నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

పండుగలు

పండుగలు
Showing posts with label ధర్మం - అధర్మం. Show all posts
Showing posts with label ధర్మం - అధర్మం. Show all posts

Monday, April 27, 2020

విభీషణుడి ధర్మ నీతి - Vibhishan Dharma Neethiనిషి పుట్టిన వంశం, కులం, జీవన విధానాలు ఎటువంటివైనా ఆశయాలూ, లక్ష్యాలూ, విలువలూ ఉన్నతంగా ఉంటే మనిషి మహనీయుడవుతాడనీ, తాను మానసికంగా ఎంతటి వ్యథను  అనుభవించినా, తనవారినే నిరోధించాల్సి వచ్చినా ధర్మమార్గమే తన మార్గమని తలంచి చివరిదాకా దానికి కట్టుబడి జీవించిన మనిషే మనిషనీ నిరూపించిన మహానుభావుడు విభీషణుడు. 
రాక్షసకులంలో జన్మించినా రత్నంగా, ధార్మిక జగతిలో శిరోమణిగా, రామాయణ గాథలో కీలకమైన వ్యక్తిగా సమాజానికి పరిచయమైన విభీషణుని మనో విజ్ఞానం అత్యద్భుతం, భావితరాలకు ఆదర్శం.
కైకసీ విశ్రవుల మూడో కొడుకు, రావణుని సోదరుడూ, మంత్రి, శ్రీరామచంద్రునికి అత్యంత ఆప్తుడు విభీషణుడు. శైలూషుడనే గంధర్వరాజు కూతురు సరమ ఈతని భార్య. రాక్షస లంకలో రామనామ జపాన్ని రహస్యంగా ధ్వనిస్తూనే ఆ నామ తరంగాలను రాక్షసత్వాన్ని పావనం చేసేందుకు తపించిన రాక్షసోత్తముడు విభీషణుడు. ఒక వ్యక్తి జీవితాన్నీ, అతనిలోని భావోద్వేగాలనూ సంపూర్ణంగా ఓ అంచనాకు తేవడం అసాధ్యం. మన జీవితాన్నే సరిగ్గా వ్యక్తపరచలేని మనం ఎదుటివారిని అర్థం చేసుకోవడంలో వెనుకడుగు వేయక తప్పదు. విభీషణుని జీవితాన్ని కూడా అర్థం చేసుకోవడం కష్టమే. ఎందుకంటే రాక్షసత్వంలోంచి పరిమళించిన ధార్మికత, నైతికత లోకకళ్యాణం కోసం మరింత నిగ్గుదేలాయనడానికి విభీషణుని వ్యక్తిత్వమే ప్రతీక.

పుట్టుక రాక్షసజాతి నిర్దేశించింది. కానీ విభీషణుని వ్యక్తిత్వం మానవీయ కోణంలో ఎదిగింది. తనజాతి లక్షణాలు స్వతాహాగా మనిషి కోణంలో ఎదిగాయి. తన జాతి లక్షణాలు స్వతహాగా మనిషిలో ప్రభావితమవుతున్నా వాటి జోలికి పోకుండా ఎటువంటి ప్రలోభాలు ప్రేరేపించినా తలొగ్గక, ఎంతటి భోగాలు ఆకర్షించినా ఏమాత్రం సడలక తనదైన వ్యక్తిత్వంతో ధర్మసాధన చేసి విభీషణుడు మహోన్నతుడయ్యాడు. తన కుటుంబం, తన లంకానగరం, తన అన్న రావణుడూ ధర్మం నీడలో బతకాలని కాంక్షించి దానిని కొనసాగించడం కోసం అహర్నిశలూ తపించాడు.

మహావీరుడూ, ధర్మశాస్త్ర, నీతిశాస్త్ర సారమెరిగినవాడూ, సకల కళలలో ప్రావీణ్యం గలవాడూ, లంకను సర్వస్వతంత్ర సామ్రాజ్యంగా నిలబెట్టిన చక్రవర్తి. బంగారు లంకను స్థాపించిన రావణుడంటే విభీషణునికి అభిమానం, ప్రేమ, గౌరవం. రావణుడు తన అన్న అయినందుకు ఒకింత గర్వం. కానీ ఒక స్త్రీ వ్యామోహంతో లంకాపతనానికి పూనుకున్నందుకు రావణున్ని వారించిన తీరు ధర్మజగతిలో ఓ మైలురాయి. 

దండకారణ్యం నుంచి సీతాపహరణం చేసుకొని వచ్చాడన్న వార్త వినగానే ఆగామి రోజుల్లో జరుగబోయే పీడను శంకించిన విభీషణుడు రావణుడు చనిపోయేంత వరకూ తను చేసేది, చేస్తుంది అధర్మమని చెబుతూనే ఉన్నాడు. బతిమాలాడూ, వాదించాడూ, చర్చించాడూ, హెచ్చరించాడు. అయినా రావణుడు పంతం వీడలేదు. 
శ్రీ రామునితో విభీషణుడు
విభీషణుడి ధర్మ నీతి:
 • ⭄ హనుమంతుడు దూతగా వచ్చినప్పుడు రావణుడు ఒక కోతి వచ్చి నాకు ధర్మబోధ చేస్తుందా! అని పరిహసిస్తూ హనుమను చంపమని ఆదేశిస్తే, విభీషణుడు దూతను చంపడం అత్యంత దుర్మార్గమనీ, కావాలంటే అతను మనకు చేసిన నష్టానికి గానూ ఏదైనా శిక్షను విధించి వదిలేయమని సమాధానపరుస్తాడు. 
 • రావణునితో ప్రశాంతంగా ఆలోచించు! నీ శత్రువుకు నీవేంటో తెలియాలంటే దూతను వదిలేయడమే ధర్మమని చెబుతాడు.
 • ⭄ రామరావణ యుద్ధాన్ని వారించేందుకు విభీషణుడు పడ్డపాట్లు అన్నీ, ఇన్నీ కావు. రావణునితో విభీషణుడు చెప్పిన మాటలు నాడు త్రేతాయుగాన్నే కాదు, నేటి కలియుగాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. 
 • అహంకారం నాడే కాదు, నేడు కూడా కుటుంబాలు నాశనమయ్యేందుకు, జీవితాలు పతనమయ్యేందుకు కాచుకొని కూర్చుంటుందనే గుణపాఠం ఆ మాటల అంతరార్థం.
విభీషణుడు రావణునితో.. 
స్త్రీ వల్లే ధనం, కీర్తి వస్తాయి. స్త్రీ వల్లే సర్వం తుడిచిపెట్టుకుపోతాయి. దేవతలకు కూడా లభించని అమరసుఖాలు మన లంకలో ఉన్నాయి. వాటిని అనుభవించే అదృష్టాన్నీ చేజేతులా పాడుచేసుకోవద్దు. నిన్నే నమ్ముకొని ఉన్న లంకానగరవాసుల్ని ఒక స్త్రీ కారణంగా మృత్యుఒడిలోకి నెట్టొద్దు. నేను నీకు ఆప్తుడనూ, మంత్రినీ. అహాన్ని వదిలి సీతమ్మను సగౌరవంగా శ్రీరామునికి అప్పగిద్దాం. అన్నింటినీ సమూలంగా నాశనం చేసే కోపాన్ని విడిచిపెట్టు. అన్నింటికీ ఆలవాలమైన ధర్మాన్ని పాటించు. కోపాన్నీ అహాన్ని, మైథిలినీ వదిలి రావణుడు కీర్తిని పోందాలనీ, అధర్మాన్ని వీడి ధర్మమార్గంలో నడవాలనీ భావించే ఈ విభీషణుడు నీ మంచే కోరుకుంటాడని ప్రాధేయపడతాడు.

రావణుని మిగతా సోదరులూ, మంత్రులూ, కొడుకులూ రావణుని వైభవాన్ని చాటుతున్నామనుకొని రావణున్ని రెచ్చగొడుతుంటే చూసి సహించలేని విభీషణుడు వారితో రాచధర్మాన్ని నిలబెట్టాలనుకుంటే రాజుకు మంచే చెప్పాలి. అది కఠినంగా ఉన్నా సరే. అధర్మంతో రాక్షస వినాశనానికి పూనుకుంటుంటే సమర్థించడం ఎంత మాత్రం మంచిది కాదని హెచ్చరించాడు.

ఇలా ఎన్నో విధాలుగా చెప్పీ, చెప్పీ అలిసిపోయిన విభీషణుడు ధర్మమే నిలబడుతుందనీ, న్యాయమే గెలుస్తుందనీ నమ్మి రాముని శరణుకోరాడు. రావణుని జయించడానికి అనేక ఉపాయాలూ, రహస్యాలూ రామునికి తెలిపి సహకరించాడు. రావణుడు నేలకొరగడం చూసి తట్టుకోలేక విలపించాడు. అనుకున్నదంతా అయ్యిందనీ, ఒక స్త్రీ వ్యామోహంతో రావణుడంతటి వాడూ, అనంతమైన లంక పతనం అయ్యిందనీ బాధపడి రావణునికి అంతిమ సంస్కారం చేసి సద్గతులకై ప్రార్థించాడు విభీషనుడు.

సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి

Saturday, March 28, 2020

దేవ, రాక్షస గుణాలు - Deva, Raakshasa Gunaalu

దేవ, రాక్షస గుణాలు - Deva, Raakshasa Gunaalu
దేవ, రాక్షస గుణాలు
ప్రతి వ్యక్తిలో దైవీ, రాక్షస గుణాలు ఉంటాయి. వేటిని ఎక్కువగా జాగృతం చేస్తే అవే శాశ్వతంగా నిలుస్తాయి.

దేవతలంటే మనలోని సాత్విక మనోవృత్తులు :-
 • 🝒 భయంలేకుండుట,  
 • 🝒 మనస్సుపరిశుద్ధంగా ఉండుట, 
 • 🝒 జ్ఞానం, 
 • 🝒 దానం, 
 • 🝒 ఇంద్రీయనిగ్రహం, 
 • 🝒 సద్దంధపఠనం, 
 • 🝒 తపస్సు, 
 • 🝒 రుజువర్తనం, 
 • 🝒 అహింస, 
 • 🝒 సత్యం పలుకడం, 
 • 🝒 కోపం లేకపోవడం, 
 • 🝒 మృదుభాషణం, 
 • 🝒 వినయం శాంతం, 
 • 🝒 తేజస్సు, 
 • 🝒 ఓర్పు, 
 • 🝒 ధైర్యం, 
 • 🝒 శుచిత్వం, 
 • 🝒 నేరాలు చేయకపోవడం, 
 • 🝒 ద్రోహ చింతన దురాభిమానం లేకపోవడం అనే సుగుణాలు. 
'దేవతలు' అన్న పదానికి అర్థం. ఇవి జ్ఞానానికి సహాయపడతాయి. సుర అనే పదానికి '‘సు'- మంచిని, రాతి (లాతి)ని తీసుకునే మనోవృత్తిగలవారు. దేవ పదానికి ప్రకాశం అనే మరో భావం కూడా ఉంది. జ్ఞాన, ప్రకాశాలైన మనోవృత్తులు గలవారు దేవతలు. మంచిని గ్రహించని వారు రాక్షసులు. అంటే అసురులు. మనలోని తామసిక మనోవృత్తుల, డాబు, దర్పం, అహంభావం, పరుషభావం, హింస, కామం, క్రోధం, లోభం, మోహం, ఇటువంటి మనోవృత్తి గల గుణాలు అసురులకు ఉంటాయి.

ఇవి అజ్ఞాన కారకాలు. అంటే ఒక వ్యక్తి దేవుడు రాక్షసుడుగా మారడానికి అతనిలో ఉండే గుణాలే కారణం వాటి ఆధారంగానే ఆయన దేవుడు, వాడు రాక్షసునివంటి వాడు అని పలుకుతారు.

