తర్కము - నమ్మకము - Tharkam, Nammakam

తర్కము - నమ్మకము - Tharkam, Nammakam
గురు-శిష్యులు 

తర్కము - నమ్మకము

"యద్ భావం తద్ భవతి "
మన భావాన్ని అనుసరించి మనముంటాము. 

పూర్వ గ్రంధాలలో రాసినదంతా ఆచరణీయం కాకపోయినా, ఆ గ్రంధాల కాలాన్ని బట్టి, వాటిలో నాయకులు అనుసరించిన మార్గం అనుసరణీయం. మిగిలిన పాత్రలన్నీ వాటి గుణగణాల ద్వారా నాయకునికి అనుకూలంగానో, వ్యతిరేకం గానో వ్యవహరిస్తాయి.  అక్కడ చిన్నగీత, పెద్ద గీత పద్దతి ఉండచ్చు, లేదా అన్ని గీతలు కలిసే మహబిందువు కధానాయకుడు అవ్వచ్చు.   గెలిచిన వారిని అనుసరించటం వల్ల ఏ మార్గాన వెళితే విజయం లభిస్తుందో తెలుస్తుంది.  ఓడిన వారిని అనుసరిస్తే ఏ మార్గాన పోకూడదో మాత్రమే తెలుస్తుంది. వారిది "నేతి, నేతి " (ఇది కాదు, ఇది కాదు ) పద్దతి. తిప్పి ముక్కు ఎక్కడుందో చూపించటమన్నమాట.  నాయకులను అనుసరించే వారిది "ఇతి, ఇతి "(ఇదే, ఇదే ) పద్దతి. వీరు ముక్కుసూటి వారు. తొందరగా గమ్యాన్ని చేరతారు . 

నేతి వారు కొంచం నెమ్మదిగా చేరతారు. ఈ పయనములో నేతి వారు ఎక్కువ శక్తిని ొల్పోతారు, అన్నిమార్గాలను పరిశీలించుకొంటూ ముందుకు వెళ్ళాళ్సి రావటం వల్ల. ఇతి వారు నమ్మకముతో ఒకే మార్గములో ముందుకు దూసుకు వెళతారు.  ఈ రెండు మార్గాలను మనం నమ్మకం, తర్కం అని అంటాము. నమ్మకం భద్రతను, మానసిక శాంతిని సూచిస్తే, తర్కం అశాంతిని దూరం చేసుకోవటానికి మనిషి తన పరిధిలో ప్రయత్నించటాన్ని తెలియచేస్తుంది.  నమ్మకములో ఇతరుల అనుభవాన్ని ప్రాతిపదికగా తీసుకొంటే, తర్కంలో తన పరిధి లో సమాధానాలు వెతికే ప్రయత్నం కనిపిస్తుంది. 

మరి రెండింటిలో ఏ దారిన వెళ్ళాలి ? 
మన తర్కాన్ని అనుసరించి గమ్యానికి తగిన నాయకుడినో, గురువునో మన పరిధిలో పరిక్షించి, ప్రశ్నించి మనసుకు తృప్తి కలిగిన తరువాత వారిపై నమ్మకంతో అనుసరించాలి. ఇదే గురు (పెద్దదైన, గొప్పదైన) మార్గం. ఈ మార్గాన్నిఅనుసరించినవారే విజయాన్నిఅవలీలగా కైవశం చేసుకోగలరు .

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top