నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

19, ఆగస్టు 2018, ఆదివారం

యోగాలో విధానాలు - Yoga Procedures

యోగాలో విధానాలు - Yoga Procedures

పతంజలి యోగసూత్రాలు
పతంజలి యోగసూత్రాలు నాలుగు అధ్యాయాల సంకలనము. సమాధి పద, సాధన పద, విభూతి పద, కైవల్య పద అనే నాలుగు అధ్యాయాలు. ఇవి మానసిక శుద్ధికి కావలసిన యోగాలు. శరీర ధారుఢ్యానికి, ఆరోగ్య సంరక్షణకి, రోగనిరోధకానికి సహాయపడే శారీరక ఆసనాలను అష్టాంగయోగము వివరిస్తుంది.
 1. సమాధిపద ఏకాగ్రతతో చిత్తవృత్తులను నిరోధించి ప్రమానంద స్తితిని సాధించడము దీనిలో వివరించబడింది.
 2. సాధనపద కర్మయోగాన్ని, రాజయోగాన్నిసాధన చెయ్యడము ఎలాగో దీనిలో వివరించబడినది. ఎనిమిది అవయవాలను స్వాధీనపరచుకోవడం ఎలా అని రాజయోగములో వివరించబడింది.
 3. విభూతియోగము జాగరూకత, యోగ సాధనలో నిపుణత సాధించడమెలాగో దీనిలో వివరించబడినది.
 4. కైవల్యపద మోక్షసాధన ఎలా పొందాలో దీనిలో వివరించబడింది. ఇది యోగశాస్త్రము యొక్క ఆఖరి గమ్యము.
అష్టాంగపదయోగము
1. యమ
 • అహింస హింసను విడనాడటము.
 • సత్యము సత్యము మాత్రమే పలకటము.
 • అస్తేయ దొంగ బుద్ది లేకుండా ఉండటము
 • బ్రహ్మచర్యము స్త్రీ సాంగత్యానికి దూరముగా ఉండటము.
 • అపరిగ్రహ వేటినీ స్వీకరించకుండా ఉండటము.
2. నియమ
 • శౌచ శుభ్రము.
 • సంతోష ఆనందంగా ఉండటము.
 • తపస్య తపస్సు.
 • స్వధ్యాయన అంతర్దృష్ఠి.
 • ఈశ్వరప్రాణిదాన ఈశ్వర శరణాగతి.
3. ఆసన
4. ప్రాణాయామ
5. ప్రత్యాహార
6. ధారణ
7. ధ్యానము
8. సమాధి
ఇవి అష్టాంగపదయోగములోని భాగములు.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి
« PREV
NEXT »