శ్రీ అయ్యప్ప స్వామి మాలధారణ మారియు మాల విసర్జనా మంత్రము - Swami Ayyappa Maala Daaranaa Mantramu

శ్రీ అయ్యప్ప స్వామి మాలాధారణ మారియు మాల విసర్జనా మంత్రము - Swami Ayyappa Maala Daaranaa Mantramu
స్వామి అయ్యప్ప
మాలధారణ మంత్రము గురించి తెలుసుకుందాం :
బాల అయ్యప్ప

మాలను ఇతరులకు వేయునపుడు గురుస్వాములు ఈ మంత్రమును చెప్పవలెను.
 •  జ్ఞానముద్రాం శాస్తృముద్రాం గురుముద్రాం నమామ్యహం |
 •  వనముద్రాం శుద్దముద్రాం రుద్రముద్రాం నమామ్యహం |
 •  శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నమామ్యహం |
 •  గురుదక్షిణయాపూర్వం తస్యానుగ్రహకారిణే |
 •  శరణాగత ముద్రాఖ్యం త్వన్ముద్రాం ధారయామ్యహం |
 •  చిన్ముద్రాం ఖేచరీముద్రాం భద్రముద్రాం నమామ్యహం |
 •  శబర్యాచల ముద్రాయై నమస్తుభ్యం నమోనమః |
 •  అష్టాదశం మహాసారం శాస్త్రుదర్శనకారణం |
 •  విదితం శుద్దముత్కృష్టం సన్నిధానం నమామ్యహం |
 •  ఊరుజం వాపురం చైవ భైఅరవద్వన్న సేవితం |
 •  విష్ణుమాయాన్వితం శాస్తృ పరివారం నమామ్యహం ||
 •  ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ||
మాల విసర్జన మంత్రము :
మాల ధరించుటకు మంత్రమున్నట్లే మాలా విసర్జనమునకు మంత్రము గలదు. శబరిమల నుండి తిరిగి రాగానే ఇంటి ముంగిట కొబ్బరికాయ కొట్టి లోనికి ప్రవేశించి పూజా మందిరం లేక శ్రీవారి మండపం ముంగిట కర్పూరం వెలిగించి శరణుఘోషలు చెప్పి గురుస్వామికి దక్షిణ తాంబూలాదులు యొసంగి మాల విసర్జన మంత్రమును చెప్పి గురుస్వామి గారిచే మాల తీయించుకొనవలెను. అపూర్వ మచలా రోగా ద్దివ్య దర్శన కారన |
శాస్తృ ముద్రాద్మహాదేవ దేహిమే వ్రతమోచనం ||

సేకరణ - రచన: గోగులపాటి కృష్ణమోహన్ (గురుస్వామి)
శ్రీ ధర్మశాస్త సన్నిధానము, సూరారం కాలనీ, భాగ్యనగరం, 
సంప్రదించవలసిన చరవాణి సంఖ్య: +91-9700007653.

ఓం 

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top