అనాయాస మరణము – ఆయాస మరణము: Maranamu

0
యమరాజు నచికేత ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చుట
యమరాజు నచికేత ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చుట 
అనాయాస మరణము – ఆయాస మరణము
మంత్రేశ్వర ఫలదీపికాయాం – చతుర్ధశోz ధ్యాయే – శ్లోకం -21 

సౌమ్యాంశకే సౌమ్య గృహేzధ సౌమ్య సంబంధ గే వా క్షయ భేక్షయేశే
అక్లేశ జాతం మరణం నరాణాం వ్యస్తే తధా క్రూర మృతిం వదంతి.

   అను ప్రమాణము వల్ల క్షయ భావము గానీ, క్షయాధిపతి గానీ సౌమ్యులయిన పూర్ణ చంద్ర, బుధ, గురు, శుక్ర గ్రహముల సంయోగ విలోక నాధులు పొందినప్పుడు గానీ, క్షయ స్థానమున వున్నప్పుడు గానీ సునాయాస మరణము మానవులకు కలుగును.

మోక్ష స్థానమున యుక్తులుగా శుభులు యున్న ముక్తియు కలుగును. ముక్తి యందు పాపులున్నను ముక్తి విహీనుండు యిలలో ముదముగ రామా ||

   ఈ విధముగా క్షయ భావ మనగా పన్నెండవ యిల్లు, ఇదియే మోక్ష స్థానము, వ్యయ స్థానము రెండునూ. ఇట్టి వ్యయాధిపతి పాపుడాయి శుభ సంయోగ విలోక నాధులు లేనప్పుడు ప్రబల పాప సంయోగ విలోకనాదులు పొందినప్పుడు దీర్ఘ కాల రోగ మరణములు, ఆయాస మరణములు, సమూహ మరణములు, అగ్ని మరణములు, జల మరణములు, ప్రబల శత్రువుల చే చిత్రవధతో కూడిన పలు విధములగు దుర్మరణములు పాపులకు సంభవించును వారి వారి పూర్వ కర్మాను సారముగాను.
కనీసము వ్యయాధి పతి, అంశయందైనను శుభ క్షేత్ర, శుభ సంయోగములను పొందిన గాని అనాయాస మరణము కలుగదు. ప్రబల పాప స్థితి సంయోగ విలోక నాధుల చేత రైలు ప్రమాదములు, విమాన ప్రమాదములు, ఓడ ప్రమాదములు, కారు, సైకిలు ప్రమాదములు, బండ్ల ప్రమాదములు కలుగును.
    జాతక చక్రము లోని దోషములను తెలుసుకొని, ఆయా గ్రహములకు శాంతి చేయించుకొని, ఇష్ట దేవతారాధన మరియు గురువును ప్రార్ధించ వలయును. గురువు ఒక్కడే అన్ని ప్రమాదముల నుంచి కాపాడ గలడు.

రచన:  శ్రీ భాస్కరానంద నాథ

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top