నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Friday, February 14, 2020

ఈ వాలెంటైన్స్ డే అంటే ఏమిటి?? ప్రేమపేరుతో పెళ్ళికి ముందు రంకుచేసే కామజంటల దినం కాదా? - What is Valentines Day Meansఈ వాలెంటైన్స్ డే అంటే ఏమిటి?? ప్రేమపేరుతో పెళ్ళికి ముందు రంకుచేసే కామజంటల దినం కాదా? - What is Valentines Day Means
"ఈ రోజు ప్రేమపేరుతో పెళ్ళికి ముందు రంకుచేసే కామజంటల దినం"
ఈ వాలెంటైన్స్ డే అంటే ఏమిటి?? మన దేశంలో ఈ ప్రేమికుల రోజు అవసరమా .. ఏది వాస్తవం.. ఏది అవాస్తవం???
వాలెంటైన్ అనబడే ఇటలీ దేశస్థుడొకడు ప్రేమ గురించి తన ప్రాణాలను ధారపోశాడని, అతను మరణించిన రోజుని ఫిబ్రవరి 14గా స్థిరీకరించుకుని ఆ రోజున అతని పేర ‘ప్రేమికుల రోజు’ను జరుపుకుంటున్నామని నేటి ప్రేమికులు చెప్పుకుంటున్నారు.

ఏది వాస్తవం??
వలంటేన్ గురించి చెప్పే ఈ అంశంలో చాలా తప్పులున్నాయి. యథార్థ చరిత్రను తిరగేసి చూస్తే అసలు విషయం ఇది. వాలెంటైన్ వివరాలు కచ్చితంగా, సుస్పష్టంగా చరిత్రలో లేవు.

3వ శతాబ్ద కాలంలో ఇటలీ దేశ చరిత్రలో ముగ్గురు వాలెంటైన్లు కన్పిస్తున్నారు. ఒక వాలెంటైన్ మతాధికారిగా ఉండేవాడు. మరో వాలెంటైన్ రోమ్ చక్రవర్తి గ్లాడియస్-2 సైన్యంలో ఒక సైనికుడుగా ఉండేవాడు. 3వ వాలెంటైన్ ఒక సామాన్య రోమన్ పౌరుడు. మొదటి వాలెంటైన్ మతాధికారిగా ఉంటూనే మరణించాడు. 2వ వాలెంటైన్, రోమ్ చక్రవర్తి గ్లాడియస్-2చే వధించబడ్డాడు. దీనికో కథ ఉంది. చక్రవర్తి గ్లాడియస్-2, తన సైనికులెవరినీ వివాహం చేసుకోనిచ్చేవాడు కాదు. అలా అయితే సైన్యం పూర్తిగా శక్తివంతంగా ఉంటుందని అతని భావం. అయితే ఆ సైనికులలో ఒకడైన వాలెంటైన్ తన సహచరులైన సైనికులకు రహస్యంగా పెళ్ళిళ్ళు జరిపించేవాడట. ఈ సంగతి తెలుసుకున్న చక్రవర్తి, ఆ వాలెంటైన్‌ను వధించాడు. దీన్నిబట్టి చూస్తే, ఈ 2వ వాలెంటైన్ అనేవాడే అసలైన వాలెంటైన్ అయి ఉండవచ్చు కానీ ఇతను ఒక పెళ్ళిళ్ళ పేరయ్య లాంటి వాడే... ఇక 3వ వాలెంటైన్ సంగతి! ఇతనొక సాధారణ పౌరుడు.

చరిత్రలో ఉన్న మొత్తం వాలెంటైన్ల అసలు చరిత్రలు ఇవి! ఈ ముగ్గురు వాలెంటైన్లలో ఏ ఒక్కణ్ణి తీసుకున్నా కూడా వాడు అమర ప్రేమికుడు ఎలా అయ్యాడో అర్థం కాదు. ఇక ఫిబ్రవరి 14 అనే తేదీ వీళ్ళ పుట్టిన తేదీ కాదు. కనీసం చనిపోయిన తేదీ కూడా కాదు. ఈ వలంటేన్ కధ గురించి చెపుతున్న కాలంలో వలంటేన్ అనే పేరు సాధారణం అనేకమంది ఉన్నట్టు చలా మంది చెపుతున్నారు

ఏది వాస్తవం???
ప్రాచీన రోమన్లు పూజించే దేవతల్లో ‘జూనో’ అని ఒకావిడ ఉంది. ఆ దేవత ‘‘స్త్రీలకు, పెళ్ళిళ్ళకు సంబంధించిన దేవత’’ అని వారి నమ్మకం. ఆ జూనో దేవతపై ఉన్న భక్తి శ్రద్ధలతో ఫిబ్రవరి 14వ తేదీన రోమ్‌లో సెలవు ప్రకటించుకుని ఉత్సవాలు చేసుకునేవారు. ఫిబ్రవరి 15వ తేదీన రోమ్ నగరంలో ఎంతో ఉత్సాహంతో జరుపుకునే వసంతోత్సవం క్రమంగా ఫిబ్రవరి 14కు మారిపోయింది. ఇన్ని విధాలుగా 14వ తేదీకి ప్రాముఖ్యత వచ్చింది.

అనంతర కాలంలో ఆ ఫిబ్రవరి 14 గురించి తెలుసుకున్న అమెరికన్ పౌరులు, తమ పరస్పర ప్రేమల్ని తెలియపరచుకోడానికి ఆ రోజున ప్రేమ కార్డులను పంచిపెట్టుకోవడం మొదలుపెట్టారు. సరిగ్గా ఆ సమయంలో ‘వాలెంటైన్’ దశ తిరిగింది. ముగ్గురు వాలెంటైన్లలో ఎవడైతే నేమి వారిలో ఒక వాలెంటైన్‌ను తీసుకుని, వాడికి అమర ప్రేమికుడుగా ముద్రవేసి వాడికీ, వాడికి ఏ మాత్రం సంబంధం లేని ఫిబ్రవరి 14వ తేదీకీ ముడి పెట్టేశారు కొందరు. 

వెర్రివేయి విధాల ముచ్చట!! 
ఇక చూడండి... ‘‘వాలెంటైన్స్ డే... ఫిబ్రవరి 14.. ప్రేమికుల రోజు’’ అంటూ మొదలయింది. అనేక దేశాల్లోకి ఈ వెర్రి పాకింది. అయితే ఈ మధ్య ఈ వెర్రి మరీ ముదరడం చూసిన చాలా దేశాల ప్రభుత్వాలు తమతమ దేశాల్లో ఈ ‘ప్రేమికుల పండుగ’ను నిషేధించాయి. చివరకు అమెరికాలో కూడా కొన్ని ప్రాంతాల్లో నిషేధించారు. అయితే మన భారతదేశంలో మాత్రం ఈ పిచ్చి అంతకంతకూ ముదురుతోంది.

ఏది నిజమైన ప్రేమ-ఏది నిజమైన అనుబంధం??
''భార్యాభర్తల మధ్య అంకురించే ప్రేమ మానవజాతికే శుభకరం. స్నేహితుల మధ్య ఉండే ప్రేమ మానవాళిని ఉన్నస్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళుతుంది. కానీ, వ్యసన పరాయణ కాముక ప్రేమ సమస్త మానవుల్ని భ్రష్టుపట్టిస్తుంది'' అన్న బెకన్‌ మహాశయుడి మాటలు 'ప్రేమికుల రోజు'న స్మరించుకోవడం ఎంతో అవసరం.

« PREV
NEXT »

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com