానే చేయబడవలెను. పని పూర్తయిన తరువాత ఆ పని చేసినట్లుగాని, ఫలితముగాని గుర్తుకు రాకూడదు. 
 • ➣ స్వబుద్ధి నిర్ణయము ఉండకూడదు. 
 • ➣ దేనినీ విమర్శ చేయరాదు. 
 • ➣ తన పేరు, ఊరు, వ్యక్తిత్వమును, గొప్పతనమును, అపరాధమును ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రకటించవలెననే భావన ఉండకూడదు. 
 • ➣ అనామకునివలె ఉండవలెను. 
ఈ విధముగా ఉన్నవాడు అగస్త్యుని అన్న. అతని పేరు, చరిత్ర ఎవరికీ తెలియదు. అందువలన అతడిని అస్త్య భ్రాత అని పిలిచెదరు. లేనివాడుగా ఉండవలెను. బ్రతికియు చచ్చినవానివలె నిష్క్రియా భావముతో ఉండవలెను.

ర్మలలో ఉత్సాహము గాని, నిరసన గాని చూపరాదు. అహము పనిచేయకూడదు. సంసారము, లోకము, మనోకల్పితమని, మనస్సే మాయయని, విచారణ ద్వారా తెలిసి తూష్ణీభూతముగా ఉండవలెను. ప్రారబ్ధమే కర్మను జరుపుచున్నది. నిజానికి ఎవరూ కర్మ చేయుటలేదు. నటనగా జీవించవలెను. వ్యవహారమందు అసంగముగా నుండవలెను. గతము గుర్తు రాకూడదు. భవిష్యత్తు గురించి చింత ఉండరాదు.

ఊహలు, పగటికలలు ఉండరాదు. కలలో తోచినవేలాగో అలాగేనని తలచి, ప్రతిస్పందన మానవలెను. అవసరమైనవి ప్రారబ్ధానుసారము జరుగుచున్నప్పుడు కర్తృత్వ రహితముగా ఉండుటయే లేనెరుక. ఎరుక ఏరూపములోనూ బాధించనప్పుడది లేనెరుక. విడచుట, మానుట, ఉదాసీనముగా ఉండుట, స్పందించకుండుట, గుర్తుంచు కొనకుండుట వంటివే కాని, ఇక ఏ సాధన లేదు. దీనినే కోరికలను జయించు ఉపాయముగా అభ్యాసము చేయవలెను.

అనువాదము: చల్లపల్లి

20, మే 2020, బుధవారం

దరిద్రం ఎలా ప్రాప్రిస్తుంది - Daridram Yala praptistundi

ప్రకృతిలో ప్రతిమనిషి దేహంలోను పరమాత్మ శక్తి దివ్యశక్తిగా ఉంటుంది. ఎదుటివారి దేహంలోని పరమాత్మ పరమైన దివ్యశక్తిని కొంత మంది అతి తెలివిగా ఆచారాలు, సంప్రదాయాలు, పూజలు పేరుతో దొంగిలించి, తత్ ఫలితంగా అధిక లాభం పొందుచుంటారు.

ఉచితంగా తీసుకొన్న వస్తువుకి సమానమైన దివ్యశక్తి తీసుకొన్నవారి దేహం నుండి మాయమై యిచ్చినవారికి చేరును. అసలు కొన్ని పూజలు, ఆచారాలలోని రహస్యం ఇదే. పేరంటం పేరుతో తీసుకొనే గుప్పెడు శనగలు లేదా వేరే పదార్ధం, వస్తువుకి సరిపడే దివ్యశక్తిని స్వీకరించినవారు కోల్పోతారు పూజ లేదా ప్రసాదం పేరుతో అతి తెలివిగా కొన్ని కొన్ని యిస్తుంటారు. గతకాలంలో ఉచితంగా దానంగా అనేక వాటిలను స్వీకరించిన అనాటి కుటుంబాలు ఈనాడు కడుదైన్యస్థితిలో జీవిస్తున్నారు.

ఉచితంగా ఏదీ స్వీకరించకు:
మాజీ రాష్ట్రపతి దా|| అబ్దుల్కలాంగార్కి వారి తండ్రిగారు ఈసూత్రాన్ని వివరించారని 19-6-2007లో ఒక సమావేశంలో వివరించారు. "మనుస్మృతి"లో ఈ విషయం వివరించబడినదని దా॥ అబ్దుల్ కలాంగారు వివరించారు తన తండ్రి తనకు చెప్పిన పాఠాలలో ఇదోకటని వివరించారు.

ఆయచితంగా వస్తుందని ఆశించిన గుప్పెడు శనగలు కాలక్రమంలో గుప్పెడు దరిద్రాన్ని ఇంటికి
తీసుకొస్తాయని తెలుసుకోవాలి. కొన్ని తెలివైన జాతులు లేదా కుటుంబాలవారు ఏదో ఒక వంకని ఏదో ఒకటి ఆయాచితంగా ఎడుటివారికి యిస్తుంటారు. దీనిని స్వీకరించిన వారు కోల్పోయేది అధికమే కాకుండా ఆయాచితంగా దారిద్ర దేవత ఇంల్లోకి ప్రవేశిస్తుంది. ఒకసారి ఈ దరిద్రదేవత గృహంలో పాదం మోపిందంటే వాలు తరాలు నాశనం అనక్ర తప్పదు.

రచన: కట్టమంటి మహాలక్ష్మి

18, మే 2020, సోమవారం

మనుస్మృతి లో శూద్రులను అణగద్రొక్కారనేది నిజామా, విశ్లేషణ ! - Manusmruti, Sudrulanu Anagdokkevaara

మనుస్మృతి లో శూద్రులను అణగద్రొక్కారనేది నిజామా, విశ్లేషణ ! - Manusmruti, Sudrulanu Anagdokkevaara

 శూద్రులను అణగద్రొక్కారా?: 

శూద్రులను గురించి మనువు అభిప్రాయాలని చూద్దాము. “శోచంతి ఖిద్యస్త ఇతి శూద్రా" కష్టపడేవారని అమరము. బ్రాహ్మణులు విరాట్పురుషుని ముఖం నుంచి. శూద్రులు పాదాలనుంచి పుట్టారని మనుస్మృతి. 
 • ➣ శరీరంలో ముఖం ఎంత ముఖ్యమో పాదాలు అంతే ముఖ్యము. 
 • ➣ ఛందస్సు వేదపురుషునికి పాదాల వంటిది అన్నదాని భావం కూడా అంతే. 
 • ➣ మనిషి సర్వాం గములతో కూడిన వాడైనప్పటికీ, కాళ్ళు లేకపోతే ఎంత కష్టమో, అట్లాగే కష్టపడి
 • ➣ పంటలు పండించి, సేవలుచేసే వాళ్లు లేక పోతే కూడా అంతే కష్టము. అదే మనువు భావంగా కన్పిస్తుంది.
 • ➣ అట్లాకాకపోతే అంటరానివాడైన శూద్రుడు కూడా ఆ విరాట్పురుషుని నుంచే పుట్టినట్లుగా ఎందుకు వర్ణిస్తాడు? కనుక పై కులాల వారందరికీ శూద్రుడే ఆధారభూతుడని అర్థం చేసుకోవాలి.
అదీకాక - పౌండ్రకులు, ఓడ్రులు, ద్రావిడులు, కారిభోజులు, యవనులు, శకులు, పారదులు, పప్లవులు, చీనులు, కిరాతులు, దరదులు, ఖశులు మొదలైనవారు సంస్కార రాహిత్యం వల్లనే శూద్రులయినారని చెప్పబడింది. కనుక సంస్కారదూరులైన వారంతా ఆ రోజులలో శూద్రులుగా పరిగణింపబడే వారని తెలుస్తుంది
 • ➣ అంతేకాదు - వృద్ధుడైన శూద్రుడు బ్రాహ్మణునికి గౌరవింపదగినవాడేనట.
 • ➣ ఆకలితో ఉన్న బ్రాహ్మణుడు శూద్రునికంటె తక్కువ వారి ఇంటకూడా భోజనం తినవచ్చును. అందుకు బ్రాహ్మణాలులైన విశ్వామిత్రుడు, భరద్వాజుడు వంటివారే నిదర్శనము.
 • ➣ కనుక వీటన్నింటిని బట్టీ ఆలోచిస్తే ఆనాటి శూద్రులు, మనమనుకొనే శూద్రులు కారనిపిస్తోంది. 
అయితే - శూద్రుడు తాకితే అతని నాలుక కోసి వెయ్యాలని, శూద్రుడు ఉన్నత జాతి స్త్రీతో రమిస్తే లింగచ్ఛేదం చెయ్యాలని మనుస్మృతిలో కన్పిస్తోంది. అది తీవ్రమైన నాటి శిక్షావిధానానికి నిదర్శనం ఎందుకంటే దొంగతనం చేస్తే శిరచ్చేదం చెయ్యమని మనువే చెప్పాడు. 

ఏమైనప్పటికీ అంత క్రూరమైన శిక్షలు అలనాటి పరిస్టుల బట్టి ఉండేవని తెలుస్తోంది. ఏమైనప్పటికి ఇలాంటివి సమర్థనీయములు కావు.

