కోలాటము పాటలలో: అంగద రావణ సంవాదం - Kōlāṭaṁ pāṭalu: Aṅgada rāvaṇa sanvādaṁ

అంగద రావణ సంవాదం

"సిరిదేవి సీతనూ సెరదెచ్చి నావురా
చెడి పోకు మోరోరి చెవిబెట్టు నా మాట వోరీ
రావణా చెవిబెట్లు నా మాట వోరీ

నా కొల్వు లోపలా నాకు బుద్ధులు జెప్ప
యేపాటి వాడవుర యేరాజు బంటువుర వోరీ
వనచరీ యేరాజు బంటువుర వోరీ

శ్రీరామ బంటుణ్ణి మా రాజు సుగ్రీవులూ
అంగదుడు నా పేరు మా తండ్రి వాలిరా వోరీ
రావడా మా తండ్రి వాలిరా వోరీ

బలశాలి వాలికి సెడ బుట్టి నావురా
పగవాని కొలువులో బానిసల బతుకేల ఓరీ
వనచరీ బానిసల బతుకేల ఓరీ

జగము పాలించేటి జగదీశ్వరుడు
మాపాలి పరమాత్మ పగవాడు గాదురా ఓరీ
రావణా పగవాడు గాదురా ఓరీ

యెక్క గుర్రాలిస్తు యేనుగలనిస్తురా
యేల ఋూమూలిస్తు యెలనాగ లిస్తురా ఓరీ
వసచరీ యెల నాగలిస్తురా ఓరీ

కోటాన కోట్లుగా కోటి దండు దళము
కోదండ రాములూ కదిలివాస్తారు ఓరీ
రావణా కదిలివొస్తా రోరీ

నల్ల జీమల్లట్ల నరుల సలిపేపిస్తు
కోతిమూళల జంపి గోరీలు కట్టిస్తురా ఓరి
వనచరీ గోరీలు కట్టిస్తురా ఓరీ

సంకలనం: ఆరతీమూర్తి 

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top