గాయత్రీ మంత్ర మహావిద్య - Gayatri Mantra Mahavidya


గాయత్రీ మంత్ర మహావిద్య - Gayatri Mantra Mahavidya

”న గాయత్ర్యా: పర: మంత్ర: న మాతు: పరా దేవతా ”
గాయత్రీ కంటే గొప్ప మంత్రము, తల్లికంటే గొప్పదేవత సృష్టిలో లేదు.

ఈ గాయత్రీ మంత్రమున ఇరవైనాలుగు అక్షరములతో పాటు ఇరవైనాలుగు దేవతమూర్తుల శక్తి అంతర్హితమై వుంటుందని గాయత్రీ మంత్రోపాసకులు ఈ మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా జపించటం వలన ఆ ఇరవైనాలుగు దేవతల ఆశీస్సులు,శక్తియుక్తులు చేకూరుతాయి

గాయత్రి మంత్రం ఘనాపాఠమ్
ఓం భూర్భువస్సువః తథ్స 'వితుర్వరే''ణ్యం భర్గో' దేవస్య' ధీమహి |
ధియో యో నః' ప్రచోదయా''త్ ||
తథ్స'వితు - స్సవితు - స్తత్తథ్స'వితుర్వరే''ణ్యం వరే''ణ్యగ్^మ్ సవితు స్తత్తథ్స'వితుర్వరే''ణ్యమ్ |
సవితుర్వరే''ణ్యం వరే''ణ్యగ్^మ్ సవితు-స్స'వితుర్వరే''ణ్యం భర్గో భర్గో వరే''ణ్యగ్^మ్ సవితు-స్స'వితుర్వరే''ణ్యం భర్గః' | వరే''ణ్యం భర్గో భర్గో వరే''ణ్యం వరే''ణ్యం భర్గో' దేవస్య' దేవస్య భర్గో వరే''ణ్యం వరే''ణ్యం భర్గో' దేవస్య' |
భర్గో' దేవస్య' దేవస్య భర్గో భర్గో' దేవస్య' ధీమహి దేవస్య భర్గో భర్గో' దేవస్య' ధీమహి |
దేవస్య' ధీమహి ధీమహి దేవస్య' దేవస్య' ధీమహి | ధీమహీతి' ధీమహి |
ధియో యో యో ధియో యో నో' నో యో ధియో ధియో యోనః' ||
యో నో' నో యో యోనః' ప్రచోదయా''త్ప్రచోదయా''న్నో యో యోనః' ప్రచోదయా''త్ |
నః ప్రచోదయా''త్ ప్రచోదయా''న్నో నః ప్రచోదయా''త్ | ప్రచోదయాదితి' ప్ర-చోదయా''త్ |

ఇరవై నాలుగు గాయత్రీమూర్తులకు చతుర్వింశతి గాయత్రీ అని పేరు.

ఇరవైనాలుగు అక్షరములు – దేవతలు
 •  1. తత్ – గణేశ్వరుడు
 •  2. స – నృసింహ భగవానుడు
 •  3. వి – విష్ణుదేవుడు
 •  4. తుః – శివదేవుడు
 •  5. వ – కృష్ణ భగవానుడు
 •  6. దే – రాథా దేవి
 •  7. ణ్యం – లక్ష్మీదేవి
 •  8. భ – అగ్నిదేవుడు
 •  9. ర్గః – ఇంద్రదేవుడు
 • 10. దే – సరస్వతి
 • 11. వ – దుర్గాదేవి
 • 12. స్య – హనుమంతుడు
 • 13. ధీ – పృధ్వీదేవి
 • 14. మ – సూర్యదేవుడు
 • 15. హి – శ్రీరాముడు
 • 16. ధి – సీతామాత
 • 17. యో – చంద్రదేవుడు
 • 18. యో – యమదేవుడు
 • 19. నః – బ్రహ్మదేవుడు
 • 20. ప్ర – వరుణదేవుడు
 • 21. చో – నారాయణుడు
 • 22. ద – హయగ్రీవ భగవానుడు
 • 23. యా – హంసదేవత
 • 24. త్ – తులసీదేవి
ఇంతటి మహిమాన్వితం, దివ్యశక్తి గల ఈ మంత్రాన్ని ఉచ్చరించటంలో స్వర, వర్ణ, లోపం ఉండిన హాని కలుగుతుంది. బ్రహ్మ పదమును పొందదలచినవారు “కాలనియమమును విధిగా పాటించవలయును. ప్రాతః(సూర్యోదయమునకు ముందు), మధ్యాహ్నికము, సాయంసంధ్యా(సూర్యుడు అస్తమించక ముందు)