రచన: నల్లందిగళ్ లక్ష్మీనరసింహ ఆచార్యులు

2, మే 2020, శనివారం

పంచ పునీతాలు - Pancha punitalu

పంచ పునీతాలు - Pancha punitalu
పంచ పునీతాలు
 • మొదటిది..వాక్ శుద్ధి: వేలకోట్ల ప్రాణులను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక్క మనిషికే ఇచ్చాడు. కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు. పగ, కసి, ద్వేషంతో సాటివారిని ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ నిందించకూడదు. మంచిగా, నెమ్మదిగా, ఆదరణతో పలకరించాలి. అమంగళాలు మాట్లాడేవారు తారసపడితే ఓ నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి.
 • రెండవది..... దేహశుద్ధి: మన శరీరం దేవుని ఆలయం వంటిది. దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ రెండుపూటలా స్నానం చెయ్యాలి. చిరిగిన, అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు.
 • మూడవది.....భాండ శుద్ధి: శరీరానికి కావలసిన శక్తిని ఇచ్చేది ఆహారం. అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి. స్నానం చేసి, పరిశుబ్రమైన పాత్రలతో వండిన ఆహారం అమృతతుల్యమైనది.
 • నాలుగవది.......కర్మశుద్ధి: అనుకున్న పనిని మధ్యలో ఆపినవాడు అధముడు. అసలు పనినే ప్రారంభించనివాడు అధమాధముడు. తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తిచేసినవాడు ఉన్నతుడు.
 • ఐదవది..........మనశ్శుద్ధి: మనస్సును ఎల్లప్పుడూ ధర్మ, న్యాయాలవైపు మళ్ళించాలి. మనస్సు చంచలమైనది. ఎప్పుడూ వక్రమార్గాలవైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూవుంటుంది. దానివల్ల అనేక సమస్యలు వస్తాయి. దీనివల్ల దుఃఖం చేకూరుతుంది. కాబట్టి ఎవ్వరికీ హాని తలపెట్టని మనస్తత్వం కలిగివుండటమే మనఃశుద్ధి.

27, ఏప్రిల్ 2020, సోమవారం

విభీషణుడి ధర్మ నీతి - Vibhishan Dharma Neethiనిషి పుట్టిన వంశం, కులం, జీవన విధానాలు ఎటువంటివైనా ఆశయాలూ, లక్ష్యాలూ, విలువలూ ఉన్నతంగా ఉంటే మనిషి మహనీయుడవుతాడనీ, తాను మానసికంగా ఎంతటి వ్యథను  అనుభవించినా, తనవారినే నిరోధించాల్సి వచ్చినా ధర్మమార్గమే తన మార్గమని తలంచి చివరిదాకా దానికి కట్టుబడి జీవించిన మనిషే మనిషనీ నిరూపించిన మహానుభావుడు విభీషణుడు. 
రాక్షసకులంలో జన్మించినా రత్నంగా, ధార్మిక జగతిలో శిరోమణిగా, రామాయణ గాథలో కీలకమైన వ్యక్తిగా సమాజానికి పరిచయమైన విభీషణుని మనో విజ్ఞానం అత్యద్భుతం, భావితరాలకు ఆదర్శం.
కైకసీ విశ్రవుల మూడో కొడుకు, రావణుని సోదరుడూ, మంత్రి, శ్రీరామచంద్రునికి అత్యంత ఆప్తుడు విభీషణుడు. శైలూషుడనే గంధర్వరాజు కూతురు సరమ ఈతని భార్య. రాక్షస లంకలో రామనామ జపాన్ని రహస్యంగా ధ్వనిస్తూనే ఆ నామ తరంగాలను రాక్షసత్వాన్ని పావనం చేసేందుకు తపించిన రాక్షసోత్తముడు విభీషణుడు. ఒక వ్యక్తి జీవితాన్నీ, అతనిలోని భావోద్వేగాలనూ సంపూర్ణంగా ఓ అంచనాకు తేవడం అసాధ్యం. మన జీవితాన్నే సరిగ్గా వ్యక్తపరచలేని మనం ఎదుటివారిని అర్థం చేసుకోవడంలో వెనుకడుగు వేయక తప్పదు. విభీషణుని జీవితాన్ని కూడా అర్థం చేసుకోవడం కష్టమే. ఎందుకంటే రాక్షసత్వంలోంచి పరిమళించిన ధార్మికత, నైతికత లోకకళ్యాణం కోసం మరింత నిగ్గుదేలాయనడానికి విభీషణుని వ్యక్తిత్వమే ప్రతీక.

పుట్టుక రాక్షసజాతి నిర్దేశించింది. కానీ విభీషణుని వ్యక్తిత్వం మానవీయ కోణంలో ఎదిగింది. తనజాతి లక్షణాలు స్వతాహాగా మనిషి కోణంలో ఎదిగాయి. తన జాతి లక్షణాలు స్వతహాగా మనిషిలో ప్రభావితమవుతున్నా వాటి జోలికి పోకుండా ఎటువంటి ప్రలోభాలు ప్రేరేపించినా తలొగ్గక, ఎంతటి భోగాలు ఆకర్షించినా ఏమాత్రం సడలక తనదైన వ్యక్తిత్వంతో ధర్మసాధన చేసి విభీషణుడు మహోన్నతుడయ్యాడు. తన కుటుంబం, తన లంకానగరం, తన అన్న రావణుడూ ధర్మం నీడలో బతకాలని కాంక్షించి దానిని కొనసాగించడం కోసం అహర్నిశలూ తపించాడు.

మహావీరుడూ, ధర్మశాస్త్ర, నీతిశాస్త్ర సారమెరిగినవాడూ, సకల కళలలో ప్రావీణ్యం గలవాడూ, లంకను సర్వస్వతంత్ర సామ్రాజ్యంగా నిలబెట్టిన చక్రవర్తి. బంగారు లంకను స్థాపించిన రావణుడంటే విభీషణునికి అభిమానం, ప్రేమ, గౌరవం. రావణుడు తన అన్న అయినందుకు ఒకింత గర్వం. కానీ ఒక స్త్రీ వ్యామోహంతో లంకాపతనానికి పూనుకున్నందుకు రావణున్ని వారించిన తీరు ధర్మజగతిలో ఓ మైలురాయి. 

దండకారణ్యం నుంచి సీతాపహరణం చేసుకొని వచ్చాడన్న వార్త వినగానే ఆగామి రోజుల్లో జరుగబోయే పీడను శంకించిన విభీషణుడు రావణుడు చనిపోయేంత వరకూ తను చేసేది, చేస్తుంది అధర్మమని చెబుతూనే ఉన్నాడు. బతిమాలాడూ, వాదించాడూ, చర్చించాడూ, హెచ్చరించాడు. అయినా రావణుడు పంతం వీడలేదు. 
శ్రీ రామునితో విభీషణుడు
విభీషణుడి ధర్మ నీతి:
 • ⭄ హనుమంతుడు దూతగా వచ్చినప్పుడు రావణుడు ఒక కోతి వచ్చి నాకు ధర్మబోధ చేస్తుందా! అని పరిహసిస్తూ హనుమను చంపమని ఆదేశిస్తే, విభీషణుడు దూతను చంపడం అత్యంత దుర్మార్గమనీ, కావాలంటే అతను మనకు చేసిన నష్టానికి గానూ ఏదైనా శిక్షను విధించి వదిలేయమని సమాధానపరుస్తాడు. 
 • రావణునితో ప్రశాంతంగా ఆలోచించు! నీ శత్రువుకు నీవేంటో తెలియాలంటే దూతను వదిలేయడమే ధర్మమని చెబుతాడు.
 • ⭄ రామరావణ యుద్ధాన్ని వారించేందుకు విభీషణుడు పడ్డపాట్లు అన్నీ, ఇన్నీ కావు. రావణునితో విభీషణుడు చెప్పిన మాటలు నాడు త్రేతాయుగాన్నే కాదు, నేటి కలియుగాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. 
 • అహంకారం నాడే కాదు, నేడు కూడా కుటుంబాలు నాశనమయ్యేందుకు, జీవితాలు పతనమయ్యేందుకు కాచుకొని కూర్చుంటుందనే గుణపాఠం ఆ మాటల అంతరార్థం.
విభీషణుడు రావణునితో.. 
స్త్రీ వల్లే ధనం, కీర్తి వస్తాయి. స్త్రీ వల్లే సర్వం తుడిచిపెట్టుకుపోతాయి. దేవతలకు కూడా లభించని అమరసుఖాలు మన లంకలో ఉన్నాయి. వాటిని అనుభవించే అదృష్టాన్నీ చేజేతులా పాడుచేసుకోవద్దు. నిన్నే నమ్ముకొని ఉన్న లంకానగరవాసుల్ని ఒక స్త్రీ కారణంగా మృత్యుఒడిలోకి నెట్టొద్దు. నేను నీకు ఆప్తుడనూ, మంత్రినీ. అహాన్ని వదిలి సీతమ్మను సగౌరవంగా శ్రీరామునికి అప్పగిద్దాం. అన్నింటినీ సమూలంగా నాశనం చేసే కోపాన్ని విడిచిపెట్టు. అన్నింటికీ ఆలవాలమైన ధర్మాన్ని పాటించు. కోపాన్నీ అహాన్ని, మైథిలినీ వదిలి రావణుడు కీర్తిని పోందాలనీ, అధర్మాన్ని వీడి ధర్మమార్గంలో నడవాలనీ భావించే ఈ విభీషణుడు నీ మంచే కోరుకుంటాడని ప్రాధేయపడతాడు.

