ద్వాదశ ముహూర్త శుద్దులు - Dwadasa Muhurtamulu

0
ద్వాదశ ముహూర్త శుద్దులు - Dwadasa Muhurta
ద్వాదశ ముహూర్త శుద్దులు !

ద్వాదశ ముహూర్త శుద్దులు

ఏ శుభ కార్యానికైనా ముహూర్తం పెట్టేటప్పుడు లగ్నం బలంగా ఉండాలి.ఏ ముహూర్త లగ్నానికి అయిన అష్టమ శుద్ది ఉండాలి. ఏ శుభ కార్యానికి ముహూర్తం పెడుతున్నామో ఆ శుభకార్యానికి వర్తించే గ్రహం ముహూర్త లగ్నంలో అస్తంగత్వం చెందకూడడు.ఆ గ్రహ వర్గోత్తమం చెందితే మంచిది. 
ఉదా:- వివాహానికి శుక్రుడు కారకుడు. కాబట్టి వివాహ ముహూర్తంలో శుక్రుడు అస్తంగత్వం చెందకూడడు.శుక్రుడు వర్గోత్తమం చెందితే మంచిది.లగ్నానికి గురు దృష్టి మంచిది.
 • లగ్నశుద్ది:  నామకరణం, నిషేకం, గర్భాదానం మొదలగు వాటికి లగ్నశుద్ది ఉండాలి.ముహూర్త లగ్నంలో ఏ గ్రహ ఉండరాదు.కానీ కాళిదాసు మాత్రం లగ్నం నందు గురువు ఉన్నచో ముహూర్తం పనికి వచ్చును అని,మరియు శుభమనియు చెప్పియున్నారు.కావున ముహూర్త లగ్నం నందు గురువు తప్ప మిగిలిన గ్రహాలు ఉండరాదని తెలియజెప్పినాడు.
 • ద్వితీయ భావ శుద్ది: ధన సంబందమైన,రాజీ ప్రయత్నాలు,మొదలైన వాటికి ద్వితీయ శుద్ది ఉండాలి.ద్వితీయానికి రాహు సంబందమున్నచో పుడ్ పాయిజన్ అవుతుంది. తృతీయ భావ శుద్ది:-పుంసవనం,సీమంతం,వ్యాపార ముహూర్తాలకు,సోదరుల మద్య ఆస్తి పంపకాలకు తృతీయ శుద్ది ఉండాలి.
 • చతుర్ధభావశుద్ది: గృహ సంబందమైన ముహూర్తాలకు, శత్రు దర్శనానికి చతుర్దశుద్ది ఉండాలి.
 • పంచమభావ శుద్ది: సంతాన విషయాలకు ,ప్రయాణాలకు ,ఉపనయనానికి పంచమశుద్ది ఉండాలి.
 • షష్టమ భావశుద్ది: క్రయ విక్రయాలకు,వడ్డీ వ్యాపారాలకు,జమ ఖర్చులు వ్రాసుకునేవారికి షష్టమ శుద్ది ఉండాలి.
 • సప్తమ భావశుద్ది: వివాహానికి సప్తమశుద్ది ఉండాలి.
 • అష్టమ భావశుద్ది: అన్నీ శుభకార్యాలకు అష్టమ శుద్ది ఉండాలి.
 • నవమ భావ శుద్ది: రాబోవు సంతానం మంచిగా ఉండటానికి శ్రీమంతం చేయటానికి నవమ శుద్ది ఉండాలి.
 • దశమ భావ శుద్ది: కర్మాభావం చేసే ప్రతి పని మంచిగా ఉండాలి.పనిచేయాలంటే శక్తి కావాలి.శక్తి ఆహార పదార్ధాలద్వారా వస్తుంది.అన్నప్రాశనకు,పనులు చేయటానికి దశమ శుద్ది ఉండాలి.ద్వితీయానికి, ద్వితీయాధిపతికి రాహుగ్రహ సంభందం ఉన్నప్పుడు అన్నప్రాశన చేయకూడదు.
 • లాభభావశుద్ది: పట్టాభిషేక ముహూర్తానికి ,ప్రమాణ స్వీకార ముహూర్తానికి లాభ భావ శుద్ది ఉండాలి. పార్లమెంట్ 11 వభావం సూచిస్తుంది.రవి ప్రభుత్వం కాబట్టి లాభంలో రవి ఉంటే మంచిది.
 • వ్యయభావ శుద్ది: శయ్యా సుఖానికి ,గృహారంభ,గృహ ప్రవేశాలకు,దీక్షా మొదలగు వాటికి ద్వాదశ భావ శుద్ది ఉండాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top