నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

15, అక్టోబర్ 2020, గురువారం

మానవ ధర్మాలు - Manava Dharmalu

మానవ ధర్మాలు
సనాతనధర్మంలో ధర్మమే దైవం. దైవం, ధర్మంఆచరించే వారిని ఎల్లవేళల కాపాడుతూనే వుంటుంది. శ్రీరాముడికి అంతమంది ఋషులు,దేవతలు,వానరాలు,పక్షులు ఎందుకు సహాయంచేసాయి, శ్రీకృష్ణుడు పాండవులవైపు ఎందుకునిలిచాడు అంటే వారివైపు ధర్మంవుంది అనిచెప్పాలి.అందుకే మనపెద్దలు "ధర్మో రక్షతి రక్షితః" అన్నారు. కలియుగంలో ఏదిధర్మం,ఎవరుచెప్పిందిధర్మం, ఇలాంటిప్రశ్నలు మనకు తరచూవస్తాయి. వేదంతెలిపినవి కిందవివరించబడినవి
ధర్మాలు

కాత్యాయనుని వచనము
రోచనం చందనం హేమం మృదంగం దర్పణం మణిమ్|
గురుమగ్నిం రవిం పశ్యేన్నమస్యేత్ ప్రాతరేవ హి||
  • ➣ గోరోజనము,చందనము, సువర్ణము, శంఖము, మృదంగము, దర్పణము, మణులు మొదలగు వస్తువులను దర్శించవలెను. ఆనంతరము గురువునకు,అగ్నికి, సూర్యనారాయణుకు నమస్కారింపవలెను. తదుపరి భగవత్స్వరూపులగు తల్లికి,తండ్రికి,గురుజనులకు ఇంటిలోగల పెద్దలందరికి వందనము చేయవలెను. 
  • ➣ రోజూ ఉదయం స్నానానంతరం తల్లితండ్రుల కాళ్ళకి తలతాకేట్టుగా సాష్టాంగప్రణామం చేస్తే ముమ్మారు భూప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది.
  • ➣ రోజూ ఉదయం స్నానానంతరం తల్లి కాళ్ళకి తలతాకేట్టుగా సాష్టాంగప్రణామం చేయాలి అలాచేస్తే కాశీలో ఒక్కరోజువున్న ఫలితం వస్తుంది.
  • ➣ ఇంట్లో నుంచి బయటకు పనిమీద బయలుదేరే ముందు విఘ్నేశ్వరుడుని తలచుకుని కుడికాలు ముందు బయటపెట్టాలి.

సంకలనం: కోటేశ్వర్
« PREV
NEXT »