మూలము: జాగృతి వార పత్రిక

Thursday, March 19, 2020

సదాచారాలు - Sadaacharamulu

సదాచారాలు - Sadaacharamulu
సదాచారాలు ఏవేవి ?
 • 1. దేవతలను, గోవులను, బ్రాహ్మణులను, సిద్ధులను, ఆచార్యులను పూజించాలి. 
 • 2. చిరగని వస్త్రద్వయాన్ని, విష్ణుక్రాంతం మొదలగునవి ఓషదుల్ని, గారుడం మొదలగు రత్నాలను ధరించాలి.
 • 3. సంధ్యావందనం - అగ్నిహోత్రం ఆచరించడం మంచిది.
 • 4. అలంకరించబడిన వేషం గలవాడై, ఎల్లప్పుడూ ఇతరులకు ఆహ్లాదకరమైన రూపంతో కనిపించాలి. (ఈ వేషాలంకరణలో సమస్త మంగళ ద్రవ్యాలూ చేరతాయి).
 • 5. పర ధనాదులను అపహరించరాదు.
 • 6. స్వల్పంగానైనా అప్రియం పలకరాదు. 
 • 7. ప్రియమైనా అసత్యం కూడదు.
 • 8. ఇతరుల దోషములెన్నరాదు.
 • 9. పరస్త్రీని - విరోధాన్ని కోరుకోరాదు.
 • 10. దుష్టమైన వాహనాలు ఎక్కరాదు.
 • 11. జలం చేత ఆవరించబడిన ప్రదేశంలో నీడ వున్నా ఆశ్రయించకూడదు.
 • 12. శత్రువు, పాపి, ఉన్మాది, అందరితోనూ జగడాలాడేవాడు, కీటకంలాగా బాధించేవాడు, నీచుడు, అసత్యప్రలాపి, నిత్యచోరజారకార్యకలాపి, మూర్ఖుడు, పరస్త్రీ వాంఛగలవాడు, జారిణి, సంకరజాతి స్త్రీలతో సంభాషించ కూడదు.
 • 13. దారిలో ఒంటరిగా పోరాదు.
 • 14. జలప్రవాహం వేగంగా వున్నప్పుడు మునక పనికిరాదు.
 • 15. చెట్టు చివరికంటా ఎక్కరాదు.
 • 16. దంతాలు కొరకడం, ముక్కునలపడం, గట్టిగా అపానవాయువు విడవడం, గోళ్లుకొరకడం, గడ్డి త్రుంచడం, మట్టిగట్టచిదుపడం....ఇవన్నీ నిషిద్ధాలు.
 • 17. నగ్నంగా ఉన్న స్త్రీని, ఉదయాస్తమయాలలో సూర్యుని చూడరాదు.
 • 18. శవాన్ని ఏవగించుకోరాదు.
 • 19. రాత్రులలో రచ్చచెట్టుకు - దుష్టస్త్రీలకు దూరంగా ఉండాలి.
 • 20. బ్రాహ్మణులు, పూజ్యులైనవారు, దేవతలు, దేవతావిగ్రహాలు వీటి నీడను సైతం దాటరాదు.
 • 21. ఒంటరిగా శూన్యారణ్యాలకు వెళ్లరాదు.
 • 22. జనశూన్యాలైన గృహాలలో నివశించకూడదు.
 • 23. కేశములు, ఎముకలు, ముండ్లు అపవిత్రములు, బూడిద, ఊక, స్నానంచే తడిసిన నేల..వీటికి దూరంగా ఉండాలి.
 • 24. అయోగ్యుల్ని ఆశ్రయించకూడదు.
 • 25. కుటిలుడైనవాడిని ఏదీ కోరకూడదు.
 • 26. కృరమృగాలు - సర్పములు మొదలగు వాటిని చూస్తే దూరంగా జరగాలి.
 • 27. వాటికి చేరువుగా కొద్దికాలమైనా నిలబడరాదు.
 • 28. అతిగా మేల్కోవడం అతిగా నిద్రపోవడం, అతిగా వ్యాయామం చేయడం నిషిద్ధం.
 • 29. కోరలు కొమ్మలుగల జంతువులకు, మంచుకు, మిక్కిలి బాధించే గ్రీష్మానికి దూరంగా ఉండాలి.
 • 30. దిసమెలతోస్నానం చేయడం గాని, నిద్రించడంగాని, ఆచమనం చేయడం గాని పనికిరాదు.
 • 31. అట్లే జుట్టుముడివేయక ఆచమించకూడదు.
 • 32. దేవతార్చనాదులూ పనికిరావు.
బ్రాహ్మణుని కాళ్లుకడిగేటపుడు, దేవతార్చనలోను, హోమాలు చేసేటపుడు, ఆచమనం చేసేటపుడు ఏకవస్త్రం పనికిరాదు. అంగవస్త్రం (భుజం మీద ఇంకొక వస్త్రం) ధరించి తీరాలి.
 • 33. మంచి శీలవంతులనే స్నేహం చేయడానికి ఎన్నుకోవాలి. 
 • 34. దుర్నడతగలవారికి దూరం జరగాలి. 
 • 35. అరక్షణకాలమే అయినా సాధుపుంగవుల సాంగత్య మహిమ నెన్నతరమా?
 • 36. ఉత్తములతో గానీ - అథములతో గానీ విరోధమెన్నడూ పనికిరాదు సగరచక్రవర్తీ! హాని అల్పంగా ఉంటే సహించే నేర్పు కలిగిఉండాలి.  ఓర్పుముఖ్యం. 
 • 37. పెనుహాని అయినపుడు అలక్ష్యం పనికిరాదు. 
 • 38. ప్రాజ్ఞుడు కయ్యానికి కాలుదువ్వరాదు. 
 • 39. శుష్కకలహం పనికిరాదు. 
 • 40. వివాహమైనా వివాదమైనా సమఉజ్జీలతోనే సాగాలి. 
 • 41. వైరం చేత ధనాన్ని ఎన్నడూ ఆర్జించవద్దు. నిలబడి ఆచమనం చేయవద్దు.
 • 42. ఒక కాలితో ఇంకోకాలు తొక్కరాదు. 
 • 43. స్నానంచేసిన వస్త్రంతోగాని చేత్తోగాని అవయవాలను తుడుచుకోరాదు. 
 • 44. కేశాలను దులుపుకోరాదు. పూజ్యులైన వారివైపు కాళ్లు చాచరాదు.
 • 45. గురువుగారు ఎదుట ఉండగా ఆసనం అధిష్ఠించరాదు. తప్పని పరిస్థితిలో వినయంగా కూర్చోవాలి. దేవాలయంలో అపసవ్యప్రదక్షిణ పనికిరాదు. పూజ్యులకెదురుగా, సూర్యచంద్రాగ్నుల కెదురుగా ఉమ్మివేయుట తగదు.
 • 46. శ్లేషం, మూత్రం, రక్తం, పురీషాలను ఎప్పుడూ దాటకూడదు. 
 • 47. అగ్నిహోత్ర సమయంలో గాని,పూజాసమయంలోగాని, మహాజన మధ్యంలోగాని, హోమశాలలోగాని కఫం, శ్లేషం విడువరాదు. 
 • 48. (చీదరాదని అర్థం!) స్త్రీలను అమ్మడం గాని, అవమానించడం గాని, ఈర్ష్యపడడం గాని, ధిక్కరించడం గాని నిషేదము. 
 • 49. రత్నాదిపూజ్య వస్తువులకు నమస్కరించకుండా ఇంటినుంచి బయలుదేరరాదు. 
 • 50. విద్వాంసుల సేవ, సకాలంలో హోమక్రియ సజ్జనలక్షణాలు దీనోద్ధరణ కూడ.
ఓ రాజా! దేవతలను, ఋషులను పూజించేవాడు - పితృదేవతలనుద్దేశించి తర్పణాలు - పిండప్రదానాలు చేసేవాడు - అతిథులను సత్కరించేవాడు ఉత్తమలోకాలకు వెళ్తారు. హితకరమైన పలుకులను ఆహ్లాదంగా చెప్పేవాడు, అక్షయమైనట్టి లోకాలను చేరతాడు.
 • 51. బుద్ధిమంతులు, క్షమావంతులు, వినయశిలురు, ఆస్తికులు సర్వోత్తమ లోకాలను పొందగలరు. అశౌచాది వేళలలోను, సూర్యగ్రహణాదులలోను, మేఘగర్జన సమయంలోను, పూర్నిమనాడు వేదాధ్యయనం పనికిరాదు. 
 • 52. కోపగ్రస్తుడ్ని శాంతపరచడం - భయపడ్డవాడిని ఓదార్చడం - ఎవరిమీదా ద్వేషం లేకుండా ఉండడం - అందరికీ బంధువుగా మెలగడం అనేవి సాధుకృత్యాలు. 
 • 53. ఇటువంటి సాధువుకు స్వర్గసౌఖ్యం సైతం అల్పమైన ఫలితంగానే తోచగలదు.
ఇంకా సదాచారాలు (జాగ్రత్తల నిమిత్తం చెప్పబడినవి) కొన్ని ఉన్నాయి. వాటిని ఆచరించడం సత్పురుష లక్షణం అనిపించుకుంటుంది.
 • 54. ఎండా వానల్లో గొడుగుధరించి, అడవుల్లో - రాత్రుల్లో దండము ధరించి, దేహరక్షణ నిమిత్తం పాదరక్షలు ధరించి సంచరించాలి. 
 • 55. పైకి చూస్తూ, అడ్డముగా చూస్తూ, దూరాన్ని పరికిస్తూ నడకసాగించకూడదు. 
 • 56. కనుచూపుమేర ఏవేవి స్పష్టంగా కనిపిస్తుంటాయో అవే చూసుకుంటూ నడవాలి.
 • 57. నియత్రితమైన మనస్సుతో, దోషాలు కలిగించేవాటన్నిటినీ దూరం జరిపి సంచరించేవారికి ఎటువంటి హాని కలుగదు. 
సదాచారవంతునికి ముక్తి కరతలామలకమే అనవచ్చు! కామక్రోధలోభాది అరిషడ్వర్గాలకు లోను కాకుండా సదాచారులై సంచరించేవారివల్లనే ఈ భూమి ఇంతకాలం నిశ్చింతగా ఉంది. (లేకున్నచో అల్లకల్లోలం తథ్యమని భావం)

ఇతరులకు దుఃఖకారణమవుతుందనుకుంటే, అది సత్యవచనం అయినప్పటికీ చెప్పకూడదు. మౌనమే శ్రేయోదాయకం. సాధారణస్థితులలో సత్యమే పరమప్రమాణం. ప్రియమైనదే అయినప్పటికీ హితకరం కాదని తెలిస్తే అప్పుడు కూడా మౌనంగా ఊరకుండడం ఉత్తమం. ప్రాణులకేది హితకరమో దాన్ని త్రికరణశుద్ధిగా ఆచరించేవాడే బుద్ధిమంతుడు.

సంకలనం: భానుమతి అక్కిశెట్టి

Friday, February 14, 2020

ఈ వాలెంటైన్స్ డే అంటే ఏమిటి?? ప్రేమపేరుతో పెళ్ళికి ముందు రంకుచేసే కామజంటల దినం కాదా? - What is Valentines Day Meansఈ వాలెంటైన్స్ డే అంటే ఏమిటి?? ప్రేమపేరుతో పెళ్ళికి ముందు రంకుచేసే కామజంటల దినం కాదా? - What is Valentines Day Means
"ఈ రోజు ప్రేమపేరుతో పెళ్ళికి ముందు రంకుచేసే కామజంటల దినం"
ఈ వాలెంటైన్స్ డే అంటే ఏమిటి?? మన దేశంలో ఈ ప్రేమికుల రోజు అవసరమా .. ఏది వాస్తవం.. ఏది అవాస్తవం???
వాలెంటైన్ అనబడే ఇటలీ దేశస్థుడొకడు ప్రేమ గురించి తన ప్రాణాలను ధారపోశాడని, అతను మరణించిన రోజుని ఫిబ్రవరి 14గా స్థిరీకరించుకుని ఆ రోజున అతని పేర ‘ప్రేమికుల రోజు’ను జరుపుకుంటున్నామని నేటి ప్రేమికులు చెప్పుకుంటున్నారు.

ఏది వాస్తవం??
వలంటేన్ గురించి చెప్పే ఈ అంశంలో చాలా తప్పులున్నాయి. యథార్థ చరిత్రను తిరగేసి చూస్తే అసలు విషయం ఇది. వాలెంటైన్ వివరాలు కచ్చితంగా, సుస్పష్టంగా చరిత్రలో లేవు.

3వ శతాబ్ద కాలంలో ఇటలీ దేశ చరిత్రలో ముగ్గురు వాలెంటైన్లు కన్పిస్తున్నారు. ఒక వాలెంటైన్ మతాధికారిగా ఉండేవాడు. మరో వాలెంటైన్ రోమ్ చక్రవర్తి గ్లాడియస్-2 సైన్యంలో ఒక సైనికుడుగా ఉండేవాడు. 3వ వాలెంటైన్ ఒక సామాన్య రోమన్ పౌరుడు. మొదటి వాలెంటైన్ మతాధికారిగా ఉంటూనే మరణించాడు. 2వ వాలెంటైన్, రోమ్ చక్రవర్తి గ్లాడియస్-2చే వధించబడ్డాడు. దీనికో కథ ఉంది. చక్రవర్తి గ్లాడియస్-2, తన సైనికులెవరినీ వివాహం చేసుకోనిచ్చేవాడు కాదు. అలా అయితే సైన్యం పూర్తిగా శక్తివంతంగా ఉంటుందని అతని భావం. అయితే ఆ సైనికులలో ఒకడైన వాలెంటైన్ తన సహచరులైన సైనికులకు రహస్యంగా పెళ్ళిళ్ళు జరిపించేవాడట. ఈ సంగతి తెలుసుకున్న చక్రవర్తి, ఆ వాలెంటైన్‌ను వధించాడు. దీన్నిబట్టి చూస్తే, ఈ 2వ వాలెంటైన్ అనేవాడే అసలైన వాలెంటైన్ అయి ఉండవచ్చు కానీ ఇతను ఒక పెళ్ళిళ్ళ పేరయ్య లాంటి వాడే... ఇక 3వ వాలెంటైన్ సంగతి! ఇతనొక సాధారణ పౌరుడు.

చరిత్రలో ఉన్న మొత్తం వాలెంటైన్ల అసలు చరిత్రలు ఇవి! ఈ ముగ్గురు వాలెంటైన్లలో ఏ ఒక్కణ్ణి తీసుకున్నా కూడా వాడు అమర ప్రేమికుడు ఎలా అయ్యాడో అర్థం కాదు. ఇక ఫిబ్రవరి 14 అనే తేదీ వీళ్ళ పుట్టిన తేదీ కాదు. కనీసం చనిపోయిన తేదీ కూడా కాదు. ఈ వలంటేన్ కధ గురించి చెపుతున్న కాలంలో వలంటేన్ అనే పేరు సాధారణం అనేకమంది ఉన్నట్టు చలా మంది చెపుతున్నారు

ఏది వాస్తవం???
ప్రాచీన రోమన్లు పూజించే దేవతల్లో ‘జూనో’ అని ఒకావిడ ఉంది. ఆ దేవత ‘‘స్త్రీలకు, పెళ్ళిళ్ళకు సంబంధించిన దేవత’’ అని వారి నమ్మకం. ఆ జూనో దేవతపై ఉన్న భక్తి శ్రద్ధలతో ఫిబ్రవరి 14వ తేదీన రోమ్‌లో సెలవు ప్రకటించుకుని ఉత్సవాలు చేసుకునేవారు. ఫిబ్రవరి 15వ తేదీన రోమ్ నగరంలో ఎంతో ఉత్సాహంతో జరుపుకునే వసంతోత్సవం క్రమంగా ఫిబ్రవరి 14కు మారిపోయింది. ఇన్ని విధాలుగా 14వ తేదీకి ప్రాముఖ్యత వచ్చింది.

