చెడు కొలెస్ట్రాల్ (కొవ్వుని) తగ్గించే అద్భుతమైన ఆహారపదార్ధాలు - Excellent foods that reduce bad cholesterol (fat)

చెడు కొలెస్ట్రాల్ (కొవ్వుని) తగ్గించే అద్భుతమైన ఆహారపదార్ధాలు - Excellent foods that reduce bad cholesterol (fat) -
Bad Cholesterol Reducers

Bad Cholesterol Reducers - చెడు కొలెస్ట్రాల్ ?(క్రొవ్వు)ని తగ్గించేవి

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

మన జీవన విధానంలో మార్పులు చేసుకోవడం ద్వారా బ్లడ్ కొలెస్ట్రాల్ లో చెడ్డ కొలెస్ట్రాల్ ను అదుపు చెయ్యవచ్చు. ప్రతిరోజూ సైక్లింగ్, నడక, ఈత వంటి తెలికపాటి వ్యాయామాలు చెయ్యాలి. దీనివలన గుండె పటిష్టపడుతుంది. చెడ్డ కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతుంది. అధిక బరువు మాయమవుతుంది. రక్త నాళాలలో వాపు, క్లాగింగ్ తగ్గి, రక్తనాళాల గోడలు దలసరికాకుండా వుంటాయి.

కొన్ని పదార్థాలను తినడం వల్ల రక్తనాళాలకు, గుండెకు ఎంతో మంచిని చేకురుస్తాయి. ఏ ఏ పదార్థాలు తినడం మంచిదో? వాటిలో  రోగ  నిరోధక శక్తిని  పెంచే గుణాలు ఏమిటో? అవి తినడం వల్ల మన శరీరంలోని కొలెస్ట్రాల్ పై ఏ విధంగా పనిచేస్తాయో తెలుసుకుందాం.

వెల్లుల్లి 

వెల్లుల్లి - Garlic
వెల్లుల్లి - Garlic
ఘాటయిన వాసన ఇచ్చే వెల్లుల్లి గుండెకు నేస్తం, క్యాన్సర్‌కు ప్రబల శత్రువు. దీన్ని నేరుగా వేయ్మించకూడదు. వెల్లుల్లిని ఒలిచి పది నిముషాలు అలా ఉంచితే క్యాన్సర్‌నిరోధించే ఎంజైమ్‌ ఎలెనాస్‌ బాగా మెరుగవుతుంది.

ఆపిల్ పండు: 

Apple
Apple
రక్తంలోని కొలెస్ట్రాల్ నిల్వల్ని తగ్గించడంలో ఆపిల్ పండు ఉపయోగపడుతుంది. లివర్ తయారు చేసే చెడ్డ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.  ఈ పండులో మాలిక్ ఆమ్లం, శరీరంలోని కొవ్వులను జీర్ణం చేస్తుంది.

బీన్స్ :

beans
beans

బీన్స్ లో ఉండే కరిగే పీచు చెడ్డ కొలెస్ట్రాల్ తయారీని నిలుపుదల చేస్తుంది. బీన్స్ లోని లేసిథిన్ కొలెస్ట్రాల్ కరిగిపోయేలా చేస్తుంది. పొటాషియం, రాగి, భాస్వరం, మాంగనీసు ఫోలిక్ ఆమ్లాలు కూడా దీనిలో ఉన్నాయి.

బెర్రీస్:

berries
berries
బ్లాక్ బెర్రీ లోని విటమిన్స్ గుండెకు, ప్రసరణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. దీనిలోని కరిగే పీచు పెక్టిన్ కొలెస్ట్రాల్ ను శరీరం నుంచి బయటికి పంపుతుంది. 

ద్రాక్ష:

grapes
grapes
ఆంతో సైనిన్స్, టానిన్స్ వంటివి కొలెస్ట్రాల్ నిల్వల్ని బాగా తగ్గిస్తాయి. ద్రాక్ష లోని పొటాషియం, శరీరంలోని విష పదార్థాలను నిర్విర్యం చేస్తుంది. మధుమేహగ్రస్తులకు  ద్రాక్ష నిషిద్ధం.

జామపండు:

guava
guava
తాజా జమపండ్లు శరీరానికేంతో మేలు చేస్తాయి. జమలోని విటమిన్ సి  భాస్వరం, నికోటిన్ ఆమ్లం, కరిగేపీచు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను పటిష్ట పరిచి, కొలెస్ట్రాల్ తగ్గించి, గుండెను సంరక్షిస్తాయి.

పుట్టగొడుగులు: 

mushroom
mushroom
కొలెస్ట్రాల్ నిల్వలు తగ్గించంలో మాష్ రూమ్స్ లోని విటమిన్స్ బి, సి కాల్షియం, మినరల్స్ బాగా ఉపయోగాపడతాయి.

గింజలు(nuts):

గింజలు(nuts):
nuts
బాదం పప్పు తినడం వల్ల చెడ్డ కొలెస్ట్రల్ ను తగ్గిస్తుంది. దీనిలోని ఒలియిక్ ఆమ్లం, గుండెను వ్యాధుల బారినపడకుండా రక్షిస్తుంది. జీడిపప్పులోని మోనో అన్  సచురేటేడ్ కొవ్వును తగ్గించి గుండెను పదిలంగా ఉంచుతాయి. వాల్ నట్స్ లోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చెడ్డ కొలెస్ట్రాల్ ను గణనీయంగా తగ్గిస్తాయి.

వెల్లుల్లి : 

garlic
garlic
రక్తపోటును, ఎక్కువగా వున్న చెడ్డ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.

సోయా: 

soya
soya
ఎనిమిది రకాల ఆవశ్యక మూలకాలు గల ఒకే ఒక శాకాహార మాంసకృత్తులు సోయాలో వున్నాయి. సోయా మాంసకృత్తులు రోజూ తీసుకుంటే కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. రక్తం నుండీ కొలెస్ట్రాలును విసర్జించే లివర్ శక్తిని పెంచుతుంది. సోయా చిక్కుల్లలో విటమిన్ b3, b6, E , ఉన్నాయి.

ఓట్ మీల్ (oatmeal) :

ఓట్ మీల్ (oatmeal)
ఓట్ మీల్ (oatmeal)
దీనిలోని బీటా గ్లూకస్ అనే ప్రత్యేక కరిగే పీచుపదార్థం  స్పంజివలె పనిచేసి కొలెస్ట్రాల్ ను గ్రహిస్తుంది.

పొట్టు తీయని గింజలు :

పొట్టు తీయని గింజలు : Unpeeled nuts
Unpeeled nuts
గోధుమ, మొక్కజోన్న  ఓటు ధ్యాన్యం, బార్లీ వీటిలోని 3 పొరలను కలిపి ఏక మొత్తంగా తింటే కొలెస్ట్రాల్ పరిమాణం రక్తపోటు, రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తుంది.


buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top