ప్రకృతిని - భగవంతుని సాక్షాత్కారం: Prakruti

0
ప్రకృతిని ఆరాధించుచున్న మహిళలు
ప్రకృతిని  ఆరాధించుచున్న మహిళలు
ప్రకృతిని కాపాడండి....భగవంతుడు కనిపిస్తాడు...
  ఈ ప్రకృతిలో, సృష్టిలో పుట్టిన ప్రతి ప్రాణినీ తిరిగి పుట్టించ వచ్చును...ఏందుకంటే అవి ఈ మట్టిలోనే కలిసిపోయినాయి కనుక....ఈ మట్టిలోని అణువణువులో వాటి రేణువులు దాగి వున్నాయి...వాటిల్ని పునర్జీవితం చేయడానికి తగిన శక్తి మనకు కావాలి...క్రొత్తవి మనం సృష్టించలేము కానీ ఓకసారి రూపము తీసుకొన్న వాటిని తిరిగి బ్రతికించవచ్చును...

యుగ ధర్మం,  కాల ధర్మం అని ఓకటి వున్నది...అది భగవంతుడే....ఆ భగవంతుడే యుగ ధర్మాన్ని కాదని భక్తుని కోసం ప్రకటితమౌతూ వుంటాడు. భక్తుని సాధన అంత గొప్పది...
నారదుడు ఏ కాలం నాటి వాడు అని త్యాగరాజు కు కనిపించినాడు?
కాళి ఏకాలం నాటిది అని రామకృష్ణులకు కనిపించినారు?
రాముడు ఏ కాలం నాటి వారు అని తులసీదాసుకు, రామదాసుకు కనిపించినారు?
వేంకటేశ్వరుడు ఏ కాలం నాటి వాడు అని అన్నమయ్యకు, బావాజీ కి కనిపించినారు?
ఇప్పటికీ నిజమైన భక్తులకు, సాధకులకు ఆ కాలం నాటి దేవతా రూపములు కనిపిస్తున్నాయి.
ఏలా?  ఏలా?
   మంత్ర శక్తితో, నామ శక్తితో, తపస్సుతో, పూజతో ఆ దివ్య స్వరూపములను క్రిందకు దించుతున్నాము....వాటి సూక్ష్మ రూపములను ఆవాహన చేస్తున్నాము....తపస్సుతో మన నేత్రములను దివ్య నేత్రములు గా చేసుకొని ఆ దివ్య స్వరూపములను చూడవచ్చును, అలా చూసిన మహాపురుషులు వున్నారు, దేవతలతో మాట్లాడిన వాళ్లు వున్నారు...
 • దేవతలనే కాదు పితృ దేవతలను కూడా ఆవాహన చేసి వారి సూక్ష్మ రూపములను గాంచి మాటలాడి వచ్చును...
 • ప్రకృతిలో కలిసిపోయిన వారి అణువులను ఆత్మలను ఆవాహన చేసి, వారి సూక్ష్మ రూపములను చూడవచ్చును, మాట్లాడ వచ్చును...
 • కావలసినది తపఃశక్తి....భక్తి...ఉపాసన...మంత్ర సాధన...
 • ఆరు నెలలు నియమ నిష్టలతో ఉపాసన చేస్తే నీకు అనుభవం అవుతుంది ఇది...
 • దేవతా శక్తుల యొక్క స్పర్శ నీకు తెలుస్తుంది....
 • కావలసినది నీకు స్వార్ధ చింతన లేని మనసు....సృష్టికి హాని తలపెట్టని మనసు...
 • సర్వ జనుల మీద, సమస్త ప్రాణి కోటి మీద ప్రేమానురాగాలు, త్యాగము, ఆర్తి, సహాయము. నీ ఆత్మ ఉద్ధరణ కొరకు సాధన చేస్తే తప్పక భగవంతుడు నీకు కనిపిస్తాడు ఈ జన్మలోనే..
 • నీ కంటితో నీవు చూడవచ్చును, పూజించ వచ్చును...
 • ప్రతి ప్రాణినీ ప్రేమించు....భగవంతుడి సృష్టిలోని ఏ ప్రాణికీ హాని చేయ వద్దు, ధర్మంగా బ్రతుకు..
 • తల్లిదండ్రులను, గురువులను పూజించు....భగవంతుడు కనిపిస్తాడు...
 • ఎవ్వరినీ చంపకు, ఆఖరాకి చీమనైనా సరే....ప్రేమించు....స్త్రీ మూర్తిని పూజించు, గౌరవించు...భగవంతుడు కనిపిస్తాడు....స్త్రీ ప్రకృతి మాత ఆమెను గౌరవించు, పూజించు భగవంతుడు కనిపిస్తాడు....స్త్రీ శాంతి మూర్తి ...ఆమెను పూజించు భగవంతుడు కనిపిస్తాడు..
 • నీ భార్యలో ఆది శక్తిని చూడు, నీ తల్లిదండ్రులలో పార్వతీ పరమేశ్వరులను చూచి పూజించు.
 • స్నేహితులలో నారాయుడ్ని చూడు......భగవంతుడు ఇక్కడే ఇప్పుడే కనిపిస్తాడు...
 • మీ గురువులలో ఆది శంకరాచార్యులను చూడు....భగవంతుడు కనిపిస్తాడు...
 • మనిషిని మనిషి లాగ, ప్రాణిని ప్రాణిలాగ చూసే శక్తి వున్నదా....భగవంతుడు కనిపిస్తాడు..
 • ఆడ పిల్లలను, కోడల్లను చంపకండీ...వారిని పాడు చేయకండి, ఆడది ప్రేమ మూర్తి...నీకు సుఖాన్ని, శాంతిని చేకూర్చే మహా శక్తి స్వరూపిణి....నీకు తల్లి వంటిది....భగవంతుడు కనిపిస్తాడు...
భగవంతుడు కనిపిస్తాడు........
భగవంతుడు కనిపిస్తాడు
భగవంతుడు కనిపిస్తాడు......తప్పక కనిపిస్తాడు....నీతో ఆడుకొంటాడు..
ఇది సత్యం......... ఇది సత్యం......... ఇది సత్యం

రచన: భాస్కరానంద నాథ

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top