అనంతర కాలంలో ఆ ఫిబ్రవరి 14 గురించి తెలుసుకున్న అమెరికన్ పౌరులు, తమ పరస్పర ప్రేమల్ని తెలియపరచుకోడానికి ఆ రోజున ప్రేమ కార్డులను పంచిపెట్టుకోవడం మొదలుపెట్టారు. సరిగ్గా ఆ సమయంలో ‘వాలెంటైన్’ దశ తిరిగింది. ముగ్గురు వాలెంటైన్లలో ఎవడైతే నేమి వారిలో ఒక వాలెంటైన్‌ను తీసుకుని, వాడికి అమర ప్రేమికుడుగా ముద్రవేసి వాడికీ, వాడికి ఏ మాత్రం సంబంధం లేని ఫిబ్రవరి 14వ తేదీకీ ముడి పెట్టేశారు కొందరు. 

వెర్రివేయి విధాల ముచ్చట!! 
ఇక చూడండి... ‘‘వాలెంటైన్స్ డే... ఫిబ్రవరి 14.. ప్రేమికుల రోజు’’ అంటూ మొదలయింది. అనేక దేశాల్లోకి ఈ వెర్రి పాకింది. అయితే ఈ మధ్య ఈ వెర్రి మరీ ముదరడం చూసిన చాలా దేశాల ప్రభుత్వాలు తమతమ దేశాల్లో ఈ ‘ప్రేమికుల పండుగ’ను నిషేధించాయి. చివరకు అమెరికాలో కూడా కొన్ని ప్రాంతాల్లో నిషేధించారు. అయితే మన భారతదేశంలో మాత్రం ఈ పిచ్చి అంతకంతకూ ముదురుతోంది.

ఏది నిజమైన ప్రేమ-ఏది నిజమైన అనుబంధం??
''భార్యాభర్తల మధ్య అంకురించే ప్రేమ మానవజాతికే శుభకరం. స్నేహితుల మధ్య ఉండే ప్రేమ మానవాళిని ఉన్నస్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళుతుంది. కానీ, వ్యసన పరాయణ కాముక ప్రేమ సమస్త మానవుల్ని భ్రష్టుపట్టిస్తుంది'' అన్న బెకన్‌ మహాశయుడి మాటలు 'ప్రేమికుల రోజు'న స్మరించుకోవడం ఎంతో అవసరం.

Tuesday, August 6, 2019

దేవుడి గుడిలోని ఉశ్చ విగ్రహాల్ని భక్తుల ఇళ్ళలో,ఫంక్షన్ హాళ్లలో పెట్టి పూజించ వచ్చా? - Gudilo Vigrahalu


దైవ సంబంధ ప్రతీ కార్యం పవిత్రా నిష్టా నియమాలను పాటిస్తూ చేయాలని ఋషులు పెద్దలు ,పండితులు శలవిచ్చారు.దైవ విగ్రహ ఆరాధనలో అణు లేశమంత అపవిత్ర అప శ్రుతులు కూడా కర్ణ,చక్షు కఠోర శిక్షలకు కారణమౌతాయిన, అగ్నితో చలగాటం సుమా.

ఈ కలియుగంలో ఇంటా బయటా సర్వం అశుధ్ధం అపవిత్రం కనుక మూల వీరాట్టైన ,ఉఛ్ఛ దైవ విగ్రహాలైన దేవాలయంలో తప్ప వీధుల్లో ఎక్కడా పూజ కు నిషేధం.

కలి మాయాజాలంలో సాధువులు, మరోహరు శాస్త్ర విరుధ్ధంగా సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నారని విజ్ఞులైన వారంతా విచక్షణా విశ్లేషణ రహితంగా ఆచరించుటం అవివేకం. మన ధర్మ శాస్త్రం మనకు ఆదర్శం.

రచన: H.V.S.R.C. SHARMA C.ENGR.(RTD)
అనువాదం: కోటి మాధవ్ బాలు చౌదరి

Thursday, August 1, 2019

భగవంతుడిని మరిచిన ఓ కీలు బొమ్మ - Bhagawantudini Marachina


  కలియుగంలో మానవుడు భగవంతుడిని మరిచి తన ఆత్మ ఈ సృష్టిలో ఓ కీలు బొమ్మ అని మరిచి తనను తాను హద్దు పద్దు లేకుండా విర్రవీగటం తన భష్యత్ పురోభివృద్ధికి ఏమాత్రము శ్రేయస్కరం కాదని ఇప్పటి కైనా గుర్తిస్తే మంచిది. ఏ క్షణంలో నైనా మానవ పతనం మొదలు కావచ్చూ. బహు పరాఖ్. సర్వం కల్తీ మాయ మైంది. గాలి, నీరు, కూరలు. పళ్ళు, భోజనం, మానసిక బాంధవ్యాలు, అన్ని అనుభవ కలుషిత మైనవి.
నరకం భూమ్మీదే అనుభవిస్తు
నరకం భూమ్మీదే అనుభవిస్తు
ప్రస్తుత జన్మలో ఉన్న పుణ్యం కాస్త ఆవిరి అయింతర్వాత ప్రతి ఆత్మ కు గడ్డు కాలం మొదలవుతుంది. రేపు హాస్పిటల్లో కర్ణ కఠోర, చక్షు జుగుట్స్పకర వ్యాధులతో బాధ పడుతూ రోగం నయం అవక ప్రాణం పోకుండా రౌరవతి నరకం భూమ్మీదే అనుభవిస్తుంనపుడు కళ్ళలో నీళ్లు కాదు రక్తం కారిన కుటుంబ సభ్యులంతా లక్షల్లో డబ్బు ఖర్చవుతుందని మానసిక వ్యాధి పెంచుకున్న భగవంతుడు కాపాడాడు.కర్ణుడి పాపల్లా అనుభవించమంటాడు.కనుక నేడే కళ్ళు తెరవండి ప్రపంచ ప్రజలారా. భగవత్ ప్రార్థన రోజు మీ కుటుంబ పద్దతుల ప్రకారం చేయండి. ధర్మంగా మానస, వాచా,కర్మణా సర్వ ప్రాపంచిక కర్మలు ఆచరించండి. 
రేజర్వాయర్లు నీళ్లు లేక
రేజర్వాయర్లు నీళ్లు లేక 
ఇప్పటికే అన్ని రేజర్వాయర్లు నీళ్లు లేక ఎండి పోయాయి. మన సద్బుద్ధితో చేసే కార్యాలవల్ల భగవంతుడు అన్ని విషయాలలో కరుణించి దీవించి ఆదుకుంటాడు. బీదవారికి,కుంట్టి, గుడ్డి,మూగ మానవులను ఆదరించండి చేతనైనంత సాయం చేయండి. వారి మనో దేవనాలు పొందండి.ముసలి వాళ్ళైనా అమ్మ, నాన్నలను కంటికిరెప్పలా కాపాడండి ఎన్నడూ వారి కంట నీవు పెట్టుకోకుండా చుడండి. వారి దీవెనలు ౩౬౦౦/౨౪/౭/౩౬౫ సెకండ్లు, గంటలు, దినాలు,రోజులు పొందండి. పరలోకంలో ఉన్న ఆ సృష్టికర్త సంతోషిస్తాడు.ఈ యావత్ కలియుగ ప్రపంచ నాటకం స్వర్గ సీమగా మారుతుంది.

ఈ భూమ్మీద ప్రతి రోజు మన స్వర్గస్తులైన తల్లితండ్రులు సృష్టాన్తమ్ వరకు పుణ్య లోకాల్లో మోక్ష గాములై,కైవల్ల్య గాములై,మరో జన్మలు లేకుండా అమ్మ వారి మరియు అయ్యవారి సన్నిధి లో పూజ పునస్కారాలు, యజ్ఞాలు చేస్తూ ఉండాలని సృష్టి కర్తను కోరుకుంటూ ఉండాలి.యిది ప్రతి సంతానం విద్యుక్త ధర్మము. ఈ జన్మం సాఫల్యం కావటానికి అత్యుత్తమ సోపానము.కనుక మరువకుండా జీవించినంతకాలం మీ తల్లి తండ్రుల మోక్షం,కైవాల్ళయం కోసం జన్మ రాహిత్యం కోసం సత్తా సర్వదా భగవంతుణ్ణి ప్రార్ధించండి. పుణ్యం మూట కట్టుకోండి.   

రచన: H.V.S.R.C. SHARMA C.ENGR.(RTD)
అనువాదం: కోటి మాధవ్ బాలు చౌదరి

Sunday, July 7, 2019

ఆధునిక ప్రపంచంలో పౌరోహిత్య స్థితిగతులు - Purohityam in Modern Worldఆధునిక ప్రపంచంలో పౌరోహిత్య స్థితి, గతి - Purohityam in Modern World
ఆధునిక ప్రపంచంలో కొంతమంది పురోహితులు కూడా అందరిలాగే కలి ప్రభావానికి గురి ఆవు తున్నారు. మనసా, వాచ,కర్మణా వారి దైనందిక పౌరోహిత్య కార్యక్రమాలు విధిగ, నిష్ఠగా, వైదిక , స్మార్త ప్రాచీన కఠిన నిబంధలకు అనుగుణంగా కాక ప్రతికూలంగ క్రమ క్రమంగా ప్రతి రోజు యదేశ్చగా సాగిస్తున్నారు.పండితులు, పామరులు ఎవరు ఇదేమిటని ,ఎందుకిలా చేస్తున్నారని జ్యోక్యం చేసుకొని ప్రశ్నించటంలేదు. దీనికి తోడుగా అపరం, పరం మరియు పంచ దశ,షోడశ కర్మలు, వ్రతాలు, దైవ అర్ఛనులు, అభిషేకాలు, వడుగులు, పెళ్లిళ్లు, లింగార్చనులు, జపాలు, తపాలు,హోమాలు, తర్పణాలు, శార్దలు, సంవత్సరీకాలు అవలీలగా లాంఛనప్రాయంగా ఓ సినిమా షూటింగ్ తంతు లాగా జరిపిస్తున్నారు. 

ఆధునిక పురోహితులు పౌరోహిత్యంలో స్వీయ శాస్త్ర ప్రమాణములు, ఘనాపాటి పటుత్వములేక , మంత్రాల , శ్లోకాల ఉచ్చారణ విధాన, ప్రక్రియలు శుద్ధిగా, విధిగా సంపూర్ణంగా శాస్త్రోత్తంగా సర్వానుష్ఠాన కార్యాచరణంగా నిర్వహించే అనుభవం లేక మన పూర్వీకుల ఘన కీర్తి దిగ జార్చేలా ఆధునిక అలవాట్ల మోజులో అవరోహణ పద్ధతుల్లో నేటి పౌరోహిత్యంలో అపశృతులు జరుపుతుండటం మన వైదిక బ్రాహ్మణ భవిష్యత్ మనుగడకి అఘాతం కలిగిస్తోందని ప్రతి బ్రాహ్మణాత్మ నఖ శిఖ పర్యంతం ప్రతిరోజు సూర్యోదయం నుండి చంద్రాస్తమయం వరకు భయంతో, పుట్టెడు దుఃఖంతో క్షణం క్షణం ఘోషిత్తోంది. ఈ పౌరోహిత్య కార్యాచరణ అపశృతులు స్వతః పురోహితుల తిరోగాభివృద్ధికేకాకుండా, వారి ద్వారా పూజ,వ్రత, అర్చన,అభిషేకాలు తదితర దైవానుష్ఠాన కార్యాచరణం నిర్వహించే సమస్త గృహ,ఆలయ యజమానులకు తీవ్ర కర్ణ, చక్షు కఠోర భవిషత్ విపరీత జీవిత సంకటాలకు, గ్రామా, నగర, రాష్ట్ర, దేశ, ప్రపంచ ప్రళయాళ సంభవాలకు ప్రత్యక్ష నిదర్శనాలవుతున్నాయి. కనుక అనుభవం లేని ధనార్జనే ధేయంగా నిత్య పౌరోహిత్య సాంప్రదాయ కార్యాచరణ విధానాలకు తిలోదకాలిస్తోన్న పురోహితులతో దైవ కార్యాలు, పితృకార్యాలు చేయించడం భవిష్యత్తులో కర్తలుగా మన కెంత శ్రయస్కరమో? చేసిన దైవ,పితృకార్యాల ఫలితం ఎంతమేర, ఎన్ని పాళ్ళలో కర్తలకు దక్కుతుందో లేక పుట్టెడు పాపం తలాపిడికెడు ఎంత మూటకట్టుకోవాలో ?? ఇకనైనా ఆలోచించాలి. 

అసలే బ్రాహ్మణ పౌరోహిత్యం పఞ్చ బ్రహ్మ రౌరవాతి మహా పాపాలకు మూలం అన్నారు మన పూర్వికులు. అటువంటిది, నేటి ఆధునిక ప్రపంచంలో కొంతమంది పురోహితులు తెలిసి తెలియక అమాయకం, మూర్ఖత్వంతో అఖండంగా తగిన నిష్ఠ, గరిష్ట నిబంధనలు పాటించక తెలిసిన పెద్దల సాంగత్యం లో పౌరోహిత్యం కార్యాచరణం అభ్యసించక ,ఈ ఇరువై ఒకటవ శతాబ్దిలో స్వీయ కవిత్వంతో ఓ తంతులా ప్రతి దైవ పితృకార్యాలు నిర్వహించటం బహు దురదృష్టకరం, గర్హణీయం కూడా. దీనికి తగిన స్వీయ పరిహారం, ప్రాయశ్చిత్తం గురు, దైవ భయంతో నిత్యం స్వతః ప్రతి పురోహితుడు జప,తప, హోమాదులుతో నిర్విఘ్నంగా నిర్వహించకో కున్న, సృష్టికర్త ఆ భగవంతుని ఆగ్రహంతో ధర్మ దేవత ఒక్క పాదంతో కూడా నడవని నేటి కాలమ్ లో బ్రాహ్మణ సమాజం ఎలా భూమ్మీద బట్ట కట్టి బ్రతకగలదో ముందు తరాల్లో అర్థం కానీ అగమ్య, అగోచర దైవ గూడ రహస్యం గా వర్తమానంలో అంతు చిక్కటం లేదు.

