నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Monday, January 13, 2020

శ్రీ లలితా సహస్రనామం - అర్ధం, పరమార్ధము - Lalitha Sahsranaamamశ్రీ లలితా సహస్రనామం - అర్ధం, పరమార్ధము - Lalitha Sahsranaamam
లలిత సహస్రనామం
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రేనమః 

1. || ఓం శ్రీమాత శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్ని కుండసంభూత దేవకార్య సముద్యత ||
 • శ్రీమాత : శ్రీదేవి అను ప్రసిద్ధనామముగల జగన్మాత , సమస్త సృష్టికి మూలమైనది.
 • శ్రీ మహారాజ్ఞీ : మహారాణి, సమస్త లోకములను పరిపాలించుచున్నది.
 • శ్రీమత్ -సింహసనేశ్వరి : సింహాసనమును అధిష్టించి దుష్ట శిక్షణ చేయునది.
 • పై మూడు నామముల వలన లలిత దేవి సృష్టి , స్థితి, లయ కారిణి అని తెలియుచున్నది. చిదగ్ని కుండసంభూత : జ్గ్యానము అను అగ్ని కుండమున పుట్టినది.
 • దేవకార్య సముద్యతా : దేవతల పని చేయుటకు పూనుకొన్నది. ( దేవతల పని అనగా ఆధ్యాత్మిక సాధన)

2.  || ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగాస్వరుప పాశాడ్యా క్రోధా కారంకుశోజ్జ్వల ||
 • ఉద్యద్భాను సహస్రాభ : ఉదయించిన వేయి సూర్యుల వెలుగు కలిగినది.
 • చతుర్బాహు సమన్విత : నాలుగు బాహువులు కలిగినది.
 • రాగాస్వరుప పాశాడ్యా : అనురాగమే పాశముగా కలిగినది.
 • క్రోధాకారంకుశోజ్జ్వలా : క్రోదమును అంకుశంగా కలిగినది.

3. || మనోరూపేక్షు కోదండా పంచ తన్మాత్ర సాయకా నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మండమండల |||
 • మనోరూపేక్షు కోదండ : మనసే విల్లుగా కలది 
 • పంచతన్మాత్ర సాయక : ముఖ, చంద్ర , అష్టమి , రస, గంధములు అను పంచ తన్మాత్రములను బానములుగా కలది. 
 • చంద్ర ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా : తన ఎర్రన్ని కాంతి చే బ్రహ్మాండమంతయు నింపి వేసినది.

4. || చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత ||
 • చంపకాశోక పున్నాగ : సంపెంగ, అశోక, పున్నాగమొదలగు పుష్పములు
 • సౌగంధిక : సువాసనగల
 • లసత్కచ : తలకట్టు
 • కురవింద మణి : కురవింద అను పేరు గల ఎర్రని మణులు
 • శ్రేణి : వరుస
 • కనత్ కోటీర మండితా : ప్రకాశం తో కూడిన కిరీటముధరించినది

5. || అష్టమిచంద్ర విభ్రాజ దళికస్తల శోభిత ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషక ||
 • అష్టమీ చంద్ర : అష్టమి నాటి చంద్రుడు
 • విభ్రాజ : ప్రకాశించు
 • దళికస్థల : నుదిటి భాగం
 • శోబిత : ప్రకాశం కలిగినది
 • ముఖ చంద్ర : చంద్రుని ముఖమునందు
 • కళంకాభ : మచ్చ
 • మృగనాభి విశేషక : కస్తూరి తిలకం దిద్దిన అందమైనముఖము

6. || వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లిక వక్త్ర లక్ష్మి పరివాహ చలన్మీనాభ లోచన ||
 • వదనస్మర మాంగల్య : అందమైన కనుబొమ్మల తో కూడినముఖము
 • గృహ తోరణ : గృహమునకు అలంకరించిన మంగళతోరణము వలె
 • చిల్లికా : అందమైన ముఖము కలది
 • వక్త్ర లక్ష్మీ పరీవాహ : ముఖ సౌందర్యం అనే ప్రవాహమున
 • చలన్మీనాభలోచన : చేపల వంటి అందమైన కనులు కలది