ఈ త్రికాలములందు అశ్రద్ధ వహించక గురువు చెప్పిన ప్రకారం “త్రిసంథ్యా”యందు సంధ్యా వందనము, గాయత్రీ మంత్ర జపం చేసిన మనుజుడు బ్రహ్మపదమును సులభముగా పొందగలడు.
ఓం భూర్భువస్సువః
తత్సవితుః వరేణియం
భర్గో దేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్
భావం ‘మాలోనున్న అంతరఃచైతన్యాన్ని మేల్కొలపడానికి ఆధ్యాత్మిక జ్ఞానం అనబడే అత్యంత ప్రకాశవంతమైన దైవికమైన, పూజ్యమైన సూర్యకాంతిలో ధ్యానం చేస్తున్నాము’ అని అర్థం

ఈ గాయత్రీ మంత్రం లోని ప్రతి అక్షరం బీజాక్షరమని, మహిమాన్వితమైనది ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుతించినట్లని ఋగ్వేదములో చెప్పబడింది. ఒకప్పుడు కొన్ని వర్ణాల వారు మరియు వేదం పాఠశాలలో మాత్రమే దీన్ని ప్రత్యేకమైన నిర్దిష్టమైన పద్దతిలో జపించడం చేసేవారు. కాని మారుతున్న కాలంతో పాటు అందరికి అందుతున్న విజ్ఞాన ఫలాల వల్ల ఇప్పుడు గాయత్రి మంత్రాన్ని అందరూ పఠిస్తున్నారు మరియు అందరూ వింటున్నారు. ఈ పవిత్రమైన గాయత్రి మంత్రాన్ని ఒక నిర్దిష్టమైన పద్దతిలో జపించినా లేదా విన్నా ఆ మంత్రం నుండి వెలువడే ధ్వని తరంగాలు మన మనసుని, శరీరాన్ని ఉల్లాసపరిచి, తేజోవంతం చేస్తాయి తద్వారా మనోబుద్ధి వికసిస్తుంది అనేది సత్యం ఈ జపం వల్ల 0మన శరీరం మనకు తెలీకుండానే ప్రకృతిలోని ఎన్నో శక్తి తరంగాలను శరీరం, మెదడు ఆకర్షిస్తుంది.. మనసుకు ఆ అనుభూతి అద్భుతమైన అనిర్వచమైన ఆనందాన్ని పొందుతుంది..

గాయత్రీ మంత్రం గురించి వేదాల ప్రకారం  చెప్పాలంటే,
 • ‘సవిత’ గాయత్రీ మంత్రమునకు అధిష్టాన దేవత. 
 • అగ్ని ముఖము, 
 • విశ్వామిత్రుడు ఋషి. 
 • గాయత్రీ ఛందము.
ప్రణవ రూపమైన ఓం కారమునకు నేను వందనం చేస్తున్నాను. విశ్వాన్ని ప్రకాశింప చేస్తున్న సూర్య తేజమైన సవితాను నేను ఉపాసిస్తున్నాను అని గాయత్రీకి ఉన్న వివిధ అర్థాలలో ఒకటి. గాయత్రి మంత్రాన్ని జపించువారు వారి మెదడులో నిరంతరం కొనసాగు ప్రకంపనలను అనుభవం పొందుతారు. వారు ఎప్పుడు జాగరూకతతో నిజజీవితాన మసలుకుంటుంటారు. ఈ విధంగా విజయాలను సొంతం చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఓ వ్యక్తి గాయత్రిని సూచించిన విధంగా లయబద్ధంగా జపిస్తాడో, దాదాపు లక్ష శక్తి తరంగాలు అతని తలచుట్టూ ఉద్భవిస్తాయి. గాయత్రి మంత్రోపాసన ఒక వ్యక్తిని తెలివైనవాడిగా, ధైర్యవంతుడిగా చేస్తూ తరగనంతటి అనుకూల శక్తి సామర్థ్యాలను అతనిలోనింపుతుంది.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి
Translate this post ⬇

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top