నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Wednesday, February 26, 2020

పుణ్యాపుణ్య ఫలప్రదా - Ponyaa ponya Phalapradaaపుణ్యాపుణ్య ఫలప్రదా - Ponyaa ponya Phalapradaa
పుణ్యాపుణ్య ఫలప్రదా
ఎనిమిది అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు 'పుణ్యాపుణ్యఫల ప్రదాయైనమః' అని చెప్పాలి.
  • పుణ్య = మంచిపనులకు,
  • అపుణ్య = చెడ్డపనులకు,
  •  ఫల= వాటి వాటికి తగిన ఫలములను,
  • ప్రదా = చక్కగా ఇచ్చునది.
శ్లో. *పుణ్యస్య ఫలమిచ్ఛంతి పుణ్యం నేచ్ఛంతి మానవాః*,
*నపాపఫల మిచ్ఛంతి పాపం కుర్వంతి యత్నతః*.

"సాధారణంగా మానవుడు పుణ్యకార్య ఫలం రావాలని కోరతాడు కాని పుణ్య కార్యాలు చెయ్యడు, పాపాలు చేస్తూ పాపకార్యఫలం రాకూడదని ఆశిస్తాడు" అని పై శ్లోకానికి అర్థం.

ఇంతకు ముందు నామంలో - మనంతకు మనకే ఏ పనులు చెయ్యాలో, ఏవి చెయ్యకూడదో తెలిసేట్లుగా అమ్మవారు అనుగ్రహిస్తుంది - అని చెప్పబడింది. అయితే 'ఎలా తెలుస్తుంది మనంతకు మనకే ?' అన్న దానికి సమాధానం ఈ ప్రస్తుత నామంలో వుంది.

మనం చేసుకున్న దాన్ని బట్టి - మన కర్మ ఫలాలను మనకు మనమే సృష్టించుకునేట్లు చేస్తుంది కాబట్టి, మనం ఏపనులు చేయవచ్చో, ఏ పనులు చేయకూడదో మనము ముందే జాగ్రత్తపడి చేసుకుంటాం. అంటే పుణ్యకార్యలు చేస్తే పుణ్యఫలాలు, అపుణ్య కార్యాలు చేస్తే అపుణ్య ఫలా వస్తాయని చెప్పే విషయం నమ్మడం కాదు, నిజంగా తెలుస్తుంది. దాంతో భయంగా ఎప్పుడూ పుణ్యకార్యాలే చేస్తాము గాని పాపకార్యాలు చెయ్యము. ఆ సాధకులకు అమ్మవారిచ్చే శిక్షణ ఆలోచనా శక్తి ని ఆలోచనా స్వేచ్ఛని జీవులకే వదిలేస్తుంది అమ్మవారి ,వారి ఆలోచనా జ్ఞానం తో చేసే పుణ్య పాప కర్మలే వారికి ఫలితాలు అర్హతలు నిర్ణయిస్తాయి.

పరమేశ్వరి నిష్పక్షపాత గుణరాశి. ఆమె అందరికి ముందు నామంలో వర్ణించి నట్టుగా ఏది మంచి చెడు అన్న విధానాలు అందజేసింది, వాటికి విరుద్ధంగా ప్రవర్తించిన వారికి తగిన ఫలితం అనుభవిస్తారు. అందువల్ల విధులు దాని ఫలితాలు తెలుసుకుని జాగర్త పడాలి...

ఏది ధర్మం ఏది అధర్మం అన్న విషయాన్ని గ్రహించి ధర్మ సమ్మతమైన కార్యములు నిర్వహించిన వారి పట్ల వారి కర్మకు తగ్గ ఫలితాన్ని ఇవ్వడం లో అమ్మవారు ఎటువంటి పక్షపాతాన్ని చూపించదు ధర్మ మార్గంలో నడిచే వారికి ఎటువంటి భయమూ ఉండదు, స్థిరత్వము ,మనశ్శాంతి ఉంటుంది.

