శ్రీ దత్త తత్త్యం | Sri Dattatreya Thatvamu |
శ్రీ దత్త తత్త్వము - Sri Datta Thatvamu
ఎవరైతే శ్రీ దత్తాత్రేయుని భక్తితో స్మరిస్తారో వారి సమస్త పాపాలూ నశిస్తాయని దత్త హృదయం చెబుతోంది. దత్తాత్రేయుడు కేవలం స్మరణ మాత్రం చేత సంతృప్తి చెందే దయామయుడు. దత్తాత్రేయిని రూపం మనకు అంతర్లీనంగా ఎన్నో విషయాలను బోధిస్తోంది. దత్తాత్రేయుని రూపం మూడు శిరస్సులతో, ఆరు భుజములతో, ఆయుధములతో, నాలుగు కుక్కలతో ఆవుతో ఉన్నట్టు మనకు కనబడుతుంది.
ఆకార విశిష్టత
మూడు శిరస్సులు త్రిమూర్తులకు చిహ్నాలు. నాలుగు కుక్కలూ నాలుగు వేదాలకు సంకేతాలు. ఆవు సాక్షాత్తూ కామధేనువే మనసును మూయ నుండీ జయిస్తే ఆ మనసే కామధేనువువంటిదని మనకు చెబుతున్నారు దత్తాత్రేయులు. ధర్మార్గకామములేని త్రిశూలానికి చిహ్నం. ఇలా చూస్తే ఆయన త్రిమూర్తి స్వరూపుడని మనకు తెలుస్తుంది. మనను మీద అదువు సాధించాలని మనకు ఉద్భోదిస్తున్నట్టనిపిస్తుంది. దత్తాత్రేయుడు ప్రకృతిలో మనకు కనపడే మానవాళికి ఉపయోగపడే ఎనిమిది మంది గురువుల వలె జీవించాలని ఉద్భోధించారు. ఆ ఎనిమిదిమంది గురువులు వీరే...
- పృధ్వి: క్షమా గుణానికి సంకేతం పృధ్వి. పృధ్వి నుండీ పరోపకార గుణాన్ని ఆయన అభ్యసించారు.
- వాయువు: వాయువు ప్రాజాధారము. సాధారణంగా జీవకోటిని అనుగ్రహిస్తూ సాధు రూపంలో ఉండే వాయువు ఆగ్రహిస్తే ప్రళయాన్ని సృష్టిస్తుంది. ఈ తత్వం వాయువు నుండీ గ్రహించారు దత్తాత్రేయులు.
- ఆకాశము: వాయువు ప్రేరణతో నేల మీద ఉన్న జలం మేఘం రూవంలో నింగికి ఎగసినప్పుటికీ ఆ మేఘాలు ఆకాశాన్నంటలేవు. అదే విధమైన బంధము ఆత్మకు, దేహానికి ఉంటుందని, ఆత్మసూచించిన ప్రకారమే దేహం నడుచుకోవాలనో అంశాన్ని ఆకాశం నుండి గ్రహించారు దత్తాత్రేయులు.
- జలము: నిర్మలమైనది జలము. ఎంత ఉధృతప్రవాహం వచ్చినప్పుటికీ కొంత సేవు తర్వాత తనంతల తాను నిర్మలత్వాన్ని పొందుతుంది. ఆత్మ కూడా ఇదే విధంగా వ్యవహరించాలని అనే అంశాన్ని జలం నుండీ తెలుసుకున్నారు దత్తాత్రేయులు.
- అగ్ని: అగ్ని కూడా జలము వలె నిర్మలమైనదే అయినప్పటికీ రెండిటి గుణగణాలూ వేరు. అగ్ని మాలినములను దహించి వేసినా ఆ మలినమేదీ అగ్నికి అంటదు. అదే విధంగా ఇహలోక విషయాలలో అగ్నివలె ప్రవర్తించాలని శిష్యులకు బోధించేవారు దత్తాత్రేయులు.
- చంద్రుడు: భూమి తిరిగే విధానాన్ని అనుసరించి చంద్రుని కళలు మారినా, సహజ ఆకృతి మ్యాత్రం మారని స్థిరరూపి చంద్రుడు. దుష్టుల మధ్య సంచరిస్తున్నా, వారి నుండీ ఆ గుణాలేవీ మనసుకు పట్టించుకోరాదని బోధించారు దత్తాత్రేయులు.
- స్యూర్యుడు: తన వేడితో జలాన్ని ఆకర్షించి, మేఘరూపంలోకి తెచ్చి, వర్షింపచేస్తాడు. అదే విధంగా ప్రతిఒక్కరూ పరోపకారం కోసం జీవించాలని ఉద్పోధించేవారు దత్తాశత్రేయులు.
