శ్రీ మందేశ్వర (శనేశ్వర) స్వామి - Sri Mandeswara (Saneswara) Swamy Temple

శ్రీ మందేశ్వర (శనేశ్వర) స్వామి - Sri Mandeswara (Saneswara) Swamy Temple

మందపల్లి క్షేత్ర ప్రాంతమున పదునాలుగువేల నూట ఎనినిది పుణ్యతీర్థములు గలవు. వీటిలో ప్రధానమైనవి అశ్యర్ధ తీర్ధము, అగస్యతీర్దము, సాత్రిక తీర్దము, యాగ్నిక తీర్దము, సానుగ తీర్దము మొదలగునవి ముక్యమైనవి.

పూర్వకాలము నందు మేరు పర్వతముల స్పర్థ వహించి అంతకంటె ఉన్నతముగా యుండవలయనను వింధ్యపర్వతము విపరీతముగ పెరగచొచ్చెను. ఇట్లు వింధ్య పర్వతము మిక్కుటముగా పెరుగుచుండుటచే భారతవర్షమున ఉత్తర దక్షిన భాగములయందు సూర్యకిరణ ప్రసారము చక్కగా ప్రసరించదని భయమేర్పడజొచ్చెను. అంతట దేవతలు, ఋషి పుంగవుడగు అగస్త్య భగవానుని వద్దకు వచ్చి వింధ్యపర్వతము యొక్క పెరుగుదలను నిలుపుటకై ప్రార్దించిరి. అంతట ఆ లోపాముద్రాపతియగు అగస్త్య మహర్షి వేయి మంది మహర్షులతో గూడి కొనినవాడై వివిద పశు జాతులతోను, బహు మృగ గణములతోను అనేక విచిత్ర వృక్ష సంకులమై సూర్య గతిని నిరోధింప నిశ్చయించి మేరు పర్వతము నతిక్రమింప తలపెట్టిన ఆ వింధ్య పర్వతమును చేరును.

అంతట ఆ పర్వతరాజు బహు ఋషీగణ సమేతుడగు అగస్త్య భగవాసుని సాష్టాంగ ప్రమాణంబులు చేసి అర్ఫ్యపాద్యాదులు నర్పించి అతిధి సత్కారంబులచే సంతుష్టుని చేసెను. అంత అగస్త్యముని పుంగపుడు అతిధి సత్కారంబులచే సంతుష్టతరంగుడై ఆ పర్వత శ్యేష్టుడగు వింధ్యుని ప్రశంసించి దేవ కార్యమును మనసు నందుంచుకొని ఇట్లు పలికెను. హే! పర్వత శ్రేష్టుడా నేను మహా జ్ఞానులగు మహర్షులతో గూడ దక్షిన దిక్కునకు తీర్ధయాత్రకై బయలుదేరితిని.నాకు మార్గమునిమ్ము. నేను తిరిగి ఉత్తర దిక్కునకు వచ్చు పర్యంతము నీవు పెరగకుండగా యిట్లే నుండవలెను. దీనికి భిన్నముగా చేయరాదు అని చెప్పగా ఆ పర్వత శ్రేణుడు సరేనని యట్లే నుండిపొయెను.ఆ ఋషి సమూహముతో గూడుకొని అగస్త్యమహర్షి దక్షిణ దిక్కునకు వెడలెను. పిమ్మట క్రమముగా సత్రయాగమును చేయుటకై గౌతమీ నదీ తీరమునకు చేరి సంవత్స్రము సత్రయాగము చేయుటకు దీక్షితుడయెను.

