దేవ, రాక్షస గుణాలు - Deva, Raakshasa Gunaalu

దేవ, రాక్షస గుణాలు - Deva, Raakshasa Gunaalu
దేవ, రాక్షస గుణాలు
ప్రతి వ్యక్తిలో దైవీ, రాక్షస గుణాలు ఉంటాయి. వేటిని ఎక్కువగా జాగృతం చేస్తే అవే శాశ్వతంగా నిలుస్తాయి.

దేవతలంటే మనలోని సాత్విక మనోవృత్తులు :-
 • 🝒 భయంలేకుండుట,  
 • 🝒 మనస్సుపరిశుద్ధంగా ఉండుట, 
 • 🝒 జ్ఞానం, 
 • 🝒 దానం, 
 • 🝒 ఇంద్రీయనిగ్రహం, 
 • 🝒 సద్దంధపఠనం, 
 • 🝒 తపస్సు, 
 • 🝒 రుజువర్తనం, 
 • 🝒 అహింస, 
 • 🝒 సత్యం పలుకడం, 
 • 🝒 కోపం లేకపోవడం, 
 • 🝒 మృదుభాషణం, 
 • 🝒 వినయం శాంతం, 
 • 🝒 తేజస్సు, 
 • 🝒 ఓర్పు, 
 • 🝒 ధైర్యం, 
 • 🝒 శుచిత్వం, 
 • 🝒 నేరాలు చేయకపోవడం, 
 • 🝒 ద్రోహ చింతన దురాభిమానం లేకపోవడం అనే సుగుణాలు. 
'దేవతలు' అన్న పదానికి అర్థం. ఇవి జ్ఞానానికి సహాయపడతాయి. సుర అనే పదానికి '‘సు'- మంచిని, రాతి (లాతి)ని తీసుకునే మనోవృత్తిగలవారు. దేవ పదానికి ప్రకాశం అనే మరో భావం కూడా ఉంది. జ్ఞాన, ప్రకాశాలైన మనోవృత్తులు గలవారు దేవతలు. మంచిని గ్రహించని వారు రాక్షసులు. అంటే అసురులు. మనలోని తామసిక మనోవృత్తుల, డాబు, దర్పం, అహంభావం, పరుషభావం, హింస, కామం, క్రోధం, లోభం, మోహం, ఇటువంటి మనోవృత్తి గల గుణాలు అసురులకు ఉంటాయి.

ఇవి అజ్ఞాన కారకాలు. అంటే ఒక వ్యక్తి దేవుడు రాక్షసుడుగా మారడానికి అతనిలో ఉండే గుణాలే కారణం వాటి ఆధారంగానే ఆయన దేవుడు, వాడు రాక్షసునివంటి వాడు అని పలుకుతారు.

మూలము: జాగృతి వార పత్రిక

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top