రావణుని మిగతా సోదరులూ, మంత్రులూ, కొడుకులూ రావణుని వైభవాన్ని చాటుతున్నామనుకొని రావణున్ని రెచ్చగొడుతుంటే చూసి సహించలేని విభీషణుడు వారితో రాచధర్మాన్ని నిలబెట్టాలనుకుంటే రాజుకు మంచే చెప్పాలి. అది కఠినంగా ఉన్నా సరే. అధర్మంతో రాక్షస వినాశనానికి పూనుకుంటుంటే సమర్థించడం ఎంత మాత్రం మంచిది కాదని హెచ్చరించాడు.

ఇలా ఎన్నో విధాలుగా చెప్పీ, చెప్పీ అలిసిపోయిన విభీషణుడు ధర్మమే నిలబడుతుందనీ, న్యాయమే గెలుస్తుందనీ నమ్మి రాముని శరణుకోరాడు. రావణుని జయించడానికి అనేక ఉపాయాలూ, రహస్యాలూ రామునికి తెలిపి సహకరించాడు. రావణుడు నేలకొరగడం చూసి తట్టుకోలేక విలపించాడు. అనుకున్నదంతా అయ్యిందనీ, ఒక స్త్రీ వ్యామోహంతో రావణుడంతటి వాడూ, అనంతమైన లంక పతనం అయ్యిందనీ బాధపడి రావణునికి అంతిమ సంస్కారం చేసి సద్గతులకై ప్రార్థించాడు విభీషనుడు.

సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి

23, ఏప్రిల్ 2020, గురువారం

ఉత్తమ మానవుడు - Uttama Maanavudu


ఉత్తమ మానవుడు - Uttama Maanavudu
కీర్తి, అధికారం, ధనం ఈ మూడిటినీ కోరుకోని మానవుడు ఉండడు. అయితే, వీటిని సంపాదించడంలో మనిషి తనకు తాను కొన్ని పరిమితులు విధించుకోవాలి. ఈ మూడు విషయాలలో ఒక స్థాయిని పొందిన తరువాత తృప్తి చెందాలి. అలాకాక, ఇంకా ఇంకా కావాలకునే వారు ఆ దాహంలో వాటి పరిమితులు తెలియక నష్టపోతారు.

ఎందుకంటేఉన్నత స్థాయిని చేరిన తరువాత క్రిందకి దిగటమే కాని, పైకి ఎక్కడానికి మరి సోపానాలు ఉండవు. క్రిందకి దిగడం మొదలుపెట్టామో, అవి జారుడుమెట్లను తలపిస్తాయి.

కీర్తి దాహం, అధికార దాహం, ధన దాహం ఈ మూడూ ఒక స్థాయిని దాటిన తరువాత అడ్డదారులు తొక్కుతాయి. మనిషి సన్మార్గాన్ని వీడిపోతాడు. దుష్ట ఆలోచనలు ప్రవేశిస్తాయి. ఈ మూడిటినీ పొందడానికి, పొందిన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు. ఆ క్రమంలో ఎన్నో పాపాలు, దుర్మార్గాలు చేస్తాడు. మనశ్శాంతిని పోగొట్టుకుంటాడు. మనిషికి అన్నిటికన్నా ముఖ్యమైనది, అలవరచుకోవలసినది మన:తృప్తి...ఇది తెలిసిన వాడు పై మూడిటినీ తన చెప్పుచేతల్లో ఉంచుకోగలుగుతాడు. అతడే ఉత్తమ మానవుడు.

సంకలనం: ప్రసాద్

17, ఏప్రిల్ 2020, శుక్రవారం

పాపములు నశించిపచేసే యోగినీ నామాలు - Gruhastula Papamulu

పాపములు నశించిపచేసే యోగినీ నామాలు - Gruhastula Papamulu
గృహస్థులకు పాపాలు నశించిపోయేనామాలు
ఏ నామాలను వినడం వల్ల సాంసారికుల పాపాలు నశించిపోతాయో అట్టి యోగినీ గణముయొక్క నామాలను స్కందుడు అగస్త్య మహర్షికి చెప్పాడు.
 • ⧫ గజాననీ , 
 • ⧫ సింహముఖీ , 
 • ⧫ గృద్ధ్రాస్యా కాకతుండికా, 
 • ⧫ ఉష్ట్రగ్రీవా, 
 • ⧫ హయగ్రీవా, 
 • ⧫ వారాహీ, 
 • ⧫ శరభాననా, 
 • ⧫ ఉలూకికా, 
 • ⧫ శివారావా , 
 • ⧫ మయూరీ వికటాననా, 
 • ⧫ అష్టవక్రా,  
 • ⧫ కోటరాక్షీ , 
 • ⧫ కుబ్జా , 
 • ⧫ వికటలోచనా, 
 • ⧫ శుష్కోదరీ , 
 • ⧫ లలజ్జిహ్వా,  
 • ⧫ శ్వదంష్ట్రా,  
 • ⧫ వానరాననా, 
 • ⧫ ఋకాక్షీ , 
 • ⧫ కేకరాక్షీ ,చ ,
 • ⧫ బృహిత్తుండా,  
 • ⧫ సురాప్రియా, 
 • ⧫ కపాలహస్తా , 
 • ⧫ రక్తాక్షీ శుకీ శ్యేనీ , 
 • ⧫ కపోతికా, 
 • ⧫ పాశహస్తా , 
 • ⧫ దండహస్తా , 
 • ⧫ ప్రచండా చండవిక్రమా, 
 • ⧫ శిశుఘ్నీ , 
 • ⧫ పాపహంత్రీచ,  
 • ⧫ కాళీ రుధిరపాయినీ, 
 • ⧫ వసాధయా , 
 • ⧫ గర్భభక్షా,  
 • ⧫ శివహస్తాంత్రమాలినీ, 
 • ⧫ స్థూలకేశీ , 
 • ⧫ బృహత్కుక్షిః,  
 • ⧫ సర్పాస్యా,  
 • ⧫ ప్రేతవాహనా, 
 • ⧫ దందశూకకరా , 
 • ⧫ క్రౌంచీ , 
 • ⧫ మృగశీర్షా,  
 • ⧫ వృకాననా, 
 • ⧫ వ్యాత్తాస్యా , 
 • ⧫ ధూమనిఃశ్వాసా,  
 • ⧫ వ్యోమైకచరణోర్థ్వదృక్,
 • ⧫ తాపనీ , 
 • ⧫ శోషణీ , 
 • ⧫ దృష్టిః , 
 • ⧫ కోటరీ స్థూలనాసికా, 
 • ⧫ విద్యుత్ప్రభా , 
 • ⧫ బలాకాస్యా , 
 • ⧫ మార్జారీ కటపూతనా, 
 • ⧫ అట్టాట్టహాసా , 
 • ⧫ కామాక్షీ , 
 • ⧫ మృగాక్షీ మృగలోచనా. . . 
ప్రతిదినము ఈ నామాలు జపిస్తే, దుష్టబాధలు నశిస్తాయి. ప్రమాదాల బారిన పడరు. అనుకున్నపనులు..ఆటంకాలు లేకుండా జరుగుతాయి. ఈ నామములు శిశువులకు శాంతికారకములు.స్త్రీలకు గర్భోపద్రవ నివారకములు.

ఓం స్కందాయ నమః

సంకలనం: భానుమతి అక్కిశెట్టి

15, ఏప్రిల్ 2020, బుధవారం

సింహాసనం కాదని వనవాసానికి - Simhasanam Kaadani Vanavasaniki Ramudu

శరథునికి మనసులో తాను వృద్ధుడయి నట్లుగా అనిపించింది. శ్రీరామునికి యువరాజ పట్టాభిషేకం చేయాలనీ కోరిక కలిగింది. కానీ ఆ పనిలో అనేక విఘ్నాలు కలుగవచ్చుననే అనుమానం కూడా కలిగింది. సర్దారులను, రాజులను, మంత్రులను, పురోహితులను ప్రజలను రాజదర్బారులో సమావేశ పరిచాడు. నిండు దర్భారులో తన ఆలోచనలు ప్రజలముందుంచాడు.
"నేను వృద్ధుడనయ్యాను. వంశాచారం ప్రకారం జ్యేష్ఠ పుత్రుడయిన శ్రీరామునికి యువరాజు పట్టాభిషేకం జరపాలని నాకు అనిపిస్తోంది. నా ఆలోచన సరైంది అనిపిస్తే అనుమతి ఇవ్వండి. అనుచితమనిపిస్తే ప్రత్యామ్నాయం సూచించండని” పలికాడు. 
ఒక్క రామాయణంలో తప్ప మరే ఇతర పురాణాలలో జ్యేష్ఠపుత్రునికి రాజ సింహాసనాధికారం కలిగించేందుకు ప్రజల అనుమతి కోరడం కనిపించదు. అదే నేటి పాలకులు తమ వారసులను అందలం ఎక్కించడానికి ఎన్ని పన్నాగాలు పన్నుతున్నారో చూస్తున్నాం.