ఈ శృతిమించిన ఆధునిక పౌరోహిత్య కార్యాచరణం నిర్వాహక ప్రతి బ్రాహ్మణ ఆత్మ ఇలలోనే రౌరవాతి నరకాలు అనుభవించటం ఖాయం.గరుడ పురాణం ప్రకారం ఈ శృతిమించిన నిర్వాకానికి శత సహస్ర కోట్ల జన్మల నరక ప్రాప్తి ప్రతి పురోహితుడికి ఉంటుందనడంలో కించిత్ సందేహం ఏ క్రోసాన లేదనటం అతిశయోక్తి కాదు.కనుక కలియుగ పురోహిత మహాశయు లారా మేల్కొనండి!! స్వీయ ప్రతి పౌరోహిత్య కార్యాచరణం ఆచరణలో పొల్లుపోకుండా అపరాధాలు జరగకుండా కూలంకషంగా శాస్త్రాధ్యయనం, కార్యాచరణం ప్రారంభించండి . మనస్సును, శరీరాన్నీ, మేధస్సును అప్రమత్తం చేసి పౌరోహిత్య విధుల్లో అపశృతులు మోగకుండా ఇక పై ప్రతి రోజు ప్రతి క్షణం కంటి రెప్ప వాలకుండా జాగ్రత్త పడండి. యజమానులకు, పురోహితులకు ఉభయాత్ భగవత్ శుభమంగళాశీస్సులు అష్టైశ్వర్య అదృష్ట ఆశీర్వచనాలై శతసర్వదా జీవితాంతం లభిస్తాయి.

ఆధునిక పురోహితులకు సెల్ ఫోన్లు రోజు వారి పూజలు, వ్రతాలు , అర్చనల్లో,తదితర దైవ కార్యాచరణలో ఆలయాలలో, గృహ సాంప్రదాయ దైవ అనుష్ఠానంలో ఆధ్యాత్మిక నిగ్రహ శక్తిని తగ్గిస్తున్నాయి. కనుక సెల్ ఫోన్ల వాడకం పౌరోహిత్య సంస్కార క్రియాచరణ సందర్భాలలో నిషేదించటం అన్ని విధాలా శ్రేయస్కరం.ఆలయ మరియు గృహ యజమానులు ఈ ఆధునిక పౌరోహిత్య పోకడలకు స్వస్తి చెప్పేందుకు కంకణం కట్టాలి.బలవంతంగా ఈ నూతన పౌరోహిత్య పోకడలకు మంగళం పడాలి.
పురోహితులకు డబ్బే ముఖ్యం కాదు, పౌరోహిత్య పాండిత్యము క్రియ కార్యాచరణం మీద శ్రద్ధ,నిష్ఠ, దైవ భయ ఆలోచన ఉండాలి.లేకుంటే కలియుగ ప్రభావం నఖ,శిఖ పర్యంతం ప్రతి ఆత్మను ఆవహిస్త్తుంది. బహు జాగ్రత్త సుమా.
ఈ ఆధునిక సమాజం లో సమాజం సంస్కర్తలే కాకుండా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, దేవాదాయ మంత్రి గారు ప్రభుత్వ అధికారులు కూడా పౌరోహిత్య ఆలయ, గృహ కార్య క్రమాల పై విహంగ విక్షణ చేయాలనీ కోరుతున్నాను. మన భారత దేశ పూర్వీక సాంప్రదాయ పద్ధతులను తు.చ.తప్పక భవిష్యత్తులో గృహ,ఆలయ పౌరోహిత్య కార్యక్రమాలలో యధావిధిగా సర్వవేళలా పాటించేలా అడుగడుగునా గ్రామ, నగర, రాష్ట్ర, దేశ ప్రభుత్వ యాజమాన్యం జన్మ సంకల్పంగా బాధ్యత వహించాలని కోరుతున్నాను.

ఈ ఆధునిక కాలములో ప్రాచ్యాత్య దేశాల వారు కలియుగ విచిత్రంగా నేడు మన దేశ సంస్కృతి సంప్రదాయాలను, పూజా పునస్కారాలు,వేదం పఠనము పొల్లు పోకుండా విధి విధాన పద్ధతులను అణువణువునా పుణికి పుచ్చుకొని, ఆపోసన పట్టి, జీర్ణించుకోని మనతో పోటీపడుతూ సవాలు చేస్తున్నారు కనుక మన బ్రాహ్మణ ఆధునిక పౌరోహిత్య ప్రవుత్తిని మార్చుకోకపోతే ఈ యావత్ ప్రపంచంలో వర్తమాన దైవ కార్య, సాంప్రదాయ కార్యాచరణ పోటీలో ముందు తరాల్లో మన బ్రాహ్మణులు మన పొరుగు దేశాల ఆధ్యాత్మిక తేజో ప్రాభవాల హోరులో కనుమరుగై అభాసుపాలు కాకతప్పదు ..బహుపరాక్.

అండ, పిండ భ్రహ్మాండ నాయకుడు సృష్టి కర్త భగవంతుడు ఈ భారత దేశ యావత్ బ్రాహ్మణ సమాజాన్ని, పురోహితుల్నిమన పూర్వీకుల అనుష్టాన నిష్ఠ,గరిష్ట, ఘనాపాటి పౌరోహిత్య పౌరుష అడుగుజాడల్లో ఎల్లప్పుడూ యెల్ల వేళల్లో సూర్యోదయ నుండి చంద్రాస్థమయం వరకు నిర్విఘ్నంగా ఎద్విధమైన అనాచారాశుభాలుకు లోనుకాకుండా ఆచంద్రార్కం సృష్ట్టిలో భగవంతం సాక్షాత్కరించినంత వరకు శతసహస్రకోటి సూర్యుళ్ళ తేజో ప్రకాశవంత వెలుగులతో బ్రాహ్మణ్య మనుగడ సవిస్తరంగా వర్ధిల్లాలని,దిన దిన ప్రవర్ధమానం కావాలని యావత్ బ్రాహ్మణ మహాశయులు తరఫున ఆ సృష్టి జనని జనకులైన వైష్ణవి దేవిని, కేదారనాథ,బద్రినాథుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను.

రచన: H.V.S.R.C. SHARMA - C.ENGR.(RTD)

అనువాదం: కోటి మాధవ్ బాలు చౌదరి

శుభంభూయాత్
సర్వ బ్రాహ్మణానాం యిల ఆచంద్రార్కం భవిష్యత్ సుఖినోభవంతు.  స్వీయ మిదం స్వస్తి .

XXI CENTURY FEW MODERN ANDHRA PRIESTS PROFESSIONAL POUROHITYA ETHICAL ATTITUDES ARE NOT UP THE MARK AS PER THE OUR GREAT ANCIENT INDIAN CUSTOMS &TRADITIONAL STANDARDS HAVE TO BE NEEDS CHANGE BY FORCE BY OUR HONORABLE ANDHRA PRIESTHOOD MASTERS WITH IMMEDIATE EFFECT. 

FOR HAVING BLESSED WITH ACTUAL MYTHOLOGICAL EFFECTIVE RESULTS BY DEVOTEES DOING OCCULT PERFORMING'S BY THEM 24/7 AT EVERY HOME&TEMPLE AND OTHER RELIGIOUS FUNCTION SPOTS ON THIS INDIAN SOIL MODERN INDIA.

TODAY,IT VERY SAD AND SHAMELESS TO NOTE THE FACTS IN OUR DAILY LIFE IN EVERY OCCASION. FOR GOD FEAR SAKE DO STOP THE NONSENSE WITHOUT ANY COMPROMISE BY HOOK OR COOK.

SARVEJANA SUKHINOBHAVANTHU.

ఓం 

Sunday, September 9, 2018

విదేశీ మతాలకు అమ్ముడు పోతున్న , స్వదేశీ రాక్షసులు - Swadesi Rakshasulu

భారత దేశంలో కొన్ని మానవ దయ్యాలు మన దైవాలను, హిందూ ధర్మాన్ని, వేదాలను, శాస్త్రాలను, గ్రంధాలను, పురాణేతిహాసాలను, బ్రాహ్మణులను దూషించటము, ద్వేషించటమే పనిగా పెట్టుకున్నాయి. పవిత్ర హిందూ దేవాలయాలను కూల్చివేస్తున్నాయి. ఆ మానవ దయ్యాలు హిందూ సమాజం అగ్ని నేత్రాల తీక్షణకు, ధాటికి మాడిమసైపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్నప్పుడు ఈ పవిత్ర పుణ్య

భారతదేశం ఆధ్యాత్మిక ప్రాకాశంతో జాగృతమై విరాజిల్లింది.
తపో సంపన్నులైన ఎందరెందరో భారతీయ ఋషులు,"సమస్తమైన అంధకారానికి అతీతమయిన సూర్య దీప్తితో ప్రకాశించే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని సాక్షాత్కరించుకున్నారు. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ప్రత్యక్షం చేసుకోవడం వలన మాత్రమే మానవుడు మృత్యువునకు అతీతుడవుతాడు. ఈ జనన మరణ వలయం నుండి తప్పించుకోవడానికి ఇది తప్ప మరో మార్గం లేదు".

"అమృత పుత్రులరా! ఆలకించండి" అని ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని సాక్షత్కారం చేసుకోవటానికి భూలోకవాసులను మాత్రమే కాక పర లోకవాసులను సైతం ఆహ్వానించారు.

పురాణకాలం నుండి ఈ లోకాన్ని పునీతం గావించే రీతిలో జీవించిన ఋషులు దివ్యానుభూతుల సమాహారమే వేదాలు.
లోకంలో అతి ప్రాచీనమైన గ్రంధాలు ఈ వేదాలే!
ఇవి ఎప్పుడు అవిష్కరింపబడినవో ఎవరికీ తెలియదు. కాని నాటి మాదిరిగానే నేటికీ కూడా అవి నిత్యనూతనమై ఉన్నాయి. ఎందుకంటే మునుపటి కన్నా అత్యంత నూతన వికాసంతో విరాజిల్లుతున్నవి కనుకనే.

వేదాలు అపౌరుషేయాలు. ఎన్నటికీ శాశ్వతంగా విరాజిల్లే సత్యాల సమాహారమే వేదాలు.

భూమి ఆకర్షణ శక్తి కనుగొనడానికి మునుపే అవి ఉన్నాయి. యావత్తు మానవాళి దానిని మరచిపోయినప్పటికి అవి ఉండే తీరుతాయి. అదే విదంగా ఆధ్యాత్మిక లోకంలోని విధులు కూడా ... వాటిని కనుగొనడానికి మునుపు కూడా అవి ఉండే ఉన్నాయి. వాటిని మనం విస్మరించినప్పటికీ అవి ఉంటూనే ఉంటాయి. (అని వచిస్తున్నారు స్వామి వివేకానంద) ఋషులు వాటిని ఆవిష్కరించారు, అంతే.

అలా ఋషులు ఆవిష్కరించిన ఆ సత్యాలను తదనంతర కాలంలో వ్యాస మహర్షి 4 భాగాలుగా క్రోడీకరించారు. అవే ఋగ్, యజర్, సామ, అదర్వణ వేదాలు. ప్రతీ వేదమూ 3 ప్రధాన భాగాలుగా వర్గీకరింపబడింది. 

అవి:
 • సంహిత (దేవతా ప్రార్థనలు). 
 • బ్రాహ్మణం (యాగ వివరాలు), 
 • అరణ్యకం... (ఉపనిషత్తులు, చరమ సత్యాన్ని గురించిన విచారణ)
దైవ సమానులయిన శ్రీ వేదవ్యాసుల వారు వేదాలను 4 భాగాలుగా విభజించి ఆ వేదాల పరమార్ధం సామాన్యుడికి సైతం అర్ధమయ్యే విధంగా ఈ మానవాళికి అందించారు. ఆ వేదాల సారాన్ని అర్ధం చేసుకోలేని కొన్ని మానవ దయ్యాలు అదే విదేశీయుల చంకలు నాకుతూ, ఆ విదేశాలలోని మతాలకు వంత పాడుతూ మన భారత దేశ సంస్కృతీ సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, మన దైవాలను కించపరుస్తూ దూషించటము, ద్వేషించటమే పనిగా పెట్టుకున్నాయి.

