పురాణాలలో (రాక్షస బల్లులు) డైనోసార్లు - Puranalalo Dinosaursపురాణాలలో (రాక్షస బల్లులు) డైనోసార్లు - Puranalalo Dinosaurs
పురాణాలు డైనోసార్ల గురించి చెప్పలేదా?

విశ్వం ఆవిర్భావం నుండి ఎలా సృష్టి నడిచిందో ఇతిమిద్ధంగా చెప్పగలిగిన ఏకైక వాంగ్మయానికి మనం వారసులం.

సృష్టి, ప్రళయం, పునఃసృష్టి ఈ విధంగా ఒక చక్రంలా తిరుగుతుందని దర్శించి చెప్పినది ఈ ప్రపంచంలో కేవలం మన శాస్త్రమే. నేడు మనకున్న ఈ సైన్సు చూస్తున్నది అతి కొంచెం. ఇంకా ఎన్నో ఎన్నో విషయాలను మనం కనుగొని సరి చూసుకుంటే చివరకు ఇవన్నీ మన వాంగ్మయానికి దగ్గరగా వస్తాయి. ఒకప్పుడు కేవలం మనదోక్కటే గ్రహం, అది కూడా బల్లపరుపుగా ఉందని నమ్మింది ఈనాడు మనం చెప్పుకుంటున్న సైన్సు. కాదు భూగోళం అని, మన చుట్టూ ఎన్నో గ్రహాలూ ఉన్నాయని, సూర్య చంద్రులు ఉన్న మన సౌరకుటుంబం అని , ఇటువంటి లోకాలు కొన్ని కోట్లు ఉన్నాయని చెప్పింది మన శాస్త్రం. నేటి సైన్సు గత కొన్ని దశాబ్దాలుగా పరిశోధించి ఇది నిజమని నమ్ముతోంది. ఇలా ఒక ప్రవాహంలా సాగుతుంది కనుక మనది కాలచక్రం అన్నారు. ప్రళయం సంభవించి అంతా మునిగిపోయి మరల పునఃప్రారంభం అవుతుందని చెబుతుంది.

ప్రస్తుత సాంకేతిక జ్ఞానం అంతవరకు ఇంకా ఎదగలేదు కానీ రమారమి అక్కడవరకు వెళ్తోంది. ఇలా కొత్త కొత్త విషయాలు కనిపెట్టినప్పుడు మన వాంగ్మయం మీద మనకు నమ్మకం మరింత ఇనుమడిస్తోంది. అయినా కొందరు “అన్నీ వేదాలలో ఉన్నాయిష” అంటూ వెటకారాలు చేస్తూనే ఉన్నారు. దారిలో ఎన్ని కుక్కలు మొరిగినా రాచనడక నడిచే ఏనుగుకు ఏమీ కాదు. మన పురాణాల ప్రాభవానికి ఇటువంటి శునకాల అరుపులు వలన ఏమీ కళంకం రాదు.

ఇక మన సృష్టి క్రమం గురించి ఇంచుమించు అన్ని పురాణాలు చెబుతాయి. ఉదాహరణకు భాగవతం తీసుకుంటే మూడవ స్కంధంలో ఈ మనువులు, మన్వంతరాలు, ప్రళయాలు ఇతర విషయాలు కూలంకషంగా చర్చించింది. 