7. || నవచంపక పుష్పాభ నాసదండ విరాజిత తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసుర ||
 • నవచంపక పుష్పాభ : క్రొత్త సంపెంగ మొగ్గలు
 • నాసదండ విరాజితా : అందమైన నాసిక కలది
 • తారా కాంతి : నక్షత్రాల వెలుగు
 • తిరస్కారి : మించిన
 • నాసాభరణ : ముక్కెర (నాసిక ఆభరణం)
 • భాసుర : ఆభరణం కలిగినది

8. || కదంబ మంజరీ క్లుప్త కర్ణపూరమనోహర తాటంక యుగళీభూత తపనోడుప మండల ||
 • కదంబ మంజరీ క్లుప్త : కడిమిపూల గుత్తి చే అలకరించిన
 • కర్ణపూర మనోహర : అందమైన చెవులు కలది
 • తాటంక యుగళీభూత తపనోడుప మండల : సూర్యచంద్రులను చెవికమ్మలుగా కలిగినది

9. || పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ నవవిద్రుమ బింబశ్రి న్యక్కారి దసన్నచ్చద ||
 • పద్మరాగశిలాదర్శ : పద్మరాగమణి (కెంపు) తో చేయబడినఅద్దములు
 • పరిభావి కపోలభూ : కెంపుల ప్రకాశం కంటే ఎక్కువప్రకాశం గల చెక్కిళ్ళు కలది
 • నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చదా : క్రొత్త పగడమును మించిన అందమైన యెర్రని పెదవులు కలది.

10. || శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వల కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర ||
 • శుద్ధవిద్యాంకురాకార : శ్రీవిద్య అనబడు షోడశీమంత్రములోని పదునారు బీజాక్షరాలు
 • ద్విజపంక్తి ద్వయోజ్వల : తెల్లని ప్రకాశవంతమైనపలువరుస కలది
 • కర్పూరవీటికామోద : కర్పూర తాంబూల సువాసనలు
 • సమాకర్షదిగంతరా : నలుదిక్కులను ఆకర్షించునది.

11. || నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపి మందస్మిత ప్రభాపుర మజ్జత్కామేశ మానస ||
 • నిజసల్లాప మాధుర్య : తన పలుకుల మాధుర్యము చేత
 • వినిర్భర్త్సిత కచ్ఛపీ : సరస్వతీదేవి వీణా నాదమునుజయించునది
 • మందస్మిత : చిరునవ్వులు
 • ప్రభాపూర : కాంతి
 • మజ్జత్ : వశము చేసుకొను
 • కామేశ : కామేశ్వరుడు
 • మానసా : మనసును జయించునది.

12. || అనాకలిత సాదృశ్య చుబుకశ్రి విరాజిత కామేశ బద్ధమాంగాల్య సూత్ర శోభిత కంధర ||
 • అనాకలిత సాదృశ్య : పోల్చుటకు సాద్యముకాని
 • చుబుక శ్రీ విరాజితా : అందమైన గడ్డము (చుబుకము)కలది
 • కామేశ బద్ధ : కామేశ్వరుని చే
 • మాంగల్య సూత్ర : మంగళ సూత్రము
 • శోభిత : శోభిల్లుచున్న
 • కంధరా : కంట్టము కలది

13. || కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత ||
 • కనకాంగద కేయూర : బంగారు బుజ కీర్తులతోను(వంకీలతో) కమనీయ : చూడచక్కని
 • భుజాన్వితా : భుజములు కలది
 • రత్న గ్రైవేయ : రత్నములు పొదిగిన
 • చింతాక : చింతాకు పతకము
 • లోల ముక్తా ఫలాన్వితా : ముత్యాల జాలర్లు

రచన: శ్రావణి రాజ్ 
« PREV
NEXT »

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com