విదేశీ మతాలకు అమ్ముడుపోయిన కొంత మంది ఆ వేదాలకు వక్రబాష్యం చెప్తున్నారంటే వారిని దయ్యాలు గాక ఇంకేమంటారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు అనే సామెతను మన పెద్దలు చెప్పటాన్ని మనము వింటూనే ఉంటాం కదా. దీన్నే దయ్యాలు వేదాల వల్లించటం అంటారు. రాక్షసులకు, దయ్యాలకు దైవ సంబంధమయిన వేదాలన్నా, దైవాలన్నా పడవు. రుచించవు కదా. ఎందుకంటే వీళ్ళు చేసే దుర్మార్గాలకు ఆ దైవాల చేతుల్లోనే నిత్యమూ చస్తూ ఉంటారు కాబట్టే. ఆ దైవాల జోలికి పోతే చచ్చిపోవాల్సిందే అనే సత్యాన్ని తెలుసుకున్నారు గనుకనే ఏమీ చేయలేక ఇలా విమర్శిస్తూ ఏడవటం అలవాటుచేసుకున్నారు. ఇవే నేటి సమాజంలోని కొన్ని మానవ దయ్యాలంటే. (విదేశాల నుండి మన భారతదేశంలోకి వలస వచ్చిన విదేశీ మతాల దయ్యాలు) అందుకే పొద్దున లేచింది మొదలు విదేశీ మతాలకు భజన చేస్తూ మన హిందూత్వాన్ని, హిందూ ధర్మాన్ని విమర్శించే పని పెట్టుకుంటున్నారు. ఏ చరిత్రలను చూసినా, చదివినా దయ్యాలు గానీ, రాక్షసులు గానీ ఎగిరినంతకాలం ఎగిరి చివరికి కూలిపోవాల్సిందే. ఆ దైవాల చేతుల్లో చచ్చిపోవాల్సిందే. కనుమరుగవ్వాల్సిందే. ఈ విషయంలో ఎవరేమన్నా, అనుకున్నా ఇది సత్యం. అలాగే ఈ మానవ దయ్యాలు కూడా అంతరించిపోయే సమయం దగ్గరపడింది. ఏనాటికయినా పవిత్ర హిందూధర్మమే గెలుస్తుంది. నిలబడి ఉంటుంది. మళ్ళీ మానవ దయ్యాలు లేని పవిత్ర హిందూ సమాజం అవతరిస్తుంది. ఇందులో సందేహమే లేదు.

ఈ భూమండలమంతా కూడా హిందూత్వంతో, మన సంస్కృతీ సాంప్రదాయాలతో, ఆచార వ్యవహారాలతో, హిందూ ధర్మంతో నిండిపొయి ఆదర్శవంతమై, కళకళలాడుతూ ప్రకాశవంతమై వెలుగులు విరజిమ్మే రోజు తప్పకుండా వస్తుంది.

జై శ్రీరామ్
భారత్‌మాతాకీ జై
జై హింద్


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

Monday, March 5, 2018

ధర్మం - అధర్మమానికి మధ్య ఏమిటి తేడా ? - Dharmam vs Adharmam

Dharmam vs Adharmam
అన్నింటి కంటే ధర్మం సర్వశ్రేష్టమయినది.:

ధర్మం అన్నివేళలా ఒకేలా ఉండదు. అందరికీ ఒకే రకంగా ఉండదు. ఈ ధర్మ విషయంలో గొప్ప గొప్ప మేధావులు జ్ఞానులు తబ్బిబ్బులు పడుతుంటారు.

ఉదా:- ఒక ఇంటి యజమాని తన భార్యతో సంభాషించేటపుడు భర్త ధర్మము. అదే కుమారునితో ఉన్నప్పుడు తండ్రి ధర్మము, సోదరునితో ఉన్నప్పుడు సోదర ధర్మమము, తండ్రితో సంభాషించేటప్పుడు కుమార(పుత్ర) ధర్మం. స్నేహితునితో ఉన్నప్పుడు స్నేహధర్మం, కార్యాలయానికి వెళ్ళి పని చేయుచున్నప్పుడు ఉద్యోగ ధర్మం. ఇంటికి ఎవరైనా అతిథులు, పూజనీయులు, జ్ఞానులు వచ్చినప్పుడు గృహస్తాశ్రమధర్మం. వానప్రస్థాశ్రమం స్వీకరిస్తే వానప్రస్తధర్మం. అలా ధర్మం అనేది దేశ కాల పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మారుతుంది.
భారత యుద్దములో అశ్వద్ధామ ఉపపాండవులను నిద్ర పోతుండగా సంహరిస్తాడు. అపుడు అర్జునుడు వెళ్ళి అశ్వద్ధామను బంధించి, తీసుకొనివచ్చి ద్రౌపతికి అప్పగించినప్పుడు, తల్లి ద్రౌపతి ఏమంటుందో చూడండి, కడుపుకోతలో,పుత్రశోకముతో, విలవిల లాడుచున్న ద్రౌపతి, తన పుత్రశోకమునకు కారకుడైన అశ్వద్ధామను చూచి, గురుపుత్రా,విప్రోత్తమా, మీరు పాండవుల గురుపుత్రులు, పాండవులు వారి పరమ పూజ్య గురువుగారిని మీలో చూచు కొనుచున్నారు.

నాబిడ్డలు ఉపపాండవులు:
“ఉద్రేకంబునరారు, శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు, కించిత్ ద్రోమున్ సేయరు, నిద్రాసక్తుల చిన్నిపాపల సంహరింప నకటా నీచేతులెట్లాడేనో.”
ఉపపాండవులు చిన్ని పాపలు, నిద్రపోవుచున్న వారిని చంపడానికి, మీకు చేతులు ఎలావచ్చాయి.. నిన్ను బంధించిన వాడు అర్జునుడని, ఆసాద్ధ్వీమతల్లి గురుపత్ని ఎంత భయపడుచున్నారో, పుత్రశోకము, ఎలాంటిదో, ఎలాఉంటుందో నేను అనుభవించుచున్నాను, ఆ పుత్రశోకము గురుపత్నికి కలుగకూడదని, ఆ సాద్వీమతల్లిది ఎంత ధర్మవర్తనో చూడండి,
“ఒరులే యవి యొనరించిన నరవర, అప్రియము తనమనంబునకగు, తా నొరులకు నవి సేయకునికి పరాయణ పరమధర్మపధములకెల్లన్.”

ప్రవర్తించకుండా ఇతరులు మనపట్ల ఎలా ప్రవర్తిస్తే మనకు బాధకలుగుతుందో,అలాంటి పనులు, ప్రవర్తన, మనము ఇతరులపట్ల, చేయకుండా ఉండడముకంటే గొప్పధర్మము వేరొకటిలేదు. అని ధర్మవిషయము లను వివరించి,అశ్వద్దామను తీసుకెళ్ళి గురుపత్నికి అప్పగించమని పాండవులను శ్రీ కృష్ణుని ప్రార్తిస్తుంది. చూచార అంతటిబాధలో అంతటి కడుపుకోత అనుభవించుచూ కూడా ధర్మమే మాట్లాడింది తల్లి ద్రౌపతీ అమ్మవారు .

శ్రీ రామచంద్రమూర్తి రావణాసురునితో యుద్ధము చేయునప్పుడు రావణాసురుడు బాగా అలసిపోయాడు, ఆ సమయానికి యుద్ధవిరామ సమయము కూడా కావడముతో, శ్రీ రాముడు రావణా ఈరోజువెళ్లి రేపురా అని యుద్ధ విరామము ప్రకటన చేస్తాడు శ్రీ రామచంద్రుడు. ఎందుకనగా, ఈ రాత్రికైన రావణాసురునికి జ్ఞానోదయమైతే రావణాసురుడు బ్రతికి సీతమ్మ వారిని రాములవారికి అప్పగించి, శరణార్ది నంటాడేమో అని, శ్రీరామచంద్రులవారు ఒక్క అవకాశమిచ్చాడు. అదే ధర్మము. తన భార్యను అపహరించిన వానికి కూడా, మారడానికి, తనతప్పును తను తెలుసుకోవడానికి, అవకాశ మిచ్చి ధర్మమునకు నిలబడిన, మహాపురుషుడు శ్రీరామచంద్రమూర్తి. అందు కొరకు రామాయణము, మహాభారతము,భాగవతము చదవాలి చదివిచాలి, వినాలి వినిపించాలి మనపిల్లలకు మనవారసత్వ సంపదగా అందివ్వాలి. ధనము,బంగారము, భూములు సంపదలుగా ఇచ్చినా అవి వారి జీవితకాలము శాస్వితముగా ఉంటాయన్న గ్యారంటీ లేదు. కానీ మన సంస్కృతి సంప్రదాయములు సనాతనధర్మములు భగవద్భక్తి ఇంతవరకు ఎవరినీ పాడుచేసిన ధాకలాలు లేవు.

ఆపద్ధర్మం ఉంది చూశారూ, జీవితం నడవడం కష్టమయినప్పుడు, సత్కర్మకు దోషం కలుగకుండా, ఏ పని చేసినా దోషం లేదు. అది ధర్మ విరుద్ధం కాదు. కానీ నిరంతరం ఆపద్ధర్మాన్ని అనుసరించడం ఆశ్రయించడం కూడదు.

ధర్మమార్గమున ఏది లభించినా పరమ ప్రీతితో స్వీకరించాలి.

మానవునికి నిద్రరాకపోవడానికి విదురుల వారు నాలుగు కారణములు చెప్పినారు.
 1. బలవంతులతో వైరం తెచ్చుకున్నా,
 2. పరుల సంపదను అపహరించినా,
 3. పరుల సంపదలను అపహరించాలనుకున్నా, పరుల సంపాదనను, సంపదను చూచి ఈర్ష్య చెందినా,
 4. పరస్త్రీని పొందుకోరుకున్నా,
ఈ నాలుగు కారణములు తప్ప నీతి శాస్త్రములో మానవ మాత్రులకు రాత్రి యందు నిద్రపట్టక పోవడానికి వేరు కారణాలు చూపలేదు.

మూర్ఖుల లక్షణాలు:-
 • అహంకారం, 
 • విద్యాశూన్యత, 
 • వివేకహీనత,
 • ఏ పనీ చేయకనే (శ్రమ పడకుండా) ఫలమాసించుట, 
 • దరిద్రంలో మునిగి తేలుతూ ఆకాశానికి నిచ్చెనలు వేయుట, 
 • ఊహలలో జీవించుట, 
 • శత్రువులను స్నేహితులుగా భావించుట, 
 • అడుగక పోయినా వచ్చి సలహాలిచ్చుట, 
 • ఎల్ల వేళలా ఎదుటివారిలో దోషముల కొరకు వెతుకుట, 
 • అకారణ క్రోధము, 
 • కలహములు ప్రోత్సహించుట, 
 • విషయ పరిజ్ఞానములేక భాషించుట, 
 • ధర్మాధర్మ విచక్షణ లేకుండుట, పరస్త్రీ వ్యామోహము, 
 • నిర్దయ,పరధనాపేక్ష, 
 • నిత్యమూ అనృతములు భాషించుట, 
 • దైవ దూషణము ఇత్యాది లక్షణ సంపన్నులు.
మోక్షదాయకములు:-
 • ధర్మము, 
 • నీతి రెండూ ఎప్పుడూ కలిసే నడుస్తుంటాయి.
 • నిరంతరం ఏదో కృషి చేస్తూ, 
 • సాత్విక స్వభావముతో సహన శీలతతో, 
 • నిశ్చల ధర్మదీక్షతో ఉండేవారు, 
 • ఎప్పుడూ సత్ఫలితాలనే పొందుతారు. 
 • వీరినే విద్వాంసులు అని అంటారు.
నీతి విషయములు:
ప్రజా రక్షణ చేయలేని ప్రభువు, నిరంతరం పరుషంగా భాషించే భార్య, విద్య నేర్పలేని గురువు, వనవాసం మీద ఆసక్తి చూపే వ్యాపారి వీరు ఎందుకు కొరగారు.
 • ఆరోగ్యము, 
 • ధర్మార్జనతో, 
 • ధర్మముతో కూడిన సంపదలు, 
 • అనుకూలవతి ఐన అర్థాంగి, 
 • చెప్పిన మాట వినే తనూభవుడు,
 • జీవన ఉపాధికి పనికి వచ్చే విద్య, 
 • చక్కని సలహాలిచ్చే స్నేహితుడు, 
 • ప్రపంచ శాంతి నాసించే శాంతి కాముకులు, 
 • పరోపకారాభిలాషులు వీరు సుఖంగా బ్రతుకగలుగుతారు.
సుఖ దుఃఖములు అనుభవించే జీవితం ఆశాశ్వతమైనదే, శాశ్వతమైనది ధర్మం ఒక్కటే.
“క్షీణే పుణ్యే మర్స్యలోకం విశంతి”
దేవతల యొక్క పుణ్యం ఖర్చు అయిపోతే వారు కూడా భూమి మీద వచ్చి పడిపోతారు.

రామాయణంలో హనుమ:-
“శతకృతుని వాసేనం నాగరాజస్య మూర్థనీ”అంటే భూమి మీద ఉన్న మనిషి, సరైన కర్మానుష్టానము చేసి ధర్మమమును పట్టుకొని ఆచారాన్ని పట్టుకొంటే తాను దేవత కాగలడు . దేవరాజు (దేవేంద్రుడు) కాగలడు.
శిష్టాచారము:-
వేదము పరమేశ్వర ప్రోక్తము (అపౌరిషేయము) వేదము భగవంతుని చేత చెప్పబడినది. వేదము చెప్పిన విధముగా వేద సమ్మతముగా నడచిన, అనుష్టించిన ధర్మమే, ధర్మము. అంతే కానీ మనకు ఇష్టం వచ్చిన రీతిలో మనకు అనుకూలంగా చేయడం ధర్మం కాదు.
కాలము రెండు కాళ్ళ మీద నడుస్తుంది.

సంవత్సరము.
రెండు ఆయనము పూర్తి అయితే సంవత్సరము.
 1. ఉత్తరాయణము:- పొందవలసిన మార్గము పొందుటకుమంచి కాలము.
 2. దక్షిణాయనము:- అనుష్టానములకు సంబందించి అనుకూలమైన కాలము(పవిత్రమైన కాలము)గణపతి నవరాత్రు లు,శారదా నవరాత్రులు, శ్రావణ మాసంలో మహాలక్ష్మీ అమ్మవారి సేవలు, నోములు వ్రతాలు అన్నీ ఈ ఆయనములో ఉంటాయి.
 3. ఆయనములలో ఋతువులు. ఋతువులలో మాసములు, మాసమూలలో పక్షములు, పక్షములలో రోజులు, రోజులో పగలు రాత్రి. రోజు అనుష్టానములో రాత్రి ఉండదు. రాత్రి పడుకునే అంత వరకు మాత్రమే అనుష్టానము.
ఆచారము=చరతి=అలాకదులుట. ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలాకాదలాడుట.
“ఆచారవ లభతే ధర్మం”
 • ఎప్పుడైతే ఆచారాన్ని పాటిస్తావో అప్పుడు ధర్మం అలవడుతుంది.
 • ఎప్పుడైతే ధర్మాన్ని పాటిస్తావో అపుడు మనకు తెలియకుండానే భగవంతుని వైపుకు మనము తిరుగుతాము.
 • ధర్మమము అనగా కాలము+దేశముతో ముడిపడి ఉండేదే ధర్మం.
 • ధర్మానుష్టానములో ఎప్పుడు కానీ సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలలో పడుకొనరాదు నిద్రించరాదు. భగవదారాధనకు అనుకూలమైన కాలము.
ప్రాతః సంధ్య:- సూర్యోదయమునకు 88 నిమిషముల ముందు ఉన్నకాలము. పరమ యోగ్యమైన కాలము. బ్రహ్మ ముహూర్తము.