      యువరాజుగా పట్టాభిషిక్తుడు కావలసిన శ్రీరాముడు తండ్రి మాటకోసం వనవాసానికి సిద్దమ య్యాడు. వాస్తవంగా కైక వలన ఒక నిరపరాధి అడవులపాలయ్యాడని, రాజ్యాధికారం పొందలేక పోయాడని భావిస్తూ ఉంటారు. కానీ రాముడి వలన జరుగవలసిన మహత్కార్యం ఎంతో ఉంది. సమస్త భూమండలంపై ఉన్న రాక్షసులను నాశనం చేసి “సజ్జన రక్షణ” అనే బృహత్కార్య నిర్వహణ ఆయన చేయాలి. అందుకే సింహాసనం కాదని వనవాసాన్ని స్వీకరించాడు.

శ్రీరాముని వనవాసానికి అసలు ఒక్క రుషిగాని, కుల గురువైన వశిష్టుడు కానీ అడ్డు చెప్పనేలేదు. రాజైన దశరథునికి నచ్చచెప్పి రాముడిని విశ్వామిత్రు నితో అడవులకు పంపగలిగిన వశిష్టునికి, కైకేయి మాట చెల్లనీయకుండా చేయడం ఏమాత్రం కష్టం కాదు, కానీ అది వారి ఆకాంక్ష కాదు.

శ్రీరాముడి చేత రాక్షస సంహారం జరగాలన్నది మహర్షులందరి అభిష్టం లోకకళ్యాణం కోసం ఆనాడు అదే అత్యవసరం. *

-జాగృతి

9, ఏప్రిల్ 2020, గురువారం

నిత్యజీవితంలో పాటించవలసిన నూరు నియమాలు, - Nityam Patinchavalasina nuru dharmika niyamalu, Follow 100 Rules In Life 1

నిత్యజీవితంలో పాటించవలసిన నూరు నియమాలు
 • 1. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు.
 • 2. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు.
 • 3. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి.
 • 4. నడుస్తూ కాని, నిలబడి కాని మలమూత్రాదులు విడువరాదు.
 • 5. బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు.
 • 6. దేవాలయాల్లోనూ, గోశాలలోను మలమూత్రాదులు విడువరాదు.
 • 7. మలమూత్ర విసర్జన ఉత్తర, దక్షిణ దిశలుగా మాత్రమే చేయాలి.
 • 8. తూర్పు, దక్షిణ దిక్కుల తల పెట్టి నిద్రపోవాలి, ఉత్తర, పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలౌతారని మార్కండేయ పురాణం చెబుతుంది.
 • 9. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగావెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటపుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి.
 • 10. పైన అనగా భుజాలమీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు, భోజనం చేయకూడదు.
 • 11. రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు.
 • 12. గురుపాపం ఎవరికీ చెప్పరాదు. గురువునకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి.
 • 13. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు.
 • 14. చతుర్దశి, అష్టమి దినాలలో తలంటు పనికిరాదు. స్త్రీ సంగమం పనికిరాదు.
 • 15. అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు.
 • 16. గురువు కోరితే ఏదైనా ఇమ్మని శాస్త్ర వచనం. అటువంటి గురువును ఏ పరిస్థితిలోను అసహ్యించుకొనరాదు. 10వేల యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది. కనుక గురుధిక్కారం పనికిరాదు.
 • 17. పిసినిగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం.
 • 18. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు.
 • 19. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు.
 • 20. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని నిందించరాదు.
 • 21. పుణ్య కార్యాల్లో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు.
 • 22. ప్రయాణం మధ్యలో భోజనాదులకు నియమంలేదు.
 • 23. తడిసిన బట్టల నీళ్ళు ఇతరులపై పడేట్లు విదిలించరాదు.
 • 24. ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు.
 • 25. తెలిసినవారి మరణ వార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి. 26. పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు. కండువా మాత్రమే ఉండవలెను.
 • 27. ఏకాదశి నాడు ఎన్ని అన్నంమెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్ర వచనం. కావున అన్నం భిన్నం చేసుకొని తినాలి. ఒక్క నిర్జలైకాదశి అనగా జేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు మాత్రం ఫలహారం కూడా పనికి రాదు. 60 సం.లు దాటిన వారికి, 11 సం.లు లోపు వారికి ఈ నియమం వర్తించదు. అనారోగ్య వంతులకు ఈ పై నియమాలు లేవు.
 • 28. కూర్చొని తొడలు, కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు.
 • 29. తూర్పు, ఉత్తరముఖంగా దంతధావనం చేయాలి. పడమర, దక్షిణ దిక్కుగా నిలబడి చేయకూడదు.
 • 30. ఉమ్ము మాత్రం తూర్పు, పడమరగా వేయరాదు.
 • 31. శివపూజకు మొగలిపువ్వు పనికిరాదు.
 • 32. ఒకేసారి నీరు, నిప్పు రెండు చేతులతో గాని, ఒకే చేత్తోగాని పట్టుకెళ్ళరాదు.
 • 33. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నపుడు విఘ్నం కలుగ చేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యాపాతకాలతో సమానం. (వేళాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో వర్తించదు.
 • 34. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి.
 • 35. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు.
 • 36. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు.
 • 37. గొడుగు, చెప్పులు కలిపి కాని, గోవును గాని దానం చేస్తే భయంకర యమమార్గం సులభంగా దాటగలరు.
 • 38. అన్నదానం, జలదానం చేసేవారు సుఖమైన మరణం పొందుతారు.
 • 39. సువర్ణదానం చేసేవారు ఐశ్వర్యవంతుల ఇళ్ళలో పుడతారు.
 • 40. కాశీలో గురుపూజ చేసిన వారిని కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది.
 • 41. ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు.
 • 42. సంకల్పం చెప్పకుండా నదీస్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే. నదీస్నాన ఫలితంరాదు. 43. ఉమ్మితో వెళ్ళు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు.
 • 44. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు.
 • 45. విష్ణు ఆలయంలో 4 ప్రదిక్షిణలు, అమ్మవారి గుడిలోనూ శివాలయంలోనూ 3 ప్రదక్షిణలు చేయాలి.
 • 46. ఆలయంలో ఆత్మప్రదిక్షిణ అనునపుడు తన చుట్టూ తాను తిరగరాదు. నమస్కారం చేస్తే చాలు, గుడి చుట్టూ ప్రదిక్షిణం మాత్రమే చేయాలి.
 • 47. నవగ్రహ ప్రదక్షిణ, పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు.
 • 48. శివాలయంలో కొబ్బరికాయ కొట్టిన తరువాత ఒక చిప్పను మనకిచ్చినా దానిని తీసుకోరాదు. జ్యోతిర్లింగాలు, స్వయంభూలింగాలు, బాణాలింగాలు అయితే మాత్రం ప్రసాదం స్వీకరించవచ్చు.
 • 49. సంధ్యా సమయంలో నిద్ర, తిండి, మైధునం పనికిరాదు.
 • 50. బహిష్టు కాలంలో పొయ్యి వెలిగించినా, అన్నం వంటివి వండినా పిల్లల వల్ల దుఃఖాల పాలౌతారు. కనుక అవి పనికిరావు.
 • 51. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం.
 • 52. నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు.
 • 53. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు.
 • 54. దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం, పొగత్రాగటం రెండూ నిషిద్దాలే.
 • 55. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసిఆకులు కోయరాదు.
 • 56. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లనుండి త్రుంచరాదు.
 • 57. గురువుద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి.
 • 58. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు. ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు.
 • 59. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషంఇవ్వక, వారికి ఋణపడేవారు నూరుజన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు.
 • 60. శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు.
 • 61. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు.
 • 62. నిద్రనుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి.
 • 63. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు.
 • 64. హారతి ఇచ్చాక దేవునిపై నీరు చల్లాలి. హారతి ఇచ్చే పాత్రపై కాదు.
 • 65. తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని కడుక్కోవాలి తప్ప, అరచేతిని తలపై రాసుకొనరాదు.
 • 66. స్నానం చేశాక శరీరం తుడుచుకొని తడి-పొడి తువ్వాలు కట్టుకొని పూజ చేయరాదు. పూజా మందిరంలో ప్రవేశించరాదు. పూర్తిగా ఆ తుండును తడిపి నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి. లేదా వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి.
 • 67. ఉపవాసం ఉన్నపుడు, జాగరణ చేసినపుడు పరులదోషాలు తలుచుకోరాదు.
 • 68. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి.
 • 69. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయి వేయాలి.
 • 70. అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు, దెప్పి పొడవరాదు.
 • 71. నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు, అభాండాలు వేయరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి.
 • 72. ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వనివాడు వందజన్మలు దరిద్రుడై పుడతాడు, వాగ్బంగం చాలా దోషం.
 • 73. అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలు, మజ్జిగ మున్నగునవి ఉన్నపాత్రలు పెట్టరాదు. మనం తినేటప్పుడు ఎంగిలి ఆ పాత్రలలో పడితే ఆ పదార్థాన్ని మరొకరికి వడ్డిస్తే, వాడికి "యముడు" మల ముత్రాదులు ఆహారంగా ఇస్తాడు.
 • 74. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు.
 • 75. గురువునకు ఉపదేశ సమయాలలో కాని, పురాణాదులు వినేటప్పుడు కాని పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలుగుతాయి.
 • 76. గురువుగారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి 3 జన్మల పాపాలు తొలగుతాయి.
 • 77. మంత్రోపదేశం చేసిన గురుని ఆజ్ఞ పాటించేవారికి ఏ పాపమూ అంటదు. పునర్జన్మ ఉండదు. (ఇది తప్పక పాటించవలసిన ముఖ్య పవిత్ర నియమము. దీనికి సాటి మరొకటి లేదు). పరాశర సంహితలో ఈ విషయాలున్నాయి.
 • 78. అష్టమి, పూర్ణిమ, చతుర్థశి కాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు.
 • 79. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు.
 • 80. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు.
 • 81. శవాన్ని స్మశానం దాకా మోసినా, శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము.
 • 82. గృహప్రవేశ కాలంలో గాని, ఏడాదిలోపు గాని ఆ ఇంట మణిద్వీప పరాయణం చేయడం మంచిది. ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది.
 • 83. భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి.
 • 84. సకల పురాణేతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు.
 • 85. పుట్టిన రోజునాడు దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. అటువంటివారు గ్రహణపు మొర్రితో మళ్ళీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు.
 • 86. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనెజిడ్డు పులమరాదు.
 • 87. శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినుటగానీ, ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేదము. ఇది ప్రయాణ మధ్యంలో ఉన్న వారికి వర్తించదు.
 • 88. చీటికి, మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కనపెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే.
 • 89. క్రూరుడు, దుష్టుడు కాని మగనితో తాళికట్టించుకొన్న భార్య, కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కానీ, అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది.
 • 90. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైధవ్యం కాని, అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి.
 • 91. దిగంబరంగా నిద్రపోరాదు.
 • 92. కలియుగంలో ఆలయంలో జంతువధ నిషేధం.
 • 93. విజయదశమి, శివరాత్రి దినాలలో మాంసాహారం, ఉల్లి పనికిరాదు.
 • 94. ఆచమనం చేసిన నీటిని దైవనివేదనలకు, అర్చనలకు వాడరాదు, కనుక వేరొక పాత్రలో శుద్ధ జలాన్ని ఈ కార్యాలకు వినియోగించుకోడానికి తెచ్చుకోవాలి.
 • 95. దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు. కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు.
 • 96. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినపుడు మూడు వత్తులు వేయాలి.
 • 97. కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోతే దోషం లేదు.
 • 98. కొబ్బరికాయను నీళ్ళతో కడిగి కొట్టడం చాలా తప్పు, కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్ళతో కడగరాదు.
 • 99. మాడిన అన్నం, అడుగంటిన పాయసం, కంపు వచ్చే నేయి ఇటువంటివి నైవేద్యానికి పనికిరావు.
 • 100. ఆలయ ప్రాంగణంలో అర్చకునిపై కేకలు వేయరాదు. అర్చకునిలో దోషం ఉంటే బయటకు పిలిచి మందలించాలి, లేదా మరింత దుష్టుడైన అర్చకునినైతే మూడు మాసాల జీతమిచ్చి ఆ పదవినుంచి తొలగించి వేయాలి.
సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి

3, ఏప్రిల్ 2020, శుక్రవారం

సద్గుణ సంపద - Sadhguna Sampada

మంచి గుణాలతో శోభిల్లే వ్యక్తి ‘సద్గుణ సంపన్నుడు’ అని పెద్దలంటారు. తన సుగుణాలతో శ్రీరామచంద్రుడు మనందరి మనసుల్లో స్థానం సంపాదించాడు. ఎందరికో మంచి మార్గం చూపించాడు. వాల్మీకి మహర్షి శ్రీరాముడి గుణ వర్ణన చేస్తూ - ఆయనకు పితృసేవ అనేది సహజ లక్షణమంటాడు. పట్టాభిషేకం భంగమైందని లక్ష్మణుడు ఆగ్రహిస్తే, శ్రీరాముడు అతణ్ని శాంతింపజేస్తాడు. తండ్రి ఏం చెప్పినా, ఏ విధంగా చెప్పినా ఆయన మాటను పాటించడమే తనయుడి కర్తవ్యమని హితవు పలుకుతాడు. భరతుడు చిత్రకూటానికి వెళ్లి అన్నను అయోధ్యకు రమ్మని బతిమిలాడినప్పుడు శ్రీరాముడు ఒప్పుకోడు. ‘నా మాట వినకపోతే నీ ముందే ప్రాయోపవేశం చేస్తా’నన్న భరతుడితో- ‘నాలాంటి కొడుకు, దశరథుడిలాంటి తండ్రి సత్యం పాటించకపోతే, ఇక లోకం ఎలా నడుస్తుంది?’ అనడం ఆయన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది.

రంగనాథ రామాయణంలో బుద్ధారెడ్డి - శ్రీరాముడి గుణాన్ని వర్ణిస్తూ, మనసులో రోషం దాచుకోని వాడంటాడు. రోషం ఉండటం మానవ సహజ లక్షణం. దీర్ఘకాల కోపం శాంతిని దూరం చేస్తుంది. శ్రీరాముడికి కోపం వచ్చిన సంఘటనలు రామాయణంలో చాలా తక్కువగా ఉంటాయి. ఆ కోపం తాటాకు మంటలా చప్పున చల్లారిపోతుంది తప్ప, దావానలమై ప్రజ్వరిల్లదు.

శ్రీరాముడు రావణాసురుడి పైకి యుద్ధానికి వెళుతూ, వానర సైన్యం సముద్రాన్ని దాటడానికి దారి ఇవ్వాలని సముద్రుణ్ని ప్రార్థిస్తాడు. అతడు పట్టించుకోకపోయేసరికి రాముడికి కోపం వచ్చి బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు. సముద్రుడు భయపడి దారి ఇచ్చిన మరుక్షణం, రాముడు బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు తప్ప ప్రయోగించడు. కోపాన్ని నిగ్రహించుకోవడమన్నది ఆయన నుంచి నేర్చుకోవాలి.

శ్రీరాముడిలోని మరో మంచి గుణం - స్థిరచిత్తం. ఏ సందర్భంలోనూ చాంచల్యం కనిపించదు. తండ్రి చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చడానికి వనవాసానికి సిద్ధమవుతాడు. పట్టాభిషేకం జరగనందుకు బాధపడడు. తండ్రి దుఃఖాన్ని చూసిన శ్రీరాముడు కైకేయిని కారణమడుగుతాడు. ఆమె ‘దశరథుడు చెప్పినదానికి నీకు ఇష్టమైనా కాకపోయినా, ఒప్పుకొంటేనే చెబుతా’ అంటుంది. సమాధానంగా శ్రీరాముడు- ‘నేను రెండు విధాలుగా మాట్లాడను, వనవాసానికి సిద్ధపడే వచ్చాను’ అని ప్రస్ఫుటం చేస్తాడు. రాముడిది ఒకటే మాట. చెప్పిందే ఆచరిస్తాడు.

శ్రీరాముడి స్థిరచిత్తానికి పరాకాష్ఠ, సీతా పరిత్యాగ ఘట్టం. ఆమెలో దోషం లేదని, ఆమెను పరిత్యజించడం వల్ల తనకు కష్టం, దుఃఖం కలుగుతాయని తెలిసి కూడా మహారాజుగా ప్రజాభిప్రాయానికి విలువిస్తాడు. అగ్నిపునీత సీతను అనివార్య పరిస్థితిలో అడవికి పంపిస్తాడు. శ్రీరాముడిలోని మరో ముఖ్య గుణం ఏకపత్నీవ్రతం. అందులో ఆయన జాతికి ఆదర్శంగా నిలిచాడు. సీతను అడవికి పంపించిన అనంతర పరిస్థితుల్లో, ఆమె బంగరు ప్రతిమను ఉంచి యజ్ఞాలు నిర్వహించడంలోనూ రాముడి మూర్తిమత్వం స్పష్టమవుతుంది.

పౌరులు దశరథుడితో- శ్రీరాముడు ఎవరితోనైనా మాట్లాడటానికి ముందు చిరునవ్వులు చిందిస్తాడంటారు. ఆంజనేయుడు అశోకవనంలో ఉన్న సీతతో రాముడి గురించి చెబుతూ ఆయన తన నడివడికను తానే రక్షించుకునే వాడంటాడు. సీత ఆంజనేయుడికి శ్రీరాముడి గుణం గురించి వివరిస్తూ ఆయన తన జీవితానికి అపకారం కలుగుతున్నప్పుడూ ఎవరితోనూ అప్రియంగా మాట్లాడడని అంటుంది.

విపత్కర పరిస్థితుల్లోనూ ఓర్పు కలిగి ఉండటం ఉత్తమ లక్షణం. దశరథుడికి తన పుత్రులందరి మీదా ప్రేమ ఉన్నా, శ్రీరాముడిపై మరింత ప్రత్యేకానురాగం ఉండటానికి కారణం- ఆయన గుణ సంపద. సత్యసంధుడు, ధర్మాత్ముడు అయిన శ్రీరామచంద్రమూర్తి తన సద్గుణాలతో మనందరికీ ఆప్తుడయ్యాడు. ఆదర్శప్రాయుడయ్యాడు!