నిషిద్ధ కర్మలు చేసిన వారు ఆ తప్పు నుండి తప్పించుకోలేరు బయట లోకానికి తప్పును కప్పి పుచ్చినా తనలో కూడా ఉన్నా ఆమ్మవారి నుండి తప్పించుకోలేరు దాని ఫలితము పాప రూపంలో అనుభవించాల్సి వస్తుంది . ప్రపంచంలో పాపకర్మలు అనుభవిస్తున్న వారిని చూసి అటువంటి కర్మలు అనుభవించకుండా ఉండాలి అన్నా పాపభీతి కలిగి జాగర్త పడాలి.

ఇది వరకు కూడా వివరించాను చిత్ర గుప్త అంటే చిత్రమైన ఆత్మ గుప్తంగా దాగి పాప పుణ్యాల జాబితాను లెక్క రాస్తుంది అని, ఈ ఆత్మ మనిషి యొక్క పాప పుణ్యాల చిట్టా నిష్పక్షపాతంగా రాస్తుంది దాని ధారంగానే మనకు జీవిత విధానము నిర్వహించబడుతున్నాయి, మన తలరాత మన కర్మను అనుసరించి మనచేత రాయించ బడుతుంది, అనగా ఇప్పటి నీ జీవితము జీవన విధానం అనుభవిస్తున్న కర్మ ఫలితమును మొత్తము నీ తలరాత రూపములో నీచే లిఖించబడింది దానికి కారణం నీలో కూడా ఆత్మ స్వరూపముగా ఉన్నది జగదంబ కనుక..
మనసుతో బుద్ధితో ఆలోచనతో చేతలతో ప్రవర్తనతో చేసే ఏ ఏ పాప పుణ్యముకు కూడా ఫలితం ఉంటుంది దేని నుంచి జీవుడు తప్పించుకోలేరు ఎందుకంటే తమ తప్పులను లోకము గుర్తించలేక పోయినా తమ మంచితనాన్ని గొప్పతనాన్ని లోకము గుర్తించలేక పోయినా నీలోని ఆత్మ రూపంలో ఉన్న అమ్మవారు గుర్తిస్తుంది.

నీ ఆత్మ స్వరూపమైన పరమేశ్వరి ప్రతిదీ గుర్తించి దానికి తగ్గ ఫలితాన్ని నిష్పక్షపాతంగా నీకు అందజేస్తుంది. మంచి పనులకు మంచి ఫలితాలను, చెడ్డపనులకు చెడ్డ ఫలితాలను ఇచ్చునది' అ ఈ నామానికి అర్థం.

ఫలస్తుతి:
చేసిన పనికి తగ్గ ఫలితాన్ని ఆశించి కానీ ,చదువుకున్న చదువుకు తగిన ఉపాధి కోసం కానీ, ఈ నామ మంత్రం జపించాలి. తెలిసి , తెలియక చేసిన తప్పులను తెలుసుకుని పశ్చాత్తాపముతో ఆ తల్లిని శరణు వేడుకుంటే తప్పును సరి చేసుకునే అవకాశాన్ని ఆ జగన్మాత అనుగ్రహిస్తుంది , చెడు ఆలోచనలు అరికట్టడం కోసం చెడు అలవాట్లనుండి విముక్తి కలిగించడం కోసం మంచి కుటుంబం బంధాలు కలిగి ఉండడం కోసం భక్తితో ఈ నామ మంత్రాన్ని ధ్యానము చేయాలి.
ఈ నామాన్ని సహస్త్ర నామంతో సంపుటికరణ చేయడం అమ్మవారికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది..ఆ తల్లి అనుగ్రహం పొందాలి అనుకునే సాధకులు ఈ నామ మంత్రాన్ని సంపుటికరణ చేయడం వల్ల వారికి మంచి మార్గంలో నడిపిస్తూ మంచి అవకాశాలు లభిస్తుంది ఎప్పుడూ ఒకరుకి సహాయం చేసే స్థితులో మీమల్ని ఉంచుతుంది.. ఆలోచనలో మార్పు, పనిలో ఓర్పు , కుటుంబ లో ప్రేమ, సమాజంలో గౌరవం లభిస్తుంది..

ఓం ఐం హ్రీం శ్రీo పుణ్యాపుణ్యఫల ప్రదాయై నమః

రచన : భానుమతి అక్కిసెట్టి
« PREV
NEXT »

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com