కొంత తార్కికంగా ఈ విషయాన్ని పరిశీలిద్దాం:
  • ✸ ఒక మన్వంతరం = 71 మహాయుగాలు. మనం ఇప్పుడు 28వ మహాయుగంలో ఉన్నాము.
  • ✸ ఒక మహాయుగం = 4 యుగాలు. ( సత్య/ కృత + త్రేతా + ద్వాపర + కలి ). మనం ఇప్పుడు కలియుగం లో ఉన్నాము.
  • ✸ సత్యయుగం = 1,728,000 మానవ సంవత్సరాలు (మహాయుగం లో 40% )
  • ✸ త్రేతాయుగం = 1,296,000 మానవ సంవత్సరాలు ( మహాయుగంలో 30% )
  • ✸ ద్వాపరయుగం = 864,000 మానవ సంవత్సరాలు ( మహాయుగంలో 20% )
  • ✸ కలియుగం = 432,000 మానవ సంవత్సరాలు ( మహాయుగంలో 10% )
  • ✸ 1 మహాయుగం = 4,320,000 మానవ సంవత్సరాలు
  • ✸ 1 మన్వంతరం = 71 * 4,320,000 = 306,720,000 మానవ సంవత్సరాలు
  • ✸ ఇప్పుడు 28వ కలియుగం నడుస్తోంది. లెక్క ప్రకారం 27.9 * 43,20,000 = 12,05,28,000 సంవత్సరాలు గడిచాయి ఈ మన్వంతరంలో. మనువు కు మనువుకు మధ్య ఉన్న సంధికాలం 2,59,20,000 సంవత్సరాల ప్రళయం కలుపుకుంటే
  • ✸14,64,48,000 సంవత్సరాలు గడిచాయి పూర్వపు మన్వంతరం చాలించాక. ఈ ప్రళయం తరువాత మరల పునఃసృష్టి జరుగుతుంది.
ఈ మనువుల సృష్టికి పూర్వం రుద్రులు సృష్టి చేసారు. భాగవతం తృతీయ స్కంధం చెబుతుంది. వారి సృష్టి వలన భయంకరమైన జీవులు ఉత్పత్తి చెంది అల్లకల్లోలం చెయ్యడం తో బ్రహ్మ వారిని సృష్టి చెయ్యడమ మానమని తపస్సు చేసుకోమని చెప్పగా వారు తపస్సు కోసం వెళ్ళిపోయారు అని. అటువంటి సృష్టిలో ఆ జీవులు ఎలా ఉన్నాయంటే కేవలం పెద్ద పెద్ద ఆకారాలతో భయంకరాకృతితో సృష్టిని భీతిల్ల చేసాయి అని చెబుతుంది. అటుపై మనుసృష్టి జరిగిందని చెబుతుంది. ఇలా మన్వంతరాలు జరిగి కల్పం మారుతూ ఉంటుంది.
బ్రహ్మ
బ్రహ్మ
ఇక నేటి టపా విషయానికి వద్దాం. డైనోసార్లు అంటే రాక్షసబల్లులు కొన్ని million సంవత్సరాల క్రితం ఉండేవి అన్నది నమ్మవలసిన నిజం. తవ్వకాలలో ప్రపంచం నలుమూలలా వీటి అస్తిపంజరాలు దొరకడం వాటి ఆకారం ఇదని మనకు మ్యూజియం లో పెట్టడం వాటి మీద సినిమాలు అన్నీ చూసాం. అసలు దీనికి సంబంధించి నేషనల్ జియోగ్రాఫిక్ అన్న వారు బాగా పరిశోధించి ఇవి సరిగ్గా 165 మిలియన్ సంవత్సరాల క్రితం వాటి ఉనికి ఉండేది అవి ఒక 70 మిలియన్ సంవత్సరాల పూర్వం అంతరించాయి అని ఊహ చేస్తున్నది. https://www.nationalgeographic.com/science ఇవన్నీ కూడా కేవలం approximations మాత్రమె. అందునా ఇవన్నీ కూడా బయటనుండి పెద్ద ఉల్కాపాతం రావడం వలన అన్నీ ఒకసారి అంతరించాయని ఒకరి ప్రతిపాదన. అదే నిజమని నమ్ముతారు.

అంత పెద్ద ఉల్కాపాతం గుండ్రంగా ఉన్న భూమి అన్ని వైపులనుండి ఒకేసారి వచ్చి అన్ని మూలల్లో ఉన్న అన్ని జంతువులను ఒకసారి చంపెసాయా? సరే అలాగే వచ్చి చంపాయి అనుకుందాం. అన్ని మరల జీవులు ఎక్కడనుండి వచ్చి బతికాయి? మరొక రీసెర్చ్ ప్రకారం అవి బతకలేక కొన్ని చిన్న బల్లుల్లా అయ్యాయని, కొన్ని చేపల్లా అయ్యాయని, కొన్ని ఏనుగులు అయ్యాయని, డార్విన్ law ప్రకారం చెబుతారు. కానీ ఇవన్నీ కూడా కేవలం proposal మాత్రమె. నిజమని ఎవరూ చెప్పలేరు. నిన్న మొన్నటి వరకు బిగ్ బాంగ్ జరిగి ఈ ప్రపంచం వచ్చింది. ఈ బ్రహ్మాండం వయసు 13.8 బిల్లియన్ సంవత్సారాలని మొన్నటివరకు నమ్మింది, నేడు అంతకన్నా పురాతనమైన నక్షత్రాన్ని గుర్తించాక మొత్తం ఆ థియరీ తప్పేమో అని తలలు పట్టుకున్నారు. https://www.express.co.uk ఇటువంటి మరిన్ని పరిశోధనలు జరగాలి, ఇంకా ఎన్నో విషయాలు వెలుగులోకి రావాలని కోరుకుందాం.