రచన: - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

28, మార్చి 2020, శనివారం

శ్రీరామ సద్గుణ సంపద - Sree Raama Sadhguna Sampadha

శ్రీరాముడిలోని సద్గుణ సంపద - Sree Raama Sadhguna Sampadha
సద్గుణ సంపద
మంచి గుణాలతో శోభిల్లే వ్యక్తి ‘సద్గుణ సంపన్నుడు’ అని పెద్దలంటారు. తన సుగుణాలతో శ్రీరామచంద్రుడు మనందరి మనసుల్లో స్థానం సంపాదించాడు. ఎందరికో మంచి మార్గం చూపించాడు. వాల్మీకి మహర్షి శ్రీరాముడి గుణ వర్ణన చేస్తూ- ఆయనకు పితృసేవ అనేది సహజ లక్షణమంటాడు. పట్టాభిషేకం భంగమైందని లక్ష్మణుడు ఆగ్రహిస్తే, శ్రీరాముడు అతణ్ని శాంతింపజేస్తాడు. తండ్రి ఏం చెప్పినా, ఏ విధంగా చెప్పినా ఆయన మాటను పాటించడమే తనయుడి కర్తవ్యమని హితవు పలుకుతాడు. భరతుడు చిత్రకూటానికి వెళ్లి అన్నను అయోధ్యకు రమ్మని బతిమిలాడినప్పుడు శ్రీరాముడు ఒప్పుకోడు. ‘నా మాట వినకపోతే నీ ముందే ప్రాయోపవేశం చేస్తా’నన్న భరతుడితో- ‘నాలాంటి కొడుకు, దశరథుడిలాంటి తండ్రి సత్యం పాటించకపోతే, ఇక లోకం ఎలా నడుస్తుంది?’ అనడం ఆయన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది.

రంగనాథ రామాయణంలో బుద్ధారెడ్డి - శ్రీరాముడి గుణాన్ని వర్ణిస్తూ, మనసులో రోషం దాచుకోని వాడంటాడు. రోషం ఉండటం మానవ సహజ లక్షణం. దీర్ఘకాల కోపం శాంతిని దూరం చేస్తుంది. శ్రీరాముడికి కోపం వచ్చిన సంఘటనలు రామాయణంలో చాలా తక్కువగా ఉంటాయి. ఆ కోపం తాటాకు మంటలా చప్పున చల్లారిపోతుంది తప్ప, దావానలమై ప్రజ్వరిల్లదు.

శ్రీరాముడు రావణాసురుడి పైకి యుద్ధానికి వెళుతూ, వానర సైన్యం సముద్రాన్ని దాటడానికి దారి ఇవ్వాలని సముద్రుణ్ని ప్రార్థిస్తాడు. అతడు పట్టించుకోకపోయేసరికి రాముడికి కోపం వచ్చి బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు. సముద్రుడు భయపడి దారి ఇచ్చిన మరుక్షణం, రాముడు బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు తప్ప ప్రయోగించడు. కోపాన్ని నిగ్రహించుకోవడమన్నది ఆయన నుంచి నేర్చుకోవాలి.

శ్రీరాముడిలోని మరో మంచి గుణం - స్థిరచిత్తం. ఏ సందర్భంలోనూ చాంచల్యం కనిపించదు. తండ్రి చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చడానికి వనవాసానికి సిద్ధమవుతాడు. పట్టాభిషేకం జరగనందుకు బాధపడడు. తండ్రి దుఃఖాన్ని చూసిన శ్రీరాముడు కైకేయిని కారణమడుగుతాడు. ఆమె ‘దశరథుడు చెప్పినదానికి నీకు ఇష్టమైనా కాకపోయినా, ఒప్పుకొంటేనే చెబుతా’ అంటుంది. సమాధానంగా శ్రీరాముడు - ‘నేను రెండు విధాలుగా మాట్లాడను, వనవాసానికి సిద్ధపడే వచ్చాను’ అని ప్రస్ఫుటం చేస్తాడు. రాముడిది ఒకటే మాట. చెప్పిందే ఆచరిస్తాడు.

శ్రీరాముడి స్థిరచిత్తానికి పరాకాష్ఠ, సీతా పరిత్యాగ ఘట్టం. ఆమెలో దోషం లేదని, ఆమెను పరిత్యజించడం వల్ల తనకు కష్టం, దుఃఖం కలుగుతాయని తెలిసి కూడా మహారాజుగా ప్రజాభిప్రాయానికి విలువిస్తాడు. అగ్నిపునీత సీతను అనివార్య పరిస్థితిలో అడవికి పంపిస్తాడు.

శ్రీరాముడిలోని మరో ముఖ్య గుణం ఏకపత్నీవ్రతం. అందులో ఆయన జాతికి ఆదర్శంగా నిలిచాడు. సీతను అడవికి పంపించిన అనంతర పరిస్థితుల్లో, ఆమె బంగరు ప్రతిమను ఉంచి యజ్ఞాలు నిర్వహించడంలోనూ రాముడి మూర్తిమత్వం స్పష్టమవుతుంది.

పౌరులు దశరథుడితో- శ్రీరాముడు ఎవరితోనైనా మాట్లాడటానికి ముందు చిరునవ్వులు చిందిస్తాడంటారు. ఆంజనేయుడు అశోకవనంలో ఉన్న సీతతో రాముడి గురించి చెబుతూ, ఆయన తన నడివడికను తానే రక్షించుకునే వాడంటాడు. సీత ఆంజనేయుడికి శ్రీరాముడి గుణం గురించి వివరిస్తూ, ఆయన తన జీవితానికి అపకారం కలుగుతున్నప్పుడూ ఎవరితోనూ అప్రియంగా మాట్లాడడని అంటుంది.

విపత్కర పరిస్థితుల్లోనూ ఓర్పు కలిగి ఉండటం ఉత్తమ లక్షణం. దశరథుడికి తన పుత్రులందరి మీదా ప్రేమ ఉన్నా, శ్రీరాముడిపై మరింత ప్రత్యేకానురాగం ఉండటానికి కారణం ఆయన గుణ సంపద. సత్యసంధుడు, ధర్మాత్ముడు అయిన శ్రీరామచంద్రమూర్తి తన సద్గుణాలతో మనందరికీ ఆప్తుడయ్యాడు. ఆదర్శప్రాయుడయ్యాడు!

