సఖాసప్తపదాభవ సప్తపది - Saptapadi


సఖాసప్తపదాభవ సప్తపది - Saptapadi

సప్తపది
సఖాసప్తపదాభవ .... అనాఅ ఇద్దరు ఏడడుగులు కలసి నడిస్తే మిత్రత్వం కల్గుతుందని శాస్త్రం. వరుడు వధువు నడుముపై చేయి వేసి దగ్గరగా తీసుకొని అగ్ని హోత్రమునకు దక్షిణపైఅవున నిలబడి తూర్ప్7ఉ దిక్కు వైపుగా ఇద్దరూ ముందుగా కుడి అడుగు పెట్టి ఏడడుగులు నడవాలి. కూక్క్క అడుగుకి ఒక్కొక్క అర్థం వచ్చే మంత్రం చెపుతాడు పురోహితుడు. 
  • 1. మొదటి అడుగు: ఏకం ఇషే విష్ణుః త్వా అన్వేతు ... ఈ మొదటి అడుగుతో విష్ణువు మనిద్దరినీ ఒక్కటి చేయుగాక. 
  • 2. రెండవ అడుగు: 'ద్వే ఊర్జే విష్ణుః త్వా అన్వేతు ఈ రెండవ ఆదుగుతో మనిద్దరకు శక్తి లభించు నట్లు చేయు గాక. 
  • 3. మూడవ అడుగు: 'త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు ఈ మూడవ అడుగు వివాహ వ్రత సిద్ధి కొరకు విష్ణువు అనుగ్రహించు ఘాక. 
  • 4. నాల్గవ అడుగు: చత్వారి మయోభవాయ విష్ణుః త్వా అన్వేతు ఈ నాలగవ ఆదుగు మనకు ఆనందమును విష్ణువు కలిగించు గాక. 
  • 5. ఐదవ అడుగు. పంచ పశుభ్యోవిష్ణు త్వా అన్వేతు ఈ ఐదవ ఆదుగు మనకు పశుసంపదను విష్ణువు కలిగించు గాక. 
  • 6. ఆరవ అడుగు. షృతుభ్యో విష్ణుః త్వా అన్వేతు ఈ ఆరవ అడుగు ఆరు ఋతువులు మనకు సుఖమునిచ్చుగాక. 
  • 7. ఏడవ అడుగు... సప్తభ్యో హోతాభ్యో విష్ణుః ఈ ఏడవ అడుగు గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణకు విష్ణు అనుగ్రహించు గాక.
అనువాదం: కోటి మాధవ్ బాలు చౌదరి 

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top