శ్రీ విద్యోపాసకులు - Sri Vidyopasana

0
శ్రీ విద్యోపాసకులు - Sri Vidyopasana
బాలా త్రిపుర సుందరి
శ్రీ విద్యోపాసకులు 
   శ్రీ విద్యోపాసకులు ఎప్పుడూ తర్కించరు, వాదించరు, తప్పును ఖండిస్తారు,  చూపిస్తారు. విని తెలుసుకొంటే ఉత్తములు అవుతారు...లేదంటే ఎవరి కర్మ వాళ్లు అనుభవిస్తారు. నిత్యం మహా షోడశిీ మంత్ర జపంలో రమిస్తూ వుండే వాళ్లకి ఆడ, మగ అనే తేడా వుండదు. చిన్న పెద్ద తేడా కనిపించదు, అందరూ బాలా త్రిపుర సుందరులుగా 8 ఏండ్ల బాలబాలికలుగా కనిపిస్తూవుంటారు. ఏవ్వరి మీద అక్కసు, ద్వేషం, పగ అసలు వుండదు....పగ కక్షలు వున్న వారి దగ్గరకు కామాక్షి రాదు....అమ్మ మాతృ స్వరూపిణి...కావున అమ్మను పూజించే వాళ్లు కూడా మాతృ సమానులౌతారు. శ్రీవిద్యోపాసకులకు కల్లాకపటం తెలియదు ఎందుకంటే వాళ్లు బాలా స్వరూపులుగా, వున్నది వున్నట్లుగా మాట్లాడుతూ వుంటారు.  చిన్న పిల్లల మనస్త్వత్వంతో ఆడుతూ పాడుతూ వుంటారు......ఆనంద తాండవంలో మునిగి తేలుతూ తమాషా చూస్తూ వుంటారు.....ఎవ్వరినీ నిందించి లేరు....

   వ్యక్తిగత పగలు ద్వేషాలు తెలియవు వారికి. సమస్త ప్రాణి కోటిని అష్టావర్ష భవేత్ అన్నట్లుగా 80 ఏండ్ల ముసలి వాళ్లు కూడా 8 ఎండ్స్ బాలికామణిలాగ కనిపిస్తూ వుంటుంది. అదే శ్రీవిద్యోపాసన....నరనరాలలో అమ్మ తనం నిండిపోయివుంటుంది...జగన్మాత లాగ మాట్లాడుతూ వుంటారు.....ప్రపంచంలో వున్న కుళ్లు కుతంత్రాలను చూసి బాధపడుతూ వుంటారు, ఓక్కోసారి ఆనంద తాండవం చేస్తూ వుంటారు....కడు విచిత్రంగా ప్రవర్తిస్తూవుంటారు....మన భావనలకు అందరు...ఎవ్వరినీ గుర్తు పెట్టుకొని పగ సాధించడం అనేది అసలు వుండదు, అహంకారం వుండదు.
    ఈ లక్షణాలతో అంబ పూజ చేయలేరు, నిత్య శ్రీచక్రార్చన చేయలేరు.....ఎవరిలో ఈ దుర్గుణములు వుంటాయో వారు శ్రీచక్రం ముందు కూర్చోలేరు.....తప్పు చేస్తే నెత్తి కొడుతుందని దేవీ ఉపాసకులకు బాగా తెలుసు....గురుపరంపరకు మచ్చ రానీయరు.  సాంప్రదాయ శిష్య పరంపరలో వచ్చిన ఉపాసకులను అనుక్షణం వారి గురు దేవుళ్లు, గురు త్రయం కాపాడుతూ వస్తుంది....చేసిన పొరబాట్లను గురించి తక్షణమే వారికి స్వప్న రూపంలో సమాధానాలు దొరుకుతూవుంటాయి.

శ్రీవిద్యా పూర్ణదీక్షాపరుల యోక్క మానసిక స్థితి కడు బిన్నముగా వుంటుంది...వారు అన్న ప్రతి మాటకూ ఓక అర్థం వుంటుంది....అర్థం లేకపోతే అర్థం కల్పిస్తుంది ఆ కామాక్షి... అది ఆమే భాధ్యత.
  వీరు అహంకారంతో, ఆగ్రహంతో ఏప్పుడూ మాట్లాడరు.....అయితే అలా కనిపిస్తూ వుంటారు కారణం వారి వెనుక శ్రీ భవానీ వున్నది అని నమ్మకంతో....వీరు నిద్రపోయేటప్పుడు అమ్మ ఓడిలో పడుకొని నిద్రపోతారు....పూర్ణవిద్యాపరులు అంటే సాక్షాత్తు స్వయం కామాక్షీ స్వరూపులు. ఆ స్పృహలోనే నిత్యం వారు మెదులుతూ వుంటారు,  కావున వారు అన్న మాటలు నిత్య సత్యాలు అవుతాయి...

