భగవద్గీత - ముక్తికాంతకు నిజమైన నివాసం - Bhagawad Gita, Mukthi

Bhagawad Gita, Mukthi
భగవద్గీత ఉపనిషత్తుల పూర్తి సారాంశం.
  • ఇందులోని కర్మయోగము - పునాది.
  • జ్ఞానయోగము - గోడలు,
  • భక్తియోగము - పైకప్పు.
కర్మలను ఆచరించుట
ఈ విధంగా నిర్మించిన ఇల్లే ముక్తికాంతకు నిజమైన నివాసం. మనిషిని దేవునివైపుకు మరలించే అపూర్వగ్రంధం ఈ గీతా శాస్త్రం.

ఇందులోని కర్మయోగం "చేసితీరాలి" అని, జ్ఞానయోగము ఆ చేసే దానిని "తెలుసుకొని చెయ్యాల"ని, భక్తియోగం తెలుసుకున్నతర్వాత దానిని "చేసిచూడాల"ని, సన్యాసయోగం చేసి - చూచినదానిని (దైవాన్ని) ఎలాగైనా "చేరుకొని తీరాలనే" సందేశాన్ని ఇస్తున్నవి.

అంటే నాలుగు మెట్లలో, నాలుగు పురుషార్ధలను ఎలాసాదిన్చుకోవాలో చెప్పేదే భగవద్గీత. భక్తిని ముందు చేసిచూడాలి, అనంతరం తెలిసి చెయ్యాలి, ఆ తర్వాతా భక్తి రుచి మరిగాము కనుక దాన్ని ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. ఇలా చేయగా,చేయగా ఎప్పుడు మనము చూసే దేవుని సులభంగా చేరుకోగలమని గీత మనకు చెబుతోంది కనుక, కనీసం దీనిని చదువకపోయినా,పై పంక్తుల మీద ఉన్న క్రిష్ణార్జునల ను ఒక్కసారి చూచినా మీకు అన్నిటా విజయమే లభిస్తుంది. మరి మీరంతా దీనిని తప్పక పాటించి ముక్తిని పొందాలి.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

ఓం 

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top