వేదాంతం = క్వాంటమ్ భౌతిక శాస్త్రము - Quantum Physics = Vedic Philosophyవేదాంతం =  క్వాంటమ్ భౌతిక శాస్త్రము - Quantum Physics = Vedic Philosophy
క్వాంటమ్ ఫిజిక్స్ = వేదాంతం
ఈమధ్య ఒక అద్భుతమైన సమాచారం గ్రహించాను. దానిలో ఉన్న విషయాన్ని మరింత పరిశీలిస్తుంటే ఎన్నో విషయాలు అర్ధమవుతున్నాయి. ఎన్నో వేదాంత విషయాలను నేటి సైన్స్ ఆధారంగా వివరణ ఇవ్వగలిగే అవకాశం దొరుకుతున్నది . ఒక రెండు, మూడు టపాలలో నాకు అవగతమైన విషయాలను సైన్సు, వేదాంతం, పురాణాంతర్గత ఆధ్యాత్మికం మిళితం చేస్తూ సరళంగా వివరించే ప్రయత్నం చేస్తాను .

మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ లింక్ వీడియో చూడండి.

నేటి సైన్స్ మనకు బయట కనబడుతున్న ప్రపంచాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే వేదాంతం మనలోపలున్న ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తుంది. లోనున్న విషయాన్ని, బయట ఉన్న విషయాన్ని అనుసంధానిస్తూ ఆధ్యాత్మికంగా ప్రయాణించమని మన వాఙ్మయం చెబుతుంది. వాటిని మరింత లోతుగా పరిశీలిద్దాం. సైన్స్ బాహ్య ప్రపంచాన్ని చూస్తూ అర్ధం చేసుకుంటూ నెమ్మదిగా అణువులు ఇతరత్రా లోనున్న వస్తువులను అర్ధం చేసుకుంటూ లోతుగా వెళ్తుంటే, వేదాంతం లోనున్న ప్రపంచాన్ని అవగతం చేస్తూ బయటున్న లోకాన్ని అనుసంధానిస్తూ ముందుకు వెళ్తుంది. ఒకటి టాప్-డౌన్ అప్రోచ్ అయితే వేదాంతం bottoms -up అప్రోచ్. చివరకు రెంటినీ అనుసంధానిస్తూ ఒకానొక సమయానికి నేటి సైన్స్ మన వేదాంతాన్ని ఒప్పుకోక తప్పని స్థితికి చేరుకుంటోంది. సైన్సు నేడు అర్ధం కాదని వదిలేసిన విషయాలకు వేదాంతానుసంధానం చెయ్యడానికి ఎందరో కృషి చేస్తున్నారు. ఒకానొక రోజు ఇవి అందరికీ ఆమోద యోగ్యమైన స్థాయికి వెళ్తాయని ఆశిస్తున్నాను.

ఇక విషయానికి వద్దాం. భౌతిక శాస్త్రం రెండుగా చెప్పబడుతుంది.
  • 1. క్లాసికల్ ఫిజిక్స్ (శాస్త్రీయ భౌతిక శాస్త్రం ) - న్యూటన్ చెప్పిన భౌతిక శాస్త్రం. స్థూల వస్తువులు, వాటి ప్రవర్తనకు సంబంధించిన శాస్త్రం
  • 2. క్వాంటమ్ ఫిజిక్స్ (పరిమాణ భౌతిక శాస్త్రం ) - atoms , అణువులు, ఎలెక్ట్రాన్స్, ప్రోటోన్స్ , వాటి ప్రవర్తనను వివరించే శాస్త్రం.
గమ్మత్తేమిటంటే శాస్త్రీయ శాస్త్రం చెప్పిన నియమాలు పరిమాణ శాస్త్రంలో వర్తించవు, అలాగే అక్కడవి ఇక్కడ వర్తించవు.