అహం భావయే భవానీం....అని ఊపిరి పీలుస్తూ వుంటారు....అటువంటి భవానీ స్వరూపమునకు కొందరిమీద కాఠిన్యం, కొందరి మీద లాలిత్యం వుండదు....శ్రీవిద్యోపాసకులతో మాటలాడే వ్యక్తుల యోక్క భావనలు తమంతట తాముగా బయట పడుతాయి....అందుకొని చాలా జాగ్రత్తగా మసలుకోవాలి....ప్రకృతిని శాసించే మంత్ర శక్తులు వీరి దగ్గర ఎక్కువగా వుంటాయి.....వీరి శరీరం మంత్రపూరితం అయ్యి వుంటుంది, పైకి అతి సాధారణముగా కనిపించినా లోన అతీంద్రియ శక్తులతో మూల ప్రకృతితో తాదామ్యత చెంది అణుసంధానమై వుంటారు...అందుకే తమలో తాము నవ్వుకొంటూ వుంటారు....నీవు పొగడినా, తిట్టినా ఒక్కటే విధముగా నవ్వుతూ వుంటారు. కరుణ కలిగితే అపారమైన సహాయం చేస్తారు, తమ పుణ్యం కూడా ఆఖరాకి తమ ప్రాణాలు సహితం ధారపోస్తారు.....అయితే ఎట్టి పరిస్థితులలోనూ ఎదుటి వారి ప్రాణాలు తీయరు. కారణం అమ్మ ప్రాణ స్వరూపిణి, మాతృ స్వరూపిణి ....ప్రాణాలు ఇవ్వడమే వీరి లక్ష్యం.....పూర్ణ దీక్షాపరులైన శ్రీవిద్యోపాసకులు మనతోనే తిరుగుతూ గుంభనంగా సాధన చేస్తూ వుంటారు....ఇటువంటి వారికి ఓక్కపూట భోజనం పెట్టినా లేక ఒక్క అనరాని మాట అన్నా అది వెయ్యింతల ఫలితాన్ని ఇస్తుంది....

శ్రీచక్రోపాసన అంటే సమస్త సృష్టిని, సమస్త లోకాలను,  ముక్కోటి దేవతలను త్రిశక్తి సహిత త్రిమూర్తులను, ఆ కామకామేశ్వరులను ఏకకాలంలో అర్చించినట్లు లెక్క.....
సాక్షాత్తు శ్రీదేవీ స్వరూపమైన శ్రీవిద్యోపాసకులు ఓక్క వారి గురువలకు తప్పించి లోకంలో మరెవ్వరి పాదములకూ నమస్కరించరు.....ప్రతి ప్రాణిలోనూ మాతృ భావన చేసి, మాతృ మూర్తిగా దర్శిస్తూవుంటారు.....వీరి శరీరభాగములలో శ్రీదేవి నాట్యమాడుతూ వుంటుంది...అదే శ్రీవిద్యోపాసన. వీరు ఏవ్వరి దగ్గర నుంచీ ఏమీ ఆశించరు....వీరికి కావలసిన వన్నీ అమ్మ సమకూర్చి పెడుతూ వుంటుంది...నోటిలోమాట నోటిలో వుండగానే సకలాభీష్ఠదాయిని తధాస్తు ..అని అంటుంది.

చాలా చాలా దుర్లభమైన విద్య.......నిలుపుకోవడం చాలా కష్టం.. పాదుకాంత పూర్ణదీక్షాపరులుగా వున్న వారిని మనం వ్రేళ్ళ మీద లెక్క పెట్టవచ్చును....పూర్వ జన్మ సుకృతం, పుణ్యఫలం, గురువుల అనుగ్రహం లేకపోతే పూర్ణదీక్ష రాదు....వచ్చినా నిలబడదు...ఇది యోగ విద్య, బ్రహ్మ విద్య, ఆత్మ విద్య....అటువంటి మహా యజ్ఞమును చేస్తున్న మహా పురుషులకు నమస్కరిస్తూ....

రచన: భాస్కరానంద నాథ

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Translate this post ⬇

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top