ఉత్తర సంధ్య:- ప్రదోషకాలము. పడమటి సంధ్య వేళలో ఎలా ఉన్నాపడుకోరాదు. అనారోగ్యముతో ఉన్నా కనీసం పదినిమిషాలు కూర్చోనాలి.
“వృషీశ్వర యానంబున సంచరించుటది అభావ్యంబయ్యే”
ఉత్తర సంధ్యా సమయములో పరమశివుడు వృషభ వాహనము మీద తిరుగుచుంటాడని ఈ సమయంలో కేవలం భగవన్నామస్మరణ సంకీర్తన మాత్రమే చేయాలని దితితో కశ్యపుల వారు చెప్పిరి.

శివకేశవ బేధము:-
“శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే
శివశ్చ హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః”
“యధాశివమయో విష్ణురేవం విష్ణుమయ శ్శివః
యధాంతరం నవశ్యామి తధామేస్వ స్టిరాయుషి”
పగలుకు విష్ణువు, రాత్రికి శివుడు అధినాయకులు.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

Thursday, November 16, 2017

పూజ ఎవరు చేయాలి ?

pooja-yevaru-cheyali-yenduku-cheyal

పూజ ఎవరు చేయాలి ? ఎందుకు చేయాలి ?:

వారు వీరను బేధములేక, వర్ణ, వర్గము తేడాలేక, వయసు లింగబేధము లేక కుల, మత బేధములేక ఎవరైనా గురుముఖతః పూజా విధానమును అభ్యసించి కానీ లేదా వారి వారి గృహములలో వారి పెద్దలు చేయుచున్న విధముగా కానీ పూజాది కార్యక్రమములను చేసుకొనవచ్చును. పరమాత్మ(భగవంతుడు) అందరివాడు ఇందులో ఎలాంటి సందేహమూలేదు.

చూచే వారికొరకు వారి ప్రశంసల కొరకు (అబ్భ వారు ఒక గంట లేదా రెండు గంటలసేపు ఎంత సేపైనా,ఏకధాటిగా పూజ చేస్తారండి) చేయు పూజ నిరుపయోగము. అందుకే శ్రీ త్యాగరాజస్వామి గారు “ మమతా బంధనయుత నరస్తుతి సుఖామా, రాముని సన్నిధి చాలా సుఖమా, నిజముగతెల్పుమో మనసా” అని ప్రార్ధన చేస్తారు. కావున పూజను త్రికరణశుద్ధిగా, మనో, వాక్కాయ, కర్మలతో, అనగా మనస్సును, నోటిమాటను, మరియు చేతలను, ఒకటిగా అనుసంధా నము చేసి పూజ చేయాలి. మన ఉద్ధతి కొరకు భగవంతుని ప్రీతి కొరకు చేయాలి కానీ ఇతరుల ప్రశంసలకొరకు కాదు. నరులమెప్పు కొరకు ఏది చేసిన ఎన్ని చేసినా వృధానే, అదే నారాయణునిమెప్పు కొరకు ఒక్కటిచేసినా ఆ జీవితము ధన్యము. నరులుమెచ్చే పూజ, భక్తి నరకముకు మార్గము, నారాయణుడు మెచ్చే పూజ, భక్తి, స్వర్గమునకుమార్గము. త్రికరణశుద్ధితో పూజ చేసిన ప్పుడు వారు పొందు అనుభవము, అనుభూతి, ఆ దివ్యానుభూతి వర్ణనాతీతము. ఆమధురానుభూతిని, దివ్యానుభూతిని తెలియ చేసే భాష ఈ ప్రపంచములో ఇంతవరకూ ఏదీ లేదు.

ఉదాహరణకు మామిడి పండు చాలా తీయగా ఉంటుంది. ఆ తీపులో బంగినపల్లి మామిడి పండు రుచివేరు,మలగూబా మామిడిపండు రుచివేరు, బేనీషా పండు రుచివేరు, రసాలు (ఖాదరు, కాళేపాడు) పళ్ల రుచులు వేరు. ఈపళ్ల రుచులను ఫలానా పండు రుచి (అన్నీ తీపే, తీపిపళ్లే) ఇది అని చెప్పుటకు భాష ఉందా? బాగాఆలోచన చేయండి.

త్రికరణశుద్ధితో పూజ నారాయణుడు మెచ్చే పూజ ఎలా ఉండాలంటే కొంతమంది సినిమాలలో ,ఇంటిలో టివిలో సీరియల్స్ చూచుచూ ఆ సినిమా, సీరియల్ పాత్రలలో పూర్తిగా లీనమైపోయి ఎక్కడలేని ఉద్రేకమునకు వీరు లోనై వీరు ఏకధాటిగా బిగ్గరగా ఎక్కిళ్లు పెట్టి ఏడుస్తారు, అందులో కొన్ని సంఘటనలలో మమేకమై హృదయము తాదాత్ప్య్మము చెంది, తన్మయత్వముతో (అందులోని త్యాగములకు, కొన్ని అనుభూతులకు, కొన్నికొన్ని సంఘటనలకు ప్రతిస్పందనగా) హృదయము ద్రవించి ఆనందభాష్ఫములు కళ్ళు చమర్చడము, కన్నీరు ధారాపాతము కావడము గమనించారా. అలా మనము చేయు పూజలో మనము మమేకమై, తాదాత్ప్య్మము, తన్మయత్వము చెంది,అనన్య భావములులేక ఏకాగ్రతతో, పూజా కార్యక్రమము చేసిన, స్వామి ప్రీతిచెంది మన భక్తికి స్వామి దాసుడై అబ్భ ఎంతభక్తి, ఎంత ఏకాగ్రత, ఏమిపూజ అని, మన స్వామి కళ్ళలో, మన కళ్ళలో ఆనందభాష్ఫములు రాలాలి. అది పూజంటే. మనకు అదీక్ష ఏది? మనకు తాదాత్ప్య్మము ఏది? మనకు ఆతన్మయత్వము ఏది? మనదంతా తంతు పూజ. భక్త కన్నప్ప భక్తికి శివుని కంటిలో రక్తము కారలా? కన్నప్ప తనకన్నును తీసి స్వామికి ఇవ్వలా? ఆ భక్తి పారవశ్యము ఉండలేకానీ భగవంతుడు ఒక కన్నప్పకేకాదు అందరికీ ఆభగవంతుడు దాసాను దాసుడే.

ఉదా:- మనము ఏ వర్ణము వారైన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేయాలంటే మనము మన పురోహితులవారు (మన ఇంటి బ్రహ్మ గారు) వచ్చి వ్రతమునకు కావలసిన సామగ్రీల వివరములు మనకు తెలియచేసి,ఆ సామగ్రిని సిద్దము చేయమని తెలుపుతారు. వాటిని మనము సిద్ధముచేసిన తర్వాత, భార్య భర్తలను పీటలమీద కూర్చో పెట్టి మనచే పురోహితులవారు (ఓం కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా) అని ఆచమనము చేయించి మనచేత పూజ, వ్రతముచేయిస్తారు కదా?
కావున వర్ణవర్గ బేధములేక వారివారి గృహములలో వారివారి ఇష్ట దైవములకు పూజా విధిని భక్తి, శ్రద్దలతో, భయ భక్తులతో నిర్వహించవచ్చు.

1. మనము ఉదయం కాగానే నిద్ర లేస్తాము. నిద్ర లేచాము అంటే అందులో మన ప్రమేయము ఏమాత్రమో ఆలోచించండి. నిద్ర పోయిన తరువాత నిద్ర లేస్తామని మనకు పడుకునే ముందు ఏదైనా గ్యారంటీ ఉందా? భగవంతుడు నిద్రలో (మనము నిద్రించుచున్నప్పుడు) మన శ్వాసను ఆగి పోనీకుండా మనకు మరునాడు ఉదయమును చూచే భాగ్యమును ప్రసాదించినందుకు పూజ చెయ్యాలి.

2. ఉదయాన నిద్ర లేచినది మొదలు మరలా సాయంకాలం (రాత్రి) నిద్రకు ఉపక్రమించేంత వరకు (పగలంతా) ఈ మానవ ఉపాధిలో శ్వాసను అలాగే ఉంచి ఈ ఉపాధికి మంచి బుద్ధిని, మనస్సును ఇచ్చి పుణ్య కర్మలు, సత్ కర్మలు చేయించి నందుకు, త్రికరణ శుద్దిగా భగవంతునికి పూజ చెయ్యాలి.

3. మనము అందరమూ చాలా ధర్మ నిష్ఠాపరులము, భగవంతుని మీద అపారమైన నమ్మకము కలిగియున్నవారము. మనకు భక్తి ఉంది, సనాతన ధర్మముల మీద గౌరవం ఉంది. నమ్మకమూ ఉంది. రోజూ కాక పోయినా సందర్భములు,పండుగలు సమయములను బట్టి ఆలయాలకు, తీర్థయాత్రలకు వెళ్లుచున్నవారము కదా! అయినా నిత్య పూజ అవసరమా? అనే సందేహం అవునా? ఆలోచించండి:-భాగవతములో అజామిళుడు ఏమయ్యాడు? అజామిళుడు ఎంతటి భక్తిపరాయణుడు. ఎంతో పరమ నిష్టాగరిష్ఠుడు. సకల శాస్త్రకోవిదుడు, వేదవేదాంగములు అవపోసనపట్టిన మహాజ్ఞాని కదా? మరి ఒక్క క్షణంలో చూడ కూడని దృశ్యమును చూచి దానికి బానిసై పతనమయ్యాడా లేదా? అరిషడ్వర్గములకు లోనై పతనమయ్యాడు. ఎంత నిష్టాగరిష్ఠుడైనా అరిషడ్వర్గములకు లోనైతే ఏమవుతాడో అజామిళో పాఖ్యానము మనకు దృష్టాంతము. అందుకే నారాయణ శతకంలో “ఒక వేళ నున్న బుద్ధి యొక వేళ నుండ దింక నేమి సేతూ విశదంబుగా జేయవే నీవు నాచిత్తమును నారాయణా”... అని ప్రార్థిస్తారు.

4. ఇంద్రియాలు పరమాత్మవేపుకు చూడడానికి అటు వైపు వెళ్ళడానికి సహకరించవు. ససేమిరా ఒప్పుకోవు. అవి ఎంత సేపూ తాత్కాలిక సుఖ, భోగముల వైపు మన మనస్సును ఉంచడానికే ప్రయత్నిస్తాయి. శాశ్వతానందము వైపు మరలవు. మనసును అటువైపుకు మరల్చటానికి సహకరించవు. వాటిని అటు వైపు నుండి శాశ్వతానందము వైపుకు త్రిప్పడమే పూజ. అజామిళుని లాగా ఏక్షణములోనైనా ఈ బుద్ధి పాడు కావచ్చు. అందుకే ఈ బుద్ధిని క్రమ బద్దీకరించి నిత్యము నిరంతరమూ పరమాత్మ వైపు త్రిప్పడానికి పూజ. నిత్య సత్ కర్మల వలన అంతః శుద్ధి ఏర్పడుతుంది.

5. పరమేశ్వరుడు మనకు పంచేంద్రియములను ప్రసాదించి తద్వారా మనకు సుఖదుఃఖములను ప్రసాదించాడు. అందుకొరకు పరమేశ్వరునికి కృతజ్ఞతలు వ్యక్తము చేయడం మన కనీస విధి. ఒక్కో ఇంద్రియంతో కొన్ని కోట్ల సుఖములను మనకు ప్రసాదించాడు. భగవంతుడు ఎంత గొప్ప శిల్పి. మనకు నోరును పైన పెట్టి కడుపును క్రింద పెట్టినాడు. నోటిలో ఏది పడినా శ్రమ లేకుండా కడుపులోకి జారీ పోతుంది. ప్రతి మానవుని చేతులలో ఎన్నో గీతలు గీశాడు. ఆ శిల్పి ఏ సిరాతో గీశాడో కానీ ఎన్ని మార్లు కడిగినా ఆగీతలు జీవితకాలం చెక్కు చెదరడంలేదు.

6. నిద్ర అనే సుఖమును ప్రసాదించాడు. ఆ నిద్రలో ఇంద్రియాలను మనసులోకి, ఆ మనస్సును ఆత్మలోకి తీసుకెళ్ళి రాత్రంతా ఇంద్రియాలకు శక్తిని ప్రసాదించి మరలా ఉదయం కాగానే ఇంద్రియములు పనిచేయుటకు అవకాశం శక్తి కల్పిస్తు న్నవాడు పరమేశ్వరుడు.

