12గురు ఆళ్వార్లు మరియు వారి వివరములు !

0
alvarlu-alvars-and-details


ఆళ్వారులు వారి వివరములు:

పరమేశ్వరుడు కలియుగం ప్రారంభమైన తర్వాత కలి ప్రభావంతో కలియుగము లో మానవులు ధర్మమార్గమును అనుసరించుటకు అనువైన పద్దతులను అందులోని ధర్మసూక్ష్మాలను మానవ జాతికి అందించడానికి మరియు కలియు గంలో ధర్మము నాలుగు పాదముల మీదకాక ఒంటికాలిమీద కుంటి నడక నడుస్తుందని ధర్మదేవతకు మరియు సనాతన ధర్మములకు వాటి ఆచరణము లకు విపరీతమైన విఘాతములు జరుగగలవని ఆ శ్రీమన్నారాయణుడే 12 మంది ఆళ్వారులుగా ఈ భూమిపై జన్మించి ఎంతో భక్తి బోధనలు చేశారు.
విష్ణు చిత్తులైన ఆళ్వార్లు విష్ణు భక్తిని విష్ణువుయొక్క గుణగణములను, గుణగానము చేయుచూ ఈ కలియుగములో ధర్మాచరణములకు పునర్జీవం పోశారు.
1. శ్రీ పూదత్తా ఆళ్వారులు :-
శ్రీ మహావిష్ణువు యొక్క కౌమోదికి అనబడే(శ్రీ మహావిష్ణువు యొక్క గద) అంశతో క్రీII పూII7వ శతాబ్దములోద్రవిడ దేశంలో మైలపోరిఅనే గ్రామములో జన్మించారు.

2. శ్రీ పొయ్ గై ఆళ్వారులు :-
శ్రీ మహావిష్ణువు యొక్క పాంచజన్యము యొక్క అంశతో క్రీIIపూII7వ శతాబ్దములో ద్రవిడ దేశంలో కాంచీపురం అనే గ్రామములో జన్మించారు.

3. శ్రీ పేయాళ్వారులు:-
శ్రీ మహావిష్ణువు యొక్క నందకము యొక్క అంశతో క్రీII పూII 7వ శతాబ్దములో ద్రవిడ దేశంలో మైలాపూరు అనే గ్రామములో జన్మించారు.

4. శ్రీ పెరియాళ్వారులు:-
శ్రీ మహావిష్ణువు యొక్క గరుత్మంతుని అంశతో క్రీIIపూII 9 వ శతాబ్దములో ద్రవిడ దేశంలో శ్రీ వళ్ళి పుత్తూరు అనే గ్రామములో జన్మించారు.

5. శ్రీ తిరుమళిశై ఆళ్వారులు:-
శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనచక్రము యొక్కఅంశతో క్రీIIపూII 7వ శతాబ్దము లో ద్రవిడ దేశంలో తిరుమళిశై అనే గ్రామములో జన్మించారు.

6. శ్రీ కులశేఖర్ ఆళ్వారులు:-
శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలము పై ఉన్నకౌస్తుభము అనే మణి యొక్క అంశతోక్రీII పూII8వ శతాబ్దములో ద్రవిడ దేశంలో తిరువంజికొళ్లం అనే గ్రామములో జన్మించారు.

7. శ్రీ తిరుప్పాణి ఆళ్వారులు:-
శ్రీ మహావిష్ణువు యొక్క హృదయము నందు గల శ్రీవత్సము అనే చిహ్నం యొక్క అంశతో క్రీIIపూII 8వ శతాబ్దములో ద్రవిడ దేశంలో ఉరైయూర్ అనే గ్రామములో జన్మించారు.

8. శ్రీ తొందరడి ప్పొడి ఆళ్వారులు:-
శ్రీ మహావిష్ణువు యొక్క వనమాల అంశతో క్రీII పూII 8వ శతాబ్దములో ద్రవిడ దేశంలో తిరుమన్డన్ గుడి అనే గ్రామములో జన్మించారు.

9. శ్రీ తిరుమంగై ఆళ్వారులు:-
శ్రీ మహావిష్ణువు యొక్క సంగీత వాయిద్యమైన సారంగి యొక్క అంశతో క్రీIIపూII 8వ శతాబ్దములో ద్రవిడ దేశంలో తిరుక్కురయలూర్ అనే గ్రామములో జన్మించారు.

10. శ్రీ నమ్మా ఆళ్వారులు:-
శ్రీ మహావిష్ణువు యొక్క సేనాధిపతివారగు విష్వక్సేనుని యొక్క అంశతో క్రీII పూII 9వ శతాబ్దములో ద్రవిడ దేశంలో అళ్వార్ తిరునగరి అనే గ్రామములో జన్మించారు.

11. శ్రీ మధురకవి ఆళ్వారులు:-
శ్రీ మహావిష్ణువు యొక్క వాహనమైన గరుడుని (వినత యొక్క కుమారుడైన వైనతేయుడు యొక్క) అంశతో క్రీIIపూII 9వ శతాబ్దములో ద్రవిడ దేశంలో తిరుకొల్లూరు అనే గ్రామములో జన్మించారు.

12. ఆండాళ్(గోదాదేవి):-
శ్రీ మహావిష్ణువు గారి సతీమణి అగు భూదేవి యొక్క అంశతో క్రీII పూII 9వ శతాబ్దములోద్రవిడదేశంలో శ్రీ వళ్ళిపుత్తూర్ అనే గ్రామములో జన్మించారు.

పై విధముగా 12గురు ఆళ్వార్లు విష్ణుఅంశసంభూతులుగా విష్ణు భక్తిని, 64 మంది నాయనార్లు శైవ భక్తికి శివాంశ సంభూతులుగా, ఎనమండు గురు మధ్వాచార్యులు ఈ కలియుగం లో మానవజాతి సముద్దరణకు మానవజాతి మనుగడకు భంగం కలుగకుండా కాపాడుటకు మరియు మానవజాతి ఉద్దరణకు కలిపురుషుని ప్రభావమునకు ఈ జాతి బలికాకూడదని అమాయకులను భగవద్భక్తులను ఉద్దరించుటకు ఈభూమిపై జన్మించినారు .

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top