ముందుగా క్వాంటమ్ ఫిజిక్స్ అర్ధం చేసుకోవడంలోనే ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వాటికి ఆద్యం 1805లో థామస్ యంగ్ చేసిన ప్రయోగాలకు నోబెల్ తీసుకున్న వైనం చూద్దాం. కాంతి (light ) ఒక తరంగంలా వెళ్తుంది అని ఆయన ప్రతిపాదన. దాన్ని డబల్ స్లిట్ ఎక్స్పరిమెంట్ తో నిరూపించారు.

ఇది మరింతగా అర్ధం చేసుకోవాలంటే ఈ వీడియో చూడండి.
కానీ 1905లో ఐంస్టీన్ కాంతి తరంగమే కాదు అది ఒక వస్తువులా ప్రవర్తిస్తుందని సింగల్ స్లిట్ ఎక్స్పరిమెంట్ తో నిరూపించారు. అంటే ఒకప్పుడు తరంగంగా ప్రవర్తించే కాంతి ఒకప్పుడు పదార్థంగా ప్రవర్తిస్తుంది. ఈ రహస్యాన్ని ఛేదించడానికి ఈ క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ మెకానిక్స్ అని కొత్త రెసెర్చ్ ప్రారంభం అయ్యాయి. ఇంకొక అడుగు ముందుకేసి డెబ్రాగ్లీ అన్న సైంటిస్ట్ అసలు అన్ని భౌతిక వస్తువులు కూడా తరంగంలా ఉంటాయి, పదార్థంగా ఉంటాయి అని ప్రతిపాదించి 1929లో నోబెల్ బహుమతి పొందారు.

అన్ని పదార్ధాలు కూడా standing wave లా ఉంటారని, పరిశీలకుడు (observer ) ఉన్నప్పుడు మాత్రమే అది వస్తువుగా (particle) గా ఉంటుందని ప్రతిపాదన. ఎవరూ చూడని పక్షంలో ఆ పదార్ధం ఏదైనా స్థితిలో ఉండవచ్చు కానీ చూసిన తక్షణం అక్కడ ఒక వస్తువుగా చూస్తాడు.

దానికి ఉదాహరణ, మన వెనుక మన స్నేహితుడు ఉన్నప్పుడు మనం అది గుర్తించనప్పుడు, అతడు నిలుచుని ఉండవచ్చు, పడుకుని ఉండవచ్చు, వాలుగా ఉండవచ్చు, అసలు అక్కడ లేకనే పోవచ్చు, అంటే ఎన్నో ప్రాబబిలిటీస్ ఉన్నాయి. అదే అతని వైపు మనం చూసినప్పుడు అక్కడ ఉన్నట్టు నిర్ధారణ అవుతుంది. ఇలా ఎన్నో ప్రాబబిలిటీస్ ఉన్న పరిస్థితిని స్టాండింగ్ వేవ్స్ అని చెబుతాము. కానీ ఒక పరిశీలకుడు చూసినప్పుడు ఆ తరంగం ఒక నిర్దుష్టమైన స్థితిలో ఉంటుంది. మరి observe చెయ్యక ముందున్న అన్ని ప్రాబబిలిటీస్ అన్నీ కూడా పటాపంచలయిపోతాయి. వీటిని schrodinger equation లో రిప్రెసెంట్ చేస్తారు. ఈ స్టాండింగ్ వేవ్స్ ఒక closed environment లో చెప్పగలము. ఎలెక్ట్రాన్గ్స్ అన్నీ కూడా atoms పరిమితిలోనే అవి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి, ఒక చిన్న మడుగులో రాయి వేస్తె ఆ వచ్చే తరంగాలు కూడా ఆ మడుగు ఉన్న ప్రదేశంలోనే ఉంటాయి, అంటే ఒక పరిధిలో ఉండేవే ఈ స్టాండింగ్ వేవ్స్. observer రాగానే అవన్నీ కూడా ఒక నిర్దుష్టమైన స్థితిలోకి వచ్చేస్తాయి ఈ bounding box లో. ఎలెక్ట్రాన్స్ మరి ప్రోటోన్స్ శక్తి సింపుల్ equation కాబట్టి schrodinger equation apply చేసి ఒక విలువ చాలా accurate గా చెప్పగలము. కానీ పెద్ద వస్తువుకు energy equation కాంప్లెక్స్ కాబట్టి దాన్ని calculate చెయ్యడం చాలా కాంప్లెక్స్. అలాగే న్యూటన్ principles పరమాణువుల మీద అప్లై చేయలేము. వీటి రూల్స్ వాటివే.

