బ్రాంకైటిస్ ను పోగొట్టే చేసే చిట్కాలు - Tips to get rid of bronchitis

0
బ్రాంకైటిస్ ను పోగొట్టే చేసే చిట్కాలు - Tips to get rid of bronchitis
బ్రాంకైటిస్
సాధారణంగా చెవి, ముక్కు, గొంతులకు సంబంధించి చాలామంది పలు సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. చికిత్స కోసం వైద్యులను ఆశ్రయిస్తున్న వారిలో చెవిపోటు, సైనసిటిస్, ఒక్కసారిగా నిద్రలో శ్వాస ఆగిపోవడం (స్లీప్ ఆప్నియా), టాన్సిలైటిస్, ముక్కులో నుంచి రక్తం కారుతుండడం, ఇతర అలర్జీలతో బాధపడుతున్న వారే ఎక్కువగా ఉంటారు. అయితే, అస్తమానం వైద్యుల వద్దకు వెళ్ళకుండా పలు చిట్కాలను పాటిస్తూ ఇంటివద్దే ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా జలుబు, ముక్కుదిబ్బడ, గొంగులో గరగర వంటివి తరచూ ఇబ్బంది పెడుతుంటాయి.

ముఖ్య కారణాలు ...

తరచూ దగ్గుతూ ఉండేవారు ఈ వ్యాధిబారిన పడే అవకాశం ఉంది. వైరస్, బ్యాక్టీరియా, ధూమపానం చేస్తున్నవారి దగ్గర నిలబడడం, శుభ్రపరిచే ఉత్పత్తుల వద్ద ఎక్కువ సేపు గడపడం వంటివి బ్రాంకైటిస్ రావడానికి ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. సాధారణంగా రెండు రకాల బ్రాంకైటిస్‌లు ఉంటాయి. మొదటిదైన అక్యూట్ బ్రాంకైటిస్ అనేది జలుబు, దగ్గు తీవ్రంగా ఉండడం వల్ల వస్తుంది. ఒళ్ళునొప్పులు, నీరసం, జ్వరం, తలపోటు వంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఒకవేళ దీనికి సరైన చికిత్సను తీసుకోకుంటే అది న్యూమోనియాకు దారితీసే అవకాశాలున్నాయి. క్రోనిక్ బ్రాంకైటిస్ అనేది తరచూ ధూమపానం చేయడం, పొగాకు ఉత్పత్తులను సేవించడం ద్వారా సోకుతుంది. ఊపిరితిత్తుల్లో శ్వాసకోశ సమస్యలను కూడా పెంచుతుంది. బ్యాక్టీరితో సోకిన బ్రాంకైటిస్‌కు యాంటీబయాటిక్స్ అవసరముంటాయి కానీ వైరస్‌తో సోకిన వ్యాధికి తప్పనిసరిగా చికిత్స చేయాల్సి ఉంటుంది. రుగ్మత ప్రాథమిక దశలో ఉండగా, ఈ చిట్కాలను పాటిస్తే ప్రయోజనం ఉంటుంది.
  • వీలైనంతవరకు మంచినీటిని ఎక్కువగా సేవించాలి అందులోనూ కాచి వడబోసిన నీరైతే మరింత శ్రేష్టం.
  • శీతలపానీయాల జోలికి వెళ్ళకుండా ఆరోగ్యకరమైన పళ్ళ రసాలను సేవించాలి. మనకు ఇబ్బంది పెడుతున్న రుగ్మత ఎక్కువ అవుతుంది అనుకునే ఫలాలను మినహాయించాలి.
  • గోరువెచ్చని హెర్బల్ తేనీరు సేవించడం వల్ల ముక్కు, గొంతు సమస్యలకు ఉపశమనం ఉంటుంది.
  • థైమ్ టీ సహజ ఔషధం, క్యామోమైల్ టీని గొంతులో గరగరకు, పెప్పర్‌మెంట్‌కు టీ ముక్కుదిబ్బడను తగ్గించడానికి, అనీసీడ్, హోలీ బేసిల్‌ను దగ్గు తగ్గించడానికి ఉపయోగించవచ్చు.
  • చెవి, ముక్కు, గొంతు సమస్యలతో బాధపడేవారు ఆల్కాహాల్, సోడాను పూర్తిగా తగ్గించాలి. వీటి వల్ల డీహైడ్రేషన్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
  • కొన్ని సందర్భాల్లో చికెన్ సూప్‌ను కూడా జలుబు తగ్గడానికి ఉపయోగిస్తారు. మ్యూకస్‌ను పనితీరును మెరుగుపరిచి సమస్యను తగ్గించడానికి ఇది దోహదపడుతుంది.
  • గోరువెచ్చటి నీటిని సగం టీస్పూన్ ఉప్పుతో కలిపి నోరు పుక్కిలిస్తే గొంతు సమస్య తగ్గిస్తుంది. నిమ్మ, నారింజలు ఈ ద్రవంతో కలిపితే అది యాంటీబ్యాక్టీరియల్‌గా కూడా పనిచేస్తుంది.
  • సైనస్ ఉన్నవారు అరోమాథెరపీ స్టీమ్‌ను దీర్ఘంగా పీల్చితే కాస్త ప్రయోజనం ఉంటుంది. దీంతో పాటు వైద్యుల సూచన ప్రకారం కొన్ని తైలాలు ఈ థెరపీకి ఉపయోగిస్తే శ్వాస సాధారణంగా మారడానికి తోడ్పతుంది. పుదీనా, శొంఠివి వంటిని మితంగా కలపడం కూడా మంచిది.
  • మనకు రోజూ కనిపించే అల్లంలో ఎన్నో పోషక విలువలుంటాయి. యాంటీమైక్రోబియల్ లక్షణాలు ఉన్న అల్లం చెవి, ముక్కు, గొంతు సమస్యలను నివారించడానికి చక్కగా ఉపయోగపడుతుంది.
  • పడక గది వాతావరణంలో కాస్త తేమను ఉండేలా చూసుకోవాలి. సహజంగా లభించే యాంటీవైరల్ ఉత్పత్తులైన ఆర్గానో ఆయిల్, అల్లం మిశ్రమాలను ఉపయోగించవచ్చు.
గమనిక:
పై నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

-డాక్టర్ నచికేత్ దేశ్‌ముఖ్ఎం .ఎస్.(ఈఎన్‌టి) Abhomi  January 27, 2012

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top