నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Tuesday, August 11, 2020

శ్రీ కృష్ణపరమాత్మ కు 16,000 భార్యలు ఎందుకు ఉన్నారు? - Sri krishna and gopikas

Sri krishna and gopikas
శ్రీ కృష్ణపరమాత్మ పదహారు వేల మంది(16000) గొపికలతో క్రీడించాడని అంటారు. ఆయన్ను మంచి వాడు కాదు అన్న విధంగా చూపిస్తారు. అసలు సంగతి తెలియాలి అంటే ముందు కొన్ని తెలుసుకొవాలి.

రామావతారంలో రాముడు మానవుడిగానే జీవించాడు. అది త్రేతాయుగం నాటి మాట. ద్వాపరయుగంలో కృష్ణావతరం పరిపూర్ణావతారం. అంటే కృష్ణుడు పుట్టడమే నాలుగు భుజములతో శంకు చక్ర గదా పద్మములతో పుట్టి సాధారణ మానవుడిగా మారాడు. రాముడు ఏనాడు మాయలు చెయ్యలేదు. కాని కృష్ణుడిగా మాత్రం ఎన్నో లీలలు చేసాడు. ఇది రెండు అవతారాల మధ్య ఉన్న తేడా.

రాముడి వనవాస కాలంలో ఆయన్ను చూసి మహర్షులు సైతం మోహించారట.
*"పుంసాం మోహన రూపాయ"* అని కదా.ఆ సుందరమైన రూపాన్ని చూసిన మహర్షులు ఒక్కసారి కౌగిలించుకోవలని ఉంది రామా అన్నారట.అందుకు రాముడు రాబోయే యుగంలో ఆ అవకాశం ఇస్తానని చెప్పాడు.
  • ద్వాపర యుగంలో వారు అందరూ గొపికలుగా వేషాలు ధరించారు.కృష్ణుడ్ని పతిగా పొందాలని,ఆయన్ను చేరాలని "కాత్యాయని వ్రతం" ఆచరించి అమ్మవారిని వరం అడిగారు.ఇక్కడ కాత్యాయని అంటే అర్దం ఏంటో తెలుసా? ఒక్కప్పుడు ఒక ఆయన మహర్షులందరిని మార్గమేది మార్గమేది అని అడిగేవారు. 
  • మార్గం దేనికి అంటే పరమపదసోపానానికి,శాశ్వతమైన చోటుకి, పరమేశ్వరునిలో ఐక్యానికి.అలా తపించి తపించి ఆయన తాపసి అయ్యారు.
  • జ్ఞానం పొంది జ్ఞాని అయ్యారు.మౌనం వహించి ముని అయ్యారు.తర్వాత మహర్షి అయ్యారు. అప్పుడు ఆయన భక్తికి మెచ్చి జగన్మాత ఆయనకు కూతురుగా "కాత్యాయని"గా వతరించింది.ఆయనకు సత్ మార్గాన్ని చూపించింది.
  • అటువంటి కాత్యాయని దేవిని వారు ఏమి కోరుకున్నారు అంటే కృష్ణపరమాత్మను చేరాలి,ఆయనలో రమించాలి,బ్రహ్మానందాన్ని పొందాలి అని.
  • వరంపొంది ఎవరిని చేరితే ఇక మళ్ళీ జన్మ ఉండదొ అటువంటి స్వామిని వారు పొందారు. కృష్ణుడు ఆత్మస్వరూపుడు.వారికి కృష్ణపరమాత్మకు శారీరిక సంబంధం ఉన్నట్టు ఎక్కడైన ఉందా చెప్పండి. 
  • కృష్ణుడు దేవుడన్న సంగతి అందరికి తెలుసు,కాబట్టి దేవున్ని పరమాత్మను చేరారు తప్ప ఒక వ్యక్తిని కాదు.
ఇంకొక విషయం ఏమిటి అంటే కృష్ణుడు ఎప్పుడు ఏవరిని మోహించాలేదు. అందరు వాసుదేవుడ్నే మోహించారు. కృష్ణుడు గోపికల సహవాసం ఎప్పుడైన కొరుకున్నాడా? కాదు. గొపికలే కృష్ణతత్వంలో ఆనందించి ఆయన కోసం తపించారు.పరమాత్మ దగ్గరకు చేరారు.

కృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి. మహాయోగి.ఆయనే పరమాత్మ.కృష్ణపరమాత్మ పరబ్రహ్మం.మనము ఆత్మస్వరూపం. అదే కదా భగవద్గీత సారాంశం. మనం శరీర పరంగా చూసినప్పుడు మనం స్త్రీ పురుష బేధం ఉంటుంది.కాని ఆత్మ స్త్రీ స్వరూపంగా ఇక్కడ భావించ బడింది. నది సముద్రంలో కల్సిన విధంగా ఆత్మ ఆ సచ్చిదానంద ఘనపరమాత్మలో కలవాలి.ఆ పరమాత్మ పురుష రూపంగా భావించబడింది మన భాగవతంలో. అంటే ఈ లోకంలో అన్నిటిని భరించే భర్త ఒక్క పరమేశ్వరుడే. మిగితా జీవరాశి అంతా ఆయనచే భరించబడుతుంది. అదే తత్వజ్ఞానం.కృష్ణ దర్శనంతొ గొపికలకు కూడా అదే తత్వజ్ఞానం బోధపడింది.అందుకే వారు అన్నిటిని సన్యసించి కృష్ణుడ్నే అంతటా చూసినవారై ఆయనే భర్తని తెలుసుకొని వేరే అన్నిటిని వదిలి ఆ ఆత్మస్వరూపాన్ని తమలోనే ఉందని గ్రహించి,వారిలో ఉన్న ఆ పరమాత్మలో తమను తాము ఐక్యం చేసుకొని బ్రహ్మజ్ఞానాన్ని పొంది బ్రహ్మానందాన్ని పొందారు.అలా వారు ఆ అత్మస్వరూపమైన ఆ తత్వంలోనే రమించారు.శాశ్వతమైన ఆనందాన్ని పొందారు అని ఉందే కాని ఎక్కడా వారు తాత్కాలికమైన సుఖాలను కృష్ణుడి ద్వారా పొందారని ఎక్కడ లేదూ.

మన శరీరం సప్తధాతువులతో,నవరంధ్రాలతో ఉందా లేదా?అటువంటి ఈ శరీరాన్ని అశాశ్వతమని భావించి ఆ శరీరాన్ని అదుపులోకి తెచ్చుకొవడానికి ఎంతో వ్యయ ప్రయాసలకు లోను అవ్వాలి.మొత్తం ఆ నవరంధ్రాలు,సప్త ధాతువులు కలిపి మొత్తం పదహారు.

సంస్కృతంలొ వేలను సహస్రం అంటారు.సహస్రం అంటే అనంతం అని అర్దం.ఈ శరీరాన్ని అదుపులోకి తెచ్చుకోవడమే అనంతమని ఆ పదహారు వాటిని అదుపులోకి తెచ్చుకొని అ పరమాత్మునిలో ఆత్మను లయం చేయడం అని అర్దం.అటువంటి అనంతమైన,అతి కష్టమైన ఈ మార్గాన్ని అనుసరించి కృష్ణపరమాత్మను చేరుకున్న వారు, ఆ గోపికలు అని అర్దం.

అలాగే పంచజ్ఞానేంద్రియాలు,పంచకర్మేంద్రియాలు,పంచ భూతాలు, మనస్సు కలిపి పదహారు (16). అనంతమైన వాటి మాయాను జయించడం కష్టం. అటువంటి వాటిని జయించి ఆత్మస్వరూపమైన ఆ పరమాత్మను ఎరుకలోకి తెచ్చుకొని వాటిని జయించిన వారు ఆయన్ను తమలోనే దర్శించినవారికి ఆత్మానందాన్ని ఇచ్చాడు.ఇప్పుడు పైన చెప్పిన ఆ పదహారు మనలని మాయలో ఉంచే ముఖ్యసాధనాలు.వాటి మాయ చేష్టలు అనేకం.మనం వాటిలో బ్రతికి మాయకు వశులమవుతున్నాం.అటువంటి ఆ పదహారు కూడా ఆపరమాత్ముడ్ని ఏమి చేయలేక ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటాయి అని.

సహస్రశీరుష పురుషః సహస్రాక్షా సహస్ర పాత్ అని పురుష సూక్త వచనం. ఆయనకు వెయ్యి తలలు, కన్నులు, పాదాలు అని అర్దం. అంటే ఆయన అనంతుడు. ఇందాక చెప్పినట్టుగా సహస్రం అంటే అనంతం అని.అనేక విధాలుగా ఉన్న ఆ పరమాత్మ మాయను దాటి ఆయన్ను చేరారు అని అర్దం.

కృష్ణుడు ప్రతి గోపికకు కనిపించాడని భాగవతం చెప్పింది. అంటే పదహారువేల కృష్ణ పరమాత్మలు ఉన్నారా? పదహారు వేలు ఏంటి అంతటా వ్యాపించి ఉన్న ప్రాణశక్తి ఆ పరమేశ్వరతత్వం. ఆ ప్రాణశక్తిని తెలుసుకొని రమించినారు గోపికలు.

చివరిగా ఒకమాట. కృష్ణుడితో ఎవరికి దేహసంబంధం లేదు.ఆయనతో ఉన్నది శరీరాలను నడిపించే ఆత్మ అయిన పరమాత్మ సంబంధం మాత్రమే.

" లోకా సమస్తా🚩 సుఖినో భవంతు..!! "


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి


« PREV
NEXT »

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com