ఆయుర్వేద పత్రం - పత్రములు ఔషధ గుణములు - Ayurvedic Leaves and medicinal use

ఆయుర్వేద పత్రం - పత్రములు ఔషధ గుణములు - Ayurvedic Leaves and medicinal use
ఆయుర్వేద పత్రములు ఔషధ గుణములు
 • మాచీ పత్రం -నేత్రములకు మంచి ఔషధము.  ఆకుని తడిపి కళ్ళ మీద ఉంచుకోవాలి.  పసుపూ నూనెతో నూరి ఒంటికి రాసుకోవాలి.
 • నేలమునుగ ఆకులు - ఆకులను నూరి నీటితో సేవిస్తే దగ్గు తగ్గును.  శరీరమునకు దివ్యఔషధము.
 • మారేడు ఆకులు - మూల శంక నయమగును.  రోజూ  రెండు ఆకులని నమిలి రసాన్ని నిదానంగా మింగాలి.  కాయలోని గుజ్జుని ఎండబెట్టి పొడిచేసి మజ్జిగలో  వేసుకుని తాగాలి.
 • జంటగరిక ఆకు - మూత్ర సంబంధ వ్యాధులు  తొలుగును.  పచ్చడి చేసుకొని తినవలెను.
 • ఉమ్మెత్త ఆకు - మానసిక రోగాలు తొలగును.  ఆకుల రసాన్ని తీసి రోజూ తలమీద మర్దన చేయాలి.
 • రేగు ఆకు - శరీర సౌష్టవానికి శ్రేష్టం.  మితంగా తింటే మంచిది.
 • ఉత్తరేణి ఆకులు - దంతవ్యాధులు నయమగును.  ఈ కొమ్మ పుల్లతో పళ్ళు తోముకోవాలి.
 • తులసీ ఆకులు - దగ్గు, వాంతులు, సర్వ రోగనివారిణి.  రోజు ఐదు, ఆరు ఆకులను తింటే మంచిది.
 • మామిడి ఆకు - కాళ్ళ పగుళ్ళు, అతిసారం నయమగును.  మామిడి జిగురులో ఉప్పు కలిపి వేడి చేసి పగుళ్ళకు రాయాలి.
 • గన్నేరు ఆకు - జ్వరమును తగ్గించును[లోనికి తీసుకోరాదు]
 • అవిసె ఆకు - రక్త దోషాలు తొలగును.  ఆకు కూరగా వాడవచ్చు.
 • అర్జున పత్రం - మద్ది ఆకులు - వ్రణాలు తగ్గును.  వ్రణాలున్న భాగాల్లో ఆకులను నూరి రాసుకోవాలి.
 • దేవదారు ఆకులు - శ్వాశకోశ వ్యాధులు తగ్గును
 • మరువం ఆకులు - శరీర దుర్వాసన పోగొట్టును.  వేడినీటిలో వేసుకొని స్నానం చేయవలెను.
 • వావిలి ఆకు - ఒంటినొప్పులను తగ్గించును.  నీటిలో ఉడికించి స్నానం చేస్తె మంచిది.
 • గండకీ ఆకు - వాత రోగములు నయమగును
 • జమ్మి ఆకులు - కుష్ఠు వ్యాధులు తొలగును.  ఆకుల పసరును ఆయా శరీర భాగాలలో రాసుకోవాలి.
 • జాజి ఆకులు - నోటి దుర్వాసన పోగొట్టును.  ఆకులను వెన్నతో కలిపి నూరి పళ్ళు తోముకోవాలి.
 • ​రావి ఆకులు - శ్వాసకోశ వ్యాధులు తగ్గును.  పొడి చేసి తేనెతో సేవిస్తే మంచిది. ​
 • దానిమ్మ ఆకు - అజీర్తి, ఉబ్బసం తగ్గును.  పొడిచేసి కషాయంగా తాగవచ్చు. ​
 • జిల్లేడు ఆకులు - వర్చస్సు పెంచును.
తిప్పతీగ - Tinospora cordifolia
తిప్పతీగ - Tinospora cordifolia

తిప్పతీగ - Tinospora cordifolia

సాధారణంగా పల్లెలలో దొరికే మూలిక తిప్పతీగ ,దీనిని హిందీ లో జిదాయ్ అని సంస్కృతం లో అమృత అని పేర్లున్నాయి. ఇది చెట్లమీదకు పాకి అల్లుకుంటుంది . కాడలకు బొడిపెలు వుంటాయి .ఆకులు పచ్చగా చిన్న సైజ్ తమలపాకుల్లావుంటాయి. కాస్త వగరు చేదు ,కారంగా రుచి కలగలసి వుంటుంది. నమిలితే జిగటగా వుంటుంది. దీనివిశేషమేమిటంటే మనం పీకి వేసినాక కొద్దికాలం ఆగాక మరలా తడితగిలినా బ్రతుకుతుంది .ఆరునెలలైనా తిప్పతీగ మరలాబ్రతుకుతుంది అని అంటారు పెద్దలు. ఇలాంటి దివ్యమైన మూలికలు అదృశ్యమవుతున్నాయి . ఎక్కడ బడితే అక్కడ దొరికే ఈమొక్క ఇప్పుడు అంతగా కనిపించటం లేదు .

తిప్పతీగను తులసిని కలిపి తింటే స్వైన్ ఫ్లూను ఎదుర్కునే రోగనిరోధక శక్తి శరీరానికి చేకూరుతుంది. అలాగే స్వైన్ ఫ్లూ వచ్చినా తగ్గించగల దివ్యౌషధమిది. దీనినే ఈమధ్య యోగా గురువు ప్రసిద్ధ ఆయుర్వేద వైద్య పరిశోధకులు రామ్ దేవ్ బాబా ఈవ్యాధి నివారణకు మందుగా సూచించారు. దీనిని కాడను ఒకటిరెండంగుళాల ముక్కను ,పది తులసి ఆకులతో కలిపి పొద్దుటే నమిలి తినాలి. అలా నాలుగైదు రోజులకు ఒకసారి తీసుకోవాలి.వ్యాధిసోకినప్పుడు ఎక్కువమోతాదులో తీసుకోవాలి. అద్భుతంగా పనిచేస్తుంది.

దీనిని మన పూలకుండి లో నాటుకుంటే నీరుపోస్తుంటే అదేపెరుగుతుంది .కనుక పెంచటము తేలికే . పుట్టకొక్కులు ,తేనె పల్లెటూర్లనుంచి తెచ్చి అమ్మే యానాదులకు ఈమూలిక బాగ పరిచయం కనుక వారినడిగితెప్పించుకోవచ్చు. లేదా మీకు పల్లెలలో ఎవరన్నా చుట్టాలుంటే వారినడిగినా పంపిస్తారు.తులసి మొక్క ఎలాగూ మీదగ్గరలో దొరుకుతుంది.
..దుర్గా నాగేశ్వరరావు 

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top