రచన:  ప్రతాప వెంకట సుబ్బారాయుడు

19, మార్చి 2020, గురువారం

సదాచారాలు - Sadaacharamulu

సదాచారాలు - Sadaacharamulu
సదాచారాలు ఏవేవి ?
 • 1. దేవతలను, గోవులను, బ్రాహ్మణులను, సిద్ధులను, ఆచార్యులను పూజించాలి. 
 • 2. చిరగని వస్త్రద్వయాన్ని, విష్ణుక్రాంతం మొదలగునవి ఓషదుల్ని, గారుడం మొదలగు రత్నాలను ధరించాలి.
 • 3. సంధ్యావందనం - అగ్నిహోత్రం ఆచరించడం మంచిది.
 • 4. అలంకరించబడిన వేషం గలవాడై, ఎల్లప్పుడూ ఇతరులకు ఆహ్లాదకరమైన రూపంతో కనిపించాలి. (ఈ వేషాలంకరణలో సమస్త మంగళ ద్రవ్యాలూ చేరతాయి).
 • 5. పర ధనాదులను అపహరించరాదు.
 • 6. స్వల్పంగానైనా అప్రియం పలకరాదు. 
 • 7. ప్రియమైనా అసత్యం కూడదు.
 • 8. ఇతరుల దోషములెన్నరాదు.
 • 9. పరస్త్రీని - విరోధాన్ని కోరుకోరాదు.
 • 10. దుష్టమైన వాహనాలు ఎక్కరాదు.
 • 11. జలం చేత ఆవరించబడిన ప్రదేశంలో నీడ వున్నా ఆశ్రయించకూడదు.
 • 12. శత్రువు, పాపి, ఉన్మాది, అందరితోనూ జగడాలాడేవాడు, కీటకంలాగా బాధించేవాడు, నీచుడు, అసత్యప్రలాపి, నిత్యచోరజారకార్యకలాపి, మూర్ఖుడు, పరస్త్రీ వాంఛగలవాడు, జారిణి, సంకరజాతి స్త్రీలతో సంభాషించ కూడదు.
 • 13. దారిలో ఒంటరిగా పోరాదు.
 • 14. జలప్రవాహం వేగంగా వున్నప్పుడు మునక పనికిరాదు.
 • 15. చెట్టు చివరికంటా ఎక్కరాదు.
 • 16. దంతాలు కొరకడం, ముక్కునలపడం, గట్టిగా అపానవాయువు విడవడం, గోళ్లుకొరకడం, గడ్డి త్రుంచడం, మట్టిగట్టచిదుపడం....ఇవన్నీ నిషిద్ధాలు.
 • 17. నగ్నంగా ఉన్న స్త్రీని, ఉదయాస్తమయాలలో సూర్యుని చూడరాదు.
 • 18. శవాన్ని ఏవగించుకోరాదు.
 • 19. రాత్రులలో రచ్చచెట్టుకు - దుష్టస్త్రీలకు దూరంగా ఉండాలి.
 • 20. బ్రాహ్మణులు, పూజ్యులైనవారు, దేవతలు, దేవతావిగ్రహాలు వీటి నీడను సైతం దాటరాదు.
 • 21. ఒంటరిగా శూన్యారణ్యాలకు వెళ్లరాదు.
 • 22. జనశూన్యాలైన గృహాలలో నివశించకూడదు.
 • 23. కేశములు, ఎముకలు, ముండ్లు అపవిత్రములు, బూడిద, ఊక, స్నానంచే తడిసిన నేల..వీటికి దూరంగా ఉండాలి.
 • 24. అయోగ్యుల్ని ఆశ్రయించకూడదు.
 • 25. కుటిలుడైనవాడిని ఏదీ కోరకూడదు.
 • 26. కృరమృగాలు - సర్పములు మొదలగు వాటిని చూస్తే దూరంగా జరగాలి.
 • 27. వాటికి చేరువుగా కొద్దికాలమైనా నిలబడరాదు.
 • 28. అతిగా మేల్కోవడం అతిగా నిద్రపోవడం, అతిగా వ్యాయామం చేయడం నిషిద్ధం.
 • 29. కోరలు కొమ్మలుగల జంతువులకు, మంచుకు, మిక్కిలి బాధించే గ్రీష్మానికి దూరంగా ఉండాలి.
 • 30. దిసమెలతోస్నానం చేయడం గాని, నిద్రించడంగాని, ఆచమనం చేయడం గాని పనికిరాదు.
 • 31. అట్లే జుట్టుముడివేయక ఆచమించకూడదు.
 • 32. దేవతార్చనాదులూ పనికిరావు.
బ్రాహ్మణుని కాళ్లుకడిగేటపుడు, దేవతార్చనలోను, హోమాలు చేసేటపుడు, ఆచమనం చేసేటపుడు ఏకవస్త్రం పనికిరాదు. అంగవస్త్రం (భుజం మీద ఇంకొక వస్త్రం) ధరించి తీరాలి.
 • 33. మంచి శీలవంతులనే స్నేహం చేయడానికి ఎన్నుకోవాలి. 
 • 34. దుర్నడతగలవారికి దూరం జరగాలి. 
 • 35. అరక్షణకాలమే అయినా సాధుపుంగవుల సాంగత్య మహిమ నెన్నతరమా?
 • 36. ఉత్తములతో గానీ - అథములతో గానీ విరోధమెన్నడూ పనికిరాదు సగరచక్రవర్తీ! హాని అల్పంగా ఉంటే సహించే నేర్పు కలిగిఉండాలి.  ఓర్పుముఖ్యం. 
 • 37. పెనుహాని అయినపుడు అలక్ష్యం పనికిరాదు. 
 • 38. ప్రాజ్ఞుడు కయ్యానికి కాలుదువ్వరాదు. 
 • 39. శుష్కకలహం పనికిరాదు. 
 • 40. వివాహమైనా వివాదమైనా సమఉజ్జీలతోనే సాగాలి. 
 • 41. వైరం చేత ధనాన్ని ఎన్నడూ ఆర్జించవద్దు. నిలబడి ఆచమనం చేయవద్దు.
 • 42. ఒక కాలితో ఇంకోకాలు తొక్కరాదు. 
 • 43. స్నానంచేసిన వస్త్రంతోగాని చేత్తోగాని అవయవాలను తుడుచుకోరాదు. 
 • 44. కేశాలను దులుపుకోరాదు. పూజ్యులైన వారివైపు కాళ్లు చాచరాదు.
 • 45. గురువుగారు ఎదుట ఉండగా ఆసనం అధిష్ఠించరాదు. తప్పని పరిస్థితిలో వినయంగా కూర్చోవాలి. దేవాలయంలో అపసవ్యప్రదక్షిణ పనికిరాదు. పూజ్యులకెదురుగా, సూర్యచంద్రాగ్నుల కెదురుగా ఉమ్మివేయుట తగదు.
 • 46. శ్లేషం, మూత్రం, రక్తం, పురీషాలను ఎప్పుడూ దాటకూడదు. 
 • 47. అగ్నిహోత్ర సమయంలో గాని,పూజాసమయంలోగాని, మహాజన మధ్యంలోగాని, హోమశాలలోగాని కఫం, శ్లేషం విడువరాదు. 
 • 48. (చీదరాదని అర్థం!) స్త్రీలను అమ్మడం గాని, అవమానించడం గాని, ఈర్ష్యపడడం గాని, ధిక్కరించడం గాని నిషేదము. 
 • 49. రత్నాదిపూజ్య వస్తువులకు నమస్కరించకుండా ఇంటినుంచి బయలుదేరరాదు. 
 • 50. విద్వాంసుల సేవ, సకాలంలో హోమక్రియ సజ్జనలక్షణాలు దీనోద్ధరణ కూడ.
ఓ రాజా! దేవతలను, ఋషులను పూజించేవాడు - పితృదేవతలనుద్దేశించి తర్పణాలు - పిండప్రదానాలు చేసేవాడు - అతిథులను సత్కరించేవాడు ఉత్తమలోకాలకు వెళ్తారు. హితకరమైన పలుకులను ఆహ్లాదంగా చెప్పేవాడు, అక్షయమైనట్టి లోకాలను చేరతాడు.
 • 51. బుద్ధిమంతులు, క్షమావంతులు, వినయశిలురు, ఆస్తికులు సర్వోత్తమ లోకాలను పొందగలరు. అశౌచాది వేళలలోను, సూర్యగ్రహణాదులలోను, మేఘగర్జన సమయంలోను, పూర్నిమనాడు వేదాధ్యయనం పనికిరాదు. 
 • 52. కోపగ్రస్తుడ్ని శాంతపరచడం - భయపడ్డవాడిని ఓదార్చడం - ఎవరిమీదా ద్వేషం లేకుండా ఉండడం - అందరికీ బంధువుగా మెలగడం అనేవి సాధుకృత్యాలు. 
 • 53. ఇటువంటి సాధువుకు స్వర్గసౌఖ్యం సైతం అల్పమైన ఫలితంగానే తోచగలదు.
ఇంకా సదాచారాలు (జాగ్రత్తల నిమిత్తం చెప్పబడినవి) కొన్ని ఉన్నాయి. వాటిని ఆచరించడం సత్పురుష లక్షణం అనిపించుకుంటుంది.
 • 54. ఎండా వానల్లో గొడుగుధరించి, అడవుల్లో - రాత్రుల్లో దండము ధరించి, దేహరక్షణ నిమిత్తం పాదరక్షలు ధరించి సంచరించాలి. 
 • 55. పైకి చూస్తూ, అడ్డముగా చూస్తూ, దూరాన్ని పరికిస్తూ నడకసాగించకూడదు. 
 • 56. కనుచూపుమేర ఏవేవి స్పష్టంగా కనిపిస్తుంటాయో అవే చూసుకుంటూ నడవాలి.
 • 57. నియత్రితమైన మనస్సుతో, దోషాలు కలిగించేవాటన్నిటినీ దూరం జరిపి సంచరించేవారికి ఎటువంటి హాని కలుగదు. 
సదాచారవంతునికి ముక్తి కరతలామలకమే అనవచ్చు! కామక్రోధలోభాది అరిషడ్వర్గాలకు లోను కాకుండా సదాచారులై సంచరించేవారివల్లనే ఈ భూమి ఇంతకాలం నిశ్చింతగా ఉంది. (లేకున్నచో అల్లకల్లోలం తథ్యమని భావం)

ఇతరులకు దుఃఖకారణమవుతుందనుకుంటే, అది సత్యవచనం అయినప్పటికీ చెప్పకూడదు. మౌనమే శ్రేయోదాయకం. సాధారణస్థితులలో సత్యమే పరమప్రమాణం. ప్రియమైనదే అయినప్పటికీ హితకరం కాదని తెలిస్తే అప్పుడు కూడా మౌనంగా ఊరకుండడం ఉత్తమం. ప్రాణులకేది హితకరమో దాన్ని త్రికరణశుద్ధిగా ఆచరించేవాడే బుద్ధిమంతుడు.

సంకలనం: భానుమతి అక్కిశెట్టి

16, మార్చి 2020, సోమవారం

విగ్రహారాధన - Vigraha Aaradhana

విగ్రహారాధన - Vigraha Aaradhana
విగ్రహారాధన..!!
భగవంతుడు అన్నిటా వున్నానని చెప్పినప్పుడు హిందువులు విగ్రహారాధన ఎందుకు చేస్తారు..?

ఒకసారి వివేకానందుడు ఇప్పుడున్న రాజస్తాన్ లో వున్న అల్వార్ సంస్థానాధీశుని దగ్గరకు వెళ్ళాడు. విగ్రహారాధనని వెక్కిరించడానికి ఆరాజు వివేకానందునితో నాకు విగ్రహారాధన పట్ల విశ్వాసం లేదు. రాయినీ, రప్పనీ, కర్రనీ, లోహాన్నీ ఎవరయినా ఎలా ఆరాధిస్తారు? ప్రజలు అపోహలో వున్నారు.. కేవలం సమయం వృధా చేసికుంటున్నారు అన్నాడు.

స్వామీజీ నవ్వుతూ స్పందించారు... రాజు సహాయకుడిని అక్కడ గోడకి వ్రేలాడుతూ వున్న రాజు చిత్ర పటాన్ని క్రిందకు దించమన్నారు. అయోమయంలో పడిన ఆ సహాయకుడు స్వామీజీ చెప్పినట్లే చేసారు. అప్పుడు స్వామీజీ ఆ పటం పై వుమ్మివేయమని రాజు సహాయకుడిని ఆదేశించారు.

