అజాన్ సమయంలో లౌడ్ స్పీకర్ల వినియోగానికి వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించిన 'రాష్ట్రీయ బజరంగ్ దళ్' - Rashtriya Bajrang Dal starts campaign against the usage of loudspeakers for Azan

0
Rashtriya Bajrang Dal starts campaign against the usage of loudspeakers for Azan
Rashtriya Bajrang Dal starts campaign against the usage of loudspeakers for Azan
కాన్పూర్, ఉత్తరప్రదేశ్: రాష్ట్రీయ బజరంగ్ దళ్ నేతృత్వంలోని హిందూ సంస్థలు ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో అజాన్ సమయంలో లౌడ్ స్పీకర్లు మోగిస్తున్న మసీదులకు వ్యతిరేకంగా సంతకాల ఉద్యమాన్ని ప్రారంభించాయి. 

2021 ఫిబ్రవరి 22న ప్రారంభమైన ఈ క్యాంపెయిన్ లో కాన్పూర్ లో 1 లక్ష మంది ప్రజల మద్దతు కోసం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలా సేకరించిన సంతకాలను రాష్ట్రపతికి అందించి లౌడ్ స్పీకర్ల ధ్వనిని ఆపించాలని తమ విజ్ఞప్తిని సమర్పించేందుకు సంస్థ ప్రణాళికలు చేస్తోంది.

సంతక సేకరణలో భజరంగ్ దళ్ 

సంతక సేకరణలో భజరంగ్ దళ్ 

సంతక సేకరణలో భజరంగ్ దళ్ 
ఓపీ ఇండియాతో మాట్లాడుతూ... ఈ ప్రచారాన్ని ఫిబ్రవరి 22న కాన్పూర్ లోని ఘంటా ఘర్ సమీపంలో ఉన్న భారత్ మాతా ఆలయం నుంచి ప్రారంభించినట్లు రాష్ట్రీయ బజరంగ్ దళ్ ప్రధాన కార్యదర్శి రాంజీ తివారీ తెలిపారు.  (అజాన్) ప్రార్థన మసీదులు లౌడ్ స్పీకర్ల వలన ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అసౌకర్యానికి లోనవుతున్నారని హిందూ సంస్థ సభ్యులు ఆరోపించారు.

మరోవైపు ఇదే విషయమై, కాన్పూర్‌కు చెందిన న్యాయవాది మసీదుల నుండి లౌడ్‌స్పీకర్లను తొలగించడానికి చట్టపరమైన చర్యలను ప్రారంభిస్తున్నట్లు తెలియజేస్తూ ట్విట్టర్‌లో ట్వీట్ చేసారు. 
అయితే, ఈ ప్రచారం అనవసరమని, ప్రజల దృష్టిని మళ్లించి ఓ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు ఓ ముస్లిం మతాధికారి తెలిపారు. మసీదువద్ద జాన్ ఆడే హక్కు రాజ్యాంగం వారికి కల్పిస్తుందని, "ఎవరూ దానిని ఆపలేరు" అని కూడా ఆయన అన్నారు. ఇక్కడ ఏ గ్రూపు కూడా అజాన్ లను ఆపమని అడగడం లేదు కేవలం బజరంగ్ దళ్ మాత్రమే ఈ లౌడ్ స్పీకర్ల వినియోగానికి వ్యతిరేకంగా ఉందని అన్నాడు.

ఇదిలాఉంటే, గత ఏడాది మేలో, అలహాబాద్ హైకోర్టు ఒక మసీదు నుండి 'ముయెజిన్ చేత అజాన్ (ముస్లింలను ప్రార్థించమని పిలుపునివ్వడం) పై సమగ్రమని తీర్పు ఇచ్చింది, కానీ లౌడ్ స్పీకర్స్ వంటి ధ్వని-విస్తరించే పరికరాల వాడకం నిలిపివేయాలని ఆ తీర్పులో స్పష్టంగా ఉంది. 'ప్రార్థనకు కోసం ఇస్లామ్ పిలుపు (అజాన్)' కోసం ఇలాంటి పరికరాలను ఉపయోగించమని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 (మత స్వేచ్ఛ హక్కు) కింద లౌడ్ స్పీకర్ల వాడేందుకు హక్కుకల్పిస్తుందని ఎక్కడ చెప్పలేదని కోర్టు అభిప్రాయపడింది.

లౌడ్ స్పీకర్లను ఉపయోగించడంపై ఎలాంటి మత గ్రంథాలలో ప్రస్తావన లేదని ధర్మాసనం పేర్కొంది. సమాజంలో సువార్త అవసరం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే, సామాజిక సయోధ్య, సామరస్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది.

Source input: Opindia - Hjs

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top