ఇప్పుడు మన ఆధ్యాత్మికం, భౌతికానికి సంబంధించి మనం అనుసంధానం చేసుకుంటే భౌతికంగా చెప్పుకునే విషయాలు ఆధ్యాత్మికంగా కుదరవు. మనం నిలకడగా ఉన్నా, మన మనస్సు కొన్ని లక్షల ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి భౌతికంగా మన పద్ధతులు మానసికంగా అనుసంధానించలేము. మన చిత్తవృత్తులు పరి పరి విధంగా తిరుగుతూ ఉంటాయి. అది తరంగాలుగా తిరుగుతూ ఉంటాయి. కానీ మనం దాన్ని observe చెయ్యడం మొదలు పెడితే తిరిగి తిరిగి ఒక చోట ఆగుతాయి. దాన్నే మనం మెడిటేషన్ అంటాము. ఇంకొంచెం ముందుకు పోయి ఆలోచిస్తే ఈ లోకం అంతా నిండి ఉన్నవాడు విష్ణువు. ఎన్నో శక్తుల రూపంలో ఎన్నో దేవతల శక్తులుగా ఈ ప్రపంచం అంతా నిండి ఉన్నారు. అది వేవ్ నేచర్. కానీ మన ఋషులు ఒక బౌండింగ్ బాక్స్ పరిధిలో ధ్యానించినప్పుడు వాళ్లకు ఒక రూపంలో దర్శనమిచ్చారు. మరి మిగిలిన తరంగాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. అవి వీటికన్నా వేరు కాదు. ఆ ధ్యానం చేసినప్పుడు వీళ్లకు అందిన రూపంలో అవన్నీ కలిసిపోయాయి. అదే రూపం ఒకరికి శివుడిగా, ఒకరికి లింగంగా, ఒకరికి విష్ణువుగా, ఒకరికి సుబ్రహ్మణ్యుడు గా వాళ్ళ పరిధిని బట్టి , వాళ్ళ దృష్టి ని బట్టి వాళ్లకు దర్శనమిచ్చారు.

ఈ క్వాంటమ్ ఫిజిక్స్ చెప్పుకోవడానికి చాలా confusing గా ఉన్నా, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ విషయాన్ని మన వాఙ్మయం చాలా కూలంకషంగా నిరూపించింది. ఇప్పుడు కనుకొంటున్న విషయం మన వాళ్ళు ఒక నిర్దుష్టమైన ఆధ్యాత్మిక దారిలో దర్శించారు. ఈ కాలప్రవాహంలో ఈ అద్భుతమైన శాస్త్రం మరుపుకు గురయింది. ఇప్పటి శాస్త్రం కొత్తగా చెబుతున్న వాటిని మనవాటితో అనుసంధానించుకుంటుంటే మనవాటిలో చెప్పిన విషయాలకు సరిగ్గా సరిపోతున్నాయి. ఇటువంటి ఎన్నో అద్భుతమైన విషయాలు దురదృష్ట వశాత్తు నూతన ఆవిష్కరణల తరువాత బేరీజు వేసుకునే స్థితితో సరిపెట్టు కుంటున్నాము.

మరికొన్ని క్వాంటమ్ ఫిజిక్స్ చెప్పిన విషయాలను రానున్న టపాలలో విశ్లేషిద్దాం.

రచన: హిందూ జ్వాల
"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top