నిర్ఘాంత పోయిన సహాయకుడు రాజు వైపూ.. స్వామీజీ వైపూ చూస్తూ ఉండిపోయాడు. స్వామీజీ మళ్ళీ, మళ్ళీ ఆదేశించారు. ప్రతీ సారీ మరింత తీవ్రంగా ఆదేశించ సాగారు, రాజు ఆగ్రహోద్రకుడవుతున్నాడు, సహాయకుడు వణికి పోతున్నాడు.

చివరికి సహాయకుడు నేను ఈ పటంపై ఎలా ఉమ్మగలను?
పటంలో వున్న చిత్రంలో మా రాజు వున్నారు అంటూ అరిచాడు. అప్పుడు స్వామీజీ ‘రాజు నీ ఎదురుగా వ్యక్తిగతంగా కూర్చుని వున్నారు. ఆ పటంలో వున్నది ఒక కాగితం మాత్రమె, అది మాట్లాడలేదు, వినలేదు, కదలలేదు. కానీ నువ్వు ఆ పటం పై ఉమ్మి వేయనంటున్నావు, ఎందుకంటే నువ్వు ఆ పటంలో నీరాజుని చూసుకుంటున్నావు కాబట్టి ఉమ్మి వేయనంటున్నావు. ఆ పటం మీద ఉమ్మితే నీ రాజు మీద ఉమ్మినట్లని నువ్వు అనుకుంటున్నావు’ అన్నారు.

స్వామీజీ ని చూసిన రాజు..స్వామీజీ ముందర సాష్టాంగ పడ్డాడు..స్వామీ చెప్పదలుచుకున్నది తనకి పూర్తిగా అర్ధమయిందని ఆ రాజు చెప్పాడు.

ఇదే విగ్రహారాధన యొక్క సారము, భగవంతుడు అన్నిచోట్లా వున్నాడు. 
కానీ మనం ఆయనని:- 
 • 🟔 పూజించాలనుకుంటాము, 
 • 🟔 కోరికలను కోరాలనుకుంటాము, 
 • 🟔 నివేదన చేద్దామను కుంటాము, 
 • 🟔 కధలు చెప్పాలని అనుకుంటాము, 
 • 🟔 స్నానం చేయించాలని అనుకుంటాము, 
 • 🟔 ఆడుకోవాలనుకుంటాము, 
మనం మన జీవితాలతో ఏమి చేస్తామో అన్నీ భగవంతునితో చేయించాలని అనుకుంటాము. విగ్రహం రూపంలో వున్న భగవంతుని ఆకారాన్ని మనం మన సహచరుడు గానూ, మార్గ దర్శకునిగానూ, స్నేహితుని గానూ, రక్షకునిగానూ,  ప్రసాదించే వానిగానూ,  సాటి మనిషి గానూ భావించుకుంటూ ఉంటాము.

విగ్రహము మనం చూడగలిగే యదార్ధ  ప్రతినిధి. నేను ఆ విగ్రహపు కన్నులలోనికి చూస్తున్నప్పుడు,  నాకది రాయిలాగానో, లోహం లాగానో కనిపించదు. మరొక జత కన్నులు  ప్రేమతో నన్ను  నవ్వుతూ  చూస్తున్నట్లు అనిపిస్తుంది.

రచన: అక్కిశెట్టి 

26, ఫిబ్రవరి 2020, బుధవారం

నిత్య జీవితంలో ఆచరించవలసిన కొన్ని ముఖ్య మానవ ధర్మాలు - Nitya jīvitanlō ācarin̄cavalasina konni mukhya mānava dharmālu

నిత్య జీవితంలో ఆచరించవలసిన కొన్ని ముఖ్య మానవ ధర్మాలు - Nitya jīvitanlō ācarin̄cavalasina konni mukhya mānava dharmālu
నిత్య జీవితంలో తెలుసుకోదగ్గ, పాటించవలసిన ముఖ్య మానవ ధర్మాలు

 • 1. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం.
 • 2. నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు.
 • 3. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు.
 • 4. దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం, పొగత్రాగటం రెండూ నిషిద్దాలే.
 • 5. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసిఆకులు కోయరాదు.
 • 6. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లనుండి త్రుంచరాదు.
 • 7. గురువుద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి.
 • 8. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు. ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు.
 • 9. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషంఇవ్వక, వారికి ఋణపడేవారు నూరుజన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు.
 • 10. శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు.
 • 11. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు.
 • 12. నిద్రనుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి.
 • 13. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు.
 • 14. హారతి ఇచ్చాక దేవునిపై నీరు చల్లాలి. హారతి ఇచ్చే పాత్రపై కాదు.
 • 15. తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని కడుక్కోవాలి తప్ప, అరచేతిని తలపై రాసుకొనరాదు.
 • 16. స్నానం చేశాక శరీరం తుడుచుకొని తడి-పొడి తువ్వాలు కట్టుకొని పూజ చేయరాదు. పూజా మందిరంలో ప్రవేశించరాదు. పూర్తిగా ఆ తుండును తడిపి నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి. లేదా వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి.
 • 17. ఉపవాసం ఉన్నపుడు, జాగరణ చేసినపుడు పరులదోషాలు తలుచుకోరాదు.
 • 18. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి.
 • 19. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయి వేయాలి.
 • 20. అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు, దెప్పి పొడవరాదు.
 • 21. నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు, అభాండాలు వేయరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి.
 • 22. ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వనివాడు వందజన్మలు దరిద్రుడై పుడతాడు, వాగ్బంగం చాలా దోషం.
 • 23. అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలు, మజ్జిగ మున్నగునవి ఉన్నపాత్రలు పెట్టరాదు. మనం తినేటప్పుడు ఎంగిలి ఆ పాత్రలలో పడితే ఆ పదార్థాన్ని మరొకరికి వడ్డిస్తే, వాడికి "యముడు" మల ముత్రాదులు ఆహారంగా ఇస్తాడు.
 • 24. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు.
 • 25. గురువునకు ఉపదేశ సమయాలలో కాని, పురాణాదులు వినేటప్పుడు కాని పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలుగుతాయి.
 • 26. గురువుగారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి 3 జన్మల పాపాలు తొలగుతాయి.
 • 27. మంత్రోపదేశం చేసిన గురుని ఆజ్ఞ పాటించేవారికి ఏ పాపమూ అంటదు. పునర్జన్మ ఉండదు. (ఇది తప్పక పాటించవలసిన ముఖ్య పవిత్ర నియమము. దీనికి సాటి మరొకటి లేదు). పరాశర సంహితలో ఈ విషయాలున్నాయి.
 • 28. అష్టమి, పూర్ణిమ, చతుర్థశి కాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు.
 • 29. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు.
 • 30. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు.
 • 31. శవాన్ని స్మశానం దాకా మోసినా, శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము.
 • 32. గృహప్రవేశ కాలంలో గాని, ఏడాదిలోపు గాని ఆ ఇంట మణిద్వీప పరాయణం చేయడం మంచిది. ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది.
 • 33. భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి.
 • 34. సకల పురాణేతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు.
 • 35. పుట్టిన రోజునాడు దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. అటువంటివారు గ్రహణపు మొర్రితో మళ్ళీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు.
 • 36. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనెజిడ్డు పులమరాదు.
 • 37. శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినుటగానీ, ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేదము. ఇది ప్రయాణ మధ్యంలో ఉన్న వారికి వర్తించదు.
 • 38. చీటికి, మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కనపెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే.
 • 39. క్రూరుడు, దుష్టుడు కాని మగనితో తాళికట్టించుకొన్న భార్య, కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కానీ, అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది.
 • 40. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైధవ్యం కాని, అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి.
 • 41. దిగంబరంగా నిద్రపోరాదు.
 • 42. కలియుగంలో ఆలయంలో జంతువధ నిషేధం.
 • 43. విజయదశమి, శివరాత్రి దినాలలో మాంసాహారం, ఉల్లి పనికిరాదు.
 • 44. ఆచమనం చేసిన నీటిని దైవనివేదనలకు, అర్చనలకు వాడరాదు, కనుక వేరొక పాత్రలో శుద్ధ జలాన్ని ఈ కార్యాలకు వినియోగించుకోడానికి తెచ్చుకోవాలి.
 • 45. దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు. కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు.
 • 46. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినపుడు మూడు వత్తులు వేయాలి.
 • 47. కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోతే దోషం లేదు.
 • 48. కొబ్బరికాయను నీళ్ళతో కడిగి కొట్టడం చాలా తప్పు, కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్ళతో కడగరాదు.
 • 49. మాడిన అన్నం, అడుగంటిన పాయసం, కంపు వచ్చే నేయి ఇటువంటివి నైవేద్యానికి పనికిరావు.
 • 50. ఆలయ ప్రాంగణంలో అర్చకునిపై కేకలు వేయరాదు. అర్చకునిలో దోషం ఉంటే బయటకు పిలిచి మందలించాలి లేదా మరింత దుష్టుడైన అర్చకునినైతే మూడు మాసాల జీతమిచ్చి ఆ పదవినుంచి తొలగించి వేయాలి.

రచన: రేణుకా పరశురామ్