ఇప్పుడు సైన్సు చెబుతున్న విషయాలని మన పురాణాలు చెబుతున్న నిజాలతో బేరీజు వేసుకుందాం. ఈ మన్వంతరం మొదలవడానికి పూర్వం అంటే 146 మిలియన్ సంవత్సరాల పూర్వం ఆ రుద్ర సృష్టి ఉండవచ్చును. అవి భయంకరమైన ఆకృతులతో ఈ భూమి మీద నడచి ఉండవచ్చును. తరువాత ప్రళయం వలన అవి పోయి మరల పునఃసృష్టి ద్వారా జీవజాలం పుట్టుకువచ్చింది అని మన పురాణం చెబుతుంది. వీళ్ళు చెప్పే 165 మిలియన్ సంవత్సరాలకు ఇంచుమించు ఇది దగ్గరగా ఉంది. ప్రళయం వచ్చినప్పుడు మొత్తం జలమయమై, ఉల్కాపాతం వచ్చి, అగ్నిపర్వతాలు బద్ధలయ్యి ఎన్నో రకాలుగా మొత్తం భూమి మొత్తం ప్రళయం చూస్తుంది. తరువాత కొంత సంధికాలం తరువాత సృష్టి ప్రారంభం అయి ఎన్నో జీవరాశులను సృష్టిస్తాడు బ్రహ్మ ఆజ్ఞతో మనువు. మన వాంగ్మయం ప్రకారం ఇప్పుడు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. నేటి సైన్సు ఇప్పుడు చెబుతున్న నెంబర్ 8.7 మిలియన్ అని. చూసారా నేటి పరిశోధనతో సంబంధం లేకుండా ఎప్పుడో కొన్ని వేలసంవత్సరాల క్రితం ఈ విషయం మనకు పురాణాలలో ఎలా చెప్పారో? ఒక పదేళ్ళక్రితం కేవలం 3మిలియన్ అని చెప్పిన వాళ్ళు నేడు ఈ 8.7 మిలియన్ అని చెబుతున్నారు. సైన్సు అంటేనే రోజూ కొత్తగా కనుక్కోవడం. పురాణం అంటే హిస్టరీ అని మన సృష్టి రహస్యం అని అర్ధం. చివరకు ఎన్ని పరిశోధనలైనా మన వాంగ్మయానికి దగ్గరగా రావలసినదే.

మరొక విషయం ఇక్కడ ప్రస్తావన చేస్తాను. ఈరోజు మనం ఫాస్సిల్ ఫ్యూయల్స్ అంటున్నాం. నేటి సిద్ధాంతం ప్రకారం ఒక 650 మిలియన్ సంవత్సరాల క్రితం చచ్చిన జీవజాలం భూమిలో కలిసిపోయి క్రూడ్ ఆయిల్ రూపంలో, బొగ్గు, ఇతర ఖనిజాల రూపంలో తయారయ్యాయని విజ్ఞాన శాస్త్రం. మరి అప్పట్లో జంతువులు, జీవులు లేకపోయుంటే ఇప్పుడు ఈ ఫ్యూయల్స్ ఉండేవా? మానవ దేహంలో ఎముకలే కొన్ని వేల సంవత్సరాల తరువాత భూమితో కలిసిపోయి మరొకరకంగా రూపాంతరం చెందుతుంది. ఎన్ని మన్వంతరాల నుండి ఈ సృష్టి ఉండి ఉండవచ్చును? ఆ జీవులు ఎన్నో ఈ భూమిలో కలిసిపోయి ఇప్పుడు ఫ్యూయల్ రూపంలో ఫాస్సిల్ రూపంలో మనకు దొరుకుతూ ఉండవచ్చును.
బల్లపరుపు గా ఉన్న భూమి ?
ఆలోచించండి. బల్లపరుపుగా భూమి ఉంది, ఈ భూమి కేవలం ఆరు వేల సంవత్సరాల క్రితం ఒకడు కూర్చుని మూడు రోజుల్లో కుట్టేసాడు, దీపం దొరక్క సూర్యుడిని, చంద్రుడిని పైన అతికించాడు అని చెప్పే కాకమ్మ కధలు నమ్మే గొర్రెలకు ఇంత లోతైన విషయాలు అర్ధం కావడం కష్టం. అటువంటి వారా మన వాన్గ్మయాన్ని పురాణాలను ప్రశ్నించేవారు? వారి ప్రకారం అసలు ఈ రాక్షసబల్లులే ఉండేవి కాదు. 
కానీ మన వైదిక పురాణాల ప్రకారం ఎలా ఉండవచ్చో మనకు అవగాహన ఉంది. నిజంగా పురాణాలలో అన్నీ ఉన్నాయి. మనకే అర్ధం చేసుకునే పరిణతి లేదు. అటువంటి బుద్ధి మనకు ప్రసాదించమని వేడుకుందాం. మన గొప్పదనాన్ని తెలుసుకుందాం, మరింత పరిశోధించి సాధించి అందరికీ చాటి చెబుదాం.

!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!

రచన: హిందు జ్వాల
"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top