7. సాధారణముగ 108 నామములతో పూజ చేస్తారు. అంటే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ప్రాణి అనగా 84 కోట్ల జీవ రాసులు క్షేమంగా ఉండాలని. ఎలాగంటే ప్రతి ప్రాణి ఏదో ఒక నక్షత్రంలో జన్మిస్తుంది. నక్షత్రములేని సమయం ఉండదు. (ఒక్క రోజుకి 86,400 సెకన్లు ఏ ప్రాణి ఐనా ఏదో ఒక సెకనులో జన్మించాలి) ఒక నక్షత్రమునకు 4 పాదములు. 27 నక్షత్రములకు 27x4=108 పాదములు. కాబట్టి ప్రతి ప్రాణి ఆయురారోగ్యములతో ఉండవలయునని పూజ చేస్తాము. అందుకే అత్యవసర మైతే 108 ఫోన్ చేస్తాము 108 వాహనము వచ్చి మన ప్రాణములను కాపాడుటకు ICU లో మనలను ఉంచితే మనవారంద రూ ICU అద్దాల దగ్గర I see you అంటూ చూచేవారే కానీ ఏమీ చేయలేరు. బాగా ఆలోచించండి. అపుడు భగవంతుడనే వైద్యుడు “వైద్య నారాయణో హరిః” కదా, కాబట్టి భగవంతుడే Doctor గారి రూపములో ICU లో మనలను కాపాడుతాడు. బాగా ఆలోచించండి. 108 కు ఫోను చేయడం జరుగుతుందే కానీ 108 నామాలలో (భగవంతుని నామాలతో) ఒక్కటి ఒక్కటంటే ఒక్కటి గుర్తుకు వస్తుందా? పలుకుతామా? పిలుస్తామా?ఏవండీ, ఎవరండి, అయ్యో, అయ్యయ్యో, కుయ్యో, మొర్రో, “ఏవండీ ఎవరైనా 108 కు phone చేయండి” అంతే గాని గోవిందా, నారాయణ, రామ, శివా, సాయిబాబా ఎవరూ గుర్తుకురారు. అందుకే నిరంతర స్మరణ, నిరంతర స్మరణ అలవరుట కొరకే పూజ.

8. పంచేంద్రియములకు ఒక భయం. ఏమంటే ఆత్మకు భగవంతునికి సంబంధించిన విషయములు ఎక్కడ ఈ మనసు గ్రహించి శరీర భ్రాంతిని విడిచి పరమాత్మవైపుకు వెళుతుందో, అని, నిరంతరమూ అత్యంత జాగరూకతతో భగవంతునికి సంబంధిoచిన విషయ వాసనలను, దరి దాపులకు రానీయకుండా అడ్డుపడుతూ ఉంటాయి. ఎంత సేపూ ప్రాపంచిక విషయాలపై, ధ్యాసను, ఆసక్తిని, అనురక్తిని పెంచి పోషిస్తాయి. కాబట్టి ఐదు కర్మేంద్రియాలు+ఐదు జ్ఞానేంద్రియాలు+బుద్ది =11 ఇంద్రియములను తన ఆధీనములో ఉంచుకొని మనస్సు నిరంతరం భగవత్ చింతనకు మనలను దూరంగా ఉంచుతుంది. దాని ఆధీనము నుండి 11 ఇంద్రియములను తప్పించి నిత్యమూ నిరంతరమూ సర్వకాల సర్వావస్థలయందు భగవంతునివైపుకు త్రిప్పుట కొరకే పూజ.

9. ఒక నాలుగు రోజుల పాటు మనము తెచ్చిన కూరగాయలను తిను బండారములను ఉపయోగించకుండా అలా బయట ఉంచితే ఏమవుతాయో ఆలోచించండి. క్రుళ్లిపోయి దుర్గంధం వెదజల్లడమేకాక క్రిమికీటకాదులకు ఆశ్రయమిచ్చి మనలను అనారోగ్యం పాలు చేస్తాయి. అవునా? మరి మనము ఈ ఉపాధి (శరీరం) లో షడ్రుచులతో కూడిన ఎన్ని ఆహార పదార్థము లను ఎంత ఆహారాన్ని ఎంత కాలంగా ఇందులో వేస్తున్నామో కదా! మరి చెడు వాసన రాదేo? క్రిమికీటకములు ఉత్పన్న ము కావటం లేదేం? ఆలోచించండి. మనము వండిన ఆహారమును అలా బయట నాలుగు రోజులు ఉంచితే ఎలా ఉంటుంది ఆలోచించండి. ఈశ్వరుడు జఠరాగ్ని స్వరూపంలో ఈ శరీరంలో పడవేసిన దేనినైనా పచనం(జీర్ణం) చేయకపోతే మనము జీవించగలమా? ఈ శరీరం పరస్థితి ఏమిటి? పరమేశ్వరుడు మనకెందుకు ఇంత ఉపకారం చేయాలి? అంత ఉపకారం ఒక రోజు కాదు రోజుకు మూడు పూటలా, ఇన్ని సంవత్సరములుగా చేయుచున్న ఈశ్వరునకు కనీసం పూజ ఐనా చేసి మన కృతజ్ఞతను ఆవిష్కరించాలా లేదా? మీరే ఆలోచించండి. ప్రతి రోజు మూడు పర్యాయములు తినడానికి సమయం ఉంది. మరియు “ప్రొద్దు పోవక యున్నను, వేసరక పొరుగిండ్ల, తిరుగుగానీ, బుద్ధి మాలిన చిత్తము నీ యందు పొందదే నారాయణా”... అన్నారు. అయినా పరమేశ్వరునికి పూజ చేయడానికి రోజుకు కనీసంలో కనీసం ఒక అరగంట సమయం లేదా? ఎంత కృతఘ్నల మండీ మనము. ఒక్కసారి ఆలోచించండి.

10. సొంతముగా ఒక ఇల్లు కట్టుకోవా? ఎంత కాలం ఈ బాడుగ ఇళ్ళలోబ్రతుకుతావు? పరమాత్మ ప్రతి ఒకరికీ సొంత ఇల్లు నిర్మించుకునే అవకాశము కేవలం ఈ ఒక్క మానవ ఉపాధికి మాత్రమే ఇచ్చాడు. మిగతా ఏ ఒక్క ఉపాధికి ఈ సౌలభ్యము ను భగవంతుడు ప్రసాదించలేదు. ఈ మానవ ఉపాధిలోనికి వచ్చిన తర్వాత సొంత ఇంటిలోకి వెళ్ళవలయును కానీ మరలా ఏదో ఒక ఉపాధి తీసుకొని బ్రతక కూడదని భగవంతుడు మానవ ఉపాధిని ప్రసాదించాడు.

ధర్మవర్తన అనే పునాదులపై భక్తి అనే ఇటుకలతో, జ్ఞానము అనే ఇసుక, తపన అనే నీళ్ళు, దానధర్మము లనే సిమెంటుతో వైరాగ్యమనే (కప్పు) శ్లాబుతో ఇల్లు నిర్మించాలి. దానికి సాధన అనే మెట్లు(తాపలు) కట్టి, నిత్య పూజ అనే ద్వారములు, నిరంతర ధర్మకర్మానుష్ఠానమనే కిటికీలు ఉంచి, సాధకుడు జీవాత్మను ఆ ఇంటిలో గురువు సహాయంతో ప్రవేశించాలి. తేనెలో పడ్డ ఈగ లాగా భక్తి మకరందాన్ని త్రాగి త్రాగి మత్తెక్కి ఇక అందులోనుంచి లేవలేని లేవలేక అందులో పడిన ఈగ లాగ కావడానికే పూజ.

11. సుడి గాలి వచ్చిందంటే దుమ్ము ధూళి పైకి లేచి కళ్ళలో పడి మనము కళ్ళు తెరవలేక అలా కళ్ళు మూసుకొని కళ్ళు నలుపుకుంటూ ఆ గాలి యొక్క ధాటికి తాళలేక ఎలా వెళుచున్నామో తెలియక ఎలా బాధపడతామో కదా. అపుడు ఆ సమయంలో వర్షం పడిందనుకోండి అపుడు ఎంత బలమైన గాలి వచ్చినా దుమ్ము ధూళి పైకి లేవగలదా మనలను ఇబ్బంది పెట్టగలదా? ఆలోచించండి. అలాగే మనము గత జన్మలలో చేసుకున్న ఈ జన్మలో చేసిన చేస్తున్న అకృత్యములకు, అధర్మవర్తనకు, పాపములకు ఈ ఈతి బాధలు, అకాల మరణాలు, అశాంతి ఇలాంటి రుగ్మతలను మరియు అరిషడ్వర్గాలకు దూరంగా ప్రశాంతంగా జీవించాలంటే భగవంతుని అపార కృపా వర్షము మన మీద కురవాలి. అవునా ఆలోచోంచండి అందుకే పూజ.

12.మన అంగీకారం లేనిదే అహం స్వార్థం మనలో ప్రవేశిoచిందా? మనం ఆశతో చూచే చూపులే కదా దానికి ఆధారం. మన కోరికలు బలహీనతలే కదా స్వార్థం యొక్క గుర్రాలు. ఈ ఆసరాలతోనే అహం అనే ఏనుగును చేసి కోరికలు అనే అంబారీ పై ఊరేగుచున్నాము. అవునా ఆలోచించండి.
ఒక మహాత్ముడు ఏమన్నాడు డబ్బుల కుంపటి మీద కోరికలు అనే ఎసరు పెట్టుకున్నది మనం. దాహంతో,వ్యామోహంతో అవకాశాల కోసం అంగలార్చుచు చున్నది మనం కాదా? ఆశ, ఆర్భాటములు, స్వార్థముల వలన కలి మనలో పరకాయ ప్రవేశం చేయడానికి మనమే అనుమతిoచాం. అది మన వేలితో మన కన్నే పొడి చేస్తుంటే ఈ కలిమాయలో పడ్డ మనకు కర్తవ్యం బోధపడటం లేదు. ఈ మృగతృష్ణ తీరడం లేదు. అరిషడ్వర్గాలను జయించలేక సంసార సాగరమును ఈదుచున్నాము. అందుకే ఈ సంసార సాగరమును, ధర్మబదద్ధముగా, వేద హితముగా ఈది, ఆవలి వొడ్డు చేరాలంటే వేదములు తెలియాలి ధర్మా ధర్మములు తెలియాలి ఆశ్రమ ధర్మాలు తెలియాలి అందుకే నిత్యం పూజ, పురాణ ప్రవచనాలు వినడం ఈ ఉపాధికి అత్యంత అవసరము.

13. మనలని మనం ప్రమదాల నుండి కాపాడుకోవడo ఎలా? మనము రాత్రి పూట పడుకుంటాo. పడుకునే ముందుFan తిరుగుతోంది చిన్న Zero light (తక్కువ కాంతిగల) వేసుకుని పడుకున్నాం. రాత్రి ఎప్పుడో ఆ zero lightకాలిపోయింది. అందు వలన గది అంతా చిమ్మ చీకటి. ఏమీ కనిపించనంత చీకటి. ఆ చీకటిలో, మధ్యలో మనకు మెలుకువ కలిగింది. లేచి బాత్రూంకి వెళ్లాలి. వెళ్లాలంటే వెలుతురు కావాలి.

అరెరె కరెంట్ పోయినట్లుంది అని అనుకున్నాము. కానీ Fan తిరుగుతోంది అంటే కరెంట్ ఉంది మరి చీకటి ఎలా వచ్చింది ఓ హొ బల్బు మాడిపోయింది అనుకొని వేరొక పెద్ద light వేయడానికి స్విచ్ బోర్డు కొరకు తడుము తుంటే ఒక చిన్న వ్రేలు ప్లగ్లోకి దూరింది. వెంటనే షాక్ కొట్టి క్రింద పడిపోయాము. ఎంత వారికైనా అజ్ఞానము అనే చీకటి ఆవహించినపుడు జ్ఞానము అనే కాంతిని దగ్గరకు రానీయదు. కోరికలు, స్వార్థం, సంసారం లోని అరిషడ్వర్గముల అనే చీకటులు ఆవహించి ఉన్నపుడు గురువు (భగవంతుడు) అనే (జ్ఞానము) వెలుతురు కావాలి. గురువు (భగవంతుడు) అనే స్విచ్ దొరకాలి. అపుడు స్విచ్ నొక్కితే వెనువెంటనే చీకట్లు మాయమై వెలుతురు ప్రకాశిస్తుంది. వెలుతురు వస్తే గాని ఏ వస్తువు ఎక్కడుoదో, ఎవ్వరూ ఎక్కడున్నారో, ఎవ్వరు ఏమిటో తెలుస్తుంది. ఎప్పుడైతే నిత్య పూజ, ధర్మానుష్ఠానము,నిరంతర స్మరణ ఉంటాయో, అప్పుడు ఎంత చీకటిలో నైనా స్వీచ్ మన చేతికి అందుతుంది. అందుకే నిత్య పూజ.

14.పరమాత్ముడు ఈ ఉపాధికి నవ రంధ్రములు కళ్ళు-2, మలమూత్ర విసర్జనా స్థానములు-2, ముక్కు-2, ఒక నోరు పెట్టి ఇందులో పది వాయువులను, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్త అనే ఈ పది వాయువులను సప్తధాతువులు చర్మము, రక్తము, క్రొవ్వు, మాంసము, అస్తి, శుక్ల, మేధ ఇందులో ఉంచి
ఆ పది వాయువులను బయటకు పోకుండా సప్తధాతువులు పాడుకాకుండా తయారు చేసి జీవన్ముక్తిని చతుర్విధ పురుషార్థములు సాధించమని ఈ ఉపాధిని మనకు ఇచ్చాడు. అందుకు నిరంతర కృతజ్ఞతావిష్కరణకు పూజ అవసరము. 15. ఈ ఉపాధిని ఆశ్రయించిన జీవాత్మ ఎక్కడి నుండి వచ్చింది? పరమాత్మ నుండి. మరలా ఈ ఉపాధిలోని జీవుడు (జీవాత్మ) ఎక్కడికి వెళ్లాలి పరమాత్మలోకి అవునా. అందుకు ఈ ఉపాధిని ఉపయోగించాలి.

