మనసు చేసే వింత చేష్టలు...- Manasu

0
మనసు చేసే వింత చేష్టలు...- Manasu
జ్ఞాని
మనసు చేసే వింత చేష్టలు...
  పంచభూతములు పంచేద్రియములకు ప్రతీక అంటారు. ఆ పంచేద్రియములను మనం జయించిన నాడు పంచ భూతములు మనకు వశం అవుతాయి. ప్రకృతి మనకు వశం అవుతుంది, అంటే మాయ మన మీద పని చేయదు. అప్పుడే భోగి యోగి అవుతాడు, యోగి జ్ఞాని అవుతాడు.
  ముందుగా మనం పంచభూతములను గౌరవించడం, సముచితంగా, నిర్ధిష్టంగా, అవసరములకు తగినంతగా వాడుకోవడం తెలుసుకొని వుండాలి. ఏవరైతే ప్రకృతిని గౌరవిస్తారో వారిని ప్రకృతి కూడా కాపాడుతుంది. 

   మనసు పంచేద్రియముల ద్వారా సుఖమును అనుభవిస్తూ వుంటుంది. చేయకూడని పనులన్నింటినీ మనసు చూడమని అంటూ వుంటుంది. ఆ మనసును కట్టడి చేస్తే పంచేద్రియములు దారికి వస్తాయి. ఒకవేళ పంచేద్రియములు చేయకూడని పని చేసినా, మనసు తాదాత్మ్యత చెందకుండా వుంటే, పొందకుండా వుంటే ఆ పాపం అంటదు.
   నిత్య బ్రహ్మచారి, నిత్య ఉపవాసం అంటే ఇదే....భోగముల యందు అనురక్తి లేకుండా వుంటే, ఆ భోగము అనుభవించిననూ భోగ ఫలితం అంటదు.....పంచ భక్ష్య పరమాన్నములు తిన్ననూ కటిక ఉపవాసం వున్న ఫలితాన్ని లెక్క కడతారు. చూడని వస్తువును చూసిననూ చూడనట్లే. గృహస్థాశ్రమ ధర్మంలో ఈ విధముగా వుండటమే బ్రహ్మచర్యం అందురు....శాస్త్రము చెప్పిన నియమములను పాటిస్తూ, శౌచమును పాటిస్తూ భార్యతో కలిసి వుండటమే గృహస్థులకు బ్రహ్మచర్యం. 
ఉపవాసం....
  తాదాత్మ్యత ఓక్క భగవంతునితోనే వుండాలి, మిగతా భోగ వస్తువులతో వుండకూడదు...పెట్టినది తినడం, దొరికినది తినడం ఉపవాసమే. శరీరమును కాపాడుకోవడానికి తినాలి..బ్రతకడానికి తినాలి, తినడానికి బ్రతకకూడదు. అప్పుడు కోరికను జయించినట్లు అవుతుంది. లేదంటే కోరిక మనల్ని జయిస్తుంది, దానికి మనం బానిసలం అవుతాము. బాగా ఆలోచిస్తే భౌతిక విషయములలో  మనసు  తాదాత్మ్యత చెందకుండా వుంటే కొంత పురోభివృద్ధి సాధించినట్లే. 
   అయితే మనసు ఒకటి జయిస్తే పరీక్ష మరో రూపంలో వస్తుంది, ఎక్కడో చోట మాయ మనల్ని పడగొట్టుతూ వుంటుంది...అనుక్షణం మనల్ని మనం పరీక్ష చేసుకొంటూ, ఓక్కోక్కటి జయిస్తూ మహాత్ముల చరిత్రను ఆదర్శంగా తీసుకొంటూ ముందుకు నడవాలి.....ఈ జన్మలో కాకపోయినా మరు జన్మలోనైనా విజయం మనదే, అప్పటిదాకా ఆగకూడదు....నడుస్తూ వుండాలి...మారుతూ, మార్చుకొంటూ జన్మను సాఫల్యం చేసుకోవాలి. లేకపోతే మన ఈ జన్మకు అర్ధం ఏమున్నది చెప్పండీ. నాది అని అనేది ఓక్కటే కర్మ ఫలితం, అది పాపం గానీ పుణ్యం గానీ.....ఏమున్నది చెప్పండీ.....నా మంచితనం, నా చెడ్డతనం నాతో వస్తాయి, ఏమి మూట కట్టుకొని పోతానో బాగా తెలిసి వున్న వాడ్ని....
  అల్పుడను....ఏదో తిన్నగా, చిన్నగా అనుభవములోకి తెచ్చుకొంటున్నాను....మనసు చేసే వింత ఆటలను శ్రద్ధగా గమనిస్తూ తెలుసుకొన్నది ప్రక్క వారితో అభిమానం, అహంకారం లేకుండా అతి చిన్న వాడినై పంచుకొంటున్నాను మనసు వుండబట్టలేక ....
ఆడుతున్నాను, గెంతులేస్తున్నాను....నన్ను నేను మైమరచి.....జరిగే ప్రతిదీ అమ్మ లీలగా ప్రగాఢంగా భావిస్తూ, భావన చేస్తూ.....

పంచభూతములకు కృతజ్ఞతగా పంచ పూజలు సమర్పించుకొంటూ...
  • లం......పృథివీ ..తత్త్వాత్మికాయై నమః .......గంధం పరి కల్పయామి,
  • హం ... ఆకాశ  ..తత్త్వాత్మికాయై నమః........పుష్పం పరికల్పయామి
  • యం ....వాయు .తత్త్వాత్మికాయై నమః......ధూపం పరికల్పయామి
  • రం.......వహ్ని    తత్త్వాత్మకాయై నమః........దీపం పరికల్పయామి
  • వం .....అమృత  తత్త్వాత్మికాయై నమః........అమృత నైవేద్యం పరికల్పయామి
  • సం.....సర్వం     తత్త్వాత్మికాయై నమః........సర్వోపచారాన్  పరికల్పయామి

శ్రీమాత్రేనమః ....

రచన: భాస్కరనంద నాథ 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top