నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

13, జూన్ 2019, గురువారం

నారికేళం - కొబ్బరికాయ యొక్క ఆధ్యాత్మిక ఫలితాలు

నారికేళం - కొబ్బరికాయ అద్భుత ఫలితాలు

నారికేళం - కొబ్బరికాయ: మన పూజా సామాగ్రిలో అత్యంత ముఖ్యమైనది:
  • కొబ్బరి కాయ మూడు కళ్ళు... ముక్కంటి (శివుడి) ని సూచిస్తాయంటారు.
  • మనం కొబ్బరికాయను భగవంతునికి సమర్పించే ముఖ్య ఉద్దేశ్యం.
  • మన అహమనే పెంకును బ్రద్దలు కొట్టి ఎవరూ తాకని అతి పవిత్రమయిన జలంతో భగవంతుని ప్రార్ధించి అభిషేకించటానికే.
వివిధ ఫలములు:
  • కొబ్బరి కాయను పగుల కొట్టేటపుడు.. అది సమంగా మధ్యకు పగిలితే.. కోరుకున్న కోరికలు నెరవేరుతాయని అర్ధం.
  • కొబ్బరికాయ నిలువుగా పగిలితే తీరని కోరికలు ఇంకా మిగిలి ఉన్నాయని అర్ధం..
  • కుళ్ళిపోయిన/లేదా కురిడి కొబ్బరి కాయను కొట్టమని బాధ పడవద్దు.
  • మనలో ఏ కల్మషంలేదని అర్ధం...మన కల్మషాలు తొలగి మంచి జరుగుతుందని అర్ధం...
  • కొబ్బరికాయలో మొలక వస్తే శుభం కలుగుతుందని అర్ధం.
అయితే ఈ శాస్త్రం చెబుతున్న పూజారిని నేను వెంటనే శాస్త్రిగారు నేను ఏ ఒక్కటీ లేకుండా అన్నీ కవర్ చేసాను అన్నిటికీ మీరు మంచిదనీ అంటున్నారు.. అని ప్రశ్నించాను... దానికి నాయనా... మనకు కొబ్బరికాయ కొట్టాలి అనే ఆలోచన చాలా గొప్పది... భగవంతుని దగ్గరకు రావాలనే ప్రయత్నం ఇంకా  గొప్పది.. మనం ఆయనకు సమర్పించేది ఏపాటి... అని వివరించారు...

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి
« PREV
NEXT »