అంతట ఆ సమయమున కైటభుడనే రాక్షసుని కొడుకులగు ధర్మకంటకులు మహాపాపులునగు అశ్వర్ధుడు పిప్పలుడు యను యిరువురు రాక్షసులు డేవలొకములో కూడా ప్రసిధ్ధి చెందినవారై యుండిరి. వారిరువురిలో అశ్వర్ధుడు రావిచెట్టు రూపములను పిప్పలుడు బ్రాహ్మణరూపములోను యుండి సమయమును జూసియజ్ఞమును నాసనమొందిచుటకై పాపబుద్దిగలవారై రావిచెట్టు రూపములోనున్న అశ్వర్ధుడు ఆ వృక్షఛాయనా శ్రయించుటకు వచ్చిన బ్రాహ్మణులను దినుచుండెను. సామవేదము నేర్చుకొనుటకు వచ్చిన శిష్యగణంబులను భక్షించుచుండెను. అంతట దిన దినము బ్రాహ్మణులు క్షీణించుటను చూచి వృద్ధులగు

మహర్షులు గౌతమీ దక్షిణ తాటమున నియత వ్రతుడై తపస్సు నాచరించుచున్న సూర్యపుత్రుడగు శనిని చూచి ఈ ఘోరమగు రాక్షస కృత్యములను నివేదించి, ఈ రాక్షసుల నిరువురిని వధించమని కోరిరి. అప్పుడు ఆ శని ఋషులతో నిట్లు పలికెను. నేను ఇప్పుడు నియతవ్రతుడనై తపస్సు చేయుచున్నాను. నా తపస్సు పూర్తి కాగనే రాక్షసుల నిరువురిని వధించెను అని పలికెను. నియత వ్రతుడై తపస్సు నాచరించుచున్న సూర్యపుత్రుడగు శనిని చూచి ఈ ఘోరమగు రాక్షస కృత్యములను నివేదించి, ఈ రాక్షసుల నిరువురిని వధించమని కోరిరి. అప్పుడు ఆ శని ఋషులతో నిట్లు పలికెను. నేను ఇప్పుడు నియతవ్రతుడనై తపస్సు చేయుచున్నాను. నా తపస్సు పూర్తి కాగనే రాక్షసుల నిరువురిని వధించెను అని పలికెను. అంతట మహర్షులు మేము మా తపస్సులను నీకిచ్చెదము నీవు వెంటనే ఆ రాక్షసులను సంహరింపమనిరి. ఈ విధంగా ఋషులచె చెప్పబడిన శని అట్లయిన రాక్షస సంహరము పూర్తి అయినట్లేనని ఋషులతో పలికి బ్రాహ్మణ వేషమున దాల్చి వృక్షరూపముగ నున్న అశ్వర్ధుడు వద్దకు వెల్లి ప్రదక్షినములు చేయనారంభించెను. అంతట అశ్వర్ధుడు రాక్షసుడు ఈ శనిని మామూలు బ్రాహ్మణుడే యనుకుని అలవాటు చొప్పున మ్రింగివేసెను. అప్పుడు శని ఆ రాక్షసుని దేహమును ప్రవేసించి రాక్శసుని ప్రేవులను త్రెంచివేసెను. ఆ పాపాత్ముడగు రాక్షసుడు సూర్యపుత్రుడగు శనిచే త్రెంచెబడిన ప్రేగులు గలవాడై క్షణమాత్రములో మహా వజ్రాహితు వలె భస్మి భూతుడాయను యిట్లు అష్వర్ధుని భస్మము గావించి బ్రాహ్మన వేశమున గల రెండవ రాక్షసుడగు పిప్పలుని వద్దకు సామవేదము నబ్యసిఅమ్చుటకు వచ్చినా బ్రహ్మణ వటరూపమున శిష్యుని వలె వినయపూర్వకముగా వెళ్ళెను.

అంతట పాప నిలయుడగు ఆ పిప్పలుడు ఈ సూర్య పుత్రుడగు సనిని అలవాటు ప్రకారముగా భక్షించెను. అంతట సని ఆ రాక్షసుని ప్రేవులు కూడా చూచిన మాత్రముననే ఆ రాక్షసుడు భస్మమాయెను. ఆ యిరివురి రాక్షసులను సంహరించిసని యింకేనేమి చేయవలయునని ఋషులతో పలకగ ఆ మహర్షులందరు సంతుస్థాంగరంతులైరి. ప్రసన్న చేతస్కుల అగస్త్యాది మహర్షులందరు సనికి ఇచ్చి వచ్చిన వరములనిచ్చిరి.సంతుష్టుడై సనిగూడ బ్రాహ్మణులతో నిట్ల పలికెను.