ఉదా:- మనము ఇంటి నుండి బయలు దేరి ఆఫీసుకు, బజారుకు, ఒక పని చేయడానికి, పొరుగూరికి, ఒక గుడికి,విహారయాత్రలకు, తీర్థయాత్రలకు వెళతాము. మరి అక్కడే ఉండి పోతామా? లేదే తిరిగి మరలా మన ఊరికి (అది సొంత ఇల్లు కానీ, అద్దె ఇల్లు కానీ) మనము వచ్చేస్తున్నాము. ఆఫీసుకు, బజారుకు, లేదా ఒక పనికో వెళ్ళినపుడు ఆ రోజు సాయంకాలనికి ఇల్లు చేరుచున్నాము. విహారయాత్రలు, తీర్థయాత్రలు, మరో పోరుగూరో వెళితే కొన్ని రోజుల తరువాతైనా మన ఇంటికే మనం వస్తున్నాం. ఔనా? అంటే ఎక్కడి నుండి (ఇల్లు) బయలుదేరినామో అక్కడికే వచ్చి చేరుతున్నాం. కదా! మరి పరమాత్మ నుండి విడివడి బయలు దేరిన ఈజీవుడు (జీవాత్మ) మరి పరమాత్మ వద్దకు చేర్చవలసిన బాధ్యత మనది కాదా? ఉదా:- ఒక పిల్లవాడు తల్లి తండ్రులతో విహారయాత్రకు, తీర్థయాత్రకో వచ్చి దారి తప్పుతాడు. (తల్లి తండ్రులను వదిలి తప్పుతాడు). అపుడు విజ్ఞులయిన మనము అతనిని చేరదీసీ వారి యొక్క విలాస వివరములు తల్లితండ్రుల విలాస వివరములు తెలుసుకుని ఆ తల్లి తండ్రులకు తెలియజేసి వారి కడకు వారి బిడ్డను చేర్చడానికి ప్రయత్నము చేస్తాము. లేదా రక్షణ విభాగము (పోలీసు) వారి దగ్గరకైన చేరుస్తాము. మరి ఈ ఉపాధిలో ఉన్న జీవుని (జీవాత్మ) పట్ల మన కెందుకు ఇంత వివక్షత? ఇంత నిర్లక్ష్యము? ఆలోచించండి. అందుకే పూజ అవసరము.

16. ఒక కుటుంబం విహారయాత్రకో, తీర్థయాత్రకో వచ్చారు. అందులో ఒక 5 సం|| బాబు తప్పిపోయాడు. విజ్ఞులైన మనము ఏమీ చేస్తాము. ఆ బాబుని దగ్గరకు తీసుకొని వివరాలు విలాసాలు విచారిస్తాం. పిల్లవాడు గోలగోల చేస్తుంటాడు. ఎక్కి ఎక్కి ఎక్కుళ్లు పెడుతూ ఏడుస్తుంటాడు. మధ్యమధ్యలో మా అమ్మకావాలి, నాన్నకావాలి అని ఏడుస్తుంటాడు. మనము వానిని బుజ్జగించి బాబు ఈ పాలు త్రాగు అంటాము. నాకు వద్దు మా అమ్మకావాలి! ఈ బిస్కట్ తినరా వద్దు మా అమ్మకావాలి! పోనీ ఈ చాక్లెట్లు తినరా వద్దు మా అమ్మకావాలి! నాన్న కావాలి! పిల్లలు బిస్కట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీములు అనిన చాలా ఇష్ట పడుతుంటారు. అంత పరమ ఇష్టమైన పదార్థాలు ఇచ్చినా, నాకు వద్దు మా అమ్మ కావాలి, మా నాన్న కావాలి అని భీష్మించుకొని ఏడ్చి ఏడ్చి శోష వచ్చి పడిపోతాడు.

ఇది తినరా మీ అమ్మ దగ్గరకు తీసుకెళతాను అంటే,ముందు తీసుకెళ్లు తరువాత తింటాను అని అంటాడు. తల్లి తండ్రులను చేరే వరకు ఏమి ముట్టడు. ఎంత తపన? ఎంత బాధ? ఎంత ఆర్తి? అమ్మను నాన్నను చేరడానికి మరి ఇన్నేళ్లు వచ్చాయి మనకేదీ ఆ ఆర్తి, ఏది ఆ తపన, ఎక్కడ ఆ బాధ. ఇంకా అరిషడ్వర్గాలనే బిస్కట్లు చాక్లెట్లు, పండ్లు రకరకాల షడ్రుచులు కావాలనే భావనే కానీ అమ్మ నాన్నలను చేరాలనే కోరిక ఎక్కడ? ఆ కోరిక పుట్టిoచడానికే పూజ. ఈ ఉపాధిలోని జీవుడు (పరమాత్మనుండి విడివడిన) తన అమ్మ నాన్నలతో కలవాలని ఎంత తపన పడుతోందో? ఎంత పొర్లి పొర్లి ఏడుస్తుందో? ఎలా అల్లాడిపోతుందో? దాని గోడు మనకు వినబడుతోందా? వినబడినా కూడా విననట్లు నటిస్తున్నామా? అని మనము విజ్ఞతతో ఆలోచించుకోవాలి.

ఈ తప్పిపోయిన బాలుడికి (జీవునికి) కార్లు చూపిస్తాము, బంగారము చూపిస్తాము, సుఖాలను చూపిస్తాము నిజంగా ఆనంద పడుచున్నాడా? లేక ఏడ్చి ఏడ్చి శోషతో పడిపోతున్నాడా? ఎందుకు ఆవిధంగా ఆలోచింపరు? అక్కడ బిడ్డను పోగొట్టుకున్న తల్లితండ్రుల పరిస్థితి ఏమిటి. ఆ తల్లి నా బిడ్డో, నా బిడ్డో అని నేలబడి ద్రొల్లుతుంది, అరుస్తుంది, ఏడుస్తుంది. అన్న పానీయాలు ముట్టదు. భర్త మిగిలిన బంధువులు చెబుతారు, బిడ్డ దొరుకుతాడు లేమ్మా కాస్త ఎంగిలి పడు అంటారు. అయినా ఎంత చెప్పినా ఏమి చెప్పినా ఎవరు చెప్పినా ఆ తల్లి వెర్రి చూపులతో బిడ్డకోసం ఆర్తితో అంటుంది, అందరూ ఇక్కడ నాకు చెప్పేవారే కానీ మీలో ఒక్కరైనా వెళ్ళి బిడ్డ కొసం వెతుకుతున్నారా? వెతికే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకీ వ్యర్థమైన కాలయాపన,వ్యర్థమైన కబుర్లు, ఓదార్పులు ముందు నా బిడ్డను వెతికించే ప్రయత్నం చేయండని ఆ తల్లి పడే బాధను ఊహించండి. అలాగే పరదేవత కూడా మన గురించి ఎంత తపన ఎంత బాధపడుతోందో ఆలోచించండి.

మనకు దారిచూపడానికి మన యొక్క విలాసము, వివరములు తెలియజేయడాని ఎందరో మహానుభావులను పంపింది. ఒక ఆదిశంకరాచార్య, ఒక రామానుజాచార్య, ఒక మద్ద్వాచార్య, ఒక రమణమహర్షి, ఒక అరబిందో, ఒక చంద్రశేఖరేంద్ర భారతీ సరస్వతి స్వామి ఎందరో అవధూతలు ఎందరో మహానుభావులు వచ్చారు. మనలను ఈ భవబంధముల నుండి బయటకు లాగి మన అసలైన చిరునామా, మన వివరములు తెలియజేయడానికి, మనలను మరలా అమ్మ దగ్గరకు తీసుకెళ్ళే మార్గము చూపడానికి. కానీ మనకు వారిని కలిసే సమయమేది? వారి పాదపద్మముల మీద పడి ప్రణిపాతము చేసే సంస్కారమేది?వారి ప్రవచనాలను వారి జీవిత గాథలను చదివే సమయమేది? ఎంతసేపూ నా సంసారం, నా పిల్లలు, నా సంపాదన, ఇదే ధ్యాస. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారన్నట్లు “ఎంత సేపూ చేసిన సంసారమే చేయిస్తావు, తిన్న తిండే తింటావు ఎంత కాలమిలా బ్రతుకుతావు? నీలో మార్పురాదా?” అన్నారు. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మనకు పశుపక్ష్యాదులకి తేడా ఏముంది?

పూజాలో పొందవలసిన అనుభూతి:
మనము ఒక సినిమా చూచేటప్పుడు, ఒక TV సీరియల్ చూచేటప్పుడు అందులోని సన్నివే శాలలో లీనమైపోయి, ఆ సందర్భానుభూతిని, మనము అనుభవించుచున్నప్పుడు, మన హృదయము తెలియని అనుభూతికి లోనై, కళ్లు చెమర్చడం, ఏడ్వడం, బాధపడడం జరుగుతుంది. మరీ కొన్ని కొన్ని హాస్య సన్నివే శములలో నైతే పొట్ట చక్కలయ్యేటట్లు నవ్వడం, నవ్వి నవ్వి కడుపు పట్టుకోవడం, మరీ విపరీతముగా నవ్వడం వలన, కళ్ళలో ఆనంద భాష్పములు రావడం, జరుగుతోంది కదా! ఇక్కడ మనము బాగా సుదీర్ఘముగా ఆలోచించగలిగితే, ఒక విషయం బోధపడుతుంది. నిజానికి సినిమాను నిర్మించే, నటించే వారికి అందరికీ, ఆ సినిమాను చూచి ఆనందించి, ఆదరించే ప్రేక్షకులే దేవుళ్లు. నటులు కానివ్వండి, దర్శకులు కానివ్వండి, ఆ పరిశ్రమలో పనిచేయు వారెవ్వరైనాసరే, ప్రేక్షకులు చూచి మెచ్చి చాలాబాగుందని అదరిస్తేనే (సినిమా, TV సీరియల్ పరిశ్రమల) వారికి జీవనం, మరియు సినిమా టివి పరిశ్రమలు వృద్ధి చెందుతాయి.

మరి మనము, విభిన్న మనస్తత్వాలు, విభిన్న ఆలోచనలు, అభిప్రాయాలు, విభిన్న పద్దతులు,ఆచారవ్యవహారాలు, కలిగిన ప్రేక్షకులు సినిమా పరిశ్రమ పట్ల, దేవుళ్లైతే, ఆ దేవుళ్లను మెప్పించడానికి (సినిమా,TVసీరియల్ పరిశ్రమల) వారు ఎంత కఠోర పరిశ్రమ చేయాలి. వివిధ దర్శకాగ్రేసరులు (సంగీతం, అలంకరణ, ఛాయా,నృత్యం,సంభాషణలు) ఎంతగా శ్రమించాలి. మరి నటులు, దర్శకులు వివరించిన విషయమును, ఆసందర్భమును, ఆ పాత్రయొక్క, గుణగణములను జీర్ణించుకొని, ఆ పాత్రలోనే జీవించుచూ, ఆ పాత్ర యొక్క భావములను, తను అనుభూ తి చెందుచూ, తన నటనతో ఆ భావమును వ్యక్తీకరించి, ప్రేక్షకులకు అందించాలి. అలా జీవించి నటించకపోతే, చూచే మనకు,ఆ మధురానుభూతి కలుగుతుందా? ఆ సినిమాను చూచిన మనము, ఆనందించగలమా? వారు, వారి వారి పాత్రలపట్ల,వృత్తిపట్ల ఎంత న్యాయము చేస్తున్నారనే విషయం, ప్రేక్షక దేవుళ్లమైన మనము నిర్ణఇంచి ఆదరించుచు న్నాము. అవునా?

ఒక సినిమానే కాదు ఒక సంగీత విద్వాంసుని సంగీతం, ఒక చిత్రకళా తపస్వి చిత్రం, ఒక నవలా రచయిత రచన, ఒక ఉపాధ్యాయుని పాఠం, ఒక నాట్యకళాకారుని నాట్యం, ఒక పురోహితుని మంత్రపఠనం, ఒక దేశరక్షకు (సైనికుడు) ని త్యాగం, ఒక అధికారి అధికారం, ఒక వైద్యుని వైద్యం ఇలా ఎందరెందరో వారివారి పాత్రలలో వారు లీనమై జీవించి పనిచేయక (ఫొటోల కొసమో, పబ్లిసిటీ కోసమో లేదా పత్రికల కోసమో) వారు పనిచేస్తే, ప్రేక్షకులమైన మనము,వారినాదరింతుమా, వారిని అభిలషింతుమా, మనము ఆదరించక పోతే వారికి మనుగడెక్కడిది?

మరి భగవంతుడు మనకొక పాత్రనిచ్చి ఈ జానారణ్యమనే నాటకరంగము పై మనలను, మనయొక్క సనాతన ధర్మములను, వేదములను, గౌరవించి వేదయుక్తముగా, ధర్మబద్ధముగా, నడుచుకోమని, జీవించమని,మనకు గొప్ప అవకాశము ఇస్తే, మనము చేయుచున్నదేమిటి, వేదములు, ధర్మవర్తన మాట అటుంచి, కనీసములో కనీసము నిత్య పూజను, ఆలయదర్శనమును కూడా మరచిపోయాము.

ఈ ఉపాధిని మనకు భగవంతుడు ఇచ్చినందుకు కృతజ్ఞతగా మనము పరమాత్మ చెప్పినవిధముగా వేదముల సారము గ్రహించుచూ వేదప్రోక్తముగా, ధర్మబద్ధముగా, జీవనము సాగించుచూ భగవంతునకు చేయు పూజలో మనము అందులో మమేకమై నిత్యమూ పూజా విధిలో జీవించుచూ పూజలో లీనమై ఆత్మానుభూతి చెందువిధముగా పూజచేస్తే, అటు పరమాత్మ కన్నులలో, మనకన్నులలో ఆనంద భాష్పములుకాక మరేమొస్తాయి. ఆలోచించండి.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com