- సముద్రము: సమస్త నదీనదాలను తనలో కలువుకున్నప్పటికీ సముద్రము ఆ నదీనదాల ప్రభావము వలన పొంగిపోవడం ఉండదు. మానవులు కూడా ఐశ్వర్యం విషయంలో సముద్రము వలె ప్రవర్తించాలని, ఎంత ఐశ్వర్యము వచ్చినా పొంగిపోరాదనేది దత్తాత్రేయుని ఉద్చోధలలో ప్రధానమైనది. దత్తాత్రేయుడు కేవలం ప్రకృతి నుండే మనకు పాఠాలు నేర్చలేదు. వివిధ జీవజాలాదుల నుండీ కూడా మనకు కొన్ని పాఠాలు నేర్పారు.
శ్రీ దత్త తత్త్వం:
శ్రీ దత్తాత్రేయుడు ప్రకృతిని గురువుగా భావిస్తూ ప్రకృతిలోని పంచభూతాల నుండీ, మరికొన్నింటి నుండీ నేర్చుకున్న పాఠాలను గత వ్యాసంలో మీరు చదివారు. దత్తాత్రేయుడు కేవలం ప్రకృతి నుండే కాక జీవజాలాదులను గురువులుగా భావిస్తూ, ఆ జీవజాలాదుల నుండీ కూడా పాఠాలు చదవండి.
- కొండ చిలువ: కొండ చిలున ఆహారం కోసం ప్రొకులాడదు. తనకు అప్రయత్నంగా లభించిన ఆహారాన్ని మ్యూతమే స్వీకరించి కడువు నింవుకుంటుంది. ఆహారం కోసం తపించకుండా, దొరికిన ఆహారాన్ని స్వీకరిస్తుంది. యోగి కూడా అదేవిధంగా ఆహారం కోసం తపించకుండా దొరికిన దానితో సరిపెట్టుకోవాలనే పాఠం కొండచిలువ నుండీ నేర్చుకున్నారు దత్తాశతేయులు.
- తుమ్మెద: తుమ్మెద మకరందము కోసం వువ్వులను వెతుకుతూ తిరుగుతుంటుంది. అదే విధంగా యోగ మార్గంలో నడిచేవారు సరైన గురువు కోసం అన్వేషణ కొనసాగించాలనే పాఠం తుమ్మెద నుండీ నేర్చుకున్నారు.
- తోనెటీగ: తేనెటీగ ఎంతో శ్రమకోర్చి మకరందం సంపాదించి తన తుట్టెలలో భద్రపరుచుకుంటుంది. అయితే చివరికది పరుల పాలవుతుంది. మానవులు కూడా ధనం కోసం అపరిమితంగా పాకులాడితే ఎప్పటికయినా అతడు సంపాదించిన ధనం పరుల సాలు కావలసినదనే పాఠం తేనెటీగ నుండీ నేర్చుకున్నారు.
- జింక: విషయ వాంఛలకు లోనయి జింక మృగాల పాలబడో, వేటగాళ్ళ పాలబడో మరణిస్తుంది. కనుక మనుషులు కూడా విషయ వాంఛలను విడనాడితే పరమాత్ముని నిలపవచ్చుననే పాఠం జింక నుండీ నేర్చుకున్నారు.
- సర్పము: నరుడి కంట పడకుండా సంచరిస్తూ అందరిచే పూజింపబడుతుంది సర్పము. యోగి కూడా సర్పము వలె నరులకు దూరముగా సంచరిస్తూ తన మహిమలు చాటుతుంటే అందరి గౌరవం పొందగలడనే పాఠం సర్పము నుండీ దత్తాత్రేయుడు నేర్చుకున్నారు.
- సాలెపురుగు: సాలెపురుగు కట్టె గూడు నుండీ సృష్టి నైపుణ్యము నేర్చుకోవాలని గ్రహించారు దత్తాత్రేయులు. ఇలాగే సమాజంలోని మానవుల నుండీ వారివారి ప్రవృత్తులను ఆధ్యాత్మిక దృష్టితో చూస్తూ అనేక వృత్తి వ్యాపకాలలో ఉన్న వారి నుండీ అనేక పాఠాలు గ్రహించారు దత్తాత్రేయులు. ఆధ్యాత్మిక కోణంలో చూడడం అలవరుచుకుంటే ఇటువంటి పాఠాలు ఎవరికి వారు గ్రహించవచ్చు. దత్తాత్రేయుడు ప్రకృతి నుండీ, ప్రకృతిలోని జీవజాలం నుండీ నేర్చుకున్నపాఠాలివి. ప్రకృతి నుండీ నేర్చుకున్న ఆ పాఠాల వల్ల పొందిన జ్ఞానాన్ని ఆచరణలో పెడితే జీవితం సౌఖ్యవంతమౌతుంది.