నా వారము ఏ జనులైతే నియతవ్రతులై అశ్వత్ధవృఉక్షమునకు ప్రదక్షిణము చేయుదురో వారి కోరికలన్నియు నీరేడును. వారికి నా పీడ కలగదు. ఈ అశ్వత తీర్ధము ఈ శనైశ్చర తీర్ధములను ఎవరైతే స్నానము చేయుదురో వారు సమస్త కార్యములు తీర్ధములు నిర్విఘ్నముగా కొనసాగును. సనివారము రోజున అశ్వద్ధ ప్రదక్షిణములు చేసిన వార్కి గ్రహపీడ కలుగదు. ఈ తీర్ధమునందు స్నానదానము చేసిన హేమదాన ఫలము లభించును అని సని వరములను యిచ్చెను. అప్పటి నుండి ఈ ప్రదేసము నందు అష్వత్ధతీర్ధము, పిప్పళ తీర్ధము, సానుగ తీర్ధము, అగస్త్యతీర్ధము, సాత్రికతీర్ధము, యగ్నిక తీర్ధము, సాముగ తీర్ధము నొదలగుగా గల పదునాలుగువేల నూట ఎనిమిది తీర్ధములు అనేకమంది ఋషులచేతను, దేవతల చేతను, కల్పించబడి ప్రసిద్ధి చెందిన స్నాన జపపూజాదులను స్వల్ప భక్తజనులకు సమస్త కార్యసిద్ధులు చేకూర్చిన సతయాగ ఫలము లభింపచేయుచున్నవి.

యిచ్చట ఈసనిసామగాన కోవిందులగు బ్రాహ్మణ సంతతి వారగు రాక్షసులను సంహరించి బ్రహ్మ హత్య దోష పరిహారముకై లోక సంరక్షణకై సర్వలోకేశ్వరుడగు సర్వదురిత సంహారకుడగు, కరుణామయుడగు శివుని ప్రతిష్ట చేసెను. తనచే ప్రతీష్టింపబడిన శివునికి నువ్వులను అభిషేకము జరిపించిన వార్కి సమcత కోరికలు నీడేరునట్లుగను తన బాద యితర గ్రహపీడ మొదలైనవిలేకుండునట్లగను శని వరములు నిచ్చెను. అంతట శనిచే ప్రతిష్టింపబడిన ఈశ్వరునికి శనేశ్వరుడనియు కూడా ప్రసిద్ధ నమాంతరము కలిగెను. పిమ్మట ఈ మందేశ్వరునికి మందేశ్వరుని ప్రక్కనే సప్తమాత్రుకల వచ్చి శ్రీ పార్వతిదేవిని ప్రతిష్టించిరి. ఈ ఈశ్వరునికి బ్రహ్మేశ్వరుడని పేరు. దీనికి ప్రక్కనే అష్ట మహానాగులలో ఒకడగు కర్కోటకుడను నాగుచే ప్రతిష్టింపబడిన ఈశ్వరునికి నాగేస్వరుడని పేరు. ఈ పక్కనే సప్త మహర్షులలో నొకడగు గౌతమి మహర్షిచే ప్రతిష్టింపబడిన శ్రీ వేణుగొపాలస్వామి మూర్తి కలదు. మొత్తము మీద ఒకే పెద్ద ప్రాకారము నందు వరుసగా ఐదు దేవాలయములు కలిగి భక్తి జనాహ్లాదకరముగా నుండును. పూజాతత్పరులకు సమస్త భక్తులకు సమస్త కోరికలు నీరేడుటయే గాక అంత్య కాలము నందు మోక్షసామ్రాజ్యము నొందెదురు.

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top