నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

24, మే 2018, గురువారం

ఓటమి నుంచి గెలుపునకు దారి - Way to success

ఓటమి నుంచి గెలుపునకు దారి - Way to success
గొప్ప వక్త లు చాలా ఈజీ గా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి అని చెప్తారు. అది ఎలాగో ఒక ఉదాహరణ ద్వార చూద్దాం.

ఒక పల్లెటూళ్ళో ఒక టోపీలు వర్తకుడు ఉండేవాడు. తను విశ్రాంతి కోసం ఒక చెట్టు కింద పడుకుంటాడు. లేచే సరికి అతని టోపీలన్ని కోతుల మూక తీసుకుని చెట్టు పై ఉంటాయి. కలత చెందిన తను , ఎం చేయాలో పాలు పోక తల గోక్కోడం చేస్తాడు. ఇంతలో కోతులు కూడా తల గోక్కుంటాయి.వర్తకుడు , కోతులు మనిషి ఎం చేస్తే అవి కూడా అలానే చేస్తాయి అని గ్రహించాడు. వర్తకుడు చాలా తెలివిగా తన టోపి తీసి విసిరిపారేస్తాడు. అన్ని కోతులు కూడా అలానే విసిరేస్తాయి. అన్ని తీసుకుని ఇంటికి బయలుదేరుతాడు. వర్తకుడి తెలివికి కోతులు అవక్కయ్యాయి.

కాలం మారిపోయింది , వర్తకుడు తన మనవడికి జరిగింది చెప్పాడు. కానీ కాలం మరినప్పటికి మనకు జరిగిన సంఘటనలు మళ్ళీ జరగవచ్చు .

ఈసారి కూడా తన మనవడి టోపీలు కోతులు తీసుకుని చెట్టు పైకి వెళ్లిపోతాయి. కానీ వర్తకుడు భయం లేకుండా టోపి తీసి విసిరేస్తాడు. కానీ ఒక కోతి దిగి వర్తకుడి  టోపి తీసుకుని , ఓరి వెర్రి! నాగన్న నీకు తాత ఉన్నట్లే మాకు కూడా తాతలు ఉండరా ఏంటి అని చూసి వెళ్లిపోతాయి. ఈసారి అవాక్కవ్వడం వర్తకుడి వంతయ్యింది.

అందుకని, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే , ప్రయత్నం లో అపజయాలు సాధారణం , కానీ వాటిని మళ్ళీ పునరావృతం కాకుండా తెలివిగా విజయం సాధించాలి.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి
« PREV
NEXT »